ఎక్స్‌లో బ్లాక్ బటన్ తొలగింపు: మస్క్ ట్వీట్ వైరల్ | Elon Musk Hates Block Button Feature On X As Users Fear Return Of Creeps, Check Out Details Inside | Sakshi
Sakshi News home page

ఎక్స్‌లో బ్లాక్ బటన్ తొలగింపు: మస్క్ ట్వీట్ వైరల్

Published Tue, Sep 24 2024 2:26 PM | Last Updated on Tue, Sep 24 2024 3:40 PM

Elon Musk Hates Block Button on X

టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) 'ట్విటర్'ను కొనుగోలు చేసినప్పటి నుంచి అనేక మార్పులు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగులను తొలగించడం, బ్రాండ్ లోగో మార్చడం వంటి వాటితో పాటు పేరును కూడా 'ఎక్స్'గా మార్చేశారు. ఇప్పుడు ఎక్స్‌లోని 'బ్లాక్ బటన్' తీసివేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఎక్స్ ప్రస్తుత బ్లాక్ బటన్‌ను తీసివేయబోతోంది. అంటే అకౌంట్ పబ్లిక్‌గా ఉంటుంది. ఒక వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఏదైనా పోస్ట్ చేస్తే.. బ్లాక్ చేసిన వినియోగదారులకు కూడా కనిపిస్తుంది. అయితే వారు దీనిని లైక్, షేర్, కామెంట్ వంటివి చేయలేరు. కాబట్టి పోస్టును ప్రతి ఒక్కరూ చూడగలరు.

బ్లాక్ బటన్ తొలగింపుకు సంబంధించిన పోస్ట్‌కు మస్క్ స్పందిస్తూ.. ''బ్లాక్ ఫంక్షన్ అనేది అకౌంట్ ఎంగేజ్ చేయకుండా బ్లాక్ చేస్తుంది, కానీ పబ్లిక్ పోస్ట్‌లను చూడకుండా నిరోధించదు'' అని అన్నారు.

ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..

ఎక్స్ ఫ్లాట్‌ఫాంలో అకౌంట్లను బ్లాక్‌ చేసే ఫీచర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు మస్క్ గతంలోనే ప్రకటించారు. ఈ ఆప్షన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని.. ఈ కారణంగానే దీనిని తొలగించనున్నట్లు పేర్కొన్నారు. ఇది ఆన్‌లైన్‌ వేధింపులకు గురి చేస్తుందని చాలామంది యూజర్లు వాపోయారు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా పోస్ట్ చేస్తే.. బ్లాక్ చేసిన యూజర్ దానిపై స్పందించడానికి అవకాశం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement