టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ కుబేరుగా మాత్రమే కాకుండా.. ఎక్స్(ట్విటర్)లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. గురువారం (అక్టోబర్ 03) నాటికి ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో 200 మిలియన్ ఫాలోవర్లను చేరుకున్న మొదటి వ్యక్తిగా మస్క్ ఈ ఘనత సాధించారు.
మస్క్ తరువాత అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 131.9 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (113.2 మిలియన్ల ఫాలోవర్స్) నిలిచారు. జస్టిన్ బీబర్ 110.3 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో, 108.4 మిలియన్ల ఫాలోవర్లతో రిహన్నా ఐదో స్థానంలో ఉన్నారు.
ఇదీ చదవండి: జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్!
భారత ప్రధాని నరేంద్ర మోదీ 100 మిలియన్ ఫాలోవర్స్ మార్కును దాటారు. కాగా 'ఎక్స్' నెలవారీ యాక్టివ్ యూజర్లు 600 మిలియన్ల కంటే ఎక్కువ, డైలీ యాక్టివ్ యూజర్లు 300 మిలియన్స్ కంటే ఎక్కువని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇటీవల ఎక్స్ విలువ భారీగా తగ్గినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment