followers
-
శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరుల బరితెగింపు
-
ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి..
రీల్స్, ఇన్‌స్ట్రాగామ్ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు. ఆ్రస్టేలియాలోని ఓ మహిళకు ఇలాంటి సమస్యే ఎదురైంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి అతను ఏర్పాటు చేసిన ‘ఫేక్ వెడ్డింగ్’నిజమని తేలడంతో ఆమె కోర్టుకెక్కాల్సి వచ్చింది. చివరకు జడ్జి ఆ పెళ్లిని రద్దు చేశారు. వివరాల్లోకి వెళ్తే... మెల్బోర్న్లో ఉంటున్న ఓ మహిళకు 2023 సెప్టెంబర్‌లో ఆన్లైన్ డేటింగ్ వేదికపై ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది డిసెంబర్లో ఆమెకు అతను ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది. రెండు రోజుల తర్వాత సిడ్నీలో ఓ వైట్పార్టీ ఉందని, అక్కడికి అందరూ తెలుపు రంగు దుస్తుల్లో వస్తారని చెప్పారు. ఆమె కూడా అలాగే రెడీ అయి వెళ్లింది. తీరా అక్కడికెళ్లి చూస్తే.. ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ స్నేహితుడు తప్ప మరెవరూ లేరు. ఇదేంటని ప్రశ్నిస్తే... తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్స్ పెరగడం కోసం ప్రాంక్ వెడ్డింగ్ నిర్వహిస్తున్నానని, అందుకు సహకరించాలని ఆమెను కోరాడు. అప్పటికే అతనికి 17,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతని వివరణ ఆమెకు సబబుగానే తోచింది. సాయం చేసినట్లవుతుందని ఫేక్ పెళ్లికి అంగీకరించింది. సివిల్ మ్యారేజ్ కోర్టులో జరిగితేనే పెళ్లి చెల్లుబాటవుతుందని నమ్మింది. అదే విషయాన్ని తన స్నేహితురాలితో పంచుకుంది. అదే నిజమైతే వారు ముందుగా వివాహం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్నేహితురాలు కూడా చెప్పడంతో.. ఇది ఉత్తుత్తి పెళ్లే అని నమ్మింది. కట్ చేస్తే.. రెండు నెలల తరువాత, ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం ఆమె చేసిన దరఖాస్తులో తనను డిపెండెంట్‌గా చేర్చాలని అతను కోరాడు. పెళ్లి కానిది ఎలా కుదురుతుందని ఆమె ప్రశ్నించగా.. సిడ్నీలో జరిగిన వివాహ వేడుక నిజమైనదని బాంబు పేల్చాడు. వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా చూపించాడు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి.. వివాహానికి నెలముందే అతను నోటీసులు ఇచ్చాడని అర్థమైంది. అతను మొదటినుంచి అబద్ధం చెప్పాడని, తనను మోసం చేశాడని ఆమె కోర్టుకెక్కింది. పెళ్లి వేడుకలో తాను నటించానే తప్ప.. అది నిజం కాదని కోర్టుకు తెలిపింది. మహిళ వాంగ్మూలాన్ని నమ్మిన మెల్బోర్న్ జడ్జి 2024 అక్టోబర్‌లో వీరి వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జర్నలిస్ట్ పై టీడీపీ నేతల దాడి
-
YSRCP నేత జావెద్ ఇంటి వద్ద జేసీ వర్గీయుల వీరంగం
-
విశాఖ HPCLలో ఎమ్మెల్యే గణబాబు అనుచరుల దౌర్జన్యం
-
హెచ్పీసీఎల్లో ఎమ్మెల్యే గణబాబు అనుచరుల దౌర్జన్యం
సాక్షి, విశాఖపట్నం: హెచ్పీసీఎల్లో ఎమ్మెల్యే గణబాబు అనుచరులు దౌర్జన్యానికి దిగారు. తమ వారినే పనిలో పెట్టుకోవాలని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. లేబర్ గేటు వద్ద బైఠాయించిన టీడీపీ నేతలు.. తమకు అనుకూలంగా వ్యవహారిస్తేనే పనులు సాగనిస్తామని.. లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే హెచ్‌పీసీఎల్ పరిశ్రమలో పనులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు.పనులు బహిష్కరించాలని కార్మికులపై టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీ నేతల ఆరాచకాలతో హెచ్‌పీసీఎల్ యాజమాన్యం విసిగిపోతోంది. తెర వెనక ఉండి ఎమ్మెల్యే గణబాబు కథ నడిపిస్తున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియపై భూమా కిషోర్ రెడ్డి ఫైర్
-
టార్గెట్ వంశీ.. కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపులు
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకు అరెస్ట్ చేశారో సమాధానం మాత్రం చెప్పడం లేదు.గన్నవరం వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై వైఎస్సార్సీపీ మండిపడింది. కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్దకు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పీఎస్ వద్ద పోలీస్ అంక్షలు విధించారు. స్టేషనలోకి ఎవరూ వెళ్లకుకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు కోసమే అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గన్నవరానికి చెందిన 10 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. మీరు కేసులు పెట్టినంత మాత్రాన బెదిరిపోమని లోకేష్ గుర్తుంచుకోవాలి. రెడ్ బ్యాంక్ రాజ్యాంగాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే మీకు ప్రజలు చరమగీతం పలుకుతారు. మీకు చేతనైంది.. చేసుకోండి. దానికి మీరు కచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదు’’ అంటూ దేవభక్తుని చక్రవర్తి హెచ్చరించారు.తెల్లవారుజామున 5 గంటలకు మా నాన్నను అరెస్ట్ చేశారు. ఏదో గ్యాంగ్ స్టర్‌ను అరెస్ట్ చేసినట్లు ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేశారంటూ వైఎస్సార్సీపీ ఎంపీపీ అనగాని రవి కుమారుడు ధ్వజమెత్తారు. 45 ఏళ్లుగా మా తాత, మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఏనాడూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోలేదు. ఇంత కక్షపూరిత.. దౌర్జన్య వైఖరి ఎప్పుడూ లేదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంపై కంటే అభివృద్దిపై దృష్టి పెడితే బాగుంటుంది. ఏ కేసు పెట్టారో చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడం కోసం కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని.. అరెస్టులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టలేరని ఆయన అన్నారు.కనీస సమాచారం లేకుండా తెల్లవారు జామున అక్రమంగా అరెస్ట్ చేశారని.. అనగాని రవికి ఆరోగ్యసమస్యలున్నాయని అనగాని రవి మేనకోడలు అన్నారు. మందులు ఇవ్వాలని కోరినా పోలీసులు ఒప్పుకోవడం లేదు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యుద్ధానికి సిద్ధం.. ప్రతి సైనికుడికి అండగా నిలుస్తా!
-
అనకాపల్లిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం
-
ఎక్స్‌లో మస్క్ ఘనత.. ప్రపంచంలో తొలి వ్యక్తిగా రికార్డ్
టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ కుబేరుగా మాత్రమే కాకుండా.. ఎక్స్(ట్విటర్)లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. గురువారం (అక్టోబర్ 03) నాటికి ఎక్స్ ప్లాట్ఫామ్లో 200 మిలియన్ ఫాలోవర్లను చేరుకున్న మొదటి వ్యక్తిగా మస్క్ ఈ ఘనత సాధించారు.మస్క్ తరువాత అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 131.9 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (113.2 మిలియన్ల ఫాలోవర్స్) నిలిచారు. జస్టిన్ బీబర్ 110.3 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో, 108.4 మిలియన్ల ఫాలోవర్లతో రిహన్నా ఐదో స్థానంలో ఉన్నారు.ఇదీ చదవండి: జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్!భారత ప్రధాని నరేంద్ర మోదీ 100 మిలియన్ ఫాలోవర్స్ మార్కును దాటారు. కాగా 'ఎక్స్' నెలవారీ యాక్టివ్ యూజర్లు 600 మిలియన్ల కంటే ఎక్కువ, డైలీ యాక్టివ్ యూజర్లు 300 మిలియన్స్ కంటే ఎక్కువని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇటీవల ఎక్స్ విలువ భారీగా తగ్గినట్లు సమాచారం. -
పులివెందులలో బీటెక్ రవి అనుచరుల దాష్టీకం
-
YSRCP అభిమానులపై టీడీపీ నేతలు దాడి
-
ఆళ్లగడ్డలో అఖిలప్రియ అనుచరుడి అరాచకాలు..
-
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తమను టార్గెట్ చేశారంటున్న బాధితులు
-
జగన్ ను కలిసేందుకు పోటెత్తిన అభిమానులు
-
హిందూపురంలో బాలకృష్ణ హింసా రాజకీయం
-
ట్రెండ్ సెట్టర్.. 100M క్రాస్..
-
ప్రపంచంలోనే ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు వీరికే (ఫొటోలు)
-
అచ్చెన్నాయుడు అనుచరులకు షాక్
సాక్షి, విశాఖపట్నం: అచ్చెన్నాయుడు అనుచరులకు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నాయకులు అర్థరాత్రి విశాఖలో హల్ చల్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా పోలీసులపై దౌర్జన్యం చేశారు. టీడీపీ నాయకులపై చర్యలు లేవని ‘సాక్షి’లో కథనాలు ప్రసారం చేయడంతో యంత్రాంగం కదిలింది. నలుగురు టీడీపీ నాయకులపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు.అసలేం జరిగిందంటే..పచ్చబిళ్ల చూపిస్తే పనైపోవాలి.. అంటూ గతంలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను పుణికిపుచ్చుకున్న ఆయన మనుషులు విశాఖలో బరితెగించారు. శ్రీకాకుళం నుంచి వచ్చి విశాఖలో పూటుగా మద్యం తాగి ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి విశాఖలోని మద్దిలపాలెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీపీ కాలనీ ట్రాఫిక్ పోలీసులపై ప్రతాపం చూపించారు.తనిఖీ కోసం కారు ఆపిన పోలీసులను తప్పించుకుని వేగంగా దూసుకెళ్లారు. దీంతో వారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు సహకరించాలని కోరగా వారిపై రెచ్చిపోయారు. ‘ఒరేయ్ అధికార పార్టీ నాయకుల కారునే ఆపుతారా.. మీ అంతు తేలుస్తాం రా.. అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకోవడానికి మీకు ఎంత ధైర్యం?..’ అంటూ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం తామరాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు పోలాకి ఢిల్లీశ్వరరావు తదితరులు రెచ్చిపోయారు.రోడ్డుపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగిస్తూ వీరంగం సృష్టించారు. దీంతో కొందరు పోలీసులు వారి చేష్టలను వీడియో తీసే ప్రయత్నం చేయగా వారిపైనా బెదిరింపులకు తెగబడ్డారు. ‘తీయండ్రా తీయండి.. ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు తీసుకోండి.. మిమ్మల్ని సస్పెండ్ చేయించి, వీఆర్‌కు పంపించకపోతే మా పేర్లు మార్చుకుంటాం’ అంటూ హెచ్చరించారు. -
ఎక్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ రికార్డు
-
‘ఎక్స్’లో మోదీ ఫాలోయర్లు 10 కోట్లు..!
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలపై ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే ప్రధాని మోదీ మరో మైలురాయిని అధిగమించారు. ‘ఎక్స్’హ్యాండిల్లో ప్రధాని మోదీ ఫాలోయర్ల సంఖ్య ఆదివారం రికార్డు స్థాయిలో 10 కోట్లను దాటిపోయింది. గత మూడేళ్లలో అదనంగా 3 కోట్ల మంది ఫాలోయర్లు నమోదవడంతో మోదీ ఈ ఘనత సాధించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అత్యధిక ఫాలోయర్లు కలిగిన ప్రపంచ నేతల్లో ఒకరిగా ఆయనకు ఇప్పటికే పేరుంది. దేశంలో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు 2.75 కోట్ల మంది, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి 2.64 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ప్రపంచ నేతల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు 3.81 కోట్ల మంది, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌కు 2.15 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. క్రీడాకారుల్లో క్రికెటర్ విరాట్ కోహ్లీకి 6.41 కోట్ల మంది, ఫుట్‌బాల్ క్రీడాకారుడు నెయ్‌మార్‌కు 6.36 కోట్లు, అమెరికా బాస్కెట్ బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్‌కు 5.29 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారని ‘ఎక్స్’అధికారి ఒకరు వివరించారు. అమెరికాకు చెందిన సెలెబ్రిటీ టేలర్ స్విఫ్ట్‌కు 9.53 కోట్లు, లేడీ గాగాకు 8.31 కోట్లు, కిమ్ కర్దాషియన్‌కు 7.52 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నట్లు తెలిపారు. -
ప్రధాని మోదీ రికార్డు.. 10 కోట్లకు చేరిన ‘ఎక్స్’ ఫాలోవర్లు
న్యూఢిల్లీ: ఎక్స్(ట్విటర్)లో ఫాలోవర్ల సంఖ్య విషయంలో ప్రధాని మోదీ కొత్త రికార్డు నెలకొల్పారు.‘ఎక్స్’లో ఆయన ఫాలోవర్ల సంఖ్య ఆదివారం (జులై 14) 100 మిలియన్ల మార్కు (10 కోట్లు)ను దాటారు.దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.‘ఎక్స్‌లో ఉండటం, ఈ వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు లభిస్తుండటం సంతోషంగా ఉంది’ అని మోదీ పోస్ట్ చేశారు.A hundred million on @X! Happy to be on this vibrant medium and cherish the discussion, debate, insights, people’s blessings, constructive criticism and more. Looking forward to an equally engaging time in the future as well. pic.twitter.com/Gcl16wsSM5— Narendra Modi (@narendramodi) July 14, 2024 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ట్విటర్ లో ఖాతా ప్రారంభించారు. 2010కే ఆయన లక్ష మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. మరో ఏడాదికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 2020 జులై 19 నాటికి 6 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా గడిచిన నాలుగేళ్లలో 4 కోట్ల మంది ఫాలోవర్లు పెరిగారు.ప్రపంచ నేతల్లో ఎవరికీ దక్కని రికార్డు..ప్రస్తుత ప్రపంచ నేతల్లో ఎవరికీ ప్రధాని మోదీ స్థాయిలో ఫాలోయింగ్ లేదు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ‘ఎక్స్’లో 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మన దేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను 27.5 మిలియన్ల మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 26.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. -
కుప్పంలో దారుణం..
-
పులివెందులలో ‘పచ్చ’మూకల బరితెగింపు..
-
పోలీస్ స్టేషన్ లో YSRCP నేతపై టీడీపీ దాడి
-
చిత్తూరులో ఆగని టీడీపీ హింసాకాండ
-
YSRCP కార్యకర్తలపై టీడీపీ దాడులు..
-
విధ్వంసమే విధానమా..?
-
క్యాష్ ‘హంట్’
జనాలతో సందడిగా ఉండే ప్రాంతం అది..ఒక వ్యక్తి తొందరతొందరగా వచ్చి ఫుట్‌పాత్‌పై ఉన్న చెత్తకుండీకి అంటించి ఉన్న కవర్ తీసుకొని అందులోని 500 రూపాయల నోట్ జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు. మనుషులే లేని మరో నిర్మానుష్య ప్రాంతంలోని పాడుబడిన పాతబస్టాండ్లోకి వేగంగా వెళ్లి ఇనుప చువ్వలో దాచిన వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్లాడు మరొకతను. వ్యూస్, లైక్స్ కోసమేనా?? సాక్షి, హైదరాబాద్: నగరంలోని ట్యాంక్‌బండ్, సచివాలయం, అసెంబ్లీ, క్రికెట్ స్టేడియం వంటి పరిసర ప్రాంతాలతోపాటు బస్టాండ్లు, పార్కులు, ఫ్లైఓవర్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు దొరుకుతున్నాయి. నగరంలో న్యూ ట్రెండ్‌గా మారింది ఈ తరహా ట్రెజర్..కాదుకాదు క్యాష్ హంటింగ్. నగరంలోనే కాదు..నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో సైతం మనీ హంటింగ్ కొనసాగించడం విశేషం. కొందరు వ్యక్తులు ఇలా డబ్బులను వివిధ ప్రాంతాల్లో పెట్టి అంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తు న్నారు. వీటి కోసం ఇన్‌స్టా, ఫేస్బుక్ వేదికగా ప్రత్యేకంగా సైట్లు, సోషల్ పేజ్‌లు తయారు చేసుకున్నారు. ఇందులోని ఫాలోవర్స్ వీడియో పోస్ట్ చేసిన నిమిషాల్లో అక్కడకు చేరుకొని డబ్బులు సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిది కొత్త ట్రెండ్. మరికొందరు యాక్సెసరీస్ ప్యాక్ చేసి పెట్టి వారి స్టోర్ లేదా బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ తరహా సోషల్ మీడియా అకౌంట్లకు పెద్దఎత్తున ఫాలోవర్స్ ఉండటం విశేషం. సోషల్‌మీడియా వేదికగా అత్యధిక ఫాలోవర్స్‌ను ఆకర్షించడం, వ్యూస్, లైక్స్ సంఖ్య పెంచుకోవడానికి ఈ తరహా ట్రెజర్ హంటింగ్ నిర్వహిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే సోషల్‌మీడియాలో ఫేమ్‌తో పాటు యాడ్స్ రూపంలో ఆర్థిక వెసులుబాటు కూడా లభిస్తుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడెప్పుడు హంట్ వీడియో పెడతారా అని ఫాలోవర్స్ చేతిలో ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. ఇలా ఎవరు ముందు వచ్చి ఈ డబ్బులు తీసుకున్నారనేది కూడా వీడియో తీసి అదే సోషల్ సైట్లలో పెడుతుంటే వాటికి కూడా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. -
ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా తెల్లని పాలరాతి కట్టడం తాజ్ మహల్ గుర్తుకు వస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో తాజ్‌కు పోటీనిస్తూ, దానినే పోలిన మరో పాలరాతి భవనం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆలవాలంగా ఉంది.తాజ్ మహల్‌కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్ వద్ద రాధాస్వామి సత్సంగ్ శాఖ వ్యవస్థాపకుని సమాధి స్థలంలో నిర్మించిన అద్భుత భవనం మరో తాజ్‌గా పేరొందుతోంది. స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మితమైన ఈ భవనం పర్యాటకులను అమితంగా అలరిస్తోంది. దీనిని చూసిన పర్యాటకులు ఇది తాజ్‌మహల్‌కు పోటీ అని అభివర్ణిస్తున్నారు. మొఘలుల స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో ఈ ‘తాజ్’ మరో ఆకర్షణగా నిలిచింది.రాజస్థాన్‌లోని మక్రానా నుండి తెచ్చిన తెల్లటి పాలరాయితో రూపొందిన ఈ 193 అడుగుల ఎత్తయిన ఈ నిర్మాణం భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. రాధాస్వామి శాఖ వ్యవస్థాపకులు పరమ పురుష్ పూరన్ ధని స్వామీజీ సమాధి స్థలంలో ఈ భవనం నిర్మితమయ్యింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సమాధి స్థలిని సందర్శించేందుకు వస్తుంటారు. ఇక్కడి అద్భుత కళాకృతులను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీని అనుమతించరు.రాధాస్వామి అనుచరుల కాలనీ మధ్య ఈ భవనం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలలో లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఉన్నారు. 1904లో అలహాబాద్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భవనం కొంతమేరకు నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోయింది. అయితే 1922లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ జరిగే పనులన్నీ హస్త కళాకారుల నైపుణ్యంతో కూడినవే కావడం విశేషం. పైగా వీరు మూడు తరాలుగా ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారు. బంగారు పూతతో ఈ భవన శిఖరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిఖరం తాజ్‌మహల్ కన్నా పొడవైనది కావడం విశేషం. -
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
పాకిస్థాన్‌కు చెందిన అత్యంత పిన్న వయస్కుడైన వ్లాగర్‌గా పాపులర్ అయిన మహమ్మద్ షిరాజ్ తన ఫ్యాన్స్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. 1.57 మిలియన్లకుపైగా ఫాలోయర్స్‌ని సొంతం చేసుకున్న షిరాజ్ ఇదే నా చివరి వ్లాగ్ అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్‌గా మారింది.మొహమ్మద్ షిరాజ్, తన యూట్యూబ్ అనుచరులకు భావోద్వేగ వీడ్కోలు పలికాడు."మేన్ ఆజ్ సే వ్లాగ్ నహీ బనౌంగా. మేరే అబ్బు నే బోలా హై ఆప్ కుచ్ దిన్ పధై కరో ఔర్ వీడియో నహీ బనావో (నేను ఇకపై వ్లాగ్‌లు చేయను. మా నాన్న నన్ను చదువుకోవాలని, ప్రస్తుతానికి వీడియోలు చేయవద్దని అడిగారు)" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. "లేకిన్, ముఝే వ్లోగ్ బనానే కా బోహత్ షౌఖ్ హై. ఇస్లీయే, ఆజ్ మేరా ఆఖ్రీ వ్లాగ్ హై. మైన్ క్యా కరూం(కానీ నాకు వ్లాగ్‌లు చేయడం చాలా ఇష్టం. కానీ, ఇదే నా చివరి వ్లాగ్. నేను ఏమి చేయాలి?)" అని షిరాజ్ తన వీడియోలో తెలిపారు.అలాగే అభిమానులందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు వ్లాగ్స్ చేయడానికి తనను అనుమతించమని తన తండ్రిని అభ్యర్థించమని కూడా అభిమానులను కోరాడు. ఈ వీడియో ఆరు లక్షలకుపై వ్యూస్ సాధించింది.కమెంట్ల రూపంలో తమ ప్రేమను అభిమానాన్ని ప్రకటించారు. ‘‘నీ భవిష్యత్తు కోసం నీ తండ్రి మంచి నిర్ణయం తీసుకున్నారు, అల్లా మిమ్మల్ని , మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు" అని ఒక వినియోగదారు రాశారు. "అయ్యో నిన్ను మిస్ అవుతాను" అని మరొకరు వ్యక్తం చేశారు. చదువు చాలా ముఖ్యం చిన్నా అని ఒకరు, కష్టపడి చదువుకో, మరోవైపు వ్లాగ్‌లు కూడా చేయి మొరకరు కమెంట్ చేశారు. చాలామంది"మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని కమెంట్ చేశారు.కాగా పాక్‌లోని ఖప్లు అనే నగరానికి చెందిన షిరాజ్ తన రోజు వారీ దినచర్యతోపాటు, తన చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను, మంచు పర్వతాలతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా పేరు సంపాదించాడు. -
ఎక్కడా తగ్గేదే లేదండీ..పల్లె టు పాపులర్ జోన్ జోరుగా హుషారుగా
యూత్ పల్స్: కంటెంట్‌లో సత్తా ఉండాలేగానీ కాలు కదపకుండా, కడుపులో చల్ల కదలకుండా సొంత ఊళ్లోనే ఉంటూ తగినంత డబ్బు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నారు గ్రామీణ యువ కంటెంట్ క్రియేటర్లు. హాస్యం నుంచి వ్యవసాయం వరకు రకరకాల సబ్జెక్ట్‌లను వైరల్ చేయడంలో నేర్పు సాధించారు.ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆరియారి గ్రామానికి చెందిన శివానీ కుమారికి సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. గ్రామీణ జీవితాన్ని పాటలు, కామెడీతో కూడిన స్కెచ్‌ల ద్వారా ఆవిష్కరిస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది. తనతో సమానంగా ఫాలోవర్లు ఉన్న ఇంగ్లీష్ క్రియేటర్లు కుమారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నటికీ డబ్బుల గురించి చింత ఆమెకు లేదు. డబ్బుల కంటే కంటెంట్ క్రియేషన్ గురించే ఎక్కువ దృష్టి పెడుతుంది కుమారి.ఒడిశాలోని చిత్రకూట్‌కు చెందిన ధీరజ్ టక్రీకి గతంలో ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడడం వచ్చేది కాదు. తడబడుతూ మాట్లాడేవాడు. దీంతో యూట్యూబ్ వీడియోలు చూసి ధీరజ్ అమెరికన్స్లా ఫ్లూయెంట్‌గా మాట్లాడడం నేర్చుకున్నాడు. అమెరికన్ యాక్సెంట్‌తో మాట్లాడే నైపుణ్యం ధీరజ్‌ను ‘ఇన్‌స్టా ఫేమ్’ చేసింది. 2023లో ధీరజ్ ఫాలోవర్ల సంఖ్య 160 మాత్రమే. హ్యాండ్సమ్ అనే మాటను ఫారిన్ యాక్సెంట్లో ఎలా పలకాలి అనే రీల్ వైరల్ కావడంతో ధీరజ్ టక్రీ ఫాలోవర్ల సంఖ్య వేలకు చేరింది. మధ్యప్రదేశ్‌లోని బిరాఖేడీ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల రామ్ పారమార్ 17 సంవత్సరాల వయసులో యూట్యూబ్ చానల్ మొదలు పెట్టాడు. తన చానల్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేవాడు. ఏడు, ఎనిమిది వేలతో యూట్యూబ్‌లో అతడి సంపాదన మొదలైంది. ఇప్పుడు బ్రాండ్ కొలాబరేషన్ ద్వారా లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.పది లక్షలు వెచ్చించి తన గ్రామంలో ఆఫీస్ నిర్మించుకున్నాడు. కారు కొన్నాడు. ఇద్దరు సభ్యులతో ఉన్న టీమ్‌ను విస్తరించే పనిలో ఉన్నాడు. గుజరాతీ, తమిళ భాషల్లో కూడా కంటెంట్‌ను విస్తరించే ఆలోచనలో ఉన్నాడు.‘మన దేశంలో చాలా ప్రాంతాల్లో రైతులు హిందీ భాషను అర్థం చేసుకోలేరు. వారిని దృష్టిలో పెట్టుకొని ఇతరుల సహకారంతో ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కంటెంట్‌ను చేరువ చేయాలనుకుంటున్నాను’ అంటున్నాడు ధీరజ్.ఇరవై ఏడు సంవత్సరాల మయూరి పాటిల్‌కు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా డబ్బు సంపాదించాలనేది లక్ష్యం కాదు. ‘పశ్చిమ కనుమలను కాపాడుకుందాం’ అనే నినాదంతో రీల్స్ చేస్తొంది. పశ్చిమ కనుమల అందాలను కళ్లకు కట్టేలా ఉండే ఆ రీల్స్ ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి. ఆలోచించేలా చేస్తున్నాయి. కొండపై ఉన్న ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఒక వృద్ధురాలి జీవనశైలిపై పాటిల్ చేసిన రీల్ వైరల్ అయింది. ఎలాంటి కమర్శియల్ ఎలిమెంట్స్ లేని ఈ రీల్ సూపర్ సక్సెస్ కావడమే కాదు అది పాటిల్‌కు ఎంతో ఉత్సాహాన్నీ ఇచ్చింది.మహారాష్ట్రలోని పులగామ్ గ్రామానికి చెందిన నేహా తాంబ్రేది సూపర్ పవర్ గ్రామీణ యాస. కామెడీ దట్టించి వివిధ సామాజిక సమస్యలపై తమ ప్రాంత మాండలికంలో నేహా చేసే వీడియోలు సోషల్ మీడియాలో ΄ాపులర్ అయ్యాయి. తన గ్రామం నుంచి వెళ్లి పుణెలో ఇంజనీరింగ్ చేయడం నేహాకు కల్చరల్ షాక్.‘నా గ్రామీణ మరాఠీ యాసను వెక్కిరించేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది నేహా.ఎంతోమంది వెక్కిరించిన ఆ యాస కంటెంట్ క్రియేషన్‌లో ఆమె బలం అయింది. నేహా సృష్టించిన ‘తోంబ్రే బాయి’ క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది.స్థూలంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంత క్రియేటర్లు సోషల్ మీడియాలో కొత్త దృశ్యం ఆవిష్కరిస్తున్నారు. కర్నాటకాలోని చిన్న పల్లెల నుంచి ఈశాన్యప్రాంతాలలోని మారుమూల గ్రామాల వరకు కంటెంట్ క్రియేషన్ ద్వారా వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రతి క్రియేటర్ తనదైన ప్రత్యేకతను కంటెంట్‌కు జోడిస్తున్నారు.‘ఇన్స్టాగ్రామ్ ఉద్దేశాన్ని చాలా బ్రాండ్స్ మరిచి΄ోయాయి. ఇన్స్టాగ్రామ్ అనేది ఫన్, స్టోరీ టెల్లింగ్‌కు వేదిక’ అంటుంది ముంబైకి చెందిన కంటెంట్ సొల్యూషన్స్ ఫర్మ్ ‘అప్పర్‌కేస్’ డైరెక్టర్ నిఠషా భర్వానీ. ఇన్‌స్టాగ్రామ్‌కు కీలకమైన ఫన్, వైవిధ్యాన్ని జోడిస్తూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు గ్రామీణ ప్రాంత యువ కంటెంట్ క్రియేటర్లు.ఎక్కడా తగ్గేదే లేదండీగ్రామీణ్ర ప్రాంత జీవనశైలికి అద్దం పట్టే వీడియోలతో ΄ాపులర్ అయింది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివానీ కుమారి. ఆడంబరాల కంటే సహజత్వమే కంటెంట్‌కు అందాన్ని తీసుకువస్తుంది అనేది కుమారి నమ్మే థియరీ. అందుకే ఆమె చేసే వీడియోల్లో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఊళ్లో సొంత ఇళ్లు కట్టుకుంది. సోషల్ మీడియాలో కుమారి ΄ాపులారిటీని దృష్టిలో పెట్టుకొని వ్యక్తుల నుంచి మొదలు ఆర్గనైజేషన్స్ వరకు ప్రశంసపూర్వకమైన ఈ–మెయిల్స్ వస్తుంటాయి. అవి ఆమెకు బలమైన టానిక్‌లా పనిచేస్తాయి. ‘ఇంగ్లిష్‌లో గడగడా మాట్లాడితేనే కంటెంట్ హిట్ అవుతుంది’ అనే భావనను కుమారిలాంటి వాళ్లు తప్పని తేల్చేస్తు్తన్నారు. ఇంగ్లీష్–స్పీకింగ్ అర్బన్ క్రియటర్స్ కంటే తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు శివాని కుమారి -
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న హీరోలు వీరే
హీరో అల్లు అర్జున్ మరో ఘనత సాధించారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య (ఫాలోవర్స్) 25 మిలియన్స్ కు చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించి, తగ్గేదే లే అంటున్నారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. అదే విధంగా ఆ మూవీకి ఉత్తమ నటుడి కేటగిరీలో తెలుగులో జాతీయ అవార్డు సాధించిన తొలి హీరోగా అరుదైన ఘనత సాధించారాయన. కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు అల్లు అర్జున్. అందులో భాగంగానే దక్షిణాదిలో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉన్న హీరోగా రికార్డ్‌ను క్రియేట్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో హీరో విజయ్ దేవరకొండ (21.3 మిలియన్లు), మూడో స్థానంలో హీరో రామ్ చరణ్ (20.8మిలియన్లు) ఉన్నారు. -
‘మహాబోధి’ మహోత్సవానికి భారీగా బౌద్ధ అనుచరుల రాక!
ప్రపంచ పర్యాటక కేంద్రమైన సాంచి(మధ్యప్రదేశ్)లో 71వ మహాబోధి మహోత్సవం ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. రెండు రోజుల ఈ ఉత్సవంలో భగవాన్ గౌతమ బుద్ధుని సన్నిహిత శిష్యుల అస్థికలను అనుచరుల దర్శనం కోసం అందుబాటులో ఉంచారు. శనివారం ఉదయం 7 గంటలకు అస్థికల కలశ యాత్రను మహాబోధి సొసైటీ కార్యాలయం నుంచి చెతీస్గిరి వరకూ నిర్వహించారు. అనంతరం అనుచరుల దర్శనార్థం ఆ కలశాన్ని అందుబాటులో ఉంచారు. శ్రీలంక, వియత్నాం, థాయ్‌లాండ్, జపాన్‌తో సహా పలు దేశాల బౌద్ధ అనుచరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీలంక మహాబోధి సొసైటీ చీఫ్ వంగల్ ఉపాథిస్ నాయక్ థెరో ఈ వేడుకల్లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి సాంచి చేరుకున్నారు. ఊరేగింపు సందర్భంగా సాంచిలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తెల్లవారుజామున కళాకారులు ఢోలక్, వేణువుల శ్రావ్యమైన రాగాలకు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సాంచి వీధుల్లో నడిచారు. ఈ ఊరేగింపు సాంచి స్థూపం వద్దనున్న చెటియగిరి విహార్‌కు చేరుకుంది. అక్కడ బుద్ధ భగవానుని శిష్యులైన అర్హంత్ సారిపుత్ర, అర్హంత్ మహామొగ్గలన్ల అస్థికలను నేలమాళిగలో నుండి బయటకు తీసి పూజలు నిర్వహించారు. అనంతరం అనుచరుల దర్శనార్థం వాటిని ప్రత్యేక స్థలంలో ఉంచారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, అనుచరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ‘26/11’ తరువాత కూడా నిర్లక్ష్యం వీడని ముంబై పోలీసులు.. -
బరితెగించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అనుచరులు.. రైతులపై దాడి
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు బరితెగించారు. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర డైరెక్షన్లోనే ఈ దాడి జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. పాలు పోయించుకుని బోనస్ ఇస్తామంటూ సంగం డెయిరీ యాజమాన్యం మోసానికి తెరతీసింది. ఇది అన్యాయం అంటూ అడగడానికి వచ్చిన ఏలూరు జిల్లా రైతులపై దాడికి పాల్పడ్డారు. చదవండి: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల -
శాసన మండలి చైర్మన్ గుత్తా ఉక్కిరి బిక్కిరి.. అసలేం జరుగుతోంది?
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఆయనకు దగ్గరి అనుచరులుగా ఉన్న వారంతా బీఆర్ఎస్ను వీడుతున్నారు. వారంతా కట్టకట్టుకు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. దీంతో పరోక్షంగా ఈ ప్రభావం మండలి చైర్మన్‌కు ఎఫెక్ట్ అయ్యేలా ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ కాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలను శాసిస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇపుడు ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితులు తలెత్తాయంటున్నారు. తెలుగుదేశం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన మదర్ డెయిరీ చైర్మన్‌గా, ఎంపీగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నల్గొండ ఎంపీగా పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. అదే సమయంలో సుఖేందర్ రెడ్డితో సత్సంబంధాలు కలిగి ఉన్న నాటి సీపీఐ దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సైతం సీపీఐ నుంచి బీఆర్ఎస్లోకి మారిపోవడంతో గుత్తా కీలకంగా వ్యవహరించారు. మరో వైపు టీడీపీలో ఉన్న సమయం నుంచీ ఇప్పటి నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరులతో గుత్తాకు బయటకు కనిపంచేంత సఖ్యత లేదు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి గులాబీ కండువా కప్పుకున్న ఆయనకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు, తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా కూడా అవకాశం కల్పించారు. పదవీ కాలం ముగిశాక కూడా రెండోసారి ఎమ్మెల్సీగా, మరో మారు మండలి చైర్మన్ గా పదవిలో కూర్చోబెట్టారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న, తన రాజకీయ వారసునిగా తన తనయుడు అమిత్‌ను అరంగేట్రం చేయించే పనిలో ఉన్నారు. కానీ, తెలంగాణ శాసన సభ ఎన్నికల సందర్బంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. వారితో చెడిందా? ఎవరితో తనకు విభేదాలు లేవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదే పదే చెప్పుకోవాల్సి వస్తోంది. కానీ, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ లతో ఈ మధ్య చెడిందన్న వార్తలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు ఖరారు చేసిన నాటినుంచే కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారిలో దేవరకొండ ఒకటి. అక్కడి అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుబడుతున్న వారంతా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గరి అనుచరులు కావడం గమనార్హం. టీడీపీ తరపున దేవరకొండ జెడ్పీటీసీ సభ్యునిగా పని చేసిన కాలం నుంచి గుత్తా ఏ పార్టీలోకి వెళితే ఆయన వెంట ఆయా పార్టీల్లోకి వెళ్లి వెంట నడుస్తున్న వారే కావడం గమనార్హం. ఇపుడు వీరంతా.. మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహులు, మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతా కట్టకట్టుకుని మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల మాటను బేఖాతరు చేసి, సుఖేందర్ రెడ్డి మాటలను చెవిన పెట్టకుండా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి బాలూ నాయక్ గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటించారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పదుల సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, తిప్పర్తి జెడ్పటీసీ సభ్యుడు వీరంతా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వీరంతా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అత్యంత దగ్గరి అనుచరులు కావడం విశేషం. జిల్లా పరిషత్‌లో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డి పార్టీ మారడం గుత్తా సుఖేందర్ రెడ్డికి తలనొప్పిగా మారింది. దీంతో ఆయన తాను పార్టీ మారడం లేదని, తన అనుచరులను బయటకు పంపడం లేదని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే తాను కానీ, తన తనయుడు కానీ, నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. సుఖేందర్ రెడ్డి అనుచరగణం పార్టీ వీడుతుండడాన్ని ఆయా నియోజకవర్గాల సిట్టింగు అభ్యర్థులు హై కమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో మండలి చైర్మన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చదవండి: కాంగ్రెస్‌ను వీడనున్న నాగం జనార్దన్‌రెడ్డి? -
ఆనంద్ మహీంద్రను దాటేసి మరీ టాప్‌లోకి రతన్ టాటా
పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. వ్యాపార దక్షతతో మాత్రమే కాదు, తనదైన వ్యక్తిత్వం, దాతృత్వంతో ఆయన ప్రత్యేకతే వేరు. అందుకే సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఇదే విషయాన్నిమరోసారి నిరూపించుకున్నారు రతన్ టాటా. మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్రను అధిగమించి మరీ నెటిజన్లు అభిమానాన్ని దోచుకున్నారు. భారతీయ సోషల్ మీడియాలో 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 జాబితాలో టాప్‌లో ప్లేస్ కొట్టేశారు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం మైక్రోబ్లాగింగ్ సైట్లో ఎక్స్( ట్విటర్) ఎక్కువ మంది ఫాలోవర్లతో వార్తల్లో నిలిచారు. 12.6 మిలియన్లతో భారతీయ సోషల్ మీడియాలో అత్యంత విస్తృతంగా అనుసరించే వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారు. ఒక ఏడాదిలో ఆయన ఫాలోవర్లు సంఖ్య 8 లక్షలకు పైగా పెరిగారు. ఆ తరువాతి స్థానంలో 10.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఆనంద్ మహీంద్రా నిలిచారు. ( కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక) ఈ జాబితాలో టాప్ టెన్‌లో పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, గూగుల్ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ సత్య నాదెళ్ల, వ్యాపార వేత్తలు నందన్ నీలేకని, రోణీ స్క్రూవాలా, హర్ష వర్థన్ గోయింగా, కిరణ్ మజుందార్ షా, ఉదయకోటక్ నిలిచారు. దీంతో పాటు, భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల 12వ వార్షిక లిస్ట్‌ను కూడా హురున్ వెల్లడించింది. వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా సంపదలో గణనీయమైన క్షీణతను ఎదుర్కొన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని అధిగమించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ టాప్‌లోకి దూసుకొచ్చారు. గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. అంబానీ సంపద ఈ కాలంలో భారీగా పుంజుకుని దాదాపు రూ.8,08,700 కోట్లకు చేరింది. గౌతమ్ అదానీ రూ.474,800 కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు. సీరం ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావల్లా రూ. 2,78,500 కోట్ల మొత్తం సంపదతో మూడో స్థానంలోఉన్నారు.ఈ జాబితాలో రూ.2,28,900 కోట్ల సంపదతో శివ నాడార్ నాల్గవ స్థానంలో ఉన్నారు, గోపీచంద్ హిందూజా , అతని కుటుంబం రూ.1,76,500 కోట్లతో 5వ స్థానంలో ఉన్నారు. 1,64,300 కోట్ల సంపదతో దిలీప్ షాంఘ్వీ ఆరో స్థానంలో ఉన్నారు. -
కత్రినా క్రేజే వేరు.. ఏకంగా ఫేస్ బుక్ సీఈవోను వెనక్కి నెట్టి!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్న సినీ తారల్లో కత్రినా ఎప్పుడు ముందు వరసలోనే ఉంటారు. ఇన్‌స్టాలో ఆమెకు 76.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా వాట్సాప్ సైతం ఛానెల్స్ సదుపాయం ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ కూడా కత్రినా కైఫ్ 14 ఫాలోవర్స్‌లో ముందు వరుసలో నిలిచింది. ఈ విషయంలో ఏకంగా ఫేస్బుక్ దిగ్గజం మార్క్ జుకర్ బర్గ్, ప్రముఖ రాపర్ బ్యాడ్ బన్నీ కంటే ఎక్కువ ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. (ఇది చదవండి: కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్) ఇప్పటివరకు వాట్సాప్ ఛానెల్‌కు అత్యధికంగా 23 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖ ఓటీటీ యాప్ నెట్‌ఫ్లిక్స్ 16.8 మిలియన్లతో రెండోస్థానంలో ఉంది. రియల్ మాడ్రిడ్ అధికారిక ఛానెల్ 14.4 మిలియన్లతో మూడోస్థానంలో నిలవగా.. కత్రినా తన 14.2 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రాపర్ బ్యాడ్ బన్నీ 12.6 మిలియన్ల ఫాలోవర్లతో 5వ స్థానం, మార్క్ జుకర్‌బర్గ్‌ను 9.2 మిలియన్లతో కొనసాగుతున్నారు. కత్రినా కైఫ్ సెప్టెంబర్ 13న వాట్సాప్ ఛానెల్‌ను ప్రారంభించింది. కొత్త ఛానెల్‌కు స్వాగతం చెబుతూ తన ఫోటోలు కూడా పంచుకుంది. సెలబ్రీటీల పరంగా చూస్తే కత్రినా కైఫ్ టాప్‌లో ఉంది. (ఇది చదవండి: సల్మాన్ ఖాన్ టైగర్ సందేశం వచ్చేసింది) కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్-3 చిత్రంలో నటిస్తోంది. యష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. గతంలో సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ జంటగా ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాల్లో నటించారు. ఈ ప్రాంఛైజీలో భాగంగా వస్తున్న చిత్రమే టైగర్-3. నవంబరు 10న దిపావళికి ఈ చిత్రం విడుదల అవుతుందని టైగర్ మేకర్స్ ప్రకటించారు. -
సుకుమారి సూపర్ స్టంట్స్
పాపులర్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మిష్ శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్టన్నింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది శర్మ. తాజా విషయానికి వస్తే... చీర ధరించి అద్భుతమైన రీతిలో చేసిన జిమ్నాస్టిక్స్ నెటిజనుల చేత ‘వావ్’ అనిపించాయి. మరో అథ్లెట్ పారుల్ శర్మ చీర ధరించి చేసిన జిమ్నాస్టిక్స్ అబ్బురపరిచాయి. ‘మన టాలెంట్ ముఖ్యం కానీ ఎలాంటి దుస్తులు ధరించామనేది ముఖ్యం కాదు’ అని ఒకరు కామెంట్ రాశారు. అయితే పారుల్ మాత్రం తన వీడియో చూసి ప్రయోగాలు చేయవద్దని సలహా ఇచ్చింది. ‘స్టంట్స్ చేయడానికి ఉత్సాహం మాత్రమే సరిపోదు. ఒకస్థాయి వరకు శిక్షణ తీసుకోవడం అవసరం. నైపుణ్యం సాధించిన తరువాతే ప్రయత్నించాలి. లేని కష్టాలు కొని తెచ్చుకోవద్దు’ అని చెప్పింది పారుల్. -
సైక్లింగ్‌తో స్ఫూర్తి నింపుతూ...
సాక్షి, వరంగల్: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని అందరూ అంటారు. కానీ కొందరు మాత్రమే ఆరోగ్యంకోసం తపిస్తారు. ఆదాయం వేటలోపడి ఆరోగ్యాన్ని మరచిపోతారు. అయితే యుక్త వయసులోనే రంజిత్ కుమార్ దవేరాకు ఆరోగ్యం ఎంత విలువైనదో తెలియజెప్పింది కరోనా... మార్చిన మహమ్మారి... కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆ మహమ్మారి బారిన పడిన నాన్న రాములే కాదు...కళ్లెదుటే ఎంతో మంది చనిపోవడం వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఈ డీఫార్మసీ గ్రాడ్యుయేట్‌ను కదిలించింది. సరైన శారీరక శ్రమ లేక వ్యాధినిరోధకత కోల్పోయి ఈ మహమ్మారికి బలయ్యారని ఆయనకు అవగతమైంది. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలన్న ఆలోచన కలిగించడమే లక్ష్యంగా సైక్లింగ్ వైపు రంజిత్ అడుగులు పడ్డాయి. అలా 2021 ఏప్రిల్ 5న మొదలైన ‘రంజిత్ ఆన్ వీల్స్’సైక్లింగ్....దశలవారీగా రాష్ట్రాలు దాటింది. ఇప్పుడు ఏకంగా ఖండాంతరాలు దాటింది. ఏ ఉద్దేశంతో ఈ సైక్లింగ్ మొదలెట్టాడో... ఇప్పుడు అదీ కార్యాచరణ రూపంలో కనిపించడం ఎంతో సంతృప్తిగా ఉందని అంటున్నాడు రంజిత్. దాదాపు 500 మంది వరకు తనను చూసి స్ఫూర్తి పొందారని మలేసియాలో సైక్లింగ్ కొనసాగిస్తున్న రంజిత్ ‘సాక్షి’కి తెలిపారు. తనను ఆగస్టు 15న మలేసియా ఇండియన్ హైకమిషన్ సత్కరించడం సంతోషం కలిగించిందన్నాడు. అలా మొదలైంది... 2021 ఏప్రిల్ ఐదున హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన సైక్లింగ్...దాదాపు 3,000 కిలోమీటర్లు తిరిగి హైదరాబాద్‌లోనే జూన్ 14న ముగిసింది. మళ్లీ జూలై 17న ప్రారంభించి హైదరాబాద్ నుంచి లడఖ్ వరకు సైక్లింగ్ చేశాడు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తిరిగి అక్టోబర్ 22న హైదరాబాద్‌లో ముగిసింది. ఈ సమయంలోనే రంజిత్ సినీ హీరో సోనూసూద్‌ను కలిశాడు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి చైనా సరిహద్దు వరకు పెంపుడు శునకం భగీరతో కలిసి రంజిత్ సైక్లింగ్ చేశాడు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్,అస్సాం, వెస్ట్‌బెంగాల్, సిక్కింల నుంచి నథులాపాస్‌లో చైనా బార్డర్ వరకు వెళ్లాడు. గత 2022 ఫిబ్రవరి 8న మొదలైన ఈ ఆరువేల కిలోమీటర్ల యాత్ర జూలై 25న ముగిసింది. ఆ్రస్టేలియా వైపుగా... హైదరాబాద్ నుంచి వియత్నాంకు రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం లేకపోవడంతో 2023 మే ఐదున శంషాబాద్ విమానాశ్రయంలో సైకిల్ ప్యాక్ చేసుకొని వియత్నాం వెళ్లాడు. అక్కడ హానోయ్ సిటీ నుంచి హోచి మిన్హ్ వరకు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, ఆ తర్వాత కాంబోడియాలోకి ప్రవేశించి 900 కిలోమీటర్లు, థాయ్‌లాండ్‌లో 2,200 కిలోమీటర్లు, మలేసియాలో 400 కిలోమీటర్లు దాటి ప్రస్తుతం కౌలంలంపూర్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్, ఇండోనేసియా, జకార్తాకు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాకు విమానం ద్వారా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేస్తాడు రంజిత్. 2021 ఏప్రిల్ ఐదు నుంచి ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్ల మార్క్ చేరుకున్నాడు. ఆసియా, ఆ్రస్టేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. సోషల్ మీడియాతో మరింత క్రేజ్ సైక్లింగ్ చేస్తున్న సమయంలో రంజిత్ తీస్తున్న వీడియోలు, ఫొటోలు తనకు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను తెస్తున్నాయి. ‘రంజిత్ ఆన్ వీల్స్’ఫేస్బుక్ పేజీలో 40,000 మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3,15,000 మంది, యూట్యూబ్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా సైక్లింగ్ చేస్తూనే...ఇంకోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రంజిత్ ఎంతో మందిని చైతన్యవంతం చేస్తున్నారు. -
కాంగ్రెస్‌లోకి వేముల వీరేశం?
సాక్షి, నల్గొండ జిల్లా: జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ సీనియర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నకిరేకల్‌కు చెందిన తన అనుచరులు, నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరనున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటి వరకు వీరేశం చేరికను కోమటిరెడ్డి వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంపై అవమానించడమే అవుతుందని, సునీల్ కనుగోలు(ఎన్నికల వ్యూహకర్త) చెబితే చేర్చుకోవడమేనా? అంటూ కోమటిరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీరేశం చేరికపైనే కోమటిరెడ్డి నియోజకవర్గంలోని తన అనుచరులతో చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా, టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. నకిరేకల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎన్ని బాధలు పెట్టినా భరించా.. అయినా ఇంకా భరిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా’’ అంటూ తన అనుచరులు ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి -
అదంతా ఉత్తదే! ఎలాన్ మస్క్‌పై షాకింగ్ రిపోర్ట్
ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)పై షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెలువడింది. చిత్రమైన ఆలోచనలు, నిర్ణయాలు, విచిత్ర వ్యాఖ్యానాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మస్క్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇదంతా ఉత్తదే అని ఓ రిపోర్ట్ పేర్కొంటోంది. ఎక్స్ (ట్విటర్)లో ఎలాన్ మస్క్‌కు ఏకంగా 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇందులో చాలా వరకు అకౌంట్లు ఫేక్ అని, కొన్ని యాక్టివ్ లో లేవని, మరికొన్ని కొత్త అకౌంట్స్ అని థర్డ్ పార్టీ రీసెర్చర్ ‘ట్రావిస్ బ్రౌన్’ సేకరించిన డేటా ఆధారంగా ‘మ్యాషబుల్’ (Mashable) అనే టెక్ వెబ్సైట్ నివేదించింది. మస్క్‌కి ఉన్న 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లలో దాదాపు 42 శాతం అంటే 65.3 మిలియన్లకు పైగా ఖాతాలకు కనీసం ఒక్క ఫాలోవర్ కూడా లేరని ఈ నివేదిక పేర్కొంది. మస్క్‌ను అనుసరిస్తున్న ఒక్కో ఖాతాలకు సగటున ఉన్న ఫాలోవర్లు కేవలం 187 మంది. మస్క్ ఫాలోవర్లలో 0.3 శాతం అంటే 4,53,000 మంది మాత్రమే ఎక్స్ ప్రీమియం (ట్విటర్ బ్లూ) సబ్స్క్రైబర్లు. మస్క్ ఫాలోవర్లలో 62.5 మిలియన్ల మంది ఎప్పుడూ అసలు ఒక్క ట్వీట్ కూడా చేయలేదని రిపోర్ట్ వెల్లడించింది. -
తుమ్మల దారెటు?.. ఖమ్మంలో అనుచరుల భేటీ..
సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టికెట్ తమకే వస్తుందని భావించిన వారికి భంగపాటు తప్పలేదు. పాలేరు నుంచి తనకే టికెట్ వస్తుందని చెప్పుకొచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌ను పొగుడుతూ ప్రకటనలు చేశారు. ఇంతలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల పేరు ప్రకటించడంతో తుమ్మల వర్గం కంగుతిన్నట్లయింది. ఇక కొత్తగూడెం స్థానం విషయంలో వనమాపై కోర్టు కేసు నేపథ్యంలో జలగం వెంకట్రావుకు టికెట్ ఇస్తారంటూ ప్రచారం గుప్పుమంది. అయినప్పటికీ సీనియారిటీ ప్రాతిపదికన వనమాకే టికెట్ కట్టబెడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో తుమ్మల అనుచరులు ఖమ్మంలోని వీసీరెడ్డి ఫంక్షన్ హాలులో మంగళవారం భేటీ అయ్యారు. తుమ్మల, జలగం కాంగ్రెస్ చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌కే తుమ్మల అనుచరులు జై.. పాలేరు బీఅర్ఎస్లో అసమ్మతి సెగ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకే తుమ్మల అనుచరులు జై కొడుతున్నారు. సమావేశానికి పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి తరలివచ్చారు. తుమ్మలకు టికెట్ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందంటున్న ఆయన అనుచరుల.. కాంగ్రెస్ వైపు మొగ్గుచుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మలపై ఒత్తిడి పెంచే ఆలోచనలో ఆయన అనుచరులు ఉన్నారు. ఈ వారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల్లో నుంచి తుమ్మల అనుచరులు భారీ ర్యాలీగా హైదరాబాద్ కు వెళ్లి తుమ్మలను కలవనున్నట్లు సమాచారం. కాగా, వైరా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తానే మళ్లీ పోటీలో ఉంటానని రాములునాయక్ నిబ్బరంగా ఉన్నా.. ఈ స్థానంలో మదన్‌లాల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంతో రాములునాయక్ ప్రగతిభవన్‌కు వెళ్లి టికెట్ తనకే ఇవ్వాలని అభ్యర్థించినా నిరాశే ఎదురైంది. ఇక ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొందరు ఫిర్యాదు చేసినా అధిష్టానం ఆమైవెపే మొగ్గు చూపింది. -
జనగామలో టెన్షన్ టెన్షన్.. పల్లా గో బ్యాక్.. ముత్తిరెడ్డి వర్గీయుల నిరసన
సాక్షి, జనగామ: బీఆర్ఎస్లో జనగామ టిక్కెట్ వివాదం తారస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు రచ్చ రచ్చ చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టిక్కెట్ ఖరారు చేశారనే ప్రచారంతో ముత్తిరెడ్డి అనుచరులు గో బ్యాక్ పల్లా అంటూ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. చౌరస్తాలో బైఠాయించి ముత్తిరెడ్డికి టిక్కెట్ ఇస్తే గెలిపించి గిఫ్ట్ ఇస్తామని లేకుంటే పార్టీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరించారు. అటు స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య అనుచరులు కడియంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగి దిష్టిబొమ్మలు దహనం చేశారు. చదవండి: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు -
ఇన్‌స్టాలో భార్యకు విపరీతమైన ఫాలోవర్స్ .. అనుమానంతో భర్త కిరాతకం
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూసి అసూయ, అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా చంపాడు భర్త... కన్న పిల్లల ఎదుటే భార్య గొంతు నులిమి హత్య చేశాడు. వివరాలు.. లక్నోలోని పారా ప్రాంతంలో వ్యాపారవేత్తకు భార్య 12 ఏళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అతడి భార్య గృహిణి. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అంతేగాక ఇన్‌స్టాగ్రామ్‌లో భార్య తనను బ్లాక్చేయడంతో భర్తకు కోపం వచ్చింది. తన భార్యకు ఎవరితోనో ఎఫైర్ ఉందని, తాను ఇంట్లో లేని సమయంలో తన భార్యను సోషల్ మీడియా ఫాలోవర్స్ కలుస్తున్నారన్న అనుమానం ఏర్పడింది. ఈ విషయం భార్య, భర్తల మధ్య గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో ఆదివారం పిల్లలతో కలిసి కారులో రాయ్‌బరేలికి బయలుదేరారు. మధ్యలోనే పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే వైపు కారును తిప్పాడు. నిందితుడు మధ్యలో సుల్తాన్‌పూర్‌లోని ముజేష్ కూడలి దగ్గర కారు ఆపాడు. అక్కడ తన భార్యతో సోషల్ మీడియా వ్యవహారంపై వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపంతో పిల్లల ముందే భార్యను గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అదే వాహనంలో లాక్ చేసుకుని ఉండిపోయాడు. ఊహించని ఘటనతో పిల్ల్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తల్లి మరణంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే.. అనుమానాస్పదంగా కారు పార్కింగ్ చేయడంతో పెట్రోలింగ్ బృందం ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేసింది. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి తనిఖీలు చేపట్టగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తమ కళ్ల ముందే తల్లిని దారుణంగా చంపాడని కుమార్తె, కుమారుడు తెలిపారు. వారి వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్కడైనా సరే 'తగ్గేదేలే'.. ఐకాన్ స్టార్ అరుదైన రికార్డ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో బన్నీ. ఐకాన్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. బన్నీ విషయానికోస్తే ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇప్పటికే ఇన్‌స్టాలో ఆయనకు 21.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇటీవల ట్విటర్‌కు పోటీగా కొత్తగా థ్రెడ్స్ యాప్‌ను జుకర్ బర్గ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!) ఈ యాప్‌లోను ఐకాన్ రికార్డ్ సృష్టించాడు. ఇండియాలోనే వన్ మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్న తొలి నటుడిగా నిలిచారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. యాప్ ఏదైనా ఐకాన్ స్టార్ తర్వాతే ఎవరైనా అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: టాలీవుడ్ హీరోకు పెద్ద ఫ్యాన్.. ధోని భార్య సాక్షి కామెంట్స్ వైరల్!) Icon star @alluarjun is ruling threads as he becomes the first Indian actor to hit 1 Million followers on the app. Not only is he setting the silver screen on fire with his incredible performances, but he's also ruling the digital world and has managed to create a deep connection… pic.twitter.com/sejrIV8Nv5 — Sarath Chandra Naidu (@imsarathchandra) July 24, 2023 -
తాడో పేడో తేల్చుకుంటాం.. గాంధీభవన్‌లో పొన్నం అనుచరుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్‌కు చోటు దక్కలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల ఏఐసీసీ నియమించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో చోటు లభించకపోవడంతో పొన్నం ప్రభాకర్ కొంత అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, పొన్నం ప్రభాకర్‌కు మద్ధతుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలు ఈ రోజు ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఏదో ఒక నిర్ణయం చెప్పాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. రేవంత్‌కు వార్నింగ్! మరో వైపు, హైదరాబాద్ గాంధీభవన్‌లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయ్యింది. రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశంలోలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలు, పార్టీలో చేరికలు, నేతల మధ్య సమన్వయంపై చర్చిస్తున్నారు. -
2023లో టాప్ 10 ఇన్స్టాగ్రామ్ ఫాల్లోవర్స్
-
ఆసియాలోనే ఒకే ఒక్కడు కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు ..
-
'కింగ్' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు
టీమిండియా స్టార్ కింగ్ కోహ్లి అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. అయితే ఆటలో మాత్రమే అతను కింగ్ అనిపించుకోవడం లేదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల విషయంలోనూ కోహ్లి తనకు తానే సాటి. ఇటీవలే ఐపీఎల్ రెండు వరుస శతకాలతో అభిమానులను అలరించిన కోహ్లి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 250 మిలియన్ ఫాలోవర్లను సంపాదించాడు. ఆసియా ఖండం నుంచి ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా కోహ్లి నిలిచాడు. టీమిండియా తరపున ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్‌గానూ కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. కోహ్లి తర్వాత ఎంఎస్ ధోని 42.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు ఇన్‌స్టాలో 40.3 మిలిమిన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన క్రీడాకారుడిగా నిలిచాడు. రొనాల్డోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 585 మిలియన్. రొనాల్డో తర్వాత లియోనల్మెస్సీ 462 మంది మిలియన్ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్ చేరడంలో మరోసారి విఫలమైంది. సీజన్లో మంచి విజయాలు నమోదు చేసినప్పటికి ఆర్సీబీ ప్లేఆఫ్‌లో అడుగుపెట్టలేదు. అయితే కోహ్లి మాత్రం రెండు సెంచరీలు సహా ఐదు అర్థసెంచరీలతో 700కు పైగా పరుగులు సాధించి తన సూపర్‌ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. చదవండి: కోహ్లి పేరిట అలా చేయడాన్ని ఆస్వాదిస్తాను: నవీన్ ఉల్ హక్ ఒక 'SKY' మరో 'స్కై'తో.. 'వదిలితే 10 వికెట్లు తీస్తావా?' -
కర్నూలులో తన్నుకున్న టీడీపీ శ్రేణులు : అఖిలప్రియ అరెస్ట్
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో తెలుగుదేశం పరువు బజారున పడింది. లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీలో మరొకసారి విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అఖిలప్రియ వర్గీయులు కొందరు ఏవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. సుబ్బారెడ్డి ఎత్తిపడేసి పిడిగుద్దులు కురిపించారు. ఒక సమయంలో సుబ్బారెడ్డి పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరి క్షణంలో ఆయన వర్గీయులు అడ్డుకుని పక్కకు తప్పించారు. తీవ్రంగా గాయ పడ్డ సుబ్బారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. భూమా అఖిలప్రియను నంద్యాల పీఎస్‌కు తరలించారు. దాడి గురించి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అఖిలప్రియ.. ఏవీ సుబ్బారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. నంద్యాల పర్యటన సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి తన చున్నీ లాగారాని, దీనిపై నిలదీస్తే ఏవీ సుబ్బారెడ్డి తనను దూషించారని అఖిలప్రియ ఆరోపించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో తన అభిమానులు ఏవీ సుబ్బారెడ్డి పై దాడిచేశారని తెలిపారు. తన కోసం భర్త భార్గవ్ రామ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారని అఖిలప్రియ తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఖండించారు. తమ బలాన్ని నిరూపించుకునేందుకు దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపించారు. ఇదిలా ఉండగా, నంద్యాల ఘటనపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తలపట్టుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసలే అంతంత మాత్రంగా నడుస్తోన్న లోకేష్ పాదయాత్రకు కొత్తగా ఇవేమీ ఇబ్బందులంటూ చంద్రబాబు వాపోయినట్టు తెలిసింది. ఘటనపై పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. సీనియర్లతో త్రిసభ్య కమిటీ వేశారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. పాదయాత్ర పూర్తయ్యేవరకు పార్టీ నేతలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చదవండి: లేఖను ఎందుకు దాచారు? -
సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ భామకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఛలో మూవీతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్గా చెలరేగిపోతుంది. చదవండి: నటి వనితా విజయ్ కుమార్ మాజీ భర్త కన్నుమూత ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉండే రష్మిక తరచూ సినిమాలు, తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది.తాజాగా రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో మరో మైలురాయిని చేరుకుంది. 38 మిలియన్ ఫాలోవర్స్‌తో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా రష్మిక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్లో ఈ మార్క్‌ను చేరుకున్న తొలి హీరోయిన్‌గానూ క్రేజ్ దక్కించుకుంది. సమంతకు 26.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, కాజల్‌కు 25.4, తమన్నాకు 20.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: ఉదయ భాను కొత్తంటిని చూశారా?భలే రిచ్‌గా ఉందే! View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
దళపతి విజయ్.. థియేటర్లే కాదు.. సోషల్ మీడియా కూడా షేక్!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆయనకు భారీసంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా క్రేజ్ సంపాదించుకున్న హీరో దళపతి విజయ్. ఇటీవలే వారసుడు(వారీసు) మూవీతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ప్రస్తుతం సెలబ్రిటీలు సోషల్ మీడియాను విరివిగా వాడేస్తున్నారు. తమ అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాతో టచ్‌లో ఉంటున్నారు. అయితే ప్రస్తుతం సినీతారలు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఆయనకు ఇన్‌స్టాలో ఖాతా లేదంటే విచిత్రంగా ఉంది కదూ. అవునండీ తాజాగా దళపతి విజయ్ తన ఇన్‌స్టా ఖాతాను తెరిచారు. ఇంకేముంది ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. విజయ్ ఖాతా తెరిచిన 24 గంటల్లోనే ఏకంగా 4.6 మిలియన్ల ఫాలోవర్లు వచ్చేశారు. ఖాతా ప్రారంభించిన 99 నిమిషాల్లో 1 మిలియన్ల ఫాలోవర్స్ చేరిన తొలి ఇండియన్‌గా విజయ్ నిలిచారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ విషయంలో విజయ్ మూడోస్థానం దక్కించుకున్నారు. తొలి రెండు స్థానాల్లో బీటీఎస్ వీ(43 నిమిషాలు), ఎంజెలీనా జోలీ(59 నిమిషాలు) ఉన్నారు. దీంతో నెటిజన్స్ దళపతి విజయ్ అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నారు. అంతకుముందు కేవలం 15 గంటల్లో 3.9 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. విజయ్ ఇన్‌స్టాలో ఎంట్రీ ఇస్తూ ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాలో రాస్తూ.. 'హలో నంబా అండ్ నంబిస్' వెల్కమ్ సందేశం ఇచ్చారు. కాగా.. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘లియో’ షూటింగ్లో ఉన్నారు. గతంలో ట్విటర్ ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్న విజయ్, కొంతకాలం విరామం తీసుకున్నాడు. దళపతికి ఇప్పటికే ఫేస్బుక్లో 7.8 మిలియన్లు, ట్విట్టర్లో 4.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Vijay (@actorvijay) -
అనంతపురంలో పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యం
-
తగ్గేదే లే
సోషల్ మీడియాలో ఫాలోయర్స్ విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అంటున్నారు అల్లు అర్జున్. ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఫాలోయర్స్ జాబితా 20 మిలియన్స్ (2 కోట్లు)కు చేరింది. దక్షిణాదిన ఈ ఫీట్‌ను సాధించిన తొలి హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. అయితే ‘పుష్ప’ తొలి భాగం రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోయర్లు ఉంటే ఆ సినిమా విడుదల తర్వాత వచ్చిన 20 మిలియన్స్‌కు చేరుకుందని అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’లో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ సాధించానన్న ఆనందంలో మునిగి తేలుతున్నాడు. మెస్సీ సంతోషం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో గెలిచిన అర్జెంటీనా టైటిల్ విజేతగా నిలిచింది. 16 ఏళ్ల నిరీక్షణ.. 36 ఏళ్ల అర్జెంటీనా కలను తీర్చాడు కాబట్టే మెస్సీ అంత సంతోషంగా ఉన్నాడు. ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా తర్వాత ఆ లిగసీని కంటిన్యూ చేస్తూ ఎట్టకేలకు అర్జెంటీనాకు మూడో వరల్డ్‌కప్‌ను అందించాడు. ఈ వరల్డ్‌కప్‌లో అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌తో పాటు మూడు అసిస్ట్‌లు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా గోల్డెన్ బాల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలోనే మెస్సీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సీ 400 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించించాడు. దీంతో క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీగా మెస్సీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక రొనాల్డో 517 మిలియన్ ఫాలోవర్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. అంతేకాదు 500 మిలియన్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన తొలి వ్యక్తిగా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొత్త చరిత్ర సృష్టించాడు. View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) చదవండి: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె నిరీక్షణ ముగిసింది.. మెస్సీ సాధించాడు -
ట్రెండ్: కుటుంబాలకు రీల్స్ గండం
33,500 మంది ఫాలోయెర్ల వల్ల ఒక గృహిణి ప్రాణం పోయింది. తమిళనాడులో తాజాగా ఈ ఘటన జరిగింది. ఫాలోయెర్లు పెరగడంతో రీల్స్ చేయడంలో పడి ఇంటిని పట్టించుకోని భార్యను క్షణికోద్రేకంలో భర్త కడతేర్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో మహిళ రీల్స్ వద్దన్నందుకు తన అన్నలిద్దరి మీదా దాడి చేసి పోలీస్ స్టేషన్ చేరింది. రీల్స్ అనేవి మహిళల ప్రతిభను వ్యక్తం చేసే సోషల్ మీడియా సాధనాలుగా ఉన్నాయి. కాని ఏ ప్రతిభా లేకపోయినా కేవలం ఫాలోయెర్ల కోసం వెర్రిమొర్రి రీల్స్ చేసే మహిళల వల్ల కుటుంబాలకు గండాలు వస్తున్నాయి. సోషల్ మీడియా అడిక్షన్ గురించి చైతన్యం రావాల్సిన సందర్భం వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తే ఫాలోయెర్స్ వస్తారు. ఆదాయం కూడా వస్తుంది. 2000 మంది ఫాలోయెర్స్ వస్తే ‘ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్’గా గుర్తింపబడతారు. వీరు చేసిన రీల్స్ నెల రోజుల్లో 1000 మంది చూస్తే వీరికి బోనస్‌లు వస్తాయి. 10వేల మంది ఫాలోయెర్స్ ఉంటే ఒక స్థాయి... లక్ష దాటితే మరో స్థాయి. ఆ తర్వాత ప్రచారకర్తలే ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లతో ఉత్పత్తులకు ప్రచారం చేయించుకుంటారు. రకరకాల పద్ధతుల్లో ఆదాయం వస్తుంది కూడా. తమ ప్రతిభతో, నైపుణ్యాలతో ఈ రీల్స్ ద్వారా గుర్తింపు, గౌరవం పొందుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. ఫిట్నెస్, లైఫ్‌స్టయిల్, స్టాండ్ అప్ కామెడీ, మిమిక్రీ, హెల్త్, యోగా... ఇలా అనేక రంగాల్లో నైపుణ్యం ఉండి వాటి ద్వారా రీల్స్ చేస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారుతారు. ఈ రంగంలో కొందరు సగటు గృహిణులు, మహిళలు కూడా తమ వంటల ద్వారానో, చమత్కారమైన మాటల ద్వారానో, నృత్యాల ద్వారానో గుర్తింపు పొందుతున్నారు. అయితే తమకు ఉన్న చిన్నపాటి ప్రతిభకు కూడా కామెంట్లు, ఫాలోయెర్లు వస్తుండటంతో ఇక అదే లోకంగా మారిన వారు అవస్థలు తెచ్చుకుంటున్నారు. ఇరవై నాలుగ్గంటలు ఫోన్లో మునిగి, రీల్స్ తయారీలో నిమగ్నమయ్యి, కుటుంబాలలో కలతలకు కారణం అవుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో జరిగింది అదే. సాధించానని భ్రమసి చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపూరులో అమృతలింగం (38) లోకల్ మార్కెట్లో హమాలీగా పని చేస్తాడు. అతడి భార్య చిత్ర చిన్న గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తుంది. ముందు టిక్ టాక్, ఆ తర్వాత ఇన్‌స్టాలో రీల్స్ చేయడం మొదలుపెట్టిన చిత్ర దాదాపు 35 వేల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకుంది. దాంతో ఆమె అన్ని పనులు మాని ఈ రీల్స్ తయారీలో పడింది. అమృతలింగంకు ఇది నచ్చలేదు. ఇంటిని పట్టించుకోమని గొడవకు దిగేవాడు. అయితే రీల్స్ కింద వచ్చే కామెంట్స్ లో పొగడ్తలు నిండేసరికి చిత్ర తన ప్రతిభకు సినీ పరిశ్రమే సరైనదని భర్త మాట వినకుండా మూడు నెలల క్రితం చెన్నై చేరి వేషాలకు ప్రయత్నించసాగింది. వారం క్రితం ఒక ఫంక్షన్‌కు సొంత ఊరు వచ్చి తిరిగి చెన్నై బయలుదేరుతుండేసరికి అమృతలింగం గట్టిగా అడ్డు పడ్డాడు. చెన్నై వెళ్లకూడదని పట్టుపట్టాడు. ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. క్షణికావేశంలో అతను చీరతో ఆమె మెడను బిగించాడు. స్పృహ తప్పేసరికి భయపడి వదిలేశాడు. కాని అప్పటికే ఆమె చనిపోయింది. వద్దు అంటే తిరుగుబాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆర్తి రాజ్‌పుత్ అనే యువతి ఈ రీల్స్‌కు బాగా అడిక్ట్ అయ్యింది. ఆమెకు ఇంటి విషయాలే పట్టడం లేదని సోదరులు జైకిషన్, ఆకాష్ అభ్యంతరం తెలిపారు. దాంతో ఆమె ఆ ఇద్దరు సోదరులపై దాడి చేసింది. వారు భయపడి పోలీసులను పిలిస్తే స్టేషన్లో మళ్లీ సిబ్బంది ఎదుటే సోదరులను కొట్టింది. అంతే కాదు... అడ్డుపడ్డ మహిళా పోలీసులపై దాడి చేసింది. దాంతో ఆమె కటకటాలు లెక్కించే స్థితికి వెళ్లింది. బతికున్నా లేనట్టే సోషల్ మీడియా అడిక్షన్ దాదాపుగా మనిషిని జీవచ్ఛవంలా మారుస్తాయని నిపుణులైన మానసిక వైద్యులు అంటున్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్, వాట్సప్‌లకు అడిక్ట్ అవుతున్నారు. లైక్‌లు, షేర్లు, సబ్స్క్రయిబ్లలో పడి చదువు, ఇంటి పని, బాధ్యతలు, లక్ష్యాలు మర్చిపోతున్నారు. భార్యాభర్తల్లో ఎవరు ఎడిక్ట్ అయినా కాపురంలో కలతలు, జగడాలు వస్తున్నాయి. పిల్లలు చదువును నష్టపోతున్నారు. ఫోన్ చూడొద్దంటే అలిగి ఇళ్ల నుంచి పిల్లలు పారిపోతున్నారు. అపరిచితులతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. లంఖణం దివ్యౌషధం అని పెద్దలు అన్నారు. సోషల్ మీడియా కు సంబంధించిన లంఖణాలు పెట్టడం మంచిదని నిపుణులు కూడా అంటున్నారు. రోజులో కొన్ని గంటలు ఫోన్ ముట్టుకోకుండా వారంలో ఒక రోజు సోషల్ మీడియా చూడకుండా పేపర్లు, పుస్తకాలు, స్నేహితులపై ధ్యాస మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబంలో అందరి సమ్మతంతో గౌరవాన్ని, ఆదాయాన్ని ఇచ్చే విధంగా మీడియాను వాడితే కలత లు రావు. కాని కుటుంబ సభ్యుల విముఖతను లెక్క చేయకుండా సోషల్ మీడియాకే ప్రాధాన్యం ఇస్తుంటే ఇబ్బందులు తప్పవు. తస్మాత్ జాగ్రత్త. -
ఆనంద్ మహీంద్ర అద్భుత రికార్డ్, అదిరిపోయే చమక్కు
సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్, పాపులర్ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా రికార్డ్ సాధించారు. సోషల్ మీడియాలోఎపుడు చురుకుగా ఉండే ఆయన ట్విటర్లో ఏకంగా కోటి మంది ఫాలోయర్లను సాధించారు. అంతేకాదు ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేస్తూ, తనదైన శైలిలో చమత్కరించడం విశేషం. దీంతో పలువురు ఫ్యాన్స్ ఆయనను అభినందనల్లో ముంచెత్తుతున్నారు ‘‘ఇంత పెద్ద కుటుంబం.. నమ్మలేకపోతున్నాను. ఇది స్పష్టంగా కుటుంబ నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుంది. మీ ఆసక్తి, నా పట్ల మీరు చూపిస్తున్న నమ్మకానికి అందరికీ బిగ్ థ్యాంక్స్..ఇకపై నాతో కలసే ఉండండి’’ అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు. అలాగే ఒక జిఫ్‌ను షేర్ చేయడంతో నెటిజన్లు ఉత్సాహంగా తమ స్పందన తెలియజేస్తున్నారు. (మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్1బీ వీసా హోల్డర్లలో కలవరం) కాగా ఆనంద్ మహీంద్ర అంటే బిజినెస్ వర్గాల్లోనే కాదు, ట్వీపుల్లో బాగా పాపులర్ అయిన పేరు. ఎందుకంటే వింతలు, విజ్ఞానం, సైన్స్, లేటెస్ట్టెక్నాలజీ అంశాలతో పాటు సామాజిక అవగాహన కల్పించే అంశాలను, వీడియోను ట్విటర్లో షేర్ చేయడం ఆయనకు అలవాటు. ఆ స్పెషాలిటీనే కోటి మంది అభిమానులకు చేరువ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. My reaction when I saw this milestone in the number of followers. Hard to believe I have a family this large. (Clearly violating Family Planning guidelines!) A huge thank you to all for your interest and your belief in me. Let’s stay connected. 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/NEIKAlKh5I — anand mahindra (@anandmahindra) November 10, 2022 -
వైఎస్సార్సీపీ నేతలపై జేసీ వర్గీయులు దాడి
-
ఎఫ్బీలో జుకర్‌బర్గ్‌కు భారీ షాక్, కష్టాల్లో మెటా
న్యూఢిల్లీ: మెటా సీఈవో, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పౌండర్ మార్క్ జుకర్ బర్గ్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత ప్లాట్‌ఫాంలోనే ఊహించని ఝలక్ తగిలింది. ఒక్కసారిగా 118 లక్షల ఫాలోవర్లను కోల్సోయారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను ప్రభావితం చేసే బగ్ కారణంగా కొన్ని సెకన్లలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఫేస్బుక్లో జుకర్‌బర్గ్‌కు 119 మిలియన్ల (11.9 కోట్ల)మంది ఫాలోవర్లు ఉండగా అకస్మాత్తుగా అది కాస్తా 10వేల కిందికి (9920) పడి పోవడం సంచలనం రేపింది. మరోవైపు జుకర్‌బర్గ్‌తో పాటు పలువురు సెలబ్రిటీల పాలోవర్ల సంఖ్య కూడా లక్షల్లో తగ్గిపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా ప్రముఖ రచయత్రి తస్లిమా నస్రీన్ ట్వీట్ చేశారు.ఫేస్బుక్ సునామీతో తన ఫాలోవర్లు కూడా ఒక్కమారుగా 9లక్షల నుంచి 9వేలకు పడిపోయారంటూ మీడియా కథనాన్ని షేర్ చేశారు. అంతేకాదు తనకు ఫేస్బుక్ కామెడీ అంటే చాలా ఇష్టం అంటూ ఆమె ట్వీట్ చేయడం విశేషం. తర్వాత కొన్ని గంటల్లో ఈ లోపాన్ని కంపెనీ సరిచేయడంతో యథాతథంగా ఆయా సెలబ్రిటీల ఫాలోవర్లు కనిపించారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో లోపాన్ని త్వరగా గుర్తించి మెటా పరిస్థితిని సరిదిద్దే పనిలో ఉన్నామని, సాంకేతికత లోపాలే కారణమని మెటా తెలిపింది. అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. అయితే, పొరపాటు ఎలా జరిగిందనే దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా మెటా వర్స్ సక్సెస్‌లో ఇబ్బందులు పడుతున్న మోటాకు తాజాగా ఫాలోవర్ల కౌంట్ తగ్గిపోవడంతో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇది ఇలా ఉంటే ఉక్రెయిన్‌లో రష్యన్ మిలిటరీకి వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చే పోస్ట్‌లను మెటా అనుమతిస్తోందని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ను ఉగ్రవాదులు, తీవ్రవాదుల జాబితాలో చేరుస్తూ ఆర్థిక పర్యవేక్షణ ఏజెన్సీ రోస్ఫిన్‌మోనిటరింగ్ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, లింక్డ్ఇన్ సీఈవొ ర్యాన్ రోస్లాన్స్కీతో సహా అనేక మంది అమెరికన్ పౌరులపై క్రెమ్లిన్ విధించిన ఆంక్షలలో భాగంగా జుకర్‌బర్గ్ రష్యాలోకి ప్రవేశించకుండా నిషేధం ఇప్పటికే అమల్లో ఉంది. .@facebook created a tsunami that wiped away my almost 900,000 followers and left only 9000 something on the shore: @taslimanasreen. Several users of @Meta's #facebook are complaining losing majority of their #followers. read more here. #MarkZuckerberghttps://t.co/QbxBSgMvId — The Telegraph (@ttindia) October 12, 2022 -
ఫేస్బుక్లో అన్‌ఫాలో కలకలం
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో బుధవారం ఉదయం నుంచి కొన్ని గంటల సేపు గందరగోళం నెలకొంది. ఫేస్బుక్ వినియోగదారుల ఫాలోవర్ల సంఖ్య రాత్రికి రాత్రి అమాంతంగా పడిపోవడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనూహ్యంగా భారీ సంఖ్యలో తమ ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతున్నట్టు చాలా మంది వినియోగదారులు ఆందోళన చెందారు. దీనికి కారణాలు తెలీక గగ్గోలు పెట్టారు. చివరికి మెటా కంపెనీ వ్యవస్థపాకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు తిప్పలు తప్పలేదు. జుకర్‌బర్గ్‌కు 11.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే ఏకంగా 10 వేలకు పడిపోవడంతో కలకలం నెలకొంది. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, యూఎస్ఏ టుడే వంటి అమెరికన్ మీడియా ఖాతాల ఫాలోవర్ల సంఖ్య పడిపోయింది. రచయిత్రి తస్లీమా నస్రీన్ ఫాలోవర్ల సంఖ్యపై ఆందోళన చెందుతూ ట్వీట్ చేశారు. ‘ఫేస్బుక్ సృష్టించిన సునామీతో తొమ్మిది లక్షల మంది ఉన్న నా ఫాలోవర్ల సంఖ్య కేవలం 9,000కు పడిపోయింది. జుకర్‌బర్గ్ ఫాలోవర్లు తగ్గిపోవడం మరీ విడ్డూరం’ అని ఆమె ట్వీట్ చేశారు. ఎందరో ప్రముఖుల ఫాలోవర్ల సంఖ్య పడిపోవడంతో ఫేస్బుక్ ప్రతినిధులు వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. సాయంత్రానికి అందరి ఖాతాల ఫాలోవర్లు సాధారణ స్థితికి చేరుకోవడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకిలా జరిగింది ? ఫేస్బుక్లో ఫాలోవర్ల సంఖ్య పడిపోవడానికి మెటా సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ రకరకాల విశ్లేషణలు చేస్తూ నెటిజన్లు పలు పోస్ట్‌లు పెట్టారు. ఫేస్బుక్లో బాట్ అకౌంట్ల ప్రక్షాళనకు దిగడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ బాట్ అకౌంట్ల సాయంతో ఆటోమేటిక్‌గా మెసేజ్‌లు పంపడం, ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడం వంటివి చేయొచ్చు. వీటిని తొలగించే క్రమంలో సాంకేతిక లోపాలు తలెత్తి భారీ గందరగోళానికి దారి తీసిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్లో కొత్త ఆల్గారథిమ్ ప్రయోగించడంతో ఇలా జరిగిందనే అనుమానాలు కొందరు వ్యక్తంచేశారు. -
'రాధేశ్యామ్'కు ముందే ప్రభాస్ అరుదైన రికార్డ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సుమారు రూ. 300కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్లో కొనసాగుతున్నాయయి. ఇదిలా ఉండగా ప్రభాస్ తాజాగా మరో అరుదైన రికార్డును సాధించాడు. ఇప్పటికే ప్రపంచమంతా క్రేజ్ ఉన్న ప్రభాస్ తాజాగా మరో మైల్‌స్టోన్‌కి రీచ్ అయ్యాడు. అతి తక్కువ కాలంలోనే ఆయన ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య 8మిలియన్స్‌కి పైగా చేరుకుంది. అయితే సోషల్ మీడియాకు దూరంగానే ఉండే ప్రభాస్ కేవలం తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ని షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ‘సలార్', ‘ప్రాజెక్ట్-K’ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి. -
రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానొ రొనాల్డో పేరిట ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. మైదానంలో తన ఆటతో రికార్డులను సొంతం చేసుకునే రొనాల్డో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 400 మిలియన్ల మార్క్‌ను టచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డులెక్కాడు. చదవండి: Munich Air Disaster: ఫిబ్రవరి 6, 1958.. ఫుట్‌బాల్ చరిత్రలో అతి పెద్ద విషాదం అటు ఆటగానిగా.. ఇటు వ్యక్తిగా ఏ విధంగా చూసినా ఇన్‌స్టాగ్రామ్‌లో 400 మిలియన్ ఫాలోవర్ల సంఖ్య రొనాల్డోకు మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే రొనాల్డో తర్వాత రెండోస్థానంలో ఉన్న అమెరికన్ స్టార్ మోడల్ కైలీ జెన్నర్ ఫాలోవర్ల సంఖ్య 309. వీరిద్దరి మధ్య దాదాపు వంద మిలియన్లు తేడా ఉంది. ఈ మధ్యనే రొనాల్డో(ఫిబ్రవరి 5న) తన 37వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా గతేడాది సెప్టెంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 230 మిలియన్గా ఉండేది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే తన ఫాలోయింగ్‌ను డబుల్ రేంజ్‌కు పెంచుకున్నాడు. గతేడాది 12 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు రీఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. సూపర్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. అదే సమయంలోనూ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లోనూ తన ఫాలోవర్ల సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటూ వెళుతున్నాడు. కాగా రొనాల్డో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 3,242 పోస్టులు చేశాడు.. విచిత్రమేంటంటే రొనాల్డో తాను ఫాలో అవుతున్న సంఖ్య 501 మాత్రమే. చదవండి: కోల్‌కతా థండర్‌బోల్ట్స్ ఉత్కంఠ విజయం -
మా గొంతు నొక్కేస్తున్నారు!
న్యూఢిల్లీ: భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడంలో ట్విట్టర్ తెలియకుండానే భాగస్వామిగా మారుతోందని, తన ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్‌ను తగ్గిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఇండియాకు లేఖ రాశారు. భారత విధ్వంసంలో ట్విట్టర్ పావుగా మారకూడదని, కోట్లాది భారతీయుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. డిసెంబర్ 27న రాసిన ఈ లేఖ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. అయితే రాహుల్ అకౌంట్ ఫాలోవర్స్ సంఖ్య కచ్ఛితమైనది, సరైనదేనని ట్విట్టర్ వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఆరోగ్యకరమైన చర్చలను కోరుకుంటున్నామని తెలిపింది. భిన్న అభిప్రాయాలను తాము గౌరవిస్తామని ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ సైనియడ్ మెక్‌స్వీనీ తెలిపారు. తాము ఎలాంటి రాజకీయపరమైన సెన్సారింగ్ చేయడం లేదన్నారు. దేశ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతగా అన్యాయంపై ప్రజల తరఫున గళమెత్తాల్సిన బాధ్యత తనపై ఉందని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. భారత్‌లో మీడియా అణగదొక్కుతున్న నేపథ్యంలో ప్రజల సమస్యలను లేవనెత్తి, ప్రభుత్వ బాధ్యతలను గుర్తుచేసేందుకు ట్విట్టర్ వంటి మాధ్యమాలు తమకు కీలకంగా మారాయని, కానీ గత కొన్ని రోజులుగా తన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పడిపోతూ వస్తోందని వివరించారు. తన ఫాలోయర్ల సంఖ్య రోజుకు పదివేల చొప్పున పెరిగేదని, కానీ కొన్ని రోజులుగా ఈ సంఖ్య మారడం లేదని చెప్పారు. కేంద్రమే కారణం తన గళాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం నుంచి ట్విట్టర్ ఇండియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని తెలిసిందని రాహుల్ ఆరోపించారు. తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారాన్ని తమ వేదికపై అంగీకరించమని, అలాంటివాటిపై మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో చర్యలు తీసుకుంటుమని ట్విట్టర్ ప్రతినిధి చెప్పారు. ఇందులో భాగంగానే కొందరి ఫాలోవర్ల సంఖ్యలో మార్పులు జరగొచ్చని, విధానాల ఉల్లంఘనకు ప్రతి వారం లక్షలాది మంది ఖాతాలను తొలగిస్తుంటామని చెప్పారు. ప్రజాస్వామ్యం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ప్రభుత్వం అణచివేయకూడదన్నదే తమ నాయకుడు రాహుల్‌గాంధీ అభిప్రాయమని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. ఈ వారం నుంచి రాహుల్ ఫాలోయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు చాలా రోజుల పాటు ఆయన ఫాలోయర్ల సంఖ్య 1.95 కోట్ల వద్ద స్థిరంగా ఉండిపోయింది. ఈ వారం మాత్రం ఈ సంఖ్య 1.96 కోట్లకు చేరింది. -
కెప్టెన్ గేమ్‌ప్లాన్ ఏమిటో..!
పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపివేయడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ గత ఏడాది నవంబరులో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)’గా తమ పార్టీకి నామకరణం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పీఎల్సీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త), బీజేపీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాయని కమలదళం పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జి, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇటీవల ప్రకటించారు. కాంగ్రెస్‌లోని తన అనుయాయులను సొంత పార్టీలోకి లాగుతారని, ఎన్నికలు సమీపించేకొద్దీ... వలసలు పెరుగుతాయని అంతా భావించారు. అనుకున్నట్లుగానే జంపింగ్‌లు మొదలయ్యాయి కానీ... ఆశ్చర్యకరంగా కెప్టెన్ అనుంగు అనుచరులు బీజేపీలోకి దూకేస్తున్నారు. ఇది పలువురి భృకుటి ముడిపడేటట్లు చేస్తోంది. అమరీందర్ గేమ్‌ప్లాన్ ఏమిటి? సొంత పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సింది పోయి ముఖ్య అనుచరులు బీజేపీలోకి వెళ్లడాన్ని ఎలా అనుమతిస్తున్నారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరెవరు వెళ్లారంటే.. మాజీ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి (గురుహర్ సహాయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే) డిసెంబరు 21న కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 67 ఏళ్ల గుర్మీత్ నాలుగుసార్లు ఎమ్మెల్యే. సెప్టెంబరు దాకా అమరీందర్ కేబినెట్లో క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు. కెప్టెన్‌కు బాగా సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఈ కారణంగానే చన్నీ కేబినెట్లో ఈయనకు చోటివ్వలేదు. ఖాదియాన్ ఎమ్మెల్యే ఫతేజంగ్ బజ్వా, శ్రీహరిగోవింద్పూర్ ఎమ్మెల్యే బల్విందర్ సింగ్ లడీలు 22న కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో బజ్వాకు కాంగ్రెస్ టిక్కెట్ రావడానికి అమరీందర్ సహాయపడ్డారు. ఇలా కెప్టెన్‌కు సన్నిహితులు కాషాయ కండువా కప్పుకోవడంతో... సమీప భవిష్యత్తులో అమరీందర్ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరూ ఉండరని, ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రధాని నరేంద్ర మోదీ పేరిటే ఎన్నికలకు వెళతామని షెకావత్ ప్రకటించారు. కూటమిలో బీజేపీయే పెద్దన్న పాత్ర పోషిస్తుందని, పంజాబ్ అసెంబ్లీలోని 117 స్థానాల్లో సగానికి పైగా తామే పోటీచేస్తామని షెకావత్ ఉద్దేశపూర్వకంగా లీకులిచ్చినా... అమరీందర్ శిబిరం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. కాంగ్రెస్‌ను సాధ్యమైనంత ఎక్కువగా నష్టపర్చడమే ఈ 79 ఏళ్ల పాటియాలా రాజవంశ వారసుడి ప్రథమ లక్ష్యమని, అందుకే బీజేపీ అభీష్టం మేరకే నడుచుకుంటున్నారనే వాదన ఉంది. పరస్పర అవగాహనతోనేనా..! కెప్టెన్ పార్టీని బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలను లోక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రిన్స్ ఖుల్లర్ తోసిపుచ్చారు. బీజేపీకి పట్టున్న పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీచేయాలనుకున్న వారు కాషాయదళంలోకి వెళుతున్నారని.. అమరీందర్‌తో సంప్రదించే చేరికలు జరుగుతున్నాయని ఖుల్లర్ చెప్పారు. రాణా గుర్మీత్ సోధి ఫిరోజ్‌పూర్ నుంచి, ఫతేజంగ్ బజ్వా హిందూ బెల్ట్ నుంచి బరిలోకి దిగాలని కోరుకున్నారని... ఇవి బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకున్న, చాలా ఏళ్లుగా ఆ పార్టీ పోటీచేస్తున్న సీట్లు కావడంతో వారు అటువైపు మొగ్గు చూపారని తెలిపారు. ఈయన మాటలను బట్టి చూస్తుంటే... పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూనే అంతిమంగా కూటమికి లబ్ధి చేకూరేలా అమరీందర్, బీజేపీలు అవగాహనకు వచ్చినట్లు కనపడుతోంది. సన్నిహితులు ’సేఫ్‌జోన్’ను (విజయావకాశాలు మెండుగా ఉన్న స్థానాల నుంచి) కోరుకోవడం... ఏ పార్టీలో ఉన్నా తన మనుషులే, కూటమి ఎమ్మెల్యేలుగానే ఉంటారనే లెక్కతో కెప్టెన్ వీరికి పచ్చజెండా ఊపి ఉండొచ్చు. గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని కూటమి భాగస్వామ్యపక్షాలు ఒక అవగాహనకు వచ్చాయని, అదే సమయంలో సంప్రదాయ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని పార్టీలకు నియోజకవర్గాల కేటాయింపు జరగాలని కోరుకుంటున్నాయని పీఎల్సీ అధికార ప్రతినిధి ఖుల్లర్ చెప్పారు. ఎవరికెన్ని సీట్లనేది ఇంకా ఖరారు కానున్నా... పీఎల్సీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త) పార్టీలు గ్రామీణ నియోజకవర్గాల నుంచి, బీజేపీ పట్టణ ప్రాంతాల్లోని స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయవర్గాల సమాచారం. 2017లో జరిగిన ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తులో భాగంగా 23 చోట్ల పోటీచేసి మూడింటిలో మాత్రమే నెగ్గిన బీజేపీ.. కెప్టెన్ అండతో ఈసారి గట్టికూటమిని ఏర్పాటు చేసింది. పంజాబ్ ఎన్నికలను ఈ కొత్త కూటమి చతుర్ముఖ (శిరోమణి అకాలీదళ్– బీఎస్పీ కూటమి, కాంగ్రెస్, ఆప్‌లు మిగతా మూడు) పోరుగా మార్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
మరో రికార్డు క్రియేట్ చేసిన రౌడీ హీరో
Vijay Deverakonda Hits 14 Million Followers on Instagram: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్‌కు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక సోషల్ మాధ్యమాల్లోనూ విజయ్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్ ఫాలోవర్స్‌తో సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ తర్వాత ఈ ఘనతను సాధించిన టాలీవుడ్ హీరో విజయే కావడం విశేషం. ఈ సందర్భంగా రౌడీ హీరోకు ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. #14MRowdiesOnInsta పేరుతో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
పెళ్లయినా తగ్గని ‘చందమామ’ క్రేజ్.. ఇన్‌స్టాలో 20 మిలియన్ల ఫాలోవర్స్
టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి కాజల్ అగర్వాల్. ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ బ్యూటీ.. రామ్ చరణ్ హీరోగా చేసిన ‘మగధీర’తో టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. అందచందాలతో అభిమానుల మనసులు దోచిన ఈ తార.. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన క్రేజ్ మరింతగా పెంచుకుంటూ పోయింది ఈ భామ. అంతేకాకుండా కొన్ని మూవీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులని సైతం పలకరించింది ఈ బ్యూటీ. అయితే కాజల్ ఇటీవల స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహమాడిన విషయం తెలిసిందే. పెళ్లాయిన తర్వాత కొంతమంది హీరోయిన్ల క్రేజ్ పడిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఈ చందమామది ఏ మాత్రం తగ్గలేదని.. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ని పెంచుకోవడం చూస్తుంటే అర్థం అవుతోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ.. తన ఖాతాలో 20 మిలియన్ల (2కోట్లు)కు ఫాలోవర్స్ వేసుకుంది. తన జోరు ఇలాగే కొనసాగితే సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది కాజల్. ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర వరకు షూటింగ్‌ను పూర్తి చేసిన ఈ బ్యూటీకి చిరుతో రెండో మూవీ. కాగా ఇటీవల సినిమాలను తగ్గించేసింది ఈ భామ. దానికి కారణం తను గర్భవతి కావడమేనని ఫిల్మీ దునియాలో ప్రచారం జరుగుతోంది. చదవండి: హబ్బీతో హాలిడే ట్రిప్, స్టన్నింగ్ ఫోటోలు -
కోహ్లీ సరికొత్త రికార్డు.. క్రికెట్లో అనుకుంటే పొరపాటే..!
న్యూఢిల్లీ: క్రికెట్లో రికార్డుల రారాజుగా చలామణి అవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. అయితే, ఈ సారి కింగ్ కోహ్లి రికార్డును క్రియేట్ చేసింది క్రికెట్లో మాత్రం కాదు. కోహ్లి.. ఇన్‌స్టాగ్రామ్‌లో 150 మిలియన్ల (15 కోట్లు) ఫాలోవర్ల రేర్ ల్యాండ్ మార్క్‌ను క్రాస్ చేసి సోషల్‌మీడియా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డుల్లో నిలిచాడు. భారత్‌లోనే కాక ఆసియా ఖండం మొత్తంలో ఈ ఫీట్ అందుకున్న తొలి వ్యక్తి కోహ్లినే కావడం మరో విశేషం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇన్‌స్టాలో అత్యంత ప్రజాదరణ(ఫాలోవర్స్) కలిగిన క్రీడాకారుల్లో కింగ్ కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. 337 మిలియన్ల ఫాలోవర్లతో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉండగా.. మెస్సీ (260 మిలియన్లు), నెయ్మార్ (160 మిలియన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కాగా, టీమిండియా కెప్టెన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్ (43.4 మిలియన్లు), ఫేస్బుక్ (48 మిలియన్లు)లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి ఒక స్పాన్సర్ పోస్టు ద్వారా ఏకంగా రూ. 5 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. చదవండి: "కోచ్ ఫిక్సింగ్ చేయమన్నాడు".. భారత స్టార్ ప్లేయర్ సంచలన ఆరోపణలు -
ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సమంత అంత సంపాదిస్తుందా?
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేశావే' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సమంత దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా అదే క్రేజ్‌ను కొనసాగిస్తుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు వ్యాపారవేత్తగానూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో సమంత యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు తనకి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఫాలోయింగ్ విషయంలోనూ సౌత్‌లో మిగతా హీరోయిన్ల కంటే సమంతదే పైచేయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం సమంతకు ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 18 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. దీంతో దీంతో పలు కంపెనీలు సైతం తమ బ్రాండ్లకు ప్రచారం చేయాల్సిందిగా క్యూ కడుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే భారీ రెమ్యునరేషన్ అందుకుంటుందట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కి గాను సమంత దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తుందని టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు పలు టీవీ యాడ్స్ నుంచి కూడా లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంటుందట. దీంతో సినిమాలకు ధీటుగా పాటు వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తూ షాక్ ఇస్తుంది అక్కినేని కోడలు. కాగా ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, నీలిమా గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
ట్విటర్లో కీలక మైలురాయి దాటిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాకర్షక నాయకుడిగా ప్రధానమంత్రి ఒకరిగా ఉన్నారు. మోదీకి దేశంలో అత్యంత ప్రజాదరణ ఉంది. ప్రధానమంత్రి హోదాలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. వివిధ అంశాలపై స్పందిస్తుంటారు. పలు ఆసక్తికరమైన పోస్టులు కూడా చేస్తుంటారు. ఇప్పుడు ప్రధాని మోదీ మరో అరుదైన ఘనతను సాధించారు. సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్లో ఏడు కోట్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని అగ్రభాగాన నిలిచారు. మొత్తం 70 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని కీలక మైలురాయిని దాటేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ 2009లో ట్విటర్ ఖాతా తెరిచారు. 2010 వరకు ఆయన ఫాలోవర్లు లక్షకే పరిమితమయ్యారు. పదకొండేళ్ల అనంతరం అంటే 2021కి ఏకంగా ఏడు కోట్లకు పైగా ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాక నరేంద్రమోదీని ఫాలో అయ్యేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రజలకు చేరువ అయ్యేందుకు మోదీ సోషల్ మీడియాను ఒక వేదికగా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలతో పాటు దేశం, ప్రపంచంలో జరుగుతున్న పలు అంశాలపై స్పందిస్తుంటారు. పలుసార్లు సామాన్య ప్రజలను కూడా ట్విటర్ ద్వారా పలకరించి ఆశ్చర్యపరుస్తుంటారు. అందుకే ప్రధాని మోదీకి ట్విటర్లో ఫాలోవర్స్ భారీగా పెరుగుతున్నారు. ప్రధాని ఈ మైలురాయిని అధిగమించడంపై కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ స్పందించారు. ‘ప్రధాని మోదీ దూరదృష్టి, నిర్ణయాత్మక చర్యలు ప్రజాదరణను మరింత పెంచుతోంది. ఏడుకోట్ల ఫాలోవర్లను సంపాదించుకుని మరో మైలురాయి దాటిన ప్రధానికి నా శుభాకాంక్షలు. మీ నాయకత్వంతో మేం గర్వంగా ఉన్నాం’ అని ట్వీట్ చేశారు. PM @NarendraModi ji's personal connect, vision and decisive actions keep adding to his surging global popularity. Congratulations to our Prime Minister on another milestone of 7 crore twitter followers. We are proud of and inspired by your leadership. pic.twitter.com/xSKFMzHmSm — Piyush Goyal (@PiyushGoyal) July 29, 2021 -
అక్కడ 'రౌడీ'ని కోటి మంది ఫాలో అవుతున్నారు
అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌లో బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు ఈ రౌడీ హీరో. సినిమాల్లో విజయ్ హీరోయిజానికి ఎంత మంది అభిమానులో.. బయట అతడి యాటిట్యూడ్, వ్యక్తిత్వానికి అంతే రేంజ్లో ఫాలోవర్లు కూడా ఉన్నారు. ‘వాట్సప్.. వాట్సప్ మై రౌడీస్’ అని అభిమానులను ప్రేమగా అంటుంటాడు విజయ్ దేవరకొండ. అభిమానులకు కూడా విజయ్ అంటే బోలెడంత ప్రేమ. అలా సోషల్ మీడియాలో రోజురోజుకూ తన క్రేజ్‌ను పెంచుకుంటున్న విజయ్ ఇప్పుడు మరో రికార్డును సాధించాడు. ఫేస్బుక్లో 10 మిలియన్ ఫాలోవర్ల అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తెలుగులో ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉన్న అతికొద్ది మంది హీరోల్లో విజయ్ ఒకరు. ఇక ఇటీవలె విజయ్ వరుసగా ముచ్చటగా మూడో ఏడాది మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ ఎవరూ సాధించని ఈ ఫీట్‌తో విజయ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా ప్రస్తుతం విజయ్.. పూరీ జగన్నాథ్‌తో పాన్ ఇండియా మూవీ ‘లైగర్' చేస్తున్న సంగతి తెలిసిందే. -
రామ్ చరణ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 4 మిలియన్స్(40 లక్షలు) ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు. సౌత్ నుంచి నాలుగు మిలియన్స్ పైగా ఫాలోవర్స్ కొద్ది మంది హీరోలో రామ్ చరణ్ ఒకటిగా నిలిచాడు. మిగతా యంగ్ హీరోలతో పోలిస్తే సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే చెర్రీ.. ఇటీవల చాలా చురుగ్గా పోస్టులు పెడుతున్నాడు. దీంతో పెద్ద ఎత్తున ఆయనకు ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఇక ట్విటర్లో చరణ్‌కు 1.3 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం చెర్రీ తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’లో నటిస్తున్నాడు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. -
అల్లు అర్జున్ సతీమణి స్నేహ సరికొత్త రికార్డు
Allu Arjun: అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అల్లు స్నేహ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. టాలీవుడ్లో ఏ హీరో భార్యకు లేనంత మంది ఫాలోవర్స్‌ని ఆమె సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ఇన్‌స్టాలో ఆమె 4 మిలియన్స్‌కి పైగా ఫాలోవర్స్‌తో దూసుకెళ్తున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం విశేషం. అల్లు స్నేహ తర్వాత రామ్ చరణ్ భార్య ఉపాసన 3.3 మిలియన్స్, మహేశ్‌బాబు భార్య నమ్రత 2 మిలియన్స్ ఫాలోవర్స్‌లో రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. చదవండి: కాజల్ డేరింగ్ స్టెప్.. పెళ్లి తర్వాత వేశ్య పాత్రలో ‘చందమామ’! -
Jr NTR: తారక్ రికార్డు.. తక్కువ పోస్టులతోనే ఆ ఘనత
టాలీవుడ్లో మిగతా హీరోలతో పోలిస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తాడు. ఎప్పుడో ఒక్కసారి, ముఖ్యమైన సమాచారం ఉంటే తప్ప సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడు. కానీ అతడిని ఫాలో అయ్యే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ టైగర్ తన ట్విటర్లో 5 మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు. 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అతి కొద్ది మంది టాలీవుడ్ స్టార్స్‌లో ఒకరిగా తారక్ నిలిచాడు. మే 28న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా… ఒక్కరోజే ఈయనను దాదాపు 2 వేల మంది ఫాలో అవ్వడం గమనార్హం. ఇక తమ అభిమాన హీరో ట్విటర్లో 50 లక్షల మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో #5MFollowersForNTR అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. చదవండి: ఆ సినిమా కోసం రోజుకు 18 గంటలు కష్టపడ్డాం : రాశిఖన్నా బాలయ్య నోట శ్రీరామ దండకం.. వీడియో వైరల్ -
అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన కోలీవుడ్ స్టార్ శింబు
తమిళ సూపర్ స్టార్ శింబు ఇన్‌స్టాగ్రామ్‌లో 1మిలియన్ ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు. గతేడాది అక్టోబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన శింబు ఏడాది కూడా పూర్తి కాకుండానే 1మిలియన్ మార్కును చేరుకున్నాడు. ఈ సందర్భంగా తన ఫాలోవర్లకు, అభిమానులకు శింబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. గతేడాది చెన్నైలోని ఓ కాలేజీ ఈవెంట్లో దిగిన ఫోటోను షేర్ చేస్తూ 1 మిలియన్ ఫాలోవర్స్‌కి థ్యాంక్స్ చెప్పాడు. ఇక లేట్‌గా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చినా..ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘మానాడు’ సినిమాలో శింబు నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి :Rangam: జీవా ప్లేస్‌లో శింబు, ఫొటోలు వైరల్ View this post on Instagram A post shared by Silambarasan TR (@silambarasantrofficial) -
'తగ్గేదే లే'.. అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు బన్నీ. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పికప్పుడు అప్డేట్స్ను షేర్ చేస్తూ ష్యాన్స్తో టచ్‌లో ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు బన్నీ. కొద్ది రోజుల కిందటే విజయ్ దేవరకొండ ఈ ఫీట్‌ను అందుకోగా, ఆ తర్వాతి స్థానంలో బన్నీ ఉన్నాడు. మిగతా స్టార్స్ మహేష్ బాబు (6.8), ప్రభాస్ (6.5), రామ్ చరణ్ (3.9), ఎన్టీఆర్ (2.6), మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా వీళ్లందరిని వెనక్కి నెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు.దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఫిల్మ్‌లో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. చదవండి :Pushpa Movie: రెమ్యునరేషన్ భారీగా పెంచిన బన్నీ, ఎంతంటే.. త్వరలోనే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ! -
ఆ ఫౌండేషన్ నాది కాదు: సోనూసూద్
ముంబై: లాక్డౌన్ కాలంలో పేదల అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన అనుచరులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేశారు. తన పేరు మీద విరాళాలు వసూలు చేస్తున్న ఓ ఫౌండేషన్ గురించి ఆయన హెచ్చరించారు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో, తన ఫొటోను పెట్టుకున్న ఓ నకిలీ సంస్థకు చెందిన వ్యక్తులు విరాళాలు వసూలు చేస్తున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ సంస్థ గురించి తెలిస్తే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. -
అందరికీ హగ్గులు, ముద్దులు ఇచ్చిన పూజా, ఎందుకంటే?
బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఇటు దక్షిణాది అటు ఉత్తరాది అభిమానులను రౌండప్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ చిత్రాలు చేస్తున్నారు కాబట్టి ఆమె బోలెడంత మంది అభిమానులను సంపాదించుకోగలిగారు. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీని ఫాలో చేస్తున్నవారి సంఖ్య 13 మిలియన్ల (1 కోటీ 30 లక్షలు) కు చేరుకుంది. యోగా, జిమ్ వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు పూజా హెగ్డే. అలాగే తన సినిమాల సమాచారాన్ని కూడా ఇస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారామె. అందుకే రోజు రోజుకు ఆమె ఫాలోయర్ల సంఖ్య పెరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్ల ఫాలోయర్లను సంపాదించుకున్న సందర్భంగా.. ‘‘అందరికీ (ఫాలోయర్లు, అభిమానులు) థ్యాంక్స్ లవ్లీస్.. మీ అందరికీ నా హగ్గులు, ముద్దులు’’ అన్నారు పూజా హెగ్డే. చదవండి: కరోనాతో డ్రైవర్ మృతి.. హోం ఐసోలేషన్‌లో రామ్ చరణ్ -
సురేఖవాణి కూతురికి షాకిచ్చిన నెటిజన్లు
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సురేఖా వాణి. భర్త మరణం తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. పార్టీలు, పబ్‌లు అంటూ కూతురు సుప్రీతతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ, ఆ ఫొటోలు షేర్ చేస్తుంటారు. దీంతో అటు సురేఖవాణితో పాటు సుప్రీతకు సైతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది. దీంతో త్వరలోనే వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు టాక్. సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సుప్రీత..వరుస పోస్టులతో తన ఫాలోవర్లను పెంచుకుంటూ పోతుంది. అయితే సడెన్‌గా ఆమెకు ఊహించని షాక్ ఎదురైంది. గత కొన్ని రోజులుగా సుప్రీతను అన్‌ఫాలో చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత వారం రోజుల్లోనే కొత్తగా 321 మంది కొత్తగా ఫాలో అయితే..422 మంది అన్ ఫాలో అయ్యారు. దీనికి సంబంధించిన లిస్ట్‌ను సుప్రీత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలోపోస్ట్ చేస్తూ..ఏం పాపం చేశాను ఫ్రెండ్స్ ..ఎందుకు అన్‌ఫాలో అవుతున్నారు అంటూ తెగ బాధపడిపోయింది. ప్రస్తుతం ఆమెకు 3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. చదవండి : 'అలాంటి వాళ్లను నమ్మొద్దు.. అప్పుడే సంతోషంగా ఉంటాం' ఉన్న న్యూస్ చెప్పండి: సురేఖా వాణి కూతురి ఫైర్ -
పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..
సాక్షి, అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వర్గీయులు ఆగడాలు మితిమీరిపోయాయి. టీడీపీ మద్దతుదారులకు ఓట్లు వేస్తేనే సాగు, తాగునీరు ఇస్తామని బెదిరింపులకు దిగారు. టీడీపీ ఓడిపోతే తమ భూముల నుంచి హంద్రీనీవా నీరు వదలమని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పేరు చెరువుకు నీరు కావాలంటే టీడీపీకి ఓట్లు వేయాలని హుకుం జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్లను పయ్యావుల వర్గీయులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు ప్రత్యర్థి అభ్యర్థులను కడతేరుస్తామని పయ్యావుల కేశవ్ అనుచరులు.. బెదిరింపులకు దిగడంతో ఈ నెల 10న బాధితులు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చదవండి: అచ్చెన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో.. విజయవాడ టీడీపీలో తారస్థాయికి విభేదాలు.. -
పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..
ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరుల ఆగడాలు మితిమీరిపోయాయి. పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు ప్రత్యర్థి అభ్యర్థులను కడతేరుస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. మేజర్ పంచాయతీలో ఆధిపత్య పోరు.. పెద్ద కౌకుంట్ల మేజర్ పంచాయతీలో దశాబ్దాలుగా టీడీపీ ఆధిపత్య పోరు సాగిస్తోంది. 14 వార్డులున్న పెద్ద కౌకుంట్ల పంచాయతీలో చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, మైలారంపల్లి, రాచేపల్లి గ్రామాలు మజారా గ్రామాలుగా ఉన్నాయి. ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినా.. ఏకపక్షంగా టీడీపీ వారే అన్ని స్థానాలు దక్కించుకునే వారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాల పట్ల పలువురు ఆకర్షితులై.. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావించారు. ఇందులో భాగంగా 14 వార్డులకు గాను 10 వార్డుల్లో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. మిగిలిన నాలుగు వార్డుల్లో ప్రత్యర్థి అభ్యర్థులు నామినేషన్ వేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. చివరి నిమిషంలో టీడీపీ నాయకుల కుట్రలు భగ్నం చేస్తూ ఈ నాలుగు వార్డుల్లోనూ పోటీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. విత్‌డ్రాలకు నేటితో ఆఖరు.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేందుకు గురువారంతో గడువు ముగియనుంది. ఈ నెల 17న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తమ ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు కుట్ర రాజకీయాలకు టీడీపీ తెరలేపింది. ప్రత్యర్థి అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని విత్‌డ్రా చేసుకోవాలని, లేకుంటే కిడ్నాప్ చేసి, అంతు చూస్తామంటూ ప్రత్యక్ష బెదిరింపులకు దిగారు. మాట వినకపోతే... పెద్ద కౌకుంట్ల పంచాయతీ 11వ వార్డు అభ్యర్థిగా రాచేపల్లి గ్రామానికి చెందిన పెన్నోబులేసు నామినేషన్ వేశాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శంకరయ్య, వేలూరి నారాయణస్వామి (పయ్యావుల అనుచరులు) బుధవారం ఉదయం పెన్నోబులేసు ఇంటికి వెళ్లి నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని హెచ్చరించారు. దీనిపై అభ్యర్థి కుటుంబసభ్యులు నిరాకరించడంతో రెచ్చిపోయిన వారు.. ‘మా మాట వినకపోతే నీ కొడుకును కిడ్నాప్ చేసి అంతు చూస్తాం’ అంటూ పెన్నోబిలేసు తల్లిదండ్రులను బెదిరించారు. ఘటనతో భయభ్రాంతులకు గురైన పెన్నోబిలేసు కుటుంబసభ్యులు.. తమకు శంకరయ్య, నారాయణస్వామి నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. (చదవండి: జగన్ ప్రభంజనాన్ని ఆపలేరు) గెలవలేక టీడీపీ నేతల అరాచకాలు -
15 మిలియన్స్.. అవాక్కైన సమంత!
ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత అభిమానుల సంఖ్య కోటిన్నరకు చేరింది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు సమంత. ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉంటారామె. వ్యాయామం చేస్తున్న ఫొటోలు, ఫొటోషూట్లు, బ్యూటీ సీక్రెట్స్, గార్డెనింగ్ వంటి అంశాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒకటి షేర్ చేస్తూనే ఉంటారు. ఇలా 15 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడంపై సమంత మాట్లాడుతూ ‘‘షూటింగ్లో బిజీగా ఉన్నా. ఉన్నట్టుండి... 15 మిలియన్స్ కొట్టేశాం అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ప్రతీ ఒక్కరికీ చాలా థ్యాంక్స్. మీ ప్రేమే నన్ను మరింత కష్టపడేలా చేస్తుంది’’ అన్నారామె. -
రికార్డుల మోత మోగిస్తోన్న స్టైలిష్ స్టార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కున్న క్రేజే వేరు. తన యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్స్, స్టైల్‌తో అభిమానులను ఎప్పటికప్పుడు ఫిదా చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటారు అల్లు అర్జున్. ఇక తాజాగా బన్నీ ఖాతాలో మరో రికార్డు నమోదయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హోరోని ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలయన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేశారు. ‘మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. నా బలంగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) ఇక ఫేస్బుక్ పేజీలో తన పోస్టులకు గాను మొత్తంగా 13 మిలియన్లకు పైగా లైక్స్ అందుకున్న నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. సౌత్‌లో ఇంత భారీ ఎత్తున ఫేస్బుక్లో ఫాలోయింగ్ ఉన్న హీరో అల్లు అర్జున్ మాత్రమే. ఇక ట్విట్టర్లో బన్నీకి 5.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మలయాళంలో మంచి గుర్తింపే ఉంది. ఇక హిందీ డబ్బింగ్ సినిమాలతో అక్కడ ప్రేక్షకులకు కూడా బన్నీ దగ్గరయ్యారు. అందుకే ఇపుడు సుకుమార్‌తో చేస్తోన్న ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు.(చదవండి: అల్లు అర్జున్ 'మెగాస్టార్' అయిపోతారా?) ‘బుట్టబొమ్మ’ మరో రికార్డు ఇక గతేడాది సంక్రాతి కానుకగా విడుదలైన అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురము’లో సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బుట్ట బొమ్మ సాంగ్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇక తాజాగా బుట్ట బొమ్మ ఖాతాలో మరో రికార్డు నమోదయ్యింది. యూట్యూబ్‌లో సెన్సేషనల్ హిట్టై ఏకంగా 500 మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగులో ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఓమై గాడ్ డాడీ, టైటిల్ సాంగ్, సిత్తరాల సిరపడు పాటలు కూడా సంచలనం విజయం సాధించాయి. -
రౌడీ రికార్డు.. సౌత్ నుంచి ఒకే ఒక్కడు
‘వాట్సప్.. వాట్సప్ మై రౌడీస్’ అని అభిమానులను ప్రేమగా అంటుంటాడు విజయ్ దేవరకొండ. అభిమానులకు కూడా విజయ్ అంటే బోలెడంత ప్రేమ. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి మంది ఫాలోవర్లను దక్కించుకోగలిగాడు విజయ్. ప్రస్తుతం 10 మిలియన్ల ఫాలోవర్స్ కలిగి రికార్డు సృష్టించాడు. దక్షిణాది స్టార్స్‌లో ఇన్‌స్టాలో కోటిమంది ఫాలోవర్లను సంపాదించుకున్న మొదటి హీరో విజయ్ కావడం విశేషం. ఈ క్రమంలో ‘వన్ క్రోర్ ఇన్‌స్టా రౌడీస్’ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియా అంతా విజయ్ ఇన్‌స్టా రికార్డ్ హల్చల్ చేసింది. చదవండి: సైనికుడి పాత్రలో విజయ్ దేవరకొండ కాగా ఈ రికార్డు సాధించిన నేపథ్యంలో విజయ్ ఓ పోస్ట్‌ను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నాడు. పదిమందికి అయినా.. అంతే లవ్ అని 100 మందికి అయినా తాను చూపించే లవ్ అంతేనని.. తాజాగా కోటి మందికి అయినా ఆ ప్రేమ తగ్గదని కొంత భావోద్వేగంతో రాశాడు. దీంతో తన ఫాలోవర్స్ కూడా భావోద్వేగం అవుతూ.. లవ్ యూ విజయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అందుకే నువ్వంటే ఇష్టమని అంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. వరల్డ్ ఫేమస్ లవర్ లాంటీ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్లో ఫైటర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు -
మీ అభిమానానికి థ్యాంక్స్ : కేఎల్ రాహుల్
అడిలైడ్ : 2014లో టీమిండియాకు ఎంపికైన కేఎల్ రాహుల్ అనతికాలంలోనే మంచి టైమింగ్ ఉన్న క్రికెటర్గాపేరు సంపాదించాడు. కెరీర్ ఆరంభం నుంచి సొగసైన షాట్లతో అలరిస్తూ టీమిండియా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. పంత్, వృద్దిమాన్ సాహా, దినేష్ కార్తిక్ వంటి ఆటగాళ్ల నుంచి పోటీని తట్టుకొని మరీ ఎంఎస్ ధోని తర్వాత అన్ని ఫార్మాట్లకు రెగ్యులర్ వికెట్ కీపర్‌గా స్థానం భర్తీచేసే పనిలో ఉన్నాడు. తాజాగా కేఎల్ రాహుల్ ట్విటర్ ఖాతా ఐదు మిలియన్ల ఫాలోవర్స్‌కు చేరుకుంది. ఈ విషయంపై రాహుల్ ఆనందం వ్యక్తం చేస్తూ స్పందించాడు. (చదవండి : 'క్షమించండి.. మళ్లీ రిపీట్ కానివ్వను') ' మీ అభిమానానికి థ్యాంక్స్.. మీరిచ్చిన సపోర్ట్ నాకు ఎంతో ప్రత్యేకం. జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నా మీరిచ్చే సహకారంతో ఇంతదాకా చేరుకున్నా.. మీ ప్రేమ ఇకమీదట కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ 35 వన్డేల్లో 4 సెంచరీల సాయంతో 1332 పరుగులు, 36 టెస్టుల్లో 5 సెంచరీల సాయంతో 2006 పరుగులు, 44 టీ20ల్లో 1542 పరుగులు సాధించాడు. టీ20లో రాహుల్ రెండు సెంచరీలు సాధించాడు. కాగా ఐపీఎల్ 13వ సీజన్లో కేఎల్ రాహుల్ దుమ్మురేపే ప్రదర్శన నమోదు చేశాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన రాహుల్ ఒక సెంచరీ.. 5 అర్థ సెంచరీలతో మొత్తం 14 మ్యాచ్‌ల్లో 670 పరుగులు సాధించి లీగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
60 లక్షల అభిమానం
వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తమ అభిమానులతో పంచుకునేందుకు సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఓ చక్కని వేదిక. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్... ఇలా పలు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు నటీనటులు. వీరిని ఫాలో అయ్యేవారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. తాజాగా మహేశ్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు మిలియన్ల ఫాలోయర్లను (60 లక్షలు) సంపాదించుకున్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘యువర్స్ ట్రూలీ మహేశ్’ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించిన తక్కువ రోజుల్లోనే 60 లక్షల మంది ఫాలోయర్లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు మహేశ్‌బాబు. -
అభిమానం పది లక్షలు
హీరో రామ్‌చరణ్ సోషల్ మీడియాలో కొత్త రికార్డు సృష్టించారు. ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన అతి తక్కువ కాలంలో ఒక మిలియన్ (పది లక్షలు) ఫాలోయర్స్‌ను సొంతం చేసుకున్నారు. అంతకుముందు చరణ్ సోషల్ మీడియాలో ఉన్నప్పటికీ మధ్యలో గ్యాప్ తీసుకున్నారు. అయితే ఈ ఏడాది మార్చిలో చరణ్ మళ్లీ ట్విట్టర్లోకి అడుగుపెట్టారు. కేవలం 233 రోజుల్లోనే పది లక్షల ఫాలోయర్లను ఆయన సొంతం చేసుకోవడం విశేషం. తన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు చరణ్. అభిమాన హీరో పదిలక్షల మార్కును చేరుకోవడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ మరో హీరో అని తెలిసిందే. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో రామ్‌చరణ్ కనిపించే అవకాశం ఉంది. -
దీపికను వెనక్కి నెట్టిన శ్రద్ధా కపూర్!
సెలబ్రిటీలకు తమ వృత్తితోపాటు సోషల్ మీడియా కూడా ముఖ్యమే.. తమను ఆరాధించే అభిమనులకు చేరువుగా ఉండేందుకు సోషల్ మీడియా ముఖ్యపాత్ర పోషిస్తుంది. తమకు చెందిన వృత్తి, వ్యక్తిగత విషయాలను ఈ వేదిక ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో వీరికి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న ఇండియన్ సెలబ్రిటీలలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల వరకు నాలుగో స్థానంలో ఉన్న ఈ సాహో భామ మరో నటి దీపికా పదుకొనెను వెనక్కునెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. చదవండి: నాగకన్యగా.. శ్రద్ధా కపూర్ ఫోటోలు, వీడియోలు షేరే చేసే ఈ సోషల్ మీడియా యాప్‌ను ఇండియాలో కొన్ని మిలియన్ల ప్రజలు ఉపయోగిస్తున్నారు. వినోదం, సామాజిక, ఇతరాత్ర కంటెంట్‌తో తమ సంబంధాలను మెరుగు పురుచుకుంటున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న భారతీయ వ్యక్తి క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఇతనిని 82.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక విరాట్ తరువాత 58.1 మిలియన్ల అభిమానులతో ప్రియాంక చోప్రా జోనాస్ రెండో స్థానంలోఉన్నారు. ఇప్పటి వరకు దీపికా పదుకొనె 52.3 మిలియన్లతో మూడో స్థానంలో ఉంటే తాజాదా శ్రద్ధా కపూర్ ఆమెను దాటుకొని 56.4 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచింది. చదవండి: దీపికా మేనేజర్‌కు మరోసారి ఎన్సీబీ సమన్లు వీరితో పాటు మిగతా బాలీవుడ్ ప్రముఖులు 50.1 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో అలియా భట్, 48.2 మిలియన్లతో నేహా కక్కర్, అక్షయ్ కుమార్ 46.8, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 46.2 మిలియన్, కత్రినా కైఫ్ 44.8 మిలియన్ల అభిమానులను కలిగి ఉన్నారు. బాలీవుడ్ నటులు, ప్రముఖులే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రపంచ వ్యాప్తంగా 49.7 మిలియన్ల మంది ఫాలో అవుతన్నారు. -
ఐదు కోట్ల ప్రేమ
‘‘మన చుట్టూ ఉన్నవాళ్లతో, మనతో మనం ఏర్పరుచుకునే బంధాలే మన జీవితం. నువ్వు అదీ ఇదీ.. అలా ఇలా అని తక్కువ చేసే అర్హత ఎవ్వరికీ ఉండదు. మరీ ముఖ్యంగా కీబోర్డ్ వెనక దాక్కునేవాళ్లకు (సోషల్ మీడియాలో విమర్శలు చేసేవాళ్లను ఉద్దేశిస్తూ)’’ అన్నారు ఆలియా భట్. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా 50 మిలియన్ల అభిమానులను (5 కోట్ల మంది) సంపాదించుకున్నారామె. ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ –‘‘నాకు 50 మిలియన్లు ప్రేమను అందించిన అభిమానులందరికీ నా ప్రేమను ఇస్తున్నాను. ఈ సందర్భంగా గత కొన్ని నెలల్లో నేను నేర్చుకున్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సోషల్ మీడియా మనందర్నీ ఒక్కచోట చేరుస్తుంది. కనెక్ట్ చేస్తుంది. వినోదం ఇస్తుంది. కానీ అందులో ఉండేది నిజమైన మనం కాదు. అది మనం కానే కాదు. అందుకే ఇప్పుడు ఐదు కోట్ల మంది చూపించిన అభిమానానికి ఎంత ఆనందపడ్డానో ఒకప్పుడు ఐదు వేల మంది, యాభైవేల మంది, యాభై లక్షలమంది ఉన్నప్పుడూ అంతే ఆనందపడ్డాను. ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మీకంటూ కొంత టైమ్ కేటాయించుకుని మీ శరీరాన్ని, మనసుని అభినందించండి. మీరేంటో తెలుసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే ఒక లైక్, డిస్లైక్, ఒక అభినందన, ఒక విమర్శ... వీటి తాలూకు ప్రభావం మీ మీద పడకూడదు’’ అన్నారు. చిత్రపరిశ్రమలో వారసత్వం గురించి జరిగిన చర్చలో ప్రముఖ దర్శక–నిర్మాత మహేశ్‌భట్ కుమార్తెగా ఆలియా సోషల్ మీడియాలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అవి తనపై ఎలాంటి ప్రభావం చూపించలేదని చెప్పడానికే ఆలియా భట్ ఈ విధంగా చెప్పి ఉంటారని ఊహించవచ్చు. -
రెండు కోట్ల ప్రేమ
‘బాహుబలి’ చిత్రం ప్రభాస్ పేరుని దేశవ్యాప్తంగా దాదాపు అందరికీ తెలిసేలా చేసింది. ప్రస్తుతం ఆయన ప్యాన్ ఇండియా స్టార్. సినిమా సినిమాతో కలెక్షన్లు బద్దలు కొడుతున్నారు. అలానే సోషల్ మీడియాలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రభాస్ ఫేస్బుక్ అకౌంట్‌ను దాదాపు 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటే రెండు కోట్ల మంది. ఫేస్బుక్లో ఇంతమంది ఫాలోయర్స్ ఉన్న సౌత్ హీరో ప్రభాసే కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేయనున్నారు. ఈ మూడూ ప్యాన్ ఇండియా సినిమాలే. -
ఈగల సత్యానికి 14 రోజుల రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు ఈగల సత్యనారాయణ (సత్యం)ను ఎంవీపీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్తేర్‌రాణి అనే మహిళపై దౌర్జన్యానికి దిగడంతోపాటు వేధింపులకు గురిచేసిన నేపథ్యంలో అతనిపై ఎంవీపీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. వేధింపులు తాళలేక ఆదివారం రాత్రి ఎస్తేర్‌రాణి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. దీంతో అక్కడికి వెళ్లిన ఎంవీపీ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకొని సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం బీచ్‌రోడ్డులో ఈగల సత్యంను అదుపులోకి తీసుకున్నట్లు ఎంవీపీ ఎస్ఐ భాస్కర్ తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అక్కడి నుంచి సత్యంను సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎస్తేర్‌రాణి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. శానిటైజర్ తాగడం వల్ల శరీరంలోని అవయవాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించినట్లు తెలిపారు. మహిళా సంఘాల ఆగ్రహం ఒంటరిగా ఉంటున్న మహిళ పట్ల ఈగల సత్యం వ్యవహరించిన తీరుపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళలపై టీడీపీ నాయకులకు ఉన్న చిన్నచూపునకు ఈ ఘటన నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు మంగళవారం కేజీహెచ్‌కు వెళ్లి ఎస్తేర్‌రాణిని పరామర్శించారు. వైఎస్సార్సీపీతోపాటు నగరంలోని మహిళా సంఘాలన్నీ అండగా ఉన్నాయంటూ భరోసా కల్పించారు. ఎస్తేర్‌రాణి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు కృపజ్యోతి మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోలు చూస్తుంటే ఎస్తేర్‌రాణిపై సత్యం ఏ స్థాయిలో దౌర్జన్యానికి దిగాడనేది అర్థమవుతుందన్నారు. నిత్యం ఆమె ఇంటికి వెళ్లి దుర్భాషలాడుతూ, వేధిస్తూ మానసికంగా హింసించాడన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి అండతోనే సత్యం ఇంతగా బరితెగించాడంటూ దుయ్యబట్టారు. మానసికంగా, శారీరకంగా ఎస్తేర్‌రాణిని హింసించిన తీరుపై కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలు బాధ కలిగించాయన్నారు. సత్యంను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశాఖలో మరోసారి ఇలాంటి ఘటన వెలుగుచూడకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన దిశ వంటి చట్టాలను ఉపయోగించి సత్యంలాంటి వారికి తగిన గుణపాఠం నేర్పాలన్నారు. కార్యక్రమంలో శిరీష, షకీనా, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, శశికళ పాల్గొన్నారు. చదవండి: మహిళపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి దౌర్జన్యం -
పన్నెండు మిలియన్ల ప్రేమ
సమంత మీద ప్రేక్షకుల అభిమానం సోషల్ మీడియాలో ప్రేమలా కురుస్తోంది. ఫొటోషేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కొత్త మైలురాయిని చేరుకున్నారామె. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోయర్స్‌ను సంపాదించారు. 12 మిలియన్లు అంటే కోటీ ఇరవై లక్షల మంది. ‘12 మిలియన్ల ప్రేమ’ అని ఈ సందర్భంగా సమంత పేర్కొన్నారు. సారీ రకుల్... బాలీవుడ్లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి పోలీసుల కస్టడీలో ఉన్నారు. డ్రగ్స్ తీసుకున్నవారిలో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారని ఆమె చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే డ్రగ్స్ తీసుకుంటున్న నటులు వీరే అని రియా చక్రవర్తి ఓ లిస్ట్ ఇచ్చిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని యన్సీబీ డైరెక్టర్ కేపీయస్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఈ వార్తను షేర్ చేసి, ‘సారీ రకుల్, సారీ సారా’ (నిజానిజాలు తెలియకుండా అందరూ రకుల్, సారాలను తప్పుగా అర్థం చేసుకున్నారనే ఉద్దేశంతో) అని ఓ పోస్ట్ పెట్టారు సమంత. -
యరపతినేని అనుచరులపై సీబీఐ కేసు
-
యరపతినేని అనుచరులపై సీబీఐ కేసు
సాక్షి, గుంటూరు: అక్రమ మైనింగ్ కేసు విచారణలో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అనుచరులు 13 మందితో పాటు మొత్తం 17 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విశాఖపట్నం ఏసీబీ పోలీసుస్టేషన్లో సీబీఐ దర్యాప్తు అధికారి పి.విమలాదిత్య పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి గ్రామాల్లో 2010 జనవరి నుంచి 2018 ఆగస్టు వరకు సున్నపురాయి గనుల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లుగా మైనింగ్ విభాగం గుంటూరు–2 అసిస్టెంట్ డైరెక్టర్ బి.జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ, 2018లో అక్రమ మైనింగ్‌పై పిడుగురాళ్ల, దాచేపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19న విడుదల చేసిన నోటిఫికేషన్‌ను, అక్రమ మైనింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఎఫ్ఐఆర్లో జతచేశారు. నిందితుల్లో యరపతినేని అనుచరులు 1. నెల్లూరి శ్రీనివాసరావు (కేశానుపల్లి) 2. వేముల శ్రీనివాసరావు (నారాయణపురం, నడికుడి) 3. ఓర్సు వెంకటేశ్వరరావు (నడికుడి) 4.వేముల ఏడుకొండలు (నారాయణపురం, నడికుడి) 5. ఇర్ల వెంకటరావు (నారాయణపురం, నడికుడి) 6. బత్తుల నరసింహారావు (దాచేపల్లి) 7. మీనిగ అంజిబాబు (జనపాడు) 8. గ్రంధి అజయ్‌కుమార్ (పిడుగురాళ్ల) 9. జి.వెంకట శివకోటేశ్వరరావు (పిడుగురాళ్ల) 10. ఓర్సు ప్రకాశ్ (కొండమోడు–రాజుపాలెం) 11. వర్ల రత్నం (పిడుగురాళ్ల) 12. నంద్యాల నాగరాజు (కొండమోడు–రాజుపాలెం) 13. ఆలపాటి నాగేశ్వరరావు (ధరణికోట–అమరావతి) సహా మరో నలుగురు కేసులో నిందితులుగా ఉన్నారు. -
మిలియనీర్లుగా యూట్యూబ్ స్టార్లు!
ఇప్పుడంతా డిజిటల్ హవా నడుస్తోంది. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్‌తో చాలామంది యూట్యూబ్‌లో సత్తా చాటుతున్నారు. ఓ నివేదిక ప్రకారం యువత రోజుకు సగటున 25% సమయాన్ని ఆన్లైన్లో కంటెంట్ కోసం వెచ్చిస్తున్నారట. ఇది వరకు అయితే యూట్యూబ్‌లో పాపులారిటీ తెచ్చుకొని స్టార్లు అయ్యేవారు. ఇప్పుడు స్టార్లు సైతం యూట్యూబ్ బాట పట్టారు. లక్షల్లో వ్యూస్, వేలల్లో సబ్స్రైబర్లతో కంటెంట్ క్రియేటర్స్‌గా మారి యూట్యూబ్‌లోనూ హవా చాటుతున్నారు. కాలానికి తగ్గట్లు మనమూ మారాలి. టెక్నాలజిని అందిపుచ్చుకొని ప్రస్తుత పరిస్థితుల్లో ఏది అవసరమో ఆ కంటెంట్‌ను రెడీ చేసుకోవాలి. లేదంటే అవుట్‌డేట్ అయిపోతాం. సరిగ్గా ఈ సూత్రాలనే పాటిస్తూ ప్రముఖులను సైతం సబ్‌స్రైబర్లుగా మలుచుకుంటున్నారు కొందరు యూట్యూబ్ స్టార్స్. అంతేకాకుండా క్రియేవిటీతో లక్షల్లో సంపాదిస్తూ మిలియనీర్లుగానూ చలామణి అవుతున్న ఇండియన్ టాప్ యూట్యూబ్ స్టార్ల గురించి సాక్షి ప్రత్యేక కథనం అజే నాగర్ అనే 21 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ టిక్‌టాక్ వర్సస్ యూట్యూబ్ అనే ఒక్క వీడియో రూపొందించి అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు. క్యారీమినాటి పేరుతో ఛానెల్ నడుపుతూ అత్యధికంగా 24 మిలియన్ సబ్స్రైబర్లను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో అగ్రగామిగా నిలిచాడు. పాఠశాల విద్యను మధ్యలో వదిలేసినా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యూట్యూబ్ సబ్స్రైబర్లు ఉన్న స్వీడిష్ యూట్యూబర్ ప్యూడీపీతో సరిసమానంగా సత్తా చాటుతున్నాడు. 5 ఏళ్ల క్రితమే ఛానల్‌ను ప్రారంభించి అతి తక్కువ టైంలోనే వరల్డ్ రికార్డులతో పోటీపడుతున్నాడు. View this post on Instagram 🙋🏼♂️ A post shared by 𝑨𝒋𝒆𝒚 𝑵𝒂𝒈𝒂𝒓 (@carryminati) on Feb 3, 2020 at 10:58pm PST 2018 గ్లోబల్ టాప్ 10 వీడియో లిస్ట్‌లో అమిత్ భదానా క్రియేట్ చేసిన కంటెంట్ కూడా ఒకటి. 20 మిలియన్ సబ్స్రైబర్లతో యూట్యూబ్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో చెలామణి అవుతున్నాడు ఈ 21 సంవత్సరాల కుర్రాడు. మూడేళ్ల క్రితం కామెడీ స్కెచ్ వీడియోలతో ప్రస్తానం మొదలుపెట్టి ఇప్పడు స్టార్స్‌తోనూ వీడియోలు చేస్తూ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పోగేసుకున్నాడు. వీళ్లతో పాటు ఆశిష్ చంచలాని, భువన్ బామ్ లాంటి కంటెంట్ క్రియేటర్లు కూడా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వెబ్‌సిరీస్‌లోనూ ఆశిష్ నటించాడు. టెక్నాలజీ గురూజీ పేరుతో ఛానల్ ప్రారంభించిన గౌరవ్ చౌదరి ఫోర్బ్స్అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకొని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. View this post on Instagram Kaise ho dosto? Waise gaming ka alag hi maja hai🔥... #Binod ko bhi #ROGPhone3 ki gaming pasand hai🤣... Guess karo main kaunsa game khel raha hu??? A post shared by Gaurav Chaudhary (@technicalguruji) on Aug 19, 2020 at 8:57pm PDT -
అవి అంకెలు కాదు.. అభిమానం
ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త మైలురాయి చేరుకున్నారు అల్లు అర్జున్. ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఫాలోయర్స్ సంఖ్య 8 మిలియన్లు దాటింది. అంటే సుమారు 80 లక్షల మంది ఆయన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. ‘‘8 మిల్లియన్లను నేను ఓ సంఖ్యలా చూడను. నాకున్న పాపులారిటియో, ఫాలోయింగో అని కూడా అనుకోను. నా మీద మీ అందరూ చూపిస్తున్న ప్రేమ, అభిమానం.. ముఖ్యంగా మీ దీవెన అని అనుకుంటాను. మీ అందరి ప్రేమకు వినమ్రంగా తలవంచుతున్నాను. ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు అల్లు అర్జున్. -
మరో రికార్డు సృష్టించిన అల్లు అర్జున్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు టాలీవుడ్లోనే కాకుండా మాలీవుడ్‌లో కూడా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఆయన చేసిన అల వైకుంఠపురం ఘన విజయాన్ని సాధించి ఎన్నో రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతి తక్కువ కాలంలోనే 8 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సాధించిన ఘనత సాధించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన అభిమానులందరికి కృతజ్ఞతలు తెలిపారు. 8 మిలియన్స్ అనేది కేవలం ఫాలోవర్స్ కాదు, అది నెంబర్ , స్టాటిస్టిక్స్, పాపులారిటి కాదు అది అంతులేనంత అభిమానం, ఆశీర్వదం. మీ అందరి ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు. నేను శిరసు వంచి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని రాసి ఒక పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఇక అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం దర్శకుడు కొరటాల శివతో చేయనున్న విషయం తెలిసిందే. చదవండి: నిహారిక నిశ్చితార్థం.. ‘భార్యంటే ఎంత ప్రేమో’ View this post on Instagram 8 Million. To me it’s not a number ... or a statistics ... or the reach of popularity or followers . It’s Infinite LOVE & BLESSING from many kind people . Thank you for all the Love you shower ... I bow down with humility & abundant Gratitude . Love AA A post shared by Allu Arjun (@alluarjunonline) on Aug 17, 2020 at 4:47am PDT -
ప్రధాని ట్విట్టర్ ఫాలోయర్లు 6 కోట్లు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజా బాహుళ్యానికి ప్రధాని మోదీ మరింత చేరువవుతున్నారు. తాజాగా, మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్లో ప్రధాని మోదీ ఫాలోయర్ల సంఖ్య 6 కోట్లకు చేరుకుంది. ప్రధాని తరచూ ట్విట్టర్లో ప్రజలకు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. తన ట్విట్టర్ హ్యాండిల్ ‘ఎట్‌ది రేటాఫ్ నరేంద్ర మోదీ’ద్వారా లైవ్‌లో ప్రసంగిస్తున్నారు. 2009 జనవరిలో ప్రధాని మోదీ ట్విట్టర్లో చేరగా 2019 సెప్టెంబర్ నాటికి ఫాలోయర్ల సంఖ్య 5 కోట్లకు చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ప్రధానికి 4.5 కోట్ల ఫాలోయర్లున్నారు. ప్రధాని కార్యాలయం ట్విట్టర్ హ్యాండిల్‌కు కూడా 3.7 కోట్ల ఫాలోయర్లున్నారు. కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 12 కోట్ల మంది ఫాలోయర్లతో అగ్రస్థానంలో ఉండగా, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కు 8.3 కోట్ల మంది ఫాలోయర్లున్నారు. ఆ తర్వాత స్థానం ప్రధాని మోదీదే కావడం గమనార్హం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ట్విట్టర్లో 1.5 కోట్ల మంది ఫాలోయర్లున్నారు. -
సోషల్ మీడియాలో మోదీ హవా
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. మోదీ దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ చురుకుగా ఉంటూ రాజకీయ, పాలనాపరమైన విషయాలను ప్రజలతో పంచుకుంటారు. తాజాగా ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో 60 మిలియన్ల (6కోట్లు) ఫాలోవర్స్ మైలు రాయిని చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ మూడో స్థానంలో నిలిచారు. 120 మిలియన్ ఫాలోవర్స్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి స్థానంలో నిలవగా, 83 మిలియన్ ఫాలోవర్స్‌తో ప్రస్తుత యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో ఉన్నారు. (ఖాతాల హ్యాకింగ్‌పై వివరణ ఇవ్వండి) మోదీ 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ట్విటర్ ఖాతాను ప్రారంభిచారు. 2014లో మోదీ ప్రధాని పదవి చేపట్టడంతో ట్విటర్లో ఆయన పాపులారిటీ అధికమవటంతో పాటు ఫాలోవర్స్ కూడా పెరుగుతూ వచ్చారు. ఇక భారతదేశంలో ఏ ఇతర రాజకీయ నాయుకుడికి లేని ఫాలోవర్స్‌ను మోదీ దక్కించుకున్నారు. దాంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా 37 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అద్భుతమైన ప్రసంగ నైపుణ్యం కలిగిన మోదీ తన ట్విటర్ ఖాతాలో చురుకుగా ఉంటూ.. క్రమం తప్పకుండా ఆయన చేసిన ప్రసంగాలు, సందర్శించిన ప్రదేశాలు, కలిసుకున్న జాతీయ, అంతర్జాతీయ వ్యక్తుల సమాచారాన్ని ట్విటర్లో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. (‘చైనా ట్విటర్’ అకౌంట్ మూసేసిన ప్రధాని ) -
ముఖపుస్తకం @ కోటీఅరవై
‘బాహుబలి’తో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఫ్యాన్స్‌ను ‘డార్లింగ్స్’ అంటూ పిలిచే ప్రభాస్‌ను సోషల్ మీడియాలో చాలామంది ఫాలో అవుతుంటారు. తాజాగా ప్రభాస్ ముఖపుస్తకం (ఫేస్బుక్) ఫ్యామిలీ 16 (కోటీ అరవై లక్షలు) మిలియన్స్‌కు చేరుకుంది. ఫేస్బుక్లో 16 మిలియన్ ఫాలోయర్స్‌ను సంపాదించుకున్న తెలుగు హీరోలలో ముందు వరుసలో ఉన్నారు ప్రభాస్. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌కు ఇప్పటివరకు 4.8 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే... ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తారు ప్రభాస్. అలాగే బాలీవుడ్లో ప్రభాస్ ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. -
నంబర్ 3
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తుండటం, తన అప్డేట్స్ను అభిమానులతో షేర్ చేయడం వంటి వాటితో శ్రద్ధా కపూర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బాగానే యాక్టివ్‌గా ఉంటారు. అంత యాక్టివ్‌గా ఉంటారు కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌లో యాభై మిలియన్ల (ఐదు కోట్లు) ఫాలోయర్స్‌ను సంపాదించుకోగలిగారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాభై మిలియన్ల ఫాలోయర్స్ మైలురాయిని చేరుకున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారీ బ్యూటీ. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్‌ల తర్వాత అత్యధిక ఫాలోయర్లను సాధించిన మూడో హీరోయిన్ శ్రద్ధా కపూరే కావడం విశేషం. దాదాపు 47.8 మిలియన్ల ఫాలోయర్స్‌తో ఆలియా భట్ కూడా యాభై మిలియన్ల జాబితాలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లో వారసులపై పలువురు మండిపడుతున్నారు. ప్రముఖ దర్శక–నిర్మాత మహేశ్ భట్ కుమార్తెగా ఆలియా కూడా చాలామంది ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చాలామంది ‘అన్‌ఫాలో’ అయ్యారు. అలా ఫాలోయర్ల సంఖ్య ఆమెకు తగ్గుతూ వస్తోంది. -
టిక్‌టాక్ బ్యాన్ : ఇన్‌స్టా, యూట్యూబ్ ఉందిగా!
సాక్షి, న్యూఢిల్లీ : టిక్‌టాక్ నిషేధం అనంతరం టిక్‌టాక్ స్టార్లు ఫ్రస్ట్రేషన్ లో మునిగిపోయారు. ఈ నిషేధం సోమవారం నుంచి అమల్లోకి వచ్చినప్పటి నుండి, ప్రత్యామ్నాయాలపై వైపు దృష్టిపెట్టారు. ముఖ్యంగా తమ అనుచరులను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఫాలో కావాలని కోరడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోలతో ఇన్‌స్టాలో హల్ చల్ చేస్తున్నారు. దీంతో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కు క్రేజ్ క్రమంగా పుంజుకోనుంది. (నిషేధంపై టిక్‌టాక్ స్పందన) టిక్‌టాక్ ప్రొఫైల్‌లలో వారి ఇన్స్టాగ్రామ్ ఖాతా వివరాలను అందిస్తున్నారు. ఇన్‌స్టా ఎలా ఉపయోగించాలో అభిమానులకు నేర్పుతూ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇంకా చాలామంది టిక్‌టాక్ వినియోగదారులు ఇన్‌స్టా లైవ్ ద్వారా తమని ఫాలో కావాలని, యూట్యూబ్‌లో తమ వీడియోలను చూడమని కోరుతుండటం విశేషం. అయితే టిక్‌టాక్ యాప్ ను ఆపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతం డౌన్లోడ్ చేయలేం. కానీ ఇప్పటికే టిక్ టాక్ యాప్ ఫోన్లలో ఉన్న యూజర్లకు దీనికి యాక్సెస్ ఉంది. మరోవైపు టిక్‌టాక్ నిషేధంపై సోషల్ మీడియాలో ఆర్ఐపీ టిక్‌టాక్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో వుంది. యూజర్లు మీమ్స్, వీడియోలతో సందడి చేస్తున్నారు. (టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు) Twitter celebs jinka khud ka account tiktok videos ke bharose chal raha tha: pic.twitter.com/SZuK0woQm0 — Diksha🌈 (@BrahmaandKiMaa) June 29, 2020 Right now in Bharat#TikTok stars vs non TikTok users pic.twitter.com/GIT25do5sK — Vertigo_Warrior (@VertigoWarrior) June 29, 2020 Twitter celebs jinka khud ka account tiktok videos ke bharose chal raha tha: pic.twitter.com/SZuK0woQm0 — Diksha🌈 (@BrahmaandKiMaa) June 29, 2020 #TikTok worker right now thinking about #tiktokbanindia . #RIPTiktok pic.twitter.com/smblKUsZv4 — PREM (@PREM48722990) June 30, 2020 -
‘ఆ సినిమా నుంచి సుశాంత్ అభిమానిగా మరాను’
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాలమరణం మొత్తం దేశాన్ని కదిలించింది. బంధుప్రీతి కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల వల్లే సుశాంత్ చనిపోయాడని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సుశాంత్ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షల మంది సుశాంత్ ప్రొఫైల్‌ను ఫాలో అయ్యారు. ఇంకా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. పలువురు నెటిజన్లు ఆయన పోస్టులపై స్పందిస్తూ.. ‘ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మీరు ఇంత త్వరగా ఈ లోకాన్ని వదిలిపోవడం బాధాకరం’ అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సుశాంత్ సింగ్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పటివరకు ఆయనకు 9.1 మిలియన్ ఫాలోవర్లు ఉండగా, కేవలం రెండు రోజుల్లోనే ఆ సంఖ్య 11.5 మిలియన్‌కి చేరింది. సుశాంత్ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలన్న ఉత్సుకతతో చాలామంది ఆయనను ఫాలో అవుతున్నారు. ‘చిత్ర పరిశ్రమ నీలాంటి ప్రతిభ కలిగిన నటుడ్ని కోల్పోయింది’ అంటూ పలువురు హార్ట్ బ్రేక్ సింబల్స్‌ని పెడుతూ పోస్టులు పెడుతున్నారు. (సుశాంత్ ఆత్మహత్య: సల్మాన్, కరణ్, ఎక్తాలపై కేసు) ఢిల్లీకి చెందిన మన్వీర పంత్ అనే అభిమాని మాట్లాడుతూ.. ‘ఎంఎస్ ధోని సినిమా తర్వాత నుంచి నేను సుశాంత్ అభిమానిగా మారాను. అయితే అప్పటికి సోషల్ మీడియాలో ఆయన్ని ఫాలో అవ్వలేదు. సుశాంత్ ఆకస్మిక మరణవార్త వినగానే నేను షాక్‌కి గురయ్యాను. ఇప్పటికీ దీని నుంచి బయటకు రాలేకపోతున్నాను. సుశాంత్ సింగ్ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి మాధ్యమాల్లో ఇప్పుడు ఫాలో అవుతున్నాను. విశ్వం, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వంటి వాటిలో సుశాంత్‌కి చాలా అవగాహన ఉంది. ప్రతీదాంట్లో చురుగ్గా ఆలోచిస్తూ ఎంతో ప్రతిభ ఉన్న సుశాంత్‌ను బాలీవుడ్ పరిశ్రమ ఎలా వదులుకోగలిగిందో అర్థం కావడం లేద’ని ఆవేదన వ్యక్తం చేశారు. (నటికి ఆర్థిక సాయం అందించిన అక్షయ్ ) -
కోటి దాటిన అభిమానం
నటిగా, గాయనిగా దక్షిణాదిలోనే కాక బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రుతీని ఎంతో మంది అభిమానులు ఫాలో అవుతుంటారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్స్ (కోటీ నలభై లక్షలు) ఫాలోయర్స్‌ని సంపాదించుకున్నారు శ్రుతీహాసన్. ఈ సందర్భంగా ఓ సరదా వీడియోను అభిమానులతో పంచుకుంటూ, ఈ విధంగా రాసుకొచ్చారామె. ‘‘నన్ను ఇంతగా ఆదరిస్తున్న నా ఇన్స్టాగ్రామ్ కుటుంబానికి కృతజ్ఞతలు. నేను మీ అందర్నీ ప్రేమిస్తున్నాను. మీరు ప్రతిరోజూ నాపై చూపించే ప్రేమకు చాలా కృతజ్ఞతలు. చరిత్రలో ఇదొక చాలా వింత సమయం (కరోనాని ఉద్దేశించి). ప్రతి ఒక్కరికీ ప్రస్తుతం చాలా విచిత్రమైన భావోద్వేగాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. కాగా లాక్డౌన్ సమయంలో ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో కనెక్ట్ అయ్యారామె. తన రోజు వారి దినచర్యతో పాటు వంట చేస్తున్న వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారామె. అంతేకాదు.. నెగటివిటీని అనుమతించే మానసిక స్థితిలో ఇప్పుడు నేను లేనని, మంచిని మాత్రమే కోరుకుంటున్నానని కూడా పేర్కొన్నారామె. అలాగే ‘చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు’ అనే ఎమోజీలను పోస్ట్ చేశారు. -
నా కుటుంబం కోటి
‘‘నా కుటుంబసభ్యులు కోటిమంది’’ అని తెగ సంబరపడిపోతున్నారు సమంత. దక్షిణాదిన టాప్ 5 హీరోయిన్ల జాబితాలో సమంత పేరు ఉంటుంది. ఇటు సోషల్ మీడియాలోనూ సమంతకు ఫాలోయర్స్ ఎక్కువే. అందుకు తాజా నిదర్శనం ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఫాలోయర్స్ సంఖ్య పది మిలియన్ల (కోటిమంది)కు చేరడమే. ‘‘నా ఫ్యామిలీ టెన్ మిలియన్స్‌కు చేరింది. ఈ సందర్భంగా నేను పది స్వచ్ఛంద సంస్థలకు సాయం చేయాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సమంత. ట్వీటర్లో సమంతకు 8 మిలియన్స్ ఫాలోయర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ‘జాను’ తర్వాత మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు సమంత. తమిళంలో మాత్రం ‘కాదువాక్కుల రెండు కాదల్’ అనే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. -
పది మిలియన్ ఫాలోవర్స్ క్లబ్లో కాజోల్
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన సినిమా విషయాలు, భర్త అజయ్ దేవగన్‌తో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా కాజోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పది మిలియన్ల ఫాలోవర్స్ మార్క్ చేరుకున్నారు. ఇక దీనిపై స్పందించిన కాజోల్.. ‘వెండితెరపై, సోషల్‌మీడియాలో అభిమానులు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు’ అని కామెంట్ చేశారు. అదే విధంగా 2001లో తను నటించిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ చిత్రానికి సంబంధించిన బాంగ్రా డాన్స్ వీడియోను కాజోల్ జత చేశారు. ఆ చిత్రంలో అంజలీ అనే పాత్రలో కాజోల్ నటించిన విషయం తెలిసిందే. చత్రపతి శివాజీ సైన్యాన్ని ముందుండి నడిపించిన మరాఠా వీరుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఈ మూవీలో మరాఠా యోధుడిగా నటించిన అజయ్ దేవ్‌గన్‌కి సతీమణి పాత్రలో కాజోల్ నటించారు. -
20 కోట్ల ఫాలోవర్లు!
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియా మైదానంలో కూడా తనకు ఎదురులేదని మరోసారి నిరూపించాడు. ‘ఇన్స్టాగ్రామ్’లో అతడిని అనుసరించే వారి సంఖ్య ఏకంగా 200 మిలియన్లకు (20 కోట్లు) చేరుకుంది. ఈ మైలురాయిని దాటిని తొలి వ్యక్తి రొనాల్డోనే కావడం విశేషం. స్వయంగా ‘ఇన్స్టాగ్రామ్’ మాత్రమే రొనాల్డో కంటే 3 కోట్ల 30 లక్షల మంది ఫాలోవర్లతో అతనికంటే ముందుంది! తన పోస్ట్‌ల ద్వారా రొనాల్డో తన ఆటకంటే ఎక్కువగా ఆర్జిస్తున్నట్లు ప్రఖ్యాత మార్కెటింగ్ కంపెనీ ‘హాపర్ హెచ్‌క్యూ’ ఇటీవలి సర్వేలో తేలింది. రొనాల్డో తన ‘ఇన్స్టాగ్రామ్’లో ప్రచారానికి ఒక్కో ప్రకటనకు 9 లక్షల యూరోలు (సుమారు రూ. 7 కోట్ల 10 లక్షలు) తీసుకుంటున్నాడు. వీటి ద్వారానే అతనికి ఏడాదికి 48 మిలియన్ల యూరోల (సుమారు రూ. 379 కోట్లు) ఆదాయం వస్తోంది. తాను లీగ్‌లో ఆడుతున్న క్లబ్ యువెంటాస్ రొనాల్డోకు ఏడాదికి 34 మిలియన్ల యూరోలు (సుమారు రూ. 268 కోట్లు) చెల్లిస్తోంది. -
దీపికా ఫాలోవర్స్ 4 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ కథానాయిక దీపికా పదుకుణె ఇన్‌స్ట్రాగామ్‌లో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇన్‌స్టాలో ఆమెను అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య సోమవారం 4 కోట్లకు చేరుకుంది. తన వ్యక్తిగత, వృత్తి జీవిత విషయాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పంచుకొనే ఈ బాజీరావ్ ‘మస్తానీ’ అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. అలా దీపికను అనుసరిస్తున్న వారి సంఖ్య 4 కోట్లకు చేరకుంది. ఇదే వరుసలో 4.5 కోట్ల మంది ఫాలోవర్స్‌తో ప్రియాంకా చోప్రా బాలీవుడ్లో అందరికంటే ముందుంది. శ్రద్ధాకపూర్‌ను 3.5 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ప్రధాని మోదీ ఇటీవల 3 కోట్ల మార్కుకు చేరుకున్నారు. -
బిగ్‌బీ రికార్డును బ్రేక్ చేసిన షారుఖ్
జయాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ బాలీవుడ్ కింగ్‌ఖాన్ బిగ్గెస్ట్ హిట్ సాధించి చాలా కాలమైనా అతడికి ఏ మాత్రం ఫ్యాన్ పోలోయింగ్ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. తాజాగా ట్విటర్లో 39 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి భారత సెలబ్రెటీగా షారుఖ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ 38.8 మిలియన్ల ఫాలోవర్స్‌తో ఆగ్రస్థానంలో ఉండేవాడు. తాజాగా అమితాబ్‌ను షారుఖ్ అధిగమించాడు. ఈ సందర్భంగా తనపై ప్రేమాభిమానాలను కురిపిస్తున్న అభిమానులకు షారుఖ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షారుఖ్ ఫాలవర్స్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు ఇన్‌స్టాలో 18.6 మిలియన్ల మంది అభిమానులు షారుఖ్‌ను అనుసరిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ సౌదీ అరేబియాలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ సౌదీ అరేబియా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ‘జాయ్ ఫోరయ్ 2019’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో హాలీవుడ్ స్టార్ జాసన్ మొమోవా, హాంకాంగ్ యాక్షన్ హీరో జాకీచాన్, బెల్జీయం నటుడుజీన్-క్లాడ్ వాన్ డామ్మేలతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఎంతగా వైరల్ అయిందంటే కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క రోజులోనే ఆ ఫోటోకు దాదాపు 24 లక్షల లైక్‌లు వచ్చాయి. ఇక ‘రా వన్’, ‘జీరో’ సినిమాలు షారుఖ్‌ను పూర్తిగా నిరాశపరిచాయి. ముఖ్యంగా తన సొంత నిర్మాణ సంస్థలో భారీ అంచనాల నడుమ వచ్చిన ‘జీరో’ బాక్సీఫీస్ వద్ద చతికిలపడింది. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ వంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో నటుడిగానే కాకుండా నిర్మాతగా షారుఖ్ బిగ్ ఫేయిల్యూర్‌ను చవిచూశాడు. జీరో పరాజయంత తర్వాత మరో సినిమాకు షారుఖ్ ఇప్పటివరకు ఓకే చెప్పలేదు. అయితే వచ్చే ఈద్‌కు ఓ సినిమాను విడుదల చేయాలని షారుఖ్ బావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మహిళా పోలీసులను నిర్భంధించిన చింతమనేని అనుచరులు
సాక్షి, ఏలూరు టౌన్ : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను బుధవారం అరెస్ట్ చేసే సందర్భం లో చింతమనేని ఇంటి వద్ద విధులు నిర్వర్తిసు న్న మహిళా కానిస్టేబుళ్లను కొందరు నిర్బంధించి, విధులకు ఆటంకం కలిగించి, బెదిరిం పులకు పాల్పడ్డారు. దీనిపై మహిళా కానిస్టేబు ల్ గుమ్మడి మేరీ గ్రేస్ ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు అయ్యిం ది. ఈ కేసుకు సంబంధించి ఏలూరు డీఎస్పీ దిలిప్‌కిరణ్ ఆధ్వర్యంలో చింతమనేని వర్గీ యులు నలుగురిని త్రీటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు మహిళా పోలీసులను అక్కడ కొందరు చింతమనేని వర్గీయులు నిర్బంధించి, బెదిరింపులకు పాల్పడ్డారని, గేటుకు తాళాలు వేసి, విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఈ సంఘటనపై సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, ఇంకా ఎవరైతే ఉంటారో వారందరినీ అరెస్టు చేస్తామని తెలిపారు. ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో క్రైం నెంబర్ 291/19తో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. ఈ కేసులో జెడ్పీలో పనిచేస్తున్న దుగ్గిరాల గ్రామానికి చెందిన చింతమనేని విష్ణు, ధర్మాజీగూడెంకు చెందిన వేంపాటి ప్రసాద్, ఏలూరుకు చెందిన న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్, పెదవేగి మాజీ ఎంపీపీ దేవరపల్లి బక్కయ్యను అరెస్టు చేశారు. అనంతరం మధ్యాహ్నం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టుకు హాజరుపరిచారు. వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ ప్రజాప్రతినిధుల హడావుడి చింతమనేని అనుచరులు నలుగురుని అరెస్టు చేశారనే విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ ప్రజాప్రతినిధులు బడేటి కోటరామారావు, గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీ పాందువ్వ శ్రీను ఏలూరులోని త్రీటౌన్ స్టేషన్ వద్దకు వచ్చారు. అప్పటికే అరెస్టు కాబడి స్టేషన్లో ఉన్న వారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదంటూ బీరాలు పలికారు. కార్యకర్తల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసి వచ్చామని, ఆయన బాగానే ఉన్నారని చెప్పారు. -
ఇంకా ’వెలగ’బెడుతున్న భూదందాలు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అడ్డగోలు భూదందాలు, కుంభకోణాలు, రౌడీయిజంతో నానాయాగీ చేసిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరులు ఇప్పుడు కూడా ఆయన్ని అడ్డుపెట్టుకుని విలువైన భూములు చెరపడుతున్నారు.మధురవాడలో సుమారు ఆరు కోట్ల విలువైన భూమికి టెండర్ పెట్టారు. పక్కా పత్రాలతో భూ హక్కుదారుడైన దళితునిపై దౌర్జన్యం చేసి... ఆ స్థలంలో అడుగుపెట్టకుండా దౌర్జన్యం చేస్తున్నారు.వాస్తవానికి ఏడు నెలల కితం నుంచి వివాదంలో ఉన్న భూ వ్యవహారం ఇప్పుడు కొలిక్కి వస్తుందని ఆశించిన బాధితులకు తాజాగా కూడా వెలగపూడి వర్గీయుల నుంచి బెదిరింపులు రావడం, తాము కొనుగోలు చేసిన భూమిలోకి రాకుండా దందా చేయడం... వరుస పరిణామాలు ’తూర్పు’న వెలగపూడి మార్కు దారుణాలను, రౌడీయిజాన్ని స్పష్టం చేస్తున్నాయనే చెప్పాలి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రియల్ బూమ్ విపరీతంగా ఉండే మధురవాడలోని సర్వే నెం 2లో 2305 గజాల స్థలాన్ని పూసపాటి లక్ష్మీనరసింహరాజు నుంచి గుంటూరు జిల్లాకు చెందిన అవుతు రాజారెడ్డి కొనుగోలు చేశారు. రాజారెడ్డి నుంచి శ్రీకాకుళం జిల్లాకు చెందిన అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వందాన వెంకటరావు గతేడాది 2018 నవంబర్ 4వ తేదీన సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ మేరకు అదే నెల 12వ తేదీన వెంకటరావు స్థలంలోకి ప్రవేశించి.. స్థలంలోని పిచ్చిమొక్కలను కూలీలతో తీయిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో వెలగపూడి అనుచరులు చేరుకున్నారు. వెలగపూడికి చెందిన వాహనంలోనే ఆయన సన్నిహితులు మండవ శివప్రసాద్ అలియాస్ సోనా ప్రసాద్, రామనాధబాబు తదితరులు పెద్దసంఖ్యలో అనుచరులతో వచ్చి హల్చల్ చేశారు. ఆ స్థలం మాది.. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటూ దౌర్జన్యానికి దిగారు. తాను అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేశానని, పక్కా ఆధారాలున్నాయని వెంకటరావు మొత్తుకున్నా వినలేదు. ఆ స్థలం మాదేనని గదమాయించారు. ‘మీ వద్దనున్న ఆధారాలు చూపించాలని, సర్వే నెంబర్ 2లో మా పట్టా నెం 585 అని, ఒకవేళ పట్టా నెంబర్లలో తేడాలుంటే సరిచూసుకుందామని’ వెంకటరావు అభ్యర్థించినా లెక్క చేయలేదు. నీ స్థాయెంత.. నువ్వెంత... మేము నీకు భూ పత్రాలు చూపించాలా అని లెక్క లేకుండా మాట్లాడారు. మహిళా కూలీలపై దాడి మొక్కలు తొలగించే పని చేస్తున్న మహిళా కూలీలు రాగిణి, లక్ష్మిలపై దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలవడంతో బాధితులు అదే రోజు కేజీహెచ్‌లో చేరి చికిత్స పొందారు. ఇక దాడి చేస్తుండగా అడ్డొచ్చిన భూ హక్కుదారుడైన వందాన వెంకటరావును కులం పేరుతో దూషించారు. ఈ మేరకు పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తదనంతరం కేసు (ఎఫ్ఐఆర్ 558, 559)ను ఎస్సీ ఎస్టీ సెల్ ఏసీపీకి బదిలీ చేశారు. అంతే.. అక్కడితో కేసు అటకెక్కింది. ఎన్నిమార్లు తిరిగినా పోలీసులు కేసు విషయం తేల్చలేదు. ఇటు వెలగపూడి అనుచరులు వీరిని స్థలంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటూ వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు నివేదించగా, కమిషన్ సభ్యుడైన రాముడు వచ్చి... స్వయంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈలోగా ఎన్నికలు రావడం, టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో బాధితులకు ధైర్యం వచ్చింది. ఇటీవలే భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించగా మళ్లీ వెలగపూడి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో న్యాయం కోసం ‘స్పందన’లో ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. దళితుడిననే దౌర్జన్యం : వందాన వెంకటరావు వెలగపూడి రామకృష్ణబాబుకు అత్యంత సన్నిహితులైన సోనాబాబు, పరుచూరి రామనాధబాబు తదితరులు మాపై దౌర్జన్యం చేస్తున్నారు. నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిలోకి నన్ను అడుగుపెట్టకుండా చేస్తున్నారు. ఆ భూమి మార్కెట్ విలువ ఇప్పుడు సుమారు ఆరుకోట్ల వరకు ఉంది. నా వద్ద అన్ని పత్రాలూ ఉన్నాయి. వాళ్ల వద్ద కూడా ఉన్నాయని అంటున్నారు. పోనీ సర్వే చేయించుకుందాం... అని ఎన్నిమార్లు చెప్పినా లెక్క చేయడం లేదు. కేవలం నేను దళితుడనే వాళ్లు లెక్క చేయడం లేదని నేను అనుకుంటున్నాను. దళితులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదా... విలువైన భూములు కొనుగోలు చేయకూడదా... వెలగపూడి అనుచరుల అహం, దౌర్జన్యం చూస్తుంటే అలానే ఉంది.. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలి. -
నయీం అనుచరుడి హల్చల్!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత.. అతని అనుచరుల కదలికలు పెద్దగా లేవు. నయీం హతమై రెండేళ్లు గడిచింది. ఇప్పుడు అతని అనుచరుడు శేషన్న విశ్వరూపం చూపిస్తున్నాడు. నయీం చేసిన దందాలు, సెటిల్ మెంట్లు, కూడబెట్టిన ఆస్తులు, ఇతరత్రా అన్నీ ఇతని కనుసన్నల్లోనే ఉన్నట్టు చెప్పుకుంటారు. అందుకే నయీం ఎన్కౌంటర్ జరిగిన రెండేళ్ల తర్వాత దందాలు మొదలుపెట్టాడు. ఎల్బీనగర్లోనే ఉంటూ కల్వకుర్తి, అమన్‌గల్, అచ్చంపేట్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో కార్యకలాపాలను విస్తృతం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నయీం గ్యాంగంతా అతడి వెనుకే... నయీం రెండు రకాలుగా గ్యాంగ్‌ను నడిపాడు. ఒకటి తన గురించి తెలిసిన కుటుంబీకులతో, రెండోది తనతో ముందు నుంచి ఉన్న అనుచరులతో.. ఎన్కౌంటర్ తర్వాత అతడి కుటుంబీకులు మొత్తం సైలెంట్ అయిపోయారు. కొందరు జైల్లో ఉంటే మరికొందరు అజ్ఞాతంలో గడుపుతున్నారు. కానీ అనుచర వర్గంగా ఉన్నవారంతా మళ్లీ రంగంలోకి దిగారు. అనుచరులుగా ఉన్న 16 మంది గ్యాంగ్‌లో నంబర్ 2గా ఉన్న శేషన్నతో చేతులు కలిపినట్టు మహబూబ్‌నగర్ పోలీస్ వర్గాలు స్పçష్టం చేశాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొం డలో బినామీ ఆస్తులను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ శేషన్న ఆర్థికంగా బలపడుతూ మళ్లీ దందాలోకి దిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. అతని వెంటే ప్రజాప్రతినిధులు.. నయీం ఎన్కౌంటర్ మరుసటి రోజు నుంచి ఎల్బీనగర్లో ఉన్న ఎంపీపీ ఇంటి పక్కన అపార్ట్మెంట్లోనే శేషన్న షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి అక్కడే ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాడని తెలిసింది. అచ్చంపేట ప్రాంత ఓ ప్రజాప్రతినిధి, మహబూబ్‌నగర్‌లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్, డీఎస్పీ, కల్వకుర్తికి చెందిన మరో ప్రజాప్రతినిధితో కలసి శేషన్న సెటిల్మెంట్లు చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. నయీం బినామీల ఆస్తులను శేషన్న ద్వారా దక్కించుకునేందుకు కొందరు ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆచూకీ తెలియడంలేదు... శేషన్న ఎక్కడున్నాడని పోలీస్ అధికారులను ప్రశ్నిస్తే ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అతను మాత్రం బహిరంగంగానే తిరుగుతున్నాడు. పైగా పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే దందాలు చేస్తుండటం అనుమానం కలిగిస్తోంది. నయీం ఎన్కౌంటర్లో కీలక సమాచారం ఇచ్చినందుకే శేషన్నను వదిలిపెట్టినట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. నలుగురు రియల్టర్లకు బెదిరింపులు.. కల్వకుర్తి, షాద్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ చేస్తున్న నలుగురు వ్యాపారులను ఇటీవల శేషన్న బెదిరించినట్లు తెలిసింది. నయీం గతంలో కబ్జా చేసిన భూములను విక్రయించేందుకు మళ్లీ రియల్టర్లు ప్రయత్నం చేయడమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై రియల్టర్లు ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఆ ఎమ్మెల్యే శేషన్నకు దగ్గరగా ఉన్న ఓ ఎంపీపీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. శేషన్న జోలికి రావద్దని ఎంపీపీ కూడా ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. రాచకొండ పరిధిలోని మల్కాజ్గిరి జోన్లో ఓ అపార్ట్మెంట్ విషయంలోనూ శేషన్న బెదిరింపులకు పాల్పడినట్లు ఓ సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. -
‘నకిలీ’పై యుద్ధం
వాషింగ్టన్: పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నకిలీ ఖాతాలపై ట్విటర్ యుద్ధభేరి మోగించింది. కొందరు ప్రముఖులకు రాత్రికిరాత్రే నకిలీ ఫాలోవర్లు పుట్టుకొస్తూ అసత్యపు వార్తలు, విద్వేషపూరిత సందేశాలు వ్యాపింపజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి ఖాతాలను తొలిగించే పనిని ట్విటర్ చేపట్టింది. ఫలితంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లి సహా పలువురు ప్రముఖులకు భారీ సంఖ్యలో ఫాలోవర్లు తగ్గే అవకాశాలున్నాయి. బాట్స్తోనే బెడద కుప్పలుతెప్పలుగా నకిలీ ఖాతాలు రావడానికి ప్రధాన కారణం బాట్స్ అనే సాఫ్ట్వేర్. ఇది రీట్వీట్, ఫాలోయింగ్, అన్‌ఫాలోయింగ్, అకౌంట్ మేనేజింగ్ తదితరాలను ఆటోమేటిక్‌గా చేస్తుంది. ట్విటర్ వినియోగదారుల పని సులభంగా కావడానికి రూపొందించిన ఈ సాప్ట్‌వేర్‌ని దుర్వినియోగం చేయడం వల్ల నకిలీల బెడద ఎక్కువైంది. బాట్స్ వల్ల ఏదైనా ఒక విషయాన్ని నిరంతరం ట్రెండింగ్‌లో ఉంచే వెసులుబాటు ఉంది. ట్వీట్లు, రీట్వీట్లన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతూ, ఎప్పటికీ ఒకే అంశంపై చర్చ జరిగేలా చేయడం వల్ల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. ఇప్పటికీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బ్రెగ్జిట్ వంటి అంశాలపై ట్విటర్ వేదికగా చర్చ జరుగుతోందంటే దానికి కారణం బాట్స్. అందుకే ట్విటర్ ప్రధానంగా బాట్స్ సాఫ్ట్వేర్ ద్వారా నడుస్తున్న ఖాతాలపై దృష్టిపెట్టింది. ఆటోమేటిక్ అకౌంట్లను సృష్టిస్తున్న సమయంలోనే పర్యవేక్షించి వాటిలో నకిలీవని తెరుచుకోకుండా కాకుండా అడ్డుకుంటోంది. ఇలా ప్రతి రోజూ 50 వేలకు పైగా నకిలీ అకౌంట్లు క్రియేట్ కాకుండా అడ్డుకుంటున్నట్టు ట్విటర్ ఆడిట్ రిపోర్ట్ తెలిపింది. గంపగుత్తగా కొట్టే లైక్‌లు, వివిధ అకౌంట్ల నుంచి ఒకే విధంగా వచ్చే రీట్వీట్లు, ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న ట్రోల్స్‌ను నిరోధించే చర్యల్ని చేపట్టింది. గత ఏడాది నుంచి ఫేక్ అకౌంట్ల ప్రక్షాళనను మొదలు పెట్టిన ట్విటర్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో అమితాబ్ బచ్చన్ ఫాలోవర్లు రాత్రికి రాత్రే బాగా తగ్గిపోవడంతో ఆయన ట్విటర్ తీరుపై మండిపడ్డారు. ట్విటర్లో తిరుగులేని ట్రంప్ రెండు, మూడు స్థానాల్లో పోప్, మోదీ జెనీవా: ట్విటర్లో అత్యధిక మంది అనుసరిస్తున్న నాయకుడిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిచారు. రెండు, మూడు స్థానాల్లో వరసగా పోప్ ఫ్రాన్సిస్, ప్రధాని మోదీ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక ట్రంప్ ఫాలోవర్ల సంఖ్య రెండింతల కన్నా ఎక్కువ పెరిగింది. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న బుర్సన్ కోన్ అండ్ వోల్ఫ్(బీసీడబ్ల్యూ) తాజా అధ్యయనంలో ఈ వివరాలు తెలిపింది. 5.2 కోట్ల ఫాలోవర్లతో ట్రంప్.. పోప్ కన్నా సుమారు 45 లక్షల మంది ఎక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ట్రంప్, మోదీల ఫాలోవర్ల సంఖ్య మధ్య తేడా సుమారు కోటిగా ఉంది. లైక్‌లు, రీట్వీట్ల పరంగా చూసినా ట్రంప్..పోప్, మోదీ కన్నా చాలా ముందంజలో ఉన్నారు. ఏడాది కాలంలో ట్రంప్ తన వ్యాఖ్యలకు సుమారు 26 కోట్ల లైక్‌లు, రీట్వీట్లు పొందారు. రీట్వీట్ల పరంగా చూస్తే ట్రంప్ కన్నా సౌదీ రాజు సల్మాన్ ఆధిక్యంలో ఉన్నారు. 2017 మే–2018 మే మధ్య కాలంలో సల్మాన్ 11 సార్లే ట్వీట్ చేయగా, ప్రతి ట్వీట్‌కు 1.5 లక్షల రీట్వీట్లు, ట్రంప్ ప్రతి ట్వీట్‌కు 20 వేల రీట్వీట్లు వచ్చాయి. -
చింతమనేని అనుచరుల ఇసుక అక్రమ తవ్వకాలు
పెదవేగి రూరల్ : ఒకపక్క ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర 200 కిలోమీటర్లకు చేరిన సందర్భంగా బుధవారం పెదవేగి మండలంలో పాదయాత్ర చేపట్టిన నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్య చౌదరికి ఇసుక అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీంతో అబ్బయ్య చౌదరి కార్యకర్తలతో కలిసి వెళ్లి తమ్మిలేరులో అక్రమంగా ఇసుకను తవ్వుతున్న పొక్లెయిన్‌కు అడ్డంగా బైఠాయించారు. జిల్లా అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్లకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. మీరు వస్తే కాని ఇక్కడ నుంచి కదిలేది లేదని చెప్పి అక్కడే భైఠాయించారు. దీంతో పెదవేగి తహసీల్దార్ ఎండి నజిముల్లాషా, ఎస్సై కాంతిప్రియ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ దెందులూరులో చింతమనేని ప్రభాకర్ పొక్లయిన్‌తో తవ్వకాలు చేసి, యంత్రంతో ఇసుకను జల్లించి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోతున్నాయని తమ్మిలేరు పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చి ఇసుక గోతులను పరిశీలిస్తే ఎంత మేర దోచుకున్నారో అర్థం అవుతుందన్నారు. ఈ తవ్వకాలపై నడిపల్లి, ఎల్లాపురం సమీప ప్రాంత రైతులు హైకోర్టుకు వెళ్లి తమ్మిలేరులో ఇసుక తీయకుండా ఆర్డర్ తీసుకువస్తే తాత్కాలికంగా పది రోజులు నిలిపి మళ్లీ ఎమ్మెల్యే అండదండలతో తవ్వుతున్నారన్నారు. బాధ్యులైన వారిపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో అధికారులు పొక్లయిన్‌ను సీజ్ చేశారు. -
‘పరిటాల శ్రీరామ్ కనుసన్నల్లో క్రిమినల్ గ్యాంగ్స్’
సాక్షి, అనంతపురం : మంత్రి పరిటాల సునీత హత్యలు, కిడ్నాప్‌లను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో 10 క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు. పరిటాల కుటుంబానికి చట్టాలు వర్తించవా? అని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మంత్రి పరిటాల సునీతను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. టీడీపీ నేతల గూండాగిరికి పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై ఉన్న కేసుల్లో సరైన విచారణ జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. వారిపై ఆలస్యంగా ఛార్జిషీట్లు నమోదు చేసి శిక్షలు పడకుండా పోలీసులు సహకరిస్తున్నారని కృష్ణప్ప ధ్వజమెత్తారు. చదవండి : పరిటాల అనుచరుల రౌడీరాజ్యం -
పరిటాల అనుచరుల రౌడీరాజ్యం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని పరిటాల అనుచరులు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఉండే సయ్యద్ పాషాను పరిటాల వర్గం కిడ్నాప్ చేసి, మంత్రి స్వగ్రామమైన వెంకటాపురానికి తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు. రూ. 4 కోట్లు ఇవ్వాలని బెదిరించి, బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 30 లక్షలు తీసుకుని అతడిని విడిచిపెట్టారు. దీంతో సయ్యద్ పాషా కర్ణాటకలోని బాగేపల్లిలో పోలీసులును అశ్రయించాడు. పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ అనుచరుడు భాస్కర్ నాయుడు సహా 8 మందిపై చర్యలు తీసుకోవాలని అతను ఫిర్యాదు చేశాడు. కర్ణాటక పోలీసులు ఈ కేసును అనంతపురం ఫోర్త్ టౌన్ పీఎస్‌కు బదిలీ చేశారు. పరిటాల వర్గీయులు ఆగడాలు పెచ్చుమీరుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిటాల వర్గీయుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నారు. -
పరిటాల అనుచరుల దౌర్జన్యం..
-
సెలబ్రిటీల లెక్కలు మారిపోయాయి
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ఈ మధ్య ప్రముఖుల ఫాలోవర్ల లెక్కలను విడుదల చేసింది. అయితే అనుసరించేవారి(ఫాలోవర్ల) లెక్కలు నిజం కాదని, అందులో చాలా మట్టుకు బోగస్‌వే ఉన్నాయంటూ పెద్ద షాకే ఇచ్చింది. ప్రధాని మోదీ నుంచి మొదలుకుని, సినీ సెలబ్రిటీల దాకా ఎవరి ఖాతాలో ఎన్ని ఫేక్ ఫాలోవర్లు ఉన్న లిస్ట్‌ను ట్విటర్ విడుదల చేసింది. అందులో మన స్టార్ల లెక్కలను పరిశీలిస్తే... టాలీవుడ్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీ సమంత అక్కినేని. అయితే ఆమె ఫాలోవర్లలో 68 శాతం మాత్రమే అసలు అని ట్విటర్ తేల్చింది. ఇక తర్వాతి స్థానంలో ఉన్న మహేష్ బాబు ఫాలోవర్లలో 51 శాతం, రానా దగ్గుబాటి 53 శాతం, నాగార్జున ఖాతాలో 54 శాతం రియల్ ఫాలోవర్లు ఉన్నారంట. లిస్ట్‌లో తర్వాతి ప్లేస్‌లో ఉన్న రాజమౌళి ట్విటర్లో మాత్రం 72 శాతం ఒరిజినల్ ఫాలోవర్లు ఉండగా, అత్యధిక ఒరిజినల్ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీగా జక్కన్న నిలిచారు. తారక్ రియల్ ఫాలోవర్స్ 65 శాతం ఉండగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 49 శాతంతో లోయెస్ట్ రియల్ ఫాలోవర్స్ సెలబ్రిటీగా నిలిచారు. బాలీవుడ్ విషయానికొస్తే... 35 మిలియన్ల ఫాలోవర్లతో షారూఖ్ ఖాన్ ట్విటర్ టాప్‌లో కొనసాగుతున్నారు. అయితే ఆయన ఒరిజినల్ ఫాలోవర్స్ 48 శాతం మాత్రమే ఉంది. అంతేకాదు ఈ లిస్ట్‌లో ఆయనే లోయెస్ట్ ఫాలోవర్స్ సెలబ్రిటీ కావటం గమనార్హం. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 62 శాతం, సల్మాన్ ఖాన్ 50 శాతం, అక్షయ్ కుమార్ 50 శాతం, దీపికా పదుకొనే 67 శాతం, హృతిక్ రోషన్ 56 శాతం, అమీర్ ఖాన్ 68 శాతం, ఏఆర్ రెహమాన్ 53 శాతం, అలియా భట్ 61 శాతం రియల్ ఫాలోవర్స్ ఉండగా, ఈ లిస్ట్‌లో ప్రియాంక చోప్రా 71 శాతం రియల్ ఫాలోవర్స్‌తో హయ్యెస్ట్ సెలబ్రిటీగా ఉన్నారు. ట్విటర్ అడిట్ ప్రకారం... -
ఫేస్బుక్లో మోదీనే టాప్
జెనీవా: ఫేస్బుక్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజా దరణ పొందిన నేతగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే రెండు రెట్లు ఎక్కువ ఫాలోవర్లతో తొలిస్థానం సాధించారు. ఫేస్బుక్లో మొత్తంగా 4.32 కోట్ల మంది మోదీని ఫాలో అవుతున్నారు. 2.31 కోట్ల మంది ఫాలోవర్లతో ట్రంప్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ట్వీటర్లో మాత్రం ట్రంప్ టాప్‌లో ఉన్నారు. బుర్సన్ కోన్, వోల్ఫీ సంస్థ ‘ఫేస్బుక్లో ప్రపంచ నేతలు’ పేరుతో నిర్వహించిన సర్వే వివరాలను ఈ మేరకు వెల్లడించింది. 2017 జనవరి 1వ తేదీ నుంచి దేశాధినేతలు, ప్రభుత్వాలు, విదేశాంగ మంత్రులకు సంబంధించిన సుమారు 650 పేజీల్లోని డేటాను విశ్లేషించినట్లు తెలిపింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు నరేంద్ర మోదీ ఫేస్బుక్ పేజీపై 11.36 కోట్ల ఇంటరాక్షన్లు జరిగినట్లు (మొత్తం కామెంట్లు, లైకులు, షేర్లు ఆధారంగా) వివరించింది. అదే డొనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్ పేజీపై మాత్రం 20.49 కోట్ల ఇంటరాక్షన్లు జరిగినట్లు పేర్కొంది. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఫేస్బుక్ పేజీపై 4.6 కోట్లు, కాంబోడియా ప్రధాని శామ్డెక్ హున్ సేన్ పేజీపై 3.6 కోట్లు, అర్జెంటీనా అధ్యక్షుడు 3.34 కోట్ల ఇంటరాక్షన్లు జరిగినట్లు వెల్లడించింది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న 91 శాతం దేశాలకు అధికారిక ఫేస్బుక్ ఖాతా ఉంది. మొత్తం 193 దేశాలకు గాను 175 దేశాలు ఖాతా నిర్వహిస్తున్నాయి. ఇవికాక 109 దేశాల అధినేతలు, 86 దేశాల ప్రభుత్వ అధినేతలు, 72 మంది విదేశాంగ మంత్రులు వ్యక్తిగతంగా ఫేస్బుక్ పేజీలు వినియోగిస్తున్నారు. ప్రపంచ నేతల్లో ఎక్కువ మంది వీడియోలను షేర్లు చేయడానికి, ప్రజలతో లైవ్‌లో మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సర్వే తెలిపింది. -
కాంగ్రెస్‌లో టికెట్ల కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కన్నడనాట మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ హై కమాండ్‌కు టికెట్ల పంపిణీ కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. కర్ణాటక సర్కారులో ఉన్న మంత్రులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నేరుగా అధిష్టానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే అన్ని పార్టీలు తొలివిడతగా తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మాత్రం జాబితా విషయంలో స్పష్టతనీయటం లేదు. కన్నడ మంత్రుల్లో ఎనిమిది మంది.. తమ పిల్లలు, అనుచరులకు టికెట్లు ఇవ్వాలంటూ పట్టుబడుతుండటమే అసలు కారణం. అయితే పార్టీ అధ్యక్షుడు రాహుల్ నేతృత్వంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ.. ఆదివారం తొలి జాబితా విడుదల చేయొచ్చని తెలుస్తోంది. సంతానంతోనే సమస్య! సీఎం సిద్దరామయ్య సైతం చాముండేశ్వరి (సిట్టింగ్), బదామీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. తన కుమారుడు యతీంద్రకూ టికెట్ ఇప్పించుకోవాలని పోటీపడుతున్నారు. అయితే సిద్దరామయ్య (కుమారుడికి), హోం మంత్రి రామ లింగారెడ్డి (కూతురికి), మాజీ కేంద్ర మంత్రి కేహెచ్ మునియప్ప (కూతురికి), మల్లికార్జున ఖర్గే (కుమారుడు – రాష్ట్ర ఐటీ మంత్రి)లు ఈ విషయంలో విజయం సాధించినట్లేనని తెలుస్తోంది. మార్గరెట్ అల్వా (కుమారుడు నివేదిత్ అల్వా), వీరప్ప మొయిలీ (కుమారుడు హర్ష మొయిలీ), పీసీసీ చీఫ్ పరమేశ్వర (కుమారుడు) మంత్రులు ఆర్వీ దేశ్‌పాండే (కుమారుడు), టీబీ జయచంద్ర (కుమారుడు)కూడా తమ వాళ్లకు టికెట్లు ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే జేడీఎస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇవ్వాల్సిందేనంటూ సిద్దరామయ్య, వద్దని ఖర్గే, వీరప్ప మొయిలీ పట్టుబడుతుండటమే ఈ జాబితా ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. రాహుల్ సమక్షంలోనే వాకౌట్లు..: శుక్ర వారం ఉదయం రాహుల్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో సీఎం సిద్దరామయ్య, లోక్‌సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎం వీరప్ప మొయిలీ, పీసీసీ చీఫ్ జి.పరమేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి నేతలు వాకౌట్ చేసేంతవరకు వెళ్లింది. దీంతో మళ్లీ సాయంత్రం సమావేశమయ్యా రు. ఈ భేటీలో సోనియా పాల్గొన్నారు. -
సినిమాలు లేకపోయినా... ఆమె హవా తగ్గలేదు!
లోకనాయకుడు, నటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రుతీహాసన్. అయితే కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ భామ. తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్స్లేతో షికార్లు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఏడాది నుంచి శ్రుతి ఏ సినిమా చేయకపోయినా... తెరపై అభిమానులకు కనిపించకపోయినా. ట్వీటర్లో మాత్రం ఆమె హవా కొనసాగిస్తోంది. భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్‌లాల్ వంటి స్టార్లను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచింది శ్రుతి. ఏడు మిలియన్ల మంది అభిమానులు ట్వీటర్లో ఈ నటిని ఫాలో అవుతున్నారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఆమె హవా మాత్రం తగ్గలేదంటున్నారు నెటిజన్లు. నటి సమంత, శ్రుతికి కాస్త దగ్గర్లో ఉంది. సమంతను ట్వీటర్లో 6.53 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. -
సగం ట్విటర్ ఫాలోవర్స్ ఫేక్
సోషల్ మీడియా యుగంలో ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాంలో ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే అంతగొప్పగా ప్రముఖులు భావిస్తుంటారు. ఇక రాజకీయ నాయకుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ ప్రచారం, వ్యక్తిగతంగా పేరు ప్రఖ్యాతుల కోసం సోషల్ మీడియా మీదే ఆధారపడుతున్నారు. దాదాపు అన్ని ప్రధాన పార్టీలు సోషల్ మీడియా విభాగాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే మన రాజకీయ నేతల సోషల్ మీడియా ఖాతాల్లోని ఫాలోవర్స్ చాలావరకూ నకిలీ అని తేలుతున్నాయి. ముఖ్యంగా ట్విటర్లో సగం ఫాలోవర్స్ ఫేక్ అని ట్విటర్ ఆడిట్, ట్విప్లమసీ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ నకిలీ ఫాలోవర్స్ జాబితాలో రాహుల్ గాంధీ టాప్‌లో నిలిస్తే ఆ తర్వాత స్థానంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఉన్నారు. రాహుల్‌కి ట్విటర్లో 62 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే వారిలో 68 శాతం మంది ఫేక్ అని సర్వే తేల్చింది. ప్రధాని మోదీకి 4 కోట్ల 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే వారిలో ఏకంగా 2.5 కోట్ల మంది ఫేక్ అని తెలిపింది. అంతర్జాతీయంగా పోప్ ఫ్రాన్సిస్‌కి 48 శాతం, హిల్లరీ క్లింటన్‌కి 31 శాతం, డొనాల్డ్ ట్రంప్‌కి 26 శాతం నకిలీ అనుచరులు ఉన్నారు. రాజకీయ ప్రముఖుల్ని ఫాలో అవుతున్న వారిలో 5 వేల మందిని శాంపిల్‌గా తీసుకొని ఈ నివేదిక రూపొందించారు. ఫేక్ ఖాతాల వెనుక గుట్టు ఇది.. ఇందుకోసం ట్విట్టర్లో బాట్స్ అనే సాఫ్ట్‌వేర్‌ని వాడుతున్నారు. ట్వీట్, రీ ట్వీట్ , ఫాలోయింగ్ , అన్‌ఫాలోయింగ్, అకౌంట్ మేనేజింగ్ను ఆటోమెటిక్‌గా చేసే సాధనమే బాట్స్.. ఈ సాప్ట్‌వేర్‌ని దుర్వినియోగం చేయడం వల్లే ఫేక్ ఫాలోవర్స్ పుట్టుకొస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోదీకి కేవలం నెలరోజుల్లోనే 70 లక్షల మంది ఫాలోవర్స్ పెరగడంతో ఆయన పాపులారిటీ పెరిగిందని, ట్రంప్‌ని ఆయన మించిపోతారని అనుకున్నారు. అయితే నెల వ్యవధిలో అన్ని లక్షల మంది ఫాలోవర్స్ పెరగడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపించాయి. రాహుల్‌గాంధీకి రెండు నెలల్లోనే 10 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఆయన ట్వీట్లకి నిముషాల్లోనే వేల సంఖ్యలో రీట్వీట్లు వస్తున్నాయి. దీనికంతటికీ ఆటోమేటెడ్ బాట్స్ వినియోగించడమే కారణమని తేలింది. ట్విటర్లో నకిలీ ఖాతాలు పెరగడంతో దాని యాజమాన్యం కూడా చర్యలు మొదలు పెట్టింది. ఫిబ్రవరిలో అమెరికాలో చాలా మంది సెలిబ్రిటీల ఫేక్ ఫాలోవర్స్ ఖాతాల్ని రాత్రికి రాత్రే రద్దు చేసింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భూ మాయగాళ్లు
తిరుపతి చుట్టూ అక్రమార్కులు బరితెగిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు టీడీపీ నేతలు అధికారుల సహకారంతో అనాధీనం.. కాలువ, కుంట, చెరువు, స్వర్ణముఖి నదీ పోరంబోకు భూములను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటున్నారు. ఈ మూడేళ్లలో కోట్ల రూపాయల విలువజేసే సుమారు 259 ఎకరాలకుపైగా స్వాధీనం చేసుకున్నారు. ఆ భూములను ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వ భూములని తెలియక కొనుగోలు చేసిన అనేకమంది బాధితులు పట్టాల కోసం నాయకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తిరుపతి రూరల్ పరిధిలో భూమాయగాళ్లపై ‘సాక్షి’ టాస్క్‌ఫోర్స్ స్పెషల్ ఫోకస్.. సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్: విభజన తర్వాత తిరుపతికి అత్యంత ప్రాధాన్యత పెరిగింది. ఏడుకొండల వాడి చెంత ఇంత చోటుంటే చాలనుకునేవారు నానాటికీ పెరుగుతున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన అనేక మంది వ్యాపారులు తిరుపతిలో నివాసాల ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. వీరి అవసరాలు.. భూములకు పెరుగుతున్న డిమాండ్‌ను అధికార పార్టీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక టీడీపీ నేతలు వారి అనుచరుల ద్వారా ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని స్వాధీనం చేసుకుంటున్నారు. అక్రమాల అడ్డా అవిలాల తిరుపతి సమీపంలోని అవిలాల రెవెన్యూ పరిధిలోని వేదాంతపురం పంచాయతీ సర్వే నం.360లో 178 ఎకరాలు వంక, కాలువ పోరంబోకు భూములతో పాటు ప్రభుత్వ భూమి ఉంది. కాలువ, స్వర్ణముఖి నదికి మధ్యలో ఉన్న ఈ భూమిని అధికార పార్టీకి చెందిన నాయకులు ఇద్దరు ప్లాట్లు వేసి విక్రయించారు. అందుకోసం ముగ్గురు బ్రోకర్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్లాటు కొనుగోలు చేసిన వారికి దగ్గరుండి తాత్కాలిక షెడ్లు వేయిస్తుంటారు. ప్లాటు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వందకుపైగా నివాసాలున్నాయి. మరికొన్ని నిర్మాణాలు సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే నిర్వాకం.. శ్రీకాళహస్తికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సుమారు రూ.15 కోట్లు విలువచేసే చెరువును ఆక్రమించుకున్నారు. అవిలాల రెవెన్యూలోని సర్వే నం.377లో 12 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విలువైన ఓటేరు చెరువును ఆ ఎమ్మెల్యే దర్జాగా కబ్జా చేశారు. చెరువు ఆక్రమణ విషయం అధికారులకు తెలిసినా ఎవ్వరూ నోరెత్తలేదు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో చెరువును పూడ్చేందుకు ప్రయత్నించారు. టిప్పర్లతో మట్టి తెచ్చి జేసీబీలతో పూడ్చివేస్తున్నా అడ్డుకునేందుకు ఎవ్వరూ సాహసించలేకపోయారు. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో స్థానికులు కోర్టును ఆశ్రయించారు. బండ పోరంబోకుపై భూరాబందులు సర్వే నం.250లో 6.3 ఎకరాల బండ పోరంబోకు స్థలం ఉంది. ఇందులో 26 మంది గంగిరెద్దుల కుటుంబాల వారికి పట్టాలిచ్చారు. ఈ పట్టాలను సాకుగా చూపించి మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు ఒకరు పెద్ద ఎత్తున విక్రయాలకు తెరదీశారు. పక్కనే శ్మశానం ఉన్నా దాన్ని కూడా ఆక్రమించి రెండు సెంట్ల స్థలాన్ని రూ.5 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రామ..రామా! రామచంద్రయ్య కాలనీలో సర్వే నం.222, 223/2, 224, 225లో సుమారు 5 ఎకరాల కాలువ పోరంబోకు భూమి ఉంది. ఇందులో 62 మందికి పట్టాలు మంజూరు చేశారు. వారి పేర్లు చెప్పుకుని మాజీ మంత్రి అనుచరుడు 2 సెంట్ల స్థలాన్ని రూ.5 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. భూమంత్రకాళి.. రామదాసు కాలనీలో సర్వే నం.230/1, 230/2, 231/3లలో మరో 4.5 ఎకరం బండ పోరంబోకు భూమి ఉంది. ఇందులో కొంతమందికి పట్టాలు ఇచ్చినట్లు ఇచ్చి మిగిలిన భూమిని అమ్ముకున్నారు. మరికొంత భూమిలో హౌసింగ్ స్కీంలో పక్కాగహాలు నిర్మించి అమ్ముకున్నారు. తిరుమలలోని పాపవినాశనంలో దుకాణాల తొలగింపుతో నష్టపోయిన వారికి వేదాంతపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.233/2, 232లో 1.5 ఎకరాల్లో 43 మందికి పట్టాలు ఇచ్చారు. మిగిలిన స్థలాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నారు. తిరుచానూరు సమీపంలో సర్వే నం.479లో 36 ఎకరాల స్వర్ణముఖి నది పోరంబోకు భూమి ఆక్రమణకు గురైంది. రెండేళ్ల క్రితం లోతట్టు ప్రాంతంలో జేసీబీలు పెట్టి చదును చేయించుకున్నారు. ఆక్రమించుకున్న ప్రాంతంలో ప్రహరీ గోడ కూడా నిర్మించుకోవడం గమనార్హం. ఆక్రమణల గురించి తమకు ఎటువంటి ఫిర్యాదులూ అందలేదని రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. బరితెగిస్తున్న మాజీ మంత్రి అనుచరులు.. తిరుపతి రూరల్ మండల పరిధిలో మాజీ మంత్రి అనుచరులు ఇద్దరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వేదాంతపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.203/2, 204/1లో సుమారు 5 ఎకరాల కాలువ పోరంబోకు ఉంది. రూ.5 కోట్లు విలువచేసే ఈ స్థలాన్ని ప్లాట్లు వేసి విక్రయించుకున్నారు. మరికొన్ని ప్లాట్లలో వారే నివాసాలు నిర్మించి అమ్ముకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 162 నివాసాలున్నాయి. దీనికి విజయనగర కాలనీగా నామకరణం చేశారు. ఇవి మొత్తం అక్రమమేనని అధికారులు స్పష్టం చేశారు. ఇదే కాలనీలో సర్వే నం.208లో ఉన్న మరో 2.5 ఎకరాల కాలువ పోరంబోకును కూడా ఆక్రమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సర్వే నం.246, 247లో మరో 5 ఎకరాల కాలువ పోరంబోకు భూమిని ఆక్రమించేందుకు రంగం సిద్ధమైంది. -
మరో 'పచ్చ' పెత్తనం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సాధికార మిత్ర ముసుగులో బూత్ మిత్ర నియామకాలు చేపడుతున్నారు. బూత్ స్థాయి కార్యకర్తలుగా వినియోగించుకునేందుకు సీఎం చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. జన్మభూమి కమిటీల తరహాలో గ్రామాల్లో తనకు అనుకూల వ్యక్తులను నియమించుకుంటున్నారు. పథకాల ప్రచారం, సమస్యల పరిష్కారం కోసమని చేపడుతున్న సాధికార మిత్ర నియామకాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి నియామకాలు పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో అధికార వర్గాలు సైతం విస్తుపోతున్నాయి. ఇప్పటికే జన్మభూమి కమిటీలు చెలరేగిపోతున్నాయి. గ్రామాల్లో పచ్చరోత రాజకీయాలు చేస్తున్నాయి. అర్హులు, అనర్హులన్న విషయాన్ని పక్కన పెట్టి టీడీపీ మద్దతు దారులైతేనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నాయి. ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నాయి. గ్రామాల్లో రాజకీయ అశాంతిని సృష్టిస్తున్నాయి. జన్మభూమి కమిటీల ఆగడాలపై ఇప్పటికే న్యాయస్థానాల్లో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. కమిటీ సభ్యుల దౌర్జన్యాలను కోర్టులు సైతం ఆక్షేపించి, అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసింది. ఈ కమిటీలే గ్రామాల పాలిట శాపంగా మారాయనుకుంటే ఇప్పుడా విధానాన్ని బూత్ స్థాయికి ప్రభుత్వం తీసుకెళ్తోంది. సాధికార మిత్ర పేరుతో కార్యకర్తల నియామకం స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)లోని తమకు అనుకూల మహిళలను సాధికార మిత్రలుగా నియమించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. 35 కుటుంబాలకొక మిత్ర చొప్పున నియమించాలని, నియమించేముందు ఎమ్మెల్యేను సంప్రదించి, జన్మభూమి కమిటీ ఆమోదం మేరకు నియామకం చేపట్టాలని నేరుగా ఆదేశించారు. ప్రజా సాధికారిత సర్వేలో చేసిన క్లస్టర్ల విభజన ఆధారంగా నియామకాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 17 లక్షల 83 వేల 145 కుటుంబాలున్నాయి. 35 కుటుంబాలకు ఒకరు చొప్పున జిల్లా వ్యాప్తంగా 50,947 మందిని సాధికార మిత్రలుగా నియమించనున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. గత నాలుగు రోజులుగా వీటి నియామకంలోనే అధికారులంతా నిమగ్నమయ్యారు. వీరిని ఎలా నియమించాలన్నదానిపై సదరు అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వీటిని సత్వరమే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టడంతో అధికారులంతా పరుగులు తీస్తున్నారు. ఎన్నికల దృష్టితోనే.. ఎన్నికల దృష్టిలో ఉంచుకుని సాధికార మిత్ర నియామకాలు చేపడుతున్నారు. తమకు అనుకూల మహిళలను మిత్రలుగా నియమించి, బూత్ స్థాయిలో పనిచేయించనున్నట్టు సమాచారం. వీరి ద్వారానే ఎన్నికల వ్యూహరచనలు చేయనున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతీదీ వారిచేత చేయించాలని, లోపాయికారీ కథ నడిపించాలని రాజకీయ ఎత్తుగడతో సాధికార మిత్రలను ఏర్పాటు చేస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. బయటికి మాత్రం ఆ 35 కుటుంబాలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన, ప్రచారం చేయడంతో పాటు సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా చెప్పుకొస్తున్నారు. కానీ లోపాయికారీ మర్మమైతే మాత్రం రాజకీయ లబ్ధిపొందడానికేనన్న వాదనలు విన్పిస్తున్నాయి. విశేషమేమిటంటే సాధికార మిత్ర నియామకాలని అధికారికంగా చెబుతుండగా...ఇటీవల వాటి నియామకాల ప్రగతిపై అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో మాత్రం బూత్మిత్ర నియామకాలు ఎంత వరకు వచ్చాయని, వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించడంతో అధికారులంతా అవాక్కయ్యారు. బయటికి సాధికార మిత్ర అని చెబుతున్నా...సీఎం మనసులో మాత్రం వారంతా బూత్ మిత్ర కార్యకర్తలే అన్న అభిప్రాయం ఉందనేది స్పష్టమయిందని అధికార వర్గాలు సైతం వాపోతున్నాయి. -
బిగ్ బీ లేటెస్ట్ ట్వీట్..!
సాక్షి, ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (75)మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘బిగ్ బీ ’ ఫాలోయర్స్ సంఖ్య ఎనిమిది కోట్లకు చేరుకుంది. స్వయంగా అమితాబ్ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. 80 మిలియన్ల ఫాలోయర్స్ అంటూ ఆయన ట్విట్ చేశారు. దీంతో ట్విట్టర్లో సందడి నెలకొంది. అటు అభిమానులు, ఇటు వివిధ వర్గాలకు పెద్దలు పలువురు అభినందలతో ముంచెత్తుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్ సినీ రంగానికి విశేష సేవలందించిన సీనియర్ నటుడు బిగ్ బికి ట్విట్టర్లో 31.7 మిలియన్లు, ఫేస్బుక్ లో 27,731,622 మంది, ఇన్స్టాగ్రామ్ లో 6.2 మిలియన్ల మంది పాలోయర్స్ ఉన్నారు. సోషల మీడియాలో తరచూ చురుగ్గా ఉండే అమితాబ్ ఖాతాలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌తో థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, రిషీకపూర్‌తో 102 నాట్ అవుట్ సినిమాల్ నటిస్తున్నారు. T 2737 - 80 MILLION followers !!! on social media .. collective !! 80 MILLION !! 80 MILLION !! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 pic.twitter.com/GL9j3oTfWT — Amitabh Bachchan (@SrBachchan) December 10, 2017 -
నలుగురు ఎస్కార్ట్ పోలీసుల సస్పెన్షన్
సాక్షి, యాదాద్రి/వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఖ్య అనుచరుడు పాశం శ్రీనివాస్‌కు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం సస్పెండ్ చేశారు. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అతడికి సహకరించిన పాశం శ్రీనివాస్‌పై పీడీ యాక్టు పెట్టి వరంగల్ సెంట్రల్ జైలుకు గత ఏడాది జూలైలో తరలించారు. 2016 జూలై 15న పీడీ యాక్టు నమోదు కాగా.. 2017 జూలై 14తో ముగిసి పోయింది. తాజాగా పోలీసుల ఫోన్‌తో జైలులో ఉన్న శ్రీనివాస్ తనను బెదిరించినట్లు బాధితులు రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్కార్ట్ పోలీసులు రమేష్, పాషా, రమేష్, లక్ష్మీనారాయణల సెల్ఫోన్లతో శ్రీనివాస్ కాల్స్ చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో వీరిపై కమిషనర్ సస్పెండ్ చేశారు. కాగా పాశం శ్రీనివాస్‌కు సహకరిస్తున్న అతని అనుచరులైన అందె సాయి కృష్ణ, అంగడి నాగరాజు, మెరుగు శివశంకర్, పులి శ్రీనివాస్, పాశం అమర్నా«థ్లపై కేసులు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇదిలాఉండగా.. పాశంను వరంగల్ సెంట్రల్ జైలులోని హైసెక్యూరిటీ బ్యారక్‌లో ఉంచినందున సెల్ఫోన్లు వినియోగించే అవకాశం లేదని జైలు అధికారులు చెబుతున్నారు. -
మలాల 'హాయ్' అనే పోస్టుకు అనూహ్యస్పందన
'హాయ్ ట్విట్టర్'.. కేవలం రెండు పదాల సింపుల్ పోస్టు. ఈ పోస్టుకు మైక్రోబ్లాగింగ్ సైట్లో అనూహ్య స్పందన వచ్చింది. రోజంతా ఈ హాయ్ ట్విట్టర్ అనే పదానికి ప్రతిస్పందనలు, ఫాలోవర్స్ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ సింపుల్ పోస్టు ఎవరు చేశారో తెలుసా? నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాల యూసఫ్‌జాయ్. నిన్ననే(శుక్రవారం) ఆమె ట్విట్టర్లో జాయిన్ అయ్యారు. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన మలాల, హాయ్ ట్విట్టర్ అని చెప్పి, బాలికల విద్యావ్యాప్తిగా మద్దతివ్వాలని కోరుతూ కొన్ని మెసేజ్‌లు చేశారు. ఆమె పిలుపుకు దాదాపు అంతర్జాతీయ అగ్రనేతలందరూ స్పందించారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ డ్రూడ్ నుంచి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ వరకు అందరూ మాలాలకు ట్విట్టర్లో ఘనస్వాగతం పలికారు. ట్విట్టర్ సైతం ఆమెకు అధికారికంగా స్వాగతం చెప్పింది. బాలికల విద్యకు ఆమె ప్రత్యేకమైన అంకితభావాన్ని, స్ఫూర్తిని అందిస్తుందని, మాలాలకు ట్విట్టర్లో వెల్కమ్ చెబుతూ ఆంటోనియా ట్వీట్ చేశారు. జస్టిన్ ట్రూడో కూడా మాలాల హైస్కూల్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసుకున్నందుకు శుభాకాంక్షలు చెప్పారు. విద్యకోసం తను చూపిస్తున్న తెగువ, అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. మలాల తనకు నిరంతరం స్ఫూర్తినందిస్తుందని బిల్‌గేట్స్ కూడా ట్వీట్ చేశారు. ఆమె అకౌంట్ క్రియేట్ చేసుకున్న 14 గంటల్లోనే 3,50,000 మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. 2012లో తాలిబన్ల చేతిలో దాడికి గురైన మలాల ప్రస్తుతం బాలికల విద్య కోసం పోరాటం సాగిస్తున్నారు. అతిచిన్నవయసులోనే ఆమె నోబెల్ శాంతి పురస్కారాన్ని కూడా పొందారు. Hi, Twitter. — Malala (@Malala) July 7, 2017 I welcome @Malala to Twitter, where she will bring her unique dedication and inspiration on behalf of girls' education. pic.twitter.com/Vwkr9qJAnb — António Guterres (@antonioguterres) July 7, 2017 Your bravery and commitment to education – both yours & others – is inspiring. Congratulations on graduating high school @Malala! — Justin Trudeau (@JustinTrudeau) July 7, 2017 -
దుమ్మురేపుతున్న అమెజాన్ సీఈవో ట్వీట్
లాస్ఏంజిల్స్: తరచూ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటే అమెజాన్ బాస్ తాజా ట్విట్‌తో దుమ్ము రేపుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బీజోస్ తనకు ఐడియాలు కావాలంటూ ట్వీట్ చేశారు. తన సంపాదనను దానం చేయాలనుకుంటున్నాననీ దీనికి సలహాలివ్వాంటూ ఫాలోయర్స్‌ను ఆహ్వానించారు. కోట్లాది రూపాయాలను విరాళం ఇవ్వాలనుకుంటున్నానని ప్రకటించారు. తాను ఇవ్వబోయే విరాళాన్ని ఖర్చు చేసేందుకు ఐడియాలు కావాలంటూ ఆ ట్వీట్లో కోరారు. ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే వేల రీట్వీట్లు, 10 వేల లైకులతో ట్విట్టర్ లో సంచలనంగా మారింది. సుమారు 15 వేల రిప్లయ్‌ల జోరు నడుస్తోంది. బ్లూఓరిజన్, వాషింగ్టన్పోస్ట్, అమెజాన్ సమాజంలో కోసం భారీ విరాళాలిస్తున్నప్పటికీ..తన ఆస్తుల్లో ఎక్కువ శాతం దానం చేయాలనుకుంటున్న జెఫ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన సొమ్ములో ఎక్కువ శాతం దానాలకే వినియోగిస్తానని.. కానీ ఇంకా చేయాలని కోరికగా ఉందన్నారు. అత్యవసరమైన, శాశ్వత ప్రభావాన్ని కలిగించేలా ప్రజలకు సహాయం చేయాలని అనుకుంటున్నానని దీనికి ఐడియాలు కావాలని చెప్పారు. ఒకవేళ ఇలా ప్రకటించడం తప్పనిపిస్తే.. ఆ విషయాన్ని కూడా నిర్మొహమాటంగా తనకు తెలియజేయాలని కోరారు. కాగా జెఫ్ బేజోస్ మొత్తం ఆస్తివిలువ సుమారు 76 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ బెజోస్ కుటుంబం ఇటీవల భారీ విరాళాన్ని అందించింది. వీరినుంచి 35 మిలియన్ డాలర్లను అందుకున్నట్లు రీసెర్చ సెంటర్ గత నెలలో ప్రకటించింది. 41 సంవత్సరాల తమ సేవల్లో ఇదే అతిపెద్ద సింగిల్ విరాళమని ప్రకటించడం విశేషం. Request for ideas… pic.twitter.com/j6D68mhseL — Jeff Bezos (@JeffBezos) June 15, 2017 -
ఫేస్ బుక్ లో ఆయనకే ఫాలోవర్స్ ఎక్కువ!
-
ఫేస్ బుక్ లో ఆయనకే ఫాలోవర్స్ ఎక్కువ!
న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో ఎక్కువగా ఫాలోఅయ్యే ప్రపంచ నాయకుల్లో దేశ ప్రధాని నరేంద్రమోదీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను వెనక్కి నెట్టేసి మరీ 4.17 కోట్ల ఫాలోవర్స్ తో మోదీ మోస్ట్ ఫాలోడ్ వరల్డ్ లీడర్ గా అవతరించారు. ఫేస్ బుక్ నేడు విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. ఇటీవల అమెరికాకు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పేజీ కన్నా, ప్రధాని నరేంద్రమోదీ అధికారిక ఫేస్ బుక్ పేజీకే ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నట్టు తెలిసింది. 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రచారం నిర్వహించినప్పటి నుంచి నరేంద్రమోదీకి బాగా పాపులారిటీ వచ్చింది. సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ విపరీతంగా పెరుగుతూ వస్తున్నారు. మే 2014లో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు 1.4 కోట్లు ఉన్న మోదీ ఫాలోవర్ల సంఖ్య ప్రస్తుతం 4.17 కోట్లకు చేరుకున్నట్టు ఫేస్బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకి దాస్ ప్రకటించారు. పెద్దనోట్ల రద్దు వంటి హఠాత్తు, విప్లవాత్మక చర్యలను గత ఆరు నెలల కాలంలో ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ, ఆయన ఫాలోవర్స్ ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. ఆయనకు విపరీతంగా ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారని చెప్పారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ వంటి ప్రచారాలు ప్రభుత్వం తీసుకుంటున్న అత్యంత ముఖ్యమైన క్యాంపెయిన్లుగా ఈ డేటా పేర్కొంది. మోదీ హవాతో 2014 ఎన్నికల్లో విజయఢంకా మోగించిన బీజేపీ, నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇటీవలే మూడేళ్ల పాలనను విజయవంతంగా పూర్తిచేసుకుంది. కేంద్రమంత్రులు రాజనాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, జనరవ్ వీకే సింగ్, పీయూష్ గోయల్, అరుణ్ జైట్లీలను కూడా ఎక్కువ మంది యూజర్లు అనుసరిస్తున్నారు. -
టీడీపీలో ఉంటే భవిష్యత్తు శూన్యం
– పార్టీని వీడాలని శిల్పాకు కౌన్సిలర్ల సూచన – త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తానన్న శిల్పా నంద్యాల: టీడీపీలో ఉంటే భవిష్యత్ ఉండదని.. పార్టీ మారాలని మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డికి టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు సూచించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి, మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. రాజకీయ భవిష్యత్‌పై మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి శిల్పా... సోమవారం ఇంట్లో సన్నిహితులతో రహస్య చర్చలు జరిపారు. మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ పీపీనాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచనతో పాటు 26మంది కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు ఆయనను కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, పార్టీ మారాలని పలువురు కౌన్సిలర్లు శిల్పాపై ఒత్తిడి తెచ్చారు.టీడీపీలో భూమా చేరినప్పటి నుంచి తమకు ప్రాముఖ్యత తగ్గిందని, కనీసం పింఛన్లను తెప్పించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో.. ఎంపీ ఎస్పీవైరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్ కూడా తమకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని..ఇంత మంది శత్రువుల మధ్య, మైనార్టీల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పార్టీలో ఉండటం సరికాదని.. తక్షణమే రాజీనామా చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొన్న శిల్పా..నాలుగైదు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ చర్చలపై విలేకరులు శిల్పాను ప్రశ్నించగా.. అప్పుడే తొందర ఎందుకని సమాధానాన్ని దాటవేశారు. -
సెలబ్రిట్వీట్స్
ఈ నెలలో ట్విట్టర్ బర్త్ డే ట్రంప్.. ట్విట్టర్ ప్రియుడు. మాట్లాడితే ట్విట్టర్లోకి వెళ్లి ఏదో ఒకటి ట్వీట్ చేస్తుంటారు. మనసులో ఏం ఉంచుకోరు! ఈ లెక్కన ట్విట్టర్లో ‘మోస్ట్ పాపులర్ లీడర్’ ట్రంపే అవ్వాలి కదా. కానీ కాదు! పూరి జగన్నాథ్ సినిమాల భాషలో చెప్పాలంటే.. ‘ఎన్ని ట్వీట్లు పెట్టారని కాదన్నయ్యా.. ఆ ట్వీట్లకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారన్నదే’ పాయింట్. ఆ లెక్కన ట్రంప్ కన్నా పాపులర్ లీడర్లు ఉన్నారు. ఈ నెలలో ట్విట్టర్ బర్త్ డే ఉంది. అంటే ఫౌండేషన్ డే. (లాంచ్ డే వేరే). ఈ సందర్భంగా ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉన్న దేశాధినేతలు, ట్విట్టర్లో వాళ్లెప్పుడు చేరారు? వాళ్లకు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు? వాళ్లు పెట్టిన ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. మీ కోసం. బరాక్ ఒబామా అమెరికా మాజీ అధ్యక్షుడు ఫాలోవర్స్: 8 కోట్ల 51 లక్షలు. చేరింది: 2007 మార్చి విక్టరీ ట్వీట్: This happend because of you. (నీ వల్లే.. నీ వల్లే..) ఆ ట్వీట్‌కి ఒబామా పెట్టిన ఫొటో ఇదే. నరేంద్ర మోదీ భారత ప్రధాని ఫాలోవర్స్ : 2 కోట్ల 74 లక్షలు. చేరింది : 2009 జనవరి విక్టరీ ట్వీట్ : India has won! (భారత్ గెలిచింది!) డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఫాలోవర్స్: 2 కోట్ల 57 లక్షలు చేరింది: 2009 మార్చి విక్టరీ ట్వీట్: such a beautiful and important evening! The forgotten men and women will never be forgotten again. We will all come together as never before. (ఎంత అందమైన, ప్రాముఖ్యమైన సాయంత్రం. నిరాదరణకు గురైనవారు మళ్లీ ఇక నిరాదరణకు గురికాకూడదు. మునుపెన్నడూ లేనంతగా మనం ఏకం అవుదాం.) హిల్లరీ క్లింటన్ అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి ఫాలోవర్స్: కోటీ 34 లక్షలు చేరింది: 2013 ఏప్రిల్ ఫేమస్ ట్వీట్: A man who can be provoked by a tweet should not have his hands anywhere near the nuclear codes. (ఒక్క ట్వీట్‌తో రెచ్చిపోయే మనిషికి అణ్వాయుధాలు అందుబాటులో ఉండకూడదు.) పోప్ ఫ్రాన్సిస్ రోమన్ క్యాథలిక్ చర్చి పోప్ ఫాలోవర్స్ : కోటీ 4 లక్షలు చేరింది : 2012 ఫిబ్రవరి ఫేమస్ ట్వీట్ : I cannot imagine a Christian who does not know how to smile. May we joyfully witness to our faith. (నవ్వడం ఎలాగో తెలియని క్రైస్తవుడిని నేను ఊహించలేకపోతున్నాను. మన విశ్వాసానికి ఉల్లాసం సాక్ష్యమవ్వాలి.) రెజీప్ తయ్యీప్ ఎర్డోగాన్ టర్కీ అధ్యక్షుడు ఫాలోవర్స్ : 90 లక్షల 90 వేలు చేరింది : 2009 ఆగస్టు ఫేమస్ ట్వీట్ : I don't like to tweet. It is a knife in the hand of a murderer. (ట్వీట్ చెయ్యడం నాకు ఇష్టం లేదు. అది హంతకుడి చేతిలో కత్తి లాంటిది.) షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్చూమ్ యు.ఎ.ఇ. ప్రధాని, ఉపాధ్యక్షుడు ఫాలోవర్స్: 70 లక్షల 50 వేలు చేరింది: 2009 జూన్ జెండర్ ట్వీట్: I salute all woman on International Women's Day. Every role a woman takes is sacred and deserves our appreciation and respect. (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ సెల్యూట్ చేస్తున్నాను. స్త్రీ నిర్వహించే ప్రతి బాధ్యతా పవిత్రమైనది; గుర్తింపును, గౌరవాన్ని పొందదగినదీ.) సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఫాలోవర్స్: 70 లక్షల 30 వేలు చేరింది: 2010 నవంబర్ విక్టరీ ట్వీట్: I was sworn as youngest ever Cabinet Minister in the country in 1977... 39 years back. (39 ఏళ్ల క్రితమే 1977లో అతి చిన్న వయసు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను.) జోకో విడూడూ ఇండోనేషియా అధ్యక్షుడు ఫాలోవర్స్: 70 లక్షలు చేరింది : 2011 సెప్టెంబర్ ఫేమస్ ట్వీట్: I don't mind being called a puppet. But I'm the puppet of the people. (నన్ను కీలుబొమ్మ అన్నా నేనేం పట్టించుకోను. నేను కీలుబొమ్మనే.. ప్రజల చేతుల్లో.) ఎరిక్ పెనా నియతో మిక్సికో అధ్యక్షుడు ఫాలోవర్స్: 60 లక్షల 20 వేలు చేరింది: 2007 మార్చి ఫేమస్ ట్వీట్ : I repeat what I told him in person: Mr.Trump, Mexico will never pay for the wall. (ఆయనకు ముఖాముఖి నేనేం చెప్పానో మళ్లీ చెప్తాను. ‘మిస్టర్ ట్రంప్, గోడ కట్టడానికి అయ్యే ఖర్చును మేము చెల్లించం’. క్రిస్టీనా ఫెర్నాండెజ్ డి కిష్నర్ అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు ఫాలోవర్స్: 40 లక్షల 80 వేలు చేరింది: 2010 ఏప్రిల్ బ్యాడ్ ట్వీట్: More than 1,000 participants at the event.. Are they all from the Campola and in it only for the lice and petloeum? (వెయ్యిమందికి పైగా ఈవెంట్‌కి వచ్చారు. వారంతో కంపోలా నుంచి, అది కూడా, లైస్ కోసం, పెట్రోలియం కోసం వచ్చారా?) క్రిస్టీనా.. చైనాలో పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి వారికి ఇంగ్లిష్ లెటర్ ‘ఆర్’ పలకడం రాదని.. కంపోరాను, కాంపోలా అనీ, రైస్‌ని లైస్ అనీ, పెట్రోలియంని పెట్లోలియం అనీ పలుకుతారనీ చేసిన ఈ ట్వీట్ ఆమె ఇమేజ్‌కు తగిన విధంగా లేదని విమర్శలు వచ్చాయి. జువాన్ మాన్యుయేల్ శాంటోస్ కొలంబియా అధ్యక్షుడు ఫాలోవర్స్: 40 లక్షల 80 వేలు చేరింది: 2009 ఆగస్టు ఇన్స్పైరింగ్ ట్వీట్:I congratulate Gabriela for getting 5 on her home work! So Colombia with better education. Our Gabriela and the country does not stop. (హోమ్‌వర్క్‌లో 5 మార్కులు సాధించిన గాబ్రియేలాకు అభినందనలు. కొలంబియా కూడా చదువులో ఇలాగే మెరుగవ్వాలి. గాబ్రియేలా, కొలంబియా ముందుకు సాగాలి.) మెట్టెయో రెంజీ ఇటలీ మాజీ ప్రధాని ఫాలోవర్స్: 20 లక్షల 90 వేలు చేరింది: 2009 జనవరి అందమైన ట్వీట్: Birthday special for a woman who the Italy loves. Happy birthday to Sophia Loren, four times twenty years old. (ఇటలీ ఎంతగానో ప్రేమించే స్త్రీకి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగు ‘ఇరవై ఏళ్ల’ సోఫియా లోరెన్‌కు హ్యాపీ బర్త్‌డే.) జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని ఫాలోయర్స్: 20 లక్షల 90 వేలు చేరింది: 2008 మార్చి పొలిటికల్ ట్వీట్ : Last week I challenged leaders in politics and business to do more for the middle class and help build a better world together. (మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి, మెరుగైన ప్రపంచ నిర్మాణానికి మనమంతా కలసికట్టుగా ఇంకా ఏదైనా చెయ్యాలని గతవారం నేను రాజకీయ, వ్యాపార రంగాలలోని నాయకులకు పిలుపునిచ్చాను.) డేవిడ్ కామెరాన్ యు.కె. మాజీ ప్రధాని ఫాలోవర్లు: 10 లక్షల 60 వేలు చేరింది: 2008 మార్చి ట్వీట్ : My best wishes to British Sikhs celebration the birth of Guru Nanak Dev. You help make Britain a brighter, better and more successful nation. (గురునానక్ జయంతిని జరుపుకుంటున్న బ్రిటన్‌లోని సిక్కులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్రిటన్ ఒక ఉజ్వలమైన, మెరుగైన, విజయవంతమైన దేశంగా ఎదగడంలో మీ తోడ్పాటు ఉంది.) నికోలాస్ సర్కోజీ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫాలోవర్స్: 10 లక్షల 50 వేలు చేరింది: 2012 ఫిబ్రవరి బెస్ట్ ట్వీట్: New life, new challenges! You're going to love it! I wish you the best, Dear. (కొత్త జీవితం, కొత్త సవాళ్లు! వాటిని ప్రేమగా స్వీకరించబోతున్నావు. శుభాకాంక్షలు ప్రియతమా.) ఒబామాను ఉద్దేశించి. దిమిత్రీ మెద్వెదెవ్ రష్యా ప్రధాని ఫాలోవర్స్: 10 లక్షల 10 వేలు. చేరింది: 2010 జూన్ ట్వీట్: silicon Valley's greatest asset is communication. People discuss their work not trifles. Russia would benefit from this kind of environment. (సిలికాన్ వ్యాలీకి ఉన్న గొప్ప సంపద.. సమాచార వ్యవస్థ. అక్కడివారు పని గురించి మాట్లాడతారు తప్ప, నిష్ప్రయోజనకరమైన విషయాలను చర్చించరు.) -
బెజవాడలో రాయపాటి అనుచరుల వీరంగం
విజయవాడ: విజయవాడ నగరంలోని బెంజి సర్కిల్లో నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అనుచరులు వీరంగం సృష్టించారు. మంగళవారం ఉదయం రాయపాటి అనుచరులు ప్రయాణిస్తున్న కారు, ఓ బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న నాగభూషణం అనే వ్యక్తిపై వారు దాడికి చేశారు. పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. -
మళ్లీ తెరమీదకు నయీం అనుచరులు
-
నెహ్రూ అనుచరుల జులం!
– అంతర్గత విభేదాలతో కల్వర్టు తొలగించే యత్నం – అడ్డుకున్న అపార్టుమెంట్ వాసులకు బెదిరింపులు – బాధితులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే వంశీ మోహన్ రామవరప్పాడు : ఒక అపార్టుమెంట్‌కు చెందిన కల్వర్టును మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) అనుచరులు శుక్రవారం అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చేందుకు యత్నించడం వివాదాస్పదమైంది. ఎనికేపాడు బీవీరావు కల్యాణ మండపం సమీపంలోని పవన్ క్లాసిక్ అపార్టుమెంట్ వాసులు రాకపోకలు సాగిచేందుకు కాలువపై నిర్మించుకున్న కల్వర్టును నెహ్రూ అనుచరులు పది మంది పొక్లెయిన్‌తో ధ్వంసం చేయడానికి యత్నించారు. అక్కడికి వచ్చిన అపార్టుమెంట్వాసులను అడ్డుకుంటే అంతు చూస్తామంటూ బెదిరించారు. పొక్లెన్తో కల్వర్టుకు రెండు వైపులా ఉన్న గోడలను ధ్వంసం చేశారు. కల్వర్టరు తొలగిస్తే అపార్టుమెంట్లో ఉంటున్న 57 కుటుంబాలు రాకపోకలు సాగించడం కష్టమని అపార్టుమెంట్ వాసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. చివరకు నెహ్రూ అనుచరులు వెనుక్కు తగ్గారు. అంతర్గత విభేదాలే కారణమా? నెహ్రూ టీడీపీలో చేరకముందు ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. నెహ్రూ టీడీపీలో చేరాక ఆ ఇంటర్వ్యూ వీడియో ఫేస్బుక్, వాట్సప్‌లో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోను వపన్ క్లాసిక్ అపార్టుమెంట్ బిల్డరు ఫేస్బుక్లో షేర్ చేసి కామెంట్ పెట్టడంతో కల్వర్టు ధ్వంసానికి నెహ్రూ అనుచరులు ప్రయత్నించారన్న ప్రచారం జరుగుతోంది. తమ నేత టీడీపీలో చేరిన తరువాత అపార్టుమెంట్ ఎదురుగా శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్ ఏర్పాటు చేయాలని నెహ్రూ అనుచరులు బిల్డర్‌కు హుకుం జారీచేసినా అతను నిర్లక్ష చేశారన్న ప్రచారం జరుగుతోంది. అపార్టుమెంట్ నిర్మించేటప్పుడు బిల్డర్‌ను నెహ్రూ డబ్బు డిమాండ్ చేశారని, అయితే డబ్బు ఇవ్వనందున ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మరి కొందరు విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు ఫిర్యాదుచేస్తా : ఎమ్మెల్యే వంశీ తన నియోజకవర్గంలో నెహ్రూ వర్గం చేసిన అరాచకాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ శనివారం ఎనికేపాడు వచ్చి అపార్టుమెంట్వాసులతో మాట్లాడారు. అంతర్గత విభేదాల కారణంగానే నెహ్రూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు. లారీ డ్రైవర్లే కూల్చారు : అన్నే చిట్టిబాబు ఈ ప్రాంతంలో నెహ్రూకు సొంత గోదాములు ఉన్నాయని నెహ్రూ అనుచరుడు, కానూరు మాజీ సర్పంచి అన్నే వేణుగోపాల కృష్ణమూర్తి (చిట్టిబాబు) పేర్కొన్నారు. వాటి వద్దకు లారీలు వెళ్లకుండా అపార్టుమెంట్ వాసులు, బిల్డరు తమ కార్లు అడ్డంగా నిలిపి దారి ఇవ్వడం లేదన్నారు. ఈ రోడ్డును నెహ్రూ రూ.1.50 కోట్లతో అభివృద్ధిచేశారని పేర్కొన్నారు. దారికి కార్లు అడ్డుపెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా విననందునే నివిసిగిపోయిన లారీ డ్రైవర్లు కల్వర్టును ధ్వంసం చేశారని చెప్పారు. రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణంపై సీఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. -
నయీం కేసులో పలువురికి కస్టడీ
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన నయీం అనుచరులను విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. తాజాగా చర్లపల్లి జైల్లో ఉన్న నయీం అనుచరులు సమీరుద్దీన్, శ్రీధర్‌గౌడ్‌లను 9 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా సంజీవ్‌రెడ్డి, శ్రీహరిలకు నాలుగు రోజులు, అబ్దుల్ ఫహీం, సామ్యూల్‌లకు రెండు రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
పేరు పేదలది.. పెత్తనం పెద్దలది
పేదలకు పట్టాలు.. ఎమ్మెల్యే అనుచరుని చేతిలో భూమి 13 ఏళ్లుగా పేదలకందని ఇంటి స్థలం కలగానే మిగిలిన సొంతిల్లు సుందరపల్లి (కె.గంగవరం) : ‘మేం ఏం చెబితే అదే జరుగుతుంది. స్థలం కావాలని అడిగితే ఖబడ్దార్. ..మేం ఇచ్చినప్పుడే తీసుకోండి.’ ఇదీ అధికార పార్టీ నేత హుకుం. నియోజకవర్గంలోని కె. గంగవరం మండలం సుందరపల్లిలో స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అనుచరుని అరాచకాలకు నిలువుటద్దం పడుతోందీ సంఘటన. 13 ఏళ్లుగా దేవస్థానం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు యథేచ్ఛగా పండించుకుంటున్నప్పటికీ అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సుందరపల్లిలోని శ్రీసోమేశ్వరస్వామి దేవస్థానికి చెందిన సుమారు రెండు ఎకరాల భూమిని 2003లో గ్రామంలోని కొంత మందికి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సేకరించింది. 70 సెంట్ల భూమిని ఎస్సీలకు, 120 సెంట్ల భూమిని ఓసీలకు కేటాయిస్తూ అప్పటి తహసీల్దార్ లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. పట్టాలిచ్చారు గానీ ఆభూమిని మాత్రం ఇప్పటికీ వారికి అప్పగించలేదు. దేవస్థానం భూమిని ప్రభుత్వం సేకరించటంతో దేవస్థానం అధికారులు ఆ పంట భూమికి వేలం కూడా నిర్వహించలేదు. ఆ భూమిని ప్రభుత్వం మెరక చేసి పట్టాదారులకు అప్పగించాలి. కానీ ఆ విధంగా జరగలేదు. ప్రభుత్వం దేవస్థానం భూమిని సేకరించిందని చెప్పి గ్రామానికి చెందిన ఆ నేత ఆ భూమిని తన ఆధీనంలోనికి తీసుకున్నాడు. 13 ఏళ్లుగా సుమారు 2 ఎకరాల భూమిని తన అనుచరులతో సాగు చేయిస్తూ మగతాలు పొందుతున్నాడు. చేను వృథాగా ఉందని సాగు చేస్తున్నామని, వచ్చిన పంటను దేవుడి కోసంS ఖర్చు చేస్తున్నామని ఆయన కబుర్లు చెబుతున్నాడు. ఎవరైనా ఇదేమని అడిగినా, జమా ఖర్చులు చెప్పాలన్నా వారిపై దాడులు చేయిస్తూ తనమాటే చెల్లుబడి చేసుకుంటున్నాడు. ఇప్పటికైనా రెవెన్యూ, దేవస్థానం అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని తమకు అందజేసి న్యాయం చేయాలని పట్టాదారులు కోరుతున్నారు. -
‘సాక్షి’ విలేకరులపై దాడి
ఏలూరు, సాక్షిప్రతినిధి : సాక్షి మీడియా విలేకరులపై దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి యత్నించారు. కెమేరాలు, సెల్ఫోన్లు లాక్కున్నారు. తొలుత పెదవేగి మండలం బి.శింగవరంలోని తమ్మిలేరు సమీపంలో బుధవారం వనం–మనం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక కార్యకర్త ఒకరు చింతమనేనిని నిలదీయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన కార్యకర్తపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో సాక్షి మీడియా జిల్లా సిబ్బంది ఆ ఘటనను చిత్రీకరించేందుకు శింగవరం గ్రామానికి బుధవారం సాయంత్రం వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని గ్రామంలో ఉన్న తన అనుచరులైన చింతమనేని సతీష్, మరో 30 మందిని రంగంలోకి దింపారు సాక్షి సిబ్బందిపై దాడికి యత్నించారు. అంతే కాకుండా వెంటపడి సిబ్బంది వద్దనున్న కెమేరాలు, సెల్ఫోన్లు, టీవీ చానల్‌కు సంబంధించిన చిప్‌లను సైతం లాక్కున్నారు. అతి కష్టమ్మీద ఏలూరు చేరుకున్న సిబ్బంది ఈ ఘటనపై డీఐజీ, ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు. -
ఇద్దరు నయీమ్ అనుచరుల అరెస్టు
జగిత్యాల అర్బన్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు ఇద్దరిని బుధవారం కరీంనగర్ పోలీసులు కోరుట్లలో అరెస్టు చేశారు. వీరిని జగిత్యాల కోర్టుకు తీసుకొచ్చి ప్రిన్సిపల్ జడ్జి మధు ఎదుట హాజరుపరిచారు. జడ్జి నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. వారిని కరీంనగర్ జైలుకు తరలించారు. మంథని మండలం సోమన్పల్లికి చెందిన పోరబోయిన రమే శ్ ఉరఫ్ రాంబాబు, కరీంనగర్ మండలం నగునూర్‌కు చెందిన గోవర్ధనాచారి నయీమ్‌కు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. వీరు కోరుట్లకు చెందిన ప్రముఖ బీడీ కంపెనీ నిర్వాహకుడు రఫూఫ్‌ను బెదిరించడంతోపాటు కిడ్నాప్‌కు పాల్పడి డబ్బులు డిమాండ్ చేశారు. రఫూఫ్ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రమేశ్, గోవర్ధనాచారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు, రూ.1.50 లక్షలు, 5 రౌండ్ల బుల్లెట్ గన్, ఒక విదేశీ రివాల్వర్ స్వాధీ నం చేసుకున్నట్లు వివరించారు. -
అనుచరుల రిమాండ్
యాదగిరిగుట్ట: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరులు నలుగురిని నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. నÄæూం ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు చేపట్టగా యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన భట్రాజ్, ముని, సంతోష్, సతీష్‌ల వద్ద మారణాయు«ధాలు దొరికాయని దీంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు గుట్ట ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. విచారించి కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. -
సిట్ అదుపులో నలుగురు..
కరీంనగర్ క్రైం: నయీమ్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో కరీంనగర్, తిమ్మాపూర్ మండలాలకు చెందిన నలుగురిని సిట్ అదుపులోకి తీసుకుందని, వీరిలో ఇద్దరు నయూమ్ సామాజిక వర్గానికి చెందినవారని సమాచారం. వారిని విచారించగా.. కరీంనగర్, తిమ్మాపూర్ మండలాల్లో మరో 10 మంది వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. నగరానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో రియల్టర్‌గా అవతారమెత్తి పలు భూముల క్రయవిక్రయాలు జరిపాడని, వీటన్నింటిలో నయీమ్ పేరునే వాడుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అరుుతే నయూమ్ ఎన్కౌంటర్ తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని, సెల్‌ఫోన్‌ను మిత్రుల వద్ద ఉంచి వెళ్లాడని తెలిసింది. -
‘అనుచరుల’ అరాచకాలు ఎన్నెన్నో..!
ఆలస్యంగా వెలుగు చూస్తున్న నయీమ్ గ్యాంగ్ ఆగడాలు ఇబ్రహీంపట్నం రూరల్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రంలో అతని బారిన పడిన బాధితులు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. ఇన్నాళ్లుగా నయీమ్ అరాచకాలకు అధికార, రాజకీయ పక్షాల మద్దతు ఉండడంతో అతని అనుచరుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. పిక్నిక్ల పేరుతో స్త్రీలు.. చిన్న పిల్లలను తీసుకు రావడం.. భూములు చూడడం.. మరుసటి రోజే ఆ భూముల కబ్జాకు పన్నాగం పన్నడం అతడి అనుచరుల పని. భూమి ఎవరిదైనా కాజేయడమే పనిగా పెట్టుకున్నారు. ఎక్కువ మాట్లాడితే చస్తావా.. భూమి ఇస్తావా అంటూ తుపాకులు పెట్టి భయాభ్రాంతులకు గురి చేసేవారు. ‘‘వ్యవసాయం చేసుకుని బతికేటోళ్లం.. మా భూములపై పడొద్దు.. మీకు దండం పెడ్తాం’’ అన్నా కనికరించే వారు కాదు. ప్రభుత్వాధికారులు, పోలీసుల అండదండలతో కబ్జా రాజ్యాలకు తెరతీశారు. నయీమ్ బతికి ఉన్నన్ని రోజులు కోట్ల విలువ చేసే భూములపై కన్నేసి కబ్జా చేసి తమను తీవ్ర ఇబ్బందులు పెట్టారని రైతులు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్ల గ్రామంలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న భూములపై నయీమ్ అనుచరులు కన్నేశారు. వివాదంలో ఉన్న స్థలాలు కొనుగోలు చేసి పక్కన ఉన్న రైతులను ఇబ్బంది పెట్టేవారు. ఆదిభట్లలో బురుగు పెద్ద వెంకట్‌రెడ్డి, చిన్న వెంకట్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డికి చెందిన సర్వే నంబర్ 490, 410లో 8 ఎకరాల భూమి ఉందని చాలా రోజులుగా వారిని చిత్రహింసలకు గురి చేశారు. 2013 నుంచి ఇప్పటి వరకు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. నయీం ప్రధాన అనుచరులుగా చెప్పుకుంటున్న సామ సంజీవరెడ్డి, శ్రీహరి, అడ్వొకేట్ తులసీదాస్ తమను చిత్రహింసలకు గురి చేశారని రైతులు వాపోయారు. చాలామందిని వీరి వల్ల ఇబ్బందులు పడ్డారని.. త్వరలో వారంతా బయటకు వస్తారని చెప్పారు. -
నయీం అనుచరులు రిమాండ్
-
దోచిపెట్టేందుకే బాబు ప్యాకేజీ జపం
– పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డోన్: తనతో పాటు అనుచరులకు దోచి పెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్యాకేజీ జపం చేస్తున్నారని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపులో భాగంగా మంగళవారం కర్నూలు జిల్లా డోన్‌లో చేపట్టిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో కుండబద్ధలు కొట్టిన తర్వాత కూడా చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ బురద నుంచి బయటపడేందుకు కేంద్రానికి ఊడిగం చేస్తున్నాడన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన ఆయన నేడు హోదా విషయంలోనూ తన అసలు స్వరూపం బయట పెట్టాడన్నారు. ఎన్నికలకు ముందు 15ఏళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ కావాలని డిమాండ్ చేసిన బాబు.. ఇప్పుడు ఆ మాట విస్మరించి మాట్లాడటం శోచనీయమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివద్ధి హోదాతోనే సాధ్యమనే విషయాన్ని ముఖ్యమంత్రితో పాటు ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. హోదా కోసం పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. -
షాద్‌నగర్ ఎమ్మెల్యే అనుచరులు వీరంగం
-
అధికారులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య అయితపూడి (కాజులూరు) : ప్రభుత్వాధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఆరోపించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు, జిల్లా టెలికాం అడ్వైజరీ‡బోర్డు సభ్యుడు దూడల శంకరనారాయణమూర్తి ఆధ్వర్యంలో అయితపూడిలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాలకొండయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాలకొండయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం 40కి పైగా కొత్తపథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వివిధ రూపాల్లో కోట్లాది రూపాయలను విడుదల చేసిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా మోదీ మార్కు కనపడకుండా చేసి తెలుగుదేశం నాయకులు అవి తమ పథకాలుగా చెప్పుకుంటున్నారన్నారు. పథకాల పంపిణీలోనూ అధికారులు ప్రజలకు వాస్తవాలు తెలపకుండా అధికారపార్టీ నాయకులు సూచించిన వారినే అర్హులుగా ఎంపికచేస్తున్నారని ఆరోపించారు. వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి బీజేపీలో చేరిన 25 మందికి మాలకొండయ్య తదితర నేతలు కండువాలుకప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. పార్టీ జిల్లా కిసాన్‌మోర్చా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి రామరాజు, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, మండల కార్యదర్శి యాళ్ళ వీరాంజనేయసతీష్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు తలాటం శ్రీనివాసు పాల్గొన్నారు. -
మహిళా కాంగ్రెస్ బలోపేతమవ్వాలి
హైదరాబాద్: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి వారితో మమేకం కావాలని, అప్పుడే పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని టిపిసిసి కార్య నిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోను, మైనారిటీ సెల్ సమావేశంలో పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళా కాంగ్రెస్‌ను సంస్థాగతంగా కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్ధాయితలో కమిటీలు ఉండాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలతో మహిళా కాంగ్రెస్ బలోపేతం కావాలని అన్నారు. మహిళా కాంగ్రెస్ నిర్మాణానికి సంబంధించిన సమాచారంతో ఎఐసిసి లేఖ రాయాలని ఆయన తెలిపారు. మరో వైపు గ్రామ స్థాయి నుంచి మైనారిటీ సెల్‌ను బలోపేతం చేయాలని, మండల స్థాయి నుంచి రాష్ర్ట స్థాయి వరకు కమిటీలను పూర్తి చేయాలన్నారు. సమస్యలపై వెంటనే స్పందించాలన్నారు. -
రెచ్చిపోతున్న తెలుగు తమ్ముడు..
- రియల్టర్లపై పెత్తనం విజయనగరం: అధికార పార్టీ అండదండలున్నాయంటూ ఓ తెలుగు దేశం కార్యకర్త రెచ్చిపోతున్నాడు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రియల్టర్లు, వ్యాపారులను బెదిరిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. గాజులరేగ ప్రాంతానికి చెందిన నడిపిల్లి రవికుమార్ అనే తెలుగుదేశం సీనియర్ కార్యకర్త జిల్లా కేంద్రంలోని పలువురు వ్యాపారులపై పెత్తనం ప్రదర్శిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. జేఎన్టీయూ సమీపంలోని శుభకరి రియల్ ఎస్టేట్ పేరుతో పెంటపాటి సురేష్ కుమార్ అనే వ్యాపారి లే ఔట్ వేశారు. ద్వారపూడి రెవెన్యూలోని సర్వే నంబర్లు 78-2, 99-3లలో 21.50 ఎకరాలను రియల్టర్ కొనుగోలు చేశారు. ఇందులో 15.50 ఎకరాల్లో లే ఔట్ వేశారు. దీనికి ముఖద్వారం నిర్మించే సమయంలో రియల్టర్ ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని గతంలో నడిపిల్లి రవికుమార్ తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు సర్వే చేపట్టి ఆక్రమణలున్నాయని ప్రకటించారు. దీనిపై రియల్టర్ సురేష్‌కుమార్ ఆర్డీఓకు అప్పీల్ చేసుకున్నాడు. వాస్తవానికి 30 రోజుల గడువు ఇవ్వాల్సి ఉన్నా అధికారులు ఐదు రోజుల్లోనే ముఖద్వారం కూలగొట్టడంతో బాధితుడు రెవెన్యూ మంత్రి, సీసీఎల్‌ను ఆశ్రయించాడు. దీనిపై సీసీఎల్ఏ కలెక్టర్, ఆర్డీఓలకు నోటీసులిచ్చింది. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నంత వరకూ స్టేటస్ కో ఇచ్చింది. అయితే టీడీపీ నాయకుడు నడిపిల్లి రవికుమార్ ఇవేమీ పట్టించుకోకుండా తనను బెదిరిస్తున్నాడని సురేష్‌కుమార్ ఆరోపించారు. ఇప్పటికే తన వద్ద నుంచి లక్షలాది రూపాయలు తీసుకున్నాడని, ఇంకా డబ్బుకోసం తనను వేధిస్తున్నాడని ఇతని తీరుతో రియల్టర్లందరూ ఇబ్బంది పడుతున్నారన్నారు. త్వరలో ఇతనిపై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపారు. -
గాజువాక ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
ఎమ్మెల్యే మనుషులనే ఆపుతారా.. ఏయ్.. ఉద్యోగాలు ఊడతాయ్ ఫూటుగా తాగి కానిస్టేబుళ్లను బండబూతులు తిడుతూ చిందులు ఒకరిపై చేయిచేసుకున్న వైనం అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ సిటీ: ‘ఏయ్..మేమెవరమో తెలుసా? ఎమ్మెల్యే మనుషులనే ఆపుతారా? మీరేమనుకుంటున్నారు మా గురించి. ఉద్యోగాలు ఊడతాయి’ అంటూ బుధవారం అర్ధరాత్రి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అనుచరులు వీరంగం చేశారు. పూటుగా తాగి కారును మితిమీరిన వేగంతో నడపడమే కాక ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులను బూతులు తిట్టారు. వైద్య పరీక్షల కోసం వారిని ఎలాగోలా ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులపై కూడా చిందులు వేశారు. ఎట్టకేలకు పోలీసు స్టేషన్‌కి తరలించి పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, దాడి, బహిరంగ ప్రదేశంలో అనుచితంగా ప్రవర్తించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విశాఖపట్నానికి చెందిన తారక లింగేశ్వరరావు అలియాస్ తారక్ ఆరు నెలలుగా విజయవాడలోని కరెన్సీనగర్‌లో ఉంటూ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టులు చేస్తున్నాడు. ఇతని స్నేహితుడైన జె.కృష్ణ మూడు రోజుల కిందట అమెరికా నుంచి నగరానికి వచ్చాడు. బుధవారం అర్ధరాత్రి వరకు వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. రాత్రి 1.30 సమయంలో హెల్త్ యూనివర్సిటీ వైపు నుంచి బెంజిసర్కిల్ వైపు సర్వీసు(ఫీడర్) రోడ్డులో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరిట ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఎ.పి. 09సిఎస్ 0610 వోక్స్ వ్యాగన్ కారులో అతివేగంగా అడ్డదిడ్డంగా వెళుతున్నారు. ఇది గమనించిన మాచవరం పోలీసుస్టేషన్ బీటు కానిస్టేబుళ్లు ఆపేందుకు ప్రయత్నించారు. ఆపకుండా వెళుతూ రమేష్ ఆస్పత్రి జంక్షన్లో లారీ అడ్డురాగా కారును ఆపారు. వెంబడించిన పోలీసులు వివరాలు అడుగుతుండగా బండ బూతులు తిడుతూ నెట్టేసి ముదుకు వెళ్లిపోయారు. దీంతో బీటు కానిస్టేబుళ్లు కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించారు. అప్రమత్తమైన రాత్రి గస్తీ పోలీసు అధికారులు పిన్నమనేని పాలీక్లినిక్ వద్ద కారును నిలువరించారు. కిందకు దిగిన ఇద్దరు యువకులు అక్కడికి చేరుకున్న పోలీసు అధికారులపై బూతు పురాణం లంకించుకున్నారు. ఓ కానిస్టేబుల్‌పై చేయికూడా చేసుకున్నట్టు తెలిసింది. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తే వైద్యులపై కూడా చిందులు వేశారు. చివరకు వీరు అతిగా మద్యం సేవించినట్టు సర్టిఫికెట్ తీసుకొని మాచవరం పోలీసు స్టేషన్‌కి తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి వీరిని అరెస్టుచేశారు. తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.