
ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత అభిమానుల సంఖ్య కోటిన్నరకు చేరింది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు సమంత. ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉంటారామె. వ్యాయామం చేస్తున్న ఫొటోలు, ఫొటోషూట్‌లు, బ్యూటీ సీక్రెట్స్, గార్డెనింగ్ వంటి అంశాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒకటి షేర్ చేస్తూనే ఉంటారు. ఇలా 15 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడంపై సమంత మాట్లాడుతూ ‘‘షూటింగ్‌లో బిజీగా ఉన్నా. ఉన్నట్టుండి... 15 మిలియన్స్ కొట్టేశాం అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ప్రతీ ఒక్కరికీ చాలా థ్యాంక్స్. మీ ప్రేమే నన్ను మరింత కష్టపడేలా చేస్తుంది’’ అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment