
సమంత మీద ప్రేక్షకుల అభిమానం సోషల్ మీడియాలో ప్రేమలా కురుస్తోంది. ఫొటోషేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కొత్త మైలురాయిని చేరుకున్నారామె. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోయర్స్‌ను సంపాదించారు. 12 మిలియన్లు అంటే కోటీ ఇరవై లక్షల మంది. ‘12 మిలియన్ల ప్రేమ’ అని ఈ సందర్భంగా సమంత పేర్కొన్నారు.
సారీ రకుల్... బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి పోలీసుల కస్టడీలో ఉన్నారు. డ్రగ్స్ తీసుకున్నవారిలో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారని ఆమె చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే డ్రగ్స్ తీసుకుంటున్న నటులు వీరే అని రియా చక్రవర్తి ఓ లిస్ట్ ఇచ్చిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని యన్‌సీబీ డైరెక్టర్ కేపీయస్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఈ వార్తను షేర్ చేసి, ‘సారీ రకుల్, సారీ సారా’ (నిజానిజాలు తెలియకుండా అందరూ రకుల్, సారాలను తప్పుగా అర్థం చేసుకున్నారనే ఉద్దేశంతో) అని ఓ పోస్ట్ పెట్టారు సమంత.
Comments
Please login to add a commentAdd a comment