Samantha Ruth Prabhu Latest Cryptic Instagram Post Viral On Social Media - Sakshi
Sakshi News home page

Samantha: సమంత మళ్లీ ప్రేమలో పడిందా.. ? ఆ పోస్ట్‌ అంతరంగమేమిటో..?

Published Wed, Oct 12 2022 11:47 AM | Last Updated on Wed, Oct 12 2022 1:11 PM

Samantha Latest Instagram post Goes Viral - Sakshi

సంచలన తారల్లో సమంత ఒకరని వేరే చె ప్పాల్సిన అవసరం ఉండదు. బోల్డ్‌  బ్యూటీ అయిన ఈ అమ్మడు నిత్యం వార్తల్లో ఉంటారు. నటుడు నాగచైతన్యతో జత కట్టిన తొలి చిత్రంతోనే ఆయన ప్రేమలో పడి పెళ్లి కూడా చేసేసుకున్నారు. అయితే వారి వివాహ బంధం ముచ్చటగా మూడేళ్లే సాగిందని చెప్పాలి. ఆ తరువాత అభిప్రాయ భేదాలతో దూరమయ్యారు. తాజాగా నటుడు నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారని, నటి సమంత కూడా అలాంటి ఆలోచనలోనే ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇలాంటి ప్రచారానికి తావిచ్చే విధంగా నాగచైతన్య కంటే సమంత చేసే రచ్చే ఎక్కువగా ఉంటోంది.

(చదవండి: రివర్స్‌ గేర్‌లో వచ్చి..స్టార్స్‌ అయ్యారు)

ఇటీవల ఆమె సోష ల్‌ మీడియాకు కాస్త దూరంగా ఉన్నా.. మళ్లీ తన పంథా ను కొనసాగిస్తున్నట్లు కనిపి స్తోంది. అందుకు కారణం ఇటీవల ఆమె సా మాజిక మాధ్యమా ల్లో  టీ షర్టు మా త్రమే తెలిసేలా ఓ ఫొటోను పోస్ట్‌ చేశా రు. ఆ టీ షర్ట్‌పై యు విల్‌ నెవర్‌ వాక్‌ అలోన్‌(నువ్వు  ఎప్పటికీ ఒంటిరిగా ప్రయాణం చేయలేవు) అనే పదాలు చోటు చేసుకున్నాయి. దీంతో నెటిజన్లు అసలు నీ అంతరంగం ఏమిటి అంటూ ఓ రేంజ్‌ లో ఆటాడుకుంటున్నారు.

సమంతకు ఒంటరి జీవితం భారంగా మారిందా? వెరొకరితో రిలేషన్‌లో ఉందా? మళ్లీ పెళ్లికి సిద్ధమవుతోందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ఆమె నటించిన మరో చారిత్రక కథా చిత్రం శాకుంతలం కూడా షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం విజయ్‌ దేవర కొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement