Samantha Latest Cryptic Post Shows You Will Never Walk Alone Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha : 'నువ్వెప్పటికీ ఒంటరిగా ప్రయాణం చేయలేవు'.. సమంత పోస్ట్‌ వైరల్‌

Published Tue, Oct 11 2022 11:32 AM | Last Updated on Tue, Oct 11 2022 2:16 PM

Samantha Latest Post Shows You Will Never Walk Alone Goes Viral - Sakshi

మొన్నటి వరకు సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న సమంత మళ్లీ యాక్టివ్‌గా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా క్రేజీ పోస్ట్‌ షేర్‌ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. తన టీషర్ట్‌పై ఉన్న కోటేషన్‌ కనిపించేలా ఓ పిక్‌ను షేర్‌ చేసింది. నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయలేవు అని అర్థం వచ్చేలా ఆ టీషర్ట్‌పై రాసి ఉంది. అయితే సమంత ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్‌ చేసిందన్నదానిపై ఆమె క్లారిటీ ఇవ్వకపోయినా నెటిజన్లు మాత్రం​ రకరకాలుగా ఊహించుకుంటున్నారు.

కొంతకాలంగా సోషల్‌ మీడియాలో సైలెంట్‌గా ఉన్న సమంత తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తుంది. వెనక్కి తగ్గాను కానీ ఓడిపోలేదు అంటూ ఓ పోస్టును షేర్‌ చేసిన సమంత ఇప్పుడు నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయలేవు అని చైతూని ఉద్దేశించే పోస్టు చేసిందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం చై పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి ఓ హీరోయిన్‌తో డేటింగ్‌ చేస్తున్నాడంటూ పుకార్లు తెరమీదకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సామ్‌ ఇలా ఇండైరెక్ట్‌ సెటైర్స్‌ వేస్తుందా అన్నట్లుగా ఆమె పోస్టులు షేర్‌ చేస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సామ్‌ యశోద, శాకుంతలంతో పాటు విజయ్‌ సరసన ఖుషి అనే సినిమాలో నటిస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement