టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే హన్నీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జోడీగా కనిపించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సామ్ ఇటీవల మరోసారి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్య- శోభిత పెళ్లి తర్వాత ఆమె చేసిన పోస్ట్‌పై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
కానీ అంతలోనే సమంత చేసిన మరో పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్కతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. 'షాషా(పెట్ డాగ్) ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అది కాస్తా వైరల్ కావడంతో నెట్టంట చర్చ మొదలైంది. ఏదేమైనప్పటికీ సామ్‌కు మాత్రం తన పెట్ డాగ్ ప్రేమ కంటే ఈ లోకంలో మరేదీ లేదని చెబుతోంది.
గతంలోనూ ప్రేమపై పోస్ట్
గతంలో ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. "చాలా మంది వ్యక్తులు స్నేహాలు, సంబంధాలను పరస్పరం కొనసాగిస్తారు. వీటిని నేను కూడా అంగీకరిస్తున్నాను. మీరు ప్రేమను పంచుతారు. నేను కూడా తిరిగి ఇస్తాను. కానీ కొన్నేళ్లుగా నేను నేర్చుకున్నది ఏంటంటే.. మనం ప్రేమను పంచే ఎదుటి వ్యక్తి తిరిగి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా ప్రేమను అందజేస్తాం. ఎందుకంటే ప్రేమ అనేది ఓ త్యాగం. మనకు అవతలి వైపు నుంచి ప్రేమ, అప్యాయతలు అందకపోయినా.. ఇప్పటికీ తమ ప్రేమను ధారపోస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు." అంటూ పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment