సమంత సర్‌ప్రైజ్‌ ఇదే.. మీరు ఊహించింది మాత్రం కాదు! | Samantha Revealead Big Surprise To Fans Goes Viral, Check Out The Details About Announcement | Sakshi
Sakshi News home page

Samantha: సమంత సర్‌ప్రైజ్‌.. మొత్తానికి అదేంటో రివీల్ చేసింది!

Published Tue, Aug 20 2024 5:04 PM | Last Updated on Tue, Aug 20 2024 5:23 PM

Samantha Revelead big Surprise to Fans Goes Viral

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీబన్నీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. చివరిసారిగా ఖుషి చిత్రం మెరిసిన ముద్దుగుమ్మ.. ఇటీవలే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే నాగచైతన్య- శోభిత ఎంగేజ్‌మెంట్ కావడంతో అందరి చూపు సమంత వైపు మళ్లింది. ఆమె కూడా త్వరలోనే నిశ్చితార్థం చేసుకుంటుందా అనే రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో డేటింగ్ ఉందంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ ఫ్యాన్స్‌కు ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తానంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.

అయితే ఆ సర్‌ప్రైజ్‌ను రివీల్ చేసింది సామ్. వరల్డ్‌ పికిల్ బాల్‌ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ లీగ్‌లో తాను చెన్నై ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే సర్‌ప్రైజ్‌ అనగానే అభిమానులు ఏదేదో ఊహించుకున్నారు. తనపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇస్తుందేమో అనుకున్నారు. ఇంకా ఏదైనా బిగ్‌ న్యూస్‌ ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. తీరా పికిల్‌బాల్ లీగ్ ప్రకటనతో అందరినీ నిరాశకు గురిచేసింది. ఏదేమైనా సమంత కొత్త బిజినెస్‌లో అడుగుపెడుతోంది. ఇది చూసిన అభిమానులు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement