
సమంత రూత్ ప్రభు టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరు. ఈ స్టార్ హీరోయిన్ ఇటీవల ఓ అరుదైన వ్యాధి బారినపడి ఇటీవలే కోలుకుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటీమణుల్లో సామ్ ఒకరు. ఇటీవలే యశోద చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కొద్ది రోజులుగా విరామం తీసుకుంటున్న సమంత తాజాగా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్‌కు అడ్వాన్స్‌గా విష్ చేసింది సామ్.
సామ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' మీరు చేయగలిగిన వాటినే నియంత్రించండి. కొత్త, సులభమైన లక్ష్యాల కోసం ఇదే సరైన సమయం. మనకు సాధ్యమయ్యే లక్ష్యాలను ముందే నిర్దేశించుకోండి. ఈ ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి. అడ్వాన్స్ హ్యపీ న్యూ ఇయర్ 2023..' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులు సమంతకు విషెష్ చెబుతున్నారు. మరికొందరు మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధి బారినపడిన సామ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. చివరిసారిగా యశోదలో సమంతా కనిపించింది. ఇందులో సరోగసి నేపథ్యంలో సాగే పాత్రలో నటించింది. ఈ చిత్రం నవంబర్ 11న విడుదల కాగా.. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment