ఆ విషయంలో వాళ్లిద్దరిని వేడుకున్నా: సమంత | Samantha request to find her replacement for Citadel after myositis diagnosis | Sakshi
Sakshi News home page

Samantha: వాళ్ల పేర్లు కూడా ఇచ్చా.. అయినా వినలేదు: సమంత

Oct 17 2024 4:13 PM | Updated on Oct 17 2024 4:22 PM

Samantha request to find her replacement for Citadel after myositis diagnosis

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించిన అమెరికన్ స్పై-యాక్షన్ సిరీస్ సిటాడెల్‌కు ఇండియన్ వర్షన్‌గా ఈ సిరీస్ రూపొందించారు.

అయితే ఈ సిరీస్ ‍ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో ఈ సిరీస్‌లో నా ప్లేస్‌లో వేరొకరిని తీసుకోవాలని దర్శకులైన రాజ్, డీకేలకు చెప్పానని సామ్ తెలిపింది. అంతేకాకుండా తన స్థానాన్ని భర్తీ చేయగల నటిని కూడా సిఫార్సు చేశానని వెల్లడించింది. కానీ తన విజ్ఞప్తిని వాళ్లిద్దరు తిరస్కరించారని సమంత పేర్కొంది. 

san

(ఇది చదవండి: నాకు వారి సపోర్ట్‌ లేకుండా ఉంటే.. మంత్రి వ్యాఖ్యలపై మరోసారి సమంత)

సమంత మాట్లాడుతూ.. 'ఈ సిరీస్ నేను చేస్తానని  నిజంగా అనుకోలేదు. అందుకే నా ప్లేస్‌లో మరొకరిని తీసుకోమని వారిని వేడుకున్నా. నేను చేయలేనని నేను కచ్చితంగా చెప్పా. ఆ పాత్రకు తగిన వారి పేర్లను కూడా పంపా. కానీ వాళ్లు నా స్థానంలో వేరొకరిని తీసుకునేందుకు నిరాకరించారు. ఇప్పుడు ఈ సిరీస్‌లో తాను నటించినందుకు సంతోషంగా ఉంది. దర్శకులు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు' తెలిపింది.

కాగా.. సమంత గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లి చికిత్స తీసుకుని కోలుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్‌ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement