RAj And DK
-
ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్ సిరీస్.. వెలుగులోకి భారీ స్కామ్
టాలీవుడ్ హీరోయిన్ సమంత నటిస్తున్న ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. సమంత నటించిన ఖుషి 2023లో విడుదలైంది. ఈ మూవీ తర్వాత మరో చిత్రంలో ఆమె నటించలేదు. అయితే, గతేడాది ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సమంత పలకరించింది. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అయితే, ఇప్పుడీ వెబ్ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయని నెట్టింట వైరల్ అవుతుంది.నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో రక్త్ బ్రహ్మాండ్ ఒకటి. ఆదిత్య రాయ్ కపూర్, సమంత నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే ఈ ప్రాజెక్ట్ణు పర్యవేక్షిస్తున్నారు. వీరిద్దరూ రీసెంట్గా సిటాడెల్ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్రారంభించిన రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్‌ను ఆర్థిక సమస్యల వల్ల తాత్కాలికంగా ఆపేశారని సమాచారం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న ఒకరు బడ్జెట్ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు బయటకొచ్చాయి. కోట్ల రూపాయల స్కామ్‌కు అతను పాల్పడినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్, డి2ఆర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హారర్ ఫాంటసీ చిత్రీకరణ ఇప్పటి వరకు 25 రోజులు పూర్తి చేసుకుందట. ఇంకా చాలా షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయట. కానీ, ఇప్పటికే సగం బడ్జెట్ ఖర్చయిపోయినట్లు తెలిసింది. ఓ ఆడిట్ ద్వారా ఈ విషయం బయటపడిందట.. అకౌంటింగ్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్‌ను ఆపేశారని టాక్ ఉంది. నెట్‌ఫ్లిక్స్, డీ2ఆర్ ఫిల్మ్స్ దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాయని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ పనులను రాజ్ అండ్ డీకే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డైరెక్టర్ రాహి అనిల్ బార్వే, రైటర్ సీతా ఆర్ మేనన్ మేకింగ్ సమయంలో స్క్రీన్ ప్లేలను ఎప్పటికప్పుడు మార్చేస్తుండటంతో ఖర్చు భారీగా పెరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తప్పుబడుతుంది. ఎంత ఖర్చు పెట్టడానికైనా నెట్ ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఇలా స్క్రిప్ట్ మారుస్తూ ఉండటంతో కనిపించని స్థాయిలో దుబారా అవుతుందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంటుందని యూనిట్ చెప్పుకొస్తుంది. -
ఆ విషయంలో వాళ్లిద్దరిని వేడుకున్నా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించిన అమెరికన్ స్పై-యాక్షన్ సిరీస్ సిటాడెల్కు ఇండియన్ వర్షన్‌గా ఈ సిరీస్ రూపొందించారు.అయితే ఈ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో ఈ సిరీస్‌లో నా ప్లేస్‌లో వేరొకరిని తీసుకోవాలని దర్శకులైన రాజ్, డీకేలకు చెప్పానని సామ్ తెలిపింది. అంతేకాకుండా తన స్థానాన్ని భర్తీ చేయగల నటిని కూడా సిఫార్సు చేశానని వెల్లడించింది. కానీ తన విజ్ఞప్తిని వాళ్లిద్దరు తిరస్కరించారని సమంత పేర్కొంది. (ఇది చదవండి: నాకు వారి సపోర్ట్ లేకుండా ఉంటే.. మంత్రి వ్యాఖ్యలపై మరోసారి సమంత)సమంత మాట్లాడుతూ.. 'ఈ సిరీస్ నేను చేస్తానని నిజంగా అనుకోలేదు. అందుకే నా ప్లేస్‌లో మరొకరిని తీసుకోమని వారిని వేడుకున్నా. నేను చేయలేనని నేను కచ్చితంగా చెప్పా. ఆ పాత్రకు తగిన వారి పేర్లను కూడా పంపా. కానీ వాళ్లు నా స్థానంలో వేరొకరిని తీసుకునేందుకు నిరాకరించారు. ఇప్పుడు ఈ సిరీస్‌లో తాను నటించినందుకు సంతోషంగా ఉంది. దర్శకులు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు' తెలిపింది.కాగా.. సమంత గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లి చికిత్స తీసుకుని కోలుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. -
Rakt Bramhand: తెలుగు డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే నుంచి కొత్త సిరీస్ ప్రకటన
రాజ్ నిడిమోరు, కృష్ణ దాసరి కొత్తపల్లి సినీరంగంలో రాజ్ అండ్ డీకేగా గుర్తింపు పొందారు. తాజాగా మరో వెబ్ సిరీస్‌ను ఈ డైరెక్టర్స్ ప్రకటించారు. బాలీవుడ్ ప్రేక్షకులకు ఇష్టమైన ఈ దర్శకులు మన తెలుగు వారే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన వీళ్లిద్దరు డి2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించారు. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ వంటి పాపులర్ వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు. ఇప్పుడీ వారు కలిసి మొదటిసారి ఓ యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు.రాజ్ అండ్ డీకే కాంబినేషన్లో కొత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేస్తూ తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఒక పోస్టర్ విడుదల చేసింది. 'రక్త్ బ్రహ్మాండ్' పేరుతో విడుదలైన ఈ టైటిల్‌కు 'ది బ్లడీ కింగ్డమ్' అనేది ఉపశీర్షిక కూడా ఉంది. రాజ్ డీకే నుంచి రానున్న మొదటి యాక్షన్ వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పోస్టర్లో ఒక కిరీటంతో పాటు దాని చుట్టూ రక్తం కారుతున్నట్లుగా ఉంది. దీనిని బట్టి చూస్తుంటే ఈ సిరీస్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అనిల్ బర్వే కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు.రాజ్ అండ్ డీకే ప్రాజెక్ట్‌లో సమంత నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనే ఆమె నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. త్వరలో ఈ టీమ్ విడుదల చేయనున్న నటీనటుల జాబితాలో సమంత పేరు ఉంటుందని అభిమానులు ఆసిస్తున్నారు. రాజ్-డీకే దర్శకత్వంలో తెరకెక్కిన సిటడెల్ వెబ్ సిరీస్ తెలుగు వెర్షెన్ త్వరలోనే విడుదల కానుందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. -
Samantha: మరో వెబ్ సిరీస్‌లో సమంత.. టైటిల్ ఇదే!
సమంత మరో వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్స్-2’లో సామ్ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి తెరకెక్కించిన మరో వెబ్ సిరీస్ ‘సిటాడెల్:హనీ బన్నీ’లోనూ సమంత నటించింది. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తికాక ముందే సామ్ అనారోగ్యం బారిన పడింది. దీంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’నే సామ్ చివరి చిత్రం. ఆ తర్వాత చిక్సిత కోసం అమెరికాకు వెళ్లింది. ఈ మధ్యే పూర్తిగా కోలుకొని మళ్లీ సినిమాల్లో నటించేందేకు రెడీ అవుతుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటించాలని సమంత ఫిక్స్ అయిందట. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించే తాజా వెబ్ సిరీస్‌లో సామ్ లీడ్ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్‌కి రక్తబీజ్' అనే టైటిల్ ఖరారు చేశారట. ఆగస్ట్‌లో షూటింగ్ మొదలు కానుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందట. యాక్షన్ సిరీస్ కావడంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు సమాచారం.