సమంత మరో వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్స్-2’లో సామ్ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి తెరకెక్కించిన మరో వెబ్ సిరీస్ ‘సిటాడెల్:హనీ బన్నీ’లోనూ సమంత నటించింది. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తికాక ముందే సామ్ అనారోగ్యం బారిన పడింది. దీంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’నే సామ్ చివరి చిత్రం. ఆ తర్వాత చిక్సిత కోసం అమెరికాకు వెళ్లింది. ఈ మధ్యే పూర్తిగా కోలుకొని మళ్లీ సినిమాల్లో నటించేందేకు రెడీ అవుతుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటించాలని సమంత ఫిక్స్ అయిందట.
రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించే తాజా వెబ్ సిరీస్‌లో సామ్ లీడ్ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్‌కి రక్తబీజ్' అనే టైటిల్ ఖరారు చేశారట. ఆగస్ట్‌లో షూటింగ్ మొదలు కానుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందట. యాక్షన్ సిరీస్ కావడంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment