నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌.. అతనితో సమంత డేటింగ్‌! | Samantha Ruth Prabhu Is Dating Citadel Honey Bunny Director | Sakshi
Sakshi News home page

Samantha: నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌.. ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌!

Aug 14 2024 7:49 AM | Updated on Aug 14 2024 9:11 AM

Samantha Ruth Prabhu Is Dating Citadel Honey Bunny Director

టాలీవుడ్ హీరో నాగచైతన్య మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే హీరోయిన్‌ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా నిశ్చితార్థం తర్వాత చైతూ చాలా సంతోషంగా ఉన్నాడని నాగ్ తెలిపారు.

అయితే చైతూకు ఎంగేజ్‌మెంట్‌ కావడంతో అందరి దృష్టి ఆయన మాజీ భార్య సమంతపైనే పడింది. చైతన్య నిశ్చితార్థం తర్వాత సమంత ఎలాంటి పోస్టులు పెడుతుందా అని నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ గురించి ఆమె ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు.

డైరెక్టర్‌తో డేటింగ్‌?

ఈ సంగతి అటుంచితే.. తాజాగా సమంతపై నేషనల్ మీడియాలో తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రెడ్‌ఇట్‌ కథనం ప్రకారం సామ్ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.  బాలీవుడ్‌ డైరెక్టర్‌  రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్‌ చేస్తున్నట్లు వరుస కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అతను సమంత నటిస్తోన్న సిటాడెల్.. హనీ బన్నీ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలోనూ సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేశారు. ఆ సిరీస్ తర్వాతే అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుంది. 

అయితే  సమంత- రాజ్‌ నిడిమోరుపై వస్తున్న రూమర్స్‌ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రెండు వెబ్‌ సిరీసుల్లో వీరిద్దరు కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి కథనాలు వినిపిస్తున్నాయని మరికొందరు అంటున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లయిన రాజ్ నిడిమోరు తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు.

కాగా.. 2017లో సమంత- నాగచైతన్య పెళ్లాడింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో  2021లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు తమ తమ కెరీర్‌లో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్‌ మూవీలో నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement