![Samantha Web Series Citadel Honey Bunny Missed Critics Choice Award](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/sam.jpg.webp?itok=Dz6LNDgc)
సినీ ఇండస్ట్రీ అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను(Critics Choice Awards) ప్రకటించారు. ఈ అవార్డుల కోసం సమంత నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ కూడా పోటీపడ్డాయి. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ వెబ్ సిరీస్‌ల జాబితాలో నామినేట్ అయిన హనీ బన్నీ అవార్డ్‌ను సాధించలేకపోయింది. ఈ కేటగిరీలో కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్-2 అవార్డ్‌ను దక్కించుకుంది. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్ సీజన్-2 2024లో విడుదలైంది. అంతేకాకుండా ఈ సిరీస్ సీజన్-3 ఈ ఏడాది జూన్‌లో అందుబాటులోకి రానుంది.
అయితే బెస్ట్ ఫారిన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీపడిన మూవీ ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్. ఈ మూవీకి కూడా నిరాశే ఎదురైంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ చిత్రం అవార్డ్ సాధించలేకపోయింది. దీంతో మన దేశం నుంచి పోటీలో నిలిచిన చిత్రాలకు తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే గతేడాది కేన్స్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్‌ను పాయల్ కపాడియా చిత్రం దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్‌లో జ్యూరీ గ్రాండ్ ప్రైజ్, గోథమ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను కూడా అందుకుంది. ఈ అవార్డుల వేడుక శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్‌లో జరిగింది.
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల విజేతలు వీరే..
ఉత్తమ విదేశీ వెబ్ సిరీస్ : స్క్విడ్ గేమ్ 2
ఉత్తమ చిత్రం : అనోరా
ఉత్తమ నటుడు: డెమి మూర్
ఉత్తమ నటి : కియేరన్ కుల్కిన్
ఉత్తమ సహాయ నటుడు : కీరన్ కుల్కిన్
ఉత్తమ సహాయనటి : జోయ్ సల్దానా
Comments
Please login to add a commentAdd a comment