Critics award
-
సమంత వెబ్ సిరీస్.. ప్రతిష్టాత్మక అవార్డుల్లో నిరాశ
సినీ ఇండస్ట్రీ అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను(Critics Choice Awards) ప్రకటించారు. ఈ అవార్డుల కోసం సమంత నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ కూడా పోటీపడ్డాయి. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ వెబ్ సిరీస్‌ల జాబితాలో నామినేట్ అయిన హనీ బన్నీ అవార్డ్‌ను సాధించలేకపోయింది. ఈ కేటగిరీలో కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్-2 అవార్డ్‌ను దక్కించుకుంది. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్ సీజన్-2 2024లో విడుదలైంది. అంతేకాకుండా ఈ సిరీస్ సీజన్-3 ఈ ఏడాది జూన్‌లో అందుబాటులోకి రానుంది.అయితే బెస్ట్ ఫారిన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీపడిన మూవీ ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్. ఈ మూవీకి కూడా నిరాశే ఎదురైంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ చిత్రం అవార్డ్ సాధించలేకపోయింది. దీంతో మన దేశం నుంచి పోటీలో నిలిచిన చిత్రాలకు తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే గతేడాది కేన్స్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్‌ను పాయల్ కపాడియా చిత్రం దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్‌లో జ్యూరీ గ్రాండ్ ప్రైజ్, గోథమ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను కూడా అందుకుంది. ఈ అవార్డుల వేడుక శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్‌లో జరిగింది.క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల విజేతలు వీరే..ఉత్తమ విదేశీ వెబ్ సిరీస్ : స్క్విడ్ గేమ్ 2ఉత్తమ చిత్రం : అనోరాఉత్తమ నటుడు: డెమి మూర్ఉత్తమ నటి : కియేరన్ కుల్కిన్ఉత్తమ సహాయ నటుడు : కీరన్ కుల్కిన్ఉత్తమ సహాయనటి : జోయ్ సల్దానా -
హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో మెరిసిన తారలు.. ఆర్ఆర్ఆర్ టీం హవా..(ఫొటోలు)
-
'గమ్మునుండవోయ్.. మాట్లాడనీ'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మధ్య మరోసారి వివాదం రాజుకునేలా ఉంది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా) వేడుక గురువారం అంగరంగ వైభవంగా మొదలైన సంగతి తెలిసిందే. సింగపూర్‌లో రెండు రోజులపాటు జరుగనున్న ఈ వేడుకల్లో మొదటిరోజైన గురువారం తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను అందించగా, శుక్రవారం తమిళ, మలయాళ సినిమాలకు అవార్డులు ఇవ్వనున్నారు. కాగా చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డి పాత్ర పోషించినందుకుగాను అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ అవార్డు లభించింది. వేదికపై అవార్డు అందుకున్న అనంతరం బన్నీ మాట్లాడుతుండగా 'పవర్ స్టార్.. పవర్ స్టార్..' అంటూ పవన్ అభిమానులు పాట అందుకున్నారు. దీంతో కాస్త అసహనం వ్యక్తం చేసిన బన్నీ వారిని ఉద్దేశించి.. 'హే గమ్మునుండవోయ్.. మాట్లాడనీ' అంటూ తిరిగి తన మాటలను కొనసాగించారట. ఇంతకుముందు కూడా ఓ సినీ వేడుకలో పవన్ ఫ్యాన్స్ ఇలానే రెచ్చిపోతుంటే.. కాస్త పద్ధతిగా ప్రవర్తించండంటూ బన్నీ వారికి కాస్త చురకలంటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అది ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదాన్నే సృష్టించింది. బన్నీ తిరిగి వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరోసారి సైమా వేడుకలో అదే రిపీట్ అవ్వడంతో బన్నీ స్పందించక తప్పలేదట. మరి ఈసారేమవుతుందో!