'గమ్మునుండవోయ్.. మాట్లాడనీ' | Bunny To Pawan Fans Gammununduvoy | Sakshi
Sakshi News home page

'గమ్మునుండవోయ్.. మాట్లాడనీ'

Published Fri, Jul 1 2016 5:02 PM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

'గమ్మునుండవోయ్.. మాట్లాడనీ' - Sakshi

'గమ్మునుండవోయ్.. మాట్లాడనీ'

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య మరోసారి వివాదం రాజుకునేలా ఉంది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా) వేడుక గురువారం అంగరంగ వైభవంగా మొదలైన సంగతి తెలిసిందే. సింగపూర్లో రెండు రోజులపాటు జరుగనున్న ఈ వేడుకల్లో మొదటిరోజైన గురువారం తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను అందించగా, శుక్రవారం తమిళ, మలయాళ సినిమాలకు అవార్డులు ఇవ్వనున్నారు. కాగా చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డి పాత్ర పోషించినందుకుగాను అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ అవార్డు లభించింది.

వేదికపై అవార్డు అందుకున్న అనంతరం బన్నీ మాట్లాడుతుండగా 'పవర్ స్టార్.. పవర్ స్టార్..' అంటూ పవన్ అభిమానులు పాట అందుకున్నారు. దీంతో కాస్త అసహనం వ్యక్తం చేసిన బన్నీ వారిని ఉద్దేశించి.. 'హే గమ్మునుండవోయ్.. మాట్లాడనీ' అంటూ తిరిగి తన మాటలను కొనసాగించారట. ఇంతకుముందు కూడా ఓ సినీ వేడుకలో పవన్ ఫ్యాన్స్ ఇలానే రెచ్చిపోతుంటే..  కాస్త పద్ధతిగా ప్రవర్తించండంటూ బన్నీ వారికి కాస్త చురకలంటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అది ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదాన్నే సృష్టించింది. బన్నీ తిరిగి వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరోసారి సైమా వేడుకలో అదే రిపీట్ అవ్వడంతో బన్నీ స్పందించక తప్పలేదట. మరి ఈసారేమవుతుందో!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement