సాక్షి,కరీంనగర్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు.
పవన్‌కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనబడ్డారో?. ఆరు గ్యారెంటీలను పక్కదారి పట్టించేందుకే.. అల్లు అర్జున్‌పై పవన్ వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్, రేవంత్‌రెడ్డికి మధ్య ఎక్కడో చెడింది. 14 శాతం కమిషన్ వద్ద చెడిందేమో?’ అని బండి సంజయ్ సెటైర్లు వేశారు.
కరీంనగర్ జిల్లా మాజీ సర్పంచులతో కలిసి బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘సర్పంచుల బతుకులు నిర్వీర్యం కావాడానికి బీఅర్ఎస్, కాంగ్రెస్ కారణం. బకాయిలు మొత్తం చెల్లిస్తానంటే జెండాలు పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీకి సర్పంచులు మద్దతు ఇచ్చారు. గ్రామాలు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి చెందాయి. సర్పంచులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మాజీ సర్పంచులు బ్రతుకుదెరువు కొసం దుబాయ్ పోయే పరిస్థితి వచ్చింది. రూ.1300 కోట్ల సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చెయ్యాలి. గ్రామపంచాయతి ఎన్నికల్లో జెండాలు ప్రక్కన బెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ది వస్తుంది.’
‘14% శాతం కమీషన్ల మీద ఈ ప్రభుత్వం నడుస్తోంది. ముగ్గురు మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారు. సచివాలయం, మంత్రుల పేషీలు కమీషన్లకి అడ్డాగా మారాయి. ఇక్కడి కమీషన్లతో ఢిల్లీలో కప్పం కడుతున్నారు. ఇప్పుడున్న మంత్రులందరికి ముఖ్యమంత్రి కావాలని ఉంది. ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లనే సీఎం పదవి నిలబడుతుంది’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment