
సాక్షి, కరీంనగర్ జిల్లా: ‘ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి.. పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యండి’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ గెలిచి నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలు తీర్చుతున్నాం. అల్ఫోర్స్ వార్షికోత్సవ సభలాగా నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఉంది’’ అంటూ ఎద్దేవా చేశారు.
‘‘బీఆర్ఎస్ కులగణనకు అనుకూలం. బీఆర్ఎస్ 51 శాతం బీసీ జనాభా, కాంగ్రెస్ చేస్తే 46 శాతం లెక్క.. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు..?. 12 శాతం ముస్లిం జనాభాకు, 10 శాతం రిజర్వేషన్ ఇస్తే.. 80 శాతం లాభం వారికే జరుగుతుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్, కారు రేస్ కేసుల్లో సీబీఐ విచారణ ఎందుకు కోరట్లేదు. సీబీఐ విచారణ కోరండి, మేము అరెస్టు చేస్తాం. ప్రభాకర్ రావు పారిపోయేందుకు సహకరించింది కాంగ్రెస్ పార్టీనే. కారు రేస్‌లో కేటీఆర్ హస్తం ఉందని కేబినెట్ మంత్రులు అన్నారు. మరి కేటీఆర్ కు ఎందుకు నోటీసు ఎందుకు ఇస్తలేరు?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలు విచారణ ఎందుకు బయట పెట్టడం లేదు..?. కేసీఆర్‌కు నోటీసు ఇచ్చే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. జన్వాడ ఫార్మ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు?. సీఎం రేవంత్ అరెస్టు అయింది.. జైల్లో ఉంది.. జన్వాడ కేసులోనే.. బీఅర్ఎస్, కాంగ్రెస్‌ది చీకటి ఒప్పందం. 15 వేల కోట్ల రూపాయలే మూసీ ప్రక్షాళన అంచనా. రాబర్ట్ వాద్రా కళ్లలో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి తాపత్రయం. అధి నాయకురాలు అల్లుడి ఆనందం కోసం మూసీ ప్రక్షాళన అంచనా లక్ష కోట్లకు పెంచింది సీఎం రేవంతే. నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం 20 వేల ఉద్యోగాల కోసమైతే.. 51 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు ఎలా చెబుతున్నారు..?’’ అని బండి సంజయ్ నిలదీశారు.

Comments
Please login to add a commentAdd a comment