SIIMA Awards
-
దుబాయ్ లో సైమా 2024 అవార్డ్స్ ప్రదానోత్సవం...తారల సందడి (ఫొటోలు)
-
తల్లిని కెమెరాలో బంధిస్తున్న ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య (ఫోటోలు)
-
‘సైమా’ 2024 అవార్డుల విజేతలు వీళ్లే! (ఫోటోలు)
-
ఇకపై 'నాని అన్నా' అని పిలుస్తా: విజయ్ దేవరకొండ
సైమా అవార్డుల వేడుక (#SIIMA2024) అట్టహాసంగా జరిగింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా, హాయ్ సినిమాలు ఎక్కువ అవార్డులు కొల్లగొట్టేశాయి. దసరా సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా నాని సైమా అవార్డు గెలిచాడు. ఈ పురస్కారాన్ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ నానిని హత్తుకుని కెరీర్ ప్రారంభ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. కంగారుపడ్డా..'ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో మొదటిసారి నేను కీలకపాత్ర పోషించాను. ఈ సినిమాకు ఆడిషన్ ఇవ్వడానికి నాని ఆఫీస్‌కు వెళ్లాను. ఓపక్క సంతోషపడుతూనే తను ఎలా మాట్లాడతాడో అని కాస్త కంగారుపడ్డాను. కానీ తను నాకు చాలా సపోర్ట్ చేశాడు. నానీ.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇండస్ట్రీలో అందర్నీ అన్నా అని పిలుస్తుంటాను. అలా ఎందుకు పిలుస్తానో నాకే తెలియదు. కానీ నానీని మాత్రం నేను అన్నగా భావించాను, కాబట్టి ఇకనుంచి తనను నానీ అన్నా అని పిలుస్తాను. నువ్వు వరుస హిట్స్ అందుకోవడం చాలా సంతోషం. ఈ అవార్డు వచ్చినందుకు కూడా ఆనందంగా ఉంది' అని విజయ్ చెప్పుకొచ్చాడు.ఫిక్స్ అయిపో..తర్వాత నాని మాట్లాడుతూ.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని తపన పడే వ్యక్తి విజయ్. కష్టపడి ఒక్కో స్టెప్ ఎక్కుతూ వచ్చాడు. ఈ రోజు నువ్వు నాకు అవార్డు ఇచ్చావు. వచ్చే ఏడాది ఇదే స్టేజీపై మా గౌతమ్ తిన్ననూరి సినిమాకు నేను అవార్డు ఇస్తాను. ఇది ఫిక్స్ అయిపో అని తెలిపాడు. కాగా నాని, విజయ్ దేవరకొండ.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఇకనైనా గొడవలకు చెక్!కాగా నాని, విజయ్ దేవరకొండ మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవారు. తాజాగా హీరోల వ్యాఖ్యలతో వారి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని స్పష్టమైపోయింది. దీంతో ఇకనైనా ఫ్యాన్స్వార్కు చెక్ పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు.చదవండి: 'పుట్టబోయే బిడ్డ నీకంటే మంచి రంగు ఉండాలి, అందుకోసం..' -
సలార్‌తో పోటీ పడిన సినిమా.. ఉత్తమ చిత్రంగా అవార్డ్!
సైమా అవార్డ్స్-2024లో కన్నడ స్టార్ దర్శన్ నటించిన చిత్రం సత్తా చాటింది. శాండల్‌వుడ్‌లో ఉత్తమ చిత్రంగా అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ కన్నడలో గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దర్శన్ హీరోగా నటించిన యాక్షన్ సినిమా కాటేరా.. గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద ఏకంగా ప్రభాస్ సలార్‌తో పోటీ పడి రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంగీతమందించిన హరికృష్ణ ఉత్తమ సంగీత దర్శకుడిగా సైమా అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. కాగా.. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని దర్శకుడు తరుణ్ సుధీర్ తెరకెక్కించారు. కాటేరా సినిమాలో దర్శన్ సరసన ఆరాధన రామ్ హీరోయిన్గా మెప్పించింది. సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు అయిన ఆరాధన రామ్ కాటేరా మూవీతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. (ఇది చదవండి: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా తెలుగు వర్షన్)జైలులో దర్శన్అయితే ఈ మూవీ సూపర్ హిట్ తర్వాత ఊహించని విధంగా దర్శన్ ఓ హత్యకేసులో అరెస్టయ్యారు. ప్రియురాలిని వేధిస్తున్నాడంటూ ఓ అభిమాని హత్య చేయడం కన్నడ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం దర్శన్, అతని ప్రియురాలు సైతం జైలులోనే ఉన్నారు. ఇటీవలే ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. Best Film #KAATERA #SIIMA #SIIMAAwards #SIIMAinDubai #Dboss #D56 pic.twitter.com/Pvx3ixJCDp— Filmy Corner ꭗ (@filmycorner9) September 14, 2024Congratulations Harikrishna for winning Best Music Director award in SIIMA for #Kaatera 🎊Thank you for giving this gem of a song to us, We will cherish forever❤️#DBoss @dasadarshanpic.twitter.com/fULQhP4tsK— King Kariya (@KingKariyaa) September 14, 2024𝗦𝗜𝗜𝗠𝗔 𝟮𝟬𝟮𝟰: Best Film (Kannada) award goes to #Kaatera #DBoss #RocklineEntertainment #SIIMA2024 #SIIMAAwards pic.twitter.com/jqitWHmMDu— Bhargavi (@IamHCB) September 14, 2024 -
‘సైమా 2024 అవార్డుల’ వేడుకలో మెరిసిన అందాల తారలు (ఫొటోలు)
-
అట్టహాసంగా ‘సైమా 2024 అవార్డుల’ వేడుక (ఫొటోలు)
-
సైమా అవార్డ్స్‌లో నాని చిత్రాల హవా.. ఉత్తమ చిత్రం ఏదంటే..?
సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్‌లో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా కొనసాగింది. దసరా, హాయ్ నాన్న చిత్రాలు అవార్డులు కొల్లగొట్టాయి. దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో టాలీవుడ్ విజేతలను ప్రకటించారు. తెలుగులో ఉత్తమ నటుడిగా నాని నిలవగా.. ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. నాని నటించిన దసరా, హాయ్ నాన్న చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డ్స్ దక్కాయి. ఈ వేడుకల్లో హీరోయిన్స్ వేదికపై సందడి చేశారు.టాలీవుడ్లో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి నిలిచింది. సైమా-2024 విన్నర్స్ వీళ్లే.. ఉత్తమ నటుడు: నాని (దసరా) ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (దసరా) ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా) ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా) ఉత్తమ సహాయ నటి: బేబీ ఖియారా ఖాన్ (హాయ్ నాన్న) ఉత్తమ హాస్య నటుడు: విష్ణు (మ్యాడ్) ఉత్తమ పరిచయ నటి: వైష్ణవి చైతన్య (బేబీ) ఉత్తమ సంగీత దర్శకుడు: అబ్దుల్ వాహబ్ (హాయ్‌నాన్న) ఉత్తమ సినిమాటోగ్రఫీ: భువన గౌడ (సలార్) ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు-బలగం) ఉత్తమ డెబ్యూ యాక్టర్: సంగీత్ శోభన్ (మ్యాడ్) ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: శౌర్యువ్ (హాయ్ నాన్న) ఉత్తమ డెబ్యూ ప్రొడ్యూసర్: వైరా ఎంటర్టైన్మెంట్స్ (హాయ్ నాన్న) ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆనంద్ దేవరకొండ (బేబీ) ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాళ్ ఠాకూర్ ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): సాయి రాజేశ్ 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సైమా అవార్డ్స్ 2024. దసరా, జైలర్ హవా!
-
సైమా అవార్డ్స్ కోసం పోటీలో ఉన్న సినిమాలు, హీరోలు.. లిస్ట్ ఇదే
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 12 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2024 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది.ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ అవార్డ్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్ తాజాగా విడుదల చేసింది. 2023లో రిలీజైన సినిమాలకు ఈ అవార్డ్స్ దక్కనున్నాయి. టాలీవుడ్ నుంచి నాని నటించిన దసరా సినిమా అత్యధికంగా 11 విభాగాల్లో పోటీపడుతుంది. తమిళ్ నుంచి జైలర్ 9 విభాగాల్లో సత్తా చాటుతుంది. మలయాలళం నుంచి టొవినో థామస్ 2018, దర్శన్ నటించిన కాటేర (కన్నడ) 8 విభాగాల్లో రేసులో ఉన్నాయి.ఉత్తమ చిత్రం కోసం బరిలో ఉన్న సినిమాలు సలార్: సీజ్ ఫైర్దసరాహాయ్ నాన్నమిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిబేబీబలగంసామజవరగమనఉత్తమ నటుడి అవార్డ్ లిస్ట్లోచిరంజీవి (వాల్తేర్ వీరయ్య)బాలకృష్ణ (భగవంత్ కేసరి)ఆనంద్ దేవరకొండ (బేబీ)నాని (దసరా)నాని (హాయ్ నాన్న)ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)ధనుష్ (సర్)నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)ఉత్తమ నటి కోసం పోటీ పడుతున్న హీరోయిన్లుకీర్తిసురేశ్ (దసరా)సమంత (శాకుంతలం)అనుష్క (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)వైష్ణవీ చైతన్య (బేబీ)మృణాళ్ ఠాకూర్ (హాయ్ నాన్న) ఉత్తమ దర్శకుడు కోసం బరిలో ఉన్న డైరెక్టర్స్ ప్రశాంత్‌నీల్ (సలార్:పార్ట్-1 సీజ్ ఫైర్)వేణు యెల్దండ (బలగం)శ్రీకాంత్ ఓదెల (దసరా)అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)శౌర్యువ్ (హాయ్ నాన్న)కార్తిక్ దండు (విరూపాక్ష)సాయి రాజేశ్ (బేబీ) -
సైమా అవార్డ్స్.. నాని హిట్ సినిమాకే ఎక్కువ క్రేజ్
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 12 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2024 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది.ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ అవార్డ్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్ తాజాగా విడుదల చేసింది. 2023లో రిలీజైన సినిమాలకు ఈ అవార్డ్స్ దక్కనున్నాయి. టాలీవుడ్ నుంచి నాని నటించిన దసరా సినిమా అత్యధికంగా 11 విభాగాల్లో పోటీపడుతుంది. తమిళ్ నుంచి జైలర్ 9 విభాగాల్లో సత్తా చాటుతుంది. మలయాలళం నుంచి టొవినో థామస్ 2018, దర్శన్ నటించిన కాటేర (కన్నడ) 8 విభాగాల్లో రేసులో ఉన్నాయి. సైమా ఛైర్పర్సన్ బృందాప్రసాద్ మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. వేడుకలకు స్పాన్సర్‌గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా వ్యవహరించనుందని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఓటింగ్ ద్వారా విజేతలను ప్రకటిస్తామని సైమా టీమ్ తెలిపింది. అభిమానులు తమ ఓట్‌ను సైమా ఫేస్బుక్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. -
'సీతారామం' బ్యూటీ తెలుగింటి కోడలు కానుందా?
తెలుగులో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తూనే ఉంటారు. కానీ వాళ్లలో హిట్ కొట్టి, స్టార్స్ అయ్యేది మాత్రం ఒకరో ఇద్దరు మాత్రమే ఉంటారు. అలా గతేడాది రిలీజైన 'సీతారామం' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్డమ్ సంపాదించిన బ్యూటీ మృణాల్ ఠాకుర్. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఈమె పెళ్లి చేసేసుకోవాలని టాలీవుడ్ బడా నిర్మాత ఆశీర్వాదించాడు. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ తరఫున ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి ప్రేక్షకుల్ని అలరించారు. గతంలో ఓ సందర్భంగా ఆయన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని.. హైదరాబాద్ వచ్చేయ్ అమ్మా అని ఆశీర్వదించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు లావణ్.. మెగాఫ్యామిలీకి చెందిన హీరో వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. నవంబరు 1న వరుణ్-లావణ్య పెళ్లి కూడా జరగనుంది. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) సరే లావణ్య పెళ్లి సెట్ అయినప్పుడు చాలామంది అల్లు అరవింద్ ఆశీర్వాదం గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆయనే.. 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకుర్‌ని కూడా ఆశీర్వదించారు. సైమా అవార్డ్స్‌లో 'సీతారామం' సినిమాకుగానూ ఉత్తమ నటిగా మృణాల్ నిలిచింది. ఈ అవార్డుని అల్లు అరవింద్.. ఈమెకు ప్రెజెంట్ చేశారు. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'గతంలో ఓ వేదికపై హీరోయిన్‌తో ఓ మాట అన్నాను. తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని టాలీవుడ్‌కి కోడలిగా వచ్చేయమన్నాను. ఆ మాటని ఆమె నిజం చేసింది. ఇప్పుడు నీతో కూడా అదే మాట అంటున్నా. టాలీవుడ్ కోడలిగా హైదరాబాద్ వచ్చేయ్' అని అల్లు అరవింద్, మృణాల్ ఠాకుర్ తో అన్నారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: ఆ సినిమా షూటింగ్లో దౌర్జన్యం.. కత్తులు తెచ్చి నటితో అలా!) #alluaravind mawa very naughty aa... #MrunalThakur tfi lo young heroni chesesko... pic.twitter.com/kjeCzguXQM — celluloidpanda (@celluloidpanda) October 28, 2023 -
సైమా వేడుకలో రెచ్చిపోయిన మంచు లక్ష్మి
-
సైమా అవార్డ్స్- 2023.. రాజమౌళి చిత్రానికి 11 నామినేషన్స్!
సినీ ఇండస్ట్రీలో దక్షిణాదిలో అవార్డుల పండుగకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2023లో పోటీపడే చిత్రాల జాబితా రిలీజ్ అయింది. అయితే అవార్డుల నామినేషన్స్‌లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్, ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 11 విభాగాల్లో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో 10 విభాగాల్లో నామినేషన్స్‌తో సీతారామం చిత్రం నిలిచింది. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన జగపతిబాబు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) తెలుగులో ఉత్తమ చిత్రం కేటగిరిలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, నిఖిల్ మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్ కార్తికేయ-2, అడవి శేష్ మేజర్‌తో పాటు.. మరో బ్లాక్‌బస్టర్ మూవీ సీతారామం పోటీలో నిలిచాయి. తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్ పొన్నియిన్ సెల్వన్-1 చిత్రానికి దక్కించుకుంది. ఆ తర్వాత కమల్‌హాసన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన విక్రమ్ 9 విభాగాల్లో నామినేషన్స్‌కు ఎంపికైంది . కన్నడలో రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కాంతార, యశ్ యాక్షన్ మూవీ కేజీయఫ్-2 చిత్రాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కాయి. మలయాళంలో ఈసారి ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి. అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముటి నటించిన భీష్మ పర్వం చిత్రానికి 8 నామినేషన్స్ రాగా, టోవినో థామస్ థల్లుమాల మూవీకి ఏడు నామినేషన్స్ వచ్చాయి. కాగా.. సౌత్ సినిమా ఇండస్ట్రీలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక సైమా అవార్డ్స్- 2023) ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్' లో ట్రాన్స్ వుమెన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?) #SIIMA2023 nominations are out. In Telugu RRR Directed by S.S Rajamouli Starring Jr.NTR & Ram Charan has 11 Nominations is leading while Sita Ramam Directed by Hanu Raghavapudi Starring Dulquer Salmaan & Mrunal Thakur with 10 Nominations is close Second. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/M3DsQ7btLQ — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Tamil Mani Ratnam’s Ponniyin Selvan:1 Starring Vikram, Trisha & Aishwarya Rai leads with 10 nominations while Lokesh Kanagaraj’s Vikram Starring Kamal Haasan, Vijay Sethupathi & Fahadh Faasil with 9 Nominations is close Second. #NEXASIIMA… pic.twitter.com/sXAxDz7cuk — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Kannada Kantara Directed by and Starring Rishab Shetty with 11 Nominations, while KGF Chapter 2 Directed by Prashanth Neel, Starring Yash with 11 Nominations are in top position. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/hWh4ZDrw0z — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Malayalam Bheeshma Parvam Directed by Amal Neerad Starring Mammootty is leading with 8 Nominations while Thallumaala Directed by Khalid Rahman & Starring Tovino Thomas and Kalyani Priyadarshan with 7 Nominations is close Second #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/Va8wuh2PRW — SIIMA (@siima) August 1, 2023 -
‘నాకు ఆ పాత్ర చేయడం ఇష్టం లేదు, ఆయన కోసమే ఒప్పుకున్నా’
ఇటీవల జరిగిన సైమా అవార్డు ఫంక్షన్లో హీరో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విక్రమంలో సినిమాలో తాను చేసిన రోలెక్స్ పాత్ర చేయడం ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా ఈ ఏడాది వచ్చిన ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ విక్రమ్ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ మూవీ తమిళం, తెలుగులో విశేష ఆదరణ అందుకుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ అందించింది. చదవండి: ఈ వారం థియేటర్ ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే అయితే ఈ చిత్రంలో సూర్య రోలెక్స్ అనే మాఫీయా గ్యాంగ్ లీడర్‌గా కనిపించాడు. కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఆ పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. సూర్య ఎంట్రీకి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్. విలనిజానికి కేరాఫ్‌గా అడ్రస్‌గా సూర్య ఇందులో కనిపించాడు. చివరి 5 నిముషాలో రోలెక్స్ పాత్రను పరిచం చేశాడు డైరెక్టర్. కనిపించిన 5 నిమిషాలు సూర్య తన కళ్లలో చూపించిన క్రూరత్వం, నవ్వుతూనే భయపెట్టిన ఆయన నటనకు ప్రతిఒక్కరు ఫిదా అయ్యారు. అలా విక్రమ్‌లో ప్రేక్షకులను రోలెక్స్‌గా భయపెట్టిన సూర్యకు ఈ పాత్ర చేయాలంటే మొదట భయం వేసిందట. చదవండి: ‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సైమా అవార్డు ఫంక్షన్లో తెలిపాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘విక్రమ్‌లో రోలెక్స్ పాత్ర చేయాలంటే మొదట భయంగా అనిపించింది. డైరెక్టర్ లోకేశ్ కనకరాజుకు చేయనని చెబుదామని అనుకున్న. కానీ అదే సమయంలో కమల్ సార్ ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్పారు. దీంతో చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఓకే చెప్పాను. అది కేవలం ఓ వ్యక్తి కోసమే. ఆయనే లోకనాయకుడు కమల్ హాసన్’ అని చెప్పుకొచ్చాడు. కాగా కమల్ హాసన్ హీరోగా నటించి ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. I did it for one man "ulaganayagan" #kamalhassan #Rolex#southfilmfare #filmfareawards2022 @ikamalhaasan @suru #bengaluru pic.twitter.com/yK07292uRm — Civic Ranter (@deerajpnrao) October 9, 2022 -
ఇండస్ట్రీకి హిట్ ఇద్దామనుకున్నా.. విజయ్ స్పీచ్ వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్లో గ్రాండ్‌గా లాంచ్ అవుదామనుకున్నాడు. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు కదా! అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా లైగర్ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడింది. దీంతో అప్పటిదాకా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేసిన విజయ్ ఫ్లాప్ టాక్ రావడంతో మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు. లైగర్ ఫ్లాప్ తర్వాత తొలిసారి సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుకల్లో పాల్గొన్నాడు రౌడీ హీరో. యూత్ ఐకాన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా అవార్డును గెలుచుకున్నాడు. అవార్డును అందుకునే క్రమంలో విజయ్ ఎమోషనలయ్యాడు. 'ఈ వేదికపై అవార్డులు అందుకున్న అందరికీ కృతజ్ఞతలు. గొప్ప సినిమాలు, అద్భుతమైన పర్ఫామెన్స్తో మీరు ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. నేను కూడా ఇండస్ట్రీకి హిట్ ఇద్దామనుకున్నా, అందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు. మనందరికీ మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి. ఏ రోజుల్లోనైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులు కచ్చితంగా, ఎంతో జాగ్రత్తగా పూర్తి చేయాల్సిందే! ఈ ఫంక్షన్‌కు నేను రాకూడదనుకున్నా.. కానీ మీ అందరికీ ఓ విషయం చెప్దామని వచ్చా! మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తానని మాటిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. The One and Only Versatile Actor 🥰😎#VijayDeverakonda 🤗@TheDeverakonda pic.twitter.com/Cvaahvh4oG — Dileep Kushi Rowdy (@Dileep35777546) October 10, 2022 చదవండి: సోషల్ మీడియాకు కరణ్ గుడ్‌బై అమ్మా, నిన్ను ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం: నమ్రత -
‘జనగణమన’ పై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అయితే ఈ చిత్రం విడుదల కంటే ముందే విజయ్, పూరీ కాంబినేషన్లో రెండో చిత్రం ప్రకటించారు. పూరి జగన్నాథ్ తన కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ ను విజయ్‌తో తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే లైగర్ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో.. ‘జనగణమన’ని నిర్మాతలు దూరం పెట్టినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. లైగర్ తర్వాత పూరీ, చార్మీలు సైతం ఈ చిత్రంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అంతేకాదు ‘జనగణమన’ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలను కూడా ఖండించలేదు. ఇలాంటి సమయంలో ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (చదవండి: బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు..ఇలా సైలెంట్ అయ్యారేంటి?) తాజాగా సైమా వేడుకలకు హాజరైన విజయ్‌ని అక్కడి మీడియా ‘జనగణమన’పై ప్రశ్నించగా.. ‘అవన్ని ఇప్పుడెందుకు? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి జగణమన గురించి మర్చిపోండి. సైమా వేడుకను ఎంజాయ్ చేయండి’అని రౌడీ హీరో సమాధానం ఇచ్చాడు. దీంతో నిజంగానే జగగణమన ఆగిపోయిందని, అందుకే ఆ చిత్రంపై స్పందించడానికి విజయ్ ఇష్టపడడంలేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. -
సైమా అవార్డ్స్ లో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
అట్టహాసంగా సైమా అవార్డు వేడుక (ఫొటోలు)
-
సైమా అవార్డు పోటీల్లో ‘పుష్ప’రాజ్ హవా.. బరిలో ఉన్న చిత్రాలివే
దక్షిణాది భాషల్లో రూపొందుతున్న సినిమాలకు ఒకే వేదికపై అవార్డులను అందిస్తున్న సంస్థ సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్). ఈ ఏడాది ఈ వేడుకను సెప్టెంబర్ 10,11 తేదీలలో బెంగళూరులో జరపనున్నారు. ఈ నేపథ్యంలో సైమా వేదికగా తలపడనున్న సినిమాల జాబితాను విడుదల చేశారు. తెలుగు నుంచి పుష్ప, అఖండ, జాతిరత్నాలు, ఉప్పెన చిత్రాలు ఎక్కువ విభాగాలలో నామినేట్ అయ్యాయి. తెలుగు నుంచి పుష్ప అత్యధికంగా 12 విభాగాల్లో నామినేట్ అవ్వడం గమనార్హం. తమిళ్ నుంచి ‘కర్ణన్(10)’, కన్నడ నుంచి ‘రాబర్డ్’, మలయాళం నుంచి ‘మిన్నల్ మురళీ’ చిత్రాలు అత్యధిక నామినేషన్స్ పొందాయి. ఈ మొత్తం నామినేషన్స్ నుంచి విన్నర్‌ను ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసి అవార్డులు అందిస్తారు. ప్రేక్షకులు తమ అభిమాన నటీనటులు, సాంకేతిక నిపుణులకు సైమా వెబ్‌సైట్‌కు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. సైమా అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలివే.. టాలీవుడ్ పుష్ప(అల్లు అర్జున్) : 12 అఖండ(బాలకృష్ణ): 10 జాతిరత్నాలు(నవీన్ పొలిశెట్టి): 8 ఉప్పెన(వైష్ణవ్ తేజ్):8 కోలీవుడ్ కర్ణన్(ధనుష్): 10 డాక్టర్(శివ కార్తికేయన్): 9 మాస్టర్(విజయ్): 7 తలైవి(కంగనా రనౌత్): 7 మాలీవుడ్ మిన్నల్ మురళీ(టోవినో థామస్): 10 కురుప్(దుల్కర్ సల్మాన్):8 మాలిక్(ఫహద్ పాజిల్):6 జోజీ(ఫహద్ ఫాజిల్):6 శాండల్‌వుడ్ రాబర్ట్(దర్శన్):10 గరుడ గమన వృషభ వాహన(రాజ్ బి.శెట్టి): 8 యువరత్న(పునీత్ రాజ్‌కుమార్): 7 -
నాని..ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఊహించావా: సమంత
Samantha Bags Best Actress Award For Oh Baby: హీరోయిన్ సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఒక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్న సమంత ఏ పాత్రలో అయినా జీవించేస్తుంది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) 2019-20 సంవరత్సరాలకు గాను విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ బేబీ చిత్రానికి గాను సమంత ఉత్తమ నటిగా ఎంపికైంది. అయితే ప్రస్తుతం చెన్నైలో ఉన్న సమంత అవార్డు వేడుకకు హాజరు కాలేజకపోయింది. దీంతో సామ్ స్ధానంలో హీరో నాని ఆ అవార్డును అందుకున్నారు. దీనికి సంబంధించి సమంత.. థ్యాంక్యూ నాని..నా బదులు అవార్డును తీసుకున్నందుకు. ఉత్తమ నటి అవార్డును తీసుకుంటావని అని ఎప్పుడైనా ఊహించావా అంటూ ఫన్నీగా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇక జెర్సీ మూవీకి అవార్డు రావడంపై నానికి కంగ్రాట్స్ చెప్పింది. చదవండి : ఆ ప్రశ్న అడగటంతో రిపోర్టర్‌పై సమంత సీరియస్ ప్రియాంక చోప్రాకి థ్యాంక్స్ చెప్పిన సామ్.. వైరల్ -
సైమా అవార్డులు: వేదికపై తారల సందడి.. ఫొటో హైలైట్స్
దక్షిణాది సినీ పురస్కారాల వేడుకలో తారలు తళుక్కుమన్నారు. 2020 ఏడాదికి గాను సైమా అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేదికపై సినీ తారలు రష్మిక మందన్నా, కళ్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి, పూజా హెగ్డే, రీతూ వర్మ, మరికొందరు నటీనటులు సందడి చేశారు. డియర్ కామ్రేడ్లో నటనకు అవార్డు అందుకున్న రష్మిక సైమా వేడుకల్లో రీతూ వర్మ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ఉత్తమ నటిగా పూజా హెగ్డే (అల వైకుంఠపురములో..) డ్యాన్స్‌తో ఆకట్టుకున్న ఫరీయా అబ్దుల్లా క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ కథానాయికగా ఐశ్వర్యారాజేష్ (వరల్డ్ ఫేమస్ లవర్) నిక్కీ గల్రానీ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
SIIMA Awards 2021: అవార్డుల వేడుకలో మెరిసిన నటీ, నటులు( ఫోటోలు)
-
సైమా 2019 : టాలీవుడ్ విజేతలు వీరే!
దక్షిణాది సినీ రంగాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) కార్యక్రమాన్ని ఈ ఏడాది ఖతర్‌లోని దోహాలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆగస్టు 15న ప్రారంభమైంది. తొలి రోజు తెలుగు, కన్నడ పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ అవార్డ్స్‌లో అత్యథిక అవార్డులతో రంగస్థలం సత్తా చాటింది. సైమా అవార్డ్స్ 2019 విజేతలు ఉత్తమ చిత్రం : మహానటి ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (రంగస్థలం) ఉత్తమ నటుడు : రామ్‌చరణ్ (రంగస్థలం) ఉత్తమ నటి : కీర్తి సురేష్ (మహానటి) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్ దేవరకొండ( గీత గోవిందం) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం) ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్ ( మహానటి) ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం) ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో) ఉత్తమ విలన్ : శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా) ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం) ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (ఎంత సక్కగున్నవవే - రంగస్థలం) ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా - ఆర్ఎక్స్ 100) ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ - రంగస్థలం) ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్ (విజేత) ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్ రాజ్‌పుత్ (ఆర్ఎక్స్ 100) ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్ భూపతి (ఆర్ఎక్స్ 100) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు (రంగస్థలం) ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రంగస్థలం) సామాజిక మాధ్యమాల్లో పాపులర్ స్టార్ : విజయ్ దేవరకొండ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా సైమా వేడుకలు