
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అయితే ఈ చిత్రం విడుదల కంటే ముందే విజయ్, పూరీ కాంబినేషన్‌లో రెండో చిత్రం ప్రకటించారు. పూరి జగన్నాథ్ తన కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ ను విజయ్‌తో తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు వార్తలు వినిపించాయి.
అయితే లైగర్ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో.. ‘జనగణమన’ని నిర్మాతలు దూరం పెట్టినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. లైగర్ తర్వాత పూరీ, చార్మీలు సైతం ఈ చిత్రంపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అంతేకాదు ‘జనగణమన’ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలను కూడా ఖండించలేదు. ఇలాంటి సమయంలో ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(చదవండి: బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు..ఇలా సైలెంట్ అయ్యారేంటి?)
తాజాగా సైమా వేడుకలకు హాజరైన విజయ్‌ని అక్కడి మీడియా ‘జనగణమన’పై ప్రశ్నించగా.. ‘అవన్ని ఇప్పుడెందుకు? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి జగణమన గురించి మర్చిపోండి. సైమా వేడుకను ఎంజాయ్ చేయండి’అని రౌడీ హీరో సమాధానం ఇచ్చాడు. దీంతో నిజంగానే జగగణమన ఆగిపోయిందని, అందుకే ఆ చిత్రంపై స్పందించడానికి విజయ్ ఇష్టపడడంలేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment