Jana Gana Mana
-
'జన గణ మన'ను జాతీయ గీతంగా స్వీకరించింది ఈరోజే!
'జన గణ మన'ను జాతీయ గీతంగా స్వీకరించింది ఈరోజే. భారత రాజ్యంగ సభ జనవరి 24 1950లో జన గణ మన గీతాన్ని భారత జాతీయ గీతంగా ఆమోదించింది. అయిదు పాదాలున్న ‘భారత భాగ్య విధాత’లోని మొదటి పాదాన్ని జాతీయ గీతంగా స్వీకరించారు. రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ఈ గీతానికి సంగీత బాణిని సమకూర్చింది కూడా ఆయనే.ఒకసారి మదనపల్లిలోని బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్‌ని 1919లో రవీంద్రనాద్ ఠాగూర్ సందర్శించాడు. ఆ కాలేజీలో ఉన్నప్పుడు జన గణ మన గీతాన్ని ‘మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు. 52 సెకండ్లలో జాతీయగీతం.. జాతీయ గీతం పూర్తిగా 52 సెకండ్ల కాలవ్యవధిలో ఆలపించాలి. జాతీయ గీతాన్ని ఈ కింది ప్రభుత్వ కార్యక్రమాలలో, వివిధ సందర్భాలలో పూర్తిగా వినిపించాలి. సివిల్, మిలటరీ ఇన్ స్టిట్యూట్స్, రాష్ట్రపతి, గవర్నర్ కు గౌరవందనం సందర్భాల్లో ఆలపించాలి. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ వంటి ప్రముఖులు లేకున్నప్పటికీ పరేడ్లలో ఆలపిస్తారు. రాష్ట్రప్రభుత్వ అధికార కార్యక్రమాలకు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజా సందోహ కార్యక్రమాలకు రాష్ట్రపతి వచ్చినప్పుడు, వెళ్తున్నప్పుడు, ఆకాశవాణిలో రాష్ట్రపతి జాతినుద్దేశించి చేసే ప్రంగానికి ముందు, వెనుక ఆలపిస్తారు. రాష్ట్ర గవర్నర్ తన రాష్ట్ర పరిధిలో అధికారిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు, నిష్క్రమించేటప్పుడు, జాతీయ పతాకాన్ని పరేడ్‌కు తెచ్చినప్పుడు, రెజిమెంటల్ కలర్స్ బహుకరించినప్పుడు, నౌకాదళంలో కలర్స్ ఆవిష్కరించినప్పుడు ఈ గీతాన్ని ఆలపిస్తారు. కొన్ని సందర్భాల్లో జాతీయ గీతాన్ని సంక్షిప్తంగా మొదటి, చివరి వరుసలను ఆలపించుకోవచ్చు. అలా ఆలపించడం 52 సెకండ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే? హడావిడిగా ఏదో పాడేశాం అన్నట్లుగానూ లేక సాగదీసినట్లుగా పాకుండా ఉండేదుకు ఇలా వ్యవధిని నిర్ణయించారు. మన జాతీయ గీతాన్ని గౌరవప్రదంగా ఆలపించదగినది అని చెప్పడానికే ఇలా వ్యవధిని ఏర్పాటు చేశారు. 1947లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జాతీయ గీతం గురించి భారత ప్రతినిధి బృందానికి అడిగినప్పుడు జన గణ మన రికార్డింగ్‌ను జనరల్‌అసెంబ్లీకి అందించారు. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతినిధుల ముందు జాతీయగీతాన్ని ఆలపించారు. అయితే మన జాతీయ గీతాన్ని అన్ని దేశాలు ప్రశంసించాయి. మూడు సంవత్సరాల తర్వాత అంటే 1950 జనవరి 24న భారత రాజ్యాంగంపై సంతకం చేయడానికి అసెంబ్లీ సమాశమైంది. ఈ సమయంలో దేశ మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ అధికారికంగా 'జన గణ మన' ను జాతీయ గీతంగా ప్రకటించారు. దీంతో మన గణతంత్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు ఇవాళే(జనవరి 24)న 'జన గణ మన'ను జాతీయగీతంగా స్వీకరించింది. (చదవండి: తొలిసారిగా మొక్కలు మాట్లాడుకోవడాన్ని కెమెరాలో బంధించిన శాస్త్రవేత్తలు!) -
ఆర్మీ క్యాంపులో విజయ్ దేవరకొండ.. ఆ ప్రాజెక్ట్ కోసమేనా?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ షూటింగ్లో బిజీ అయిపోయాడా? లైగర్ ఫ్లాప్ తర్వాత కాస్త విరామం తీసుకున్న యంగ్ హీరో మరో ప్రాజెక్ట్ కోసం సిద్ధమయ్యాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తన తదుపరి సినిమా జనగణమన షూటింగ్ కోసం సైనికులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గన్ పట్టుకుని ఉన్న ఓ ఫోటోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. బాక్సాఫీస్ వద్ద లైగర్ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆపేసినట్లు చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా విజయ్ ఆర్మీ క్యాంపులో కనిపించడంతో ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఫోటో-షేరింగ్ యాప్‌లో చిత్రాన్ని షేర్ చేసిన విజయ్ దేవరకొండ.. 'దేశంలో అత్యంత పెద్ద దుర్ఘటన యూరీ' అని రాశాడు. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా ప్రకటన కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ఛాపర్ నుండి బయటకు రావడం కనిపించింది. గతంలో ఈ చిత్రం ఆగిపోయిందన్న రూమర్లను నిర్మాత ఛార్మీ కౌర్ అవన్నీ ఫేక్ అంటూ ట్వీట్ చేసింది. వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్‌ల సహకారంతో ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. ఈ పాన్-ఇండియా చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో 3 ఆగస్టు 2023న విడుదల కానుంది. -
‘జనగణమన’ పై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అయితే ఈ చిత్రం విడుదల కంటే ముందే విజయ్, పూరీ కాంబినేషన్లో రెండో చిత్రం ప్రకటించారు. పూరి జగన్నాథ్ తన కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ ను విజయ్‌తో తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే లైగర్ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో.. ‘జనగణమన’ని నిర్మాతలు దూరం పెట్టినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. లైగర్ తర్వాత పూరీ, చార్మీలు సైతం ఈ చిత్రంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అంతేకాదు ‘జనగణమన’ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలను కూడా ఖండించలేదు. ఇలాంటి సమయంలో ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (చదవండి: బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు..ఇలా సైలెంట్ అయ్యారేంటి?) తాజాగా సైమా వేడుకలకు హాజరైన విజయ్‌ని అక్కడి మీడియా ‘జనగణమన’పై ప్రశ్నించగా.. ‘అవన్ని ఇప్పుడెందుకు? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి జగణమన గురించి మర్చిపోండి. సైమా వేడుకను ఎంజాయ్ చేయండి’అని రౌడీ హీరో సమాధానం ఇచ్చాడు. దీంతో నిజంగానే జగగణమన ఆగిపోయిందని, అందుకే ఆ చిత్రంపై స్పందించడానికి విజయ్ ఇష్టపడడంలేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. -
భారత్‌కు పాక్ మ్యుజీషియన్ కానుక.. ‘రబాబ్’పై జనగణమన వినిపించి..!
ఇస్లామాబాద్: భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పుసర్కరించుకుని.. మన జాతీయ గీతమైన ‘జనగణమన’ను ‘రబాబ్’ ద్వారా వాయించి భారతీయులకు అంకితమిచ్చాడు పాకిస్థాన్‌కు చెందిన సియాల్ ఖాన్ రబాబ్ వాయిద్యకారుడు. భారత జాతీయ గీతమైన ‘జనగణమన’ను రబాబ్(తంబూర తరహాలో ఉండే రబాబ్ పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌తోపాటు కశ్మీర్‌లోనూ ప్రసిద్ధి)తో అద్భుతంగా వాయించారు సియాల్ ఖాన్. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘సరిహద్దుల్లో ఉన్న వీక్షకులకు నా కానుక’ అంటూ ఆ వీడియోను పోస్టు చేశారు సియాల్ఖాన్. ‘భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇరు దేశాల మధ్య శాంతి, సామర్యం, సంబంధాలు ఏర్పడేందుకు.. స్నేహం, సద్భావనకు చిహ్నంగా భారతదేశ జాతీయ గీతాన్ని ప్రయత్నించాను’ అంటూ సంగీతకారుడు జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు ఒక మిలియన్ మంది వీక్షించారు. Here’s a gift for my viewers across the border. 🇵🇰🇮🇳 pic.twitter.com/apEcPN9EnN — Siyal Khan (@siyaltunes) August 14, 2022 ఇదీ చదవండి: పామును ముక్కలుగా కొరికేసిన రెండేళ్ల చిన్నారి! -
7 గంటలు.. 75 సార్లు..
సప్తగిరికాలనీ(కరీంనగర్): కృషి ఉంటే సాధించనిది ఏదీ లేదని నిరూపించింది కరీంనగర్ జిల్లాకేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన పండుగ అర్చన. 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆజాదికా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయగీతం జనగణమన ఐదు చరణాల్లో 7 గంటల్లో 75 సార్లు పాడింది. కరీంనగర్‌లోని ఓ హోటల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ ఘనత సాధించిన అర్చన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించింది. నగరానికి చెందిన పండుగ కీర్తి కుమార్, దేవపాలా కూతురు అర్చన. ఐదోతరగతి నుంచే జెండా పండుగల్లో జాతీయ గీతాన్ని ఆలపించేది. నాలుగు పీజీలు పూర్తిచేసిన అర్చన నగరంలోని ఓ ప్రయివేటు కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా ఉద్యోగం చేస్తోంది. అర్చనను సన్మానిస్తున్న సీపీ సత్యనారాయణ లాక్డౌన్ తెచ్చిన ఆలోచన చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలు అధికంగా ఉన్న అర్చన 2020లో వచ్చిన కరోనా లాక్డౌన్ సరికొత్త ఆలోచనను తీసుకొచి్చంది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన అర్చన జాతీయ గీతాన్ని ఆలపించే సంకల్పాన్ని పెట్టుకుంది. ఈ అంశంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాలంటే ఏం చేయాలనే పలువురి సలహాలు తీసుకుంది. ఏడాదికాలంగా సీరియస్‌గా సాధన చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో సంపూర్ణ జనగణమనను ఐదు చరణాల్లో 75 సార్లు 7 గంటల పాటు పాడి రికార్డుకెక్కింది. మన జాతీయగీతానికి ఉన్న పవిత్రతను ప్రపంచానికి చాటేందుకే ఈ కార్యక్రమం చేసినట్లు అర్చన తెలిపింది. మరిన్ని రికార్డులు సాధించాలి అంతకుముందు ఉదయం ఈ కార్యక్రమాన్ని మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ప్రారంభించారు. అనంతరం అర్చనను పోలీస్ కమిషనర్ సత్యనారాయణ శాలువాతో సత్కరించారు. పట్టుదలతో జాతీయ గీతాన్ని పాడి మన జాతీయ గీతానికి ఉన్న మహాత్యాన్ని తేలియజేసేలా ప్రయత్నం చేస్తున్న అర్చన రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ముగింపు కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ హాజరై అర్చనను అభినందించారు. చొప్పరి జయశ్రీ, గుంజపడుగు హరిప్రసాద్, సాదవేణి వినయ్, పొన్నం అనిల్‌గౌడ్, తిరుపతి, కుమార్, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
జైహింద్ స్పెషల్: జాతీయ గీతానికి ‘మదన’పల్లె రాగం
గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ (1861–1941) బెంగాలీ భాషలో రచించిన ‘జనగణమన’ గీతాన్ని మదనపల్లెలో ఇంగ్లీష్ లోకి అనువదించారనీ, అక్కడే ఆ గీతానికి రాగాలు కట్టారని చరిత్ర చెబుతోంది! ఏమిటి మదనపల్లెకు, ఠాగూరు గీతానికి సంబంధం? కేవలం 52 సెకన్ల నిడివి గల ‘జనగణమన’ గీతాన్ని స్వాతంత్య్రం పొందిన భారతదేశం 1950 జనవరి 24న జాతీయగీతంగా స్వీకరించింది. తొలి రిపబ్లిక్ దినోత్సవానికి రెండు రోజుల ముందు అన్నమాట! రాగానికి ముందే గానం కలకత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో 1911 డిసెంబర్ 27న తొలిసారి ఈ గీతాన్ని (ఓ పెద్ద సమావేశంలో) పాడారు. అంతకుముందు పాట సిద్ధమయ్యాక 1911 డిసెంబర్ 11న రిహార్సల్స్ చేసినప్పుడు పాడారు. తర్వాత 1912 జనవరిలో కలకత్తాలో జరిగిన బ్రహ్మ సమాజం ప్రార్థనా సమావేశంలో (మూడోసారి) పాడారు. అంతేకాక బ్రహ్మ సమాజం వారి తత్వబోధిని పత్రిక 1912 జనవరి సంచికలో ఈ గీతం అచ్చయ్యింది. ఠాగూరు మేనకోడలు సరళాదేవి చౌదరి 1912లో పాడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనలన్నీ కలకత్తాలోనే జరిగాయి. ఆ పాట బెంగాలీ భాషలో పాడబడింది. 1913లో సాహిత్యపు నోబెల్ బహుమతి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ రచనకు రావడం మరో విశేషం. ఇది భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే తొలి నోబెల్ బహుమతి! దక్షిణాదికి ‘దివ్యజ్ఞానం’ 1914లో బాలగంగాధర తిలక్ మహాశయుడు పూనా పట్టణంలో ‘హోమ్ రూల్ లీగ్’ ను స్థాపించి ఉద్యమంగా చేపట్టారు. అనిబిసెంట్ కు ఇది బాగా నచ్చింది. దక్షిణాదిలో ఇలాంటి ఉద్యమాన్ని అదే పేరుతో 1916లో ప్రారంభించారు. దీనికి ముందే అనిబిసెంట్ పూనికతో ‘దివ్యజ్ఞాన సమాజం’ మద్రాసులో ఏర్పడి, మంచి వనరులు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంతో 1915లో మదనపల్లెలో బీసెంట్ థియోసాఫికల్ కళాశాల (బి.టి.కాలేజి) స్థాపించారు. అంతకుముందు ఇండియన్ బాయ్స్ స్కౌట్ మూవ్మెంట్, నేషనల్ ఎడ్యుకేషన్ స్కీమ్ నిర్వహించి, ఆ ప్రాంతానికి కళాశాల అవసరమని భావించి, దివ్యజ్ఞాన సమాజం వారు మదనపల్లెలోనే ప్రారంభించారు. ధర్మవరం, మదనపల్లె, చిత్తూరు, చంద్రగిరి, కడప వంటిచోట్ల థియోసాఫికల్ సొసైటీ వారి లాడ్జిలు (కేంద్రాలు) ఏర్పడ్డాయి. మదనపల్లెకు ఠాగూర్ తెలుగు ప్రాంతాలలో హోమ్ రూల్ ఉద్యమం దివ్యజ్ఞాన సమాజం వ్యక్తుల చేయూతతో పుంజుకుంది. హోమ్ రూల్ ఉద్యమ వ్యాప్తికి ’ఆంధ్ర తిలక్’ గాడిచర్ల హరిసర్వోత్తమరావు చేసిన కృషి విశేషమైనది. బి.టి.కళాశాల విద్యార్థులు హోమ్ రూల్ ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలు వివిధ ప్రాంతాలలో అందజేసేవారు. బ్రిటిష్ వారికిది కంటగింపుగా తయారైంది. ఫలితంగా 1917 జూన్ 16న బి.పి. వాడియా, జి.ఎస్.ఆరండేల్ తో కలసి అనిబిసెంట్ ను అరెస్టు చేశారు. ఈ సమయంలో బి.టి. కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా సమావేశాలు నిర్వహించారు. ఇలాంటి సమావేశాలకు బి.టి. కళాశాల కేంద్ర బిందువు అయ్యింది. ఈ విషయాలను బ్రిటిషు ప్రభుత్వం గుర్తు పెట్టుకుంది. 1917 సెప్టెంబరులో అనిబిసెంట్, ఆమె సహచరులు కారాగారం నుంచి విముక్తులయ్యారు. కానీ, బి.టి. కళాశాలకు మద్రాసు విశ్వవిద్యాలయపు అనుబంధాన్ని రద్దు చేశారు. ఈ సమయంలో అనిబిసెంట్ విభిన్నంగా ఆలోచించి రవీంద్రనాథ్ ఠాగోర్ నిర్వహించే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా చేశారు. ఇదీ నేపథ్యం! కనుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెను సందర్శించారు. గురుదేవుని గీతాలాపన గురుదేవులు 1919లో మదనపల్లె వచ్చినపుడు బి.టి. కళాశాలలోని బిసెంట్ హాల్ లో ఫిబ్రవరి 28న ‘జనగణమన’ గీతాన్ని స్వయంగా పాడారు. ఆ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న మార్గరెట్ కజిన్ (Mrs Margaret Cousins) ఈ గీతాన్ని ఠాగూర్ సలహాల మేరకు పాశ్చాత్య బాణిలో రాగాలు రాశారు. మార్గరెట్ కజిన్స్ ఐరిష్ కవి డా. జేమ్స్ కజిన్స్ శ్రీమతి. ఈ సంగతులన్నీ డా. జేమ్స్ కజిన్స్ రాసిన ఆత్మకథ ‘వుయ్ టు టుగెదర్’ అనే గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి! అదే సమయంలో ఠాగూర్ ‘జనగణమన’ బెంగాలి గీతాన్ని ‘ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’గా తనే ఆంగ్లంలోకి అనువదించారు. 2018–19 సమయంలో మదనపల్లెలోని బి.టి. కళాశాలలో ఈ అపురూప సంఘటనలకు శత వార్షిక ఉత్సవాలు జరిగాయి. కానీ కలకత్తా వెలుపల మొట్టమొదటిసారి ‘జనగణమన’ గీతం పాడబడింది మదనపల్లెలోనే. ఈ రకంగా మదనపల్లె పట్టణానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ ఊరితో మన జాతీయ గీతానికి సంబంధించి ఇన్ని సందర్భాలు ముడిపడి ఉన్నాయి. భారత్‌కు ముందే బోస్! అప్పటికి ఈ గీతానికి పెద్ద ప్రాచుర్యం లేదు. 1935లో డెహ్రడూన్ స్కూల్ లో పాఠశాల గీతంగా స్వీకరించారు. సుభాష్ చంద్రబోస్ తన ఐఎన్ఏ సమావేశంలో 1942 సెప్టెంబరు 11న ఈ పాటను భారతదేశపు జాతీయ గీతంగా పాడించారు. 1945 లో ‘హమ్ రహి’ సినిమాలో తొలిసారిగా వాడారు. ఠాగూర్ 1941లో గతించారు, ఈ గీతానికి సంబంధించి ఏ వైభవాన్నీ వారు చూడలేదు! ‘జనగణమన’ గీతచరిత్రలో మదనపల్లె చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది! -డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
వ్యవస్థల తీరుపై ప్రశ్నల వర్షం.. 'జన గణ మన' రివ్యూ
టైటిల్: జన గణ మన (2022) నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడ్, మమతామోహన్ దాస్, జీఎమ్ సుందర్ తదితరులు కథ: షరీస్ మహమ్మద్ దర్శకత్వం: డిజో జోస్ ఆంటోని సంగీతం: జేక్స్ బిజోయ్ నిర్మాతలు: పృథ్వీరాజ్ సుకుమారన్, లిస్టిన్ స్టీఫెన్ ఓటీటీ విడుదల తేది: జూన్ 2, 2022 (నెట్‌ఫ్లిక్స్) విభిన్నమైన కథా కథనాలతో ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది మలయాళ సినీ ఇండస్ట్రీ. అందులోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాల ఎంపికను మెచ్చుకోక తప్పదు. నటుడిగా అయ్యప్పనుమ్ కోషియుమ్, డైరెక్టర్‌గా లూసీఫర్ తదితర చిత్రాలతో అలరించిన ఆయన తాజాగా 'జన గణ మన' సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలైనప్పటికీ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో సందడి చేస్తున్న ఈ సినిమా నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్న 'జన గణ మన' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ సబా మరియం (మమతా మోహన్ దాస్)ను రేప్ చేసి శరీరాన్ని కాల్చి చంపేశారని మీడియాలో నేషనల్ హైడ్‌లైన్ అవుతుంది. తమ ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని నిరసనకు దిగుతారు ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్. దీంతో ఆ కేసును చేధించమని ఏసీపీ సజ్జన్ కుమార్ (సూరజ్ వెంజరమూడ్)ను ఆదేశిస్తుంది ప్రభుత్వం. మరీ రంగంలోకి దిగిన ఆ ఏసీపీ ఏం చేశాడు ? ఆమెను హత్య చేయడానికి కారణమేంటి ? కారకులెవరు ? వారిని ఏ విధంగా శిక్షించాలని సమాజం కోరుకుంది ? తర్వాత ఏసీపీ ఎదుర్కొన్న పరిణామాలేమిటి ? కోర్టులో లాయర్ అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సంధించిన ప్రశ్నలు ఏంటి ? తదితర ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: సత్యమేవ జయతే.. సత్యానికి అబద్ధం ఎన్నిసార్లు అడ్డుగా నిలుచున్నా, చివరిగా కటిక చీకట్లో ఉన్న సత్యం వెలుగులోకి రాక తప్పదు అని 'జన గణ మన' సినిమా ద్వారా తెలియజేశారు. ఇది పేరుకు సినిమా అయినా ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులకు 2 గంటల 41 నిమిషాల నిదర్శనం. విద్య, న్యాయ, పోలీసు, మీడియా, రాజకీయ వ్యవస్థ ఇలా ప్రతీ అంశాన్ని తడిమారు. ఈ వ్యవస్థల ఉనికి, విశ్వసనీయతను సూటిగా ప్రశ్నించారు. సమాజంలో అవి ఎలాంటి పరిస్థితులో ఉన్నాయి, వర్ణ, కుల, మత, జాతి విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రభుత్వాలు తమ గెలుపు కోసం పరిస్థితులను ఎలా మార్చుకుంటాయి ? అందుకోసం ఏం చేస్తాయి? విద్యార్థులను ఏ విధంగా వాడుకుంటాయి? వంటి విషయాలను తెరపై చూపించి వాటన్నింటి గురించి ఆలోచింపజేసేలా సినిమా ఉంది. ఏది అబద్ధం, ఏది నిజం అనేది సమాజం ఎలా నిర్ణయిస్తుందో, ఏ దృక్కోణంతో ఆలోచిస్తుందో, ఎలా ప్రభావితమవుతుందో సమాజానికి చూపించారు. ఎవరెలా చేశారంటే ? సమాజంలో నెలకొన్న పరిస్థితులు, ప్రతి ఒక్క అంశాన్ని ధైర్యంగా చూపించిన డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనికి, ఈ సినిమా నిర్మించిన పృథ్వీరాజ్ సుకుమారన్‌కు హాట్సాఫ్ చెప్పాల్సిందే. కథ అందించిన షరీస్ మహమ్మద్‌కు, జేక్స్ బిజోయ్ సంగీతానికి ప్రశంసలు దక్కాల్సిందే. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వాళ్ల నటనతో అదరగొట్టారు. ఫస్టాఫ్‌లో సూరజ్ తనవైపు దృష్టిని ఆకర్షిస్తే, సెకండాఫ్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రేక్షకులను నిజాలతో కట్టిపడేస్తాడు. ప్రొఫెసర్ సబా మరియంగా మమత మోహన్ దాస్ సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చింది. కోర్టు సీన్లో వచ్చే సన్నివేశాలు, సినిమాలోని డైలాగ్‌లు హైలెట్‌గా నిలిచాయి. చివరిగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మాత్రమే కాదు, సమాజానికి ఓ కనువిప్పు ఈ 'జన గణ మన'. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
పూరీ జగన్నాథ్ 'జనగణమన' పోస్టర్ లాంచ్.. అప్పుడే వార్ స్టార్ట్
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ 'జనగణమన' (JGM). రౌడీ హీరో విజయ్ దేవరకొండతో జగన్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. ఇదివరకే పాన్ ఇండియాగా 'లైగర్' మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ క్రేజీ కాంబోగా వస్తోన్న ఈ 'జనగణమన' చిత్రం పోస్టర్, విడుదల తేదిని ప్రకటించారు. ఈ పోస్టర్ లాంచ్‌ను మంగళవారం (మార్చి 29) ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ఆర్మీ డ్రెస్‌లో ప్రత్యేక ఛాపర్లో ముంబై చేరుకున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సైనికుడిగా కనిపించనున్నాడు రౌడీ హీరో. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ 'నేను ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. నేను చూసిన స్క్రిప్ట్‌లలో ఇది చాలా ఛాలెంజింగ్ కథ. ఈ సినిమా కథ ప్రతీ భారతీయుడికి హత్తుకుంటుంది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడూ చేయని పాత్రను జెజీఎంలో చేస్తున్నాను. ఆ పాత్ర ప్రభావం ప్రేక్షకులపై కచ్చితంగా ఉంటుందని విశ్వవిస్తున్నాను.' అని తెలిపాడు. 'మా తర్వాతి ప్రాజెక్ట్ జెజీఎం పోస్టర్‌ను నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ్‌తో మళ్లీ కలిసి పనిచేయడం గొప్పగా అనిపిస్తుంది. ఇది ఒక బలమైన కథ, కథనంతో ఉన్న అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్.' అని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ బాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఆగస్టు 3, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 2022లో షూటింగ్ ప్రారంభంకానుంది. -
పూరి పక్కా ప్లాన్.. ఈ ఏడాదిలోనే ‘జనగణమన’!
టాలీవుడ్ టాప్ స్పీడ్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ పేరు ముందు వరుసలో ఉంటుంది.జెట్ స్పీడ్ కు బ్రాండ్ అంబాసిడర్ పూరి.అలాంటి దర్శకుడ్ని రేస్ లో వెనుకపడేలా చేసింది కరోనా. లైగర్ రెండేళ్లుగా నిర్మాణం తర్వాత పూర్తైంది.కాని రిలీజ్ కోసం ఆగస్ట్ 25 వరకు వెయిట్ చేయాలి.అంటే దాదాపు ఆరు నెలలు సమయం ఉంది.అందుకే నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ చేతిలో జనగణమన అనే పవర్ ఫుల్ స్క్రిప్ట్ ఉంది.చాలా కాలం క్రితమే సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో తీయాలనుకున్న సినిమా ఇది. ఇప్పుడు అతని ఫ్యాన్ విజయ్ దేవరకొండతో మూవీ తెరకెక్కిస్తున్నాడు.పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్.అందుకే జాన్వి కపూర్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఏప్రిల్ నుంచే రెగ్యులర్ షూట్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం జనగణమన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది. ఆగస్ట్ 25న లైగర్ పూర్తి అయ్యే నాటికి,జనగణమన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ.సో ఇదే ఏడాది జనగణమన కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు లైగర్ కోసం పొడవాటి జుట్టుతో కనిపించిన విజయ్.. జనగణమన కోసం మిలట్రీ హెయిర్ కట్ లోకి మారిపోనున్నాడట.ఆ లుక్ టెర్రిఫిక్ గా ఉండనుందని యూనిట్ చెప్పుకొస్తోంది. -
'జనగణమన'పై అధికారిక ప్రకటన.. హీరో ఎవరంటే?
ఇండస్ట్రీలో డ్రీమ్ అనేది సర్వసాధారణంగా వినిపించే పదం. డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ కాన్సెప్ట్, డ్రీమ్ రోల్, డ్రీమ్ కాంబినేషన్ అనేవి తరచూ వినిపిస్తుంటాయి. అలా పూరీ జగన్నాథ్‌కు కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే జనగణమన. ఈ సినిమా తెరకెక్కించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. కానీ ఏళ్లతరబడి వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కేందుకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు పూరీ. ఈ మేరకు చార్మీ కౌర్.. పూరీ మాట్లాడిన ఆయోను రిలీజ్ చేసింది. 'ఇప్పుడే లైగర్ షూటింగ్ పూర్తైంది.. ఈ రోజుతో జనగణమన..' అంటూ త్వరలోనే ఈ సినిమా మొదలు పెట్టనున్నట్లు హింట్ ఇచ్చారు. అయితే గతంలో జనగణమన స్క్రిప్ట్‌ను మహేశ్‌కు వినిపించగా ప్రిన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గణ్ లాంటి ఉద్ధండులతో పాన్ ఇండియా లెవల్లో తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ చార్మి కౌర్ తన ట్వీట్లో విజయ్ దేవరకొండ పేరు మెన్షన్ చేయడంతో అందరూ ఈ చిత్రంలో అతడే హీరో అని చర్చించుకుంటున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. #LIGER #JGM@TheDeverakonda #purijagannadh pic.twitter.com/iI80NUAg5c — Charmme Kaur (@Charmmeofficial) February 6, 2022 -
మహేశ్ కాదనుకుంది పవన్ ఓకే చెప్తాడా?
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలల ప్రాజెక్ట్ "జనగణమన". దీన్ని పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తానని కొన్నేళ్ల క్రితం ప్రకటించాడాయన. కానీ ఎంత త్వరగా మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూనే వస్తోంది. మొదట్లో ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో తీస్తున్నట్లు వెల్లడించాడు పూరీ. కానీ అకస్మాత్తుగా ఈ ఇద్దరి మధ్య విభేదాలు తొంగి చూడటంతో అది అర్ధాంతరంగా ఆగిపోయింది. అంతేకాదు, భవిష్యత్తులోనూ మహేశ్‌తో సినిమాలు చేయనని పూరీ ప్రకటించడంతో పెద్ద వివాదమే చెలరేగింది. (చదవండి: పవన్ కల్యాణ్, రానా యాక్షన్) ముచ్చటగా మూడోసారి చర్చలు అయితే ఆ తర్వాతి కాలంలో మహేశ్ తన ఫేవరెట్ డైరెక్టర్ పూరీ అని చెప్పడమే కాక, ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో జనగణమన తిరిగి పట్టాలెక్కుతుందని అంతా భావించారు, కానీ అలా జరగలేదు. తాజాగా ఈ సినిమా కథను పవన్ కల్యాణ్‌కు వినిపించాడట పూరీ. ఇప్పటికే హైదరాబాద్‌లో వీళ్లిద్దరూ రెండు సార్లు సమావేశమై కథ గురించి చర్చించారట. కానీ పవన్ చేతిలో ఇప్పటికే బోలెడన్ని సినిమాలు ఉండటంతో ఆయన ఏమీ స్పందించడం లేదట. లేటైనా సరే కానీ పవన్‌తోనే చేసేందుకు పట్టుపడుతున్నాడట పూరీ. దీంతో మూడో దఫా చర్చలు జరుగుతున్నాయి. ఎలక్షన్స్‌కు ముందు జనగణమన ఇక ఈ సినిమాను రాబోయే సాధారణ ఎన్నికలకు ముందే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు పూరీ. దీంతో పొలిటికల్ పంచులతో సాగే ఈ సినిమా తనకేమైనా ప్లస్ అవుతుందేమోనని సినిమాలో నటించేందుకు పవన్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నిజానికి 'కెమెరామన్ గంగ'తో రాంబాబు ఫ్లాఫ్ కావడంతో పవన్.. పూరీని పక్కన పెట్టేసినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ అదంతా గతం. ఇప్పుడు పవన్ మరోసారి అతడితో కలిసి ప్రయాణం మొదలు పెట్టేందుకు సుముఖత చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ సినిమా మొదలు పెట్టాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఎందుకంటే పూరీ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'లైగర్' చేస్తున్నాడు. దీంతో పాటు బాలీవుడ్లో ఓ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నాడు. అటు పవన్ కూడా బోలెడన్ని సినిమాలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్లో భారీ అగ్ని ప్రమాదం) -
బుడ్డోడి జనగణమన.. వైరల్ వీడియో
‘జనగణమన అధినాయక జయహే..’ ఈ పాట ఎవరూ పాడినా..ఎప్పుడు పాడినా భారతీయులు గుండెలు ఉప్పొంగుతాయి. దేశభక్తి పెల్లుబుక్కుతుంది. మరి ముద్దొచ్చే ఓ చిన్నారి పాడితే.. ఈ వీడియో వైరల్ కాకుండా ఎలా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ బుడ్డోడు జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాతీయ గీతాన్ని మనస్సుపెట్టి హృదయం ఉప్పొంగేలా చిన్నారి ఆలపిస్తున్న ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. నోరు సరిగ్గా తిరగకపోయినా.. జాతీయ గీతంలోని కొన్ని చరణాలను కలిపేస్తూ.. చివర్లో కొన్ని చరణాలను మరిచిపోయి.. బుడ్డుడో లీనమై దేశభక్తి చాటేలా పాడిన తీరు నెటిజన్లను ముగ్ధులను చేస్తోంది. చిరుప్రాయంలోనే జాతీయగీతాన్ని గుర్తుంచుకొని పాడిన బుజ్జాయిని అభినందిస్తూ.. ప్రశంసిస్తూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. -
జన గణ మన.. అక్కడ ఫస్ట్ టైమ్
అగర్తలా : త్రిపుర రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ ఘట్టం చోటు చేసుకుంది. జాతీయ గీతం జన గణ మనను రాష్ట్ర అసెంబ్లీలో తొలిసారిగా ప్రదర్శించారు. శుక్రవారం ఉదయం స్పీకర్ పదవి కోసం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొటెం-స్పీకర్‌గా వ్యవహరించిన రతన్ చక్రవర్తి తన స్థానానికి రాగానే జన గణ మనను ప్రదర్శించారు. ఆ సమయంలో సభలో ఉన్న సభ్యులు, అధికారులు, పాత్రికేయులు అంతా నిల్చుని గౌరవించారు. తర్వాత జరిగిన ఎన్నికలో రెబతీ మోహన్ దాస్‌ను స్పీకర్‌గా ఎన్నుకున్నారు. ‘దేశంలోని ఇతర రాష్ట్రాల శాసన సభల్లో జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తారో లేదో? నాకు తెలీదు,కానీ, ఇకపై మాత్రం రోజూ జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తాం అని అసెంబ్లీ కార్యదర్శి బామ్‌దేవ్ మజుందార్ వెల్లడించారు. అయితే ప్రతిపక్ష కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమను సంప్రదించకుండానే ఏపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ సీపీఎం పార్టీ నేత బాదల్ చౌదరి చెబుతున్నారు. సింధీలు కూడా మనకు అంటరాని వారేనా! -
సింధీలు కూడా మనకు పరాయివారేనా!
సాక్షి, న్యూఢిల్లీ : సింధీలను భారతీయుల నుంచి ఎవరు వేరు చేయలేరు. నేడు వారు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడ్డా తాము భారతీయులమనే గర్వంగా చెప్పుకుంటారు. వారు పుట్టింది పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రమైనా వారు పెరిగిందీ, ప్రేమించిందీ భారత్‌నే. భారతీయ సంస్కృతి సంప్రదాయాలనే. దేశ విభజన సందర్భంగా పాక్ పాలకులు వారిని తరిమికొడితే మనమేమి వారిని అక్కున చేర్చుకోలేదు. అప్పటికీ అంతగా అభివృద్ధి చెందని భారత్‌కు వారు బరువేనంటూ భరించామంతే. దేశ స్వాతంత్య్ర పోరాటంలో వారిది కూడా వీరోచిత పాత్ర ఉండడం అందుకు కారణం కావచ్చు. స్వార్థపరులు, అవకాశవాదులంటూ మనం ఎన్ని విధాలుగా వారిని అవమానించినా వాటిని వారు పట్టించుకోకుండా భారత్‌లో అన్ని రంగాల్లో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య రంగాల్లో బాగా రాణించారు. అప్పటికీ వారు సామాజికంగా వెనకబడి ఉన్నప్పటికీ విద్యా, ఉపాధి రంగాల్లో ఏనాడు రిజర్వేషన్లు కావాలంటూ డిమాండ్లు చేయలేదు. వారి కోసం వారు స్వయంగా విద్యాలయాలను, వైద్యాలయాలను, హోటళ్లను ఏర్పాటు చేసుకున్నారు. తోటి భారతీయుల పట్ల వారు ధాతృత్వం కూడా చాటుకున్నారు. అయినా మనం పట్టించుకోలేదు. దేశంలోని ఇతర ప్రాంతాలకన్నా చాలా ఆలస్యంగా, అంటే 1843లో సింధు రాష్ట్రం బ్రిటీష్ పాలన కిందకు వచ్చింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా దేశంలోని జైళ్లన్నీ నిండిపోయాయి. అప్పుడూ సింధూ ప్రాంతమంతటా బ్రిటీష్ పాలకులు మార్షల్ లా ప్రకటించారు. ప్రముఖ సింధీ పత్రిక ‘హిందూ’ (నేటి ఇంగ్లీషి పత్రిక ‘ది హిందూ’ కాదు) పోషించిన ప్రముఖ పాత్రను కూడా మనం విస్మరించాం. 1921లో భారత జాతిపిత మహాత్మా గాంధీ ఈ పత్రిక ప్రారంభించారు. దేశ స్వాతంత్య్రం కోసం విస్తృతతంగా ప్రచారం చేస్తున్న ఈ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు హిరానంద్ కర్మచంద్ మఖీజానిని 1942లో బ్రిటీష్ పాలకులు అరెస్ట్ చేసి ప్రింటింగ్ ప్రెస్‌ను మూసివేశారు. ఆ తర్వాత మరో చోటు నుంచి ఈ పత్రిక ప్రచురణ మొదలయింది. మళ్లీ ఎడిటర్‌ను అరెస్ట్ చేసి పత్రికను మూసివేశారు. ఓ చోట ఎడిటర్‌ను అరెస్ట్‌చేసి ప్రెస్‌ను మూసివేస్తే మరోచోటు నుంచి మరో ఎడిటర్ ఆధ్వర్యంలో పత్రిక పుట్టుకొచ్చేది. ఇలా దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఏడుగురు ఎడిటర్లు అరెస్ట్ అయ్యారు. 19 ఏళ్ల సింధీ యువకుడు హేము కలానీ త్యాగాన్ని కూడా మన చరిత్రకారులు అంతగా పట్టించుకున్నట్లు లేదు. స్వాతంత్య్ర కార్యకలాపాల్లో క్రి యాశీలకంగా పాల్గొంటున్నారన్న ఆరోపణలపై ఆ యువకుడిని బ్రిటీష్ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడికి క్షమాభిక్ష పెట్టాలంటూ సింధీలంతా అప్పటికీ బ్రిటీష్ వైస్రాయ్కి ఓ అర్జి పెట్టుకున్నారు. అందుకు ఆయన ఓ షరతు విధించారు. తోటి కార్యకర్తల గురించి సమాచారం అందిస్తే కలానీ విడుదల చేస్తామన్నది ఆ షరతు. అందుకు ఆ యువకుడు ససేమిరా అంగీకరించలేదు. దాంతో సింధూ రాష్ట్రంలోని సుక్కూర్ జైల్లో ఆ యువకుడిని ఉరి తీశారు. దేశంలో ప్రసిద్ధి చెందిన గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవును సింధీ వ్యాపారి భాయ్ ప్రతాప్ ఏర్పాటు చేశారు. కాండ్లా ఓడ రేవు పేరును గతేడాది సెప్టెంబర్ 25వ తేదీనే దీన్ దయాళ్ రేవుగా మార్చిన విషయం తెలిసిందే. రేవుకు దీన్ దయాళ్‌కు ఎలాంటి సంబంధం లేదన్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే దేశ జాతీయ గీతం ‘జన గణ మన అధి నాయక జయహే’లో నుంచి ‘సింధు’ పదాన్ని తొలగించాలని, ఆ స్థానంలో ఈశాన్య భారతాన్ని సూచించాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రిపున్ బోరా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కారణం. మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టి జాతీయ గీతం నుంచి ఈ ‘సింధు’ అనే పదాన్ని తొలగించవచ్చేమోగానీ, సింధీల మది నుంచి భారత్‌ను, భారతీయతను తొలగించలేరన్నది సత్యము. -
జాతీయ గీతం ఎలా పుట్టింది?
న్యూఢిల్లీ: ‘జన గణ మన అధినాయక జయహే’ వెనక మనకు గుర్తులేని చరిత్ర ఎంతో ఉంది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించేందుకు పార్లమెంట్‌కు ఎంతో కాలం పట్టలేదు. కానీ జాతీయ గీతాన్ని ఎంపిక చేసుకోవడానికే దాదాపు మూడేళ్లు పట్టింది. తొలుత స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించాలనే డిమాండ్ వచ్చింది. జాతీయ కాంగ్రెస్ ప్రతి సదస్సులో వందేమాతరం గీతాన్నే ఆలాపించేవారు. మొహమ్మద్ జిన్నా లాంటి ముస్లిం నాయకులు, ఆయన అనుచరులు కూడా గౌరవపూర్వకంగా లేచి నిలబడేవారు. ఆ తర్వాత ఛాందసవాద ముస్లిం నాయకులు తమ మత విశ్వాసాలకు ఆ గీతం వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. అప్పుడు వారి మనోభావాలను గౌరవించి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆ తర్వా 1950, జనవరి 26వ తేదీన దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించినప్పుడు పార్లమెంట్లో అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘జన గణ మన అధినాయక జయహే’ను జాతీయ గీతంగా, వందేమాతరంను జాతీయ గేయంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాటలకు సమాన హోదాను కల్పిస్తూ ఒక్కొక్కటి కచ్చితంగా 60 సెకండ్లు ఉండాలని కూడా పార్లమెంట్ నిర్ణయించింది. ఆకాశవాణి ద్వారానే ప్రచారం ఈ రెండు గీతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం 60 సెకండ్లకు మించకుండా గాత్రంతో ఒకటి, కేవలం సంగీత వాయిద్యాలతో ఒక్కటి చొప్పున అంతర్జాతీయ గీతాల బాణీలను పరిగణలోకి తీసుకొని బాణికట్టి పాడించే బాధ్యతని ఆలిండియా రేడియో (ఆకాశవాణికి)కు అప్పగించారు. గాత్ర గీతాలను పండిట్ దినకర్ కైకిని, సుమతి ముతాత్కర్తో పాడించారు. మ్యూజిక్ వర్షన్ కూడా కంపోజ్ చేశారు. వాయిద్యాల వర్షన్‌ను ప్రత్యేకంగా సైనిక బ్యాండ్‌కే పరిమితం చేయాలని కూడా పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ రెండు వర్షన్లను పార్లమెంట్ కమిటీ, గ్రాఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లు ఆమోదించాయి. రెండు పాటల రెండు వర్షన్లను వెయ్యేసి రికార్డుల చొప్పున కాపీ చేయించాలని నిర్ణయించారు. రికార్డుకు ఓ పక్కన వందేమాతరం గాత్రాన్ని, మరోపక్క వాయిద్య గీతాన్ని, అలాగే మరో రికార్డుకు ఓ పక్క జన గన మనను, మరో పక్క మ్యూజిక్ వర్షన్ రికార్డు చేయించారు. ఆ రికార్డులను దేశంలో 800 రేడియో స్టేషన్లకు పంపించారు. ప్రతి రోజు ఆకాశవాణి ప్రాథ:కాళ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందు వందేమాతరం గేయాన్ని ప్రసారం చేయాలని నిర్ణయించారు. 1955 నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయాన్ని ఆకాశవాణి పాటిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జన గణ మన గీతాన్ని వినిపించాలని నిర్ణయించారు. అదే సంప్రదాయం కొనసాగుతుంది. ఇదే క్రమంలో దేశంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల చేత తరగతులు ప్రారంభానికి ముందు వందేమాతరంను, తరగతులు ముగిశాక జన గన మనను పాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ ఎంపీలకు ప్రాక్టీస్ ఆరోజుల్లో జాతీయ గీతం 60 సెకండ్లు ఉండాలంటే ఎక్కువ, తక్కువ కాకుండా కచ్చితంగా 60 సెకండ్లే ఆలాపించేవారు. అప్పట్లో ఎంపీలందరికీ జాతీయ గీతం వచ్చేది. అయితే 60 సెకండ్ల కచ్చితత్వం కోసం గాయకురాలు సుమతి ముతాత్కర్ ప్రతి శుక్రవారం పార్లమెంట్‌కు వెళ్లి ఎంపీలకు పాడడంలో శిక్షణ ఇచ్చేవారు. (సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో) -
థియేటర్లలోకి జాతీయగీతం ఎప్పుడొచ్చింది?
(వెబ్ ప్రత్యేక కథనం) న్యూఢిల్లీ: చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయినప్పుడు సైనికుల్లోనే కాకుండా దేశ ప్రజల్లో కూడా దేశభక్తిని ప్రోత్సహించాలని పలువురు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఆ సూచనలు అలాగే మిగిలిపోయాయి. 1965లో పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం ముగిశాక మళ్లీ ఈ అంశం చర్చకు వచ్చింది. అప్పుడు ప్రతి సినిమా థియేటర్లలో సినిమా ముగింపులో జాతీయ గీతాలాపనను వినిపించాలని, ప్రేక్షకులంతా గౌరవ సూచకంగా నిలబడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోల్‌కతాలోని గ్రాంఫోన్ కంపెనీలో 78 ఆర్పీఎంలో జాతీయ గీతాన్ని రికార్డు చేయించి దేశంలోని అన్ని థియేటర్లకు పంపించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక నిమిషం వీడియోను కూడా రూపొందించి సినిమా థియేటర్లకు పంపించారు. తెరపై నలుపు, తెలుపు రంగుల్లో జాతీయ జెంగా రెప రెపలాడుతుండగా గీతాలాపన వినిపించేది. ఆ తర్వాత కొంతకాలానికి కలర్ వర్షన్ వచ్చింది. మొదట్లో ప్రేక్షకులు బుద్ధిగా లేచినలబడి గీతాలాపన ముగిసేవరకు అలాగే ఉండేవారు. రానురాను సినిమా ముగిసి గీతాలాపన ప్రారంభంకాగా ప్రేక్షకులు వెళ్లిపోవడం ప్రారంభమైంది. దాంతో 1980 దశకంలో థియేటర్లలో గీతాలాపనకు తెరదించారు. (జాతీయ గీతం ఎలా పుట్టింది?) మళ్లీ మల్టీప్లెక్స్‌లు వచ్చాక..... 1990వ దశకంలో దేశంలోని మెట్రో నగరాల్లో మల్టీప్లెక్స్‌ల రావడంతో అధికారులకు జాతీయ గీతాలాపనను పునరుద్ధరించాలనే ఆలోచన వచ్చింది. అయినా ఎవరు సీరియస్‌గా తీసుకోలేదు. 2003లో మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపనను వినిపించాలని అప్పటి డిప్యూటి ముఖ్యమంత్రి ఛాగల్ భుజ్పల్ రాష్ర్టంలోని థియేటర్లను ఆదేశించారు. సినిమాకు ముందే గీతాలాపనను వినిపించినట్లయితే ప్రేక్షకులు బయటకు వెళ్లే అవకాశం ఉండదన్న ఆయన ఆలోచన దాదాపు సక్సెస్ అయింది. అంతేకాకుండా జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం కూడా తీసుకొచ్చింది. ఇలాంటి చట్టం ఇప్పుడు దేశంలో మహారాష్ట్ర, గోవాలో మాత్రమే అమల్లో ఉంది. నాడు సోషల్ మీడియాలో హల్చల్ అందుకనే 2015, నవంబర్ నెలలో ముంబైలోని ఓ థియేటర్లో జాతీయ గీతాలాపన సందర్భంగా ఓ జంట సీట్ల నుంచి లేవనందుకు తోటి ప్రేక్షకుల ఆ జంటను థియేటర్ నుంచి బయటకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అమీషా పాటిల్‌ను కూడా ముంబై థియేటర్లలో ఇలాంటి సందర్భంలోనే ప్రేక్షకులు అవమానించారు. బాలివుడ్ నటి ప్రీతి జింటా కూడా 2014లో ముంబైలోని ఓ థియేటర్లో ఓ యువకుడు లేచి నిలబడనందుకు గోల చేసి థియేటర్ నుంచి బయటకు పంపించారు. గోవాలో ఇటీవల అంటే, అక్టోబర్ నెలలో ప్రముఖ రచయిత, దివ్యాంగుల హక్కుల కార్తకర్త సలీల్ చతుర్వేది జాతీయ గీతాలాపన సందర్భంగా థియేటర్లో లేచి నిలబడనందుకు ఆయన్ని ప్రేక్షకులు కొట్టారు. దివ్యాంగుడే కాకుండా వెన్నుముక దెబ్బతినడం వల్ల సలీల్ చతుర్వేది వీల్చేర్ నుంచి లేవలేకపోయారు. మల్టీప్లెక్స్‌లో అపహాస్యం వీటిల్లో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అపహాస్యం పాలైంది. వాణిజ్య ప్రకటనలన్నీ ముగిశాక ఈ గీతాన్ని వినిపిస్తున్నప్పుడు ఎక్కువ మంది లేచి నిలబడుతున్నప్పటికీ వారి వద్ద ఒక చేతిలో పాప్ కార్న్, మరో చేతిలో కూల్ డ్రింక్ ఉంటోంది. వారు కార్న్, తింటూ కోల్ డ్రింక్ తాగుతూ తాపీగా నిలబడేవారు, తొందరగా కూర్చొనేవారు. ఇది కూడా నిబంధనలు ఉల్లంఘిచడం అవుతుందని భావించిన యువతరం టెక్నీషన్లు 2000 దశకంలో జాతీయ గీతానికి కోరస్ ఇచ్చే కొత్త వీడియో వర్షన్ తీసుకొచ్చారు. అందులో జాతీయ జెండాలో ఉండే అసలు రంగులను కొద్దిగా మార్చి డిజిటల్ జెండాను తీసుకొచ్చారు. ఈ వర్షన్ ప్రేక్షకులను నిలబెడుతుందని, నిలబడకపోయినా జెండాను, గీతాన్ని అవమానించినట్లు కాదని టెక్నీషయన్లు థియేటర్ యజమానులు భావించారు. ఇదే వర్షన్ ఆ తర్వాత దేశంలోని పలు పాఠశాలలు అడాప్ట్ చేసుకున్నాయి. రెహమాన్ రంగప్రవేశం 2000 దశకంలోనే పండిట్ జస్రాజ్ మ్యూజిక్ మాయిస్ట్రో రెహమాన్‌తో కలసి కొత్త బాణీతో జాతీయ గీతం వీడియోను చిత్రీకరించనున్నట్లు ప్రకటించారు. నిమిషానికి బదులు జాతీయ గీతం రెండు నిమిషాలు ఉంటుందని వెల్లడించారు. పండిట్ భీంసేన్ జోషి, లతా మంగేష్కర్ లాంటి 50 మంది మహా మహా గాయణీ గాయకులు, సంగీత విద్వాంసులతో రిహార్సల్స్ కూడా ప్రారంభించారు. అయితే ఇది జాతీయ గీతం కోడ్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని అధికారులు, కొన్ని దేశభక్తి సంఘాలు గోల చేశాయి. దాంతో ఈ వీడియో రికార్డు ఆగిపోయింది. సోని మ్యూజిక్‌తో కలిసి... ఆ తర్వాత రెహమాన్ సోని మ్యూజిక్ కంపెనీ, భారత్ బాల ప్రొడక్షన్‌తో కలిసి జాతీయ గీతంపై 150 సెకండ్లతో వీడియోను తీసుకొచ్చారు. ఇందులో రెహమాన్, లతా మంగేష్కర్‌తోపాటు ఆశాభోంస్లే, క వితా కృష్ణమూర్తి నుంచి డీకె పట్టమ్మాల్ వరకు, పండిట్ భీంసేన్ జోషి నుంచి జస్రాజ్ వరకు, హరిప్రసాద్ చౌరాసియా, నుంచి అమ్జత్ అలీ ఖాన్ వరకు ఎందరో మహానుభావులైన విద్వాంసులు పాల్గొన్నారు. ఈ వీడియో కూడా జాతీయ గీతం కోడ్‌కు విరుద్ధంగా ఉండడంతో అధికారిక గుర్తింపు రాలేదు. టీవీలకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత మరాఠీ థియేటర్‌కు చెందిన టెలివిజన్ పర్సనాలిటీ పుష్కర్ స్త్రోత్రి ప్రభుత్వ పెద్దల సహకారంతో 40 మంది విద్వాంసులతో, మరాఠి నటీనటులతో రూపొందించిన జాతీయ గీతం కొత్త వర్షన్‌ను 2007, ఆగస్టు 15 తేదీ నుంచి మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శిస్తూ వస్తున్నారు. చట్టంలో నిలబడాలని లేదు.... 1971లో జాతీయ జెండాను, గీతాన్ని గౌరవించేందుకు తెచ్చిన ‘ప్రొటెక్సన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్’లో స్పష్టత లేదు. జాతీయ జెండాను, గీతాన్ని అగౌరవ పరిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని ఉందిగానీ గీతాలాపన సందర్భంగా నిలబడకపోవడం కూడా నేరమని లేదు. ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరిగా వినిపించాలని, ఆ సందర్భంగా ప్రేక్షకులు గౌరవ సూచకంగా నిలబడాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
గుండెల్లో దేశభక్తి చాలదా?
దేశవ్యాప్తంగా ప్రతి సినిమా హాలులో ప్రదర్శనకంటే ముందు జాతీయ గీతం ఆల పించాలనీ, ప్రేక్షకులంతా విధిగా 52 సెకన్లు నిలబడి జాతీయ గీతాన్ని పూర్తిగా పాడాలనీ, ఆ సమయంలో తెరపైన జాతీయ పతాకం ప్రదర్శించాలనీ, ప్రేక్షకులు నిష్ర్కమించే అవకాశం లేకుండా ద్వారాలు మూసి ఉంచాలనీ సుప్రీంకోర్టు ధర్మా సనం బుధవారం తాత్కాలిక ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమై వాడివేడి చర్చకు దారి తీసింది. దేశభక్తిపైనా, జాతీయతపైనా జస్టిస్ దీపాంకర్ మిశ్రా చేసిన వ్యాఖ్యలకూ, ప్రధాని నరేంద్రమోదీ రెండున్నర సంవత్సరాలుగా వెలిబుచ్చుతున్న అభిప్రాయాలకూ మధ్య కనిపిస్తున్న అభేదం ఆశ్చర్యం కలిగించకమానదు. మాతృ మూర్తినీ, మాతృదేశాన్నీ, మాతృభాషనూ ప్రేమించాలని బాధ్యతాయుతులైన పౌరులకు ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అది జాతి సంస్కారంలో భాగంగా సంక్రమించే విలువ. దేశాన్నీ, తల్లినీ ప్రేమించడం వ్యక్తిగత విషయం. ఆ ప్రేమకు కొలమానం ఉండదు. చట్టాల ద్వారా దేశభక్తిని కానీ మాతృభక్తిని కానీ పౌరులలో పాదుకొల్పడం అసాధ్యం. న్యాయమూర్తులు మానవమాత్రులు. వారిపైన దేశ కాల పరిస్థితుల ప్రభావం నిశ్చయంగా ఉంటుంది. జస్టిస్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ప్రస్తుతానికీ, జస్టిస్ చిన్నప్పరెడ్డి అదే న్యాయస్థానంలో పనిచేసిన గతానికీ మధ్య చాలా అంతరం ఉంది. కేరళ విద్యార్థుల కేసులో జాతీయగీతాన్ని పాడాలని పట్టు బట్టడం భావప్రకటన స్వేచ్ఛకు గండికొట్టడమేనంటూ చిన్నప్పరెడ్డి తీర్పు ఇచ్చారు. భావప్రకటన స్వేచ్ఛ ప్రసాదించిన రాజ్యాంగమే మౌనంగా ఉండే స్వేచ్ఛ ఇచ్చిం దంటూ ఆయన అన్వయించారు. జాతీయ గీతం రచించిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ అభిప్రాయాలకీ, అదే గీతంపైన ఇప్పుడు ఆదేశాలు జారీ చేసిన న్యాయ మూర్తుల భావాలకూ మధ్య గణనీయమైన అంతరం ఉంది. టాగోర్ తనను తాను విశ్వమానవుడుగా సంభావించుకునేవారు. ఆయన దేశభక్తుడు నిస్సందేహంగా. కానీ జాతీయతాభావాన్ని పనికట్టుకొని ప్రదర్శించడాన్ని ఆమోదించే వ్యక్తి మాత్రం కాడు. కవిగా సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కోరుకున్న మేధావి. స్వాతంత్య్ర దినోత్స వాలు, రిపబ్లిక్ డే వేడుకలలో జాతీయగీతాన్ని ఆలపించడం ఆనవాయితీ. 1962లో చైనా దురాక్రమణ తర్వాత సినిమా ప్రదర్శన చివరిలో జాతీయగీతాలాపన ప్రవేశ పెట్టారు. 1971 జాతీయ పతాకంపట్ల గౌరవాన్ని పరిరక్షించేందుకు ఒక చట్టాన్ని తెచ్చారు. జాతీయగీతాలాపన జరుగుతుండగానే ప్రేక్షకులు నిష్ర్కమించడం జాతీ యగీతాన్ని అవమానించడంగా భావించి 1975 నుంచి ఆ ఆనవాయితీకి స్వస్తి చెప్పారు. ఎవ్వరూ ఎవరి దేశభక్తినీ శంకించలేదు. ప్రశ్నించలేదు. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారాయి. దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలోనూ 207 అడుగుల ఎత్తున జాతీ యపతాకం రెపరెపలాడుతూ ఉండాలని స్మృతిఇరానీ అధ్యక్షతన జరిగిన వైస్‌చాన్సలర్ల సమావేశం తీర్మానించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంపైన మెరుపు దాడుల సందర్భంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం జాతి వ్యతిరేక చర్యగా భావించే పరిస్థితులు దాపురించాయంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఇప్పటికీ సినిమాహాళ్ళలో జాతీయగీతాలాపన జరుగుతున్న రాష్ట్రాలలో మహా రాష్ట్ర, గోవా ఉన్నాయి. అక్టోబరులో గోవాలోని ఒక సినిమాహాలులో జాతీయగీతం పాడుతున్న సందర్భంలో ప్రముఖ రచయిత సలీల్చతుర్వేది తన సీట్లోనే కూర్చొని ఉన్నారు. ఆ దృశ్యాన్ని సహించలేని దేశభక్తులైన దంపతులు ఆయనపైన దాడి చేశారు. ఆ రచయితకు ప్రమావశాత్తూ వెన్నెముక గాయమైనదనీ, నిలబడలేనిస్థితి లో ఉన్నారనీ, వికలాంగుల హక్కుల సాధన ఉద్యమంలో ఆయన ప్రముఖుడనీ ఆ దంపతులకు తెలియదు. ఇటువంటి ఘటనలు మొన్నటి తీర్పు ప్రభావంతో ముమ్మరం కావచ్చుననే ఆందోళన ఆలోచనాపరులను అశాంతికి గురిచేస్తున్నది. మనం అన్ని విషయాలలో పాశ్చాత్యదేశాలను, ముఖ్యంగా అమెరికాను, ఆద ర్శంగా తీసుకుంటున్నాం. అమెరికా, బ్రిటన్వలె నగదు లావాదేవీలు లేని సమాజం నిర్మించాలన్న అభిలాషతోనే మోదీ పెద్దనోట్లను రద్దు చేశారని భావిస్తున్నాం. అదే అమెరికాలో జాతీయపతాకాన్ని తగులబెట్టడం శిక్షార్హమైన నేరం కాదు. మితవాద మనోభావాలకు ప్రతీక అయిన డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక ట్వీట్లో ‘అమెరికా పతాకాన్ని తగులబెట్టినవారికి కనీసం ఒక సంవత్సరం కారాగార శిక్ష విధించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనను అమెరికా సుప్రీంకోర్టు ఆమోదించే అవకాశాలు లేవు. వియత్నాం యుద్ధ వ్యతిరేక ప్రదర్శకులు అమెరికా జాతీయ పతా కాన్ని దగ్ధం చేసినప్పుడు ‘సమాఖ్య పతాక పరిరక్షణ చట్టాన్ని (ఫెడరల్ ఫ్లాగ్ ప్రొటె క్షన్ యాక్ట్) 1968లో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) తెచ్చింది. అదే చట్టాన్ని అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలోనూ 48 రాష్ట్రాలు ఆమోదించాయి. కానీ 1989లో అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ చట్టం రాజ్యాంగ విరు ద్ధమంటూ 5-4 మెజారిటీతో కొట్టివేసింది (టెక్సస్ వర్సెస్ జాన్సన్ కేసు). అమె రికా రాజ్యాంగానికి జరిగిన మొదటి సవరణలో హామీ ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛకు ఈ చట్టం విఘాతం కలిగిస్తుందని తీర్పు చెప్పింది. పట్టువీడని అమెరికా కాంగ్రెస్ మరోసారి జాతీయపతాక పరిరక్షణ చట్టాన్ని ఆమోదించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం 1990లో అదే 5-4 మెజారిటీతో కాంగ్రెస్ తాజా నిర్ణయాన్ని సైతం చెల్లదని ప్రకటించింది (యూఎస్ వర్సెస్ ఏక్మన్ కేసు). రిపబ్లికన్ పార్టీకి పార్లమెం టులో ఆధిక్యం ఉన్నది కనుక ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన ఆలో చనను అమలు చేయవచ్చు. కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యే అవకాశాలే ఎక్కువ. పౌరులు మానవత్వం కలిగి ఉండాలనీ, తోటివారిని ప్రేమించాలనీ కోరుకో వాలి. దేశభక్తి గుండెనిండా ఉంటే చాలు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు 28 సంవత్సరాల తర్వాత తొలి స్వర్ణపతకాన్ని అభినవ్ భింద్రా సాధించినప్పుడు భారత జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే, జాతీయ గీతం ఆలపిస్తుంటే హృదయం ఆనందంతో ఉప్పొంగని భారతీయులు ఎవరుంటారు? అదే సహజ మైన, సార్వజనీనమైన దేశభక్తి. జాతికి అదే రక్ష. -
పూరీతో జన గణ మన
మహేశ్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఈ ఏప్రిల్ 28కి ‘పోకిరి’ విడుదలై పదేళ్లయ్యింది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు హీరోగా తాను చేయనున్న చిత్రం గురించి సోషల్ మీడియా ద్వారా పూరి గురువారం రాత్రి ప్రకటించారు. ‘‘‘పోకిరి’ విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా మహేశ్‌తో నా తదుపరి చిత్రాన్ని ప్రకటించకుండా ఉండలేకపోతున్నాను. మహేశ్ అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఈసారి ‘పోకిరి’కన్నా ఇంకా రూత్ లెస్‌గా, ‘బిజినెస్‌మేన్’కన్నా ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటాడు మహేశ్’’ అని పూరి తన ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. అలాగే ‘జన గణ మన’ అనే టైటిల్‌తో, మన జాతీయ జెండా, మహేశ్ కళ్లతో ఓ డిజైన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు. -
150 దేశాల్లో 600 థియేటర్లలో 'జన గణ మన'!
కోల్ కతా: పాప్ సాంగ్స్, హిప్పీ, వెస్ట్రన్ సంగీతం మోజులో పడిన పిల్లలకు, యువతకు జాతీయ గీతంపై అవగాహన కల్పించేందుకు సుమారు 70 మంది ప్రముఖ వ్యక్తులతో జాతీయ గీతం 'జన గణ మన'ను కొత్త వీడియోగా చిత్రీకరించారు. రాజీవ్ వాలియా దర్శకత్వం వహించిన కొత్త వీడియోను 150 దేశాలల్లో 600 థియేటర్లలో ప్రదర్శించారు. జాతీయ గీతాన్ని రూపొందించడానికి ఎనిమిది నెలలు పట్టిందని రాజీవ్ వాలియా తెలిపారు. ఈ వీడియోకు స్వరూప్ భల్వంకర్ సంగీతాన్ని సమకూర్చగా, బాల గాయని సంచితి సాకత్ పాడారని వాలియా మీడియాకు వివరాలందించారు. ఈ వీడియోలో బాలీవుడ్ తారలు శిల్పాశెట్టి, వివేక్ ఓబెరాయ్, తుషార్ కపూర్, అనుపమ్ ఖేర్, ఇషా కొప్పికర్, మల్లికా షరావత్, జానీ లీవర్ లు, మెజీషియన్ పీసీ సర్కార్, నృత్యాకారిణీలు సుజాతా మహాపాత్ర, క్రికెటర్లు ఇర్ఫాన్, యూసఫ్ పఠాన్, కుస్తీ ఆటగాడు సంగ్రామ్ సింగ్, బాలీవుడ్ గాయకులు అల్కా యాగ్నినిక్, అను మాలిక్, జావెద్ ఆలీ, మోహిత్ చౌహాన్, ఉదిత్ నారాయణ్ లు, ఇంకా పూనమ్ థిల్లాన్, పద్మిని కొల్హాపూరి లు కూడా ఉన్నారు. తాజ్ మహల్, కోణార్క్ టెంపుల్, బాంద్రా, ఇండియా గేట్, ఎర్రకోట, తదితర ప్రాంతాల్లో 1500 మంది పిల్లలపై చిత్రీకరించారు. -
మేధా వలసలొద్దు.. డోన్ట్ క్విట్ ఇండియా
అది జూలై ఫోర్త్.. అమెరికన్ ఇండిపెండెన్స్ డే! ఆ రోజు అమెరికాలో పదివేలమంది తెలుగువారు ఓ చోటికి చేరి తెలుగు సంబరాలు చేసుకుంటున్నారు. వేదికమీద ‘ద స్టార్ స్ట్రాంగల్డ్ బ్యానర్ ’ అంటూ అమెరికా జాతీయగీతం పాడుతున్నారు. ఆ పాటలో చాలా పదాలు అర్థంకావట్లేదు కానీ దేశభక్తి మాత్రం తొణికిసలాడుతోంది. ఏ దేశ జాతీయగీతమైనా అంతేనేమో! వెంటనే ‘జనగణమన..’ ప్రారంభమైంది.. నరాల్లో రక్తం పరుగులిడుతోంది.. గుండెలో శ్వాసబరువుగా మారుతోంది... కళ్లు ఊటబావులవుతున్నాయ్.. నా చుట్టూ ఉన్న చాలామందిదీ అదే స్థితి. దీనినే దేశభక్తి అనాలా? ఇక ఆ తర్వాత షరా మామూలే! డాలర్లు, రూపాయలు మాట్లాడుకుంటాయ్. కస్టమ్ సూట్లు, డిజైనర్ చీరలు ఫొటోలు దిగుతాయ్. బర్గర్లు, బూరెలు పళ్లేలు వెతుక్కుంటాయ్. అమెరికా అక్కున చేర్చుకున్నా భారతీయతను మర్చిపోకుండా ఉండటానికి వారు పడుతున్న కష్టం రెండు పడవల మీద ప్రయాణంలా అనిపించింది! ఓర్లాండాలో మిత్రుడు శ్రీనివాస్ అన్న మాటలు గుర్తొచ్చాయి..‘అమెరికన్ సిటిజన్‌షిప్ కోసం వెళ్లినప్పుడు గుండెల మీద కుడిచేయి వేసి ఆ దేశ జాతీయగీతం పాడుతుంటే అమ్మని తాకట్టుపెట్టినట్టు అనిపించింది’ అని! తప్పులేదు బ్రదర్.. కూటి కోసం కోటి తిప్పలు! కానీ.. అవసరమొస్తే అదే అమ్మ కోసం శ్రీనివాస్ ఈ దేశానికి తిరిగిరాగలడా?.. అనుమానమే! న్యూయార్క్‌లో ఓ తెలుగులక్ష్మి నాలుగు చేతులా (వాళ్లాయనవి కూడా కలిపి) డాలర్ల పంట పండించింది. మట్టివాసన పిలుస్తోందంటూ చేస్తున్న వ్యాపారాన్ని చుట్టేసి, ఉద్యోగాన్ని కట్టేసి ‘ఫర్ గుడ్’ అంటూ ఈ దేశానికి తిరిగొచ్చింది. ఆ కుటుంబాన్ని వెరీగుడ్ అనొచ్చా... ఏమో.. ఎందుకంటే మట్టికొట్టుకుపోతున్న విలువల్ని కడిగేయడానికి డాలర్లను కరిగించేసింది మరి! ఆమె మళ్లీ వెళ్లిపోతుందా? శ్రీనివాస్ రాడేమో అన్న అనుమానానికీ.. లక్ష్మీ వెళ్లిపోతుందేమో అన్న భయానికీ లింక్.. దేశభక్తి! .. ఎన్ఆర్ఐలకున్న పాటి దేశాభిమానం మనకి లేదా? ఇదేం ప్రశ్న! 68 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పండగలా మనమూ జరుపుకుంటున్నాం కదా.. వాట్సప్పుల్లో ప్రొఫైల్ పిక్‌గా మువ్వన్నెల పతాకం పెట్టేస్తాం.. ఈ ఒక్క రోజుకి! ఫేస్బుక్లో దేశభక్తి నినాదాలు పోస్ట్ చేస్తాం.. లైకులు ఎక్కువ రాకపోయినా పర్లేదని! గల్లీ గల్లీలో తిరంగా ఎగరేస్తాం.. ట్రాఫిక్‌కు అడ్డయినా సరే! ఫ్రీడం సేల్‌లో తెగ కొనేస్తాం..డిస్కౌంట్లు మళ్లీ రావని! ఇంతేనా.. దేశభక్తి? నిజమైన స్వాతంత్య్ర స్ఫూర్తి?? పరాయిపాలకులను తరిమికొట్టిన స్ఫూర్తి ఏది? స్వరాజ్యంలో సొంతపాలకుల దోపిడీని తిప్పికొట్టే ధైర్యాన్ని ఎక్కడ దాచుకున్నాం? ఓటును నోటుకి ఎందుకు అమ్ముకుంటున్నాం? ఫ్రీడంని సేల్ చేశామా? లంచగొండి తనాన్ని నిలదీసే బదులు అదే లంచంతో మనం పాలకులకు బానిసలవుతున్నామా? బీ ద చేంజ్.. అని పిలుపునిచ్చిన బాపూజీ ఈ మార్పులను చూసి నోరెళ్లబెడతారేమో! పక్క దేశాల్లోని చట్టాలు మన దేశంలో ఎందుకు పనికిరావో తెలుసా? అక్కడ ఎంత స్వేచ్ఛ ఉన్నా చట్టానికి లోబడే ఉంటారు. ఇక్కడ అన్నింటికంటే ముందు ‘నేను’ అనుకుంటూ.. ఆ ‘నేను’కి స్వేచ్ఛ ఇవ్వాలనే దూకుడులో పక్కవాడికీ స్వేచ్ఛ ఉందని మరిచిపోతున్నాం. మూత లేని సీసాల్లో పీతల్లా మిగిలిపోతున్నాం. అందుకే.. కొంత స్వేచ్ఛని త్యాగం చేద్దాం. అధికారబలంతో అందినంత దోచే స్వేచ్ఛ.. పేదోడిని ఎప్పటికీ పేదరికంలో ఉంచే స్వేచ్ఛ.. లంచం అడిగే స్వేచ్ఛ.. ఇచ్చే స్వేచ్ఛ రూల్స్ బ్రేక్ చేసే స్వేచ్ఛ.. బాధ్యతని తెగ్గొట్టే స్వేచ్ఛ.. మానవతకు మచ్చ తెచ్చే స్వేచ్ఛ.. మనకొద్దు! అందుకే.. స్వాతంత్య్ర సంగ్రామం స్ఫూర్తిగా ఇప్పుడు మళ్లీ ఉద్యమిద్దాం. స్వరాజ్య ఉద్యమం చేద్దాం.. రాజకీయ ప్రక్షాళన చేద్దాం. సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభిద్దాం.. అధర్మంపై గళమెత్తుదాం. సహాయనిరాకరణ మొదలెడదాం.. నయవంచకులు, కీచకులను బహిష్కరిద్దాం. స్వదేశీ నినాదాన్ని ఉద్యమంగా చేసుకుందాం.. ఉత్పత్తులను, హస్తకళలను ప్రోత్సహిద్దాం. చివరగా..ఒక ఉద్యమాన్ని బలంగా చేద్దాం.. Don't Quit India. మేధా వలసలు ఆపండి! ఆశ మిగిలే ఉంది.. యువతరంలో స్ఫూర్తి, శక్తి కొత్తగానే ఉంది. యంగ్ ఎనర్జీ ఇంకా సుషుప్తావస్థలోకి జారుకోలేదు. ఫేస్బుక్ వాల్స్ పసలేని నినాదాలను కాదు ప్రభుత్వాలను వణికించే విప్లవాలనూ సృష్టించాయి! రాజకీయాల్లో పేరుకున్న చెత్తను ప్రక్షాళన చేయడానికి చట్టసభల్లో చేరి తమ సత్తాను చాటుతున్నారు! మట్టికొట్టుకుపోయిన వీధులనే కాదు మనుషుల మనసులనూ శుభ్రంచేసే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు! బాపూ... బీ ద ఛేంజ్.. నువ్వన్న మాటలు వట్టిపోలేదు! దేశమంటే మట్టికాదోయ్ మనుషులోయ్.. గురజాడా.. నీ జాడలు నిజం నిజం! ఇది నా దేశం! మేరా భారత్ మహాన్! ఈ మార్పులను అమలుచేసే ఆ యంగ్ ఎనర్జీకి సలాం! జైహింద్! ఖద్దరు ధరించండి... వివేకవర్ధిని పాఠశాల ప్రాంగణంలో మహాత్మాగాంధీ 1929లో ఇచ్చిన ఈ పిలుపు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. అనిబిసెంట్, సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబా ఆమ్టే వంటి మహోద్యమకారులు ప్రసంగించిన, సందర్శించిన 107 ఏళ్ల చరిత్ర ఉన్న విద్యాలయాన్ని ఒక్కసారి చూడాలనిపించింది. అణువణువునా చరిత్ర స్ఫూర్తిని ప్రసరిస్తున్న వివేకవర్ధినికి వందనం. -
దిల్ రాజు ప్రొడక్షన్ లో పవన్ మూవీ