Puri Jagannadh: Latest Jana Gana Mana Movie Update In Telugu - Sakshi
Sakshi News home page

Puri Jagannadh: 'జనగణమన'పై అధికారిక ప్రకటన.. ఆడియో వైరల్‌

Published Mon, Feb 7 2022 10:05 AM | Last Updated on Mon, Feb 7 2022 4:58 PM

Puri Jagannadh Jana Gana Mana Movie Update - Sakshi

ఇండస్ట్రీలో డ్రీమ్‌ అనేది సర్వసాధారణంగా వినిపించే పదం. డ్రీమ్‌ ప్రాజెక్ట్‌, డ్రీమ్‌ కాన్సెప్ట్‌, డ్రీమ్‌ రోల్‌, డ్రీమ్‌ కాంబినేషన్‌ అనేవి తరచూ వినిపిస్తుంటాయి. అలా పూరీ జగన్నాథ్‌కు కూడా ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంది. అదే జనగణమన. ఈ సినిమా తెరకెక్కించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. కానీ ఏళ్లతరబడి వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కేందుకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు పూరీ. ఈ మేరకు చార్మీ కౌర్‌.. పూరీ మాట్లాడిన ఆయోను రిలీజ్‌ చేసింది. 'ఇప్పుడే లైగర్‌ షూటింగ్‌ పూర్తైంది.. ఈ రోజుతో జనగణమన..' అంటూ త్వరలోనే ఈ సినిమా మొదలు పెట్టనున్నట్లు హింట్‌ ఇచ్చారు.

అయితే గతంలో జనగణమన స్క్రిప్ట్‌ను మహేశ్‌కు వినిపించగా ప్రిన్స్‌ పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపించలేదట. దీంతో అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ లాంటి ఉద్ధండులతో పాన్‌ ఇండియా లెవల్‌లో తీయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ చార్మి కౌర్‌ తన ట్వీట్‌లో విజయ్‌ దేవరకొండ పేరు మెన్షన్‌ చేయడంతో అందరూ ఈ చిత్రంలో అతడే హీరో అని చర్చించుకుంటున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement