150 దేశాల్లో 600 థియేటర్లలో 'జన గణ మన'!
150 దేశాల్లో 600 థియేటర్లలో 'జన గణ మన'!
Published Wed, Aug 20 2014 2:37 PM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM
కోల్ కతా: పాప్ సాంగ్స్, హిప్పీ, వెస్ట్రన్ సంగీతం మోజులో పడిన పిల్లలకు, యువతకు జాతీయ గీతంపై అవగాహన కల్పించేందుకు సుమారు 70 మంది ప్రముఖ వ్యక్తులతో జాతీయ గీతం 'జన గణ మన'ను కొత్త వీడియోగా చిత్రీకరించారు. రాజీవ్ వాలియా దర్శకత్వం వహించిన కొత్త వీడియోను 150 దేశాలల్లో 600 థియేటర్లలో ప్రదర్శించారు. జాతీయ గీతాన్ని రూపొందించడానికి ఎనిమిది నెలలు పట్టిందని రాజీవ్ వాలియా తెలిపారు. ఈ వీడియోకు స్వరూప్ భల్వంకర్ సంగీతాన్ని సమకూర్చగా, బాల గాయని సంచితి సాకత్ పాడారని వాలియా మీడియాకు వివరాలందించారు.
ఈ వీడియోలో బాలీవుడ్ తారలు శిల్పాశెట్టి, వివేక్ ఓబెరాయ్, తుషార్ కపూర్, అనుపమ్ ఖేర్, ఇషా కొప్పికర్, మల్లికా షరావత్, జానీ లీవర్ లు, మెజీషియన్ పీసీ సర్కార్, నృత్యాకారిణీలు సుజాతా మహాపాత్ర, క్రికెటర్లు ఇర్ఫాన్, యూసఫ్ పఠాన్, కుస్తీ ఆటగాడు సంగ్రామ్ సింగ్, బాలీవుడ్ గాయకులు అల్కా యాగ్నినిక్, అను మాలిక్, జావెద్ ఆలీ, మోహిత్ చౌహాన్, ఉదిత్ నారాయణ్ లు, ఇంకా పూనమ్ థిల్లాన్, పద్మిని కొల్హాపూరి లు కూడా ఉన్నారు. తాజ్ మహల్, కోణార్క్ టెంపుల్, బాంద్రా, ఇండియా గేట్, ఎర్రకోట, తదితర ప్రాంతాల్లో 1500 మంది పిల్లలపై చిత్రీకరించారు.
Advertisement
Advertisement