‘రాహుల్‌ ఆలపిస్తే చూడాలనివుంది’ | Want to see if Rahul Gandhi knows the National Anthem: Anupam Kher | Sakshi
Sakshi News home page

‘రాహుల్‌ ఆలపిస్తే చూడాలనివుంది’

Published Mon, Dec 5 2016 7:10 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

‘రాహుల్‌ ఆలపిస్తే చూడాలనివుంది’

‘రాహుల్‌ ఆలపిస్తే చూడాలనివుంది’

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌... కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. రాహుల్‌ గాంధీకి ఉన్న దేశాభిమానంపై తనకు అనుమానం లేదంటూనే మెలిక పెట్టారు. రాహుల్‌ జాతీయగీతం ఆలపిస్తే చూడాలని ఉందని అన్నాయి. అయితే జాతీయ గీతంలోని పదాలకు అర్థాలు రాహుల్‌ గాంధీకి తెలుసో, లేదోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుదారుడైన అనుపమ్‌ ఖేర్‌ పలు చాలా సందర్భాల్లో స్వామిభక్తి చాటుకున్నారు. మోదీ వ్యతిరేకులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించేవారు. సినిమా ధియేటర్లతో జాతీయ గీతం వినిపించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పుపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement