Vivek Oberoi
-
రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..
వివేక్ ఒబెరాయ్ ప్రముఖ నటుడిగానే అందరికి తెలుసు. కానీ, తన పదహారో ఏటే స్టాక్ మార్కెట్లో శిక్షణ తీసుకుని కమోడిటీ ట్రేడింగ్ చేసేవారని చాలా మందికి తెలియకపోవచ్చు. అలా స్టాక్ మార్కెట్, నట జీవితంలో వచ్చిన డబ్బుతో పాటు విభిన్న వ్యాపారాల వల్ల తాను ప్రస్తుతం రూ.1,200 కోట్ల సంపదను సృష్టించుకున్నారు. అత్యంత సంపన్న నటుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన తన సంపదను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇటీవల తెలియజేశారు.వివేక్ ఒబెరాయ్ చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించడంతోపాటు దాన్ని సమర్థంగా ఎలా నిర్వహించాలనే దానిపై దృష్టి సారించేవారు. తాను సినిమాల్లోకి రాకముందే వాయిస్ఓవర్ అసైన్మెంట్లు, హోస్టింగ్ షోలు చేసేవారు. అందులో వచ్చిన డబ్బును సమర్థంగా పెట్టుబడి పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. దాంతో విభిన్న వ్యాపార ఆలోచనలను అన్వేషిస్తూ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించారు. చిన్న వయసులోనే స్టాక్ మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి స్టాక్ బ్రోకర్లతో శిక్షణ తీసుకున్నట్లు ఓ ఇంటర్వూలో చెప్పారు. తన పదహారో ఏట మార్కెట్లో పోర్ట్‌ఫోలియోను నిర్మించుకున్నారు. ఎక్కువగా కమోడిటీ ట్రేడింగ్ చేసేవారని చెప్పారు. 19 ఏళ్ల వయసులోనే ఒక టెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. 22 సంవత్సరాల వయసులో మంచి లాభంతో దాన్ని ఓ బహుళజాతి సంస్థకు విక్రయించినట్లు తెలిపారు.వ్యూహాత్మక పెట్టుబడులుముంబయిలోని మిథిబాయి కాలేజీ నుంచి కామర్స్ గ్రాడ్యుయేషన్‌లో పట్టా పొందిన వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం తన వద్ద ఉన్న సంపదను రెండు భాగాలు విభజించినట్లు చెప్పారు. 60 శాతం సంపదను స్థిరంగా ఆదాయం సమకూర్చే విభాగాల్లో పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. మరో 40 శాతం సంపదను ప్రైవేట్ ఈక్విటీ, రియల్ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నట్లు, ఆకర్షణీయ స్టార్టప్‌ల్లో వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో మంచి రాబడులు రావాలంటే భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాలతో ప్రయోగాత్మక పెట్టుబడులు పెట్టాలని చెబుతున్నారు.ఇదీ చదవండి: రైల్వే కొత్త రూల్.. ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే..రియల్ ఎస్టేట్: వివేక్ ఒబెరాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో దృష్టి సారించి కర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను స్థాపించారు.డైమండ్ బిజినెస్: దేశవ్యాప్తంగా 18 స్టోర్లతో సోలిటారియో అనే డైమండ్ కంపెనీని స్థాపించారు.ఈవెంట్ మేనేజ్మెంట్: వివేక్ ‘మెగా ఎంటర్టైన్మెంట్’ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించారు.ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్: సుమారు రూ.3,400 కోట్ల (సుమారు 400 మిలియన్ డాలర్లు) విలువైన ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ స్టార్టప్‌ను ప్రారంభించారు.ఫ్యామిలీ కార్యాలయం: ‘ఒబెరాయ్ ఫ్యామిలీ ఆఫీస్’ ద్వారా పెట్టుబడులను మేనేజ్ చేస్తున్నారు. -
రూ.12 కోట్ల విలువైన కారు కొన్న 'వినయ విధేయ రామ' నటుడు
బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ కల్లినన్ బ్రాండ్ కారును సొంతం చేసుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి లగ్జరీ కారు డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు.వివేక్ తన తల్లిదండ్రులు సురేశ్, యశోధర, భార్య ప్రియాంకతో కలిసి కొత్త కారులో ప్రయాణించారు. సిల్వర్ గ్రే కలర్ ఉన్న రోల్స్ రాయిస్ కుల్లినన్ కారు ధర మనదేశంలో దాదాపు రూ.12.25 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. వివేక్ ఒబెరాయ్ చివరిసారిగా 2019లో పీఎం నరేంద్ర మోదీ, ప్రైమ్ మినిస్టర్స్ బయోపిక్‌లో నటించారు.అంతేకాకుండా మలయాళం, కన్నడతో పాటు తెలుగు చిత్రాల్లోనూ కనిపించారు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన రక్త చరిత్ర సినిమాలో నటించి తన నటనతో తెలుగు వారిని మెప్పించారు. రామ్ చరణ్ చిత్రం వినయ విధేయ రామలోనూ కీలక పాత్ర పోషించారు. సినిమాలతో పాటు ఇన్సైడ్ ఎడ్జ్, ధారవి బ్యాంక్, ఇండియన్ పోలీస్ ఫోర్స్ లాంటి వెబ్ సిరీస్‌లలో కూడా కనిపించాడు. విలన్‌గా, హీరోగా, సహా నటుడిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని విలక్షణ నుటుడిగా పేరు తెచ్చుకున్నారు వివేక్. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Vivek Oberoi (@vivekoberoi) -
ఐశ్వర్యరాయ్‌తో వివేక్ ప్రేమాయణం.. నటుడు ఏమన్నాడంటే?
కొన్ని ప్రేమకథలు సుఖాంతం అవుతే మరికొన్ని ప్రేమకథలు మధ్యలోనే ఆగిపోతాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు వివేక్ ఒబెరాయ్- ఐశ్వర్యరాయ్ లవ్‌స్టోరీ రెండో కోవలోకి చెందుతుంది. వీరు గాఢంగా ప్రేమించుకున్నారు, కట్ చేస్తే ఇద్దరూ చెరొకరిని పెళ్లి చేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఐష్‌తో తన కొడుకు ప్రేమాయణం గురించి మొదట్లో ఏమీ తెలియలేదన్నాడు సురేశ్ ఒబెరాయ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'చాలా విషయాలు నాకసలు తెలియనే తెలీదు. వివేక్ ఎప్పుడూ నాతో ఓపెన్‌గా చెప్పలేదు. రాము (రామ్ గోపాల్ వర్మ)యే అదంతా నాతో చెప్పాడు. ఐశ్వర్యతో లవ్.. వద్దని వారించా రాము కంటే ముందు కూడా ఎవరో చెప్పినట్లు గుర్తు. కానీ తను ఏదైతే చేస్తున్నాడో అది వెంటనే ఆపేయమని చెప్పాను. ఎందుకనేది అతడికి అర్థమయ్యేలా వివరించాను' అని చెప్పుకొచ్చాడు. ఇక సల్మాన్ ఖాన్‌తో బ్రేకప్ చెప్పిన వెంటనే వివేక్‌తో ప్రేమలో పడింది ఐష్. కానీ వీరి బంధం కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎంతో త్వరగా బ్రేకప్ చెప్పుకున్నారు. కొన్నేళ్ల తర్వాత హీరో అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడి అమితాబ్ ఇంటికి కోడలిగా వెళ్లింది ఐశ్వర్య రాయ్. ఎవరీ సురేశ్- వివేక్.. సురేశ్ ఒబెరాయ్ విషయానికి వస్తే ఈయన సహజ నటుడు. ఏడేళ్ల వయసులోనే తొలిసారిగా ఆడపిల్ల వేషంలో రంగస్థలంపై అడుగుపెట్టాడు. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాడు. మిర్చ్ మసాలా, ఐత్బార్, లావారిస్, ఘర్ ఏక్ మందిర్ వంటి చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించాడు. తెలుగులో మరణ మృదంగం వంటి సినిమాలు చేశాడు. ఇటీవలే యానిమల్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడు. ఈయన తనయుడు వివేక్ ఒబెరాయ్.. రక్త చరిత్ర, క్రిష్ 3 వంటి పలు సినిమాల్లో నటించాడు. పీఎమ్ నరేంద్రమోది బయోపిక్‌లో ప్రధాని మోది పాత్రను పోషించాడు. తాజాగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. చదవండి: దావూద్ పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్.. ఒక్క ఫోటోతో జీవితం నాశనం! -
వివేక్ ఒబెరాయ్‌కి రూ.1.55 కోట్ల టోకరా
ముంబై: సామాన్యులే కాదు, ప్రముఖులు సైతం ఆర్థిక నేరాల బారినపడుతున్నారు. ఇదే తరహాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ రూ.1.55 కోట్లు పోగొట్టుకున్నారు. ఈవెంట్, సినీ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టాలని, మంచి లాభాలు వస్తాయంటూ ఓ సినీ నిర్మాత, వివేక్ ఒబెరాయ్ ఇద్దరు వ్యాపార భాగస్వాములు నమ్మించారు. ఒబెరాయ్ రూ.1.55 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. కానీ, ఆ సొమ్మును ముగ్గురు వ్యక్తులు సొంతానికి వాడుకున్నారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. సదరు ఈవెంట్, సినీ నిర్మాణ సంస్థలో వివేక్ ఒబెరాయ్ భార్య కూడా భాగస్వామిగా ఉన్నారు. -
ఆయన కంపెనీ ఎన్నో నేర్పింది:వివేక్ ఒబెరాయ్
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన కంపెనీ సినిమా తనకు ఎన్నో నేర్పిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ చెప్పాడు. ఆ సినిమా తనకు తొలి పాఠం మాత్రమే కాదు నిత్యం మననం చేసుకునే పాఠం కూడా అంటున్నాడు.ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఒకటైన ఎంఎక్స్ రూపొందించిన ఒరిజినల్ సిరీస్ ‘ ధారావీ బ్యాంక్’ లో వివేక్... పవర్ఫుల్ జెసెపీ జయంత్ గవాస్కర్ పాత్ర పోషించారు. రూల్‌బుక్‌కు కట్టుబడి ఉండాల్సిన పనిలేని, తనకు అనుకూలమైన రీతిలో నిబంధనలను మార్చుకునే తత్త్వమున్న పోలీస్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన పాత్ర ప్రశంసలు అందుకుంటున్న సందర్భంగా స్పందించిన వివేక్.. నటన వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లుగా ఉండటమే జయంత్ గవాస్కర్‌గా తాను ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ అన్నాడు. ఈ సందర్భంగా తన తొలి చిత్రం ‘కంపెనీ’ ని గుర్తు చేసుకున్నాడు. కంపెనీ నా తొలి చిత్రమే అయినప్పటికీ దానిలో నేర్చుకునేందుకు ఎంతో ఉండడం నాకు మేలు చేసింది. ఆ సినిమాలో అద్భుతమైన నటులు అజయ్‌దేవగన్, మోహన్‌లాల్ వంటి నటులు చేశారు. ధారావీ బ్యాంక్ కోసం నేను మోహన్‌లాల్ సర్ నటనా చాతుర్యం పరిశీలించడానికి పదే పదే ఆ సినిమా చూశాను. ఆయన దానిలో ముంబై పొలీస్ జాయింట్ కమిషనర్ వీరపల్లి శ్రీనివాసన్, ఐపీఎస్, గా చేశారు. తన సీన్స్ అద్భుతంగా రావడం కోసం ఆయన అనుసరించిన విధానం నాకిప్పటికీ గుర్తే’’ అని అన్నారు. అనుభవంతో కూడిన టెక్నిక్ ఆయనది. ఆయన పాత్రలో అవలీలగా ఒదిగిపోతారు. ఆయన ఆ క్యారెక్టర్‌కు ఆయన సిద్ధమయ్యే తీరు స్ఫూర్తిదాయకం. ఈ క్యారెక్టర్ కోసం నేను ఆయన ఉపయోగించిన కొన్ని ట్రిక్స్ చేశాను. దానితో పాటుగా ముంబైలో ఎంతోమంది పోలీసులతో నాకున్న పరిచయాలు, వారి మార్గనిర్థేశనం ఈ క్యారెక్టర్ గొప్పగా రావడానికి తోడ్పడిందన్నాడు. ముంబయిలోని ధారావీ గోడల మధ్య విస్తరించిన నేర సామ్రాజ్యపు శక్తివంతమైన కథ ధారావీ బ్యాంక్ ఇది. రూ.30వేల కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన ఆర్ధిక నేరసామ్రాజ్య మూలాలను అన్వేషించే ఓ అవిశ్రాంత పోలీస్ ప్రయత్నమే ఈ సిరీస్. ఉద్విగ్నభరితంగా సాగే కథనం కూడా తోడు కావడంతో ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ ఇప్పటికే వీక్షకుల ఆదరణ పొందింది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ 'కడువా'!
మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కడువా. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో జూన్ 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అదే సమయంలో దీనిపై వివాదాలు సైతం రాజుకున్నాయి. మూవీలో కొన్ని సన్నివేశాలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమవడంతో చిత్రయూనిట్ క్షమాపణలు చెప్పి ఆ సన్నివేశాలను తొలగించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 4 నుంచి ప్రసారం కానుంది. అయితే ఓటీటీ రిలీజ్‌ను అడ్డుకోవాలంటూ జోస్ కురువినక్కునీల్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. కడువాలోని ప్రధాన పాత్ర పేరు సహా తన జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారని మండిపడ్డాడు. ఇక గతంలోనూ అతడు కడువా విడుదల ఆపేయాలంటూ ఫిర్యాదు చేశాడు. తన జీవితకథ ఆధారంగా సినిమా తీశారని, కానీ కొన్ని సన్నివేశాలు తనను, తన కుటుంబ గౌరవాన్ని మంట గలిపేలా ఉన్నాయని మండిపడ్డాడు. దీంతో సెన్సార్ బోర్డ్ సినిమాలోని లీడ్ క్యారెక్టర్ పేరును కురువచన్ అని కాకుండా కురియచన్ అని మార్చాలని సూచించింది. ఇన్ని వివాదాల నడుమ విడుదలైన ఈ మూవీ మరికొద్ది రోజుల్లో ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, సంయుక్త మీనన్, కలాభవన్ షాజన్ ముఖ్య పాత్రలు పోషించారు. షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మ్యాజిక్ ఫ్రేమ్స్– పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌పై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. చదవండి: విజయ్, రష్మిక డేటింగ్‌పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే రవితేజకు ఊహించని షాక్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సీన్స్ లీక్! -
ఇక రీమేక్ సినిమాలు ఉండవు..ఆ మోడల్ని ఫాలో అవ్వాల్సిందే: హీరో
‘‘మలయాళ చిత్రాలు వాస్తవానికి దగ్గరగా, ఆలోచన రేకెత్తించేలా ఉంటాయని ప్రేక్షకులు భావించడం సంతోషం. అయితే కొన్నాళ్లుగా థియేటర్లో హాయిగా కూర్చుని పాప్ కార్న్ తింటూ విజల్స్ వేస్తూ ఎంజాయ్ చేసే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు రాలేదు. మా ‘కడువా’ ఆ లోటుని తీరుస్తుంది. ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. షాజీ కైలాస్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్తా మీనన్ జంటగా వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కడువా’. మ్యాజిక్ ఫ్రేమ్స్– పృథ్వీరాజ్ ప్రొడక్ష¯Œ ్సపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించిన ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ హైదరాబాద్‌లో విలేకరులతో పంచుకున్న విశేషాలు... ► ‘సింహాసనం’ (2012) తర్వాత మళ్లీ షాజీ కైలాస్ దర్శకత్వంలో సినిమా చేయడం ఎలా అనిపించింది? పృథ్వీరాజ్: మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లకు షాజీ కైలాస్గారు పెట్టింది పేరు. ఆయన సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను. నేను దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’లో కొన్ని చోట్ల ఆయన మార్క్ కనిపిస్తుంది. ‘కడువా’ కథ వినగానే ‘మీరు డైరెక్ట్ చేస్తే ఈ సినిమాను నేనే నిర్మిస్తాను’ అన్నాను. ‘కడువా’ ఆయన మార్క్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ► కడువా అంటే ఏంటి? కడువా అంటే పులి. ఇందులో హీరో పేరు కడువకున్నేల్ కురువచన్. షార్ట్ కట్లో కడువా. అందుకే ప్రతి భాషలో అదే టైటిల్ పెట్టాం. కడువ కున్నేల్ ధనికుడు. ఒక వ్యక్తితో చిన్న అహం సమస్య మొదలై పెద్ద హింసకు దారితీస్తుంది. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ ఈ చిత్రకథపై రచయితకి మరో వ్యక్తికి మధ్య వివాదం వచ్చింది. కోర్టు రచయితకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ లోనూ అహం పాయింట్ ఉంది కదా.. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (తెలుగులో ‘భీమ్లా నాయక్)లో అహం అనే పాయింట్ ఉన్నా, సినిమాటిక్‌గా రియల్ స్టోరీ. కానీ ‘కడువా’ మాత్రం కమర్షియల్, లార్జర్ దెన్ లైఫ్ సినిమా. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’తో పోలికలుండవు. ► మీకు ఎలాంటి జోనర్ సినిమాలంటే ఇష్టం? నా దృష్టిలో గుడ్ మూవీ, బ్యాడ్ మూవీ.. అంతే. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా, వైవిధ్యమైన సినిమా అయినా.. ఏదైనా సరే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తే అదే గుడ్ మూవీ. సినిమా చూస్తూ ఫోన్లో మెసేజ్‌లు చెక్ చేసుకుంటూ దిక్కులు చూస్తుంటే అది బ్యాడ్ మూవీ. నేనెప్పుడూ మంచి సినిమాలు చేయాలని తాపత్రయపడుతుంటాను. ► నటన, దర్శకత్వం, నిర్మాణం, పాటలు పాడటం... ఇన్ని పనులు కష్టం అనిపించవా? అవన్నీ సినిమాలో భాగమే. అయితే నిర్మాణానికి ఎంతో ప్రతిభ కావాలి. ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఈ విషయంలో నా భార్య (సుప్రియా మీనన్) సపోర్ట్‌గా ఉంటారు. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే వంటివి నేను చూసుకుంటాను. జీఎస్టీ, ఫైల్స్ వంటి బోరింగ్ పనుల్ని నా భార్య చూస్తుంది(నవ్వుతూ). ► మీ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ‘కడువా’ని థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి కారణం? పాన్ ఇండియా స్థాయిలో నా సినిమా విడుదల అవ్వాలనుకున్నాను. ‘కడువా’తో అది మొదలు పెట్టాను. భవిష్యత్‌లో రీమేక్ సినిమాల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి పరిశ్రమ నుండి మల్టీ లాంగ్వేజ్ సినిమాలని రూపొందించడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. రాజమౌళిగారి ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మెయిన్ స్ట్రీమ్‌గా రిలీజ్ అయ్యాయి. ఆయన చూపించిన ఆ మోడల్ని మనం ఫాలో అవ్వాలి. ‘కేజీఎఫ్ 2’ కూడా ఇదే మోడల్లో రిలీజ్ అయింది. పెద్ద బడ్జెట్ సిని మాలు భవిష్యత్‌లో అన్ని భాషల్లో థియేటర్ రిలీజ్ కావాలి. థియేటర్లో సినిమాని ఎంజాయ్ చేయడం గొప్ప అనుభూతి. ఈ అనుభూతి ఓటీటీ ఇవ్వలేదు. మీ సినిమాలు తెలుగులో రీమేక్ కావడం గురించి... హ్యాపీ. ‘లూసిఫర్’ రీమేక్ చిరంజీవిగారు చేస్తున్నారు. ఆ చిత్రాన్ని నేను తెలుగులో దర్శకత్వం చేసి ఉన్నా ఆయనే నా ఫస్ట్ ఆప్షన్. తెలుగు రీమేక్ కథలో మార్పులు గురించి నాకు తెలీదు. నేనూ ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ► ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌కి దర్శకత్వం వహించే అవకాశం ఎందుకు వదులుకున్నారు? చిరంజీవిగారికి నేను అభిమానిని. ‘లూసిఫర్’ రీమేక్ చేయమని అడిగారు. కానీ, వేరే సినిమాతో నేను బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అంతకు ముందు ‘సైరా నరసింహా రెడ్డి’లో కూడా ఒక పాత్ర చేయమని కోరారు.. అప్పుడూ వీలుపడలేదు. చిరంజీవిగారితో పని చేయాలని ఉంది. నేను ‘లూసిఫర్ 2’ చేస్తున్నాను. ఈ సినిమా తెలుగు రీమేక్ అవకాశం వస్తే చిరంజీవి గారితో చేస్తాను. -
వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే..
ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వినోదాన్ని అందించే ప్రధాన వేదికలుగా మారాయి. ఈ ఓటీటీల ద్వారా వినోదమే కాకుండా మంచి మార్కెటింగ్, బిజినెస్ కూడా ఏర్పడుతోంది. దీంతో చిన్న హీరోలు, నటులే కాకుండా పెద్ద హీరోలు సైతం ఓటీటీ బాట పడుతున్నారు. సూర్య, నాని వంటి తదితర హీరోల సినిమాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లతో కూడా అలరించారు కొందరు స్టార్ హీరోలు. విభిన్నమైన కథలను వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే అవకాశం ఓటీటీలకు ఉండటంతో సై అంటున్నారు కథానాయకులు. మనోజ్ భాయ్పాయ్, కెకె మీనన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పంకజ్ త్రిపాఠి వంటి పాపులర్ యాక్టర్స్‌కు పోటీ ఇస్తున్నారు ఈ పెద్ద హీరోలు. 1. అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా వెండితెరకు పరిచయమైన అభిషేక్ బచ్చన్ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రెండేళ్లలో అభిషేక్ సినిమాలన్నీ నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. 2020లో వచ్చిన 'బ్రీత్: ఇన్టు ది షాడోస్' వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగు పెట్టాడు అభిషేక్ బచ్చన్. 2. సైఫ్ అలీఖాన్ వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతిపెద్ద బాలీవుడ్ స్టార్లలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. తన హ్యాండ్సమ్ లుక్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను, అభిమానులను ఎంతో అలరించాడు. 2018లో రిలీజైన 'సేక్రేడ్ గేమ్స్' వెబ్ సిరీస్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కోల్కీ కొచ్చి వంటి భారీ తారాగణం నటించింది. తర్వాత 2020లో ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ కూడా వచ్చింది. 3. అజయ్ దేవగణ్ 'ఆర్ఆర్ఆర్'లో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అజయ్ దేవగణ్ తాజాగా వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సైకాలాజికల్, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' అనే వెబ్ సిరీస్‌లో అజయ్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా అలరించాడు. మార్చి 4, 2022న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా హీరోయిన్గా నటించడం విశేషం. 4. వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ 'ప్రిన్స్'గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వివేక్ ఒబెరాయ్. బాలీవుడ్ చాక్లెట్ బాయ్‌గా పేరొందిన ఈ హీరో రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నెగెటివ్ పాత్రలు పోషిస్తున్న వివేక్ 2017లో 'ఇన్సైడ్ ఎడ్జ్' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎక్కాడు. క్రికెట్ నేపథ్యంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇప్పటికీ 3 సీజన్లు రిలీజ్ చేసింది. 5. మాధవన్ విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మాధవన్ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో నటించి ఆకట్టుకున్న మాధవన్‌ను చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు. ఈ 51 ఏళ్ల హీరో ఇటీవల 'డీకపుల్డ్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 2018లో విడుదలైన 'బ్రీత్' వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకు ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. -
ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నా.. అయినా కష్టంగా ఉంది: నటుడు ఆవేదన
వివేక్ ఒబెరాయ్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. హిందీ నుటుడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరితులు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన రక్త చరిత్ర సినిమాలో నటించి తన నటనతో తెలుగు వారిని మెప్పించారు. ఇక బాలీవుడ్లో ఆయన ఓ స్టార్ నటుడు. విలన్‌గా, హీరోగా, సహా నటుడిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని విలక్షణ నుటుడిగా పేరు తెచ్చుకున్నారు వివేక్. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి ఆయన 20 ఏళ్లపైనే అవుతుంది. చదవండి: ఇన్సైడ్ ఎడ్జ్ హ్యాట్రిక్ సీజన్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా? అయినప్పటికీ నటుడిగా తనని తాను నిలదొక్కుకునేందుకు ఇప్పటికి ఆయన కష్టపడుతున్నారంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఈ మాటలు స్వయంగా ఆయనే చెప్పడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. బాలీవుడ్లో టాలెంట్ కంటే ఇంటి పేర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బి-టౌన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు 20 ఏళ్లు నుంచి తాను పరిశ్రమలో ఉన్నప్పటికీ.. నేటికి తన ప్రయాణం ఎంతో కష్టం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వివేక్ తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘ఇన్సైడ్ ఎడ్జ్’ మూడవ సీజన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా వివేక్ మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో నెపోటిజంపై ఆయనకు ప్రశ్న ఎదురవగా తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు. ఈ మేరకు ‘20 ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్న. అయినప్పటికీ నటుడిగా నా ప్రయాణం ఇప్పటికీ కష్టంగా ఉంది. బాలీవుడ్.. కొత్త టాలెంట్ పెంచి పోషించే ఒక వ్యవస్థను అభివృద్ధి చేసుకోలేకపోయింది. హిందీ చిత్ర పరిశ్రమను ఎక్స్‌క్లూజివ్ క్లబ్‌గా మార్చేశారు. ఇది చాలా బాధించే విషయం. ఇక్కడ రాణించాలంటే ప్రతిభ కంటే ఇంటిపేరు కీలకంగా మారింది. బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకోవాలంటే ఇంటిపేరు ప్రముఖులదై ఉండాలి. చదవండి: 'విడాకుల తర్వాత చనిపోతా అనుకున్నా'.. సమంత షాకింగ్ కామెంట్స్ లేదంటే ప్రముఖులకు బంధువో, లేక తెలిసిన వారై ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఇక్కడ అవకాశాలు వస్తాయి. ఇక్కడ అవకాశాలకు, ప్రతిభకు సంబంధం ఉండదు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ నేపోటిజం(బంధుప్రీతి)పై చర్చ సాగుతున్న నేపథ్యంలో హిందీ పరిశ్రమకు చెందిన స్టార్ నటుడు ఈ వ్యాఖ్యలు చేయడం హాట్‌టాపిక్ మారింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో యువ టాలెంట్‌ను నింపేందుకు తన వంతుగా కృష్టి చేస్తున్నానని, వీలైనంతగా కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నానని వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు. -
ఇన్సైడ్ ఎడ్జ్ హ్యాట్రిక్ సీజన్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?
Inside Edge Season 3: క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్ ఫీవర్ తగ్గింది. టీ20 వరల్డ్ కప్ ముగిసింది. ఇక క్రికెట్ కోలహాలం తగ్గిందని అనుకుంటున్నారా ? అలా అస్సలు ఆలోచించకండి. నిరాశ పడకండి క్రికెట్లో మరో పెద్ద లీగ్ రానుంది. కానీ ఈ లీగ్ గ్రౌండ్లో జరగదండి. అమెజాన్ ప్రైమ్ వేదికగా హ్యాట్రిక్ కొట్టడానికి 'ఇన్సైడ్ ఎడ్జ్ సీజన్ 3' వెబ్ సిరీస్ అనే మ్యాచ్ ప్రారంభంకానుంది. గేమ్ మాస్టర్స్ తిరిగి రానున్నారు. ఈసారి వెనక్కి తిరిగి చూసుకునే ప్రసక్తే లేదంటున్నాయి మ్యాచ్‌లో తలపడనున్న జట్లు క్రికెట్ నేపథ్యంగా వచ్చిన వెబ్ సిరీస్ ఇన్సైడ్ ఎడ్జ్. మొదటి రెండు సీజన్లు క్రికెట్ అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మూడో సీజన్ కోసం వెబ్ సిరీస్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. ఇన్సైడ్ ఎడ్జ్ సీజన్ 1, 2లను ప్రేక్షకులు ఆదరించి, భారీ సక్సెస్ ఇవ్వడంతో మూడో సీజన్‌ను ప్లాన్ చేసి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్. ఈ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ 3వ సీజన్ డిసెంబర్ 3, 2021న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తామని మేకర్స్ సోమవారం ప్రకటించారు. ఈ సీజన్ 3లో వివేక్ ఒబెరాయ్, రిచా చద్దా, తనూజ్ విర్వానీ, అమీర్ బషీర్, సయానీ గుప్తా, సప్నా పబ్బి, అక్షయ్ ఒబెరాయ్, సిధాంత్ గుప్తా, అమిత్ సియాల్ నటించారు. కరణ్ అన్షుమాన్ రూపొందించిన ఈ సిరీస్‌కు కనిష్క్ వర్మ దర్శకత్వం వహించారు. ఎక్సెల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మాత రితేష్ సిధ్వాని ' ఇన్సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్‌కు వీక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అదే మమ్మల్ని మరో సీజన్‌ను రూపొందిచేలా ప్రోత్సహించింది. ఇన్సైడ్ ఎడ్జ్ మాకు ఎప్పుడూ ప్రత్యేకమైంది. ఇది అమెజాన్‌తో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ మొదటి ఒరిజినల్ సిరీస్. ఇండియాలో అమెజాన్ మొదటి ఒరిజినల్ సిరీస్ కావడంతో మాకు ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఈ సీజన్లో ముంబై మావెరిక్స్ ప్రయాణం, గ్రిప్పింగ్ దశను వివరించామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం.' అంటూ ఆయన భావాలు పంచుకున్నారు. View this post on Instagram A post shared by Kanishk Varma (@kanishk.varma) -
వివేక్ ఒబెరాయ్‌పై కేసు నమోదు
ముంబైలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఒకవైపు ప్రభుత్వం టెన్షన్ పడుతోంది. మరోవైపు సెలబ్రిటీలు కాసింత మైమరిచి ప్రవర్తించి చిక్కులు పడుతున్నారు. నటుడు వివేక్ ఒబెరాయ్‌పై తాజాగా కేసు బుక్ అయ్యింది. ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదైంది. దానికి కారణం హీరోగారి ఉత్సాహం. వేలెంటైన్స్ డే సందర్భంగా వివేక్ తన భార్య ప్రియాంకా అల్వాతో కలిసి హార్లి–డేవిడ్సన్ బైక్ మీద ముంబై వీధుల్లో షికారు చేశాడు. అంతేనా! చుట్టుముట్టిన అభిమానులతో ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అక్కడి నుంచి సమస్య మొదలైంది. సోషల్ మీడియాలో అతణ్ణి చూసిన నెటిజన్లు ‘మాస్క్ ఏది? హెల్మెట్ ఏది?’ అని ప్రశ్నించడం మొదలెట్టారు. వెంటనే పోలీసులు రంగంలో దిగి హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు 500 రూపాయల ఫైన్ వేశారు. అది చెల్లించడం సులభం. భార్య ప్రియాంకా అల్వాతో వివేక్ అయితే మాస్క్ లేకుండా బాధ్యతారహితంగా తిరిగినందుకు సెక్షన్ 269 ప్రకారం కేసు నమోదైంది. మహమ్మారి సమయంలో అది వ్యాపించేలా తిరిగే వ్యక్తులపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. అయితే ఈ వ్యవహారంలో వివేక్ స్పందన ఇంకా తెలియలేదు. ఒకవైపు భార్యతో కలిసి ఏదో సరదాగా బయలుదేరాడనుకునేవారు ఉండొచ్చు. మరోవైపు ఇలా శిక్షించేలా ఉండాల్సిందే అనేవారూ ఉండొచ్చు. కాని వివేక్ చిన్నవాడేమి కాదు. ఏకంగా నరేంద్రమోది పాత్రను పోషించి ‘పి.ఎం. నరేంద్రమోదీ’ సినిమాలో నటించాడు. ఇంకా పెద్ద సినిమాలలో నటిస్తున్నాడు. కనుక ఈ కేసులు అతణ్ణి ఏమి చేస్తాయో చూడాలి. -
పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ హీరో
ముంబై : బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా వివేక్ భార్య ఆయనకు ఓ బైక్‌ని బహుమతిగా ఇచ్చింది. దీంతో అదే రోజు శ్రీమతిని బైక్‌పై ఎక్కించుకొని ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా వివేక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే వివేక్ హెల్మెట్ ధరించకపోవడంతో ఇది కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా హీరో వివేక్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి చలానా విధించారు. అంతేకాకుండా కరోనా సమయంలో మాస్క్ ధరించనందున ఎఫైఐఆర్ నమోదు చేశారు. మహారాష్ట్రలోగత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తుండంతో అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనల్ని పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వివేక్ చివరగా ప్రధానమంత్రి మోదీ బయోపిక్‌లో కనిపించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చదవండి : (వివేక్ ఒబెరాయ్ భార్యకు నోటీసులు!) (‘దిశా.. యమ హాట్‌గా ఉన్నావ్’) View this post on Instagram A post shared by Vivek Oberoi (@vivekoberoi) -
మాజీ మంత్రి తనయుడి ఇంట్లో డ్రగ్స్
బెంగళూరు: శాండల్ వుడ్ డ్రగ్ కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ దర్యాప్తులో కొంత మంది ప్రముఖులు వారి బంధువులు పేర్లు కూడా ఉన్నాయి. ఇక ఈ లిస్ట్‌లో ఆదిత్య అల్వా కూడా నిందితులుగా ఉన్నారు. ఆదిత్య అల్వా మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సోదరుడు. శాండల్‌వుడ్ డ్రగ్ కేసులో కాటన్‌పేట్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆదిత్య 6వ నిందితుడిగా ఉన్నారు. ఆదిత్య అల్వా నివాసంలో ఎన్సీబీ అధికారులు దాడులు చేయగా 55 గ్రాముల పొడి గంజాయి లభించింది. లాక్డౌన్ సమయంలో ఆల్వా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పార్టీలో డ్రగ్స్ సేకరించి, సరఫరా చేయడంలో ఆదిత్య అల్వా ప్రధాన పాత్ర పోషించాడని ఇప్పటికే ఎన్సీబీ విచారిస్తున్న నిందితుడు రవిశంకర్ అంగీకరించాడు. ఆదిత్య అల్వా పేరు వెలుగులోకి రావడంతో సెప్టెంబర్ 4 నుంచి పరారీలో ఉన్నాడు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అవడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంతవరకు ఆయనకు ఉపశమనాన్ని కలిగించలేదు. క్రైమ్ బ్రాంచ్ అతనికి లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. ఆదిత్యను అరెస్టు చేయడానికి సిద్ధమయ్యింది. చదవండి: డ్రగ్స్ కేసు: తెరపైకి ప్రముఖుల పేర్లు.. -
వివేక్ ఒబెరాయ్ భార్యకు నోటీసులు!
ముంబై: బాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కేసు కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కన్నడ నటీనటులు అరెస్టై జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో నిన్న (గురువారం) బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(బీసీసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంతేగాక ఆయన భార్య ప్రియాంక అల్వా ఒబెరాయ్‌కు క్రైం బ్రాంచ్ శుక్రవారం నోటీసులు ఇచ్చింది. అయితే డ్రగ్ కేసులో కర్ణాటక మాజీ దివంగత మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు అదిత్య అల్వా నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: డ్రగ్ కేసు; వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు) City Crime Branch Bengaluru serves notice to Priyanka Alva Oberoi over links with brother Adithya Alva in connection with Sandalwood drug case. #Karnataka CCB raided actor Vivek Oberoi's Mumbai residence in search of his relative Aditya Alva in connection with the case y'day. — ANI (@ANI) October 16, 2020 ఆదిత్య అల్వా స్వయంగా ప్రియాంక అల్వా సోదరుడు, వివెక్ ఒబెరాయ్‌కి బావమరిది కావడంతో పోలీసులు ఆయన ఇంటిలో తనిఖీ చేసినట్లు తెలిసింది. అయితే ఆదిత్య పరారీ ఉండటంతొ ఆచూకి కోసం ఇవాళ ప్రియాంకను పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసు అధికారి మాట్లాడుతూ... ‘డ్రగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆదిత్య అల్వా పరారీలో ఉన్నాడు. అతడు నటుడు వివెక్ ఒబెరాయ్ భార్య ప్రియాంకకు సోదురుడు. అతడి ఆచూకి కోసమే వివేక్ ఇంటిలో సోదాలు నిర్వహించాం. అయితే ఆచూకి లభించకపోవడంతో ప్రియాంకను విచారించేందుకు ఇవాళ నోటీసులు జారీ చేశాం’ అని అధికారి చెప్పుకొచ్చారు. (చదవండి: వారికి అండర్‌వరల్డ్ డాన్లతో సంబంధాలు..!) -
వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు
సాక్షి, బెంగళూరు: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ముంబై నివాసంపై బెంగళూరు పోలీసులు గురువారం సోదాలు చేశారు. మత్తుమందుల కేసులో నిందితుడిగా ఉన్న వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య ఆళ్వా కోసం ఈ దాడులు జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని కాటన్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఆదిత్యపై ఓ కేసు నమోదు కాగా అతడు పరారీలో ఉన్నట్లు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. ‘ఆదిత్య సమాచారం తెలియడంతో కోర్టు వారెంట్‌తో అతడి బంధువైన వివేక్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు’ అని కమిషనర్ చెప్పారు. తనిఖీల ఫలితం ఏమిటన్నది మాత్రం వివరించలేదు. ఆదిత్య మాజీ మంత్రి దివంగత జీవరాజ్ ఆళ్వా కుమారుడు. రేవ్‌పార్టీలు, మత్తుమందు సరఫరాదారులు, అమ్మకం దార్లపై పోలీసులు విరుచుకుపడిన నేపథ్యంలో కన్నడ సినీనటులు రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీసహా కొందరు నైజీరియన్లను అరెస్ట్ చేయడం తెల్సిందే. రెండు నెలల క్రితం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేసిన ముగ్గురు వ్యక్తులు తాము నటులకు మత్తుమందులు సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతోనే ఈ అరెస్ట్‌లు జరిగాయని సమాచారం. -
డ్రగ్ కేసు; వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు
ముంబై : నటుడు వివేక్ ఒబెరాయ్ ఇంట్లో బెంగళూరు పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. శాండల్ డ్రగ్స్ కేసులో వివేక్ బావమరిది అదిత్య అల్వాకు సంబంధాలు ఉండటంతో పోలీసులు నేడు ముంబైలోని వివేక్ ఇంట్లో ఈ సోదాలు చేశారు. ఆదిత్య అల్వా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు బెంగుళూరు జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. అదే విధంగా అతని బంధువైన వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సందీప్ ఉన్నట్లు తమకు సమాచారం అందిందని అందుకే తనిఖీ చేసినట్లు వెల్లడించారు. కోర్టు నుంచి వారెంట్ పొందిన తర్వాతే క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం ముంబైలోని ఒబెరాయ్ ఇంట్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. కాగా అదిత్య సోదరి ప్రియాంకను అల్వాను 2010లో వివేక్ వివాహం చేసుకున్నారు. చదవండి: నేరస్తురాలిని కాను: అనుశ్రీ ఆవేదన కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు అయిన ఆదిత్య అల్వా కన్నడ సినీ ప్రముఖలకు, సింగర్స్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన శాండల్‌వుడ్ డ్రగ్స్ కుంభకోణం కేసులో పోలీసులు చర్య ప్రారంభించినప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. మరోవైపు అధికారులు బెంగళూరులోని అదిత్య అల్వా ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే 15 మంది అరెస్ట్ అవ్వగా వీరిలో నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ ఉన్నారు. అలాగే రేవ్ పార్టీ నిర్వాహకుడు వీరెన్ ఖన్నా, రియల్టర్ రాహుల్ థోన్స్ కూడా ఉన్నారు. చదవండి: డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లకు షాక్ -
మోదీ బయోపిక్ మళ్లీ విడుదల
భారత ప్రధాని నరేంద్ర మోది జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీయం నరేంద్ర మోది’. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ పోషించారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది మే 24న విడుదలయింది. అయితే మరోసారి ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. లాక్డౌన్ తర్వాత ఈ నెల 15 నుంచి థియేటర్స్ మళ్లీ ప్రారంభం కానున్నాయి అనే విషయం తెలిసిందే. దాంతో ‘పీయం నరేంద్ర మోది’ని 15న రీ–రిలీజ్ చేయనున్నారు. ‘‘కొందరి పొలిటికల్ అజెండాల వల్ల ఈ సినిమా విడుదలైనప్పుడు ఎక్కువమంది ప్రేక్షకులకు చేరలేదు. ఈ రీ–రిలీజ్లో అందరికీ ఈ సినిమా చేరువ అవుతుందనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత సందీప్ సింగ్. -
థియేటర్లలో ఫస్ట్ సినిమా అదే..
ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర నేపథ్యంలో వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘నరేంద్ర మోదీ’. ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందకు రానుంది. ఆక్టోబర్ 15న థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు. కాగా కరోనా కారణంగా గత ఆరు నెలల నుంచి సినిమా థియేటర్లు అన్ని మూత పడిన విషయం తెలిసిందే. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15నే తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో థియేటర్ల పునఃప్రారంభం తరువాత థియేటర్లలో విడుదల అవతున్న మొదటి సినిమా ఇదే. ఈ విషయాన్ని సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్లో వెల్లడించారు. చదవండి: స్టార్ క్రికెటర్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి కాగా జాతీయ అవార్డు విజేత ఓముంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘నరేంద్ర మోదీ’ చిత్రం గత ఏడాది మే 24 న విడుదలైంది. విడుదలైన మొదటి రోజునే రూ .2.88 కోట్లు సంపాదించింది. మోదీ పాత్రంలో వివేక్ ఒబెరాయ్ తొమ్మిది విభిన్న లుక్‌లో కనిపించారు. ఇందులో మోదీ పేదరికంలో ఉన్న సమయంలో రైల్వే స్టేషన్లో టీ అమ్మడం నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నాయకుడిగా ఎదిగిన విధానాన్ని చూపించారరు. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, బర్ఖా బిష్ట్, రాజేంద్ర గుప్తా, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. చదవండి: కోవిడ్‌పై పోరుకు ప్రజాచైతన్య కార్యక్రమం -
ఇస్మార్ట్ కుక్క: హీరో ఫిదా!
స్లిఘ్ రైడ్(ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు జారడం) అంటే ఇష్టం ఉండని వారుండరు. మంచు ప్రాంతం కనిపిస్తే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు స్లీఘ్ రైడ్‌కు ఆసక్తి చూపుతారు. అలాగే ఈ కుక్కకు కూడా అలా జారుతూ ఆడుకోవడం ఇష్టం అనుకంటా. మంచు ప్రాంతం కనిపించగానే స్లిఘ్తో జారుతూ ఆడుకుంటున్న వీడియోను ఓ ట్విటర్ యూజర్ ఆదివారం షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కీ అనే వ్యక్తి ‘ఈ రోజు మీరు చూసిన గొప్ప విషయం ఇదే అనుకుంటా’ అనే క్యాప్షన్‌తో దీన్ని షేర్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 5 మిలియన్ల వ్యూస్ రాగా వందల్లో కామెంటు వస్తున్నాయి. ‘ఇది చాలా తెలివైన కుక్క’, ‘ఈ రోజు నేను చూసిన అత్యంత గొప్ప సంఘటన ఇదే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. This is the best thing you'll see today 😍 pic.twitter.com/xhOsd3imIM — Akki (@akkitwts) February 2, 2020 ఈ కుక్క స్వయంగా దాని నోటితో ప్లాస్టిక్ స్లిఘ్ను తీసుకుని మంచుతో కప్పి ఉన్న ఎత్తైన ప్రదేశం పైకి ఎక్కి దాన్ని కాళ్లకింద వేసుకుని కిందికి జారుతూ ఆస్వాదిస్తున్న ఈ వీడియోకు సినిమా హీరోలు సైతం ఫిదా అవుతున్నారు. దీని తెలివికి బాలీవుడ్ నటుడు వివెక్ ఒబెరాయ్ ఆశ్యర్యపోతూ.. ‘నిజంగా ఇది చాలా ముద్దుగా ఉంది!!’ ‘ఈ కుక్క స్మార్ట్ ఫోన్ కంటే స్మార్ట్’ అని కామెంటు చేశాడు. అంతేగాక హాలీవుడ్ నటుడు క్రిస్ ఎవాన్స్ కూడా ‘హే.. ఏంటీ ఈ కుక్క స్లిఘ్ చేస్తుంది.. అంతా ఓకే కదా!’ అంటూ వీడియోను రీ ట్వీట్ చేశాడు. -
భారతీయుడిగా అది నా బాధ్యత
ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్లో జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సంఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్తాన్ ఎయిర్‌పోర్స్ బృందం అరెస్టు చేయడం, తర్వాత పాకిస్తాన్ అతన్ని విడిచిపెట్టేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం.. ఫైనల్‌గా అభినందన్ తిరిగి భారత్‌కు రావడం.. ఇలా అన్ని విషయాలను దేశ ప్రజలు చాలా ఆసక్తితో గమనించారు. ఇప్పుడు ఈ విషయాలనే వెండితెరపై చూపించబోతున్నారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. ‘‘బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సంఘటనల ఆధారంగా సినిమా తీయడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విభాగం నాకు అనుమతులు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారతీయుడిగా, దేశ భక్తుడిగా, మన ఆర్మీ బలగాల సమర్థతను ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. పుల్వామా ఎటాక్స్, బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ ఘటనలకు చెందిన వార్తలను నేను ఫాలో అవుతూనే ఉన్నాను. తమ ఆర్మీ, ఇంటెలిజెన్సీ ఇండస్ట్రీస్, పొలిటికల్ లీడర్స్ గురించి హాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ గొప్పగా చెప్పుకుంటారు. మనం ఎందుకు అలా చేయకూడదు? అందుకే ఈ ప్రయత్నం’’ అన్నారు వివేక్. ఈ చిత్రానికి ‘బాలాకోట్: ది ట్రూ స్టోరీ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. హిందీ, తమిళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంకా నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. జమ్ము కశ్మీర్, ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాల్లో చిత్రీకరణ ప్లాన్ చేశారు. మరి.. ఈ సినిమాలో వివేక్ నటిస్తారా? లేక కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. -
మంచిగైంది
ఐశ్వర్యకు పెళ్లయిపోయాక కూడా వివేక్ ఒబేరాయ్‌కి ఆమెపై ప్రేమ ఇంకా పోనట్లుంది. పోకపోతే పోయింది.. ఆమె పరువు తీసి, తన పరువూ తీసేసుకున్నాడు! దేశమంతా ఎగ్జిట్ పోల్స్ మూడ్‌లో ఉన్నప్పుడు ఈయన ఒక్కడు ఐశ్వర్య మూడ్‌లోకి వెళ్లిపోయాడు. ఐశ్వర్య, సల్మాన్ ఉన్న పాత ఫొటో ఒకటి సంపాదించి, దానికి ‘ఒపీనియన్ పోల్’ అని కాప్షన్ పెట్టాడు. ఐశ్వర్యతో తను ఉన్న ఫొటోను ఆల్బమ్‌లోంచి బయటికి లాగి, దానికి ‘ఎగ్జిట్ పోల్’ అని కాప్షన్ పెట్టాడు. ఐశ్వర్య, ఆమె భర్త అభిషేక్, వారి పాప ఆరాధ్య కలిసి ఉన్న ఫొటో వెదికి తీసి, దాని కింద ‘రిజల్ట్’ అని కాప్షన్ పెట్టాడు. ఈ మూడు ఫొటోలను జాయింట్ చేసి ట్విట్టర్లో పెట్టాడు! వెంటనే నెటిజన్లు ‘ఇదేం తలతిక్క పని ఒబెరాయ్’ అంటూ ట్వీట్ చేశారు. సోనమ్ కపూర్ ‘క్లాస్లెస్’ అన్నారు.నేలబారు పని అని! ఢిల్లీ ఉమెన్ కమిషన్ చైర్మన్ స్వాతీ మలీవాల్ ‘డిస్టేస్ట్ఫుల్’ అన్నారు. చవకబారు పని! నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్ ‘డిస్గస్టింగ్’ అన్నారు. చీదర పని అని! మహారాష్ట్ర ఉమెన్ కమిషన్ కూడా ఒబెరాయ్ ట్వీట్‌పై తీవ్రంగా స్పందించబోతోంది. ఇప్పటికే నేషనల్ కమిషన్ ఆయన్ని వివరణ అడిగింది. ఢిల్లీ కమిషన్ ఆపాలజీ అడిగింది. ఆ ట్వీట్ ఫొటోలో మైనర్ బాలికను (ఆరాధ్య) ను చూపించడం కూడా ఇప్పుడు పెద్ద అఫెన్స్ కాబోతోంది. ఏం పని ఇది వివేక్! ఐశ్వర్యకే కాదు. నీకూ పెళ్లయింది కదా. ఇప్పుడు భార్యకు ముఖమెలా చూపిస్తావ్?! -
నాకేం పనిలేదా?: సల్మాన్ ఫైర్
ముంబై : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ మీడియాపై చిందులుతొక్కాడు. తోటి నటుడు వివేక్ ఒబేరాయ్ చేసిన వివాదస్పద ట్వీట్ విషయాన్ని సల్మాన్ ఖాన్ ముందు ప్రస్తావించగా.. ‘ట్విటర్ చూసుకుంటూ ఉండటానికి నాకేం పనిలేదా..? సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. ట్విటర్‌ను నేను అంతగా పట్టించుకోను. నాకంతా సమయం కూడా లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సల్మాన్ నటించిన ‘భారత్’ చిత్రం విడుదలకు సిద్దం కాగా.. ఆ మూవీ ప్రమోషన్స్‌లో ఈ కండలవీరుడు బిజీగా ఉన్నాడు. కత్రీనా కైఫ్, దిశా పటాని, జాకీ ష్రాఫ్, టబు, సోనాలి కులకర్ణి వంటి అగ్రతారలు నటించిన ఈ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వివేక్ ఒబేరాయ్ ఒళ్లు మరిచి చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ ఒబేరాయ్ షేర్ చేసిన మీమ్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. జాతీయ మహిళా కమిషన్ సైతం ఆ ట్వీట్‌కు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ ట్వీట్‌ను తొలిగించి ఒబెరాయ్ క్షమాపణలు కోరారు. ‘కొందరికి సరదాగా తోచిన ఓ విషయం.. మరి కొందరికి బాధ కల్గించవచ్చు. గత పదేళ్ల నుంచి నేను మహిళాసాధికారత కోసం పని చేస్తున్నాను. ఎప్పుడు ఏ మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదు. నేను చేసిన పని వల్ల మహిళలు బాధపడుతున్నారు. అందుకే క్షమాపణలు చెప్తున్నాను. ఆ ట్వీట్ కూడా డిలీట్ చేశాను’ అంటూ ట్వీట్ చేశారు. -
క్షమాపణలు చెప్పిన వివేక్ ఒబేరాయ్
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్.. ఐశ్యర్య రాయ్‌ను కించపరుస్తూ రూపొందించిన మీమ్‌ను షేర్ చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వివేక్ చర్యల పట్ల బాలీవుడ్ జనాలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తక్షణమే వివేక్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వివేక్ క్షమాపణలు చెప్పడమే కాక ఆ ట్వీట్‌ను కూడా డిలీట్ చేశారు. ఈ సందర్భంగా ‘కొందరికి సరదాగా తోచిన ఓ విషయం.. మరి కొందరికి బాధ కల్గించవచ్చు. గత పదేళ్ల నుంచి నేను మహిళాసాధికారత కోసం పని చేస్తున్నాను. ఎప్పుడు ఏ మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదు. నేను చేసిన పని వల్ల మహిళలు బాధపడుతున్నారు. అందుకే క్షమాపణలు చెప్తున్నాను. ఆ ట్వీట్ కూడా డిలీట్ చేశాను’ అంటూ ట్వీట్ చేశారు వివేక్. Sometimes what appears to be funny and harmless at first glance to one, may not be so to others. I have spent the last 10 years empowering more than 2000 underprivileged girls, I cant even think of being disrespectful to any woman ever. — Vivek Anand Oberoi (@vivekoberoi) May 21, 2019 ఒకప్పటి గర్ల్‌ఫ్రెండ్ అయిన ఐశ్వర్య రాయ్ వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ.. ఎగతాళిగా రూపొందించిన మీమ్‌ను వివేక్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ నేపథ్యంలో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఒబెరాయ్‌పై కేసు నమోదు చేసింది. -
వివేకం కోల్పోయావా వివేక్?
ముంబై: సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ షేర్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే దేశం యావత్తు ఉలిక్కిపడేలా ప్రకంపనలు రేగుతాయి. ఇలాంటి ట్విట్టర్ దుమారమే మరోసారి చోటుచేసుకుంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్, ఐశ్వర్యరాయ్‌ను కించపరిచేలా ఉన్న ఒక మీమ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిలో సల్మాన్‌తో ఐశ్వర్య ఉన్న ఫొటోకు ఒపీనియన్ పోల్, వివేక్–ఐశ్వర్య చిత్రానికి ఎగ్జిట్ పోల్, అభిషేక్, ఆరాధ్య, ఐశ్వర్య కలిసి ఉన్న చిత్రానికి రిజల్ట్ అని టైటిల్ ఇచ్చి, ఈ మూడు చిత్రాలతో కూడిన మీమ్‌ను రూపొందించారు. ‘హ..హ.. క్రియేటివ్, రాజకీయాల్లేవు, కేవలం జీవితం’ అని టైటిల్‌తో దీనిని వివేక్ ట్విట్టర్లో షేర్ చేశారు. కొద్ది వ్యవధిలోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారి నెటిజన్లను మండిపాటుకు గురిచేసింది. అతని స్థాయిని సూచిస్తోంది ఈ ట్వీట్ అసహ్యంగా ఉందంటూ నటి సోనమ్ కపూర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా, పలువురు మహిళా జర్నలిస్టులు, ప్రముఖులు ట్విట్టర్లో స్పందించారు. వివేక్‌కు నోటీసులు పంపుతామన్నారు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్. అతని నీచ బుద్ధిని.. అతను జీవితంలోను, రాజకీయాల్లోను సమర్థుడు కాదని తేల్చడానికి ఇదే సాక్ష్యం అంటూ ట్వీట్ చేశారు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్. -
ఐష్‌పై ఒబెరాయ్ ట్వీట్.. సోనమ్ ఫైర్
ముంబై : బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సరదాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో ఆయన షేర్ చేసిన మీమ్ పెడర్థాలకు దారితీసింది. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ను కించపరిచే విధంగా ఉన్న ఆ మీమ్‌పై యావత్ భారతం మండిపడుతోంది. మహిళా అనే కనీస గౌరవం లేకుండా ఒబెరాయ్ ప్రవర్తించాడని దుమ్మెత్తిపోస్తుంది. ఇంతకీ ఒబెరాయ్ చేసిన తప్పు ఏంటంటే.. ఒకప్పటి గర్ల్‌ఫ్రెండ్ అయిన ఐశ్వర్య వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ.. ఎగతాళిగా రూపొందించిన మీమ్‌ను షేర్ చేయడం. ఆమె బాయ్‌ఫ్రెండ్స్‌ను ప్రస్తావిస్తూ.. చాలా జుగుప్సాకరంగా రూపొందించిన ఆ మీమ్‌ను ట్వీట్ చేయడం.. నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో ఐశ్వర్య ఉన్న ఫొటోను ఒపీనియన్ పోల్గా.. తనతో ఐశ్వర్య ఉన్న ఫొటోను ఎగ్జిట్ పోల్గా.. అభిషేక్ బచ్చన్, తన కూతురు ఆరాధ్యతో ఐశ్వర్య ఉన్న ఫొటోను రిజల్ట్‌గా పేర్కొంటూ ఏ మాత్రం సోయి లేకుండా ట్వీట్ చేశాడు. పైగా వెటకారంగా ‘హహహ.. క్రియేటివ్.. ఇక్కడ రాజకీయాలు లేవు. జీవితం మాత్రమే’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరు ఆగ్రహానికి గురవుతున్నారు. ఒబెరాయ్ ఒళ్లు మరిచి ట్వీట్ చేశాడని మండిపడుతున్నారు. చాలా అమర్యాదకంగా ప్రవర్తించాడని, వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించాలని కామెంట్ చేస్తున్నారు. నరేంద్రమోదీ సినిమాలో మోదీ పాత్ర చేసినంత మాత్రానా.. ప్రధానని ఫీలవుతున్నావా? అని ప్రశ్నిస్తున్నారు. మహిళలను గౌరవించడం నేర్చుకో అంటూ బుద్ది చెబుతున్నారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సైతం ఒబెరాయ్ చర్యను తప్పుబట్టారు. చాలా అసహ్యంగా ఉందని కామెంట్ చేశారు. ఈ ట్వీట్ నేపథ్యంలో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఒబెరాయ్‌పై కేసు నమోదు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’ లో ఒబెరాయ్ మోదీ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి పట్టం కట్టిన విషయం తెలిసిందే. Haha! 👍 creative! No politics here....just life 🙏😃 Credits : @pavansingh1985 pic.twitter.com/1rPbbXZU8T — Vivek Anand Oberoi (@vivekoberoi) 20 May 2019 -
‘ఆమె ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు’
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీని ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్‌తో పోలుస్తూ ట్విట్ చేశారు. ‘ గౌరవనీయులైన ఒక మహిళ (మమతా బెనర్జీ) ఇరాక్ మాజీ నియంతలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడంలేదు. దీదీ తనకు తానే ప్రజాస్వామ్యానికి ముప్పులా పరిణమించారు. మొదట ప్రియాంక శర్మను, ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ బగ్గాను నిర్భందించారు. బెంగాల్‌ను రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అని వివేక్ ట్విట్ చేశారు. చదవండి : బెంగాల్లో టెన్షన్.. టెన్షన్ కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ బగ్గాను గృహ నిర్భంగా చేశారు. ఈ నేపథ్యంలోనే వివేక్ పైరకంగా స్పందించారు. బీజేపీపై ఎవరు విమర్శలు చేసినా వెంటనే వివేక్ వెంటనే స్పందిస్తున్నారు. హిందూ ఉగ్రవాదంపై మక్కల్ నీదీ మయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కూడా వివేక్ ఒబెరాయ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే.ఆయన ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయోపిక్ లో నటించారు. I can’t understand why a respected lady like Didi is behaving like Saddam Hussain! Ironically, democracy is under threat and in danger by Dictator Didi herself. First #PriyankaSharma & now #TajinderBagga. यह दीदीगिरी नही चलेगी ! #SaveBengalSaveDemocracy #FreeTajinderBagga pic.twitter.com/oRq596aljH — Vivek Anand Oberoi (@vivekoberoi) 15 May 2019 -
కమల్ వ్యాఖ్యలపై వివేక్ ఒబెరాయ్ ఫైర్
ముంబై : మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను ప్రస్తావిస్తూ దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనన్న మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ నేతలు కమల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. దేశాన్ని విభజించే వ్యాఖ్యలను ఏ ఒక్కరూ చేయరాదని అన్నారు. ‘కమల్ సార్..మీరు గొప్ప నటులు..కళకు ఎలాగైతే మతం ఉండదో ఉగ్రవాదానికీ మతం ఉండదు..గాడ్సే ఉగ్రవాదని అంటున్న మీరు హిందూ అని నిర్ధిష్టంగా ఎందుకు చెప్పారు..? మీరు ముస్లిం ప్రాబల్య ప్రాంతంలో ఉన్నందున వారి ఓట్ల కోసం అలా చెప్పారా..? అని వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేశారు. దయచేసి దేశాన్ని విభజించేలా వ్యవహరించకండి..మనమంతా ఒక్కటే అంటూ ఒబెరాయ్ పేర్కొన్నారు. -
మోదీ బయోపిక్ రిలీజ్ డేట్ ఖరారు
ఎన్నికల వేడిలో రాజకీయ నాయకుల జీవిత చిత్రాలను వెండితెరపై ప్రదర్శించడం కాసింత కష్టమే. ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్, ఏపిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, మమతా బెనర్జీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఈసీ పలుమార్లు బ్రేకులు వేసింది. ఎట్టకేలకు ‘పీఎం నరేంద్రమోదీ’ చిత్రబృందం విడుదల తేదీని ఖరారు చేసింది. ఇప్పటికే చాలాసార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను మే 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో మోదీ పాత్రలో వివేక్ ఒబేరాయ్ నటించగా.. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. -
వడోదర పోటీలో వివేక్ ఒబెరాయ్..?
సాక్షి, వడోదర: ఒకవేళ తాను 2024లోపు తాను రాజకీయ ప్రవేశం చేస్తే, గుజరాత్‌లోని వడోదర స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతానని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నాడు. గత ఎన్నికల్లో ప్రధాని మోదీ వడోదర నుంచి లోక్‌సభ బరిలో ఉన్నప్పుడు.. ఇక్కడి ప్రజలు చూపింపన ప్రేమ, వాత్సల్యాలు తనను చాలా ఆకట్టుకున్నాయని ఆయన ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మకథ ఆధారంగా తీస్తున్న పీఎం నరేంద్రమోదీ సినిమా ప్రమోషన్లో భాగంగా వడోదరలోని పారుల్ విశ్వవిద్యాలయాన్ని వివేక్ ఒబెరాయ్ సందర్శించారు. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శనివారం కొట్టేసిన సంగతి తెలిసిందే. ప్రజలను ఏమార్చడానికి, మభ్యపెట్టడానికి, ఆకట్టుకోవడానికే ఈ బయోపిక్‌ను తెరకెక్కించారని కాంగ్రెస్ నేత వేసిన పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ‘పీఎం నరేంద్ర మోదీ చిత్రం చేసే ముందు మోదీ బాడీ లాంగ్వేజ్‌ను చాలా రోజులు గమనించాను. మోదీ లుక్ ఖరారుకు 16 రోజల సమయం తీసుకున్నాం. ఇది అందరిలో స్ఫూర్తినింపే సినిమా. ఎవరి అండదండలు లేకుండా దేశ ప్రధానిగా, ప్రపంచంలోని ముఖ్య నేత స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తి అపురూప గాథను ఈ సినిమాలో చూడొచ్చ’ని వివకేక్ ఒబెరాయ్ అన్నారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, ప్రశాంత్ నారాయణ్, బర్ఖా బిష్త్, రాజేంద్ర గుప్తా, జరీనా వాహబ్ ప్రధాన పాత్రలు పోషించారు. -
బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా నటుడు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్‌ని గుజరాత్ రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించింది. బీజేపీ విడుదల చేసిన క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు కూడా ఉండటం విశేషం. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింన విషయం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్లతో పాటు వివేక్ ఒబెరాయ్ పేరు కూడా చేర్చారు. మోదీ సొంత రాష్ట్రంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా బాలీవుడ్ నటుడిని పెట్టుకోవడాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. మోదీ బయోపిక్ ఈ సార్వత్రిక ఎన్నికల ముందు విడుదల చేస్తే ప్రజల మీద ప్రభావం పడుతుందని, ఎన్నికలు ముగిసే వరకు సినిమా విడుదల వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మోదీ బయోపిక్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుకుంటుందని సోమవారం (ఏప్రిల్ 1)న బాంబే హైకోర్టు తెలిపింది. మోదీ బయోపిక్ విడుదల వల్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు కాదని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని హైకోర్టు వెల్లడించింది. ఎన్నికల సంఘం అభిప్రాయంతో ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా విభేదించారు. మోదీ బయోపిక్ ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించడం లేదని చెప్పడం సరికాదని, ఈసీ పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఇప్పుడున్న ఎన్నికల సంఘం బలహీనమైనదిగా చరిత్రలో నిలుస్తుందని విమర్శిచారు. -
‘ఏం సాధించాడని ఆయన బయోపిక్ తీయాలి’
రాహుల్ గాంధీ ఏం సాధించాడని ఆయన గురించి బయోపిక్ తీయాలి అంటూ నటుడు వివేక్ ఒబేరాయ్ ప్రశ్నించారు. ప్రస్తుతం వివేక్ నరేంద్రమోదీ బయోపిక్‌లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడే విడుదల చేయకూడదంటూ ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దాంతో ఈసీ ఈ చిత్రాన్ని ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఓ ఇంగ్లీష్ చానెల్‌తో మాట్లాడారు వివేక్ ఒబేరాయ్. ఈ సందర్భంగా విలేకరి ‘రాహుల్ గాంధీ బయోపిక్‌లో నటిస్తారా’ అని వివేక్‌ను ప్రశ్నించారు. అందుకు ఆయన ‘రాహుల్ గాంధీ ఏం సాధించాడని ఆయన గురించి బయోపిక్ తీయాలి.. ఒకవేళ అలా తీయాల్సి వచ్చినా షూటింగ్ మొత్తం థాయ్లాండ్లోనే జరుగుతుంద’ని ఎద్దేవా చేశారు. ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఓ యువకుడు టీ అమ్మి చదువుకుంటూ దేశంలో అత్యున్నత స్థానాన్ని పొందారు. ప్రపంచం అంతా చూసే శక్తిగా ఎదిగారు. అమెరికా అధ్యక్షుడైనా.. జపాన్ ప్రధాని ఐనా వారి కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం కేవలం మోదీకి మాత్రమే ఉంది. అలాంటి గొప్ప వ్యక్తికి సంబంధించిన కథతో ఈ చిత్రాన్ని తెరకిక్కించాము. దీనిలో ఏ పార్టీకి ప్రతికూలంగా కానీ.. అనుకూలంగా కానీ మాట్లాడలేదు. కానీ సినిమా విడుదల చేస్తామంటే ప్రతిపక్షాలు భయపడుతున్నాయి’ అని పేర్కొన్నారు. ‘అంతేకాక రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్లో భావప్రకటనా స్వేచ్ఛ కూడా ఉంది. ఎలాంటి అంశాల గురించి సినిమా తీయాలి.. ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయం గురించి ఎవరూ నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రంజాన్, క్రిస్టమస్ పండుగ సందర్భంగా సినిమాలు రిలీజ్ చేస్తే అప్పుడే ఎందుకు రిలీజ్ చేస్తున్నారని ఎవరైనా వారిని ప్రశ్నిస్తున్నారా’ అని మండిపడ్డారు. దర్శకుడు ఒమంగ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ ప్రధానపాత్రలో నటిస్తుండగా.. బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, కిశోర్ షహానే, దర్శన్ కుమార్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. -
బాలీవుడ్ ‘నమో’ స్మరణ!
సినీ రంగంలో రాజకీయ నాయకుల జీవిత చిత్రాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇదే పరంపరలో ప్రధాని మోదీ బయోపిక్‌లు నిర్మితమయ్యాయి. ఎన్నికల వేళ మోదీ పట్ల బాలీవుడ్ ఇలా తన విధేయత చాటుతూ అనధికార ప్రచారం చేస్తోందని వినిపిస్తోంది. ఈ ఏడాది తొలినాళ్లలో మోదీతో బాలీవుడ్ ప్రముఖులు సమావేశమై జాతి నిర్మాణంలో సినిమాల పాత్రపై చర్చలు జరిపిన తరువాత బాలీవుడ్–మోదీ బంధం మరింత బలపడిందని భావిస్తున్నారు. ఆ మరసటి రోజే ‘ఉడీ: సర్జికల్ స్ట్రైక్స్’ అనే చిత్రం విడుదలైంది. ఇందులో రంజిత్ కపూర్ మోదీ పాత్రలో కనిపించారు. అదే రోజున మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఆత్మకథతో వచ్చిన ‘యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా కాంగ్రెస్‌కు, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికల క్రతువు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రధాని క్యాంపెయిన్‌కు మద్దతుగా నిలుస్తాయని భావిస్తున్న కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు.. పీఎం నరేంద్ర మోదీ వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ సినిమాలో సోలో హీరోగా నటించి 5 ఏళ్లు పూర్తయింది. అప్పటి నుంచి దక్షిణాది పరిశ్రమపై దృష్టిపెట్టి సహాయ లేదా విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రంతో మళ్లీ బాలీవుడ్లో కథానాయకుడిగా తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి బీజేపీ ఎంపీ అయిన ఆయన తండ్రే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి మోదీకి అభిమాని అయిన ఒబెరాయ్ 2014 ఎన్నికల సందర్భంగా ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలున్నాయి. మోదీ– ఏ జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ ‘నియంతలకు మతాలు లేవు. కనీసం మృతులనైనా హిందూ, ముస్లింలని వేరుచేయకండి’..మంటల్లో రైలు బోగి దగ్ధమవుతున్న(2002 నాటి గోద్రా అల్లర్లు ప్రస్తావిస్తూ) సమయంలో మోదీ పాత్రధారి ఆశిష్ శర్మ ట్రైలర్లో అన్న మాటలివి. ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో ఈరోస్ నౌలో ప్రసారం అయ్యే అవకాశాలున్నాయి. బాల్యంలో టీ విక్రేతగా పనిచేయడం, ఇందిరా గాంధీని వ్యతిరేకించడం, పాకిస్తాన్‌తో కయ్యానికి కాలు దువ్వడం లాంటి మోదీ గుణాలన్నింటిని చూపాలంటే ఈ సిరీస్‌ను కనీసం పది భాగాల పాటు కొనసాగించాలని నిర్మాతలు భావిస్తున్నారు. మోదీ కాకా కా గావ్ మోదీ మానసపుత్రికలైన స్వచ్ఛ్ భారత్ అభియాన్, డిజిటల్ ఇండియా, సర్జికల్ దాడులు, పెద్దనోట్ల రద్దు లాంటి వాటిని ఈ చిత్రంలో ప్రధానంగా ప్రస్తావించారు. 2017, డిసెంబర్ 8న గుజరాత్ ఎన్నికలకు ఒకరోజు ముందు విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేయడంతో అదే ఏడాది డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. – సాక్షి నేషనల్ డెస్క్ నమో సౌనె గామో గుజరాతీలో తీసిన ఈ చిత్రం 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదలైంది. గుజరాత్, ముంబైలలో ఒకరోజు ఆడిన తరువాత ఎన్నికల సంఘం చిత్ర ప్రదర్శనను నిలిపేసింది. నరేంద్ర మోదీకి సంబంధించి ఈ చిత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదని నిర్మాతలు వాదించినా సినిమా పేరు, హీరో పాత్ర తదితరాలు అసలు విషయమేంటో స్పష్టం చేశాయి. ఈ మార్చిలో సినిమాను తిరిగి విడుదల చేయాలనుకున్నా సాధ్యం కాలేదు. – సాక్షి నేషనల్ డెస్క్ – సాక్షి నేషనల్ డెస్క్ -
కమర్షియల్ ఎంటర్టైనర్లా మోదీ బయోపిక్
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ పీఎం నరేంద్ర మోదీ. ఈ సినిమాకు మేరీ కోమ్, సరబ్జిత్ లాంటి బయోపిక్ లను తెరకెక్కించిన ఒమాంగ్ కుమార్ దర్శకుడు. లెజెండ్ గ్లోబల్ స్టూడియో నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ బుధవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే కమర్షియల్ సినిమాకు ఏమాత్రం తగ్గని స్థాయిలో ఈ బయోపిక్ తెరకెక్కినట్టుగా అనిపిస్తోంది. మోదీ బాల్యంతో పాటు దేశ పర్యటన, ఆర్ఎస్ఎస్ లాంటి అంశాలతో పాటు గోద్రా అల్లర్లు, ప్రధానిగా తీసుకున్న నిర్ణయాలు లాంటి అంశాలను సినిమాలో ప్రధానంగా తెరకెక్కించారు. దాదాపు భారతీయ భాషలన్నింటిల రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో దర్శన్ కుమార్, బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహబ్, సేన్ గుప్తాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 27న లాంచనంగా ప్రారంభమైన మోదీ బయోపిక్ ఫిబ్రవరి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు 60 రోజుల్లోనే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 12న రిలీజ్ చేయాలని భావించారు. కానీ ముందే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తవుతుండటంతో ఏప్రిల్ 5నే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అదే రోజు రిలీజ్ కానుంది. -
ముందే వస్తున్న మోదీ బయోపిక్
ఎన్నికల సీజన్లో వెండితెర మీద కూడా గట్టి పోటి కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ఎన్నికల సమయంలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోదీ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మేరీ కోమ్, సరబ్జిత్ లాంటి బయోపిక్ లను తెరకెక్కించిన ఒమాంగ్ కుమార్ దర్శకుడు. లెజెండ్ గ్లోబల్ స్టూడియో నిర్మిస్తున్న ఈ సినిమాను రికార్డ్ సమయంలో పూర్తి చేశాడు దర్శకుడు. జనవరి 27న లాంచనంగా ప్రారంభమైన మోదీ బయోపిక్ ఫిబ్రవరి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు 60 రోజుల్లోనే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 12న రిలీజ్ చేయాలని భావించారు. కానీ ముందే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తవుతుండటంతో ఏప్రిల్ 5నే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అదే రోజు రిలీజ్ కానుంది. 2nd poster of my film #PMNarendraModi Releasing on 5th April 2019 @vivekoberoi @sandipssingh @sureshoberoi @anandpandit63 pic.twitter.com/bYhNBlphUT — Omung Kumar B (@OmungKumar) 19 March 2019 -
12న ‘పీఎం నరేంద్ర మోదీ’ రిలీజ్
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం కథాంశంగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించిన సినిమా ‘పీఎం నరేంద్ర మోదీ’ ఏప్రిల్ 12వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కానుంది. మేరీ కోమ్, సరబ్జిత్ వంటి వారి బయోపిక్‌లను రూపొందించిన ఒమంగ్ కుమార్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. జనవరిలో గుజరాత్లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో తుదిదశలో ఉంది. షూటింగ్లో ఎక్కువ భాగం ఉత్తరాఖండ్‌లోనే జరిగింది. కథా నాయకుడు దామోదర్‌దాస్ మోదీ గుజరాత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి, 2014 ఎన్నికల్లో చారిత్రక విజయం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం వరకు కథాంశంగా ఉంటుందని దర్శకుడు ఒమంగ్ కుమార్ వెల్లడించారు. ‘ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ప్రజలకు తెలియాల్సిన కథాంశం. విశ్వాసానికి సంబంధించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపుతుందని ఆశిస్తున్నాం. 103 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నందుకు ఆసక్తితో, ఆనందంతో ఉన్నాం’ అని చిత్ర నిర్మాత సందీప్ సింగ్ పేర్కొన్నారు. ఈ సినిమాలో నటులు దర్శన్ కుమార్, బొమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, జరినా వహబ్, బర్ఖా బిస్త్ సేన్‌గుప్తా తదితరులు ఉన్నారు. జాతీయ పతాకం నేపథ్యం, కాషాయ రంగు కుర్తా ధరించిన ఒబెరాయ్‌తో కూడిన ఈ సినిమా పోస్టర్ జనవరిలో 27 భాషల్లో విడుదలయింది. -
‘వినయ విధేయ రామ’ మూవీ రివ్యూ
టైటిల్ : వినయ విధేయ రామ జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : రామ్ చరణ్, కియారా అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : బోయపాటి శ్రీను నిర్మాత : డీవీవీ దానయ్య రంగస్థలం లాంటి ఘనవిజయం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. వరుస ప్రయోగాల తరువాత చరణ్ కమర్షియల్ ఎంటర్టైనర్తో వస్తుండటంతో అభిమానులు కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఇంతటి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన వినయ విధేయ రామ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? రామ్‌చరణ్ తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడా..? బోయపాటి మాస్ ఫార్ములా వర్క్ అవుట్ అయ్యిందా..? కథ : రామ (రామ్‌చరణ్)కు తన అన్నలంటే ప్రాణం. పెద్దవాడు భువన్ కుమార్(ప్రశాంత్) అంటే అందరికీ గౌరవం. తన వారి కోసం చదువును భవిష్యత్తును కాదనుకొని అన్నలను పెద్ద చదువులు చదివిస్తాడు రామ. భువన్ కుమార్ ఎలక్షన్ కమిషనర్‌గా వైజాగ్‌లో పనిచేస్తుండగా పందెం పరుశురాం (ముఖేష్ రుషి) అనే వ్యక్తితో గొడవ అవుతుంది. అన్నల జోలికి ఎవరు వచ్చిన సహించలేని రామ, పరుశురాంని అతడి అనుచరులను కొట్టి ఎలక్షన్లు సజావుగా జరిగేలా చూస్తాడు. అదే సమయంలో బీహార్‌లోని ఓ ప్రాంతాన్ని తను కనుసైగలతో శాసిస్తున్న వ్యక్తి రాజు భాయ్ మున్నా (వివేక్ ఒబెరాయ్). రాజు భాయ్ తన ప్రాంతంలో ఎలక్షన్లే లేకుండా తనకు నచ్చిన వారినే పదువుల్లో పెట్టుకుంటున్నాడని తెలిసి, భువన్ కుమార్‌ను అక్కడికి ఎలక్షన్ కమీషనర్‌గా పంపిస్తారు. తనకు ఎవరు ఎదురొచ్చినా అంతం చేసే రాజు భాయ్, భువన్ కుమార్‌ను ఏం చేశాడు.? అన్న కోసం రామ ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ధృవ, రంగస్థలం లాంటి ప్రయోగాల తరువాత పక్కా మాస్ కమర్షియల్ సినిమాలో నటించిన రామ్ చరణ్, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. చాలా సన్నివేశాల్లో చిరంజీవిని అనుకరించినట్టుగా అనిపించినా.. రామ పాత్రలో ఒదిగిపోయాడు. నటుడిగానూ మంచి పరిణతి కనిపించింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో చరణ్ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ కియారా అద్వానీ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. పాటలు అవసరమైనప్పుడు వచ్చిపోవటం తప్ప పెద్దగా నటనకు ఆస్కారం లేదు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ప్రశాంత్, సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. వదిన పాత్రలో స్నేహ హుందాగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన బాగుంది. విలన్‌గా వివేక్ ఒబెరాయ్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ఆర్యన్ రాజేష్, ముఖేష్ రుషి, హరీష్ ఉత్తమన్, రవి వర్మ, మధునందన్ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఎవరికీ రెండు మూడు డైలాగ్‌లకు మించి లేవు. విశ్లేషణ : రంగస్థలం లాంటి సూపర్ హిట్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావటంతో వినయ విధేయ రామపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటం లో చిత్రయూనిట్ పూర్తిగా విఫలమైంది. బోయపాటి సినిమా అంటే భారీ యాక్షన్ ఎపిసోడ్స్, హై ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే సినిమాలో యాక్షన్ కాస్త శ్రుతి మించినట్టుగా అనిపిస్తుంది. బోయపాటి గత చిత్రాలతో పోలిస్తే ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. తెర నిండా నటీనటులు ఉన్నా ఎవరినీ సరిగ్గా వినియోగించుకోలేదు. రామ్ చరణ్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో సినిమా చేసే ప్రయత్నంలో కథా కథనాలు పూర్తిగా గాడి తప్పాయి. హీరోను అంచనాలకు మించి చూపించే ప్రయత్నంలో ఏ మాత్రం నమ్మశక్యంగా లేని పోరాట సన్నివేశాలను డిజైన్ చేశారు. ఒక దశలో యాక్షన్ సీన్స్ మధ్యలో కథ వచ్చిపోతున్న భావన కలుగుతుంది. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. రిషీ పంజాబీ తన సినిమాటోగ్రఫితో సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. ఎలివేషన్ షాట్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రామ్ చరణ్ కొన్ని యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : మితిమీరిన హింస ఫోర్స్డ్ సీన్స్ సంగీతం దర్శకత్వం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘మోదీ మీ పాత్రలో సల్మాన్ ఐతే బాగుండేది’
ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్‌తోనే ఈ సినిమా వివాదాలను రేపుతోంది. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఒబేరాయ్ మోదీ పాత్రలో నటిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ పట్ల ఇప్పటికే పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. వివేక్ ఒబేరాయ్ మోదీ పాత్రను దారుణంగా ఖూనీ చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడు వీరి వరుసలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా చేరారు. ది యాక్సిడెంటల్ ప్రైమ్ పినిస్టర్ సినిమాను, మోదీ బయోపిక్‌ను కంపేర్ చేస్తూ అబ్దుల్లా కామెంట్ చేశారు. ‘మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ బాగానే సూట్ అయ్యారు.. కానీ మోదీ మీ పాత్ర కోసం వివేక్ అంతగా సెట్ అవ్వలేదు. వివేక్ బదులు మీరు సల్మాన్ ఖాన్ తీసుకుంటే మజా వచ్చేది’ అంటూ ట్వీట్ చేశారు. Life is unfair Dr Manmohan Singh got someone of the calibre of Anupam Kher. Poor Modi ji has to settle for Vivek Oberoi. Salman Khan hota toh kya maza aata. — Omar Abdullah (@OmarAbdullah) January 8, 2019 -
23 భాషల్లో ‘పీఎం నరేంద్ర మోదీ’ ఫస్ట్ లుక్
ప్రసుత్తం సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. పలు రంగాలకు చెందిన ప్రముఖల జీవితగాథల ఆధారంగా సినిమాలు రూపొందుతున్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల కాగా, మరి కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం విడుదల చేశారు. ‘దేశభక్తే నా శక్తి’ అనే క్యాప్షన్ ఈ చిత్రంపై ఆసక్తి కలిగించేలా ఉంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ దాదాపు 23 భాషల్లో రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో వివేక్ ఒబెరాయ్, మోదీ హావభావాలతో కనిపిస్తున్నారు. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో జాతీయ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది. సందీప్ ఎస్ సింగ్, సురేశ్ ఒబెరాయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బయోపిక్కు సంబంధించిన పూర్తి వివరాలు చిత్ర బృందం ప్రకటించాల్సి ఉంది. जय हिन्द. జై హింద్. ஜெய் ஹிந்த். Jai Hind 🇮🇳🙏 We humbly ask for your prayers and blessings on this incredible journey. #AkhandBharat #PMNarendraModi pic.twitter.com/t0lQVka7mJ — Vivek Anand Oberoi (@vivekoberoi) 7 January 2019 -
మోదీగా ఎవరు నటిస్తున్నారంటే..?
అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా బయోపిక్‌లకు అన్ని చోట్లా క్రేజ్నెలకొంది. సౌత్‌లో మహానటి సినిమాతో బయోపిక్‌లకు మంచి గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఝాన్సీ లక్ష్మీభాయి జీవితచరిత్రపై మణికర్ణిక రిలీజ్‌కు రెడీ అవ్వగా.. మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. చాయ్‌వాలా నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ జీవితాన్ని తెరపైకి తెచ్చేందుకు బాలీవుడ్ సిద్దమైంది. అయితే ఈ చిత్రానికి పీఎం:నరేంద్ర మోదీ అనే టైటిల్‌ను పెట్టే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. మోదీ పాత్రలో విలక్షణ నటుడు వివేక్ ఒబేరాయ్ నటించనున్నాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకటించాడు. సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. జనవరి 7న ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు.. జనవరిలోనే చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. IT’S OFFICIAL... Vivekanand Oberoi [Vivek Oberoi] to star in Narendra Modi biopic, titled #PMNarendraModi... Directed by Omung Kumar... Produced by Sandip Ssingh... First look poster will be launched on 7 Jan 2019... Filming starts mid-Jan 2019. — taran adarsh (@taran_adarsh) 4 January 2019 -
ప్రధానమంత్రిగా...
బాలీవుడ్లో బయోపిక్స్ గాలి బాగా వీస్తోంది. ఇప్పటికే అరడజను బయోపిక్‌లు సెట్స్‌పై ఉన్నాయి. తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోది బయోపిక్ బాలీవుడ్లో చర్చకు వచ్చింది. టైటిల్ రోల్లో బాలీవుడ్ నటుడు నటిస్తారని టాక్. బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోమ్ బయోపిక్‌ను తెరకెక్కించి, జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఒమంగ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని బీటౌన్ ఖబర్. ఆల్రెడీ గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో లొకేషన్స్‌ని అన్వేషిస్తున్నారట టీమ్. ఈ సంగతి ఇలా ఉంచితే... మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ బయోపిక్ రిలీజ్‌కు రెడీ అవుతున్న తరుణంలో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోది బయోపిక్ తెరపైకి రావడం విశేషం. ఇదిలా ఉంటే.. ‘రక్తచరిత్ర, వివేగమ్’ వంటి దక్షిణాది చిత్రాల్లో నటించిన వివేక్ ఒబెరాయ్ ‘వినయ విధేయ రామ’లో విలన్ పాత్ర చేశారు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
ఆన్ స్క్రీన్ వారియర్స్... ఆఫ్ స్క్రీన్ బ్రదర్స్
‘‘కెమెరా ఆన్ చేస్తే రామ్‌చరణ్, నేను వారియర్స్‌లా ఫైట్ చేసుకున్నాం. కెమెరా ఆఫ్ చేస్తే అన్నదమ్ములుగా కబుర్లు చెప్పుకున్నాం’’ అని అంటున్నారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదారాబాద్‌లో జరుగుతోందని సమాచారం. ‘‘ఈ సినిమాకు సంబంధించి నా లాస్ట్ డే (శనివారం) షూటింగ్లో పాల్గొన్నాను. నా తమ్ముడు రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నువ్వు(రామ్ చరణ్) చూపించిన ప్రేమాభిమానలకు థ్యాంక్స్. గొప్ప నటులు చిరంజీవిగారిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఆయన కొడుకు రామ్‌చరణ్‌లోనూ ఉన్నాయి’’ అని పేర్కొన్నారు వివేక్. స్నేహ,ఆర్యన్ రాజేశ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. -
చెర్రీకీ అన్నీ ఆయన లక్షణాలే..!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీపావళికి చెర్రీ ఫస్ట్‌లుక్‌ను, టైటిల్‌ను ప్రకటించబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో చెర్రీ యుద్ధం చేయబోయేది (విలన్) బాలీవుడ్ విలక్షణ నటుడు వివేక్ ఒబేరాయ్‌తో అన్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా వివేక్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తైయిన సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘కెమెరా ముందు యోధులం.. కెమెరా వెనక అన్నదమ్ములం.. ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించి ఇది నా చివరి రోజు.. ఇదొక ఎపిక్ ఎక్స్పీరియన్స్. ప్రతీ మూమెంట్‌ను ప్రేమించాను. నా బ్రదర్ రామ్‌చరణ్‌తో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు చూపించిన ప్రేమకు, ఇచ్చిన గౌరవానికి, ఆతిథ్యానికి ధన్యవాదాలు. లెజెండరీ అయిన మీ నాన్నకు ఉన్న గొప్ప లక్షణాలన్నీ నీకూ ఉన్నాయి’ అంటూ చెర్రీని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. Camera on “WARRIORS” camera off “BROTHERS”! Last day of shoot for the film, epic experience! Loved every moment. My brother #RamCharan you are a delight to work with. Thank you for the love, respect & hospitality. You have all the great qualities of your legendary father! #RC12 pic.twitter.com/PCHdRickWt — Vivek Anand Oberoi (@vivekoberoi) November 3, 2018 -
కేకో కేక...
రామ్‌చరణ్ అండ్ టీమ్ లొకేషన్లో కేక్ కట్ చేశారు. ఏంటీ? అప్పుడే షూటింగ్ పూర్తయ్యిందా? అని ఆశ్చర్యపోకండి. అందుకు టైమ్ ఉంది. నటి స్నేహ బర్త్‌డే సెలబ్రేషన్ కోసం సెట్లో కేక్ కట్ చేశారు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. స్నేహ, ఆర్యన్ రాజేశ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి ‘విజయ విధేయ రామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోందనీ, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. శుక్రవారంతో 37వ వసంతంలోకి అడుగుపెట్టారు స్నేహ. ఈ సందర్భంగా సెట్లోనే ఆమె బర్త్‌డే వేడుకలు జరిగాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ షెడ్యూల్ కంప్లీటైన తర్వాత వైజాగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. -
ఇక లవ్ గేమ్
అజర్ బైజాన్ లొకేషన్లో విలన్స్ భరతం పట్టారు హీరో రామ్‌చరణ్. ఈ సాలిడ్ ఫైట్ తర్వాత హీరోయిన్ కియారా అద్వానీతో లవ్ గేమ్ ఆడుతున్నారు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఓ సినిమా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమాలోని ఓ మేజర్ షెడ్యూల్ కోసం టీమ్ అజర్ బైజాన్ వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా కియారా అద్వానీ టీమ్‌కి తోడయ్యారు. ఈ షెడ్యూల్ బుధవారంతో పూర్తయిందని సమాచారం. కానీ, రామ్‌చరణ్ అండ్ కో ఇండియాకి తిరిగివచ్చేది మాత్రం అక్టోబర్ ఒకటో తేదీనే అట. ఇందులో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మాత్రం ఈ యాక్షన్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుని ముంబై చేరుకున్నారట. ఈ సినిమా ఫస్ట్ లుక్ దసరాకి రిలీజ్ అవుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల చేయాలనుకుంటున్నారు. -
స్పెషల్ గెస్ట్
అజర్ బైజాన్ వెళ్లారు చిరంజీవి. అదేంటీ ‘సైరా’ సినిమా కోసం ఆయన జార్జియాలో కదా ఉండాలి? అంటే అది నిజమే. కానీ చిరంజీవి ఇంకా జార్జియా సెట్లో జాయిన్ అవ్వలేదట. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. స్నేహ, ఆర్యన్ రాజేశ్, ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ అజర్బైజాన్లో జరుగుతోంది. ముఖ్యంగా రామ్‌చరణ్, వివేక్ ఒబెరాయ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌ను విజిట్ చేశారు చిరంజీవి. సినిమా ప్రోగ్రెస్ గురించి అడిగి తెలుసుకున్నారట. అంటే తనయుడి సినిమా లొకేషన్‌కు చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా వెళ్లారన్న మాట. దాదాపు 25 రోజుల పాటు అజర్ బైజాన్‌లో షూటింగ్ చేసి, యూనిట్ ఇండియా చేరుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. -
ఫుల్ ఫోకస్
గతేడాది అజిత్ హీరోగా నటించిన ‘వివేగమ్’ సినిమా ద్వారా విలన్‌గా కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. ఈ ఏడాది కన్నడ చిత్రం ‘రుస్తుం’ సినిమాతో శాండిల్‌వుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారాయన. ఇందులో శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ రవివర్మ ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. ‘‘రుస్తుం’ సినిమాతో వివేక్ ఒబెరాయ్ శాండిల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారని చెప్పడానికి ఆనందంగా ఉంది’’ అన్నారు రవివర్మ. అలాగే.. మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న ‘లూసీఫర్’ చిత్రంతో వివేక్ ఒబెరాయ్ మాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ‘రక్తచరిత్ర’ సినిమాతో ఆయన ఎప్పుడో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేశారు. ప్రస్తుతం తెలుగులో బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న సినిమాలో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇవన్నీ చూస్తుంటే.. వివేక్ సౌత్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు ఉంది కదూ. -
క్లైమాక్స్ స్టార్ట్
రౌడీలను చిత్తు చిత్తు చేయడానికి రామ్ చరణ్ రంగం సిద్ధం చేశారు. బ్యాడ్ బాయ్స్ బెండు తీయడానికి స్కెచ్‌లు రెడీ చేస్తున్నారు. ఈ సెటప్పంతా బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా క్లైమాక్స్ కోసం. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. స్నేహా, ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌ను ఈ నెల 10న స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఈ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్‌తో పాటు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా పాల్గొననున్నారట. ఈ షెడ్యూల్ తర్వాత ఫారిన్లో మరో షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారట దర్శకుడు బోయపాటి శ్రీను. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
యూరోప్ పోదాం చలో చలో
హైదరాబాద్‌లో విలన్స్ అందర్నీ చితకబాదిన తర్వాత హీరోయిన్‌తో ఓ డ్యూయెట్ పాడనున్నారట రామ్‌చరణ్. ఆ డ్యూయెట్ కూడా ఫారిన్లో పాడుకోనున్నారు. అందుకే హీరోయిన్‌తో కలసి యూరోప్ వెళ్లనున్నారని సమాచారమ్. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, ఆర్యన్ రాజేశ్, ప్రశాంత్, స్నేహా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించి హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంటర్వెల్ సీన్స్‌కు సంబంధించిన ఈ ఫైట్‌లో 200మంది ఫైటర్స్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌లో ఓ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట బోయపాటి శ్రీను. దానికి సంబంధించిన లొకేషన్స్ కూడా ఫిక్స్ చేశారట. ఈ షెడ్యూల్లో సాంగ్స్‌తో పాటు హీరో హీరోయిన్‌పై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించనున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. -
బ్యాంకాక్ టు హైదరాబాద్
బ్యాంకాక్ నుంచి తిరిగొచ్చిన రామ్‌చరణ్ కుటుంబం మరికొన్ని రోజులు సకుటుంబ సపరివార సమేతంగా హైదరాబాద్‌లో సందడి చేయనుంది. మరి హైదరాబాద్‌లో మకాం ఎన్ని రోజులంటే పది రోజులకుపైనే అట. ఏం చెప్తున్నామో అర్థం కావట్లేదా? రామ్ చరణ్ కొత్త చిత్రం షూటింగ్ విశేషాలండి. ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత స్టార్టింగ్ టు ఎండింగ్ యూనిట్‌ని ఫ్యామిలీయే అనుకుంటారు కదా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా డీవీవీ దానయ్య ఓ చిత్రం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. స్నేహా, ఆర్యన్ రాజేశ్, ప్రశాంత్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బ్యాంకాక్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన బృందం ఇప్పుడు హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. జూన్ 14 నుంచి స్టార్ట్ అయ్యే ఈ షెడ్యూల్లో ఫ్యామిలీ సీన్స్ షూట్ చేయనున్నారు. ఇందులో చరణ్, కియారాతో పాటు మిగతా తారాగణం పాల్గొననుంది. ఈ షెడ్యూల్ పదిహేను రోజులపాటు సాగనుంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. -
కొత్త ఇంట్లోకి...
మరో మూడు రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నారు రామ్‌చరణ్. గృహప్రవేశం తేదీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 21న కుటుంబ సభ్యులు, బంధువులందరితో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతారట. ‘రంగస్థలం’ సినిమా సూపర్ సక్సెస్‌తో రామ్‌చరణ్ కొత్త ఇంటికి మారిపోయారని అనుకుంటే పొరబాటే. ఈ గృహప్రవేశం రియల్‌గా కాదు... రీల్‌గా. విషయం ఏంటంటే.. బోయపాటి శ్రీను డైరెక్షన్లో చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో చరణ్ ఈ నెల 21 నుంచి పాల్గొంటారట. ఇప్పటివరకు ఇతర చిత్రబృందంతో సీన్స్ తెరకెక్కించారు. ఈ సినిమా సెట్లోకి చరణ్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడే. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఓ భారీ ఇంటి సెట్ రూపొందించారట. ఆ ఇంటి సెట్లో రామ్‌చరణ్‌తో పాటు ఇతర కీలక తారాగణంతో ముఖ్య సన్నివేశాలు తీయడానికి ప్లాన్ చేశారట. ‘రంగస్థలం’ సినిమాలో పల్లెటూరి కుర్రాడిలా కనిపించిన చరణ్ ఈ సినిమాలో ఫుల్ స్టైలిష్ మేకోవర్‌లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, స్నేహా, ఆర్యన్ రాజేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు బోయపాటి మార్క్ యాక్షన్‌తో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. -
చిట్టిబాబును తెగ పొగిడేశాడు
విడుదలై రెండు వారాలు గడుస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద రంగస్థలం కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూ వస్తోంది. ఈ చిత్ర సక్సెస్ మీట్ నేడు హైద్రాబాద్‌లో జరగనుండగా.. పవన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఇక ఈ చిత్రంలో చిట్టిబాబుగా చెర్రీ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. కెరీర్లోనే బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడంటూ పలువురు ప్రముఖులు ప్రశంసలు గుప్పించారు. తాజాగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్కు చెర్రీ నటనకు ఫిదా అయ్యాడు. వివేక్ తన ట్విటర్లో స్పందిస్తూ...‘ చిట్టిబాబు సౌండ్ ఇంజనీర్!!! రంగస్థలం చాలా పెద్ద సక్సెస్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. వాటే బ్రిలియంట్ ట్రాన్స్ఫర్మేషన్! నువ్వు సూపర్‌స్టార్, సూపర్ ఫెర్ఫార్మర్ల మెగా కాంబోవి! నిన్ను చూస్తే గర్వంగా ఉంది. గాడ్ బ్లెస్ యు. సూపర్ టాలెంటెడ్ టీమ్‌కు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే బోయపాటి, రామ్‌చరణ్ సినిమాలో ప్రతినాయకుడిగా వివేక్ ఒబేరాయ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. Chitti Babu sound engineer!!! So happy for my bro #RamCharan & the Massive Blockbuster success of #Rangasthalam!What a brilliant transformation! You are a ‘Mega’ combo of superstar & superperformer! God bless, proud of u man! Big congrats to the super talented team! Take a bow! pic.twitter.com/pVB5W4w05B — Vivek Anand Oberoi (@vivekoberoi) April 13, 2018 -
మార్చిలో షురూ
కొబ్బరికాయ కొట్టి ఒకే ఒక్క నెల అయింది. ఈలోపే ‘ఇన్కమ్’ స్టార్ట్ అయితే ఆనందమే ఆనందం. రామ్‌చరణ్–బోయపాటి శ్రీను–డీవీవీ దానయ్య అలాంటి ఆనందంలోనే ఉన్నారు. షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ‘రైట్స్’ రూపంలో ఫ్యాన్సీ ఆఫర్ వస్తే అది ఆ హీరో, డైరెక్టర్ స్టామినాని తెలియజేస్తుంది. చరణ్–బోయపాటి కాంబినేషన్లో దానయ్య నిర్మిస్తోన్న సినిమా ఇప్పటికి దాదాపు 47 కోట్లు రాబట్టిందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. రిలీజ్‌కి ముందే ఇన్ని కోట్లంటే నిర్మాతకు పండగే. ఇంతకీ 47 కోట్లు ఎలా రాబట్టిగలిగిందంటే... హిందీ శాటిలైట్, డబ్బింగ్ రైట్స్, తెలుగు శాటిలైట్ రైట్స్ ద్వారా ఇంత మొత్తం వచ్చిందని భోగట్టా. చిత్రీకరణ ప్రారంభించిన కొన్ని రోజులకే ఇంత పెద్ద బిజినెస్ జరగటంతో చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. శుక్రవారంతో రెండో షెడ్యూల్ ముగిసింది. హైదరాబాద్ పరిసరాల్లో ఈ భారీ షెడ్యూల్ జరిగింది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. సినిమాలో ఎంతో Mీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్‌లు హీరో రామ్‌చరణ్‌కు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సన్నివేశాల్లో హీరో పాల్గొనలేదు. నెక్ట్స్ మంత్ 8న ప్రార ంభమయ్యే మూడో షెడ్యూల్లో రామ్‌చరణ్ పాల్గొంటారని చిత్రబృందం తెలియజేసింది. -
చరణ్ సినిమాకు భారీ డీల్
రంగస్థలం షూటింగ్ దాదాపుగా పూర్తి కావటంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు చెర్రీ. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇంతవరకు రామ్ చరణ్ షూటింగ్ కూడా హాజరు కాకముందే ఈ సినిమా బిజినెస్ మొదలైపోయిందట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను ఓ ప్రముఖ సంస్థ 22 కోట్ల మొత్తానికి సొంతం చేసుకుంది. జంజీర్ సినిమాతో చరణ్ బాలీవుడ్‌కు సుపరిచితుడు కావటంతో పాటు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తుండటంతో ఇంత ధర పలికిందని భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం చెర్రీ సరికొత్త లుక్ ట్రై చేస్తున్నాడట. -
ఇక్కడ స్టెప్ అవుట్.. అక్కడ స్టెప్ ఇన్
స్టెప్ అవుట్ అయితే స్టెప్ ఇన్ అవ్వాలి. అవును... ‘రంగస్థలం’ నుంచి స్టెప్ అవుట్ అయ్యి కొత్త సినిమాలోకి స్టెప్ ఇన్ అవ్వబోతున్నారు రామ్‌చరణ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ సినిమా అంగీకరించిన విషయం తెలిసిందే. త్వరలో ‘రంగస్థలం’ పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం స్టెప్పులేస్తున్నారు చరణ్. ఓ పాట చిత్రీకరణ జరగుతోంది. ఆ తర్వాత బోయపాటి సినిమాతో బిజీ అయిపోతారు. మరి.. బోయపాటి సినిమా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది కదా అంటే... ఫస్ట్ షెడ్యూల్లో నటి స్నేహ మరియు ఇతర తారాగణం పై కొన్ని సీన్లను చిత్రీకరించారు. ఇవి ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్. పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. ఫిబ్రవరి మూడో వారంలో తర్వాతి షెడ్యూల్ స్టార్ట్ చేస్తారట. ఆ షెడ్యూల్‌తో షూటింగ్‌లోకి స్టెప్ ఇన్ అవుతారు రామ్‌చరణ్. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఆ షెడ్యూల్లో పాల్గొంటారు. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా కొత్తగా ఉండబోతోందని, ఎక్కువ శాతం షూటింగ్ రాజస్థాన్‌లో జరగనుందని సమాచారం. కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
రాజస్థాన్‌లో చరణ్, బోయపాటి
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తరువాత మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ధృవ, రంగస్థలం లాంటి ప్రయోగాల తరువాత చరణ్ ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ రాజస్థాన్‌లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని కోటల్లో షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 70 శాతం షూటింగ్ అక్కడే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో నటించే అవకాశం ఉంది. -
నెక్ట్స్ టార్గెట్!
ఆల్ సెట్ అయితే హీరో రామ్‌చరణ్ నెక్ట్స్ టార్గెట్ చేసే విలన్ నేమ్ ప్రతాప్ రవినే అని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఎవరీ ప్రతాప్ రవి? అంటే... రక్తచరిత్రను బయటికి తీయాల్సిందే. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పేస్తాం. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్తచరిత్ర’ సినిమాలో ప్రతాప్ రవి క్యారెక్టర్‌ను బీ టౌన్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు అజిత్ హీరోగా చేసిన తమిళ చిత్రం ‘వివేగం’ లో వివేక్ ఒబెరాయ్‌నే విలన్. మళ్లీ తెలుగు తెరపై వివేక్ కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వివేక్‌ను ప్రతినాయకుడి పాత్రకు సెలక్ట్ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోందని ఫిల్మ్‌నగర్ టాక్. అంతే కాదండోయ్.. ఓ కీలక పాత్రకు శివగామిని.. అదేనండి.. రమ్యకృష్ణను సంప్రదించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
వివేకంతో అభిమానులు ఖుషీ
తమిళసినిమా: అజిత్ అభిమానులు ఎంతగానో ఎదరుచూసిన వివేకం చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ఇది అజిత్ 57వ చిత్రం మాత్రమే కాదు, ఆయనకు నటుడిగా 25వ వసంతంలోకి అడుగుపెట్టిన చిత్రం కూడా కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. కాజల్‌అగర్వాల్ కథానాయకిగా నటుడు కమలహాసన్ రెండవ కూతురు అక్షరహాసన్ కీలక పాత్రలోనూ నటించిన ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఓబరాయ్ ప్రతినాయకుడిగా నటించారు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. అనిరుధ్ సంగీత బాణీలు లందించారు.అజిత్ ఇంటర్‌పోల్ అధికారిగా నటించిన ఈ చిత్రం హై స్టాండర్డ్‌లో రూపొందింది. చిత్ర ఆధ్యంతం ఉత్కంఠభరితంగా శరవేగంగా సాగుతుంది. మన దేశాన్ని అను ఆయుధాల ద్వారా భూకంపాలు వచ్చేలా చీకటి అరాచక శక్తుల కుట్రను కథానాయకుడు అజిత్ ఎలా ఛేదించారన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం వివేకం. ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు అజిత్ సహా చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. చిత్రం హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉందంటూ ప్రశంసిస్తున్నారు. కమలహాసన్ అభినందనలు నటుడు కమలహాసన్ తన కూతురు అక్షరహాసన్‌తో కలిసి గురువారం వివేకం చిత్రాన్ని చూశారు. చిత్రం ప్రదర్శన సమయంలోనే ఆయన తాను తన కూతురు అక్షరతో కలిసి వివేకం చిత్రం చూస్తున్నాను. చిత్రం గురించి మంచి రిపోర్ట్ వస్తోంది. అజిత్ సహా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. అభిమానుల హంగామా ఇక అజిత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వివేకం చిత్రాన్ని గురువారం వేకువజాము నుంచే చాలా థియేటర్లలో ప్రదర్శించారు. అభిమానులు అజిత్ ఫొటోలతో కూడిన భారీ కటౌట్లను థియేటర్ల ముందు ఏర్పాటు చేయడంతో పాటు ఆ కటౌట్లకు పాలాభిషేకాలు, ఆలయాల్లో పూజలు అంటూ హంగామా సృష్టించారు. -
'వివేకం' మూవీ రివ్యూ
టైటిల్ : వివేకం జానర్ : స్పై థ్రిల్లర్ తారాగణం : అజిత్ కుమార్, వివేక్ ఒబరాయ్, కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ సంగీతం : అనిరుధ్ దర్శకత్వం : శివ నిర్మాత : సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ వివేకం. వీరం, వేదలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందించిన అజిత్, శివ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో తమిళ నాట ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో తెలుగు నాట కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది.? చాలా కాలంగా తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టిన అజిత్ అనుకున్నది సాధించాడా.? దరువు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన శివ, వివేకంతో మెప్పించాడా..? కథ : అజయ్ కుమార్ (అజిత్ కుమార్) కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పని చేస్తుంటాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి 279 మిషన్ లను సమర్థవంతంగా పూర్తి చేసిన అజయ్, 280వ మిషన్ లో ఉండగా అదృశ్యమవుతాడు. కొంత కాలం తరువాత భారీ వినాశనానికి ప్రయత్నించిన ఓ అంతర్జాతీయ మూఠా ను మట్టుబెట్టిన సమయంలో అజయ్ ఉనికి వెలుగులోకి వస్తుంది. దీంతో ఎలర్ట్ అయిన కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం అజయ్ కోసం వెతకటం ప్రారంభిస్తుంది. అందుకోసం అజయ్ స్నేహితుల సాయం తీసుకుంటుంది. తన భార్యతో కలిసి ఓ హోటల్ నడుపుతున్న ప్రశాంతంగా జీవిస్తున్న అజయ్.. సీక్రెట్ గా తన మిషన్ ను కొనసాగిస్తుంటాడు. ప్రపంచ వ్యాప్తంగా కృతిమ భూకంపాలను సృష్టించి భారీ ప్రాణ ఆస్తి నష్టాలను సృష్టించేందుకు అంతర్జాతీయ తీవ్రవాదులు ప్లాన్ చేస్తారు. అందుకోసం ప్లుటోనియం ఆయుధాలను శాటిలైట్ సాయంతో పేల్చేసేందుకు ప్లాన్ చేస్తారు. ఈ ఆయుదాలను పేల్చాలనుకుంటుంది ఎవరు..? ఆ ప్రయత్నాలను అజయ్ కుమార్ ఎలా అడ్డుకున్నాడు..? అసలు అజయ్ రహస్య జీవితం ఎందుకు గడుపుతున్నాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాలో నటించిన అజిత్, సినిమా అంతా తన భుజాల మీదే మోశాడు. యాక్షన్, ఎమోషన్, స్టైల్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ను సమపాళ్లలో అందించి అభిమానులను అలరించాడు. యాక్షన్ సీక్వన్స్ లలో అజిత్ పడిన కష్టం ప్రతీ ఫ్రేమ్ లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. హీరోయిన్ గా కాజల్ ఆకట్టుకుంది. గ్లామర్ షోకు ఏ మాత్రం చాన్స్ లేని హుందా పాత్రలో తనదైన నటనతో అలరించింది. కీలక పాత్రలో కనిపించిన అక్షర హాసన్, తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా.. గుర్తుండిపోయే పాత్రలో తనని తానూ ప్రూవ్ చేసుకుంది. విలన్ గా వివేక్ ఒబరాయ్ మరోసారి ఆకట్టుకున్నాడు. చాలా సందర్భాల్లో క్రిష్ 3 సినిమాలోని వివేక్ నటన గుర్తుకు వస్తుంది. మిగిలిన పాత్రలేవి చెప్పుకొదగ్గ స్థాయిలో తెర మీద కనిపించవు. సాంకేతిక నిపుణులు : ఓ అంతర్జాతీయ స్థాయి కథను తమిళ సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం చేసిన దర్శకుడు శివ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. సినిమా అంతా హాలీవుడ్ స్థాయిలో రూపొందించే ప్రయత్నం చేసిన శివ సక్సెస్ అయినా... లోకల్ ఆడియన్స్ ను మెప్పించటంలో తడబడ్డాడు. అజిత్ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ మసాలా ఎలిమెంట్స్ ఏవీ సినిమాలో లేకపోవటం నిరాశపరుస్తుంది. పూర్తిగా హాలీవుడ్ తరహా కథ కథానాలతో సాగటంతో యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి నచ్చినా.. సాధారణ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందన్నది అనుమానమే. ఏ మాత్రం లాజిక్ లేకుండా సాగిన కథా కథనాలు కూడా కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచింది. ముఖ్యంగా చేజింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ లో అనిరుథ్ మ్యూజిక్ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. వెట్రీ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. సత్య జ్యోతి ఫిలింస్ నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయి సినిమాను దక్షిణాది ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చాయి. ప్లస్ పాయింట్స్ : అజిత్ నటన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్రాండ్ విజువల్స్ యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : లాజిక్ లేని సీన్స్ పాటలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
చెప్పింది కొండంత... చేసింది గోరంత
కనగానపల్లి: దత్తత గ్రామాల అభివృద్ధి పూర్తిగా పడకేసింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ దత్తతకు తీసుకున్న కనగానపల్లి మండలంలోని ముత్తువకుంట్ల ఇందుకు అద్దం పడుతోంది. ఆ గ్రామ ప్రజలకు అతను ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా నెరవేర్చకపోవడం గమనార్హం. రెండున్నర సంవత్సరాల క్రితం (2015, జనవరి 24న) రామగిరి మండలం వెంకటాపురం గ్రామానికి వచ్చిన వివేక్ ఒబేరాయ్‌ను ముత్తువకుంట్ల వాసులకు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత పరిచయం చేశారు. ఈ సందర్భంగా అతను ముత్తువకుంట్ల గ్రామాన్ని దత్తతకు తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. చెత్త బుట్టలు ఇచ్చి... 2016, జనవరి 12న ముత్తువకుంట్లకు వచ్చిన ఒబేరాయ్.. సంక్రాంతి సంబరాలలో పాల్గొని, తాను ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రామ వీధుల్లో ఎల్ఈడీ బల్బులు వేయించారు. పారిశుద్ధ్యం నిర్వహణలో భాగంగా మహిళలకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముత్తవకుంట్లను దేశవ్యాప్తంగా మరే గ్రామం అభివృద్ధి చెందనంత గొప్పగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఆ తర్వాతి రోజు వెళ్లిపోయిన అతను నేటికీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు కదా.. కనీసం గ్రామాభివృద్ధిని కూడా పట్టించుకోలేదు. దీనిపై స్థానికుల్లో అసహనం వ్యక్తమవుతోంది. గ్రామంలోని దళిత వాడలో కనీస మౌలిక వసతులు లేవు. సీసీ రోడ్లు, తాగునీరు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధి చేసింది ఏమీ లేదు హీరో వివేక్ ఒబేరాయ్ ఇక్కడికి వచ్చినపుడు మా గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాయని చెప్పాడు. కాని అతను పెద్దగా చేసింది ఏమీ లేదు. అతను వేసి పోయిన వీధి లైట్లు కూడా ఇప్పుడు పడడం లేదు. హీరో దత్తత తీసుకున్నాడంటూ ప్రజాప్రతినిధులు కూడా మా గ్రామాభివృద్ధిని పట్టించుకోవడం లేదు. మా కాలనీలో కనీస మౌలిక వసతులు కూడా లేక జీవిస్తున్నాం. - అనిల్, ముత్తువకుంట్ల గ్రామం, కనగానపల్లి మండలం -
అజిత్ అభిమానులకు షాకింగ్ న్యూస్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అభిమానులకు చేదువార్త. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వివేగం' మూవీలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అజిత్ గాయపడ్డారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంలో కాజల్ అగర్వాల్ తొలిసారిగా అజిత్‌తో జత కట్టింది. అజిత్ ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. యూరప్‌లో వివేగం మూవీ షూటింగ్ వేగంగా జరగుతుంది. ఈ క్రమంలో ఎలాంటి డూప్ లేకుండా ఓ భారీ యాక్షన్ సన్నివేషాన్ని చిత్రీకరిస్తుండగా అజిత్ అమాంతం కొంత ఎత్తు నుంచి కింద పడ్డారు. ఈ క్రమంలో ఆయన భుజానికి గాయాలైనట్లు సమాచారం. అజిత్‌కు వెంటనే ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయాల తీవ్రతపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే మూవీ యూనిట్ మాత్రం అజిత్ గాయాలకు సంబంధించి అధికారికంగా విషయాన్ని వెల్లడించలేదు. అజిత్ ను యాక్షన్ సీన్లలో చూడాలని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. అజిత్ గాయం తీవ్రత ఎక్కువైతే కొన్ని రోజులపాటు షూటింగ్ నిలిపివేయనున్నారు. -
‘అమరులకు’ వివేక్ సాయం
న్యూఢిల్లీ: ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది జవాన్ల కుటుంబాలకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అండగా నిలిచారు. మహారాష్ట్రలో థానే సమీపంలోని తన కర్మ్ రెసిడెన్సీ, కర్మ్ పంచతత్వా వెంచర్లలో 25 ఫ్లాట్లను అమరుల కుటుంబాలకు అందిస్తానని చెప్పారు. ఇప్పటికే నాలుగు ఫ్లాట్లను అందించామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జాబితా అందిన వెంటనే మిగతావి కేటాయిస్తామన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి విరాళాల కోసం కేంద్ర హోంశాఖ ఇటీవల www. bharatkeveer. gov. in వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. -
25 ఫ్లాట్లు దానం చేయనున్న హీరో
థానె: అమరవీరుల కుటుంబాలకు తన వంతు సాయం చేసేందుకు బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ముందుకు వచ్చాడు. మహారాష్ట్రలోని థానెలో సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్(సీఆర్ఫీఎఫ్) అమర సైనికుల కుటుంబాలకు 25 ఫ్లాట్లు దానం చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు సీఆర్ఫీఎఫ్కు లేఖ రాశాడు. వివిధ ఘటనల్లో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సీఆర్ఫీఎఫ్ అమరవీరుల కుటుంబాలకు తన కంపెనీ కరమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ తరపున 25 ఫ్లాట్లు నిర్మించి ఇవాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఇప్పటికే నాలుగు ఫ్లాట్లు ఇచ్చినట్టు సమాచారం. ఎంపిక చేసిన కుటుంబాల పేర్లతో జాబితాను కరమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన 12 మంది సీఆర్ఫీఎఫ్ సైనికుల కుటుంబాలకు హీరో అక్షయ్‌కుమార్ ఇంతకుముందు రూ. 1.08 కోట్ల విరాళం ప్రకటించాడు. -
హాలీవుడ్ రేంజ్లో అజిత్ 'వివేగం' టీజర్
-
హాలీవుడ్ రేంజ్లో అజిత్ 'వివేగం' టీజర్
కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వివేగం టీజర్ వచ్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఫారిన్ లోకేషన్లలో భారీ యాక్షన్స్ సీన్స్‌తో రూపొందించిన టీజర్ అభిమానులను అలరిస్తోంది. అజిత్ ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంలో కాజల్ అగర్వాల్ తొలిసారిగా అజిత్‌తో జత కట్టింది. అక్షర హాసర్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ టీజర్ రిలీజ్ అయిన పది గంటల్లోనే రెండు మిలియన్ల వ్యూస్ సాధించిన రికార్డ్ సృష్టించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సెన్సేషన్ సృష్టించిన వివేగం, టీజర్ తోనూ అదే హవా చూపిస్తోంది. ఆగస్ట్‌లో వివేగం మూవీ రిలీజ్ కి యూనిట్ ప్లాన్ చేస్తుంది. -
15ఏళ్ల తర్వాత లోకల్ రైలులో హీరో
ముంబయి: దాదాపు పదిహేనేళ్ల తర్వాత బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ లోకల్ రైలులో ప్రయాణించారు. తన కలల ప్రాజెక్టు అయిన కర్మ్ బ్రహ్మాండ్ హౌజింగ్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆయన లోకల్ రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన అమితానందాన్ని వ్యక్తం చేశారు. సాధారణ పౌరులకు అతి తక్కువ ధరకే ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ముంబయిలోని బీచ్ పక్కనే దాదాపు ఐదు వేల నివాసాల బృహత్తర ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను వెళుతున్నానని, ఇది తన జీవిత కల అని తెలిపారు. కెల్వ్ రోడ్డులోని లోకల్ రైలులో సెకండ్ క్లాస్‌లో వివేక్ ఒబెరాయ్ మీడియా ప్రతినిధులతో సహా వెళ్లారు. ఆయన 2002లో సాతియా అనే చిత్రం షూటింగ్ సమయంలో చివరిసారిగా లోకల్ రైలు ఎక్కారంట. ‘ఎంతో మంది పేదవారు, సామాన్యులు అసురక్షితమైన జీవితాన్ని కఠిన పరిస్థితుల మధ్య బతికేస్తున్నారు. కెల్వ్ రోడ్డు మాదిరిగానే షాపూర్ కూడా మారిపోయింది. 2018 నుంచి దాదాపు 14,000 వేల కుటుంబాలు నాణ్యమైన జీవితాన్ని ప్రారంభిస్తారు’ అని వివేక్ చెప్పారు. -
ప్రభాస్‌తో తలపడనున్న బాలీవుడ్ స్టార్స్..?
దాదాపు నాలుగేళ్లుగా బాహుబలికే అంకితమైపోయిన ప్రభాస్, ఇటీవలే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడు. రెండో భాగం చిత్రీకరణ కూడా పూర్తి కావటంతో బాహుబలి గెటప్‌కు గుడ్ బై చెప్పేసిన ప్రభాస్, తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ప్రభాస్‌తో సినిమా చేయడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించేందుకు ఓకె చెప్పాడు. యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. బాహుబలి సినిమాతో ప్రభాస్‌కు వచ్చిన ఇమేజ్ను కంటిన్యూ చేసే స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది. అందుకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు అన్ని భాషల్లో హైప్ క్రియేట్ అయ్యే విధంగా కాస్టింగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ మీద దృష్టి పెట్టిన నిర్మాతలు ప్రభాస్‌కు ప్రతినాయకులుగా బాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దించుతున్నారు. ప్రస్తుతం అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వివేగంలో విలన్‌గా నటిస్తున్న వివేక్ ఒబరాయ్తో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌లు ప్రభాస్ సినిమాలోనటిస్తున్నారు. విలన్లతో పాటు హీరోయిన్ను బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకునే ఆలోచనలో ఉంది యువి క్రియేషన్స్. ఇప్పటికే బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నట్టుగా ప్రకటించారు. పేరుకు సౌత్ సినిమానే అయినా.. ప్రభాస్ కొత్త సినిమాను పూర్తి బాలీవుడ్ ప్రాజెక్ట్‌గా రూపొందించే పనిలో ఉన్నారు మేకర్స్. మరి బాహుబలి హవాను ప్రభాస్ కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. -
75 కోట్లతో... 12 దేశాల్లో...
కోలీవుడ్‌లో ఫుల్ ఫాంలో ఉన్న స్టార్ హీరో అజిత్. అభిమానులు తలా అని ప్రేమగా పిలుచుకునే అజిత్.. ఏ మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లకుండా వరుసగా మాస్ మసాలా ఎంటర్టైనర్లతో అలరిస్తున్నాడు. అజిత్ తాజా చిత్రం వేదలం కూడా వంద కోట్ల కలెక్షన్లు సాధించి అజిత్ మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. వీరం, వేదలం లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన అజిత్, శివల కాంబినేషన్లో ప్రస్తుతం మరో సినిమా రూపొందుతోంది. ఈ కాంబినేషన్‌పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అజిత్ సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్న ఈ సినిమాను 12 దేశాల్లో షూట్ చేస్తున్నారు. ఇప్పటికే బల్గేరియాతో పాటు యూరప్ లోని మరికొన్ని దేశాల్లో షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలోనూ ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలో మరికొన్ని దేశాల్లో షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టిజీ త్యాగరాజన్ నిర్మాత. అజిత్ సరసన కాజల్ అగర్వాల్‌తో పాటు అక్షర హాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. -
అజిత్‌కు విలన్‌గా వివేక్ ఒబెరాయ్
హిందీ ప్రముఖ కథానాయకులు కోలీవుడ్‌లో ప్రతినాయకులుగా మారడానికి ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్‌కుమార్ 2.ఓ చిత్రంలో సూపర్‌స్టార్‌కు విలన్‌గా మారితే తాజాగా అజిత్‌కు స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా మారనున్నారు. అజిత్ నటిస్తున్న తాజా చిత్రంలో ఆయన విలన్‌గా నటించడానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. వీరం, వేదాళం తరువాత అజిత్ దర్శకుడు శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఇందులో నటి కాజల్‌అగర్వాల్ నాయకీగానూ, కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ ముఖ్య పాత్రలోనూ నటిస్తున్నారు. వెట్రి చాయాగ్రహణం, అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే బల్గేరి, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇందులో విలన్ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ ప్రముఖ నటులను సంప్రదించినట్లు తెలిసింది. వారిలో అభిషేక్‌బచ్చన్, ఇర్ఫాన్ ఖాన్ పేర్లు కూడా చోటు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే చివరికి చిత్ర వర్గాలు నటుడు వివేక్ ఒబెరాయ్‌ను అజిత్‌కు విలన్‌గా ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. వివేక్ ఒబెరాయ్‌కు ఇంతకు ముందు హిందీలోనే కాకుండా తెలుగులోనూ హీరోగా నటించిన అనుభవం ఉంది. అయితే తమిళంలో మాత్రం అజిత్‌కు విలన్‌గానే పరిచయం కానున్నారు. అయితే ఆయన తమిళనాట సునామీ వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలను ఆదుకోవడానికి తన వంతు సేవాకార్యక్రమాలు చేశారన్నది గమనార్హం. -
మెగాస్టార్ సినిమా కాదని.. తమిళ్లో చేస్తున్నాడు
బాలీవుడ్ యాక్టర్స్‌కు హీరో, విలన్ అన్న తేడా ఉండదు. కథలో తమ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే చాలు ఏ పాత్రకైనా రెడీ అయిపోతారు. అందుకే అమితాబ్, షారూఖ్, ఆమిర్ లాంటి టాప్ స్టార్లు కూడా నెగెటివ్ రోల్స్‌లో అలరించారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా రోబో సినిమా సీక్వల్ కోసం విలన్‌గా మారిపోయారు. అదే బాటలో మరో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్, హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన క్రిష్ 3 సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్నాడు. దీంతో తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లో విలన్‌గా వివేక్‌ను నటించాల్సిందిగా కోరారు. కానీ అప్పట్లో చిరుకు విలన్‌గా చేసేందుకు నో చెప్పిన వివేక్ ఇప్పుడు అజిత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో విలన్‌గా నటించేందుకు అంగకీరించాడట. ఇప్పటికే అజిత్ హీరోగా వరుస సూపర్ హిట్స్ అందించిన శివ మరోసారి తలాతో కలిసి మ్యాజిక్ రిపీట్చేయాలని భావిస్తున్నాడు. ఈ కాంబినేషన్‌పై ఉన్న నమ్మకంతో పాటు జేమ్స్‌బాండ్ తరహా సినిమా కావటంతో విలన్ పాత్ర స్టైలిష్‌గా ఉండబోతోందని వివేక్ ఈ ఆఫర్‌ను ఓకె చేశాడన్న టాక్ వినిపిస్తోంది. -
5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న హీరో
న్యూఢిల్లీ: 2022 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ను స్ఫూర్తిగా తీసుకుని బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ అల్పాదాయం గలవారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఈ ఏడాది చివరికి 5 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పాడు. మిషన్ 360 పేరుతో మహారాష్ట్ర వ్యాప్తంగా 360 ప్రాంతాల్లో ప్రాజెక్టు చేపట్టామని వివేక్ తెలిపాడు. తక్కువ ఆదాయం గల ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని భావిస్తున్నామని చెప్పాడు. లాభాలను ఆశించకుండా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇంటి ధరను 7,90,000 రూపాయలుగా నిర్ణయించామని తెలిపాడు. ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పాడు. కాగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి భూమి తీసుకోలేదని ప్రైవేట్‌గా సేకరించామని తెలిపాడు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని, ప్రస్తుతానికి మహారాష్ట్రలో ప్రాజెక్టు పూర్తిచేయడమే తమ లక్ష్యమని చెప్పాడు. -
'కపిల్ మంచోడు.. క్రిమినల్ కాదు'
కమెడియన్ కపిల్ శర్మకు నటుడు వివేక్ ఒబెరాయ్ మద్దతు పలికాడు. బీఎంసీలో అవినీతి జరుగుతోందంటూ ప్రధానమంత్రిని ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేసినప్పటినుంచి కపిల్‌ను కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అయితే.. కపిల్ క్రిమినల్ కాదని, అతడు మంచి మనిషని వివేక్ ఒబెరాయ్ చెబుతున్నాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసేందుకు సాయం చేయాల్సిందిగా వివేక్ ఒబెరాయ్‌ని కపిల్ శర్మ కోరినట్లు తెలుస్తోంది. తాను గత ఐదేళ్లుగా ఏడాదికి రూ. 15 కోట్ల ఆదాయపన్ను కడుతున్నానని, అయినా తనను 5 లక్షల లంచం అడిగారని కపిల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకుడు జీవరాజ్ ఆల్వా కుమార్తెను పెళ్లి చేసుకున్న కపిల్.. ఇప్పుడు సమస్య నుంచి బయటపడేందుకు అవసరమైతే మామగారి వైపు నుంచి రాజకీయ పరిచయాలను కూడా వాడుకోవాలని చూస్తున్నాడు. ఎవరికైనా సమస్యలు తీర్చగలిగే పరిస్థితిలో మనం ఉంటే ఆమాత్రం సాయం చేయాలని ఈ సందర్భంగా వివేక్ ఒబెరాయ్ తెలిపాడు. కేన్సర్‌తో బాధపడుతున్న పిల్లల కోసం తాను నిధులు సేకరిస్తుంటానని, ఇందులో భాగం పంచుకుంటానని కపిల్ శర్మ స్వయంగా తనకు చెప్పాడని కూడా వివేక్ అన్నాడు. -
వివేక్ కోసం జేమ్స్‌బాండ్ టైనర్
బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ త్వరలో రెండు విభిన్న చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్తచరిత్ర సినిమాలో ఫ్యాక్షన్ లీడర్‌గా నటించిన వివేక్, మరోసారి అదే దర్శకుడితో కలిసి ఓ అండర్ వరల్డ్ డాన్ జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించనున్నాడు. ముత్తప్ప రాయ్ అనే మాఫీయా డాన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న రాయ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఖేల్ అనే మరో సినిమాలోనూ ఒకేసారి నటించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ రెండు సినిమాల్లో రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించేందుకు వివేక్ కష్టపడుతున్నాడు. కాసినో రాయల్, స్కైఫాల్ లాంటి సినిమాల కోసం డానియల్ క్రెగ్‌ను ట్రయిన్ చేసిన ఆంతోని పెకోరా పర్యవేక్షణలో బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. రాయ్ సినిమాలో భారీ దేహంతో డాన్‌లా కనిపించనున్నాడు, అదే సమయంలో ఖేల్ సినిమా కోసం సన్నగా కనిపించాల్సి ఉంది. అంత త్వరగా బాడీ బిల్డ్ చేయటం వెంటనే సన్నబడటం లాంటివి చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అంతర్జాతీయ స్థాయి ట్రైనర్‌ను ఎంపిక చేసుకున్నాడు వివేక్. -
రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో సినిమా లీక్!
న్యూఢిల్లీ: రితేశ్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబరాయ్, ఆఫ్తాబ్ శివదాసని, ఊర్వశీ రౌతేలా, పూజా బోస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆడల్ట్ కామెడీ మూవీ 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'... 'మస్తీ', 'గ్రేట్ మస్తీ' సిరీస్ భాగంగా వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే ఆన్ లైన్ లో లీకైంది. ఈ లీకు ఆన్ లైన్ లో దుమారం రేపడంతో అప్రమత్తమైన 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' చిత్రయూనిట్ ఈ సినిమా విడుదలను ఒక వారం ముందుకు జరిపింది. నిజానికి ఈ సినిమా వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ఈ శుక్రవారమే (ఎల్లుండి) విడుదల చేయబోతున్నారు. సినిమా ఆన్ లైన్ లో లీకు కావడంపై స్పందించడానికి 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' స్టార్లు రితేశ్, వివేక్, ఆఫ్తాబ్ నిరాకరించారు. ఈ విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వలేదు. ఢిల్లీలో బుధవారం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాలుపంచుకున్న వారు ఈ విషయంపై తాము కామెంట్ చేయబోమని చెప్పారు. సినిమా లీక్ పై నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయనుందని వివేక్ తెలిపారు. 'మస్తీ' సిరీస్ లో భాగంగా వస్తున్న మూడో సినిమాలోనూ తాము కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉందని, గత 12 ఏళ్లుగా ఈ సినిమాల కోసం పనిచేయడం వల్ల తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని ముగ్గురు స్టార్లు పేర్కొన్నారు. -
దాతృత్వం చాటుకున్న బాలీవుడ్ నటుడు
ముంబై: 'రక్తచరిత్ర' సినిమాతో తెలుగువారికి పరిచయమైన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. మంచి నటుడిగానే కాక ఎన్నో సందర్భాల్లో ఒబెరాయ్ సమాజం కోసం తన వంతుగా సహాయాన్ని చేస్తూనే ఉన్నారు. జమ్మూ కశ్మీర్ లోని 10 మంది బాలికల చదువుకయ్యే ఖర్చు కోసం స్కాలర్ షిప్ అందించడానికి ఒబెరాయి స్థాపించిన ఎన్జీఓ 'దేవీ' ముందుకు వచ్చింది. జమ్ము కశ్మీర్‌లోని సెయింట్ లారెన్స్ పాఠశాలలోని 10 మంది విద్యార్థినులకు ఈ స్కాలర్షిప్ ఫలాలు అందనున్నాయి. విద్యార్థినుల ఉన్నత చదువులకు, హాస్టల్, వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును స్పాన్సర్ చేయనున్నారు. స్కాలర్షిప్ విషయమై వివేక్ ఒబెరాయ్ స్పందిస్తూ..చదువు వారిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లగలిగితే, వారి లక్ష్యాలను చేరకోవడానికి కావల్సిన రెక్కలను అందించడానికి తాను సిద్ధమని తెలిపారు. -
చిరంజీవి సినిమాలో బాలీవుడ్ నటుడు
ఇటీవల రామ్‌చరణ్ మరోసారి చిరంజీవి 150వ సినిమాను తెర మీదకు తీసుకొచ్చాడు. కత్తి సినిమాను చిరు రీమేక్ చేయనున్నాడని, ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా ప్రకటించటంతో దాదాపుగా ఇదే ఖాయమని ఫీలవుతున్నారు ఫ్యాన్స్. అయితే మెగా క్యాంప్ మాత్రం ఇంత వరకు దీనిపై అధికారికంగా ఏమీ చెప్పలేదు. ప్రకటన రాకపోయినా సినిమా మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్గా తమన్నా గ్యారంటీ అన్న వార్త, కొద్ది రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తుండాగా, తాజాగా ప్రతినాయక పాత్రపై కూడా ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. తమిళ వర్షన్లో నీల్ నితిన్ ముఖేష్ నటించిన విలన్ పాత్రలో తెలుగు వర్షన్‌కు వివేక్ ఒబెరాయ్‌ని సెలెక్ట్ చేశారట. ఇప్పటికే రక్తచరిత్ర సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన వివేక్, ఈ సినిమాతో మరోసారి సౌత్ ఆడియన్స్ ను పలకరించనున్నాడు. -
రామ్ అన్నా.. సూపర్ ఇంప్రెసివ్!
సిసలైన హైదరాబాదీలైన బాలీవుడ్ ఒబెరాయ్‌లు ఎప్పటికీ హైదరాబాద్‌ను మాత్రం మర్చిపోరు, మర్చిపోలేరు. ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుంటూనే ఉంటారు. అందుకోసం సోషల్ మీడియాను కూడా బాగానే ఫాలో అవుతారు. హైదరాబాద్‌లో అపాచీ హెలికాప్టర్ల తయారీ కోసం బోయింగ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థలు జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ట్వీట్ చేయడంతో.. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ స్పందించారు. సూపర్ ఇంప్రెసివ్ రామ్ అన్నా అంటూ తన ట్వీట్ మొదలుపెట్టారు. మీరు చేస్తున్న ప్రయత్నాల వల్ల 'హైదరాబాద్ హ్యాపెనింగ్' మాత్రమే కాదు, 'టెర్రిఫిక్ తెలంగాణ' సాధ్యమవుతోందని చెప్పారు. దానికి మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. వివేక్ భాయ్‌కి ధన్యవాదాలు చెబుతూనే, తమ హైదరాబాదీ ఒబెరాయ్ సాబ్ ఏం చేస్తున్నారని అడిగారు. వివేక్ తండ్రి సురేష్ ఒబెరాయ్ కూడా ఒకప్పుడు బాలీవుడ్లో రాజ్యమేలినవారే. ఆయన సిసలైన హైదరాబాదీ. ఆయనకు తన వందనాలు అందజేయాలని కేటీఆర్ కోరారు. Wow!Super impressive Ram Anna! Bcoz of ur efforts its not just #HappeningHyderabad but it's also #TerrificTelengana https://t.co/WHJvukRspj — Vivek Oberoi (@vivek_oberoi) November 9, 2015 Thanks Vivek Bhai! Appreciate your kind words. How is our Hyderabadi Oberoi Saab doing? Convey my regards please https://t.co/w8D4iBVlyH — K Taraka Rama Rao (@KTRTRS) November 10, 2015 -
బాలీవుడ్ స్టార్లు షాకయ్యారు!
ముంబై: తాజాగా సంభవించిన భూకంపంతో బాలీవుడ్ స్టార్లు దిగ్భ్రాంతి చెందారు. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌తోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న భూకంపం ప్రభావాన్ని తాము కూడా ఎదుర్కొన్నమంటూ పలువురు సినీతారలు పేర్కొన్నారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. బాలీవుడ్ సెలెబ్రిటీలు వివేక్ ఒబ్రరాయ్, ప్రీతి జింతా, రణ్వీర్ షోరెయ్, అలీ జఫర్ తదితరులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఈ విషయమై స్పందించారు. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో నమోదైన భూకంపం ఘటనపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరేమన్నారంటే.. వివేక్ ఒబెరాయ్: అహ్మదాబాద్‌లో ఇప్పుడే భూకంపాన్ని చవిచూశా. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఆశిస్తున్నా. మేమున్న హోటల్ మొత్తం ఊగిపోయింది. అలీ జఫర్: నాకు అనుభవంలోకి వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపం ఇది. రణ్వీర్ షోరెయ్: భూకంపం ప్రభావ ప్రాంతాల్లో ఉన్నవారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నా. సురక్షితంగా ఉండండి. అద్నాన్ సమీ: భూకంపం వల్ల ప్రభావితమైన వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడి సంరక్షణలో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రీతిజింతా: ఓ మై గాడ్: భూకంపం వచ్చింది. నెహా ధూపియా: భూకంపం గురించి వార్తలు వస్తున్నాయి. చాలా ఆందోళనగా ఉంది. మీరు, మీ ఆప్తులు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నా. -
సెప్టెంబర్ 3 నపుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న శక్తి కపూర్ (యాక్టర్), వివేక్ ఒబెరాయ్ (యాక్టర్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు ఆర్జిస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలై ఈ సంవత్సరం జాబ్‌లో చేరే అవకాశం ఉంది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. వీరు పుట్టిన తేదీ 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. విజయాలు వరిస్తాయి. కొత్త స్నేహాలు, కొత్త బంధుత్వాలు ఏర్పడి, వాటి వల్ల లబ్ధి పొందుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులకు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. అయితే చంద్రుని ప్రభావం వల్ల ఆలోచనలలో నిలకడ లేక గందరగోళం నెలకొనవచ్చు. చంద్ర, గురుల పరస్పర ద్వైదీభావం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. లక్కీ నంబర్స్: 2,4, 5,6,7; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, ఎల్లో, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, శుక్ర, శనివారాలు. సూచనలు: రోజూ రాత్రిపూట వెన్నెలలో విహరించడం, నవగ్రహాభిషేకం, దత్తస్తవం పఠించడం, గురువులను, పండితులను గౌరవించడం, అనాథ శరణాలయాల్లో పాయసం దానం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
తండ్రి అయిన బాలీవుడ్ హీరో
ముంబయి : మరో బాలీవుడ్ హీరో తండ్రి ప్రమోషన్ కొట్టేశాడు. హీరో వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక ఆల్వా పాపకు జన్మనిచ్చింది. మంగళవారం ఆమె బుజ్జిపాపకు జన్మనివ్వడంతో వివేక్ ఒబెరాయ్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. ఈ సంతోషకరమైన వార్తను బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వివేక్ ఒబెరాయ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది. 'కంగ్రాట్యూలేషన్స్ ప్రియాంకా అండ్ వివేక్ ఒబెరాయ్.. లిటిల్ వీర్ హేజ్ ఏ లిటిల్ సిస్టర్.. సో హ్యాపీ ఫర్ యూ ఆల్.. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్,' అంటూ జెనీలియా ట్విట్ చేసింది. ఇప్పటికే వివేక్ దంపతులకు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బుడ్డోడి పేరు వివాన్ వీర్ ఒబెరాయ్. వివేక్ ఒబెరాయ్ జేడీ(యూ) దివంగత నేత జీవరాజ్ ఆల్వా కుమార్తె ప్రియాంకను 2010 అక్టోబర్ 29న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రక్త చరిత్ర సినిమా ద్వారా వివేక్ ఒబెరాయ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. -
అమరులకు నివాళులు
26/11 ఘటన అమరులకు సినీనటులు, విద్యార్థులు ఆదివారం నివాళులర్పించారు. అఖిల భారత ఉగ్రవాద వ్యతిరేక సమాఖ్య (ఏఐఏటీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం పార్శీ జింఖానా గ్రౌండ్లో ‘జరా యాద్ కరో ఖుర్బానీ’ అనే కార్యక్రమాన్ని సమాఖ్య అధ్యక్షుడు ఎం.ఎస్.బిట్టా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఘటన జరిగి ఆరేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, వివేక్ ఒబేరాయ్‌తో పాటు వేలాది మంది విద్యార్థులు పోలీస్ జింఖానా సమీపంలో ఉన్న 26/11 స్మారక స్థలం వద్దకు చేరుకుని అప్పటి ఘటనలో ముష్కరుల దాడిని తిప్పికొట్టే క్రమంలో అశువులు బాసిన అమరజవానులకు నివాళులర్పించారు. అలాగే ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ ప్రతిన బూనారు.