
చిరంజీవి సినిమాలో బాలీవుడ్ నటుడు
ఇటీవల రామ్చరణ్ మరోసారి చిరంజీవి 150వ సినిమాను తెర మీదకు తీసుకువచ్చాడు. కత్తి సినిమాను చిరు రీమేక్ చేయనున్నాడని, ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం...
ఇటీవల రామ్చరణ్ మరోసారి చిరంజీవి 150వ సినిమాను తెర మీదకు తీసుకొచ్చాడు. కత్తి సినిమాను చిరు రీమేక్ చేయనున్నాడని, ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా ప్రకటించటంతో దాదాపుగా ఇదే ఖాయమని ఫీలవుతున్నారు ఫ్యాన్స్. అయితే మెగా క్యాంప్ మాత్రం ఇంత వరకు దీనిపై అధికారికంగా ఏమీ చెప్పలేదు.
ప్రకటన రాకపోయినా సినిమా మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్గా తమన్నా గ్యారంటీ అన్న వార్త, కొద్ది రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తుండాగా, తాజాగా ప్రతినాయక పాత్రపై కూడా ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. తమిళ వర్షన్లో నీల్ నితిన్ ముఖేష్ నటించిన విలన్ పాత్రలో తెలుగు వర్షన్కు వివేక్ ఒబెరాయ్ని సెలెక్ట్ చేశారట. ఇప్పటికే రక్తచరిత్ర సినిమాతో తెలుగు ఆడియన్స్కు దగ్గరైన వివేక్, ఈ సినిమాతో మరోసారి సౌత్ ఆడియన్స్ ను పలకరించనున్నాడు.