Vinayak
-
జైలర్ సినిమా విలన్ వినాయక్ అరెస్ట్
-
‘నారాయణ’లో విద్యార్థి ఆత్మహత్య
మధురవాడ (విశాఖజిల్లా): నారాయణ క్యాంపస్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం పట్టణంలోని పీఎస్ఎన్ఎం స్కూలు సమీపంలో నివాసం ఉంటున్న నెల్లూరు రవికుమార్, ఆయన భార్య మార్కెటింగ్ శాఖలో పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, చిన్న కుమారుడు నెల్లూరు అఖిల్ వినాయక్(15)ను విశాఖలోని నారాయణ విద్యాసంస్థలో 6వ తరగతి నుంచి చదివిస్తున్నారు. ప్రస్తుతం పీఎంపాలెంలోని క్యాంపస్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం గణతంత్ర వేడుకలకు సహచర విద్యార్థులు వెళ్లగా, నిఖిల్ మాత్రం హాస్టల్ రూము నంబరు 203లోనే ఒంటరిగా ఉన్నాడు. సుమారు 10.15 గంటల సమయంలో జెండా వందనం కార్యక్రమం పూర్తయి సహచర విద్యార్థులు వచ్చేసరికి నిఖిల్ వినాయక్ గదిలో ప్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఉన్నాడు. అతడిని వైద్యం నిమిత్తం గాయత్రి ఆస్పత్రికి యాజమాన్యం తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. నిఖిల్ ప్యాంటు కుడి జేబులో ‘నా చావుకి నేనే కారణం. పదో తరగతి ఫెయిల్ అవుతాననే భయంతో చస్తున్నాను.. ’ అని రాసిన లేఖ ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే నా కుమారుడు మృతి ‘బాగా చదువు చెబుతారని ఏడాదికి రూ.2లక్షలు ఫీజు కట్టి నారాయణ పీఎంపాలెం క్యాంపస్‌లో చేర్పించాను. నా కుమారుడు నిఖిల్‌పై గత ఏడాది ఆగస్టు 7వ తేదీన సహచర విద్యార్థులు దాడి చేయగా, బాగా దెబ్బలు తగిలాయి. ఫిట్స్ కూడా వచ్చాయి. నాలుగు నెలలు ఇంటి వద్దే ఉంచాం. ఆ తర్వాత మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చాం. గత ఏడాది గొడవ జరిగినప్పుడు ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అప్పుటి నుంచే నిఖిల్ ఆరోగ్యం పాడైంది. ఈ నెల 21న నిఖిల్ జ్వరంతో బాధపడుతున్నాడని వార్డెన్ శ్రావణ్ ఫోన్ చేసి చెప్పారు. రూ.వెయ్యి ఫోన్ పే ద్వారా పంపించగా, వైద్యం చేయించారు. అనారోగ్యానికి గురైన నిఖిల్‌ను ఒంటరిగా గదిలో మేనేజ్మెంట్ వదిలేసింది. ఉదయం 10.15 గంటలకు ఫ్యాన్‌కు వేలాడుతున్నాడని గుర్తించినా, 10.45 గంటల వరకు ఆస్పత్రికి తీసుకువెళ్లలేదు. కనీసం 108 అంబులెన్స్‌కు కూడా ఫోన్ చెయ్యలేదు. పక్కనే ఆస్పత్రి ఉన్నా, హాస్టల్ వ్యాన్‌లో గాయత్రి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నా కుమారుడి మృతికి నారాయణ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయి. మేనేజ్మెంట్ ఒత్తిడి లేదా ఇంకా ఏమైనా జరిగి ఉండవచ్చు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.– నెల్లూరి రవికుమార్, విద్యార్థి నిఖిల్ వినాయక్ తండ్రి, శ్రీకాకుళం -
గ్రామీణ ప్రేమకథగా వస్తోన్న 'రాధా మాధవం'..!
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధా మాధవం'. ఈ చిత్రానికి దాసరి ఇస్సాక్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను గోనాల్ వెంకటేశ్ నిర్మిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. తాజాగా ఈ చిత్రం నుంచి వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 'నువ్వు నేను' అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా.. సమీరా భరద్వాజ్, రవి జీ ఆలపించారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 'నేల మీద నేను ఉన్నా' అంటూ సాగే సాంగ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జనవరి నెలలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో మేక రామకృష్ణ, జయ ప్రకాశ్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
ప్రియురాలితో నటుడి వివాహం
సాక్షి, బెంగళూరు: కన్నడ నటుడు వినాయక్ జోషి ఒక ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు వర్షా బెలవాడితో ఆర్య సమాజం ఆచారాల ప్రకారం పరస్పరం ఉంగరాలు మార్చుకొని వివాహం చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక శుక్రవారం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలన పాటిస్తూ నిరాడంబరంగా వివాహ వేడుకను నిర్వహించారు. పెళ్లి కార్యక్రమాన్ని బంధువులు, స్నేహితులు, అభిమానుల కోసం సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. వినాయక్ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు వినాయక్, వర్షాలకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వర్షా బెలవాడి జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం వర్షా బాడ్మింటన్ అకాడమీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. వినాయక్, వర్షా చిన్ననాటి స్నేహితులు. ఏడేళ్ల వయసులో వీరిద్దరు ఒకే చోట డాన్స్ నేర్చుకున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మళ్లీ కలుసుకొని ప్రేమలో పడ్డారు. ఇక సినిమాలో విషయానికి వస్తే.. హీరో వినాయక్ 70 సినిమాల్లో నటించారు. అమృతా వర్షిని, లాలి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపునిచ్చాయి. అదే విధంగా బిగ్ బాస్ కన్నడ సీజన్3లో వినాయక్ పాల్గొని సందడి చేశారు. -
భయ్యూ వెయ్యి కోట్ల ఆస్తి వినాయక్‌కు
ఇండోర్ : మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహారాజ్‌కు దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య రోజు ఆయన రాసిన సూసైడ్ నోట్లో ఈ విషయాన్ని గుర్తించినట్లు ఇండోర్ డీఐజీ హరి నారాయణచారి మిశ్రా తెలిపారు. ఆ ఆస్తులకు సర్వహక్కులు భయ్యూ నమ్మిన బంటు వినాయక్‌కు చెందాలని తన సూసైడ్ నోట్లో రాసుకున్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం భయ్యూ మహారాజ్ పేరున ఉన్న ఆస్తులు ఇకపై వినాయక్‌కు చెందుతాయని మిశ్రా స్పష్టం చేశారు. వినాయక్ గత పదిహేనేళ్లుగా భయ్యూ మహారాజ్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. ఆయన చేసే ప్రతిపనిలో వినాయక్ పాలుపంచుకున్నారు. ఈ కారణంగానే యావదాస్తిని వినాయక్‌కు చెందేలా సూసైట్ నోట్ రాశారని భావిస్తున్నారు. ఈ ఆస్తులపై భయ్యూ కుటుంబ సభ్యులకు ఎలాంటి హక్కులు ఉండవని డీఐజీ తెలిపారు. చట్టబద్ధంగా 1000 కోట్ల ఆస్తి ఉన్న భయ్యూకు లెక్కల్లో లేని ఇతర ఆస్తులు ఇంకా చాలా ఉండి ఉంటాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయం పడుతున్నారు. అయితే ఈ సూసైడ్ నోట్‌పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తిని కాజేయండంలో భాగంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇది చదవండి : అసలెవరీ భయ్యూజీ? ఆసక్తికర నిజాలు , ఆధ్యాత్మిక గురువు ఆత్మహత్యకు కారణం..? -
సెమీస్‌లో వినాయక్ జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నమెంట్లో తెలుగు కుర్రాడు కాజా వినాయక్ శర్మకు బుధవారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. చండీగఢ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్‌లో సెమీస్‌కు చేరిన వినాయక్ శర్మ సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. పురు షుల డబుల్స్ క్వార్టర్స్‌లో మోహిత్ మయూర్ జయప్రకాశ్– వినాయక్ శర్మ జంట 7–5, 5–4 (రిటైర్డ్ హర్ట్)తో విజయంత్ మలిక్–దల్విందర్ సింగ్ (భారత్) జోడీపై నెగ్గింది. నేడు జరిగే సెమీస్‌లో కునాల్ ఆనంద్–షాబాజ్ ఖాన్ (భారత్) జంటతో వినాయక్ శర్మ ద్వయం తలపడుతుంది. మరోవైపు సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో వినాయక్ శర్మ 4–6, 2–6తో దల్విందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. -
నరసన్నను దర్శించుకున్న వినాయక్, హీరో శ్రీనివాస్
అంతర్వేది (సఖినేటిపల్లి) : స్థానిక శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆదివారం ప్రముఖ చిత్ర దర్శకుడు వినాయక్, సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకట శాస్త్రి, అభిమానులు స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు వీరికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. ‘జై జానకి నాయకా’ చిత్రం త్వరలో విడుదల అవుతున్న సందర్భంగా ఆ చిత్రం హీరో సాయిశ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. చిత్రం విజయవంతం కావాలని ఆయన స్వామిని వేడుకున్నారు. సి. కల్యాణ్ నిర్మాతగా మెగా ఫ్యామిలీ మెంబర్ సాయిధరమ్ తేజ్ హీరోగా సీకే ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై నిర్మించనున్న కొత్త చిత్రం స్క్రిప్టును దర్శకుడు వినాయక్ స్వామివారి పాదాల చెంతన ఉంచి పూజలు చేశారు. వారి వెంట ట్రస్టీలు వీరా మల్లిబాబు, తిరుమాని ఆచార్యులు, యెనుముల శ్రీరామకృష్ణ, శంకరగుప్తం శ్రీనుబాబు, సీనియర్ అసిస్టెంట్ పి. విజయ సారధి, జూనియర్ అసిస్టెంట్ ఎం. సత్యకిరణ్ ఉన్నారు. రాబోయే సినిమా మినీ ఠాగూర్‌లా ఉంటుంది మలికిపురం : తన దర్శకత్వంలో రానున్న సినిమా మినీ ఠాగూర్‌లా ఉంటుందని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తెలిపారు. మలికిపురంలో కంచుస్తంభం వాసు నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సి. కల్యాణ్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుందన్నారు. ఆయన వెంట కంచుస్తంభం వాసు, లింగోలు మహేష్, బొలిశెట్టి శ్రీను, అబ్దుల్ తదితరులు ఉన్నారు. -
మరో మెగా హీరోతో వినాయక్ 'దుర్గ'..?
ఖైదీ నంబర్ 150 సినిమాతో వంద కోట్ల వసూళ్లు సాధించిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేయలేదు. అయితే చాలా రోజులుగా మెగా హీరోతోనే వినాయక్ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే విషయానికి సంబంధించిన మరో అప్ డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మెగా హీరోగా సాయిధరమ్ తేజ్‌తో వినాయక్ సినిమా చేయనున్నాడన్న వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా కోసం దుర్గ (వర్కింగ్ టైటిల్) అనే పవర్ ఫుల్ మాస్ కథను వినాయక్ సిద్ధం చేశాడట. కథ, మాటల రచయిత ఆకుల శివతో కలిసి వినాయక్, ఈ కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయిధరమ్ తేజ్ తదుపరి ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేయలేదు. -
డిసైడ్ అయ్యాక నేనే చెప్తా : రానా
తన నెక్ట్స్ సినిమా పై మీడియాలో జరుగుతున్న ప్రచారం పై యంగ్ హీరో రానా స్పందించాడు. త్వరలో స్టార్ వివి వినాయక్ దర్శకత్వంలో రానా నటించబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే విషయాన్ని ట్విట్టర్ లో ద్వారా తెలుసుకున్న రానా.. తాను ఏ సినిమా చేయాలన్నది ఫిక్స్ అయితే.. తానే ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తానని ఇలాంటి రూమర్స్ నమ్మవద్దని తెలిపాడు. బాహుబలి సినిమాలోని భల్లాలదేవుడి పాత్రలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా, ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ను జూన్ 23న రిలీజ్ చేయనున్నారు. -
చిరు చిత్రాలతో గేమ్
చిరంజీవి నటించిన 150 చిత్రాల్లో ప్రతి చిత్రాన్నీ ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో రూపొందించిన గేమ్ ‘మెగా 150–బాస్ ఇన్ గేమ్’. చిరంజీవి అభిమా నులు సతీశ్‌బాబు ముత్యాల, ప్రసాద్ బొలిశెట్టి, పవన్ కొర్లపాటి, శేషు లొశెట్టి స్థాపించిన ‘ఎం యాప్ సోర్స్ డెవలప్మెంట్’ కంపెనీ ఈ గేమ్‌ని రూపొందించింది. దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత ‘దిల్’ రాజులు హైదరాబాద్‌లో ఈ గేమ్‌ని విడుదల చేశారు. ఈ గేమ్ రూపకర్తలు మాట్లాడుతూ –‘‘ఈ గేమ్‌లో 14 లెవల్స్ ఉంటాయి. రెండు వాల్యూమ్స్ కింద విడుదల చేస్తున్నాం. చిరంజీవిగారి 110 చిత్రాలను మొదటి వాల్యూమ్‌లో, మిగతా 40 చిత్రాలను రెండో వాల్యూమ్‌లో క్రియేట్ చేశాం. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు’’ అన్నారు. అభిమానులు రూపొందించిన ఈ గేమ్ సక్సెస్ కావాలని వీవీ వినాయక్, ‘దిల్’రాజు ఆకాంక్షించారు. -
మెగా నం. 150
150 సినిమాలంటే అందాజాగా సప్త సముద్రాలు దాటినట్లే.. ఎన్నో అనుమానాలు.. ఎన్నో భయాలు.. ఎన్నో విపత్తులు.. ఎన్నో విమర్శలు.. ఎన్నో అంచనాలు.. ఎన్నో ఎదురుచూపులు... ఎన్నో ఆశలు... ఇవి చిరంజీవి అభిమానుల గుండెల్లోని సప్త సముద్రాలు. ఈ సప్త సముద్రాల తీరం ఇంకా గొప్పది... ఆ తీరం పేరే... ఫ్యామిలీ! ఇవాళ ఈ వయసులో ఇంత మహోన్నతమైన ప్రాజెక్ట్ చేపట్టిన చిరంజీవి తన ఫ్యామిలీ కనబర్చిన శక్తి ఈ ఏడు సముద్రాలనీ దాటించేలా చేసిందని అంటున్నారు. ‘సాక్షి’ ఫ్యామిలీకి చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... ఎంజాయ్... రిలీజులు మీకు కొత్త కాదు. కానీ, తొమ్మిదేళ్ల తర్వాత చేసిన సినిమా అంటే ఓ ప్రత్యేకమైన ఫీలింగ్ ఉండి ఉంటుంది... యస్... గత సినిమాల విడుదలకీ, ఈ ‘ఖైదీ నంబర్ 150’ విడుదలకీ కచ్చితంగా వ్యత్యాసం ఉంది. అది కాదనలేని సత్యం. తొమ్మిదిన్నరేళ్ల విరామం తర్వాత నేను చేసిన రీ–ఎంట్రీ సినిమా. ఎంతవరకూ వాళ్లను ఈ సినిమా అలరిస్తుందనే మీమాంస, తర్జన భర్జనలు మాకున్నాయి. కానీ, మాకున్న గట్ ఫీలింగ్ ఏంటంటే... రామ్‌చరణ్, వీవీ వినాయక్, రత్నవేలు, గౌతంరాజు.. మేం ఆల్రెడీ సినిమా చూసుకున్నాం. చూశాక మాకు ఓ రకమైన కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. ‘స్టాలిన్’, ‘శంకర్‌దాదా జిందాబాద్’.. నేను చేసిన చివరి మూడు నాలుగు సినిమాల కంటే ఈ సినిమాలో నా లుక్ చాలా బాగుంది. ఫస్ట్‌డే మేకప్ వేసుకుని లొకేషన్‌కి వెళ్లగానే, వినాయక్ ‘అన్నయ్యా... ‘చూడాలని ఉంది’లో చిరంజీవిలా ఉన్నారు. ఫిఫ్టీ పర్సెంట్ హిట్ ఇక్కడే కొట్టేశాం’ అన్నాడు. సో, ఎక్కడా కూడా పదేళ్ల విరామం గానీ, ప్రస్తుత వయసు గానీ తెరపై కనిపించే ఆస్కారం లేదు. ‘నేనే నిర్మిస్తా’ అని రామ్‌చరణ్ అన్నప్పుడేమనిపించింది? చరణ్ ఆ మాట అన్నప్పుడు ‘ఇన్నేళ్లుగా నేను క్రియేటివ్ సైడ్ వెళుతూ వచ్చానే తప్ప వ్యాపార దృక్పథంతో ఆలోచించలేదు. అంజనా ప్రొడక్షన్స్ సంస్థ స్థాపించి మీ బాబాయ్ నాగబాబు సినిమాలు నిర్మించినప్పటికీ ఎప్పుడూ నేను భాగస్వామిగా వ్యవహరించలేదు. తనను ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. నటుడిగానే నేను ఫోకస్ చేశాను’ అన్నాను. అప్పుడు చరణ్ ఏమన్నాడంటే, ‘డాడీ.. మీ వెనకాల ఎక్కువ మంది లేరేమో. నా వెనకాల మాత్రం మీరంతా ఉన్నారు. ఏ విషయంలోనైనా నాకు సలహాలూ, సూచనలూ ఇచ్చేవాళ్లు చాలామంది ఉండగా, నేనెందుకు వెనకంజ వేయాలి’ అన్నాడుæ. అంతేకాదు.. ‘డాడీ... మిమ్మల్ని ఎలా ప్రెజెంట్ చేయాలనేది మేమందరం కూడబలుక్కుని, బెస్ట్ టెక్నీషియన్స్‌ని పెట్టుకుని సినిమా చేస్తాం. ఆ ఛాన్స్ నాకే ఇవ్వండి’ అన్నాడు. కాదనలేకపోయా. ఇంతకీ మీ నిర్మాత ఎంతవరకూ బెస్ట్? సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో సూపర్. నిర్మాతగా అది మొదటి విజయం. ఓ హీరోగా, నటుడిగా తన నిర్మాత ఎలా ఉండాలని కోరుకుంటాడో... ఓ నిర్మాతగా తను అలానే ఉన్నాడు. ‘ధృవ’ షూటింగ్ కోసం చరణ్ బ్యాంకాక్ వెళ్లిన టైమ్‌లోనే మేము స్లొవేనియా, క్రోయేషియా వెళ్లాం. ‘డాడీ ఎలా ఉన్నారు? షూటింగ్ ఎలా జరుగుతోంది?’ అని నిరంతరం దర్శకుడితో, మా పెద్దమ్మాయి సుస్మితతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఫారిన్ వెళ్లినప్పుడు అక్కడి కరెన్సీకి మన డబ్బులు మార్చుకోలేక, చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడతారు. అందుకే మేకప్మ్యాన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ 300 యూరోలు ఇవ్వమని చెప్పాడు. అందరికీ ఫైవ్ స్టార్ హోటల్ సదుపాయాలు ఇచ్చాడు. అతిశయోక్తి అనుకోకుంటే ఓ మాట చెబుతా. నా నిర్మాతల్లో ‘ది బెస్ట్’ అని అశ్వనీదత్, అల్లు అరవింద్ లాంటి కొద్దిమంది పేర్లు చెప్పగలను. అందులో ప్రథమ స్థానం అనను కానీ చరణ్‌కు ప్రముఖ స్థానం ఇస్తా. చరణ్ ఆ స్థాయి నిర్మాత. మీ అమ్మాయి సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం.. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘అందరివాడు’.. నా లాస్ట్ సినిమాలు అన్నిటికీ తనే చేస్తూ వచ్చింది. నిఫ్ట్లోనూ, లండన్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలోనూ శిక్షణ తీసుకుంది. మొదట్నుంచీ సినిమా వాతావరణంలో పెరగడం వలన తన శిక్షణను సినిమాకి అనుగుణంగా సుస్మిత మలచుకుంది. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫెక్టివ్‌గా చూపించడంలో తను సక్సెస్ అయింది. మొదట ముంబయ్ వాళ్లను ప్రయత్నిద్దాం అనుకున్నాం. వచ్చినవాళ్ళ యాటిట్యూడ్, కమర్షియల్‌గా మాట్లాడడం చూసిన తర్వాత ‘వద్దు. అక్కే డ్రస్సులు డిజైన్ చేస్తే బాగుంటుంది’ అని చరణ్ అన్నాడు. తమ్ముడు అడిగిన వెంటనే సుస్మిత కాదనలేదు. ఇప్పుడు తనకీ ఓ ఫ్యామిలీ ఉంది కదా. మా విష్ణు (సుష్మిత భర్త) చాలా కో–ఆపరేట్ చేశాడు.‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి కూడా తనే డ్రస్సులు డిజైన్ చేసింది. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] మీ అల్లుడు విష్ణు ఏమన్నారు? ‘మా పెళ్లైన బిగినింగ్‌లో చేశారు. మళ్లీ సినిమాలు చేయలేదు. మేమంతా మీ ఫ్యాన్స్. మీరు సినిమాలు చేస్తే అంత కంటే ఆనందం ఉండదు. తప్పకుండా చేయాలి’ అన్నాడు. విష్ణు మాత్రమే కాదు.. ఫ్యామిలీలో యంగ్ హీరోలందరూ ఎంతో ఉత్సాహపడ్డారు. కుటుంబం నుంచి చాలామంది హీరోలు రావడంపై? ఇది చాలా గర్వపడే అంశం. వాళ్లు కూడా ఒక సుస్థిర స్థానం ఏర్పరుచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. నా తృప్తి, నా గర్వం ఇప్పుడు రెండింతలు. ‘ప్రతి ఒక్కరూ (మెగా హీరోలు) మనకి నల్లేరు మీద నడక’ అనుకోవడం లేదు. కష్టపడితేనే చిత్ర పరిశ్రమలో ఉంటాం. ఇండస్ట్రీలో ఓ స్థానం ఏర్పడడానికి చిరంజీవి కారణం కావొచ్చు. ఒకప్పుడు బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో మీ పిల్లల ఎదుగుదలను చూడలేకపోయారు. ఇప్పుడు కాస్త విశ్రాంతి దొరకడం ఎలా ఉంది? దట్స్ ట్రూ! నా పిల్లలతో తినవి తీరా ఆడుకునే వీలు నాకు చిక్కలేదు. ఇప్పుడు నా గ్రాండ్ చిల్డ్రన్‌తో నేను ఆడుకుంటూ, ఆనందపడిపోతుందే సురేఖ నన్ను తదేకంగా చూస్తుంటుంది. ‘ఏంటి? ఏం చూస్తున్నావ్?’ అనడిగితే, ‘మన పిల్లలతో మీరు ఈ విధంగా ఆడుకున్న సంఘటనలు ఉన్నాయా? అని గుర్తు చేసుకుంటున్నా’ అంది. ఏం గుర్తుకు రాలేదు. వాళ్లు పెద్దయిన తర్వాత నేను ఊటీ, స్విట్జర్లాండ్, కాశ్మీర్ వెళ్లినప్పుడు నాతో వచ్చేవారు. షూటింగ్ నుంచి అలసిపోయి వచ్చిన నేను వాళ్లతో సరదాగా కాసేపు మాట్లాడడం తప్ప.. ఎప్పుడూ ఆడుకోలేదు. మొదటి రోజు షూటింగ్‌కి వెళ్లినప్పుడు మీ ఫీలింగ్? నిజంగా చెప్తున్నాను. మేకప్ వేసుకుని సెట్లోకి వెళ్లిన తర్వాత లైట్స్, సౌండ్, కెమేరా.. అదే సినిమా అరోమా అంటుంటాం కదా! ఇవన్నీ ఎంత ఫెమిలియర్ అంటే.. స్టార్ట్, కెమేరా, యాక్షన్ అనే ధ్వని వినపడగానే... పదేళ్ల క్రితం నన్ను నడిపించిన, నాకు ఇష్టమైన, నేను ఆస్వాదించిన వాతావరణం మళ్లి వచ్చినట్లుగా అనిపించింది. నిన్నటివరకూ షూటింగ్ చేసి, మళ్లీ ఈరోజు సెట్‌కి వచ్చాననే ఫీలింగ్ తప్ప... పదేళ్ల విరామం తర్వాత మళ్లీ వస్తున్నాననే ఫీలింగ్ లేదు. ఇంటి నుంచి మేకప్ వేసుకుని బయలు దేరినప్పుడు గానీ... మేకప్ తీసేసి ఇంటికి వచ్చినప్పుడు గానీ... పని తాలూకు ఉత్సాహం, వైబ్రేషన్స్ అన్నీ మా ఆవిడ గమనించింది. ‘ఈ మధ్య కాలంలో ఇంత హుషారుగా, ఇంత సంతోషంగా మీరు కనిపించలేదు’ అని సురేఖ అంది. ఇష్టమైన ఫీల్డ్‌లో మనకి ఇష్టమైన పని చేస్తుంటే ఉండే జోష్ మాటల్లో చెప్పలేను. 2007లో ‘శంకర్‌దాదా జిందాబాద్’ చేసిన ఆఖరి క్షణానికీ, 2016లో ‘ఖైదీ నంబర్ 150’ మొదటి రోజు షూటింగ్ చేసిన క్షణానికీ నాకు తేడా లేదు. బాగా ఎంజాయ్ చేశాను. ఇన్నేళ్లు దూరంగా ఉన్నందుకు పశ్చాత్తాపపడ్డారా? లేదు. 30 ఏళ్లు కంటిన్యూస్‌గా నటించిన తర్వాత ఓ రకమైన అలసటకు గురయ్యాను. ఆ అలసట నుంచి మానసిక సంతృప్తి కోసం వేరే రంగానికి (రాజకీయాల్లోకి) వెళ్లాను. అందులో నేను ఎంత సాధించాను అనేది అందరికీ తెరిచిన పుస్తకమే. అందులో ఉండే తృప్తి పూర్తిగా వేరు. రాజకీయంగా ఏర్పడిన సబ్దత దృష్ట్యా 150వ సినిమాకి ప్రతీ కార్నర్ నుంచీ నన్ను స్వాగతించారు. అభిమానులే కాదు! అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లాంటి వారూ నేను సినిమాల్లోకి రావాలన్నారు. అంతటి గొప్ప స్వాగతం నాకు లభించింది. సో, నో రిగ్రేట్స్. అది (రాజకీయాలు) ఓ రకమైన సంతృప్తి. ఇది (సినిమాలు) ఓ రకమైన సంతృప్తి. 150.. 175.. మీ ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్చేస్తున్నారు? అవకాశమున్నంత వరకూ నేను నటిస్తూనే ఉంటా. మీ ఫ్యామిలీలో ఎక్కువమంది హీరోలు ఉండటంతో అభిమానులు డివైడ్ అవుతున్నారనుకోవచ్చా? మీ ప్రశ్న డివైడ్ అవుతుంటే అని కాకుండా యునైట్ అవుతుంటే అనాలేమో. అభిమానులు బలోపేతం అవుతున్నారు. మా ఫ్యామిలీ హీరోలు నా ఇమేజ్ షేర్ చేసుకుంటూ నన్ను బలహీనపరుస్తున్నారు అనుకోవడం లేదు. దర్శకుడు... అభిమాని అయితే సౌకర్యం కదా? నిజమే. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే హీరోలు ఇప్పుడు ఒక్క సినిమా, ఏడాదిన్నరకు ఓ సినిమా చేస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటంటే.. ఏ కథలు చేయాలి? ఎలాంటి సినిమాలు చేయాలి? అనే దానిపై చాలా సంఘర్షణ ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక్కోసారి బాగా రాణిస్తుందనుకున్న సినిమా సరిగ్గా ఆడకపోతే.. తర్వాత ఏం చేయాలన్నా ధైర్యం సరిపోదు. ఒక్కోసారి మన స్టైల్ రొటీన్ అయిపోతుందని అనుకుంటున్న టైమ్‌లో.. ‘లేదు సార్. అభిమానులకు అవే కావాలి, అవే కిక్ ఇస్తాయి’ అని చేయించుకుంటారు. ఒక్కోసారి మొనాటనీ ఫీల్ అవడం కామన్. అప్పుడు ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో!నా అభిమాని అయినటువంటి దర్శకుడికి బాగా తెలుస్తుంది. వీవీ వినాయక్ నా అభిమాని కావడంతో సినిమాని బాగా తీశాడు. ఓ ఆర్టిస్ట్‌కి ‘ఇమేజ్’ ఏర్పడటం ఎంత ప్లస్సో అంత మైనస్ ఏమో.. ఎందుకంటే, ఇమేజ్‌కి తగ్గట్టుగా కథ ఉండాలి. ఉదాహరణకు తమిళ ‘కత్తి’లో లేనివి మీకోసం యాడ్ చేయాల్సి వచ్చింది కదా.. ఏ ఆర్టిస్ట్‌కి అయినా ఇమేజ్ ప్లస్సే అని నా ఫీలింగ్. అదొక అదృష్టం. కాకపోతే ఒక్కో ఆర్టిస్ట్‌కీ ఒక్కో ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్‌కి నిర్వచనం ఇవ్వలేం. ఇమేజ్ రావడం, అది రాను రాను బలం కావడం అనేది లక్. కాకపోతే తన బలం ఎక్కడుందో ఆర్టిస్ట్‌కి తెలియాలి. అది తెలుసుకుని దానికి తగ్గట్టుగా కథలు ఎన్నుకోవాలి. నాకున్న ఇమేజ్‌కి నేను ‘కత్తి’ చేయడమే కరెక్ట్. అందుకే రీమేక్‌కి రెడీ అయ్యాం. అన్ని అంశాలూ ఉన్న సినిమా అది. మంచి సోషల్ మెసేజ్ ఉంది. స్టోరీ సెలక్షన్ విషయంలో చాలా స్ట్రెస్‌కి గురయ్యారు కదా? సరిగ్గా ఏడాది పాటు కథ కోసం అన్వేషించా. నా నుంచి ప్రేక్షకులు ఏవేం కోరుకుంటున్నారో అవన్నీ సినిమాలో ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్... పొలిటికల్‌గా ఓ బాధ్యతాయుతమైన స్థానంలో, ఈ వయసులో, అందులోనూ పదేళ్ల తర్వాత వస్తున్నప్పుడు సామాజిక స్పృహ ఉన్న సినిమా చేయాలి. చాలా కథలు విన్నాను. ఎక్కడా పూర్తి స్థాయిలో సంతృప్తి పడే కథ రాలేదు. అప్పుడు ‘కత్తి’ చూశా. అదో మాస్ సినిమా. అందులో యూనివర్శల్ ప్రాబ్లమ్ ఉంది. ముఖ్యంగా వ్యవసాయమే ప్రధానంగా ఉన్న మన ఇండియాలో సమస్యను ప్రస్తావించే సినిమా. ఈరోజుకీ సమసిపోని సమస్య. దీన్ని నా యాటిట్యూడ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కీ మార్చుకోవాలనుకున్నాం. కమ్‌బ్యాక్ ఫిల్మ్‌కి ఇది కరెక్ట్ అని భావించాం. తొమ్మిదిన్నరేళ్లు టచ్ వదిలిపోయిన డ్యాన్స్ మళ్లీ చేసేటప్పుడు ఇబ్బంది అనిపించిందా? సాంగ్స్ విషయంలో కొంచెం కొత్తగా ప్రయత్నించాం. యంగ్ డ్యాన్స్ మాస్టర్స్ శేఖర్, జానీ, లారెన్స్లు ఇందులో పాటలకు కొరియోగ్రఫీ చేశారు. వీళ్ల మూమెంట్స్ నా బాడీపై కొత్తగా అనిపించాయి. నిజం చెప్పాలంటే ఈ ఇన్నేళ్ల గ్యాప్‌లో ఎప్పుడూ సరదాకి కూడా ఇంట్లో డ్యాన్స్ చేయలేదు. శ్రీజ వివాహంలో పిల్లలు బలవంత పెట్టడంతో కొన్ని సెకన్లు డ్యాన్స్ చేశా. అంతే. అటువంటిది డ్యాన్స్‌మాస్టర్ కంపోజ్ చేయగానే డ్యాన్స్ చేస్తుంటే.. కాజల్ అగర్వాల్ ఆశ్చర్యపోయింది. కొడుకు సరసన నటించిన హీరోయిన్‌తో మీరు చేశారు... (నవ్వుతూ) యాక్చువల్‌గా ముందు తండ్రితో, తర్వాత కొడుకుతో నటించిన హీరోయిన్లున్నారు. కాజల్ మాత్రం ముందు కొడుకుతో చేసి, తర్వాత తండ్రితో నటించింది. కాజల్‌ది అరుదైన రికార్డు. ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు...’ లిరిక్‌ని కొందరు విమర్శిస్తున్నారు... మామూలుగా ‘కుమ్ముడు’ అనే పదం కామన్‌గా వాడుతుంటాం. ఎవరినైనా హోటల్‌కి తీసుకెళ్లినప్పుడు బాగా తింటే ‘ఇవాళ బాగా కుమ్మాడు రా’ అంటుంటాం. కుమ్ముడు పదం విన్నప్పుడు చాలా క్యాచీగా ఉంది. పైగా మాస్ అభిమానులు నాకు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, నేను ఏదైనా చేసేటప్పుడు వాళ్లని కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్లను అలరించడమే నా ప్రధాన లక్ష్యం. అందుకని వాళ్ల గురించి తప్పుగా మాట్లాడినా, వాళ్ల కోసం సినిమాలు తక్కువ స్థాయికి పడిపోతున్నాయని అన్నా నేను ఒప్పుకోను. కమర్షియల్ సినిమానే నా ప్రధానమైన ఛాయిస్. వినాయక్‌గారు చేసినవాటిలో కొన్ని నిరాశపరిచాయి. సో.. మీ కమ్ బ్యాక్ మూవీకి ఆయన్ను ఎన్నుకోవడానికి కారణం ఏంటి? వినాయక్ ఎంచుకున్న కథాంశం ఫెయిల్ అయ్యుండొచ్చేమో కానీ, తను ఫెయిల్ కాలేదు. ఓన్ సినిమా అన్నట్లుగా చేశాడు. వేస్టేజ్‌ని కంట్రోల్ చేశాడు. నన్నో పువ్వులా చూసుకున్నాడు. మనసుకి మరింత దగ్గరయ్యాడు. మురుగదాస్‘రమణ’ను ‘ఠాగూర్’గా చేశారు. ఇప్పుడు ఆయన ‘కత్తి’ని ‘ఖైదీ నం. 150’గా చేశారు. ఈ రెండింటికీ వినాయకే దర్శకుడు. యస్.. అలా సెంటిమెంట్‌గా ఆలోచిస్తే.. ఇది కూడా సక్సెస్ ఖాయం. నో డౌట్ (నవ్వుతూ). ఆ టైమ్‌లో ‘ఠాగూర్’ని మురుగదాస్ చేయలేని పరిస్థితిలో ఉంటే, వినయ్ అయితే బాగా తీయగలడని తనతో చేశాం. ఇప్పుడు మురుగదాస్ ‘కత్తి’ అనుకున్నాక నాకూ, చరణ్‌కీ ‘వినయ్ అయితే చేయగలడు’ అనిపించింది. సక్సెస్ గ్యారంటీ. 150వ సినిమాతో ఓ హీరో.. 100వ సినిమాతో మరో హీరో... హీరోలిద్దరి మధ్య పోటీ గురించి బయట మాత్రం డిస్కషన్ నెలకొంది... (నవ్వుతూ). పోటీ అనేది నాకు లేనే లేదు. నా 150వ సినిమా అప్పుడు బాలకృష్ణ 100వ సినిమా ‘శాతకర్ణి’ కుదరడం అనేది కాకతాళీయం. పోటీ పడి మేం చేసింది కాదు. రిలీజ్ టైమ్ ఒకేసారి కావడంతో మీడియా క్రియేట్ చేసిన పోటీ ఇది. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఈక్వేషన్స్? మీరు గుర్తు చేసుకుంటే ‘శాతకర్ణి’ సినిమా ఓపెనింగ్‌కి నేను వెళ్లాను. నేను కెమెరా స్విచాన్ చేశాను. నూరవ సినిమాగా ఈ కథాంశాన్ని ఎన్నుకోవడమే మొదటి సక్సెస్, ఇలాంటి సినిమాలు ఆడాలని నిండు మనసుతో విష్ చేశాను. క్రిష్ ‘కంచె’ చూసి, నేను ఇంటికి పిలిచి, అభినందించాను. క్రిష్ టాలెంటెడ్. మిత్రుడు బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతికి వచ్చే అన్నీ ఆడాలి. ‘ఖైదీ నం. 150’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కి విజయవాడలో మీరనుకున్న వేదికకు అనుమతి దొరక్కపోవడంలో రాజకీయం ఉందనే టాక్ ఉంది? ఈ ఫంక్షన్ చేయాలనుకున్న తర్వాత ఆఫీసర్స్‌ను సంప్రదించాం. ముందు ఇస్తామన్నారు. పర్మిషన్ కూడా ఇచ్చేశారు. తర్వాత ‘మేం పొరపాటు పడ్డాం. కోర్టు స్టే ఉంది. ఒకవేళ ఇచ్చినా ఇంత మేరకే వాడుకోవాలి’ అన్నారు. ఓ వారం రోజులు తిప్పించుకున్నారు. ఓకే చేయలేదు. ఆ తర్వాత గుంటూరు స్టేడియం అయితే అక్కడున్న అధికారులు ముందు ఓకే అని, ఆ తర్వాత ఇవ్వమన్నారు. అప్పుడు ప్రైవైట్ వెన్యూ అయిన హాయ్‌లాండ్‌ని ఎన్నుకున్నాం. ఏదేమైనా.. అనుమతి దొరక్కపోవడం వెనక ఏదో రాజకీయ కుట్ర ఉందని నేను అనుకోవడం లేదు. అధికారులకు ఏవో ఇబ్బందులు ఉండి ఉంటాయ్. పొలిటికల్‌గా ఏదో ఉందనే మాటని కొట్టిపారేస్తున్నా. సినిమా రంగుకి, రాజకీయ రంగు అంటుకోవడం సరైనదేనా? తమిళనాడులో సినిమాలు, పాలిటిక్స్ కలగలిసి ఉన్నాయి. హీరో విజయ్ చేసిన ఓ సినిమాకి థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. చివరికి ‘ఇది ఎవర్నీ ఉద్దేశించి తీసిన సినిమా కాదు. పొలిటికల్‌గా ఎవర్నీ ఎయిమ్ చేయలేదు’ అని ఆనాటి సీఎంకి విన్నవించుకున్నాక, సమస్య తీరింది. సినిమా అనేది క్రియేటివ్ ఫీల్డ్. దీని మీద రాజకీయ ప్రభావం ఉండకపోతే బాగుంటుంది. పవన్ కల్యాణ్ మీ ప్రీ–రిలీజ్ వేడుకలో పాల్గొంటారా, లేదా అన్నది ఆసక్తికరమైన టాపిక్. ఈ మధ్య కల్యాణ్‌గారిని మీరెప్పుడు కలిశారు? చరణ్ ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం. కల్యాణ్ బిజీగా ఉన్నాడు. నేనూ, తనూ డిసెంబర్ 17న నాన్నగారి ఆబ్దీకానికి కలిశాం. మీ అమ్మ గారు అంజనాదేవిగారు మీ సిన్మా గురించి ఏమన్నారు? అమ్మ చాలా ఉత్సాహంగా ఉంది. మొన్న ఆదివారం తనను కలిస్తే, ‘ప్రివ్యూ షోకి నన్ను పిలవద్దురా. నేను చూడను. ప్రివ్యూ చూస్తే ఎలాంటి ఉత్సాహం ఉండదురా. నేను థియేటర్‌కి వెళ్లి చూస్తాను. అక్కడ చూస్తే ఆ కిక్కే వేరు’ అని ఉత్సాహంగా అంది (నవ్వులు). మంచి స్లిమ్‌గా తయారయ్యారు.. కచ్చితంగా కఠినమైన కసరత్తులే చేసి ఉంటారనుకోవచ్చా? సినిమా చేయాలని నిర్ణయించుకున్న నా ఆహారపు అలవాట్లు మార్చుకున్నా. ప్రతిరోజూ వ్యాయమం చేయడం మొదలుపెట్టా. కఠినమైన శిక్షణ తీసుకున్నా. ప్రత్యేకంగా ఓ జిమ్ కోచ్, డైటీషియన్‌ని పెట్టుకున్నా. వాళ్ల సలహాలు తీసుకున్నా. రాజకీయాల పరంగా కొంచెం విరామం వచ్చేసరికి నా లుక్, డైట్‌పై దృష్టి పెట్టే అవకాశం వచ్చింది. రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. స్లిమ్ కావడం వెనక రెండు మూడు నెలల కష్టం కాదు.. ఓ ఏడాది పాటు శ్రమిస్తే వచ్చిన లుక్ ఇది. సినిమాల కోసం రామ్‌చరణ్ కఠినమైన వర్కవుట్లు, డైట్ పాటించేటప్పుడు సురేఖగారు చాలా బాధపడ్డారు. మరి.. మీ విషయంలో? అస్సలు ఇంత కూడా బాధ లేదు. నా విషయంలో రేఖ చాలా కర్కశంగా ఉంది (నవ్వుతూ). ఇన్నాళ్ళకు నా ఆశ నెరవేరింది! – చిరంజీవి సతీమణి సురేఖ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవిగారు హీరోగా మేకప్ వేసుకోవడం పట్ల మీ అనుభూతి? ఇది చాలా చాలా సంతృప్తినిచ్చే విషయం. మా అబ్బాయి చరణ్ (రామ్‌చరణ్), ఆయన ఇద్దరూ మేకప్ వేసుకుని, ఇంటి నుంచి షూటింగ్‌కి వెళుతుంటే చూడాలనేది నా కోరిక. కానీ, చరణ్ సినిమాల్లోకి వచ్చేనాటికి ఆయన సినిమాలకు దూరమయ్యారు. దాంతో వెలితిగా ఉండేది. ఇన్నాళ్లకు నా ఆశ నెరవేరింది. ఒకవైపు ఈయన, మరోవైపు చరణ్ పొద్దున్నే నిద్ర లేచి, షూటింగ్‌కి రెడీ అయి, హడావిడిగా వెళుతుంటే నాకు కలిగిన ఫీలింగ్‌ని మాటల్లో చెప్పలేను. ఒకవైపు భర్త.. మరోవైపు కొడుకు.. హీరోలుగా ఇద్దరిలో ఎవరు బెస్ట్? అమ్మో అది మాత్రం చెప్పలేనండి. నాకు ఇద్దరూ సమానమే. చెర్రీ (రామ్‌చరణ్) తండ్రికి తగ్గ కొడుకు అని ప్రూవ్ చేసుకున్నాడు. తండ్రి పేరుని నిలబెట్టాడు. అందుకు చాలా సంతోషంగా ఉంది. భర్త హీరో.. కొడుకు నిర్మాత.. కూతురు (సుస్మిత) కాస్ట్యూమ్ డిజైనర్. టోటల్‌గా ఈ సినిమా మీకు ఫెస్టివల్.. అవునండి. చాలా గ్యాప్ తర్వాత డాడీ చేస్తు్తన్న సినిమా అని సుస్మిత చాలా శ్రద్ధగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. ‘ఏం ఫర్వాలేదు.. మావయ్యగారి కాస్ట్యూమ్స్ మీద దృష్టి పెట్టు’ అని మా అల్లుడు కూడా సుస్మితను ఎంకరేజ్ చేయడం ఆనందం అనిపించింది. ఈ సినిమా కోసం చిరంజీవిగారు సన్నబడ్డారు. దానికోసం కఠినమైన కసరత్తులు, ఆహార నియమాలు పాటించారు కదా మీకేమైనా బాధ అనిపించిందా? అస్సలు లేదు. ఎందుకంటే హెల్దీ ఫుడ్ తీసుకున్నారు. అందుకని నాకు హ్యాపీయే. కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు ఫుడ్ తీసుకున్నారు. అసలు ఈ సినిమాయే నాకు మంచి మెమరీ. ఎలాగంటే, ఇంట్లో అందరం డిస్కస్ చేసుకునేవాళ్లం. సుస్మిత కాస్ట్యూమ్స్ గురించి, చెర్రీ ఏమో ప్రొడక్షన్ గురించి మాట్లాడేవాళ్లు. ‘ఇలా చేస్తే బాగుంటుంది.. అలా అయితే బాగుంటుంది’ అని ఒకరికొకరు డిస్కస్ చేసుకోవడం నాకు బాగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ‘మోస్ట్ శాటిస్ఫైయింగ్ మూమెంట్. – డి.జి. భవాని -
మెగా మూవీ డబ్బింగ్ మొదలైంది
ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఆసక్తి ఎదురుచూస్తున్న సినిమా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా, ఇది చిరు రీ ఎంట్రీ సినిమా కూడా కావటంతో మేకింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథ ఎంపిక విషయంలోనే ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసిన మెగా టీం ఇప్పుడు మేకింగ్‌లో మాత్రం జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. షూటింగ్‌తో పాటు ఎడిటింగ్ డబ్బింగ్ లాంటివి కూడా ఒకేసారి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు చిరంజీవి కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పటం స్టార్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నట్టుగా, సంక్రాంతికి ఖైదీ నంబర్ 150ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అరవింద్‌తో కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మాస్ కమర్షియల్ సినిమాల కేరాఫ్ అడ్రస్ వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా అందాల భామ కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. -
ఈ‘నాయకులు’ నిజాలు నిమజ్జనం
ప్రజా వ్యతిరేకత ఉన్నా బేఖాతరు కోర్టులు మెుట్టికాయలేసినా నిస్సిగ్గుగా ముందుకు సాక్షిప్రతినిధి–కాకినాడ: ఊరూ వాడా వినాయకుడి నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. బాణసంచా, డప్పులు, మేళతాళాలతో ఊరేగుతూ వినాయకుడ్ని భక్తజనం నిమజ్జనం చేశారు. తలపెట్టే పనిలో విఘ్నాలు లేకుండా చూడవయ్యా ఓ బొజ్జగణపయ్యా అంటూ తొమ్మిది రోజులు పూజించాక నిమజ్జనంతో ముగింపు పలికారు. వచ్చే ఏడాది ఇంతకు రెట్టింపుగా ఉత్సవాలు చేస్తామని మొక్కుకున్నారు. కానీ జనానికి సేవ చేయాల్సిన వాస్తవ వి‘నాయకులు’ మాత్రం వారి ఆశలను నట్టేట్లో నిమజ్జనం చేసేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఓటు దేవుళ్లుగా కొలిచే నాయకులు అడిగినవే కాకుండా అడగకపోయినా అవిచేస్తాం, ఇవి చేస్తామని గుక్కతిప్పకోకుండా వాగ్థానాలు గుప్పించేశారు. వారి మాటలు నమ్మి జనం ఓటేసి అందలమెక్కించారు. ‘ఓడ దాటే వరకు ఓడ మల్లన్న...దాటేశాక బోడి మల్లన్న’ అన్న చందంగా ప్రజాప్రతినిధులు అందలమెక్కాక వారి కష్టాలు కడతేర్చడం మాట అటుంచి కనీసం వారు మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించేస్తున్నారు. కొందరైతే తమ స్వార్థం కోసం కక్ష సాధించేందుకు వెనుకాడటం లేదు. మరి కొందరు ప్రజాప్రతినిధులు ప్రజాకంఠక పాలన సాగిస్తున్న తీరు జుగుప్స కలిగిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో తూర్పు సెంటిమెంట్‌గా తునికి ఒక ప్రత్యేక స్థానం, మంచి గుర్తింపు ఉంది. అటువంటి తునిలో అధికారపార్టీ నేతలు చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని పౌర హక్కులను కాలరాస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన రామకృష్ణుడు ఎమ్మెల్సీ అయి చంద్రబాబు కేబినెట్లో నెంబర్–2గా కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. మూడు దశాబ్థాల రాజకీయ జీవిత గమనంలో అనేక ఎత్తుపల్లాలు చూసిన యనమలను ఆ నియోజకవర్గ ప్రజలు రాముడనుకుని నెత్తిన పెట్టుకున్నారు. స్పీకర్, పీఏసీ చైర్మన్, పలు మంత్రిత్వశాఖలతో ఉన్నత పదవులు అలంకరించిన యనమల సొంత నియోజకవర్గ ప్రజలపై ప్రస్తుతం సర్కార్ కత్తి కట్టినట్టుగా వ్యవహరిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారనే కోపమో మరేదైనా కారణమో తెలియదు కానీ ఆ పార్టీ నేతలు అధికారం చేతిలో ఉందనే అహంతో అక్కడి ప్రజలపై కక్షకట్టేశారు. నియోజకవర్గంలోని తొండంగి మండలం తీర ప్రాంతంలో ఏర్పాటుచేయ తలపెట్టిన దివీస్ రసాయన పరిశ్రమ ప్రజల గుండెలపై కుంపటిగా మారింది. ప్రజా సంక్షేమం కోరే నేతలైతే అటువంటి కుంపటి నుంచి రక్షించాలి. అందునా ఇప్పుడు దివీస్‌తో నష్టపోయే వారిలో యనమల సొంత సామాజి వర్గీయులే ఎక్కువగా ఉన్నారు. అవసరమైతే వారి కోసం తనకున్న పలుకుబడిని ఉపయోగించి ప్రజలకు మంచి చేసి నియోజకవర్గంలో కోల్పోయిన ప్రాభవాన్ని అందిపుచ్చుకోవాలి. పరిశ్రమలు, దాని ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలను ఎవరూ కాదనరు. కానీ అక్కడి ప్రజల బెంగంతా ఆ పరిశ్రమ ద్వారా కలిగే భవిష్యత్ దుష్పరిణామాలపైనే. భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమయ్యాక తొండంగి తీర ప్రాంతంలో ప్రజలు స్వేచ్ఛగా తిరగడం, నలుగురు కూర్చుని రచ్చబండపై మాట్లాడుకోవడం ఎప్పుడో మానుకున్నారు. దివీస్ బాధితులకు అండగా నిలిచేందుకు వస్తున్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరించి సుమారు 200 మందిపై కేసులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. అధికారం ఉంది కదా అని పోలీసుల బలప్రయోగంతో ప్రజలు, ఉద్యమకారుల గొంతు నొక్కేసినంత మాత్రాన ఉద్యమం చల్లారిపోతుందనుకోవడం అవివేకమే. ఇందుకు తాజా ఉదాహరణ హైకోర్టు ఇచ్చిన తీర్పు. స్టేలో ఉన్న భూముల్లో భూ సేకరణ ఎలా చేస్తారంటూ న్యాయ స్థానం సర్కార్‌కు అక్షింతలు వేసిన తరువాత ఏదో పెద్ద మార్పును ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. ఎందుకంటే ఒకపక్క కోట్ల రూపాయల పెట్టుబడులతో సిద్ధంగా ఉన్న బడా కంపెనీ, మరోపక్క బక్కచిక్కిన సామాన్య రైతులు అటువంటప్పుడు చంద్రబాబు సర్కార్ అయినా, యనమల ద్వయమైనా ఎటువైపు మొగ్గుచూపుతారో ప్రజలకు తెలియంది కాదు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు -
ఖైదీతో ఆటా పాటా?
దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. వీవీ వినాయక్ దర్శకత్వంలో శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరిన్ ఐటెమ్ సాంగ్ చేయనున్నారని తాజా సమాచారం. వాస్తవానికి చిరూ సరసన తమన్నా ఐటెమ్ సాంగ్ చేయనున్నారని ఓ వార్త వినిపించింది. ‘తమన్నాతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది’ అంటూ గతంలో చిరు ఓ ఫంక్షన్లో చెప్పారు కూడా. దాంతో అందరూ ఐటెమ్ సాంగ్ చేసే అవకాశం తమన్నాకే ఉంటుందనుకున్నారు. కానీ, ఎవరి ఊహలకూ అందని విధంగా సీన్లోకి సడెన్‌గా కేథరిన్ పేరు వచ్చింది. త్వరలో చిరు, కేథరిన్ పాల్గొనగా హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్లో పాటను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
నిర్మాతగా మారుతున్న స్టార్ డైరెక్టర్
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులుగా ఉన్న చాలా మంది, నిర్మాతలుగా మారి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. మరో స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా అదే బాటలో నడవడానికి రెడీ అవుతున్నారు. అయితే మిగిలిన దర్శకుల్లా సినిమాతో కాకుండా ఓ ష్టార్ ఫిలింతో నిర్మాతగా మారుతున్నారు వినాయక్. ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి ఈ షార్ట్ ఫిలింను డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సిరా, మిథునం లాంటి సినిమాలతో దర్శకుడిగా ఎన్నో అవార్డులు అందుకున్న తనికెళ్ల భరణి, లాస్ట్ ఫార్మర్ పేరుతో ఓ షార్ట్ ఫిలింను రూపొందిస్తున్నారు. ఈ కథ నచ్చిన వినాయక్ తానే స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న వినాయక్, తాజాగా ఈ నిర్మాణ బాధ్యతలను కూడా తలకెత్తుకున్నారు. -
వినాయక విగ్రహాల తయారీ షురూ..!
-
మెగా 150లో విజయశాంతి
-
మెగా 150లో విజయశాంతి..?
మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఎప్పటికప్పుడు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. చాలా ఏళ్లుగా ఊరిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఇటీవలే పట్టాలెక్కింది. వినాయక్ దర్శకత్వంలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. అయితే తాజాగా మరో ఆసక్తి కరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తమిళ సినిమా కత్తికి రీమేక్ గా తెరకెక్కుతున్న మెగాస్టార్ 150వ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటించనుందట. 90లలో హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ జోడి మరోసారి తెరమీద కనిపించనుందన్న వార్త ఇప్పుడు మెగాఫ్యాన్స్తో పాటు సినీ వర్గాలను కూడా షాక్‌కు గురిచేస్తోంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమానే తన రీ ఎంట్రీకి కూడా కరెక్ట్ అని ఫీలవుతుందట. మెగాస్టార్ సినిమాలో విజయశాంతి నటిస్తుందన్న వార్తకు సంబందించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేక పోయినా.. మీడియా సర్కిల్స్‌లో మాత్రం ఈ గాసిప్ తెగ హడావిడి చేస్తోంది. మరి ఇప్పటికైన చిరు టీం ఈ వార్తలపై క్లారిటీ ఇస్తుందో లేక ఫ్రీ ప్రమోషన్ అన్న ఆలోచనతో వదిలేస్తుందో. -
విద్యార్థి దారుణ హత్య
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో ఓ కు గురయ్యాడు. గ్రామానికి చెందిన వినాయక అనే ఏడో తరగతి విద్యార్థి శుక్రవారం నుంచి కనిపించకుండాపోయాడు. దీంతో కుటుంబీకులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వాకబు చేసిన ఫలితం కనిపించలేదు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని గుట్టలో శవమై పడి ఉండగా స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు తెలిపారు. పాతకక్షల నేపథ్యంలో అతడిని ఎవరైనా చంపి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చిరు కోసం వినాయక్ రీసెర్చ్
ఇంతవరకు పట్టాలెక్కకపోయినా... చిరంజీవి 150 సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తూనే ఉంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని, గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ సినిమాను మించే స్థాయిలో రూపొందించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఠాగూర్ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్స్ అప్పట్లో సెన్సేషన్. అందుకే ఈ తాజా చిత్రంలోనూ అలాంటి డైలాగ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా ఠాగూర్ తరహా డైలాగ్ ను ప్లాన్ చేస్తున్నాడు వినాయక్. అందుకోసం భారీగా రీసెర్చ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల అప్పుడు, ఆత్మహత్యలు, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ కేటాయింపులు లాంటి విషయాలతో ఓ లెంగ్తీ డైలాగ్ ను రెడీ చేస్తున్నారు. మరీ డైలాగ్ కత్తిలాంటోడికి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. -
ఇక్కడకొస్తే మాస్టర్ని... అక్కడికెళ్తే డైరెక్టర్ని!
‘‘తమన్నాతో ఇంతకుముందు రెండు చిత్రాలు చేసిన అనుభవంతో చెబుతున్నా.. ‘అభినేత్రి’ టైటిల్ తనకు బాగా సూటవుతుంది. కోన వెంకట్ ఈ కథ విని, ఎగ్జయిట్ అయి నాకు ఫోన్ చేసి చెప్పాడు. నాక్కూడా కథ బాగా నచ్చింది. ప్రభుదేవాగారు హైదరాబాద్‌లో డ్యాన్స్ స్కూల్ పెట్టాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అభినేత్రి’. కోన ఫిలిం కార్పొరేషన్ పతాకంపై బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బిఎల్ఎన్ సినిమాతో కలిసి ఎంవీవీ సత్యనారాయణ తెలుగులో, ప్రభుదేవా తమిళ్లో, హిందీలో సోనూసూద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రభుదేవా మాట్లాడుతూ- ‘‘నేను హైదరాబాద్‌కొస్తే డ్యాన్స్‌మాస్టర్. ముంబయ్ వెళ్తే డైరెక్టర్ అనే ఫీలింగ్ నాలో ఉంటుంది. ఈ చిత్రకథ నచ్చడంతో తమిళంలో నేనే నిర్మిస్తున్నా. దర్శకుడు విజయ్ చెప్పినట్లు నటిస్తున్నా’’ అని చెప్పారు. ‘‘ప్రభుదేవాగారికి నేను ఓ కథ చెప్పేందుకు ముంబై వెళ్లా. నా కథ విన్న తర్వాత ఆయనో కథ చెప్పారు. నేను ఎగ్జయిట్ అయి నిర్మించాలనుకున్నా. మూడు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న చిత్రమిది’’ అని సమర్పకుడు కోన వెంకట్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘హాలీవుడ్ రైటర్ పాల్ లారెన్, నేను కలిసి రాసుకున్న కథ ఇది. గణేశ్‌గారు నన్ను నమ్మి, ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేలా సహకరించారు. ఇందులో కొత్త ప్రభుదేవాను చూస్తారు. తమన్నా కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయి అవుతుంది’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ- ‘‘నేను నటించిన మొదటి చిత్రం ‘శ్రీ’ కథ చెప్పేందుకు తొలిసారి కోన వెంకట్‌గారు నన్ను కలిశారు. అప్పట్నుంచి ఆయనతో నా పరిచయం కొనసాగుతోంది. కేవలం పది నిమిషాలు కథ విని, వెంటనే ఒప్పేసుకున్నా. ఇది హారర్ చిత్రం కాదు. ప్రభుదేవా ‘కింగ్ ఆఫ్ డ్యాన్స్ కాదు... గాడ్ ఆఫ్ డ్యాన్స్’ అనాలి’’ అని చెప్పారు. చిత్ర నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ, నిర్మాత డి.సురేశ్‌బాబు, రచయిత విజయేంద్రప్రసాద్, నటుడు సోనూసూద్, హాస్యనటుడు సప్తగిరి పాల్గొన్నారు. -
నిర్మాతగా మారుతున్న మరో స్టార్ డైరెక్టర్
టాలీవుడ్ హీరోలతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఆర్థికంగా స్థిరపడటానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే స్టార్ హీరోలందరూ నిర్మాణ రంగంపై దృష్టి పెట్టగా, సుకుమార్, పూరిజగన్నాథ్ లాంటి దర్శకులు కూడా నిర్మాతలుగా మారారు. ఇప్పుడు అదే బాటలో మరో స్టార్ డైరెక్టర్ కూడా నడవడానికి రెడీ అవుతున్నాడు. ఆది సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన వినాయక్ త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించనున్నాడట. అఖిల్ సినిమా రిజల్ట్ తో ఢీలా పడ్డ వినాయక్ ప్రస్తుతం, చిరు రీ ఎంట్రీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత తన సొంతం నిర్మాణ సంస్థ ద్వారా లో బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా త్వరలోనే వినాయక్ నిర్మాత గా మారే అవకాశం మాత్రం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
ఇష్టంగా.. సంతోషంగా.. ఆనందంగా..
తెలుగు సినీరంగంలో రచయితలుగా సక్సెస్ సాధించి చాలామంది ఆ తర్వాత మెగాఫోన్ పట్టి విజయాలనందుకున్నారు. ఇప్పుడు అదే బాటలో నడవడానికి మరో స్టార్ రైటర్ రెడీ అవుతున్నాడు. శ్రీను వైట్ల, వినాయక్ లాంటి దర్శకుల సినిమాలకు రచయితగా పనిచేసిన గోపి మోహన్ త్వరలోనే దర్శకత్వం వహించనున్నాడు. రెండేళ్ల క్రితమే ఈ విషయాన్ని ప్రకటించాడు గోపి మోహన్. సునీల్ హీరోగా, అనీల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కే సినిమాతో గోపిమోహన్ దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉంది. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సునీల్‌తో చేయాల్సి సినిమా ఆలస్యం కావటం, ఈలోగా సునీల్ కూడా వీరు పోట్లతో మరో సినిమా అంగీకరించటంతో, ఇప్పుడు మరో సినిమాకు దర్శకత్వం వహించే ప్రయత్నాల్లో ఉన్నాడు గోపిమోహన్. ఈ సినిమాకు 'ఇష్టంగా.. సంతోషంగా.. ఆనందంగా' అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫైనల్ చేశాడు. ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. రచయితగా భారీ విజయాలను అందించిన గోపిమోహన్ దర్శకుడిగా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
ఆదినా..? అదుర్సా..?
అఖిల్ సినిమా ఫెయిల్యూర్‌తో డీలా పడిపోయిన వినాయక్ తిరిగి సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చిరు 150వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిని ఈ మాస్ డైరెక్టర్ తన నెక్ట్స్ సినిమాల మీద కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వరుసగా రెండు భారీ ఫ్లాప్స్ తరువాత కూడా స్టార్ హీరోలతోనే వరుస సినిమాలు చేస్తున్నట్టుగా తేల్చేశాడు. అందుకే నాన్నకు ప్రేమతో ఆడియో వేడుకలో ఎన్టీఆర్‌తో త్వరలో సినిమా ఉంటుందంటూ ప్రకటించాడు. అల్లుడు శీను, అఖిల్ సినిమాలతో నిరాశపరిచిన వినాయక్, సినీ ప్రముఖులకు తనమీద ఉన్న నమ్మకాన్ని మాత్రం పొగొట్టుకోలేదు. అందుకే రెండు భారీ ఫ్లాప్‌ల తరువాత కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు. నాన్నకు ప్రేమతో ఆడియో రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్తోనే త్వరలోనే సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు ఆ సినిమా ఆది లేదా అదుర్స్ సినిమాలకు సీక్వల్ అయ్యే చాన్స్ ఉందంటూ హింట్ ఇచ్చాడు. -
అఖిల్ అంత రిస్క్ చేస్తాడా..?
తొలి సినిమా వైఫల్యంతో ఆలోచనలో పడ్డ అఖిల్ రెండో సినిమా విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. స్టార్ డైరెక్ట్లతో సినిమా చేయడానికి ఎవరూ అందుబాటులో లేకపోవడంతో.. మరోసారి రిస్క్ చేయాలా..? లేక వెయిట్ చేయాలా అన్న డైలమాలో ఉన్నాడు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో 'అఖిల్' సినిమాతో గ్రాండ్‌గా లాంచ్ అయిన అఖిల్ పర్సనల్‌గా మంచి మార్కులు సాధించినా.. కమర్షియల్‌గా మాత్రం ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాడు. తన రెండో సినిమాను త్రివిక్రమ్, సుకుమార్‌లలో ఒకరితో చేయాలని భావించినా, ఈ ఇద్దరు ఇప్పట్లో ఫ్రీ అయ్యే అవకాశం కనిపించటం లేదు. గౌతమ్ మీనన్ లాంటి క్లాస్ డైరెక్టర్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేసినా, అది కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఏ డైరెక్టర్‌తో సినిమా చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడు అక్కినేని నట వారసుడు. తాజాగా అఖిల్ నెక్ట్స్ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కెరీర్లో ఇప్పటివరకు ఒక్క భారీ కమర్షియల్ హిట్ కూడా లేని దేవ కట్ట దర్శకత్వంలో.. సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట అఖిల్. ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలతో నిరాశపరిచిన దేవాతో అఖిల్ సినిమా చేయటం రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. మరి అఖిల్ ఆ రిస్క్ చేయడానికి రెడీ అవుతాడో.. లేదో.. తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
చిరంజీవి సినిమాలో బాలీవుడ్ నటుడు
ఇటీవల రామ్‌చరణ్ మరోసారి చిరంజీవి 150వ సినిమాను తెర మీదకు తీసుకొచ్చాడు. కత్తి సినిమాను చిరు రీమేక్ చేయనున్నాడని, ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా ప్రకటించటంతో దాదాపుగా ఇదే ఖాయమని ఫీలవుతున్నారు ఫ్యాన్స్. అయితే మెగా క్యాంప్ మాత్రం ఇంత వరకు దీనిపై అధికారికంగా ఏమీ చెప్పలేదు. ప్రకటన రాకపోయినా సినిమా మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్గా తమన్నా గ్యారంటీ అన్న వార్త, కొద్ది రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తుండాగా, తాజాగా ప్రతినాయక పాత్రపై కూడా ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. తమిళ వర్షన్లో నీల్ నితిన్ ముఖేష్ నటించిన విలన్ పాత్రలో తెలుగు వర్షన్‌కు వివేక్ ఒబెరాయ్‌ని సెలెక్ట్ చేశారట. ఇప్పటికే రక్తచరిత్ర సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన వివేక్, ఈ సినిమాతో మరోసారి సౌత్ ఆడియన్స్ ను పలకరించనున్నాడు. -
'స్పీడున్నోడు'గా అల్లుడు శీను
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన తొలి సినిమాతో కమర్షియల్ హిట్ కొట్ట లేకపోయినా.. నటుడిగా మాత్రం మంచి మార్కులే సాధించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు శీను సినిమాలో యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్‌లు, ఫైట్స్ ఇరగదీసి కుర్ర హీరోలకు షాక్ ఇచ్చాడు. తొలి సినిమా ఫెయిల్యూర్‌తో ఆలోచనలో పడ్డ అల్లుడు శీను రెండు సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించి ఆగిపోవటంతో ప్రస్తుతం రీమేక్ స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన సుందర పాండియన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాకు స్పీడున్నోడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ముందుగా సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించినా, పెద్ద సినిమాల పోటి ఉండటంతో ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
చిరుతో కాదు, ఎన్టీఆర్‌తో..?
అఖిల్ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోవటంతో దర్శకుడు వివి వినాయక్ మళ్లీ ఆలోచనలో పడ్డాడు. అఖిల్ సినిమా సెట్స్ మీద ఉండగానే చిరంజీవి 150వ సినిమాను వినాయక్ డైరెక్ట్ చేయనున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా, ఖండించనూలేదు. దీంతో వినాయక్ తర్వాతి ప్రాజెక్ట్ చిరుతోనే ఉంటుందని భావించారు ఫ్యాన్స్. చిరు మాత్రం ఇంత వరకు తన ప్రతిష్టాత్మక చిత్రం ఎవరితో ఉంటుందన్న విషయాన్ని నిర్ణయించలేదు. పూరితో సినిమా ఉంటుందని తొలుత వార్తలు రాగా, తర్వాత వినాయక్ తో అని టాక్ వచ్చింది. అయితే వినాయక్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో టైం వేస్ట్ చేసుకోవటం ఇష్టం లేని వినాయక్ మరో హీరోతో సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడట. అందుకే ఆది, అదుర్స్ లాంటి భారీ విజయాలు సాధించిన ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. అఖిల్ సినిమా తరువాత రెండు నెలల పాటు సెలవు తీసుకుంటానని ప్రకటించిన వినాయక్, త్వరలోనే ఎన్టీఆర్‌కు కథ చెప్పాలని నిర్ణయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అదుర్స్ లాంటి భారీ విజయం తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో భారీ అంచనాలు ఉంటాయన్న ఉద్దేశంతో, ఆ అంచనాలను అందుకునే స్ధాయి కథ కోసం వేట ప్రారంభించారు. మరోసారి కామెడీ ఎంటర్టైనర్తో ఆడియన్స్‌ను మెప్పించే ఆలోచనలో ఉన్నాడు వినాయక్. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఆ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ (వర్కింగ్ టైటిల్)లో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యే సరికి పక్కా స్క్రిప్ట్ తో రెడీ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడట వినాయక్. -
'అఖిల్' మూవీ రివ్యూ
టైటిల్ : అఖిల్ జానర్ : రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : అఖిల్, సయేషా సైగల్, రాజేంద్ర ప్రసాద్, మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం : వి.వి. వినాయక్ నిర్మాత : శ్రేష్ట్ మూవీస్ సంగీతం : అనూప్ రుబెన్స్, థమన్ అక్కినేని వంశంలో మూడో తరం నట వారసుడిగా భారీ అంచనాల మధ్య తెరంగేట్రం చేసిన నటుడు అఖిల్. గతంలో ఏ హీరోకి రాని హైప్ అఖిల్ తొలి సినిమాకు వచ్చింది. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్‌తో అఖిల్ సినిమాను తెరకెక్కించారు. అఖిల్ లుక్కు తగ్గట్టుగా క్లాస్ రొమాంటిక్ సీన్స్ తో పాటు, వినాయక్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న అఖిల్ దీపావళి కానుకగా బుధవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. సోషియో ఫాంటసీ తరహా కథాంశంతో తెరకెక్కిన అఖిల్ ఆడియన్స్‌ను ఎంత వరకు మెప్పించింది. భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన అఖిల్ ఆ అంచనాలను అందుకున్నాడా..? కథ : అఖిల్ హ్యాపీగా జీవితాన్ని గడిపే ఓ సాదాసీదాకుర్రాడు. అలా జీవితం సాగిపోతున్న సమయంలో పిజి చదువుతున్న హీరోయిన్ సయేషాతో ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించి ప్రేమను గెలుచుకుంటాడు. ఇంతలో కొంత మంది రౌడీలు సయోషాను కిడ్నాప్ చేస్తారు. ఆమె కోసం వెతికే ప్రయత్నంలో ఆమె ఆఫ్రికాలో ఉందని తెలుసుకున్న అఖిల్ అక్కడికి వెళతాడు. తన ప్రియురాళిని కాపాడుకోవటానికి అక్కడి గిరిజనుల సాయం తీసుకుంటాడు. అసలు ఆ గిరిజనులు ఎవరు. సయేషాను విలన్లు ఎందుకు కిడ్నాప్ చేశారు. అక్కడికి వెళ్లిన అఖిల్ జీవితం ఎలా మారిపోయింది అన్నదే మిగతా కథ. నటీనటులు : అఖిల్ పూర్తి స్థాయి ఫాంటసీ కథాంశం కాకపోయినా, చిన్న ఫాంటసీ లైన్‌ను రియలిస్టిక్‌గా రూపొందించారు. ముఖ్యంగా అఖిల్ లాంచింగ్ సినిమా కావటంతో, కథా కథనాలు అన్ని అఖిల్ పాత్ర చుట్టూ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అఖిల్ కూడా తన మీద ఉన్న బాధ్యతకు పూర్తి న్యాయం చేశాడు. తొలి సినిమానే అయినా ఎక్కడ అలా కనిపించలేదు. డ్యాన్స్, ఫైట్స్ తో పాటు డైలాగ్ డెలివరీ బాడీలాంగ్వేజ్ వంటి విషయాల్లో కూడా మంచి ఈజ్ కనబరిచాడు. అయితే కామెడీ విషయంలో మాత్రం ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండనిపించింది. హీరోయిన్గా నటించిన సయేషా సైగల్ కూడా మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా డ్యాన్స్‌ల విషయంలో అఖిల్‌తో పోటి పడిన సయేషా మంచి మార్కులు సాధించింది. బ్రహ్మనందం, జయప్రకాష్ రెడ్డిల కామెడీ అలరిస్తుంది. ఇక రాజేంద్రప్రసాద్ మరోసారి ఆకట్టుకోగా, విలన్‌గా మహేష్ మంజ్రేకర్ తన మార్క్ చూపించాడు. సాంకేతిక నిపుణులు : తెర మీద అఖిల్ వన్ మేన్ షోలా సాగిన అఖిల్ సినిమా. తెర వెనుక వినాయక్ వన్ మేన్ షోలా సాగింది. ఎన్నో అంచనాలు ఉన్న అక్కినేని వారసున్ని వెండితెరకు పరిచయం చేసే భారీ బాధ్యతను తలకెత్తుకున్న వినాయక్ అందుకు తగ్గ స్ధాయిలో కష్టపడ్డాడు. ముఖ్యంగా తనకు బాగా పట్టున్న మాస్ యాక్షన్‌ను క్లాస్‌గా ప్రజెంట్ చేసి, స్టార్ వారసులకు గ్రాండ్ లాంచింగ్ ఇవ్వటంలో తాను స్పెషలిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. కథా కథనాల్లో ఎక్కడా పట్టు కోల్పోకుండా సినిమా అంతా చాలా ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించాడు. అనూప్, థమన్లు కమర్షియల్ నెంబర్స్‌తో అలరించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కెమెరా వర్క్ సూపర్ అనిపించింది. గతంలో ఎన్నడూ చూడని లొకేషన్స్‌లో షూట్ చేసిన చిత్రయూనిట్, ఆ ప్రాంతాలను గ్రాండ్‌గా ప్రజెంట్ చేశారు. అఖిల్, సయేషాలు తెర మీద చాలా అందంగా కనిపించారు. ఎడిటింగ్, కొరియోగ్రఫీ, యాక్షన్స్ సీన్స్ ఇలా అన్నీ అప్ టు ద మార్క్ గా ఉన్నాయి. విశ్లేషణ : అఖిల్ ఫాంటసీ కథాంశం కాకపోయినా.. చిన్న ఫాంటసీ ఎలిమెంట్‌ను పక్కా కమర్షియల్ జానర్లో ప్రజెంట్ చేశారు. అఖిల్ తొలి సినిమానే అయినా ఓ స్టార్ హీరో సినిమాలో ఉండే అన్ని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించారు. ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్ ఎపిసోడ్స్, యాక్షన్, డ్రామా ఇలా అన్ని రకాల సీన్స్‌తో అఖిల్ స్టామినా ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా కూడా అదే స్ధాయిలో వచ్చింది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంది. ప్లస్ పాయింట్స్ : అఖిల్ పర్ఫామెన్స్, డ్యాన్స్, యాక్షన్ వినాయక్ టేకింగ్ సినిమా నిడివి బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్ : రొటీన్ స్టోరీ లైన్ సెకండాఫ్ లో కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ ఓవరాల్‌గా 'అఖిల్' అక్కినేని అభిమానులకు ఫుల్ ట్రీట్, అఖిల్ కు పర్ఫెక్ట్ లాంచింగ్ -
అఖిల్‌ను చూసి ఆశ్చర్యపోయా!
‘‘ఏం జరిగినా మన మంచికే అంటారు. ఈ సినిమాను ముందు అనుకున్నట్లుగా దసరాకే విడుదల చేసి ఉంటే.. తక్కువ థియేటర్లు దొరికి ఉండేవి. దీపావళికి వాయిదా పడటంవల్ల ఎక్కువ థియేటర్లు దొరికాయి. ఈ చిత్రం రషెస్ చూసినవాళ్లు ‘పెద్ద హిట్’ అంటున్నారు’’ అని వీవీ వినాయక్ అన్నారు. అక్కినేని అఖిల్‌ని హీరోగా పరిచయం చేస్తూ వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మించిన ‘అఖిల్’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా వినాయక్‌తో జరిపిన ఇంటర్వ్యూ... నాగార్జునతో చేయకుండా డెరైక్టగా అఖిల్‌తో సినిమా చేసేశారు.. ఎలా అనిపిస్తోంది? వి.వి. వినాయక్: ఇప్పటివరకూ నాగార్జునగారితో సినిమా కుదరలేదు. అఖిల్‌తో అనుకోకుండా కుదిరింది. చిరంజీవిగారు, రాంచరణ్.. ఇలా రెండు తరాల హీరోలతో సినిమాలు చేశాను. మంచి కథ దొరికినప్పుడు తప్పకుండా నాగార్జునగారితో కూడా సినిమా చేస్తాను. మీరేమో పక్కా మాస్ డెరైక్టర్.. అఖిల్ ఏమో ఫుల్ మోడ్రన్‌గా ఉంటాడు. ఇద్దరికీ ఎలా సింక్ అయ్యింది? ఇది ఫుల్ మోడ్రన్ యాక్షన్ మూవీలా ఉంటుంది. వినాయక్ చాలా యూత్‌ఫుల్‌గా తీశాడని సినిమా చూసినవాళ్లు అంటారు. అఖిల్ పరిచయ చిత్రం చేయడంపై ఒత్తిడి ఫీలయ్యారా? ఒక స్టార్ హీరో కొడుకుని పరిచయం చేయడం అంటే కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. పైగా, నాగార్జునగారు ఓ వేడుకలో ‘నా కొడుకుని నీ చేతిలో పెట్టా’ అని చెప్పిన మాటలు నా బాధ్యతను మరింత పెంచాయి. గ్రాఫిక్స్ కుదరనందుకే విడుదల వాయిదా వేశారు కదా.. అది ఎవరి నిర్ణయం? అందరి నిర్ణయమే. ‘సినిమా మొత్తం బ్రహ్మాండంగా ఉంది కదా.. ఈ కొంచెం కూడా ఎందుకు వేరే విధంగా ఉండాలి’ అని నాగార్జునగారు కూడా అన్నారు. క్వాలిటీ బాగుండాలి కదా అని మళ్లీ గ్రాఫిక్స్ చేయించాం. రీ-షూట్స్ జరగలేదు. ఈ చిత్రం విడుదల వాయిదా పడిందని పెట్టిన ప్రెస్మీట్లో అఖిల్ పాల్గొనలేదు.. అప్పటివరకూ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉన్న తను ఆ తర్వాత అలా లేకపోవడానికి కారణం? దీన్ని ఓ పెద్ద ఇష్యూగా అందరూ అనుకుంటున్నారేమో. మాకైతే అస్సలు ఇది ఇష్యూ కానే కాదు. సినిమా విడుదల తేదీ ఖరారు కాగానే యాక్టివ్‌గా ఉండాలని అఖిల్ అనుకుని ఉంటాడు. ఇంతకూ అఖిల్ నటన గురించి ఏం చెబుతారు? అఖిల్ పూర్తిగా కొత్త స్టయిల్లో ఉంటాడు. కొన్ని మేనరిజమ్స్ నాగార్జునగారిలా ఉంటాయి. ఇంత బాగా డ్యాన్సులు, ఫైట్లు చేస్తున్నాడేంటి? అని ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్ కాంబినేషన్లో అఖిల్ బాగా చేశాడు. సెంటిమెంట్ కూడా అంతే బాగా చేశాడు. కచ్చితంగా తను పెద్ద స్టార్ అవుతాడు. ఇలా ఎందుకంటున్నానంటే.. ఇంట్రడక్షన్ సాంగ్‌కి ఫుడ్ తీసుకోకుండా మరీ ప్రాక్టీస్ చేశాడు. ఒకరోజు కళ్లు తిరిగి పడిపోయాడు కూడా. పని మీద అఖిల్‌కి ఉన్న శ్రద్ధ గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు. మహేశ్‌బాబుతో ఛత్రపతి శివాజీ తీయాలనుకుంటున్నారట? ఫలానా తరహా సినిమా అని ఇప్పుడే చెప్పను. వంద కోట్ల బడ్జెట్‌తో మహేశ్‌తో సినిమా తీయాలని ఉంది. కథ రెడీ అయ్యాక మొదలుపెడతాం. చిరంజీవి 150వ సినిమాకి మీరే డెరైక్టర్ అట? ఇంకా ఏం ఫైనలైజ్ కాలేదు. -
చాలామంది హీరోలు సుబ్బారావులే..!
సినిమాలతో కన్నా ట్విట్టర్ కామెంట్స్‌తోనే ఎక్కువగా వార్తల్లో కనిపించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ తెర మీదకు వచ్చాడు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా విమర్శనాస్త్రాలను సంధిస్తూ వస్తున్న వర్మ ఈ సారి మాత్రం ఓ కుర్ర హీరోను పొగడ్తలతో ముంచెత్తాడు. త్వరలో తన సినిమాలో హీరోగా నటించబోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్‌ను పొగుడుతూ తన మార్క్ ట్వీట్స్‌తో అలరించాడు వర్మ. 'రాజ్ తరుణ్ అద్భుతమైన నటుడు, అతనితో పోలిస్తే చాలా మంది హీరోలు సుబ్బారావులతో సమానం.' అంటూ కుర్రహీరోలకు చురకలంటించాడు. అంతటితో ఆగకుండా తన మాటల ప్రతాపాన్ని డైరెక్టర్ల మీద కూడా చూపించాడు.' రాజ్‌తరుణ్‌కి నటుడిగా కన్నా దర్శకుడిగా చాలా టాలెంట్ ఉంది, పూరి జగన్నాధ్, వివి వినాయక్, రాజమౌళి లాంటి దర్శకులకన్నా టాలెంటెడ్ దర్శకుడయ్యే స్థాయి ఉన్న కళాకారుడు' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సుకుమార్ నిర్మాతగా తెరకెక్కిన 'కుమారి 21ఎఫ్' సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్ త్వరలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూకీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా వర్మ చేసిన ట్వీట్స్ రాజ్ తరుణ్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి. I think Raj Tarun is a fantastic actor..compared to him most actors are Subba Raos — Ram Gopal Varma (@RGVzoomin) November 5, 2015 I truly think Raj Tarun more than an actor is potentially a much much greater director than me Poori,V V Vinayak, Rajmouli etc etc — Ram Gopal Varma (@RGVzoomin) November 5, 2015 -
అది... నా గర్ల్‌ఫ్రెండ్!
ఇంకొక పవర్ఫుల్ వారసుడు వచ్చాడండోయ్. అఖిల్ దిపవర్ ఆఫ్ జువ హీరోగా ‘అఖిల్’ ఎంట్రీకి స్వాగతం. ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి చాలా కసరత్తులు చేసినట్లున్నారు! అఖిల్: నిజమే. ‘మనం’ సినిమాలో చిన్న పాత్ర చేసిన తరువాత నేను ఒక జోన్లోకి వెళ్ళిపోయా. ఎలాంటి సినిమాలో పూర్తి స్థాయి పాత్ర చేయాలని తర్జనభర్జన పడ్డా. చాలా స్క్రిప్టులు విన్నా. చాలామంది దర్శకుల్ని కలిశా. ఆ టైమ్‌లో నాకు వినయ్ (దర్శకుడు వినాయక్) గారిలో కాన్ఫిడెన్స్, క్లారిటీ కనిపించింది. పైగా ఆయన ఎంచుకున్న ఇలాంటి స్క్రిప్ట్‌తో ఈ మధ్య ఎవరూ తీయలేదు. ఇలాంటి సినిమాతో హీరోగా వస్తే బాగుంటుందనిపించింది. పైగా, వినయ్ గారు మోస్ట్ సేఫ్ అండ్ కమర్షియల్ డెరైక్టర్. అందుకే, ఈ స్క్రిప్ట్‌తో ముందుకొస్తున్నాం. సర్వసాధారణంగా హీరోగా తొలి సినిమా... అందులోనూ మీ లాంటి కుర్రాళ్ళ మీద అంటే ప్రేమకథ తీస్తారు. భారీ ప్రాజెక్ట్ భుజానికెత్తుకున్నారు. బరువనిపించలేదా? అఖిల్: ఫలానా రకం సినిమా చేయాలని ముందే ఏమీ అనుకోలేదు. నా మనసుకు నచ్చాలి అనుకున్నా. ఈ స్క్రిప్ట్ నచ్చింది. ఎమోషనల్‌గా ఫీలయ్యా. అంతే... లవ్‌స్టోరీనా, యాక్షనా - అని చూసుకోలేదు. ఎప్పుడైనా ‘యు హ్యావ్ టు ఫాలో యువర్ హార్ట్’ కదండీ! ఏ మీ నాన్న గారి సలహాలు, సూచనలూ ఫాలో అయ్యారా? అఖిల్: కచ్చితంగా. నేనెప్పుడూ ఆయన ఎడ్వైజ్ తీసుకొంటా. ఈ కథ నాకు నచ్చాక, ఆయనకు కూడా వినిపించాం. ఆయన తన సూచనలు చెప్పారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని, షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు 8 నెలలు స్క్రిప్ట్‌పై వర్క్ చేశాం. అప్పుడు షూట్‌కు వెళ్ళాం. ఈ సినిమాతో వినాయక్‌లో కొత్త స్టైల్‌ను చూస్తామన్నారు. అఖిల్: ఆయన గత చిత్రాలతో చూస్తే, ఈ సినిమా కమర్షియల్‌గా ఉంటూనే కొత్తగా అనిపిస్తుంది. ట్రీట్మెంట్ కూడా ఎప్పుడూ ఉండే వినాయక్ సినిమాల పద్ధతిలో ఉండదు. పైగా, కొత్త టీమ్‌తో పనిచేయడం వల్ల వినయ్ గారి సినిమాకు ఫ్రెష్ లుక్ వచ్చింది. అందుకే, ‘అఖిల్’ను తెరపై డిస్కవర్ చేసే క్రమంలో తనను తాను రీ-డిస్కవర్ చేసుకున్నానని ఆయనే నాతో అన్నారు. ప్రతి రోజూ ఇక్కడ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాల్సిన ఈ రంగంలో ఆయన ఆ మాట అనడం హ్యాపీగా ఫీలయ్యా. క్రికెటర్ కావాల్సింది యాక్టరైనట్లున్నారు. అజరుద్దీన్, అంబటి రాయుడులా మరో మంచి క్రికెటర్‌గా వస్తారనుకున్నామే! అఖిల్: (నవ్వుతూ...) సినిమాలు వదిలేసి, క్రికెట్‌కు వెళ్ళిపొమ్మంటారా ఏమిటి! నిజానికి, క్రికెట్ నాకు బాగా ఇష్టం. ప్రొఫెషనల్‌గా క్రికెట్ నేర్చుకొని, ఆడాలనుకున్నా. దాన్ని సీరియస్‌గా తీసుకున్నా. అంతే తప్ప, నేషనల్ క్రికెటర్‌ను అవ్వాలనో, ఆ రంగంలో స్థిరపడాలనో ఎప్పుడూ అనుకోలేదు. నాకెప్పుడూ యాక్టింగ్ మీదే ఇంట్రస్ట్. పైగా, అక్కినేని లాంటి పెద్ద సినీ కుటుంబంలో పుట్టినప్పుడు మనకు తెలియకుండా చిన్నప్పుడే ‘నటన’ అనే పురుగు కుట్టేస్తుంది. అందుకే, ‘నువ్వేమవుతావు’ అని అడిగినప్పుడు ‘ఇంకేమవుతా... యాక్టర్‌నవుతా’ అని చెప్పేవాణ్ణి. కానీ అప్పట్లో ఆస్ట్రేలియాకు వెళ్ళి మరీ క్రికెట్ నేర్చుకున్నారుగా! అఖిల్: స్పోర్ట్స్ అంటే మొదటి నుంచీ నాకు ఇంట్రస్ట్. మన దగ్గర సౌకర్యాలు తక్కువ. కానీ, ఆస్ట్రేలియాలో అన్నీ ఉంటాయి. మా అమ్మ వాళ్ళ అన్నయ్య అప్పట్లో ఆస్ట్రేలియాలోని ‘నూసా’ అనే చోట ఉండేవారు. నా చిన్నప్పుడు సెలవులకు అమ్మ వాళ్ళతో కలసి వెళ్ళి, అక్కడ రెండు వారాలున్నా. ఆ ప్లేస్ నచ్చి, అక్కడే చదువుకుంటానన్నా. ఇంట్లో సరే అన్నారు. అలా పెర్త్‌లో అందరూ మగపిల్లలే ఉండే బోర్డింగ్ స్కూల్లో రెండేళ్ళు చదువుకున్నా. ఆ స్కూల్లో మధ్యాహ్నం 3 దాకా చదువులు. ఆ తరువాతంతా క్రికెట్ శిక్షణ. నేను రైట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ని. రైట్ ఆర్మ్ పేస్ బౌలర్‌ని. ఆస్ట్రేలియా క్రికెటర్ టామ్ మూడీ మా స్కూల్లోనే చదివారట! సినిమాల్లోకి రావడానికీ బాగా శిక్షణ తీసుకున్నట్లున్నారు! అఖిల్: అవునండీ! అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో బిజినెస్ స్టార్ట్ చేశా. ఏడాది తరువాత అది డిస్కంటిన్యూ చేసి, యాక్టింగ్‌లో రెండేళ్ళ పాటు డిప్లమా కోర్స్ చదివా. అప్పట్లో చాలా బిడియంగా ఉండేవాణ్ణి. ఆ షెనైస్ పోవడానికీ, మనసు విప్పి ఫ్రీగా అందరితో మాట్లాడడానికీ ఆ శిక్షణ ఉపయోగపడింది. అక్కడ థియేటర్ పెర్ఫార్మెన్స్లు వగైరా చేసి, కాన్ఫిడెన్స్ పెంచుకున్నా. మరి ఫైట్స్, డ్యాన్స్‌ల మాటేమిటి? అఖిల్: ఫైట్స్ విషయానికొస్తే, థాయిలాండ్‌లోని ‘కిచ్చా’ మాస్టర్ (‘ఇద్దరమ్మాయిలతో’, ‘కత్తి’ సినిమాల ఫేమ్) దగ్గర రెండు నెలలు సినిమా తరహా ఫైట్స్, రోప్ వర్క్ లాంటివి నేర్చుకున్నా. పంచ్‌లు రియల్ అనిపించేలా కనిపించడానికి ఏం చేయాలో తెలుసుకున్నా. ఇక, సినిమాకు కావాల్సిన మూడు, నాలుగు స్టైల్స్ ఆఫ్ డ్యాన్సెస్ కొంత నేర్చుకున్నా. ‘అఖిల్’ ప్రారంభం కావడానికి మూడు నెలల ముందు నుంచి సీరియస్‌గా ప్రాక్టీస్ చేశా. గణేశ్, శేఖర్, జానీ మాస్టర్ల దగ్గర ఎక్కువ నేర్చుకున్నా. ఒక పాటకు మీ స్టెప్పులు చూసి, నాన్నగారు థ్రిల్లయ్యారట? అఖిల్: ఆ ఇంట్రడక్షన్ పాటకి సెట్స్ వేశాం. చేయగలిగినదంతా చేశాం. మామూలుగా మూడున్నర నిమిషాల పాటలుంటాయి. హై ఎనర్జీతో సాగే ఆ పాట 5 నిమిషాలుంటుంది. అంతా డ్యాన్స్... డ్యాన్స్. పన్నెండు రోజులు షూట్ చేశాం. అది చూసి నాన్న చాలా మెచ్చుకున్నారు. ‘అఖిల్’లో కొత్తమ్మాయి సాయేషా ఎంపిక వెనక కారణం? అఖిల్: కథానాయిక పాత్ర కోసం ముగ్గురు, నలుగురు అమ్మాయిలతో నాకు టెస్ట్ షూట్ చేశారు. వాళ్ళందరిలోకీ బెస్ట్ - సాయేషానే. దిలీప్‌కుమార్ సతీమణి సైరాబానుకు మనుమరాలి వరస ఆమెది. ముంబయ్‌లోని క్యాస్టింగ్ ఏజెంట్ల ద్వారానే నిర్మాతలు ఆమెను చూశారు. లుక్ టెస్ట్ చేయగానే పర్ఫెక్టనిపించింది. ఒక్కరోజులో ఓకె చెప్పాం. కెమేరా ముందు మీరూ కొత్తే. అమ్మాయీ కొత్తే. మరి మీ మధ్య లవ్ కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి ఏం చేశారు? అఖిల్: ‘అఖిల్’ అవుట్ అండ్ అవుట్ లవ్‌స్టోరీ కాదు. సినిమాలో హై పాయింట్స్, ఎలివేటింగ్ ఎపిసోడ్స్, యాక్షన్ ఉంటాయి. ‘ఏం మాయ చేశావే’ లాంటి లవ్‌స్టోరీ అయితే, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇందులో ఆ అవసరం లేదు. కానీ, తెరపై మా జంట బాగుంటుంది. షి ఈజ్ వెరీ గుడ్ డ్యాన్సర్. ‘అఖిల్’ సోషియో - ఫ్యాంటసీ సినిమా అనీ... అఖిల్: (అందుకుంటూ...) అలా కాదు. అన్నోన్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. రియల్‌గా మనం చూస్తున్నవే ఉంటాయి. సూర్యుడు, సౌరశక్తి లాంటివాటి చుట్టూ ఆసక్తిగా సాగుతుంది. అందుకే, ‘ది పవర్ ఆఫ్ జువ’ అని క్యాప్షన్ పెట్టాం. ‘జువ’ అంటే సూర్యుడని అర్థం. సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసినప్పుడు మీ మానసిక స్థితి? అఖిల్: (గంభీరంగా మారి...) మానసిక ఒత్తిడి అనిపించింది. బాగా బాధపడ్డా. కానీ, అన్నీ మన చేతుల్లో ఉండవుగా. వాయిదా పడడం కూడా మంచికే జరిగింది. ఇప్పుడు మరింత బెటర్ ప్రొడక్ట్‌తో ముందుకొస్తున్నాం. అప్పుడు గ్రాఫిక్స్ తృప్తిగా రాలేదన్నారు. ఇప్పుడు తృప్తేనా? అఖిల్: చూడండి. గ్రాఫిక్స్ విషయంలో యు కెన్ నెవర్ బి శాటిస్ఫైడ్. వాటిని ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా మెరుగుపరుస్తూనే పోవచ్చు. ‘బాహుబలి’ ఆలస్యానికి కూడా కారణం అదే! ఒకే ఎఫెక్ట్ మీద రెండు నెలలు, రెండేళ్ళు, ఇరవయ్యేళ్ళు కూడా వర్క్ చేస్తూనే పోవచ్చు. కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది మనం తెరపై సృష్టించే వాతావరణం. ‘అఖిల్’లో అవన్నీ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. షూటింగ్లో మీ కష్టం చూసి తల్లి మనసు తల్లడిల్లిందా? అఖిల్: (నవ్వుతూ...) నేనేమీ... చచ్చిపోయేలా కష్టపడలేదండీ! బాగా కష్టపడి వచ్చినప్పుడు, నొప్పులు పోవడానికి మా అమ్మ ఐస్ బ్యాగ్ ఇచ్చేది. నటుడిగా నిరూపించుకోవడానికి నా కృషి, శ్రమ చూసి అమ్మ సంతోషించింది. అందరితో ఎప్పుడూ బాగా మాట్లాడే మీ అమ్మ గారు ఆడియో రోజున వేదికపై మాట్లాడడానికి మొహమాటపడ్డట్లున్నారు! అఖిల్: అవునండీ. షి ఈజ్ ఫీలింగ్ షై. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ, ఫ్యాన్స్‌కు ఉత్తేజం ఇవ్వాలి. అమ్మ అంత తెలుగు మాట్లాడలేదు. పైగా, మహేశ్, నాన్న, అన్నయ్య అంత మాట్లాడాక అమ్మ ఏం మాట్లాడుతుంది! అయినా, సినిమా ప్రారంభం రోజునే ‘మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నా’ అని ఫ్యాన్‌సకి చెప్పేసిందిగా! అక్కినేని కుటుంబ వారసుడిగా ఒత్తిడి చాలా ఉంటుందిగా.. అఖిల్: నేనే కాదు... ఒక స్టార్ కుటుంబం నుంచి వచ్చే ఎవరికైనా ఆ ప్రెజర్ ఉంటుంది. పాతికేళ్ళ తరువాత మహేశ్‌బాబు గారబ్బాయి గౌతమ్ హీరోగా వచ్చినా... అంతే! ఎందుకంటే, ఒకప్పటి కన్నా ఇప్పుడు మీడియా పెరిగింది. ప్రచారం బాగా వస్తోంది. అంచనాలు పెరిగిపోతాయి. అంతెందుకు... నాపై, నా సినిమాపై ఇంతగా అంచనాలొస్తాయని ఊహించలేదు. కానీ, ఏ స్టార్ కిడ్కైనా ఈ ఇబ్బంది తప్పదు. తట్టుకొని ముందుకెళ్ళాల్సిందే! కానీ, సినిమాకు మీ పేరే పెట్టడం మరీ ‘నార్సిసిజమ్’ (స్వయంప్రేమ, ఆత్మస్తుతి) అనిపించలేదా? అఖిల్: (గంభీరంగా...) మీకు అలా అనిపించిందా? అనిపించడమెలా ఉన్నా కొందరి గుసగుసలు వినిపించాయి! అఖిల్: ఈ సినిమాలో నా పాత్ర పేరు కూడా అఖిల్. అదే సినిమాకూ పెట్టాం. దానికి మంచి రెస్పాన్సొచ్చింది. బ్లాక్‌బస్టర్ ఇస్తానన్నమాట నిలబెట్టుకొనే రోజొచ్చినట్లుంది. అఖిల్: (నవ్వుతూ...) బ్లాక్‌బస్టర్ హిట్ కోరుకుంటున్నానని చెప్పా. అందు కోసమే అందరం శ్రమించాం. ప్రేక్షకుల ఆశీర్వాదమే ఇక మిగిలింది. హోపింగ్ ఫర్ ది బెస్ట్. ఇంతకీ, ఒక నటుడిగా ఇప్పుడు మీరు పెట్టుకున్న లక్ష్యం! అఖిల్: తొలి నాలుగైదు సినిమాలూ చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ మూడేళ్ళూ ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేస్తా. మరి, ‘అఖిల్’ తరువాతి ప్రాజెక్ట్ ఏమిటి? అఖిల్: ఆలోచనలు చాలా ఉన్నాయి. కానీ, అన్నీ ప్రస్తుతం ఆపి పెట్టా. ఇప్పుడు దృష్ట్టంతా ‘అఖిల్’ మీదే! మీ లుక్స్, స్టైల్ బాలీవుడ్‌కి సూపర్. మీకూ ప్లాన్లున్నాయట? అఖిల్: (నవ్వేస్తూ...) చాలా ప్లాన్స్ ఉన్నాయి. కానీ, ముందుగా నేను తెలుగు వాణ్ణి. మన దగ్గర ముందు బాగా పేరు తెచ్చుకోవాలి. ఆ తరువాతే ఏదైనా! ఇప్పటికీ నైట్ క్రికెట్ ఆడతాం! సినిమాల్లోకొచ్చినా క్రికెట్ మీద ఇప్పటికీ అదే ఇంట్రస్ట్. ఫ్రెండ్స్‌తో ఇప్పటికీ మాకు టీమ్ ఉంది. ఇప్పటికీ హైదరాబాద్‌లో రాత్రి ఫ్లడ్‌లైట్స్‌లో సీరియస్‌గా ఆడతాం. అదెక్కడన్నది అడక్కండి (నవ్వులు..) చాలా ‘క్రష్’లు ఉన్నాయి! గర్ల్‌ఫ్రెండ్స్, లవర్స్ లేరు. కానీ అందరి లానే నాకూ చిన్నప్పటి నుంచి చాలామంది మీద ‘క్రష్’లు (తెలియని ఆకర్షణ) ఏర్పడ్డాయి. నాకు ప్రపోజ్ చేసినవాళ్ళూ ఉన్నారు. అవన్నీ అందరి లైఫ్‌లో ఉండేవే. దీపికా పదుకొనే కనపడితే... దీపికా పదుకొనే అంటే చాలా ఇష్టం. కలవలేదు కలిస్తే ‘అయామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు’ అని చెప్పేస్తా. ఆమె సినిమాల్లో ‘పీకూ’, ‘యే జవానీ హై దివానీ’ ఇష్టం. ఆమె నటన సహజంగా ఉంటుంది. తాత గారిలో అది నచ్చేది! తాత గారిని చూసి, విని, గమనించి ఎన్నో తెలుసుకున్నా. ముఖ్యంగా, అవతలి వ్యక్తి హోదాతో సంబంధం లేకుండా అందరితో ఆదరంగా మాట్లాడేవారు. అది నేనూ అలవరచుకోవాలని ఉంది. స్నేహమేరా జీవితం! కెరీర్ ఎంత ముఖ్యమో, పర్సనల్ లైఫ్, స్నేహం అంతే ముఖ్యమని నా అభిప్రాయం. ఎమోషనల్‌గా డిపెండ్ అవడానికీ, మనసులో మాట పంచుకోవడానికీ మంచి స్నేహితులు కావాలి. ఫ్రెండ్స లేకుండా నేనుండలేను. సినీ పరిశ్రమలో నితిన్ నా బెస్ట్ ఫ్రెండ్. రామ్‌చరణ్ కూడా మంచి ఫ్రెండ్. అయితే, అవుట్‌సైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీనే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. అలా నలుగురు మంచి ఫ్రెండ్స్ చాలాకాలంగా ఉన్నారు. షూటింగ్ లేకుండా నేను ఖాళీగా ఇంట్లో ఉన్నానూ అంటే... వాళ్ళలో కనీసం ఒకరైనా మా ఇంట్లో ఉండాల్సిందే. వాళ్ళతోనే నా కాలక్షేపం. మేమిద్దరం ఆ క్యాంప్‌లో కలిశాం! నా వెంటే కనిపించే రతుల్ నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకడు. క్రికెట్ ఆడుతున్న రోజుల నుంచి పరిచయం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ) పెట్టిన క్యాంప్‌లో కలిశాం. అప్పటి నుంచి మా బంధం బలపడింది. మా జర్నీ సాగుతోంది. వాళ్ళంతా భలే స్వీట్! ‘అఖిల్’ ఆడియో లాంచ్‌కి మై బిగ్గెస్ట్ హీరో సచిన్ టెండూల్కర్‌తో సహా ప్రముఖులు నాకు బెస్ట్ విషెస్ చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. అమితాబ్జీ అంటే మా కుటుంబం మొత్తానికీ ఎంతో గౌరవం. ఆయనా మాట్లాడారు. ఒక ఫంక్షన్లో కలిసిన సల్మాన్‌ఖాన్ భాయ్ అయితే, ట్రైలర్ లాంచ్ చేస్తానంటూ సపోర్ట్‌గా నిలిచారు. మహేశ్‌బాబు గారైతే, ఆడియోకి వీడియోలో మాట్లాడమని అడిగితే, ‘స్వయంగా వస్తా’ అంటూ ఫంక్షన్‌కొచ్చారు. ఇలాంటి పెద్దవాళ్ళ మంచి మనసు, ప్రవర్తన స్వీట్‌గా అనిపించింది. రీమేక్ చేయను! రీమిక్స్ అనుకున్నా! తాత గారి సినిమాల్లో ‘దొంగరాముడు’, నాన్న గారి సినిమాల్లో ‘హలో బ్రదర్’ ఇష్టం. కానీ, ఏదీ రీమేక్ చేయను. జనం మెచ్చిన ఆ కథలు, సినిమాలను చెడగొట్టడం నాకిష్టం లేదు. కాకపోతే, ఒక హిట్ పాట ఈ సినిమాలో రీమిక్స్ చేయాలని అనుకున్నాం. కానీ, చివరకు వద్దనుకున్నాం. నేనే షూట్ చేసి, డబ్బింగ్ చెప్పేవాణ్ణి! తెలుగు నేర్చుకున్నా. చదవడం, రాయడం వచ్చు. మీ పేపర్, ఈ ఇంటర్వ్యూ చదువుతా! (నవ్వు...) కానీ, నటించడం ఒక ఎత్తు. డబ్బింగ్ చెప్పడం ఇంకో ఎత్తు. ఎవరైనా సరిగ్గా మాట్లాడలేకపోతే తెరపై చూస్తున్నప్పుడు నాకు చిరాకు అనిపించేది. అందుకే, ఉచ్చారణపై పట్టు కోసం కష్టపడ్డా. నేనే కొన్ని సీన్స్ షూట్ చేసుకొని, అన్నపూర్ణా స్టూడియోలో వాటికి డబ్బింగ్ చెప్పుకొనేవాణ్ణి. సీన్ రాసుకొని, వాయిస్ ఓవర్లా ఎమోషన్స్‌తో పలికేవాణ్ణి. దర్శకుడు దేవా కట్టా నాకు హెల్ప్ చేశారు. నాతో నేను గడుపుతా! షూటింగ్ లేకపోతే లేట్‌గా నిద్ర లేస్తా. ఏ పనీ చేయకుండా, అలా మ్యూజిక్ వింటూ, టీవీ చూస్తూ ఉంటా. అలా ఏమీ చేయకుండా, టీవీ చూడడం కూడా నాకు రిలాక్స్ అవడమే! ఎక్కువగా నాతో నేను గడుపుతా. బ్లాక్ అండ్ ఎయిట్! నేను పుట్టింది 1994 ఏప్రిల్ 8న. అందుకే, నంబర్ 8 అంటే నాకు ఫేవరెట్. నా ట్విట్టర్ ఎకౌంట్ కూడా ‘అఖిల్ అక్కినేని8’ అని ఉంటుంది. ఇక, నాకిష్టమైన కలర్ బ్లాక్. ఆ రంగు డ్రెస్లెక్కువ వేసుకుంటా. అమ్మాయిల్లో నచ్చేది... అఫ్కోర్స్... అందం, ఆకర్షణ ఉండాలని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అమ్మాయిల్లో నాకు బాగా నచ్చేది - జెన్యూనిటీ. మాటలో, మనిషిలో నిజాయతీ ఉంటే... నేను కనెక్ట్ అవుతాను. అది... నా గర్ల్‌ఫ్రెండ్! అన్నయ్యకు బైక్‌లంటే ఇష్టం. నాకు వాచ్‌లంటే చాలా ఇష్టం. మా ఇంట్లో చాలా వాచ్‌లున్నాయి. అదో పెద్ద కలెక్షన్. బ్రాండ్స్ పేరు చెప్పను కానీ, నిజం చెప్పాలంటే, (చేతికి ఉన్న గడియారాన్ని కదుపుతూ...) మై వాచ్ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్! - రెంటాల జయదేవ -
మరోసారి ఐటమ్ నంబర్లో..
పదేళ్ల సినీ కెరీర్లో ఒకే ఒక్కసారి స్పెషల్ సాంగ్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా, మరోసారి అదే సాహసానికి రెడీ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయిన అల్లుడు శీను సినిమా కోసం స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది ఈ బ్యూటీ. అయితే కొత్త హీరోతో చిందేసినందుకు భారీ మొత్తాన్నే రెమ్యూనరేషన్‌గా అందుకుంది. అప్పట్లో కెరీర్ ఆశించిన స్ధాయిలో లేదు కాబట్టి ఐటమ్ నంబర్‌ను కూడా ఓకే చేసింది తమన్నా. ఇప్పుడు పరిస్థితులు వేరు, బాహుబలి రిలీజ్ తరువాత తమన్నా క్రేజ్ భారీగా పెరిగింది. నేషనల్ లెవల్లో తమన్నా అందాలకు మంచి మార్కులు పడ్డాయి. అలాంటిది ఈ సమయంలో కూడా ఐటమ్ సాంగ్ చేసేందుకు రెడీ అవుతోంది. మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కోసమే ఈ స్టార్ హీరోయిన్ ఐటమ్ బ్యూటీగా మారనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న శ్రీనివాస్ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించిన చిత్రయూనిట్ భారీ ఆఫర్‌తో తమన్నా డేట్స్ తీసుకున్నారట. వివి వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అల్లుడు శీను ఆశించిన స్ధాయి విజయం సాధించకపోవటంతో, ఈసారి రీమేక్ సినిమాను నమ్ముకున్నాడీ యువ హీరో. తమిళంలో ఘనవిజయం సాదించిన సుందరపాండియన్ సినిమాను భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. -
అందుకే అఖిల్ విడుదల వాయిదా వేశాం!
‘‘మా రెండో అబ్బాయి అఖిల్‌ని హీరోగా ఎప్పుడెప్పుడు తెరపై చూసుకుందామా? అని ఆత్రంగా ఎదురు చూశా. నేను రషెస్ చూశా. ప్రేక్షకుల నుంచి కూడా ‘బాగుంది’ అనే మాట వినడం కోసం వెయిటింగ్. ఈ నెల 22న వింటాననుకున్నాను. కానీ, విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది’’ అని నాగార్జున అన్నారు. అఖిల్‌ని హీరోగా పరిచయం చేస్తూ వీవీ వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మించిన చిత్రం ‘అఖిల్’. విజయదశమి పర్వదినాన ఈ నెల 22న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. దీనికి కారణాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాగార్జున చెబుతూ - ‘‘సినిమాలో అఖిల్ డ్యాన్సులు చూసి షాకయ్యాను. ఇంటికెళ్లాక ఐదు నిముషాలు అఖిల్‌నే చూస్తుండిపోయాను. నా ఇంట్లో ఇంత మంచి డ్యాన్సర్ తిరుగుతున్నాడా? అనిపించింది. ఎప్పుడు నేర్చుకున్నావురా? అని అడిగాను. సినిమా మొత్తం బాగా వచ్చింది. కానీ, ఒక ఎపిసోడ్‌కు సంబంధించి గ్రాఫిక్స్ సరిగ్గా కుదరలేదు. ఆ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, బాగా కుదిరాకే విడుదల చేద్దామనుకున్నాం. వాయిదా వేయడానికి కారణం ఇదే. గ్రాఫిక్స్ బాగా రావాలనే ఆకాంక్షతో రాజమౌళి ‘బాహుబలి’ కోసం ఏడాదిన్నర తీసుకున్నారు. ఆ చిత్రంలోని గ్రాఫిక్స్ మన తెలుగు సినిమా స్టాండర్డ్‌ను పెంచింది. ఆ స్టాండర్డ్ తగ్గకూడదనే సినిమా విడుదలను కూడా వాయిదా వేసుకున్నాం. అభిమానులకు బాధగానే ఉంటుంది. నాకు కూడా చాలా బాధగానే ఉంది. కానీ, అన్నీ బాగుండాలి కదా. వాయిదా వేయాలనే విషయాన్ని అఖిల్‌కి నేనే స్వయంగా చెప్పాను. ‘మీ ఇష్టం నాన్నగారూ! మీకెలా అనిపిస్తే అలా’ అని చాలా ప్రశాంతంగా, పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు అభిమానులు నిరాశపడతారు కానీ, రేపు విడుదల తర్వాత సినిమా చూసి చాలా ఆనందపడతారు’’ అన్నారు. విజయదశమి వంటి మంచి రోజు నాడు విడుదల మిస్ కావడంపై మీ అభిప్రాయం ఏమిటనే ప్రశ్నకు - ‘‘ఏడాదిలో బోల్డన్ని మంచి రోజులుంటాయి. ఓ మంచి రోజు వెతుక్కుని రిలీజ్ చేస్తాం. అయినా అఖిల్ సినిమా ఎప్పుడు విడుదలైతే అప్పుడే మంచి రోజు (నవ్వుతూ...). వాయిదా పడినంత మాత్రాన సినిమా క్రేజ్ పెరుగుతుందే తప్ప తరగదు’’ అన్నారు. ‘‘నాగార్జున గారి అభిమానులకు క్షమాపణలు. గ్రాఫిక్స్‌కి ఇంకాస్త టైమ్ ఇస్తే బాగుంటుందనే వాయిదా వేశాం. ఈ చిత్రంలో అఖిల్‌ని చూసి ఫ్యాన్స్ ఆనందపడతారు’’ అని వినాయక్ చెప్పారు. ‘‘ఎప్పుడు రిలీజైనా ఈ సినిమా సూపర్‌హిట్ అని ఘంటాపథంగా చెబుతున్నా’’ అని నిర్మాత సుధాకర్‌రెడ్డి అన్నారు. -
'అఖిల్' వాయిదా
అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న తొలి సినిమా 'అఖిల్'. మాస్ స్పెషలిస్ట్ వివి వినాయక్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ సినిమా అనుకున్నట్టుగా దసరాకు రిలీజ్ కావటం లేదు. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న అఖిల్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అఖిల్ ఇంట్రడ్యూసింగ్ సినిమా కావటంతో త్వరగా పని పూర్తిచేసి రిలీజ్ చేయడం కన్నా, పూర్తి క్వాలిటీతో రిలీజ్ చేయాలని భావించిన యూనిట్.., ఆలస్యం అయినా గ్రాఫిక్స్ క్వాలిటీ బాగా వచ్చాకే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. యంగ్ హీరో, అఖిల్ సినిమా నిర్మాత నితిన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో ప్రకటించారు. 'గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అయిన కారణంగా అనుకున్న సమయానికి అఖిల్ సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం, కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తాం.. సారీ ' అంటూ తన ట్విట్టర్ లో అభిమానులకు మెసేజ్ ఇచ్చాడు. Due to delay in graphics work v r unable to release AKHIL on oct22nd..sorry for the delay..will announce the new release date soon..sorry.. — nithiin (@actor_nithiin) October 15, 2015 -
అఖిల్.. 'సూర్య కవచం'
అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామా అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. యంగ్ హీరో నితిన్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'అఖిల్' సినిమాలో సయెషా సైగల్ హీరోయిన్గా నటిస్తోంది. తొలి సినిమాతోనే రికార్డ్ కలెక్షన్ల మీద కన్నేసిన అఖిల్, ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రమోషన్ ముగించుకొని వచ్చిన అఖిల్ ప్రస్తుతం తమిళ మార్కెట్ మీద దృష్టి పెట్టారు. తెలుగులో 'అఖిల్' పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు తమిళ్ లో వేరే టైటిల్ ను ఫైనల్ చేశారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథా కథనాలకు తగ్గట్టుగా 'సూర్య కవచం' అనే టైటిల్ ను తమిళ వర్షన్‌కు ఫిక్స్ చేశారు. -
ఆమె తప్ప అందరూ సిస్టర్సే!
-
ఆమె తప్ప అందరూ సిస్టర్సే!
‘‘భారతీయులందరూ నా సోదరీసోదరులు. కానీ, ఒక్క అమ్మాయి తప్ప’’ అని అంటున్నారు హీరో సందీప్ కిషన్. ఆయన హీరోగా రూపొందుతున్న ‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప’ అనే చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ- ‘‘తన లవ్‌స్టోరీ కోసం హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే కథాంశంతో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘ఈ కథను మూడేళ్ల క్రితమే సందీప్‌కు చెప్పాను. ఈ నెల 10న షూటింగ్ ప్రారంభించి, డిసెంబరులో పూర్తి చేస్తాం. కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు, సంగీతం: మిక్కీ జె మేయర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆళ్ల రాంబాబు. -
ఫ్లాప్ దర్శకులకు చరణ్ చేయూత
టాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ వెంటే పరిగెడుతుంది అన్న మాట నిజమే.. అయితే అందరి విషయంలో ఈ మాట నిజం కాదు. కరెక్ట్‌గా కథ చెప్పగలిగితే ఫ్లాప్ దర్శకులతో కూడా పని చేయడానికి రెడీ అవుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అంతేకాదు అలా ఫ్లాప్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా సాదిస్తున్నాడు. తన కెరీర్ స్టార్టింగ్ నుంచే ఈ ఫార్ములా ఫాలో అవుతున్న చెర్రీ మంచి రిజల్టే సాదిస్తున్నాడు. ముఖ్యంగా ఒక ఫ్లాప్ తీసిన దర్శకుడు నెక్ట్స్ సినిమాను ఎలాగైన సక్సెస్ చేయాలన్న కసితో చేస్తాడు కనుక చరణ్ కెరీర్లో ఈ ఫార్ములు ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్‌నే ఇచ్చింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బద్రినాద్ సినిమాతో తన కెరీర్లో బిగెస్ట్ ఫ్లాప్‌ను ఫేస్ చేశాడు వినాయక్.. ఈ ఎఫెక్ట్‌తో వినాయక్ కెరీర్లో లాంగ్ గ్యాప్ తప్పలేదు. అయితే కష్టాల్లో ఉన్న సమయంలో వినాయక్‌కి సినిమా ఇచ్చి ఆదుకున్నాడు చెర్రీ.. బద్రినాథ్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత చరణ్ హీరోగా నాయక్ సినిమా చేశాడు. అప్పటికే చరణ్‌కు ఉన్న భారీ మాస్ ఇమేజ్‌తో నాయక్ మంచి విజయం సాధించింది. 40 కోట్లకు పైగా వసూళు చేసి చరణ్‌తో పాటు వినాయక్ కెరీర్లో కూడా బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. చాలా ఏళ్లుగా హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న కృష్ణవంశీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి రామ్ చరణ్‌నే నమ్ముకున్నాడు. పైసా, మొగుడు లాంటి వరుస డిజాస్టర్లతో కెరీర్ కష్టాల్లో పడ్డ సమయంలో బిగ్ స్టార్‌తో సినిమా చేస్తే తప్ప కెరీర్ గాడిలో పడదని, యంగ్ హీరోలను పక్కన పెట్టేశాడు. రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే సినిమాను తెరకెక్కించిన కృష్ణవంశీ మంచి సక్సెస్ సాదించాడు. కృష్ణవంశీ మార్క్ ఫ్యామిలీ డ్రామతో పాటు, చెర్రీ మార్క్ కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్న ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవటంతో పాటు వసూళ్ల పరంగా కూడా సత్తా చాటింది. శ్రీనువైట్ చేసిన అన్ని సినిమాల్లోకి బిగెస్ట్ ఫ్లాప్ ఆగడు.. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఒక్కసారిగా శ్రీనువైట్ల కెరీర్‌ను డైలామాలో పడేసింది. ఈసినిమా రిజల్ట్ తో ఇక శ్రీనువైట్లకు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తుందా అని భావించారు అంతా. ఇలాంటి సమయంలో కూడా శ్రీనువైట్లతో సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఆగడు సినిమా కన్నా ముందే ఇచ్చిన కమిట్ మెంట్ కావటంతో ఆ సినిమా రిజల్ట్ తో సంబందం లేకుండా బ్రూస్లీ సినిమాకు అంగీకరించాడు. తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతాడన్న టాక్ వినిపిస్తుంది. త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు చెర్రీ. కిక్ 2 సినిమాతో భారీ డిజాస్టర్ ను ఫేస్ చేసిన సురేందర్ రెడ్డి చరణ్ తో సినిమా చేస్తున్నాడన్న వార్త బలంగా వినిపిస్తుంది. తనీ ఒరువన్ రీమేక్ గా తెరకెక్కనున్న కొత్త సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు చరణ్. -
అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ
తొలి సినిమా రిలీజ్ కూడా కాకముందే అక్కినేని అఖిల్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయం అవుతున్న అఖిల్, తొలి ప్రయత్నంలోనే సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఓ డెబ్యూ హీరో గతంలో ఎన్నడూ చేయని విధంగా భారీ బిజినెస్ చేసి రికార్డ్ సృష్టించిన సిసింద్రి, ఆ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీకి కూడా రెడీ అయిపోతున్నాడు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అఖిల్ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఇప్పటి వరకు చర్చల దశలోనే ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ రానుంది. అనుకున్న విధంగా అఖిల్ సినిమా ఘనవిజయం సాధిస్తే 'అఖిల్' హీరోగా ఆ సినిమాను బాలీవుడ్ రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే టైటాన్ వాచెస్, మౌంటెన్ డ్యూ లాంటి యాడ్స్‌తో నార్త్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడయ్యాడు అఖిల్. దీంతో బాలీవుడ్ ఎంట్రీకి ఇదే సరైన సమయం అని భావిస్తుంది అక్కినేని కుటుంబం. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్న అఖిల్ సినిమాను వివి వినాయక్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తమన్, అనూప్ రుబెన్స్ లు సంగీతం అందిస్తుండగా మణిశర్మ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. -
అఖిల్ ఆడియోకు రికార్డ్ రేటు
అక్కినేని నటవారసుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న తొలి సినిమా రిలీజ్‌కు ముందు నుంచే సంచలనాలను నమోదు చేస్తుంది. గతంలో ఏ హీరో తొలి సినిమాకు లేని విధంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా అదే స్ధాయిలో 40 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. స్టార్ మేకర్ వినాయక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ఈ హైప్ అఖిల్ సినిమా బిజినెస్ మీద కూడా బాగానే ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే సినిమా బిజిసెన్ కూడా పూర్తవ్వటంతో నిర్మాతలు చాలా హ్యాపిగా ఉన్నారు. దీనికి తోడు తాజాగా ఆడియో రిలీజ్ హక్కుల విషయంలోనూ అదే జోరు చూపించాడు అఖిల్.. గతంలో అత్యంత భారీ వ్యయానికి ఆడియో రిలీజ్ హక్కులను అమ్మిన రికార్డ్ ఇండియాస్ బిగెస్ట్ మోషన్ పిక్చర్ బాహుబలి పేరిట ఉంది. బాహుబలి తరువాత స్థానంలో నిలిచాడు అఖిల్. దీంతో తొలి సినిమాతోనే ఈ ఘనత సాదించిన హీరోగా రికార్డ్ సృష్టించాడు. యంగ్ హీరో నితిన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సయేషా సెహగల్ అఖిల్ సరసన హీరోయిన్ గానటిస్తుంది. తమన్‌తో పాటు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20 రిలీజ్ కానుంది. -
అఖిల్ కోసం కర్చీఫ్ వేసిన నిర్మాత
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న సినిమా అఖిల్.. అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వివి వినాయక్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మరో యంగ్ హీరో నితిన్... శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే అఖిల్ చేయబోయే నెక్ట్స్ సినిమా చర్చ మొదలైంది. కామెడియన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బడానిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఈ చర్చకు తెర తీశాడు. ఇప్పటికే అఖిల్ తన తదుపరి చిత్రానికి బండ్ల గణేష్‌కు డేట్స్ కూడా ఇచ్చాడన్న టాక్ వినిపిస్తుంది. అయితే సినిమా విడుదలకు ముందు భారీ బిజినెస్ చేయగలిగే క్రేజీ కాంబినేషన్లను సెట్ చేయటంలో గణేష్ స్పెషలిస్ట్. అందుకే రెండో చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మాణంలో అయితే ద్వితియ విఘ్నాన్ని ఈజీగా దాటేయవచ్చని ఫీల్ అవుతున్నాడట అఖిల్. బండ్ల గణేష్ కూడా ఓ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన కొరటాల శివతో అఖిల్ సినిమాను డైరెక్ట్ చేయించాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమంతుడు తరువాత ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయని కొరటాల ఈ ప్రాజెక్ట్ మీద సుముఖంగానే ఉన్నాడట. మరి ప్రభాస్, మహేష్‌ల కోసం ఫ్యామిలీ యాక్షన్ కథలను సెట్ చేసిన శివ... అఖిల్ ఎలా చూపిస్తాడో చూడాలి. -
మహేష్‌తో వినాయక్ 100కోట్ల బడ్జెట్ సినిమా
-
అమ్మ తోడు... రికార్డుల్ని అడ్డంగా నరికేశాడు!
సినిమా వెనుక స్టోరీ - 5 స్విట్జర్లాండ్‌లోని ఓ హోటల్. పార్కింగ్ ఏరియాలో ‘స్టూడెంట్ నెం.1’ సినిమా యూనిట్ అంతా ఎయిర్పోర్టుకెళ్లడానికి బస్సు కోసం వెయిటింగ్. పది రోజులుగా ఆ చుట్టుపక్కల పాటలు చిత్రీకరించారు. పాటలు బాగా రావడంతో ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అక్కడున్న రాడ్ పట్టుకుని ఊగుతూ పాటలు హమ్ చేసుకుంటున్నాడు. తననెవరో పిలుస్తున్నట్టు అనిపించి వెనక్కు తిరిగి చూశాడు. ఇద్దరు వ్యక్తులు. తెలిసినట్టే ఉన్నారు. తెలియనట్టూ ఉన్నారు. ‘‘నన్ను గుర్తుపట్టారా? నేను బుజ్జిని. ‘నిన్ను చూడాలని’ మార్నింగ్‌షో గుంటూరులో చూసి ఫోన్ చేశాను కదా’’ అని గుర్తుచేశాడు బుజ్జి. ఎన్టీఆర్‌కి గుర్తొచ్చినట్టే అనిపించింది. బుజ్జి తన పక్కన ఉన్నతన్ని పరిచయం చేస్తూ ‘‘ఇతను వీవీ వినాయక్. సాగర్ గారి దగ్గర అసోసియేట్‌గా చాలా కాలం పనిచేశాడు. ఇప్పుడు ‘చెప్పాలనివుంది’ సినిమాకి చంద్రమహేశ్ దగ్గర కో-డెరైక్టర్‌గా చేస్తున్నాడు. పాటల షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాం. మీకు సరిపడే కథ ఒకటి ఉంది. వింటారా?’’ అని టకటకా చెప్పుకొచ్చేశాడు బుజ్జి. ఇలా కథలు చెబుతానన్న వాళ్లను ఈ రెండు సినిమాల టైమ్‌లోనే చాలామందిని చూశాడు ఎన్టీఆర్. పైగా, కొత్త డెరైక్టర్! ఎంతవరకూ నమ్మగలడు? వినాయక్‌ను చూస్తేనేమో రౌడీలా ఉన్నాడు. సినిమా తీసే రకమేనా? అనుకున్నాడు. అందుకే ఎవాయిడ్ చేయాలనుకున్నాడు. ‘‘హైదరాబాద్ వచ్చాక కలవండి’’ అని వెళ్లి పోయాడు. అక్కడితో మ్యాటర్ ఎండ్. ‘‘ఎవరో బుజ్జి అట. ఫోన్ చేసి చంపేస్తున్నాడు. కాస్త మాట్లాడరా బాబూ’’ అంది అమ్మ ఎన్టీఆర్‌తో. కథ విని నచ్చలేదని చెప్పి పంపిచేద్దామని డిసైడయ్యాడు ఎన్టీఆర్. నెక్ట్స్ డే... వినాయక్, బుజ్జి - ఇద్దరూ వచ్చారు. ‘‘నాకు కథ మొత్తం చెప్పొద్దు. జస్ట్ ఇంట్రడక్షన్... ఇంటర్వెల్... క్లైమాక్స్ చెప్పండి చాలు’’ అన్నాడు ఎన్టీఆర్. వినాయక్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ‘‘మీకు ఇంట్రో ఒక్కటే చెప్తాను. నచ్చితేనే కూర్చోండి. మీ టైమ్ వేస్ట్ చేయను’’ అంటూ ఇంట్రో చెప్పడం మొదలెట్టాడు. మొదట చాలా లైట్ తీసుకున్న ఎన్టీఆర్ ఇమ్మిడియెట్‌గా కనెక్ట్ అయిపోయి ఇంట్రో ఎపిసోడ్‌ని ఫుల్ ఎంజాయ్ చేసేశాడు. అరగంట... గంట... గంటన్నర... రెండు గంటలు... వినాయక్ నాన్‌స్టాప్‌గా కథ చెబుతూనే ఉన్నాడు. ఎన్టీఆర్ ఫుల్‌గా ఇన్వాల్వ్ అయిపోయి మరీ విన్నాడు. అదిరిపోయే లవ్‌స్టోరీ. వెంటనే లేచి ‘‘అన్నా... మనమీ సినిమా చేస్తున్నాం’’ అని హగ్ చేసుకున్నాడు. వినాయక్ కల నెరవేరింది. అతను గాల్లో తేలి పోతున్నాడు. బుజ్జి కూడా సేమ్ టూ సేమ్. ఎన్టీఆర్‌తో వినాయక్ సినిమా చేస్తున్నాడనే వార్త ఇండస్ట్రీ అంతా స్ప్రెడ్ అయింది. కానీ నాలుగు రోజుల తర్వాత ఎన్టీఆర్ నుంచి పిలుపొచ్చింది. వినాయక్ ఎగురుకుంటూ వెళ్లాడు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ కనిపించే ఎన్టీఆర్ మొహంలో సీరియస్‌నెస్. వినాయక్ పసిగట్టేశాడు. ఈ సినిమా క్యాన్సిల్ అని చెప్పేస్తాడని అర్థమై పోయింది. ‘‘మీరు కూర్చోండి. జిమ్కెళ్లొస్తాను’’ అంటూ గంటసేపు ఎన్టీఆర్ జంప్. ఆ గంట... నరకం చూశాడు వినాయక్. ఎన్టీఆర్ వచ్చీ రావడంతోనే విషయంలోకి వచ్చేశాడు. ‘‘ఏమనుకో వద్దన్నా! కొడాలి నానీ అన్న ఇప్పుడు లవ్ స్టోరీ వద్దు. ఏదైనా మాస్ సినిమా చేయమని సలహా ఇచ్చాడు. మాస్ కథ ఉంటే చెప్పన్నా’’ అన్నాడు ఎన్టీఆర్. వినాయక్ కుప్పకూలిపోయినట్టు అయిపోయాడు. రేపో మాపో సినిమా స్టార్ట్ అవుతుందని ఎన్నెన్నో కలలు కంటున్నాడు. అంతలోనే అవాంతరం. ఇప్పటికిప్పుడు మాస్ కథ ఎక్కడ దొరుకుతుంది? కానీ, చీకట్లో చిరుదీపంలా ఎప్పుడో రెడీ చేసుకున్న రెండు సీన్లు గుర్తొచ్చాయి. వెంటనే మైండ్లోంచి వాటిని బయటకు తీశాడు. ‘‘నా దగ్గర రెండు యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఒకటి చిన్న పిల్లాడు బాంబు వేసేది. రెండోది బ్లాస్ట్‌లో సుమోలు లేచేది. మీకు నచ్చితే వాటి చుట్టూ కథ అల్లుతా’’ అని కొంచెం డీటైల్స్ చెప్పాడు వినాయక్. ‘‘ఫ్యాక్షన్ కథ నాకు హెవీ అయి పోతుందన్నా’’ అన్నాడు ఎన్టీఆర్. ఎలాగైనా తనను వదిలించుకునే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఆ మాట అంటున్నాడని వినాయక్‌కి అర్థమైంది. ‘‘వారం రోజులు టైమివ్వండి. ఆ కథ నచ్చకపోతే డేట్స్ ఎవరికైనా ఇచ్చేయండి’’ అని లేచాడు. హైదరాబాద్ - జర్నలిస్టు కాలనీలో వినాయక్ రూమ్. ఎన్టీఆర్ దగ్గర్నుంచీ రూమ్కొచ్చేసరికి రాత్రి తొమ్మిదయ్యింది. బుజ్జి కూడా ఉన్నాడు. అతనేమో వెంటనే నిద్రపోయాడు. అర్ధరాత్రి మూడు గంటలకు వినాయక్ గట్టిగా లేపితే తప్ప మెలకువ రానంత మొద్దు నిద్ర. ‘‘చూడు బుజ్జీ! కథ ఓ కొలిక్కి వచ్చేసింది’’ అని చదివి వినిపించాడు వినాయక్. బుజ్జి షాకైపోయాడు. థ్రిల్లయిపోయాడు. వండరైపోయాడు. వినాయక్‌లోని స్పెషాల్టీనే అది. ఏదైనా పంతం పట్టాడంటే, దాని అంతం చూస్తాడు. ఆ రెండ్రోజులూ వినాయక్ నిద్రపోలేదు. బ్రష్ చేసుకోలేదు. స్నానం కూడా లేదు. తిండి కూడా తినడం లేదు. ఆలోచిస్తూనే ఉన్నాడు. రాస్తూనే ఉన్నాడు. ఫైనల్‌గా 58 సీన్లతో ‘ఆది’ కథ రెడీ. కథ విని ఎన్టీఆర్ ఎగిరి గంతేశాడు.ప్రాజెక్ట్ స్టార్ట్. బెల్లంకొండ సురేశ్ సమర్పకుడు. నాగలక్ష్మి నిర్మాత. బుజ్జి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఎన్టీఆర్ నుంచి వినాయక్‌కి మళ్లీ పిలుపు. ఈసారేం ట్విస్టో? ‘‘అన్నా..! చిన్న ఛేంజ్! కథలో కాదు, ప్రొడ్యూసర్ విషయంలో! బూరుగుపల్లి శివరామకృష్ణగారు రెడీగా ఉన్నారు’’ చెప్పాడు ఎన్టీఆర్. వినాయక్ ఖంగు తిన్నాడు. ‘‘లేదండీ..! నన్ను డెరైక్టర్‌ను చేయాలని బుజ్జి ఎంతో తపించాడు. ఇప్పుడు హ్యాండ్ ఇవ్వలేను’’ అని చెప్పేశాడు. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న వినాయక్ గుణం ఎన్టీఆర్‌ని ముగ్ధుణ్ణి చేసేసింది. అందుకే ఇంకేం మాట్లాడలేకపోయాడు. షూటింగ్ స్టార్ట్. హీరోకి, డెరైక్టర్‌కి ట్యూనింగ్ కుదిరితే షూటింగ్ యమస్పీడ్‌గా వెళ్తుందనడానికి ‘ఆది’ నిదర్శనం. ఎన్టీఆర్... వినాయక్ ఇద్దరూ కథను ఆవాహన చేసేసుకున్నారు. అందుకే సెట్లో నో సీన్ పేపర్. ‘‘ఇది సీన్... అది డైలాగ్’’ అని వినాయక్ చెప్పడం ఆలస్యం... ఎన్టీఆర్ చెలరేగిపోయేవాడు. హైదరాబాద్, విజయనగరం, వైజాగుల్లో షూటింగ్. 65 రోజుల్లో ఫినిష్. 2002 మార్చి 28న రిలీజ్. రిజల్ట్ బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్‌కి స్టార్డమ్ షురూ. 19 ఏళ్ల వయసు... మూడో సినిమా... ఒక్కసారిగా ఎన్టీఆర్ కెరీర్ సూపర్స్పీడ్. వినాయక్ అయితే ఓవర్‌నైట్ స్టార్ డెరైక్టర్. ఈ సినిమాకి అయిన ఖర్చు రెండు కోట్ల ముప్ఫై ఐదు లక్షలు. వసూళ్లు పాతిక కోట్లు. అమ్మ తోడు... బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని అడ్డంగా నరికేశాడు ‘ఆది’. - పులగం చిన్నారాయణ వెరీ ఇంట్రస్టింగ్ లైఫ్‌లో కొన్ని మలుపులు భలే ఉంటాయి. దర్శక, నిర్మాత కె. క్రాంతికుమార్ దగ్గర ‘9నెలలు’ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశాక వినాయక్ సొంతంగా డెరైక్షన్ కోసం ట్రై చేస్తున్నాడు. అదే టైమ్‌లో కూచిపూడి వెంకట్ డెరైక్షన్‌లో బెల్లంకొండ సురేశ్ ‘రాజుగారు-బేవార్సుగాడు’ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. కూచిపూడి వెంకట్కేమో వినాయక్‌ను కో-డెరైక్టర్‌గా పెట్టుకోవాలని కోరిక. బెల్లంకొండ పిలిపించాడు. వినాయక్ చాలా నిజాయతీగా ‘‘నేను డెరైక్షన్ ట్రయల్స్‌లో ఉన్నా. ఇప్పుడు కో-డెరైక్టర్‌గా చేయలేను’’ అని చెప్పేశాడు. బెల్లంకొండకు అతని నిజాయతీ నచ్చేసి పర్సులో నుంచి పది వేలు తీసి, ‘‘నీకు డెరైక్షన్ ఛాన్స్ నేనే ఇస్తాను. ఇది అడ్వాన్స్. నీ కథ తయారయ్యేలోగా ఈ సినిమాకు పనిచేయ్’’ అన్నాడు. వినాయక్ ఓకే అన్నాడు. తీరా చూస్తే కూచిపూడి వెంకట్ సినిమా అటకెక్కేసింది. ఆ తర్వాత బెల్లంకొండ ‘చెప్పాలని వుంది’ మొదలెట్టాడు. అలా దానికి కో-డెరైక్టర్‌గా వెళ్లాడు వినాయక్. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ‘చెప్పాలని వుంది’ (వడ్డే నవీన్ హీరో) షూటింగ్ టైమ్‌లోనే వినాయక్-బుజ్జి బాగా క్లోజ్ అయ్యారు. ఓ రోజు అన్నపూర్ణ స్టూడియోలో శివుడి బొమ్మ దగ్గర కూర్చుని బుజ్జికి ఓ లవ్‌స్టోరీ చెప్పాడు వినాయక్. టైటిల్ ‘శ్రీ’. బుజ్జికి బాగా నచ్చేసి, ఆకాశ్ హీరోగా చేద్దామని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాడు. ఆ కథనే తర్వాత స్విట్జర్లాండ్‌లో ఎన్టీఆర్‌కి చెప్పింది. ఇప్పటికీ ఆ కథ వినాయక్ దగ్గరే ఉంది. బుజ్జి అసలు పేరు నల్లమలుపు శ్రీనివాస్. బెల్లంకొండ సురేశ్‌కి స్వయానా మేనల్లుడు. అతనికి నాగలక్ష్మి పిన్ని అవుతుంది. గుంటూరులో పత్తి గింజల ఆయిల్ వ్యాపారం చేస్తుండేవాడు. సినిమాలంటే ఆసక్తే కానీ నిర్మాత అయిపోవాలనీ, పరిశ్రమలో స్థిరపడిపోవాలనీ మాత్రం అనుకోలేదు. కానీ, ‘ఆది’ అతణ్ని ఇండస్ట్రీలో నిర్మాతగా సెటిలయ్యేలా చేసింది.