
డిసైడ్ అయ్యాక నేనే చెప్తా : రానా
తన నెక్ట్స్ సినిమా పై మీడియాలో జరుగుతున్న ప్రచారం పై యంగ్ హీరో రానా స్పందించాడు. త్వరలో స్టార్ వివి వినాయక్ దర్శకత్వంలో రానా నటించబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే విషయాన్ని ట్విట్టర్ లో ద్వారా తెలుసుకున్న రానా.. తాను ఏ సినిమా చేయాలన్నది ఫిక్స్ అయితే.. తానే ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తానని ఇలాంటి రూమర్స్ నమ్మవద్దని తెలిపాడు.
బాహుబలి సినిమాలోని భల్లాలదేవుడి పాత్రలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా, ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ను జూన్ 23న రిలీజ్ చేయనున్నారు.