Nene Raju Nene Mantri
-
నేనే రాణి.. నేనే మంత్రి
నా లైన్ నాదే. నా లైఫ్ నాదే. ‘ఇండస్ట్రీలో అలా ఉంటుంది కదా.. ఇలా ఉంటుంది కదా’ అంటే.. ఎలాగున్నా.. మనం మనలా ఉండగలిగితే మన వరకు ఇబ్బందులు రావు. అంటే.. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. అందరికీ అది చేత కాకపోవచ్చు. నా వరకైతే, నేనే రాణి. నేనే మంత్రి! అంటున్న కాజల్ అగర్వాల్‌తో సాక్షి ఎక్స్‌క్లూజివ్.. చాలా సన్నగా అయిపోయారు. ఏం చేశారేంటి? కాజల్: అవునా? చూడ్డానికి సన్నగా కనిపిస్తున్నానేమో కానీ యాక్చువల్లీ నేను బరువు పెరిగాను. విచిత్రంగా చాలామంది నన్ను సన్నగా అయ్యారేంటి? అని అడుగుతున్నారు. ఇంతకీ ఎంత పెరిగారు? తగ్గాలనుకుంటున్నారా? ఇంతకుముందు 54 ఉండేదాన్ని.. 3 కిలోలు పెరిగినట్టున్నా. అయితే తగ్గాలని మాత్రం అనుకోవడంలేదు. ఎందుకంటే కంఫర్ట్‌బుల్‌గానే ఉన్నాను (నవ్వుతూ). గతంలో వంద సూర్య నమస్కరాలు చేసేవారు? ఇప్పుడూ చేస్తున్నారా? లేదు. దిష్టి తగిలినట్టుంది (నవ్వుతూ). మళ్లీ స్టార్ట్ చేస్తాను. హీరోయిన్ అయి పదేళ్లవుతోంది? ఈ టెన్ ఇయర్స్ జర్నీ ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది. పదేళ్లు గడిచాయి అని మాత్రం అనిపించడం లేదు. గ్రేట్ రన్. నేను చాలా ‘బ్లెస్డ్’ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందని అనుకోలేదు. నన్ను తెలుగుమ్మాయిగా స్వీకరించిన నా ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు. అఫ్కోర్స్ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలను మరచిపోకూడదు. ఈ పదేళ్లలో ఎప్పుడైనా బ్రేక్ వస్తుందని భయపడిన సందర్భాలున్నాయా? ఆ భయం ఎప్పుడూ కలగలేదు. ఎందుకంటే ఒక సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఇంకో సినిమా చేతిలో ఉండేది. ఒక్కోసారి రెండు మూడు సినిమాలు ఉండేవి. అయితే రెండే రెండు సార్లు బ్రేక్ వచ్చింది. అవి కూడా నా అంతట నేను తీసుకున్నవి. నా చెల్లెలు నిషా పెళ్లి కోసం ఒక బ్రేక్ తీసుకున్నాను. అక్కగా అన్నీ దగ్గరుండి చేయాలి కాబట్టి నెల రోజులు షూటింగ్స్‌కి ఎటెండ్ కాలేదు. ఆ తర్వాత 2018 స్టార్టింగ్‌లో ఆరోగ్యం బాగాలేక మూడు నెలలు ఇంటిపట్టున ఉన్నాను. పదేళ్లు కంటిన్యూస్‌గా పని చేసి, ఏదో అలా రిలాక్స్ అవ్వడానికి కొన్ని రోజులంటే ఓకే. ఏకంగా మూడు నెలలంటే బోరింగ్‌గా అనిపించిందా? బోర్ సంగతి పక్కన పెడితే ప్రతి రోజూ జ్వరంతో ఒళ్లు కాలిపోయేది. ‘హెల్త్ ఈజ్ వెల్త్’ అంటారు కదా. ఆరోగ్యంగా ఉండటం లైఫ్‌లో అన్నింటికన్నా ముఖ్యం. అందుకే ఫుల్‌గా రిలాక్స్ అవ్వాలని ఏ టెన్షన్సూ పెట్టుకోలేదు. ఈ మూడు నెలలు ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్’తో బాధపడ్డా. మూడు నెలలూ మీవాళ్లు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుని ఉంటారు... మా అమ్మానాన్నలకు పిల్లలంటే చాలా శ్రద్ధ. నేను సినిమాల్లోకి వచ్చాక నాతో పాటే ఉంటూ, నాక్కావాల్సినవన్నీ సమకూర్చేవారు. అమ్మ అయితే స్వయంగా వంట చేసి పెట్టేది. ఇప్పుడు అమ్మని షూటింగ్ స్పాట్‌కి రావద్దని నేనే చెప్పేశాను. ఎందుకంటే ఇంకా ఎంతకాలం నాకోసం కష్టపడతారు. ఇది విశ్రాంతి తీసుకునే వయసు కదా. అమ్మ నాతో రావడంలేదు కాబట్టి నేను హోమ్ ఫుడ్‌ని చాలా మిస్సవుతున్నాను. అందుకే ఇంట్లో ఉన్న ఆ 3 నెలలూ మా అమ్మమ్మ, అమ్మ నెయ్యి విపరీతంగా దట్టించి, పరాటాలు చేసి పెట్టేశారు. పంజాబీ ఇల్లంటే స్వీట్లు, నెయ్యి, పన్నీర్ ఫుల్లుగా ఉంటాయి. అందుకే కాస్త బరువు పెరిగాను. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయింది కాబట్టి బోలెడంతమంది ఫ్రెండ్స్, పార్టీలు కామన్. కానీ మీరు పార్టీల్లో పెద్దగా కనిపించరెందుకని? నా ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటాను. వాళ్లంతా ముంబైలో ఉంటారు. ఇండస్ట్రీలో కూడా ఏదైనా పార్టీ ఉంటే ఫార్మాలిటీగా అటెండ్ అవుతాను. పర్సనల్, ప్రొఫెషనల్ జీవితాన్ని మిక్స్ చేయకూడదని అనుకుంటాను. నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్‌తో కంఫర్ట్‌బుల్‌గా ఉంటుంది. స్విచ్చాన్ స్విచ్చాఫ్ బటన్లాగా. వర్క్ అప్పుడు పార్టీలు చేసుకోలేను. ఎందుకంటే మళ్లీ మరుసటిరోజు నిద్ర లేవాలి. జిమ్‌కి వెళ్లాలి. షూట్‌కి వెళ్లాలి. ఇన్ని పనులు చేశాక ఎప్పుడెప్పుడు ముసుగు తన్నేద్దామా అనిపిస్తుంటుంది. ఇక పార్టీ అనే ఆలోచన ఉంటుందా? టీవీ చూస్తుంటాను. ఇంట్లో వాళ్లతో ఫోన్లో మాట్లాడతాను. అయితే జనరల్‌గా మీ రోజు ఎలా మొదలవుతుంది? ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తాను. అలారంతో పని లేదు. కొన్నేళ్లుగా ఐదింటికి నిద్రలేస్తున్నాను కాబట్టి శరీరం అలవాటు పడిపోయింది. అయితే షూటింగ్స్ లేనప్పుడు ఎక్కువసేపు నిద్రపోతా. రాత్రి నిద్రపోవడానికి దాదాపు పదకొండు అవుతుంది. 5 టు 11 వర్కవుట్స్, షూటింగులు. షూటింగులు లేకపోతే వేరే పనులు.. అలా బిజీబిజీ. ఈ మధ్య కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ‘ఇది పెళిళ్ల్ల సీజన్. నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని ఓ సందర్భంలో అన్నారు. మరి పెళ్లెప్పుడు? ఏదో సరదాగా జోక్ చేశాను. అంతేకానీ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని లేదు. లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ అనలేను. నచ్చిన అబ్బాయి దొరికితే ఓకే. లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా. ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడంలేదు. ఇండస్ట్రీలో వాళ్లను చేసుకోకూడదని ఎందుకు అనుకుంటున్నారు? అలా అని కాదు. ఒకవేళ ఎవరైనా నచ్చితే తప్పకుండా చేసుకుంటా. ఇండస్ట్రీలో అందరూ నాకు తెలుసు. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్లలో నాకు లైఫ్ పార్టనర్ కనిపించలేదు. అందుకే ఇండస్ట్రీ నుంచి ఎవర్నీ పెళ్లాడను అన్నాను. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోయే ముందు ఇది సాధించాలి, అది సాధించాలి అని పెట్టుకున్న లిస్ట్ అంతా ఫినిష్ చేసేశారా? రాసుకున్న లిస్ట్ అంటూ ఏదీ లేదు. మైండ్‌లోనే క్వాలిటీ సినిమాలు చేయాలనుకున్నాను. కెరీర్లో చెప్పుకోవడానికి ఓ 5 సినిమాలుంటే చాలనుకున్నా. ఆ సినిమాల గురించి ఎప్పుడు అనుకున్నా గర్వంగా అనిపించాలి. ‘మగధీర, నేనే రాజు నేనే మంత్రి, మిస్టర్ పర్ఫెక్ట్, వివేగమ్ (తమిళం), అ!’ సినిమాలు నాకు బాగా ఇష్టం. ‘అ!’లో నాది చిన్న రోల్ కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు తేజాగారితో ఓ సినిమా చేస్తున్నాను. అందులో నాది అద్భుతమైన పాత్ర. నేను గర్వంగా చెప్పుకునే సినిమాలలో ఇది కూడా ఉంటుంది. హిస్టారికల్ సినిమాలో నటించాలనుందా? ఉంటే.. ఎలాంటి పాత్ర? ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నాకు ఝాన్సీ లక్ష్మీభాయ్ అంటే ఇష్టం. ఆమె భయం లేని గుణం, ఆత్మవిశ్వాసం గురించి మనందరం చదువుకున్నాం. స్క్రీన్ మీద ఆవిడ పాత్ర చేయాలని ఉంది. ఝాన్సీ లక్ష్మీభాయ్ లక్షణాల్లో మీకున్నవి? ఆవిడ అంత ధైర్యం లేకపోయినా కొంతవరకూ ధైర్యవంతురాలినే. కొన్నిసార్లు లక్ష్మీభాయ్ అవ్వాల్సి వస్తుంది కూడా. ఇక ఆ సమయంలో చుట్టు పక్కలవారి గురించి, పరిసరాల గురించి పట్టించుకోను కూడా. కొన్నిసార్లు సౌమ్యంగా, కొన్నిసార్లు సింహంలా, కాళీ మాతలా మారాల్సి ఉంటుంది. కాళీలా మారిన సందర్భం ఏదైనా గుర్తుందా? మా ఫ్రెండ్‌తో ఒక అబ్బాయి తప్పుగా ప్రవర్తించాడని రోడ్డు మీద కాలర్ పట్టుకుని ముఖం వాచిపోయేలా కొట్టాను. అది ప్లస్ టు చదువుతున్నప్పుడు అనుకుంటా. మేం ఉండే ఏరియాలో రాత్రి ఎనిమిదింటికి ఫ్రెండ్స్ అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా ఫ్రెండ్‌తో తప్పుగా ప్రవర్తించాడు. అప్పుడు మా గ్యాంగ్‌లో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. వాడు పారిపోయాడు. నాకు చాలా చిరాకు, కోపం వచ్చేశాయి. ఆకతాయి ఒంటి మీద ఒక్కటిచ్చి కళ్లు కనిపించడం లేదా? అన్నాను. ఆ తర్వాత ఇంటికెళితే మా నాన్నగారు అలా కొట్టకూడదు అన్నారు. సినిమాల్లోకి వచ్చాక చేదు అనుభవాలేవైనా? లేవు. కానీ కొందరు హీరోయిన్లు ‘క్యాస్టింగ్ కౌచ్’ అంటూ తమను వేధించారని పలువురు ప్రముఖుల పేర్లు బయటపెట్టారు కదా? క్యాస్టింగ్ కౌచ్ అస్సలు లేదు అనను. బయటకు వచ్చి చెబుతున్న వాళ్లందరి బాధ వింటున్నాం. వాళ్లు అబద్ధాలు చెప్పరు కదా. అయితే నాకు అలాంటి అనుభవం ఏదీ లేదంటున్నాను. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరే కదా. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది. చాలా ఏళ్లు మా అమ్మగారు నాతోనే ఉన్నారు. నావరకూ చేదు అనుభవం ఒక్కటి కూడా లేదు. అయితే నాకేం కాలేదని ఆనందపడిపోకూడదు. ఆడవాళ్లు హాయిగా పని చేసుకునే వాతావరణం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని రంగాల్లోనూ ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో దారుణమైన మనుషులు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అందుకే ‘నాతో పెట్టుకోవద్దు’ అనే సంకే తాలను పంపిస్తా. బహుశా నా జోలికి ఎవరూ రాకపోవడానికి అది కూడా ఓ కారణం అయ్యుండొచ్చు. నటి తనుశ్రీ దత్తాను తీసుకుందాం.. ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన హెరాస్మెంట్ ఇప్పుడు చెప్పారామె. నిజం చెప్పడానికి పదేళ్లు అవసరమా? ఏం చేస్తారో అని భయం. ఏ వ్యక్తికైనా కెరీర్ అంటే ఓ భయం ఉంటుంది. ఎవరైనా నష్టం చేస్తారనే భయంతో మాట్లాడలేరు. భయం లేకుండా చెప్పే ధైర్యం మీకుందా? ఓ. సపోజ్ నాకు ఏదైనా కాస్ట్యూమ్ ఇబ్బందిగా అనిపిస్తే చెప్పేదాన్ని. ఇది నాకు కంఫర్ట్‌బుల్‌గా ఉండదు.. వేసుకోలేను అని కరాఖండిగా చెప్పిన రోజులున్నాయి. అయితే ఇప్పుడు ఇంత అనుభవం సంపాదించుకున్న తర్వాత కాదు.. కెరీర్ స్టార్టింగ్ లోనే అలానే ఉండేదాన్ని. అవకాశాలు తగ్గిపోతాయని భయపడలేదా? లేదు. అలా తెగువ చూపించడమే నన్ను సేవ్ చేసిందని భావిస్తాను. కోల్పోయేవాటి గురించి అసలు కేర్ చేయను. ఎలా రాసుందో అలా జరుగుద్ది అనుకుంటాను. ఒకవేళ అవకాశాలు కోల్పోయుంటే ధైర్యం... (మధ్యలో అందుకుంటూ) చాలా సినిమాలు మిస్ అయ్యాను. అవి పెద్ద పెద్ద సినిమాలు. వదులుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ నేను సంతోషంగా ఉన్నాను. మనం తీసుకున్న చాయిస్‌ల వల్ల మనం హ్యాపీగా ఉండాలని నమ్ముతాను. వేరేవాళ్ల సంతోషం కోసం నేను బతకడంలేదు కదా. కొన్నిసార్లు పాత్ర స్వభావానికి, మీ పర్సనల్ అభిప్రాయాలకు తేడా వస్తే చేసేవారా? లేదా దర్శకుడితో డిస్కస్ చేసేవారా? ఈ మధ్య కాలంలో డిస్కషన్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కెరీర్ స్టార్టింగ్‌లో క్యారెక్టర్స్ విషయంలో నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఏదైనా నచ్చకపోయినా, స్త్రీలను కొంచెం తక్కువగా, అసభ్యకరంగా చూపించడానికి ట్రై చేసినా నేను చేయనని చెప్పేస్తా. మార్చండి అని అడుగుతా. వీటిని ఎంకరేజ్ చేయను. కెమెరా యాంగిల్స్ మీద కూడా పూర్తి అవగాహన వచ్చే ఉంటుంది కదా? ఇప్పుడు వచ్చేసింది. కెరీర్ స్టార్టింగ్‌లో ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నా, నాకు నేను స్క్రీన్ మీద ఈ యాంగిల్లో బాగా కనిపించను అనిపించినా ఆ ఫ్రేమ్ మార్చండి అని అడుగుతాను. మీరు పని చేసిన దర్శకుల్లో మీకు చాలెంజింగ్ అనిపించింది ఎవరు? ఒక్కళ్లు అని చెప్పలేను. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఇంత మంది దర్శకులతో కలసి పనిచేయడం అదృష్టం అని భావిస్తాను. చాలా నేర్చుకున్నాను. కొత్త దర్శకుడు అయినా స్టార్ డైరెక్టర్ అయినా కూడా నాకేదోటి నేర్పిస్తూనే ఉన్నారు. అది నా కెరీర్‌కు చాలా హెల్ప్ అవుతుంది. ఫైనల్లీ.. మీ పదేళ్ల కెరీర్‌ని ఒక పదంలో పెట్టమంటే? నేర్చుకుంటున్నాను. – డి.జి. భవాని -
తేజ నెక్ట్స్ సినిమా ఫిక్స్!
ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్న తరువాత దర్శకుడు తేజ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తేజ, తరువాత చాలా కాంబినేషన్స్‌ను సెట్ చేసే ప్రయత్నం చేశాడు. వెంకటేష్ హీరోగా ఓ సినిమా అనుకున్నా అది పట్టాలెక్కలేదు. తరువాత ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తానే తప్పుకున్నాడు. రానాతో మరో సినిమా అనుకున్నా రానాకు ఖాలీ లేకపోవటంతో కుదరలేదు. దీంతో తేజ మరో సినిమా ఎప్పుడు మొదలు పెడతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా తేజ కొత్త సినిమాపై మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. తేజ తన తదుపరి చిత్రాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా కాజల్ అగర్వాలే హీరోయిన్. అంటే వరుసగా రెండు సినిమాలో ఈ జంట కలిసి నటిస్తున్నారు. -
‘నేనే రాజు నేనే మంత్రి’ సిన్మాను అందుకే తిరస్కరించా!
భల్లాల దేవుడు రానా హీరోగా తెరకెక్కిన ’నేనే రాజు నేనే మంత్రి’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో డైరెక్టర్ తేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. అయితే.. ఈ సినిమా మొదట రాజశేఖర్ వద్దకు వచ్చిందట. తేజ చెప్పిన ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని, కానీ, క్లైమాక్స్ విషయంలో ఇద్దరికీ విభేదాలు రావడంతో తాను ఆ సినిమాను చేయలేదని రాజ్‌శేఖర్ వెల్లడించారు. ఓ టీవీ చానెల్‌తో ముచ్చటించిన రాజశేఖర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సినిమా కథ సూపర్‌గా వచ్చింది. కానీ క్లైమాక్స్‌లో నాకు తేజకు విభేదాలు వచ్చాయి. ఇలా ఉంటే బాగుంటుందని తేజ చెప్పారు. కాదు అలా ఉంటే బాగుంటుందని నేనన్నాను. తేజతో నాకు మొదటి సినిమా నుంచి పరిచయముంది. వందేమాతరం సినిమాకు తేజ అసిస్టెంట్ కెమెరామ్యాన్‌గా చేశాడు. అప్పటినుంచి తేజ తెలుసు. అంతేకాకుండా జీవితకు చిన్నప్పటి నుంచి తేజ క్లాస్మేట్ కూడా.. డైరెక్ట్ చేయమని తేజను ఫోర్స్ చేసింది కూడా నేనే. ఆ చనువు వల్ల క్లైమాక్స్ అలా ఉంటే చేయనని నేను చెప్పాను. దీంతో తను వెళ్లిపోయాడు. తర్వాత రానాతో చేశాడు’ అని రాజశేఖర్ వివరించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రాజశేఖర్ తాజా సినిమా ’పీఎస్వీ గరుడవేగ’ నవంబర్ 3న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. -
నారా వారబ్బాయి విలన్ గానా..?
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో నేను రాజు నేనే మంత్రి సినిమాతో బిగ్ హిట్ అందుకున్న దర్శకుడు తేజ, అదే బ్యానర్లో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబందించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో విలన రోల్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకే కీలకమైన ప్రతినాయక పాత్రకు స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైతే కరెక్ట్‌అని భావించిన చిత్రయూనిట్, హీరోగా అలరిస్తున్న నారా రోహిత్‌ను విలన్‌గా ఫైనల్ చేశారట. ఇప్పటికే కథలో రాజకుమారి సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్న రోహిత్ పూర్తి స్థాయి విలన్‌గా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
తేజ దర్శకత్వంలో సీనియర్ హీరో..?
నేను రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ, తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సక్సెస్ ఫాంను కొనసాగించేందుకు స్టార్ ఇమేజ్ ను ఉపయోగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇటీవల మెగా హీరోలతో తేజ ఓ మల్టీ స్టారర్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. తాజాగా మరో సీనియర్ హీరోతో తేజ సినిమా అన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వంద సినిమాలు పూర్తి చేసుకున్న తరువాత జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న నందమూరి బాలకృష్ణ, తేజ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించారట. ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తన 102వ సినిమా చేస్తున్న బాలకృష్ణ, ఆ తరువాత చేయబోయే సినిమాను ఇంత వరకు ప్రకటించలేదు. -
రాధాజోగేంద్ర అందరికీ నచ్చారు
భర్త అంటే భరించే వాడు కాదు... భార్యను ప్రాణంగా చూసుకునేవాడు. తన జీవితంలోనే కాదు తన ఆలోచనల్లో కూడా సగ భాగం ఆమెకు కల్పించి, గౌరవించేవాడు. భార్య ఇష్టాన్నే తన ఇష్టంగా, ఆమె కష్టాన్ని తన కష్టంగా భావించేవాడు నిజమైన భర్త. భార్య కూడా అంతే. భర్త తప్పులు చేయకుండా వెన్నంటే ఉండాలి. భర్త ఆశయం కోసం తన వంతు సాయం చేయాలి. ఇలా భార్యాభర్తలు కలిసి మెలిసి ఉంటే ఆ దాంపత్యం ఆనందంగా ఉంటుంది. ఎంతోమందికి ఆదర్శంగా ఉంటుంది. కాజల్, రానా జంటగా తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’లోని భార్యాభర్తల (రానా–కాజల్) ప్రేమ చూడముచ్చటగా ఉంటుంది. డి. సురేశ్‌బాబు, సీహెచ్ భరత్‌చౌదరి, కిరణ్‌రెడ్డి నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. జోగేంద్ర (రానా), రాధ (కాజల్) మనసుల్లో నిలిచిపోతారని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. కథ.. వడ్డీ వ్యాపారం చేసుకునే జోగేంద్రకు భార్య రాధే ప్రపంచం. కానీ, ఈ దంపతులకు సంతానం ఉండదు. తీరా దేవుడు దయ వల్ల రాధ కడుపు పండితే అనుకోని పరిస్థితులు ఆ సంతోషాన్ని వారి నుంచి దూరం చేస్తాయి. దీంతో రాధ చాలా బాధపడుతుంది. అప్పటివరకు మంచివాడిలా ఉన్న జోగేంద్ర ఆ ఘటన తర్వాత రూట్ మార్చుతాడు. ఏమైనా చేసి రాధను సంతోషంగా ఉంచాలనుకుంటాడు. ముందుగా ఆ ఊరి సర్పంచ్ అవుతాడు. ఊరి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, మినిస్టర్ వరకు ఎదుగుతాడు జోగేంద్ర. ఆ తర్వాత సీఎం కావాలనుకుంటాడు? కానీ, శత్రువులు ఆడిన రాజకీయ చందరగంలో తన నమ్మినబంటు శివ (నవదీప్) ను తానే చంపుకుంటాడు జోగేంద్ర. ఇదే సమయంలో జోగేంద్ర తప్పుడు పనులు చేస్తున్నాడని నిరూపించేందుకు జర్నలిస్టు దేవికారాణి (క్యాథరిన్)ట్రై చేస్తుంది. అసలు జోగేంద్ర మారడానికి దారితీసిన పరిస్థితులు ఎంటి? దేవికారాణి ఎంటరైన తర్వాత రాధ, జోగేంద్ర జీవితాల్లో ఎమైనా మార్పులు వచ్చాయా? రాధ కోసం జోగేంద్ర తన దారిని మార్చుకున్నాడా? సి.ఎం. కావాలనుకున్న కలను నేరవేర్చుకున్నాడా? లేదా? అనేది తెరపై చూడాల్సిందే. కథను నమ్మి ఈ సినిమా తీశామని, ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారని నిర్మాతలు డి. సురేశ్‌బాబు, సీహెచ్ భరత్‌చౌదరి, కిరణ్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ప్రేక్షకులకు దగ్గర కావడానికి ముఖ్యం కారణాలు కథ, అందులో ఉన్న ఎమోషన్ అన్నారు. ఇంకా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘జోగేంద్ర, రాధల స్వచ్ఛమైన ప్రేమ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. రానా, కాజల్ ఎమోషనల్ సీన్స్‌లో బాగా యాక్ట్ చేశారు. స్క్రీన్‌పై రానా, కాజల్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఒక పక్క రాధ, జోగేంద్ర లవ్‌స్టోరీని చూపిస్తూనే, మరోపక్క పొలిటికల్ డ్రామాను జోడించి, డైరెక్టర్ తేజ బాగా తీశారు. స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. అనూప్ రూబెన్స్ పాటలు మెప్పిస్తున్నాయి. జోగేంద్ర పాత్రకు రానా జీవం పోశారు. ఎక్స్‌లెంట్‌గా నటించారు. చాలా తక్కువమంది హీరోలు ఇలాంటి కథలను ఎంచుకుని, సినిమాలు చేస్తారు. ఇలాంటి కథ చేయండ హీరో రానా గొప్పతనం. రానా డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. అందుకు లీడర్, బాహుబలి, ఘాజి తదితర చిత్రాలే నిదర్శనం. అనుకున్న బడ్జెట్లోనే సినిమాను కంప్లీట్ చేశాం. మంచి కథ–కథనం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు’’ అన్నారు. -
కలక్షన్స్ చూసి కంగారుపడ్డా... అంత బాగున్నాయి!
రానా, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, సీహెచ్ భరత్‌చౌదరి, కిరణ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో రానా మాట్లాడుతూ– ‘‘సినిమా విడుదల తర్వాత తక్కువగా మాట్లాడతాను. కానీ, ఈ సినిమా కలెక్షన్స్ చాలా బాగున్నాయి. కలక్షన్స్ నంబర్స్ చూసి నేనే కంగారు పడిపోయాను. ఇంతకు ముందు ఎవరో ‘వన్ మ్యాన్ షో’ అన్నారు. కాదు... ఈ సినిమా కోసం అందరూ కష్టపడ్డాం. పోస్టర్ల మీద నేను ఉన్నాను కాబట్టి నేను కనిపిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు కొత్త సినిమాలను ఆదరిస్తారు. కథ అందరి కన్నా గొప్పది’’ అన్నారు. తేజ మాట్లాడుతూ– ‘‘యూఎస్‌లో షో పడ్డాక ఒక టాక్ వచ్చింది. అక్కడ టాక్ ఏంటంటే... ‘సెకండాఫ్ డ్రాప్ అయ్యింది, ఎండింగ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది’ అని. బేసిక్‌గా ప్రాపర్ రివ్యూ రైటర్స్ తగ్గిపోయారు. తెలుగులో మంచి రైటర్స్ లేరనడం లేదు. సినిమాలో హీరోగా ఉన్నవాడు విలన్ స్థాయికి జారిపోతాడు. అక్కడ దిగజారింది కథ కాదు. కథ పరంగా హీరో క్యారెక్టర్. ఆ తేడాను పట్టుకోవాలి. కొంతమంది పట్టుకుని రివ్యూలు రాశారు. వారికి ధన్యవాదాలు. ఆ లైన్ పట్టుకోలేని వారిని దేవుడే రక్షిస్తాడు. మార్నింగ్ షోకి ప్రేక్షకులు ధర్మామీటర్లు, ప్యారామీటర్లు పట్టుకుని వస్తారు. సాయంత్రం షోకి ఒరిజినల్ ప్రేక్షకులు వస్తారు. అప్పుడు తెలుస్తుంది సినిమా గురించి. లక్కీగా మా సినిమా సేవ్ అయ్యింది. నేను హిట్ తీయగలనని తెలిసింది. హిట్ తీయగలనని ఆడియన్స్ నాకు సర్టిఫికెట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇక మీదట హిట్స్‌నే తీద్దామనుకుంటున్నా. తెలుగులో ఎనీ స్టైల్ స్క్రిప్ట్‌ను రానానే చేయగలడు. తెలుగు సినిమా బెటర్ అవ్వాలంటే నెగిటివ్, పాజిటివ్ రెండు షేడ్స్ చేసే యాక్టర్లు రావాలి’’ అన్నారు. ‘‘సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఇది మాకు 48వ సినిమా. రామానాయుడుగారు ఉండుంటే రానాను కౌగిలించుకుని చాలా ఆనందపడేవారు. ఈ సినిమాతో తేజ ఈజ్ బ్యాక్’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. -
నా భల్లాలదేవను చూసి గర్వపడుతున్నా : రాజమౌళి
తన సన్నిహితుల సినిమాలు రిలీజ్ అయినప్పుడు తన రివ్యూలతో సినిమాలకు బూస్ట్ ఇచ్చే దర్శకుడు రాజమౌళి నేనే రాజు నేనే మంత్రి సినిమాపై స్పందించాడు. తన భల్లాలదేవుడి కోసం తన వంతు సాయం అందించాడు. తన ట్విట్టర్ ఖాతాలో సినిమాపై స్పందించిన రాజమౌళి ఒక్కొక్కరిని పేరు పేరున పొగిడాడు. 'చాలా కాలం తర్వాత ఓ అర్థవంతమైన సినిమా వచ్చింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా యూనిట్ శుభాకాంక్షలు, కాజల్, కేథరిన్ లు బాగున్నారు. కట్టిపడేసే ఓపెనింగ్, ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటాయి. తేజ గారు అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రతీ ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు ... నా భళ్లాలదేవాను చూస్తే చాలా గర్వంగా ఉంది'. అంటూ ప్రశంసించారు రాజమౌళి. ఈ శుక్రవారం గట్టి పోటి మధ్య రిలీజ్ అయిన నేనే రాజు నేనే మంత్రి సినిమా పాజిటివ్ టాక్ లో స్టార్ట్ అయ్యింది. Nene Raju Nene Manthri..👍🏻👍🏻 Dealt with great finesse by Teja garu.. Superb performances by every actor.. So proud of my Bhallaladeva.. — rajamouli ss (@ssrajamouli) 11 August 2017 -
'నేనే రాజు నేనే మంత్రి' మూవీ రివ్యూ
టైటిల్ : నేనే రాజు నేనే మంత్రి జానర్ : పొలిటికల్ థ్రిల్లర్ తారాగణం : రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, కేథరిన్ థెరిస్సా, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, నవదీప్ సంగీతం : అనూప్ రుబెన్స్ దర్శకత్వం : తేజ నిర్మాతలు : సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి కెరీర్ లో సోలో హీరోగా భారీ హిట్ లేని రానా, పుష్కర కాలంగా అసలు హిట్ చూడని తేజ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ నేనే రాజు నేనే మంత్రి. తేజ తన స్టైల్ ను పక్కన పెట్టి ఓ డిఫరెంట్ జానర్ లో చేసిన ఈ సినిమా రానా కెరీర్ ను మలుపు తిప్పుతుందన్న నమ్మకంతో ఉన్నారు. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న తేజ కూడా ఈ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి నేనే రాజు నేనే మంత్రి రానాకు సోలో హీరోగా సక్సెస్ అందించిందా..? ఈ సినిమాతో తేజ మరోసారి దర్శకుడిగా సత్తా చాటాడా..? కథ : జోగేంద్ర(రానా దగ్గుబాటి)కి తన భార్య రాధ(కాజల్) అంటే ప్రాణం. వడ్డీ వ్యాపారం చేస్తూ బతికే జోగేంద్రకు భార్య, మామ తప్ప మరో ప్రపంచం తెలీదు. తాకట్టు లేకుండా అప్పు ఇవ్వకపోవటం జోగేంద్ర అలవాటు.. ఎదుటి మనిషి కష్టాల్లో ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా ఆదుకోవటం రాధకు అలవాటు. పెళ్లైన మూడేళ్ల తరువాత రాధ గర్భవతి అవుతుంది. కానీ ఆనందం వారి జీవితంలో ఎంతో సేపు నిలబడదు. ఊరి సర్పంచ్ భార్యతో జరిగిన గొడవలో రాధ కడుపులో బిడ్డ చనిపోతుంది. సర్పంచ్ భార్య వల్లే తన భార్యకు ఇలా జరిగిందన్న కోపంతో జోగేంద్ర సర్పంచ్ ను చంపి ఊరి సర్పంచ్ అవుతాడు. తన పెత్తనానికి అడ్డొస్తున్నాడని ఎమ్మెల్యేను చంపి ఎమ్మెల్యే అవుతాడు. మంత్రి బలం ముందు ఎమ్మెల్యే బలం చాలటం లేదన్న కోపంతో మంత్రి కావాలని నిర్ణయించుకుంటాడు. చివరకు ఎలాగైన ముఖ్యమంత్రి కావాలన్న ఆశ జోగేంద్రకు కలుగుతుంది. ఈ పరుగులో అసలు తాను ఇదంతా ఎందుకు మొదలుపెట్టాడో మర్చిపోతాడు. రాధ ప్రేమను పక్కన పెట్టి ఎలాగైన సీఎం అవ్వటమే లక్ష్యంగా అక్రమాలు చేస్తుంటాడు. రాధ కోసం రాక్షసుడిగా మారిన జోగేంద్రను రాధ ఏం చేసింది..? చివరకు జోగేంద్ర ముఖ్యమంత్రి అయ్యాడా..? లేక రాధ కోరుకున్నట్టుగా మనిషిగా మారాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : విలక్షణమైన జోగేంద్ర పాత్రలో రానా ఒదిగిపోయాడు. భార్యను ప్రాణంగా ప్రేమించే సాధారణ వడ్డీ వ్యాపారీగా.. తన గెలుపు కోసం ఎంతకైనా తెగించే మూర్ఖపు రాజకీయ నాయకుడిగా రెండు వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు. హీరోయిన్ గా కాజల్ ఆకట్టుకుంది. సినిమా అంతా హుందాగా చీరలో కనిపిస్తూనే.. అందం అభినయం తో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన నటనతో మెప్పించింది. విలన్ గా అశుతోష్ రాణా, పోసాని కృష్ణమురళీ ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో నవదీప్, శివాజీ రాజా, అజయ్, ప్రదీప్ రావత్ లు తన పరిధి మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణులు : లాంగ్ గ్యాప్ తరువాత తేజ కొత్త కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. గతంలో తానే డీల్ చేయని కొత్త తరహా కథను ఎంచుకున్నా.. కథనం మాత్రం తన గత చిత్రాల పంథాలోనే కొనసాగించాడు. బలమైన హీరోయిన్ క్యారెక్టర్ తో పాటు హీరోనే సినిమా అంతా విలన్ గా నడిపించాడు. తొలి భాగం ఎమోషన్స్, పొలిటికల్ స్ట్రాటజీస్ తో స్పీడుగా నడిపించిన దర్శకుడు ద్వితాయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. యాంటీ క్లైమాక్స్ తో ముగించటం కూడా కొన్ని వర్గాలకు నచ్చకపోవచ్చు. టైటిల్ సాంగ్ తో అనూప్ ఫుల్ మార్క్స్ సాధించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రానా నటన మెయిన్ స్టోరి మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ముందు స్టోరీ... తర్వాతే టెక్నాలజీ!
‘‘వైవిధ్యమైన పాత్రలు చేయాలనే నటుణ్ణి అయ్యా. ప్రతిసారీ ఒకే రకమైన పాత్రలు చేస్తే చూడ్డానికి ప్రేక్షకులకు, చేయడానికి నాకు బోర్. కొత్త క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ పాత్ర నుంచి ఏం నేర్చుకోవాలా? అని ఆలోచిస్తా. క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు చేయడం ఇష్టం. ఇప్పటివరకు చేసిన పాత్రలతో సంతోషంగా ఉన్నా’’ అన్నారు రానా. ఆయన హీరోగా తేజ దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, సీహెచ్. భరత్‌చౌదరి, వి. కిరణ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈరోజు సినిమా విడుదలవుతున్న సందర్భంగా రానా చెప్పిన విశేషాలు... ♦ మా సురేశ్ ప్రొడక్షన్స్‌లో ఫస్ట్ నుంచి సినిమా చేద్దాం అనుకున్నా కుదర్లేదు. ఇప్పుడైనా చేయడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నకు (డి.సురేశ్‌బాబు), నాకు స్టోరీ నచ్చింది. బాబాయ్ వెంకటేశ్‌గారు కథ విని హ్యాపీ. ఒక సినిమా మీద ఓనర్షిప్ ఉంటే బాగా చేయొచ్చు. ఈ సినిమాకి మా నాన్నగారు ఓ నిర్మాత కావడం నా లక్. ♦ ‘లీడర్’ సినిమాలోని అర్జున్‌ప్రసాద్ మంచోడు. ‘నేనే రాజు నేనే మంత్రి’లో జోగేంద్ర(రానా పాత్ర పేరు) అంత మంచోడు కాదు. ఈ చిత్రంలో రాజకీయాలు ఒక అంశం మాత్రమే. రాధా, జోగేంద్ర అనే భార్యాభర్తల కథ ఇది. కరువు ప్రాంతంలో ఉంటూ సింపుల్ అండ్ హ్యాపీలైఫ్ను లీడ్ చేసే జోగేంద్ర క్రైమ్, పాలిటిక్స్, మనీ అనే ప్రపంచంలోకి ఎందుకు అడుగుపెడతాడు? ఏం చేశాడన్నదే చిత్ర కథ. ♦ ‘బాహుబలి’ కోసం కండలు పెంచా. జోగేంద్ర చాలా కామన్‌మ్యాన్. అందుకోసం కష్టపడి బరువు తగ్గా. ఈ సినిమాకు ఆత్మ కథే. టెక్నాలజీ అనేది స్టోరీని సపోర్ట్ చేసే ఒక అంశం మాత్రమే. టెక్నాలజీ మీదే ఆధారపడితే సినిమాలు ఆడకపోవచ్చు. ముందు కథ ముఖ్యం. తర్వాతే టెక్నాలజీ అని నమ్ముతాను. విడుదలకు ముందు కొంచెం డబ్బులు మిగిలితే అది ఫైనాన్షియల్‌గా సక్సెస్ఫుల్æమూవీనే. ♦ ‘నేనే రాజు నేనే మంత్రి’ని తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నాం. తమిళ రాజకీయాలకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందంటున్నారు. మేం తీసిన తర్వాత కనెక్ట్ అయ్యిందేమో అనిపిస్తుంది. నేను ప్రతిసారి పొలిటికల్ సినిమా చేస్తుంటే అది ఎవరికో ఎప్పుడో ఒక చోట కనెక్ట్ అవుతూనే ఉంది (నవ్వుతూ) . ♦ కాంపిటీషన్ అంటే ఫస్టఫాల్ నేను చేసే సినిమాలు ఇంకెవరూ చేయరని నా అభిప్రాయం. ఈరోజు విడుదలవుతున్న సినిమాలు వేటికవే డిఫరెంట్. బిగ్ వీకెండ్. ఇండిపెండెన్స్ వీకెండ్ అనేది ఒక సంక్రాంతి వీకెండ్ అయిపోవాలని కోరుకుంటున్నాను. హాలీవుడ్ మూవీ కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి త్వరలోనే పూర్తి వివరాలు చెబుతా. . -
డ్రగ్ కలకలం.. మీడియా హంగామా మాత్రమే : సురేష్ బాబు
ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలిసారిగా తన తనయుడు రానా హీరోగా సినిమాను నిర్మించిన సురేష్, సినిమా రిలీజ్ కు ముందు వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ శుక్రవారం (11-08-2017) రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తిరుమలలో మీడియాతో మాట్లాడిన సురేష్ డ్రగ్స్ కేసుపై స్పందించారు. సినీ రంగంలో డ్రగ్ కలకలం కేవలం మీడియా హంగామా మాత్రమే అన్న సురేష్, ఇండస్ట్రీలో ఉన్న డ్రగ్స్ ప్రభావాన్ని తామే సరిదిద్దుకుంటామన్నారు. స్కూల్ పిల్లలపై డ్రగ్స్ ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిదన్నారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో స్కూల్ పిల్లల్లో డ్రగ్స్ పై అవగాహన కల్పించే కార్యక్రమాలకు సినీ ఇండస్ట్రీ పూర్తి సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. -
జీవితంలో గుర్తుండి పోతుంది- హీరోయిన్
‘నేనే రాజు.. నేనే మంత్రి’ సినిమా యూనిట్ సభ్యులు బుధవారం నగరంలో సందడి చేశారు. బెంజ్ సర్కిల్లోని ట్రెండ్ సెట్ మాల్‌కు హీరో దగ్గుపాటి రాణా, హీరోయిన్ కాజల్ ఆగర్వాల్, నిర్మాతలు కిరణ్ రెడ్డి, భతర్ చౌదరి విచ్చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో రాణా మాట్లాడుతూ.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తొలిసారిగా నటించినట్లు తెలిపారు. ఈ సినిమా పక్కా మాస్ సినిమా అని, కుటుంబసమేతంగా చూడదగిన కథాంశంతో తీసినట్లు చెప్పారు. ఈ సినిమాను డైరెక్టర్ తేజ చాలా చక్కగా తీశారని పేర్కొన్నారు. రాజకీయ నేపథ్యం.. భార్యభర్తల బంధమే ముఖ్యఅంశమన్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. జీవితంలో గుర్తుండిపోతుంది: కాజల్ అగర్వాల్ ‘నేనే రాజు.. నేనే మంత్రి’ సినిమా జీవితంలో గుర్తిండిపోయేలా విజయాన్ని సాధిస్తుందని హీరోయిన్ కాజల్ అగర్వాల్ అన్నారు. ఈ సినిమాలో ఎంతో కష్టపడి నటించామని, షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. కాజల్, రాణాలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ట్రెండ్‌సెట్ మాల్‌కు తరలివచ్చారు.-లబ్బీపేట (విజయవాడ తూర్పు) కేల్ యూనివర్శిటీలో సందడే సందడి వడ్డేశ్వరం: వడ్డేశ్వరంలోని కేల్ యూనివర్శటీలో బుధవారం సినీనటులు సందడి చేశారు. నేనే రాజు-నేనే మంత్రి చిత్ర ప్రచారంలో భాగంగా హీరో రాణా, హీరోయిన్ కాజల్ అగర్వాల్, చిత్ర యూనిట్ సభ్యులు వర్శిటీకి విచ్చేశారు. వారితో కరచాలనం కోసం విద్యార్థులు పోటీపడ్డారు. రాణా విద్యార్థులందరికీ అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. వర్శిటీ విద్యార్థి విభాగం డీన్ హబీబుల్లా ఖాన్, హ్యాపీ క్లబ్ విభాగం ఇన్చార్జి శుభాకరరాజు పాల్గొన్నారు. నేనే రాజు.. నేనే మంత్రి.. పక్కా మాస్ సినిమా. కుటుంబసమేతంగా చూడొచ్చు. రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ భార్యాభర్తల అనుబంధమే ముఖ్యాంశం. ఇది అందరికీ నచ్చుతుంది. – రానా, కాజల్ -
నా అన్నయ్య సినిమా వచ్చేస్తోంది : సమంత
నటి సమంత తన అన్నయ్య రానా దగ్గుబాటి పోస్టర్‌ను చూసి తెగ మురిసిపోతుంది. రానా కథానాయకుడిగా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఈ శుక్రవారం విడుదులవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రానా భారీ కౌటౌట్ చూసి తెగ సంబరపడింది ఈ అమ్మడూ.. ఈ ఫోటోను ట్విటర్లో పోస్టు చేస్తూ హో మా సూపర్ స్టార్ అన్నయ్య సినిమా కౌటౌట్.. ఫస్ట్ డే ఫస్ట్ షో అని ట్వీట్ చేసింది. Woo hoo .. and that's my superstar brother @RanaDaggubati #nenerajunenemantri ❤️❤️❤️ #FDFS #August11 pic.twitter.com/PQ6Yc8qTLP — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 9 August 2017 సమంత పెట్టిన ఈ ట్వీట్‌కు 4000కి పైగా లైక్‌లు, మూడు వందలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. ప్రస్తుతం సమంత ‘రంగస్థలం’, ‘రాజు గారి గది 2’, ‘మహానటి’ చిత్రాల్లో నటిస్తోంది. సమంత త్వరలో నాగచైతన్యను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. రానాకు నాగ చైతన్య వరుసకు బావకాగా..ఈ వరుసతోనే ఈ ముద్దుగుమ్మ రానాకు చెల్లి కానుంది. కాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని కేఎల్ యూనివర్సిటీలో నేనే రాజు.. నేనే మంత్రి టీమ్ సందడి చేసింది. సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో రానా, హీరోయిన్ కాజల్ బుధవారం యూనివర్సిటీకి వచ్చారు. అయితే వీరిని చూసేందుకు భారీ సంఖ్యలో విద్యార్ధులు గూమికూడారు. విద్యార్ధులు రానాతో కరచాలనం కోసం పోటీ పడటంతో వారిని ఆపడం సెక్యూరిటీ వల్ల కాలేదు. దీంతో చిత్ర యూనిట్ అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయింది. -
రాజశేఖర్‌తో అనుకున్న సినిమా రానాతో చేశారా..!
బాహుబలి లాంటి భారీ సినిమా తరువాత యంగ్ హీరో రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. కొంత కాలంగా సరైన సక్సెస్ లు లేక ఇబ్బందుల్లో ఉన్న తేజ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కింది. ఈ శుక్రవారం (11-08-2017) రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబందించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. కొంత కాలం క్రితం తేజ సీనియర్ హీరో రాజశేఖర్ తో అహం అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే క్లైమాక్స్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఆ సినిమా సెట్స్ మీదకు రాలేదు. తరువాత అదే కథను రానాతో నేనే రాజు నేనే మంత్రి గా మార్చి చేశారట. రాజశేఖర్ సినిమాను తీసుకున్నట్టుగా చెప్పకపోయినా.. అహం కథనే రానా కోసం కొన్ని మార్పులు చేసినట్టుగా నిర్మాత సురేష్ బాబు తెలిపారు. మరి రాజశేఖర్ అనుకున్న క్యారెక్టర్ కు రానా ఎంత వరకు సూట్ అవుతాడు. రానాకు తగ్గట్టుగా కథలో ఏం మార్పులు చేశారో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఎవరూ వెనక్కి వెళ్లలేని పరిస్థితి!
– డి.సురేశ్ బాబు ‘‘సినిమా ఇండస్ట్రీలోకి నిర్మాతగా, డైరెక్టర్‌గా, రైటర్‌గా, యాక్టర్‌గా రావాలని చాలామంది అనుకుంటారు. కానీ అందరి కలలు నిజం కావు. తక్కువమంది సక్సెస్ అవుతారు. నాకు మా ఫాదర్ (డి. రామానాయుడు) ఒక కంపెనీ తయారు చేసి పెట్టారు. నా తమ్ముడు (వెంకటేశ్) యాక్టర్. తనతో సినిమాలు తీస్తున్నాను. ఇప్పుడు నా కొడుకు (రానా) కూడా ఉన్నాడు. ఎక్కడో నేను బ్లెస్డ్ అనుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. రానా, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. డి.సురేశ్‌బాబు, సీహెచ్. భరత్‌చౌదరి, వి.కిరణ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఇది రాధ, జోగేంద్ర స్టోరీ. రాధ, జోగేంద్ర చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. తర్వాత లవర్స్.. ఆ తర్వాత భార్యాభర్తలు. అనుకోని కారణాల వల్ల రాధకు దూరమవుతాడు జోగేంద్ర. చివరికి రాధ దగ్గరకు వెళ్లి ఫైనల్‌గా ఎలా సెట్ అయ్యాడన్నదే చిత్రకథ. మూడో అమ్మాయి క్యాథరిన్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది’’ అన్నారు. ఈ నెల 11న మరో రెండు సినిమాలు విడుదలవుతున్న విషయం గురించి సురేశ్‌బాబు ప్రస్తావిస్తూ – ‘‘ఒక్కొక్కసారి పండగకు మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి. అన్నీ బాగానే ఆడతాయి. అలాగే ఈ నెల 11ని ప్రేక్షకులు పండగలా, అన్ని సినిమాలను ఆదరిస్తారనుకుంటున్నాను. మిగతా సినిమాల నిర్మాతలతో సంప్రదించడం జరిగింది. కానీ, ఎవరూ వెనక్కు వెళ్లలేని పరిస్థితి. ఎవరైనా వెనక్కు వెళితే భయపడ్డారనే పుకార్లు వస్తాయి. అందుకే వెళ్లలేదు. మా సినిమాపై నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సినిమాల గురించి సురేశ్‌బాబుగారి దగ్గర ఏడాది పాటు ఒక పీజీ డిప్లొమా కోర్స్ చేసినట్లు ఉంది. ప్రీ–ప్రొడక్షన్ వర్క్ బాగా చేస్తే ప్రొడక్షన్లో అన్ని బాధలు తగ్గుతాయని ఆయన దగ్గర నేర్చుకున్నాను. తేజగారు బాగా డైరెక్ట్ చేశారు. రానా సూపర్‌గా యాక్ట్ చేశారు’’ అని కిరణ్‌రెడ్డి అన్నారు. ‘‘గ్రేట్ ప్రొడ్యూసర్ సురేష్బాబుగారితో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. కథను నమ్మి ఈ సినిమా తీశాం. రానాగారిని ఈ సినిమా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతుందన్న నమ్మకం ఉంది. తేజగారి లాంటి డైరెక్టర్‌తో సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు భరత్ చౌదరి. -
బిగ్‌బాస్‌లో రానా?
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో టీవీ రేటింగ్స్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. 14 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటికే సంపూర్ణేష్ బాబు, జ్యోతి, మధుప్రియ నిష్క్రమించగా కంటిస్టెంట్ల సంఖ్య 11 మందికి తగ్గిపోయింది. అంతలోనే 'బంతిపూల జానకి' సినిమా ఫేం దీక్షా పంత్‌ను వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తాజా ఈ షోలో మరో సెలబ్రిటీ కనిపించనున్నారు. నెం.1 యారీ ప్రోగ్రామ్ ద్వారా యాంకర్‌గా మారిన దగ్గుబాటి రానా బిగ్‌బాస్‌లో పాల్గొననున్నారు. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో ముఖ్య అతిథి షోలో ఆయన కనిపించనున్నారు. ఎన్టీఆర్‌తోపాటు ఆయన ఉంటారని సమాచారం. ఇందులో పాల్గొనేందుకు రానా శనివారం ఇక్కడి నుంచి పూణే బయలుదేరారు. అయితే ఇందులో రానా వెళ్లేది మిగతా సభ్యులతో కలిసి ఆడటానికి మాత్రం కాదు. త్వరలో విడుదల కానున్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈకార్యక్రమంలో పాల్గొననున్నారు. -
రానాకి యాక్టింగ్ వస్తుందా.. రాదా?అనే భయం ఉండేది .
– నిర్మాత డి. సురేశ్‌బాబు ‘‘మా వాడు(రానా) హీరో అయ్యాక తనతో నేను తీస్తున్న తొలి చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. మామూలుగా కథలంటే నాకు చాలా భయం. కథ సెలక్ట్ చేయడం కష్టం. నా కొడుకు సినిమాకి కథ అంటే ఇంకా కష్టం’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు అన్నారు. రానా, కాజల్, కేథరిన్, నవదీప్ ముఖ్య పాత్రల్లో తేజ దర్శకత్వంలో డి.రామానాయుడు సమర్పణలో సురేశ్‌బాబు, ఎం.వి. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులో రానా చేసిన జోగేంద్ర పాత్ర పేరుతో ‘జోగేంద్ర యువగర్జన’ అనే కార్యక్రమం నిర్వహించారు. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘తేజ చెప్పిన కథ బాగుందనిపించి వినమని రానాకు చెప్పా. రానాకూ నచ్చింది. నేను తండ్రిని కాబట్టి.. వీడికి యాక్టింగ్ వస్తుందా? రాదా? అనే భయం ఉండేది. తొలి షెడ్యూల్ ఫస్ట్ కాపీ చూసిన కిరణ్‌రెడ్డి ‘అదిరిపోయింది సార్’ అనడంతో ధైర ్యం వచ్చింది’’ అన్నారు. రానా మాట్లాడుతూ– ‘‘వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నేనెప్పుడూ దేవుడిగా చూసే వ్యక్తి ఎన్టీఆర్‌గారు. ఈ చిత్రంలోని నా పాత్రలో (జోగేంద్ర) ఎన్టీఆర్‌గారి, ఎం.జీ.ఆర్.గారి ఫిలాసఫీ ఉంటాయి. అందుకే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేశా. ఈ చిత్రం మా తాత (రామానాయుడు) చూడలేకపోయారనే లోటు ఉంది. ఈ రోజు ఇక్కడ నిలుచున్నానంటే ఆయనవల్లే. ఆయనతో ఒక్క సినిమా కూడా చేయలేదనే బాధ కూడా ఉంది. మా నాన్న చాలా మంచి నిర్మాత. తేజగారి వద్ద చాలా చాలా నేర్చుకున్నా. మంచి సినిమాలు చేద్దామనే నటుణ్ణి అయ్యా. వెంకటేశ్‌గారి ఫ్యాన్స్ అండగా ఉన్నారనే ధైర్యంతో ముందుకెళుతున్నా. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇతర భాషల సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమా అయినా చేస్తా’’ అన్నారు. ‘‘కథ రాయగానే రానాకి కరెక్ట్‌గా సరిపోతుందనుకున్నా. కథ వినగానే రానా, కాజల్ ఓకే అన్నారు’’ అని తేజ చెప్పారు. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి, మాటల రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, లక్ష్మీ భూపాల్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు. -
జోగేంద్ర యువగర్జన
-
ఆశల పల్లకిలో కాజల్
తమిళసినిమా: నటి కాజల్ సినీ పయనం జోర్ధార్గా సాగిపోతోందనే చెప్పాలి. నటిగా 10 ఏళ్ల నిరంతర పయనంలో అప్రహతంగా 50 చిత్రాల మైలురాయిని టచ్ చేసినట్లు ఈ అమ్మడు ఇటీవల కాస్త గర్వంగానే చెప్పుకొచ్చింది. అదేవిధంగా కోలీవుడ్‌లో టాప్ హీరోలు విజయ్, అజిత్‌లతో ఏకకాలంలో నటిస్తున్న అరుదైన క్రెడిట్‌ను కొట్టేసిన నటి కాజల్‌అగర్వాల్. వీటితో పాటు, హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంది. కాగా అజిత్‌తో రొమాన్స్ చేసిన వివేగం చిత్రం ఆగస్ట్ నెల రెండవ వారంలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆయనతో నటించిన తొలి చిత్రం కావడంతో చాలా ఎగ్జైట్‌గా ఎదురుచూస్తోంది.అదే విధంగా తెలుగులో తనకు తొలి అవకాశం కల్పించిన దర్శకుడు తేజ దర్శకత్వంలో తాజాగా నటించిన తెలుగు చిత్రం నేనే రాజా నేనేమంత్రి తమిళంలోనూ నాన్ ఆణైయిట్టాళ్ పేరుతో విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో ఆ ఏడాది తనకు చాలా స్పెషల్ అంటున్నా కాజల్‌అగర్వాల్ కొత్తగా ఒక టార్గెట్ పెట్టుకుందట. నటి సమంత అంగీకరించిన చిత్రాలను చకచకా పూర్తి చేసి ప్రియుడు నాగచైతన్యతో మూడుముళ్లకు సిద్ధం అవుతుండడంతో ఆమె కోసం ఎదురుచూస్తున్న అవకాశాలను రాబట్టుకునే ప్రయత్నంలో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో విజయ్, అజిత్, సూర్య, కార్తీ, ధనుష్ అంటూ ప్రముఖ కథానాయకులందరితోనూ నటించేసింది. ఇప్పుడు ఈ అమ్మడి చూపు సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై పడిందట.ఆయనతో నటించడమే టార్గెట్‌గా పెట్టుకుందట. త్వరలోనే అలాంటి అవకాశం వస్తుందనే ఆశలపల్లకిలో కలలు కంటోందట. -
జోగేంద్రగా రానా!
తమిళసినిమా: బాహుబలి చిత్రంలో భళ్లలాదేవ పాత్రలో నటుడు రానాను ప్రపంచ సినీ ప్రేక్షకులు ఇంకా మరచిపోనేలేదు. తాజాగా జోగేంద్రగా తెరపైకి రానున్నారు. అవును సురేశ్ ప్రొడక్షన్ పతాకంపై దివంగత ప్రఖ్యాత నిర్మాత డి.రామానాయుడు దివ్యాశీసులతో డి.సురేశ్‌బాబు నిర్మిస్తున్న తాజా తెలుగు చిత్రం నేనేరాజా నేనే మంత్రి. రానా కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో నటి కాజల్‌అగర్వాల్ నాయకిగా నటిస్తోంది. నటి క్యాథరిన్ ట్రెసా, నాజర్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి తేజా దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ నాన్ ఆణైవిట్టాళ్ పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు తేజ మాట్లాడుతూ తాను ఎంజీఆర్ వీరాభిమానినన్నారు. తమిళంలో చిత్రాలు చేయాలన్న ఆశ ఉన్నా అవకాశాలు రాలేదన్నారు. నాన్ ఆణైయిట్టాళ్ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం అని తెలిపారు. ఈ చిత్రంలో 100 మంది ఎంఎల్ఏలను తీసుకెళ్లి ఫామ్ హౌస్‌లో పెడితే నేనూ ముఖ్యమంత్రినవుతాననే సన్నివేశం ఉందన్నారు.ఈ సన్నివేశాన్ని చిత్రీకరించిన తరువాత తమిళనాడు రాజకీయాల్లో సరిగ్గా ఇలాంటి సంఘటనే నిజంగా జరగడం విశేషం అన్నారు. ఎంజీఆర్ శతాబ్దిలో విడుదల కాగా ముందుగా చిత్ర నిర్మాత డి.సురేశ్‌బాబు మాట్లాడిన విడియోను ప్రదర్శించారు.అందులో ఆయన పేర్కొంటూ తన తండ్రి తెలుగులో నిర్మించిన రాముడు భీముడు చిత్ర తమిళ రీమేక్‌లో ఎంజీఆర్ ఎంగవీటిపిళ్లై పేరుతో నటించారన్నారు.అందులో పచ్చైకిళ్లి ముత్తుచ్చారం అనే పాటను ఈ చిత్రంలో పొందుపరచడం విశేషంగా పేర్కొన్నారు. అప్పటి నుంచే తన తండ్రికి ఎంజీఆర్‌తో సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన నటించిన ఎంగవీటి పిళ్లై చిత్రంలోని పాట పల్లవి అయిన నాన్ ఆణైయిట్టాళ్ను తమ చిత్రానికి పేరుగా నిర్ణయించడం, ఈ చిత్రాన్ని ఎంజీఆర్ శతాబ్ధి తరుణంలో విడుదల చేయనుండడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర కథానాయకుడు రానా మాట్లాడుతూ బాహుబలిలో భళ్లాలదేవ పాత్ర, సబ్‌మెరైన్ నేపథ్యంలో ఘాజీ వంటి చిత్రాలు చేశానని, ఇప్పుడు నటించిన నాన్ ఆణైయిట్టాళ్ చిత్రం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. తేజా దర్శకత్వంలో నటించడం సరి కొత్త అనుభవం అని తెలిపారు. బాహుబలి చిత్రంలో భళ్లాలదేవ కింగ్ కావాలని ఆశ పడతాడని, ఇందులో జోగేంద్ర తానే కింగ్‌గా భావిస్తాడని రానా తెలిపారు. ఇక సాధారణ యువకుడు కాంప్లెక్స్ లోకంలోకి వెళ్లితే ఎలాంటి సంఘటనలను ఎదుర్కోవలసి వస్తుందన్నదే నాన్ ఆణైయిట్లాళ్ చిత్రం అని రానా అన్నారు. -
రాధ మీద ప్రేమే రాక్షసుడిగా మార్చేసింది..!
యంగ్ హీరో రానా, తేజ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కథపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేశారు. తేజ గత సినిమాల మాదిరిగానే ఈసినిమా కూడా ప్రేమ కోసం జరిగే యుద్ధం నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో రాధ లేనిదే జోగేంద్ర లేడు అంటూ హిట్ ఇచ్చిన తేజ, తాజా పోస్టర్ తో మరింత క్లారిటీ ఇచ్చాడు. పొలిటీషియన్ గెటప్ లో రానా కూర్చొని ఉన్న స్టిల్ తో రిలీజ్ అయిన పోస్టర్ లో 'రాధ మీద జోగేంద్ర ప్రేమే అతన్ని రాక్షసుడిలా మార్చేసింది' అనే క్యాప్షన్ రాసారు. దీంతో తన భార్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగానే జోగేంద్ర రాజకీయ వ్యవస్థను శాసించే నియంత మారతాడు. ఈ సినిమాలో రానా భార్య రాధగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న నేనే రాజు నేనే మంత్రి తెలుగుతో పాటు తమిళ, మలయాళ బాషల్లోనూ ఒకేసారి రిలీజ్ అవుతోంది. -
'నేనే రాజు నేనే మంత్రి' వర్కింగ్ స్టిల్స్
-
ముందు నాకూ అర్థం కాలేదు... వింతగా అనిపించింది!
‘‘థియేటర్లో సినిమా స్టార్ట్ అవ్వడానికి టైమ్ ఉంటే ప్రేక్షకులు మూవీ పోస్టర్లను చూస్తుంటారు. క్యాంటీన్‌కు వెళుతుంటారు. ఇప్పుడు ఈ ఆగ్మెంటెడ్ రియాల్టీ టెక్నాలజీతో కూడిన స్టాండీలు వచ్చిన తర్వాత తమ అభిమాన స్టార్లతో ప్రేక్షకులు ఫొటోలు దిగే అవకాశం ఉంటుంది’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. రానా, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, సీహెచ్ భరత్ చౌదరి, వి. కిరణ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆగ్మెంటెడ్ రియాల్టీ అనే కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ టెక్నాలజీ గురించి హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ముందు ఈ టెక్నాలజీ నాకు అర్థం కాలేదు. వింతగా అనిపించింది. మాములు స్టాండీలకు (సినిమా పోస్టర్లు), ఆగ్మెంటెడ్ స్టాండీలకు తేడా ఉంది. ఫస్ట్ టైమ్ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో స్టార్ట్ చేస్తున్నాం. ఈ అగుమెంటెడ్ టెక్నాలజీతో కూడిన స్టాండీలను మణిశంకర్ అండ్ టీమ్ డెవలప్ చేశారు. ప్రస్తుతం ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ఆడబోయే అన్ని థియేటర్లకు 650 స్టాండీలను పంపించడం జరిగింది. పేటెంట్ రైట్స్ మావి అని కాదు. మణిశంకర్ అండ్ టీమ్ చేస్తారు. మేం హెల్ప్ చేస్తున్నాం. మిగతా సినిమాల నిర్మాతలు ఎవరైనా ఇలా చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు’’ అన్నారు. ‘‘ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్టార్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్స్టార్లో ఉన్న స్కానింగ్ ఆప్షన్ ద్వారా ఆగ్మెంటెడ్ స్టాండీలపై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసుకున్న వెంటనే ఈ స్టాండీకి సంబంధించి లింకై ఉన్న వీడియోలో యాక్టర్లు వచ్చి మాట్లాడుతుంటారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ ఎలా కావాలంటే అలా ఫొటోలు దిగవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి స్కానింగ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకుని ఆగ్మెంటెడ్ స్టాండీలపై ఉన్న క్యూర్ కోడ్‌ని స్కాన్ చేసి కూడా యాప్స్టార్ను డౌన్లోడ్ చేసుకుని ఫొటోలు దిగవచ్చు. ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు. యాప్స్టార్లో ఉన్న ఆప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు’’ అని మణిశంకర్ అండ్ టీమ్ తెలిపారు. -
తేజ.. పెద్ద కథే చెబుతున్నాడు..!
చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు తేజ, రానా హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా ఈ సారి ఓ పొలిటికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్, సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్కు కూడా మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా రన్ టైంకు సంబంధించిన అప్డేట్ ఒకటి మరోసారి తేజ సినిమా రిజల్ట్‌పై అనుమానాలు కలిగిస్తోంది. దాదాపుగా ఇటీవల రిలీజ్ అవుతున్న సినిమాలన్ని రెండు గంటల రన్ టైంకు ఓ పది నిమిషాలు అటు ఇటుగా రూపొందుతున్నాయి. అలాంటి సినిమాలనే కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. కానీ తేజ మాత్రం నేనే రాజు నేనే మంత్రి సినిమా రన్ టైంను ఏకంగా రెండు గంటల నలబై నిమిషాలుగా ఫిక్స్ చేశాడు. ఇది థ్రిల్లర్ సినిమా కావటంతో రన్ టైం తక్కువగా ఉంటుందని భావించారు. కానీ చిత్రయూనిట్ రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాను రెడీ చేశారు. మరి అంత సేపు అభిమానులను థ్రిల్ చేసే కథ తేజ రెడీ చేశాడా..? నేనే రాజు నేనే మంత్రి సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది..? అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. -
వారి కుట్రలు నాపై సాగవు!
తమిళసినిమా: నాపై కుట్రలు పన్నుతున్నారు. అయితే అవి నన్నేమి చేయలేవు. నా స్థాయిని ఎవరూ కుదించలేరు అంటోంది నటి కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కోలీవుడ్‌లో విజయ్, అజిత్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో నటిస్తున్న ఏకైక హీరోయిన్ కాజల్‌అగర్వాలే. అదేవిధంగా తెలుగుతో పాటు హిందీలోనూ అవకాశాలను అందుకుంటున్న నటి కాజల్. తెలుగులో రానాతో రొమాన్స్ చేసిన నేనేరాజా నేనేమంత్రి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక హిందీలో సన్నిడియోల్‌తో నటించే లక్కీచాన్స్ ఈ బ్యూటీని వరించిదనే ప్రచారం జరుగుతోంది. తాజాగా పి.వాసు దర్శకత్వంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేయనున్నట్లు టాక్ ప్రచారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్అగర్వాల్పై వదంతులు జోరుగానే సాగుతున్నాయన్నది గమనార్హం. ఆ మధ్య ఒక భేటీలో తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని, తనకు కాబోయే వరుడు సినిమారంగానికి చెందిన వాడైనా, లేదా మరే ఇతర రంగాలకు చెందిన వాడైనా పర్వాలేదని, తను అందంగా లేకపోయినా పర్వాలేదు గానీ కచ్చితంగా ఆరడుగుల పొడగాటి వాడై ఉండాలని పేర్కొన్నారు. దీంతో కాజల్ ప్రేమలో పడ్డారనే ప్రచారం జోరందుకుంది. ఒక ప్రముఖ టాలీవుడ్ నటుడితో తరచూ రహస్యగా కలుసుకుంటున్నారని, అదే విధంగా ఇటీవల అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం హల్చల్ చేసింది. ఇలాంటివి కాజల్‌ను కలతకు గురిచేశాయట. దీంతో ఈ అమ్మడు కాస్త ఘాటుగానే స్పందించారు.తన ఎదుగుదలను ఓర్వలేని వారే ఇలాంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నారు.ఇదంతా వారు తనపై పన్నుతున్న కుట్ర అని ఆరోపించారు. అయితే వారి కుట్రలు పారవని, మరి కొన్నేళ్ల వరకూ తాను అగ్రహీరోలతోనే నటిస్తానని కాజల్‌అగర్వాల్ అన్నారు. తన స్థానాన్ని ఎవరూ కదిలించలేరు అనే ధీమాను వ్యక్తం చేశారు. -
నేనలా చేసింది మీరు చూశారా ? నటి
నేనలా చేసింది మీరు చూశారా అంటూ మీడియా పై మండిపడుతోంది నటి కాజల్‌అగర్వాల్. ఇంతకీ ఈ అమ్మడి అగ్రహానికి కారణం ఏమటనేగా మీ ప్రశ్న. కాజల్ అందగత్తే నోడౌట్ ఎబౌటిట్. నటనలో పరిణితి చెందిన నటి కూడా. అందుకే అగ్రనాయికల్లో ఒకరిగా రాణిస్తోంది. మధ్యలో కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, దశాబ్దం కాలంగా కాథానాయకిగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటూ వస్తోంది. ఇటీవల తెలుగు చిత్రం ఖైదీ నంబర్ 150లో మెగాస్టార్ చిరంజీవితో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు లాంటి ఆటలతో ఇరగదీసి కాజల్ తాజాగా తమిళంలో విజయ్‌కు జంటగా మెర్స్‌ల్, అజిత్‌తో వివేగం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులోనూ తన 50వ చిత్రం నేనేరాజు నేనేమంత్రి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉంది. అంతా బాగానే ఉంది. కాజల్ తన అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయమే కాజల్ కోపాన్ని హైపీచ్కు తీసుకెళ్లింది. అంతే తాను శస్త్ర చికిత్స చేయించుకోవడం మీరు చూశారా ? అంటూ ఆవేశపడిపోయింది. నిజానికి ఈ 32 ఏళ్ల పడుచు మునుపటి కంటే మెరుగైన అందాలతో కనిపిస్తోంది. అయితే తను అందాన్ని మెరుగు పరచుకోవడం కోసం శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఈ అమ్మడు కొట్టిపారేసింది. తనకు అలాంటి అవసరం లేదని, తన అందం సహజ సిద్ధమేనని చెప్పుకొచ్చింది. తాను డైట్లో ఉన్నానని, నిత్యం కసరత్తులు కూడా చేస్తున్నానని తెలిపింది. ఇవే తన సౌందర్య రహస్యం అని కాజల్ చెప్పింది. -
రానా కెరీర్లో తొలిసారి..!
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సత్తా చాటుతున్న యువ నటుడు రానా. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. హీరో క్యారెక్టరే చేస్తానంటూ పట్టుపట్టకుండా, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు రానా. బాహుబలి సినిమా నేషనల్ స్టార్ గా మారిన ఈ మేన్లీ స్టార్ సోలో హీరోగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఓ టీవీ షోలో భాగంగా రానా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నెం. 1 యారి విత్ రానా షోలో పాల్గొన్న నాగచైతన్య, సుమంత్‌లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇంతవరకు తన చేసిన సినిమాల్లో తనపై పెళ్లి సీన్లు చిత్రీకరించలేదని, తొలిసారిగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాలోనే పెళ్లి సీన్లో నటించానని తెలిపాడు. అయితే నిజజీవితంలో పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు మాత్రం రానా సమాధానం చెప్పలేదు. -
రానా సినిమాకు రికార్డ్ ప్రైజ్..!
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి నటుడిగా మారిన రానా, ఇప్పుడు సోలో హీరోగా సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. తేజ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు రానా. బాహుబలి తరువాత రానాకు ఉన్న క్రేజ్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అంతేకాదు ఈ సినిమాతో రానా మరో రికార్డ్ సృష్టించాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా బాలీవుడ్ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి కన్నా ముందు నుంచే బాలీవుడ్ కు పరిచయమున్న రానా, బాహుబలి తరువాత అక్కడ స్టార్ గా మారిపోయాడు. అందుకే ఈ సినిమా రైట్స్ ను ఏకంగా 11 కోట్లకు సొంతం చేసుకున్నారట బాలీవుడ్ నిర్మాతలు. అత్యధికంగా మహేష్ బాబు, మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా బాలీవుడ్ రైట్స్ 20 కోట్లు పలకగా, రానా నేనే రాజు నేనే మంత్రి రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల రిలీజ్ అయిన అల్లు అర్జున్, డీజే దువ్వాడ జగన్నాథమ్ రైట్స్ 8 కోట్లు మాత్రమే పలకటం విశేషం. -
షూటింగ్ పూర్తి చేసుకున్న 'నేనే రాజు నేనే మంత్రి'
సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భారత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. రాణా టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో కాజల్, కేథరిన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం 24 గంటల్లోపే 4 మిలియన్ వ్యూస్ సాధించి సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు తేజ మాట్లాడుతూ.. 'రాణాలోని సరికొత్త యాంగిల్ ను 'నేనే రాజు నేనే మంత్రి'లో చూస్తారు. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ చిత్రంలో రాణా యాటిట్యూడ్ ఉంటుంది. జోగేంద్ర పాత్రలో రాణా ఒదిగిపోయిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది' అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'రాణా కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమాపై మాకున్న నమ్మకం ద్విగుణీకృతం అవుతోంది. తేజ టేకింగ్ చాలా కొత్తగా ఉండబోతోంది. లక్ష్మీ భూపాల్ సంభాషణలకి థియేటర్లలో విజిల్స్ వేస్తారు, ఆయన డైలాగ్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నేటి(శనివారం)తో చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి' అన్నారు. -
టార్గెట్... సీయం కుర్చీ!
అతను అల్లూరి సీతారామరాజు కాదు... సుభాష్ చంద్రబోస్ కాదు... భగత్‌సింగ్ కూడా కాదు! కానీ, టీవీల్లో ముప్ఫై ఏళ్ల ఆ యువకుడి జీవితం గురించి తెగ చెప్పేస్తున్నారు. అతని పేరు... జోగేంద్ర. అతని టార్గెట్... సీయం కుర్చీ! అతని బలం... ‘వందమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి స్టార్ హోటల్లో పెడితే సాయంత్రానికి నేనూ అవుతా సీయం’ అంటూ ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ విసిరేంత! మరి, అనుకున్న టైమ్‌లో అతను టార్గెట్ రీచ్ అయ్యాడా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘నేనే రాజు నేనే మంత్రి’ చూసి తెలుసుకోమంటున్నారు దర్శకుడు తేజ. ఆయన దర్శకత్వంలో రానా హీరోగా డి. సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరి నిర్మించిన చిత్రమిది. కాజల్ అగర్వాల్, కేథరిన్ త్రెసాలు హీరోయిన్లు. ఈ సినిమా చిత్రీకరణ శనివారంతో పూర్తయింది. ‘‘నటుడిగా రానాలో కొత్త కోణాన్ని చూస్తారు. ప్రేక్షకుల ఊహకు అందని విధంగా సినిమాలో రానా యాటిట్యూడ్ ఉంటుంది’’ అన్నారు తేజ. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌ను 40 లక్షలమంది నెటిజన్లు చూశారు. ప్రేక్షకుల స్పందన చూస్తోంటే మా నమ్మకం బలపడుతోంది. రానా కెరీర్లో మైలురాయిగా నిలిచే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: వెంకట్ సి. దిలీప్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: నారాయణరెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్–లక్ష్మీ భూపాల్–సురేంద్ర కృష్ణ, ఫైట్స్: రవివర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిబొట్ల, సమర్పణ: డి. రామానాయుడు. -
సాయంత్రానికి సీఎం అవుతా: హీరో
హైదరాబాద్: ‘వందమంది ఎమ్మెల్యేలను స్టార్ హోటల్లో కూర్చోబెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం’ అంటున్నాడు దగ్గుబాటి రానా. అతడి చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ లోని డైలాగ్ ఇది. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం సీటు నా ముడ్డి కింద ఉండాలి. పాముకు పుట్ట కావాలంటే చీమలే కదా కష్టపడాలి’ అంటూ రానా చెప్పిన డైలాగులు అభిమానులను అలరించేలా ఉన్నాయి. ఇంతకుముందు విడుదలైన టీజర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజకీయ నాయకుడి పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా సరసన కాజల్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను డి. సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. -
డిసైడ్ అయ్యాక నేనే చెప్తా : రానా
తన నెక్ట్స్ సినిమా పై మీడియాలో జరుగుతున్న ప్రచారం పై యంగ్ హీరో రానా స్పందించాడు. త్వరలో స్టార్ వివి వినాయక్ దర్శకత్వంలో రానా నటించబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే విషయాన్ని ట్విట్టర్ లో ద్వారా తెలుసుకున్న రానా.. తాను ఏ సినిమా చేయాలన్నది ఫిక్స్ అయితే.. తానే ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తానని ఇలాంటి రూమర్స్ నమ్మవద్దని తెలిపాడు. బాహుబలి సినిమాలోని భల్లాలదేవుడి పాత్రలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా, ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ను జూన్ 23న రిలీజ్ చేయనున్నారు. -
రాధ పుట్టినరోజుకు రాజుగారే బహుమతి!
చాలు... ఇది చాలు! ఇంతకు మించిన పుట్టినరోజు బహుమతి ఏముంటుంది చెప్పండి! అంటున్నారు కాజల్ అగర్వాల్. ఈ రోజు (జూన్ 19) ఆమె బర్త్‌డే. అంతే కాదండోయ్... కథానాయికగా కాజల్ జరుపుకుంటోన్న 10వ పుట్టినరోజు. దర్శకుడు తేజ ‘లక్ష్మీ కల్యాణం’తో కథానాయికగా పరిచయమైన కాజల్, ఈ పదేళ్లలో 50 సినిమాలు చేశారు. ఎన్నో బర్త్‌డే గిఫ్టులు అందుకున్నారు. మరి, ఈ బర్త్‌డేకు అంతలా సంతోషపడే స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్ ఏం అందుకున్నారు? అని కాజల్‌ను అడిగితే... ‘‘రానాకు జోడీగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ఈ బర్త్‌డే గిఫ్ట్’’ అన్నారు. ఈ సినిమాలో అంత స్పెషాలిటీ ఏముంది? అనడిగితే... ‘‘హీరోయిన్గా నా 50వ సినిమా ఇది. అందులోనూ తెలుగు తెరకు నన్ను పరిచయం చేసిన తేజగారి దర్శకత్వంలో, మళ్లీ పదేళ్ల తర్వాత నటించిన ఈ సినిమా నా 50వ సినిమా కావడం కంటే సంతోషం ఏముంటుంది చెప్పండి’’ అన్నారామె. డి. సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరిలు నిర్మించిన ‘నేనే రాజు నేనే మంత్రి’లో రాధ పాత్రలో కాజల్ కనిపించనున్నారు. ఇందులో ఇప్పటివరకు చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్ర చేశానని ఆమె తెలిపారు. -
డాక్టర్ రానా... ప్రెగ్నెంట్ కాజల్!!
ప్రెగ్నెంట్ కాజల్ అగర్వాల్ మెడికల్ టెస్టులు చేయించుకోవడం కోసం కర్నూల్ జిల్లాలోని ఓ హాస్పటల్‌కి వెళ్లారు. అక్కడ డాక్టర్ రానా దగ్గుబాటి ఆమెకు స్కానింగ్, గట్రా చేశారు. చట్టరీత్యా నేరం కాబట్టి కాజల్‌కు పుట్టబోయేది అమ్మాయా? అబ్బాయా? అనేది మాత్రం చెప్పలేదు. వెయిట్... వెయిట్... ఒక్క నిమిషం ఆగండి! రానా డాక్టర్ అయ్యిందెప్పుడు? కాజల్ ప్రెగ్నెంట్ కావడం ఏంటి? అనుకుంటున్నారా!! తేజ దర్శకత్వంలో నటిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ కోసం ఒకరు డాక్టర్, మరొకరు ప్రెగ్నెంట్ అయ్యారు. ఇటీవలే డాక్టర్‌గా రానా, ప్రెగ్నెంట్‌గా కాజల్ నటించిన సన్నివేశాలు తెరకెక్కించారట! ‘నేనే రాజు నేనే మంత్రి’లో రాజకీయ నాయకుడి పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డాక్టర్ అంటే... వైద్య వృత్తిలో నుంచి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తిగా రానా కనిపిస్తారేమో మరి! లేదంటే... డ్యూయల్ రోల్ ఏమైనా చేస్తున్నారా! వెయిట్ అండ్ సీ!! రానా సరసన కాజల్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను డి. సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. నెం.1 ఎవరు? ఎవరు? నంబర్ వన్ ఎవరు? అంటున్నారు రానా! ఇప్పుడీ నంబర్ల గోల ఎందుకు? అంటే... త్వరలో ఆయన బుల్లితెరపై అడుగుపెట్టనున్నారు. ‘నెం.1 యారి’ అనే టీవీ కార్యక్రమానికి రానా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ‘యారి’ అంటే ‘ఎవరు’ అని అర్థం అయ్యుండొచ్చు. ఈ కార్యక్రమం జెమిని టీవీలో ప్రసారం కానుంది. నిన్న ఈ న్యూస్ కన్ఫర్మ్ చేసిన రానా, ‘నెం.1 యారి’ టీజర్ విడుదల చేశారు. ‘బిగ్ బాస్’కి ఎన్టీఆర్, ఇప్పుడీ ‘నెం.1 యారి’కి రానా... మరి హోస్ట్‌గా టీవీపై అడుగుపెట్టే నెక్స్›్ట యంగ్ హీరో ఎవరో? వీళ్ల బాటలో ఇంకెంతమంది నడుస్తారో!! -
ఆసుపత్రిలో కాజల్, రానా
బనగానపల్లె రూరల్: సినీ హీరో రానా, హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంగళవారం బనగానపల్లె ఆసుపత్రికి చేరుకున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్‌ను అక్కడ నిర్వహించారు. మూడు రోజులుగా యాగంటి క్షేత్రంలో నిర్వహిస్తున్న షూటింగ్‌ను మంగళవారం రానా, కాజల్ మధ్య ఆసుపత్రిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. గర్భిణిగా కాజల్ ఆసుపత్రికి రాగా, స్కానింగ్ చేసే సన్నివేశాలను షూటింగ్ చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్ గదికి వెళ్లే ప్రధాన గేట్‌కు తాళం వేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఎస్ఐ రాకేష్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. బుధవారం యాగంటిలో షూటింగ్ పూర్తవుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు. -
రాధ... రాణి నడుమ రాజు
నారీ నారీ నడుమ మురారి... ఆ పాట్లు ఎలా ఉంటాయో పడేవాళ్లకు బాగా తెలుసు. ఆన్ స్క్రీన్‌లో ఇద్దరి భామల మధ్య ఇరుకున పడే పాత్రలను చాలామంది హీరోలు చేశారు. ఇప్పుడు రానా ఇద్దరు భామల మధ్య క్రష్ అవుతున్నారు. తేజ దర్శకత్వంలో నటిస్తోన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో రానాకు ఇద్దరు కథానాయికలు. ఒకరు కాజల్ అగర్వాల్. మరొకరు కేథరిన్ థ్రెసా. ‘నేనే రాధ నేనే భార్య’ అని కాజల్ అంటూంటే, కేథరిన్ ఏమో ‘కాదు నేనే రాణి నేనే భార్య’ అంటున్నారు. మరి... ఈ భామలలో రాజుగారిS అసలు భార్య ఎవరు? అనడిగితే... దర్శకుడు తేజ సమాధానం చెప్పేదాకా ఆగాల్సిందే! ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్లో హిట్టు కళ కనిపిస్తూనే ఉంది. ఇప్పుడీ రాధా, రాణిల పరిచయంతో ఆ కళ ఇంకాస్త పెరిగిందనే చెప్పొచ్చు. సురేశ్‌బాబు, భరత్ చౌదరి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. -
'నేనే డిసైడ్ చేస్తా.. నేనే రాజు నేనే మంత్రి'
బాహుబలి, ఘాజీ లాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా చేస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ నేనే రాజు నేనే మంత్రి. సెన్సేషనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఫస్ట్ టీజర్‌ను మూవీ మొగల్ రామానాయుడు జయంతి సందర్శంగా రిలీజ్ చేశారు. రానా రాజకీయనాయకుడు జోగేంద్రగా కనిపించనున్నాడు. ఇప్పటి వరకు కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయిన రానా ఈ సినిమాతో ఎలాగైన సోలోగా మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అదే సమయంలో దర్శకుడు తేజకు కూడా ఈ సినిమా కీలకం కానుంది. కెరీర్ స్టార్టింగ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో అలరించిన తేజ, తరువాత ఆ స్థాయి సక్సెస్‌లు సాధించలేకపోయాడు. అందుకే తన మార్క్ లవ్ స్టోరిలను పక్కన పెట్టి పొలిటికల్ థ్రిల్లర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. -
తాతయ్య జయంతికి టీజర్
తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసి, అత్యధిక భాషల్లో చిత్రాలు నిర్మించి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో స్థానం పొందిన ఏకైక నిర్మాత డి.రామానాయుడు. ఈనెల 6న ఆయన జయంతి. ఆ రోజున ఆయన మనవడు రానా తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్‌ను విడుదల చేయనున్నారు. రానా, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో సురేశ్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రం నిర్మించారు. రానా మాట్లాడుతూ– ‘‘తాతగారి జయంతిన ‘నేనే రాజు నేనే మంత్రి‘ టీజర్ విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను పోషిస్తున్న జోగేంద్ర పాత్ర స్వభావాన్ని టీజర్లో పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘రానా పర్సనాలిటీని మాత్రమే కాదు. అతడిలోని నటుణ్ణి పూర్తి వైవిధ్యంగా ఈ చిత్రంలో రీ ప్రజెంట్ చేస్తున్నా’’ అన్నారు తేజ. ‘రానా కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రమిది’ అన్నారు సురేశ్‌బాబు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: వెంకట్ సి. దిలీప్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిబొట్ల, సమర్పణ: డి. రామానాయుడు. -
మార్పు ఖాయం!
రానా, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో సురేశ్‌బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. టైటిల్ అదేనంటూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘తేజగారు కథ చెప్పినప్పుడే రానా కెరీర్లో ఓ వైవిధ్యమైన చిత్రం అవుతుందనిపించింది. రానాలోని నటుడు మరో కొత్త కోణంలో కనిపించడానికి ఆస్కారం ఉంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనం పట్టించుకోం. పోతే పోనీ అనుకొంటూ దశాబ్దాలుగా బతికేస్తున్నాం. ఈ దృక్పథాన్ని మార్చే చిత్రమే ‘నేనే రాజు నేనే మంత్రి’. రానా పాత్ర సమాజంలో మార్పు తీసుకొస్తుంది’’ అన్నారు తేజ. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిభొట్ల, సమర్పణ: డి. రామానాయుడు. -
మార్పు ఖాయం!
రానా, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో సురేశ్‌బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. టైటిల్ అదేనంటూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘తేజగారు కథ చెప్పినప్పుడే రానా కెరీర్లో ఓ వైవిధ్యమైన చిత్రం అవుతుందనిపించింది. రానాలోని నటుడు మరో కొత్త కోణంలో కనిపించడానికి ఆస్కారం ఉంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనం పట్టించుకోం. పోతే పోనీ అనుకొంటూ దశాబ్దాలుగా బతికేస్తున్నాం. ఈ దృక్పథాన్ని మార్చే చిత్రమే ‘నేనే రాజు నేనే మంత్రి’. రానా పాత్ర సమాజంలో మార్పు తీసుకొస్తుంది’’ అన్నారు తేజ. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిభొట్ల, సమర్పణ: డి. రామానాయుడు. -
జోగేంద్రగా రానా..!
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా మరో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ లో అలరించనున్నాడు. బాహుబలి, ఘాజీ లాంటి చిత్రాలతో డిఫరెంట్ సినిమాల హీరోగా పేరుతెచ్చుకున్న భల్లాలదేవ, నెక్ట్స్ ఓ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నేనే రాజు నేనే మంత్రి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. రానా పొలిటీషన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు జోగేంద్ర అని తెలిపారు. ఈ సినిమాలో రానా సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్న తేజ, తన రెగ్యులర్ స్టైల్ ను పక్కన పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. -
పంద్రాగస్టుకి వస్తున్నారా?
ఆగస్టు 15... మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన రోజు. ఈ ఏడాది సరిగ్గా అదే తేదీన ‘నేనే రాజు – నేనే మంత్రి’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట దర్శకుడు తేజ. రానా, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం రాజకీయాల నేపథ్యంలో రూపొందుతోంది. అందుకే పంద్రాగస్టుకు రావాలనుకున్నారేమో. కేథరిన్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాయలసీమ రాజకీయాలను చూపించనున్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజు ఎవరు? మంత్రి ఎవరు? పాలకులను నిర్ణయించే ప్రజలే రాజులు అంటుంటారు. కానీ, అంతిమంగా అధికారాన్ని ఆసరాగా చేసుకుని కొందరు రాజకీయ నాయకులు చక్రం తిప్పుతున్నారు. ఈ వ్యవస్థపై ఓ యువకుడు ఎలాంటి పోరాటం చేశాడనేది ఈ చిత్ర కథాంశమట! రానా, కాజల్, కేథరిన్... ముగ్గురి పాత్రలూ రాజకీయ కోణాల్లోనే ఉంటాయట. సరికొత్త కథ, కథనాలతో రూపొందుతోన్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని రానా నమ్మకంగా ఉన్నారు. -
నాకేం కావాలో నాకు తెలుసు!
లైఫ్ ఎలా ఉండాలి? అనే విషయంలో క్లారిటీ ఉన్నవాళ్లకు ఏ చీకూ చింతా ఉండదు. తమకేం కావాలో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. అందుకు తగ్గట్టుగా లైఫ్‌ని ప్లాన్ చేసుకుంటారు. కాజల్ అగర్వాల్ ఇలాంటి అమ్మాయే. ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అనాలి. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయం గురించి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ – ‘‘కన్ఫ్యూజన్ అనే పదం నా డిక్షనరీలో ఉండదు. ఫుల్ క్లారిటీతో ఉంటాను. ఆల్మోస్ట్ తెలివిగానే నిర్ణయాలు తీసుకుంటాను. నాకేం కావాలో నాకు బాగా తెలుసు. కరెక్ట్‌గా చెప్పాలంటే స్ట్రాంగ్ గర్ల్‌ని’’ అన్నారు. విచిత్రం ఏంటంటే... తన మనస్తత్వానికి దగ్గరగా ఉన్న పాత్రను ‘నేనే రాజు నేనే మంత్రి’లో కాజల్ చేస్తున్నారు. ఆ పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ఇందులో నేను స్ట్రాంగ్ గర్ల్‌గా నటిస్తున్నాను. రియల్ లైఫ్‌లో నాకేం కావాలో నాకు బాగా తెలుసు. ఈ సినిమాలో నా పాత్ర కూడా అంతే. ఇలాంటి స్ట్రాంగ్ రోల్స్ చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ మధ్య సవాల్ అనిపించే పాత్రలనే సెలక్ట్ చేసుకుంటున్నాను. ఈ పాత్ర అలాంటిదే. ఈ సినిమా విషయంలో ఇంకో విశేషం ఏంటంటే.. నన్ను కథానాయికను చేసిన తేజగారి దర్శకత్వంలో మళ్లీ సినిమా చేస్తున్నాను. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు. -
పార్టీ ప్రచారంలో బిజీ బిజీగా రానా
యంగ్ హీరో రానా కొత్త ఏడాదిలో బిజీ అయ్యాడు. అనంతపురంలోజరుగుతున్న పార్టీ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. చుట్టూ అనుచరులు, కార్యకర్తలతో కలిసి రోడ్ షో నిర్వహిస్తున్నాడు. ఇదంతా పొలిటికల్ పార్టీ కోసం మాత్రం కాదులెండీ. రానా హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు.. నేను మంత్రి సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతోంది. ఇందులో భాగంగా రానా ప్రచారంలో పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే బాహుబలి, ఘాజీ సినిమాల షూటింగ్ పూర్తి చేసిన రానా, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు.. నేనే మంత్రి షూటింగ్లో పాల్గొంటున్నాడు. కాజల్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన రానా, నిన్న (మంగళవారం) తిరిగి షూటింగ్ పాల్గొన్నాడు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న తొలిరోజు షూటింగ్ ఫోటోనూ ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. Day 1 of shoot in 2017 started yesterday in Ananthapur!! Thank you for the love!! pic.twitter.com/PnJoaQF28o — Rana Daggubati (@RanaDaggubati) 4 January 2017