
నేనలా చేసింది మీరు చూశారా ? నటి
నేనలా చేసింది మీరు చూశారా అంటూ మీడియా పై మండిపడుతోంది నటి కాజల్‌అగర్వాల్. ఇంతకీ ఈ అమ్మడి అగ్రహానికి కారణం ఏమటనేగా మీ ప్రశ్న. కాజల్ అందగత్తే నోడౌట్ ఎబౌటిట్. నటనలో పరిణితి చెందిన నటి కూడా. అందుకే అగ్రనాయికల్లో ఒకరిగా రాణిస్తోంది. మధ్యలో కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, దశాబ్దం కాలంగా కాథానాయకిగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటూ వస్తోంది.
ఇటీవల తెలుగు చిత్రం ఖైదీ నంబర్ 150లో మెగాస్టార్ చిరంజీవితో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు లాంటి ఆటలతో ఇరగదీసి కాజల్ తాజాగా తమిళంలో విజయ్‌కు జంటగా మెర్స్‌ల్, అజిత్‌తో వివేగం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులోనూ తన 50వ చిత్రం నేనేరాజు నేనేమంత్రి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉంది. అంతా బాగానే ఉంది. కాజల్ తన అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయమే కాజల్ కోపాన్ని హైపీచ్‌కు తీసుకెళ్లింది. అంతే తాను శస్త్ర చికిత్స చేయించుకోవడం మీరు చూశారా ? అంటూ ఆవేశపడిపోయింది.
నిజానికి ఈ 32 ఏళ్ల పడుచు మునుపటి కంటే మెరుగైన అందాలతో కనిపిస్తోంది. అయితే తను అందాన్ని మెరుగు పరచుకోవడం కోసం శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఈ అమ్మడు కొట్టిపారేసింది. తనకు అలాంటి అవసరం లేదని, తన అందం సహజ సిద్ధమేనని చెప్పుకొచ్చింది. తాను డైట్‌లో ఉన్నానని, నిత్యం కసరత్తులు కూడా చేస్తున్నానని తెలిపింది. ఇవే తన సౌందర్య రహస్యం అని కాజల్ చెప్పింది.