కలక్షన్స్‌ చూసి కంగారుపడ్డా... అంత బాగున్నాయి! | daggubati rana about hes movie nene raju nene manthri | Sakshi
Sakshi News home page

కలక్షన్స్‌ చూసి కంగారుపడ్డా... అంత బాగున్నాయి!

Published Sun, Aug 13 2017 12:37 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

కలక్షన్స్‌ చూసి కంగారుపడ్డా... అంత బాగున్నాయి! - Sakshi

కలక్షన్స్‌ చూసి కంగారుపడ్డా... అంత బాగున్నాయి!

రానా, కాజల్‌ జంటగా తేజ దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, సీహెచ్‌ భరత్‌చౌదరి, కిరణ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో రానా మాట్లాడుతూ– ‘‘సినిమా విడుదల తర్వాత తక్కువగా మాట్లాడతాను. కానీ, ఈ సినిమా కలెక్షన్స్‌ చాలా బాగున్నాయి. కలక్షన్స్‌ నంబర్స్‌ చూసి నేనే కంగారు పడిపోయాను. ఇంతకు ముందు ఎవరో ‘వన్‌ మ్యాన్‌ షో’ అన్నారు. కాదు... ఈ సినిమా కోసం అందరూ కష్టపడ్డాం. పోస్టర్ల మీద నేను ఉన్నాను కాబట్టి నేను కనిపిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు కొత్త సినిమాలను ఆదరిస్తారు. కథ అందరి కన్నా గొప్పది’’ అన్నారు. తేజ మాట్లాడుతూ– ‘‘యూఎస్‌లో షో పడ్డాక ఒక టాక్‌ వచ్చింది. అక్కడ టాక్‌ ఏంటంటే... ‘సెకండాఫ్‌ డ్రాప్‌ అయ్యింది, ఎండింగ్‌ బాగుంది, ఫస్ట్‌ హాఫ్‌ బాగుంది’ అని.

బేసిక్‌గా ప్రాపర్‌ రివ్యూ రైటర్స్‌ తగ్గిపోయారు. తెలుగులో మంచి రైటర్స్‌ లేరనడం లేదు. సినిమాలో హీరోగా ఉన్నవాడు విలన్‌ స్థాయికి జారిపోతాడు. అక్కడ దిగజారింది కథ కాదు. కథ పరంగా హీరో క్యారెక్టర్‌. ఆ తేడాను పట్టుకోవాలి. కొంతమంది పట్టుకుని రివ్యూలు రాశారు. వారికి ధన్యవాదాలు. ఆ లైన్‌ పట్టుకోలేని వారిని దేవుడే రక్షిస్తాడు. మార్నింగ్‌ షోకి ప్రేక్షకులు ధర్మామీటర్లు, ప్యారామీటర్లు పట్టుకుని వస్తారు. సాయంత్రం షోకి ఒరిజినల్‌ ప్రేక్షకులు వస్తారు. అప్పుడు తెలుస్తుంది సినిమా గురించి. లక్కీగా మా సినిమా సేవ్‌ అయ్యింది. నేను హిట్‌ తీయగలనని తెలిసింది.

హిట్‌ తీయగలనని ఆడియన్స్‌ నాకు సర్టిఫికెట్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌. ఇక మీదట హిట్స్‌నే తీద్దామనుకుంటున్నా. తెలుగులో ఎనీ స్టైల్‌ స్క్రిప్ట్‌ను రానానే చేయగలడు. తెలుగు సినిమా బెటర్‌ అవ్వాలంటే నెగిటివ్, పాజిటివ్‌ రెండు షేడ్స్‌ చేసే యాక్టర్లు రావాలి’’ అన్నారు. ‘‘సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఇది మాకు 48వ సినిమా. రామానాయుడుగారు ఉండుంటే రానాను కౌగిలించుకుని చాలా ఆనందపడేవారు. ఈ సినిమాతో తేజ ఈజ్‌ బ్యాక్‌’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement