రాధ మీద ప్రేమే రాక్షసుడిగా మార్చేసింది..! | Rana Nene raju Nene mantri Story Line | Sakshi
Sakshi News home page

రాధ మీద ప్రేమే రాక్షసుడిగా మార్చేసింది..!

Published Tue, Jul 25 2017 11:30 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రాధ మీద ప్రేమే రాక్షసుడిగా మార్చేసింది..! - Sakshi

రాధ మీద ప్రేమే రాక్షసుడిగా మార్చేసింది..!

యంగ్ హీరో రానా, తేజ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కథపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేశారు. తేజ గత సినిమాల మాదిరిగానే ఈసినిమా కూడా ప్రేమ కోసం జరిగే యుద్ధం నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో రాధ లేనిదే జోగేంద్ర లేడు అంటూ హిట్ ఇచ్చిన తేజ, తాజా పోస్టర్ తో మరింత క్లారిటీ ఇచ్చాడు.

పొలిటీషియన్ గెటప్ లో రానా కూర్చొని ఉన్న స్టిల్ తో రిలీజ్ అయిన పోస్టర్ లో 'రాధ మీద జోగేంద్ర ప్రేమే అతన్ని రాక్షసుడిలా మార్చేసింది' అనే క్యాప్షన్ రాసారు. దీంతో తన భార్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగానే జోగేంద్ర రాజకీయ వ్యవస్థను శాసించే నియంత మారతాడు. ఈ సినిమాలో రానా భార్య రాధగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.  ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న నేనే రాజు నేనే మంత్రి తెలుగుతో పాటు తమిళ, మలయాళ బాషల్లోనూ ఒకేసారి రిలీజ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement