
పార్టీ ప్రచారంలో బిజీ బిజీగా రానా
యంగ్ హీరో రానా కొత్త ఏడాదిలో బిజీ అయ్యాడు. అనంతపురంలోజరుగుతున్న పార్టీ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. చుట్టూ అనుచరులు, కార్యకర్తలతో కలిసి రోడ్ షో నిర్వహిస్తున్నాడు. ఇదంతా పొలిటికల్ పార్టీ కోసం మాత్రం కాదులెండీ. రానా హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు.. నేను మంత్రి సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతోంది. ఇందులో భాగంగా రానా ప్రచారంలో పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇప్పటికే బాహుబలి, ఘాజీ సినిమాల షూటింగ్ పూర్తి చేసిన రానా, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు.. నేనే మంత్రి షూటింగ్లో పాల్గొంటున్నాడు. కాజల్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం షూటింగ్లకు బ్రేక్ ఇచ్చిన రానా, నిన్న (మంగళవారం) తిరిగి షూటింగ్ పాల్గొన్నాడు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న తొలిరోజు షూటింగ్ ఫోటోనూ ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేశాడు.
Day 1 of shoot in 2017 started yesterday in Ananthapur!! Thank you for the love!! pic.twitter.com/PnJoaQF28o
— Rana Daggubati (@RanaDaggubati) 4 January 2017