తేజ.. పెద్ద కథే చెబుతున్నాడు..! | Nene Raju Nene Mantri to have lengthy run time | Sakshi
Sakshi News home page

తేజ.. పెద్ద కథే చెబుతున్నాడు..!

Published Wed, Jul 19 2017 11:00 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

తేజ.. పెద్ద కథే చెబుతున్నాడు..! - Sakshi

తేజ.. పెద్ద కథే చెబుతున్నాడు..!

చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు తేజ, రానా హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన రెగ్యులర్ స్టైల్కు భిన్నంగా ఈ సారి ఓ పొలిటికల్ థ్రిల్లర్ను తెరకెక్కిస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్, సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్కు కూడా మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ సినిమా రన్ టైంకు సంబంధించిన అప్డేట్ ఒకటి మరోసారి తేజ సినిమా రిజల్ట్పై అనుమానాలు కలిగిస్తోంది. దాదాపుగా ఇటీవల రిలీజ్ అవుతున్న సినిమాలన్ని రెండు గంటల రన్ టైంకు ఓ పది నిమిషాలు అటు ఇటుగా రూపొందుతున్నాయి. అలాంటి సినిమాలనే కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. కానీ తేజ మాత్రం నేనే రాజు నేనే మంత్రి సినిమా రన్ టైంను ఏకంగా రెండు గంటల నలబై నిమిషాలుగా ఫిక్స్ చేశాడు.

ఇది థ్రిల్లర్ సినిమా కావటంతో రన్ టైం తక్కువగా ఉంటుందని భావించారు. కానీ చిత్రయూనిట్ రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాను రెడీ చేశారు. మరి అంత సేపు అభిమానులను థ్రిల్ చేసే కథ తేజ రెడీ చేశాడా..? నేనే రాజు నేనే మంత్రి సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది..? అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement