షూటింగ్ పూర్తి చేసుకున్న 'నేనే రాజు నేనే మంత్రి'
సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భారత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. రాణా టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్లో కాజల్, కేథరిన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం 24 గంటల్లోపే 4 మిలియన్ వ్యూస్ సాధించి సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకులు తేజ మాట్లాడుతూ.. 'రాణాలోని సరికొత్త యాంగిల్ ను 'నేనే రాజు నేనే మంత్రి'లో చూస్తారు. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ చిత్రంలో రాణా యాటిట్యూడ్ ఉంటుంది. జోగేంద్ర పాత్రలో రాణా ఒదిగిపోయిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది' అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'రాణా కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'.
తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ట్రైలర్కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమాపై మాకున్న నమ్మకం ద్విగుణీకృతం అవుతోంది. తేజ టేకింగ్ చాలా కొత్తగా ఉండబోతోంది. లక్ష్మీ భూపాల్ సంభాషణలకి థియేటర్లలో విజిల్స్ వేస్తారు, ఆయన డైలాగ్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నేటి(శనివారం)తో చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి' అన్నారు.