రాధ పుట్టినరోజుకు రాజుగారే బహుమతి! | Kajal Aggarwal is 50th film as the nene raju nene manthri. | Sakshi
Sakshi News home page

రాధ పుట్టినరోజుకు రాజుగారే బహుమతి!

Published Sun, Jun 18 2017 10:42 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రాధ పుట్టినరోజుకు రాజుగారే బహుమతి! - Sakshi

రాధ పుట్టినరోజుకు రాజుగారే బహుమతి!

చాలు... ఇది చాలు! ఇంతకు మించిన పుట్టినరోజు బహుమతి ఏముంటుంది చెప్పండి! అంటున్నారు కాజల్‌ అగర్వాల్‌. ఈ రోజు (జూన్‌ 19) ఆమె బర్త్‌డే. అంతే కాదండోయ్‌... కథానాయికగా కాజల్‌ జరుపుకుంటోన్న 10వ పుట్టినరోజు. దర్శకుడు తేజ ‘లక్ష్మీ కల్యాణం’తో కథానాయికగా పరిచయమైన కాజల్, ఈ పదేళ్లలో 50 సినిమాలు చేశారు. ఎన్నో బర్త్‌డే గిఫ్టులు అందుకున్నారు.

మరి, ఈ బర్త్‌డేకు అంతలా సంతోషపడే స్పెషల్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఏం అందుకున్నారు? అని కాజల్‌ను అడిగితే... ‘‘రానాకు జోడీగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ఈ బర్త్‌డే గిఫ్ట్‌’’ అన్నారు. ఈ సినిమాలో అంత స్పెషాలిటీ ఏముంది? అనడిగితే... ‘‘హీరోయిన్‌గా నా 50వ సినిమా ఇది. అందులోనూ తెలుగు తెరకు నన్ను పరిచయం చేసిన తేజగారి దర్శకత్వంలో, మళ్లీ పదేళ్ల తర్వాత నటించిన ఈ సినిమా నా 50వ సినిమా కావడం కంటే సంతోషం ఏముంటుంది చెప్పండి’’ అన్నారామె. డి. సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరిలు నిర్మించిన ‘నేనే రాజు నేనే మంత్రి’లో రాధ పాత్రలో కాజల్‌ కనిపించనున్నారు. ఇందులో ఇప్పటివరకు చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్ర చేశానని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement