'నేనే డిసైడ్ చేస్తా.. నేనే రాజు నేనే మంత్రి' | Rana, teja nene raju nene matri teaser | Sakshi
Sakshi News home page

'నేనే డిసైడ్ చేస్తా.. నేనే రాజు నేనే మంత్రి'

Published Tue, Jun 6 2017 10:22 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

Rana, teja nene raju nene matri teaser

బాహుబలి, ఘాజీ లాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా చేస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ నేనే రాజు నేనే మంత్రి. సెన్సేషనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ను మూవీ మొగల్ రామానాయుడు జయంతి సందర్శంగా రిలీజ్ చేశారు. రానా రాజకీయనాయకుడు జోగేంద్రగా కనిపించనున్నాడు.

ఇప్పటి వరకు కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయిన రానా ఈ సినిమాతో ఎలాగైన సోలోగా మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అదే సమయంలో దర్శకుడు తేజకు కూడా ఈ సినిమా కీలకం కానుంది. కెరీర్ స్టార్టింగ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో అలరించిన తేజ, తరువాత ఆ స్థాయి సక్సెస్లు సాధించలేకపోయాడు. అందుకే తన మార్క్ లవ్ స్టోరిలను పక్కన పెట్టి పొలిటికల్ థ్రిల్లర్తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement