
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో నేను రాజు నేనే మంత్రి సినిమాతో బిగ్ హిట్ అందుకున్న దర్శకుడు తేజ, అదే బ్యానర్‌లో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబందించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో విలన రోల్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట.
అందుకే కీలకమైన ప్రతినాయక పాత్రకు స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైతే కరెక్ట్‌అని భావించిన చిత్రయూనిట్, హీరోగా అలరిస్తున్న నారా రోహిత్‌ను విలన్‌గా ఫైనల్ చేశారట. ఇప్పటికే కథలో రాజకుమారి సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్న రోహిత్ పూర్తి స్థాయి విలన్‌గా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment