
రాకేష్, గౌతమ్ రెడ్డి, వెంకటేశ్, నారా రోహిత్, సంతోష్
నారా రోహిత్, విర్తీ వాఘని జంటగా వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. నారా రోహిత్ కెరీర్‌లో ఇది 20వ చిత్రం. ఈ సినిమాను సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి ఎం. ప్రదీష్ వర్మ కెమెరా స్విచ్చాన్ చేయగా, గౌతమ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. విజయ్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. శ్రీదేవీ విజయ్ కుమార్, నరేశ్ విజయకృష్ణ, వాసుకీ ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్.
Comments
Please login to add a commentAdd a comment