
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌కు క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. గతంలో చాలాసార్లు టీమిండియా మ్యాచ్‌ల్లోనూ సందడి చేశారు. తాజాగా ఐపీఎల్ సీజన్‌లో మరోసారి స్టేడియంలో మెరిశారు. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు ఆయన హాజరయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్ జెండాను పట్టుకుని టీమ్‌కు మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోను సన్‌రైజర్స్ హైదరాబాద్ తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది.
కాగా.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు మన హీరో విక్టరీ వెంకటేశ్. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు.
Anytime, Uppal center lo Single handedly support chese our Victory Venkatesh is here 💪🧡#PlayWithFire | #SRHvRR | #TATAIPL2025 pic.twitter.com/2v4qDKh4bI
— SunRisers Hyderabad (@SunRisers) March 23, 2025