వెంకీ సరసన క్రేజీ హీరోయిన్‌.. ఎవరో తెలుసా? Aishwarya Rajesh Joins The Cast Of Venkatesh Upcoming Movie SVC 58 | Sakshi
Sakshi News home page

Venkatesh: వెంకీ చిత్రంలో మరో హీరోయిన్‌.. ఎవరంటే?

Published Tue, Jul 2 2024 6:39 PM | Last Updated on Tue, Jul 2 2024 6:53 PM

Another Crazy Heroine Selected as Tollywood Hero Venkatesh Movie

ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో సైంధవ్‌ మూవీతో ప్రేక్షకులను టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్. శైలేశ్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం వెంకీ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది.

అయితే ఈ వెంకీ సరసన మరో హీరోయిన్‌ కనిపించనుంది. తాజాగా కోలీవుడ్ భామ ఐశ్వర్య రాజేశ్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఫుల్ యాక్షన్‌ కథాచిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. 

aishwarya rajesh
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement