Sunrisers Hyderabad
-
IPL 2025: సన్‌రైజర్స్ రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి రిటెన్షన్స్ జాబితాను ఇవాళ (అక్టోబర్ 31) విడుదల చేశారు. మెజార్టీ శాతం ఫ్రాంచైజీలు ఊహించిన విధంగానే ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం కెప్టెన్లను వదిలేసి పెద్ద సాహసం చేశాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే.. ఆరెంజ్ ఆర్మీ సాధ్యమైనంత వరకు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (18 కోట్లు), అభిషేక్ శర్మ (14 కోట్లు), నితీశ్‌కుమార్ రెడ్డి (6 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (23 కోట్లు), ట్రవిస్ హెడ్ (14 కోట్లు) మరోసారి రిటైన్ చేసుకుంది.ఫ్రాంచైజీలకు కేవలం ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఎస్ఆర్హెచ్ కొందరు స్టార్ ఆటగాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. ఇందులో ఎయిడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, మార్కో జన్సెన్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా కెప్టెన్ పాట్ కమిన్స్ కంటే హెన్రిచ్ క్లాసెన్‌కు అధిక ధర లభించింది. రిటెన్షన్ లిస్ట్‌లో అత్యధిక ధర లభించింది కూడా క్లాసెన్‌కే.సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు పాట్ కమిన్స్- రూ. 18 కోట్లుఅభిషేక్ శర్మ- రూ. 14 కోట్లునితీశ్కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లుహెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లుట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లుటోటల్ పర్స్ వాల్యూ- రూ. 120 కోట్లుమిగిలిన పర్స్ వాల్యూ- రూ. 45 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకున్న ఆటగాళ్లు గ్లెన్ ఫిలిప్స్రాహుల్ త్రిపాఠిఎయిడెన్ మార్క్రమ్మయాంక్ అగర్వాల్అబ్దుల్ సమద్అన్మోల్ప్రీత్ సింగ్వాషింగ్టన్ సుందర్షాబాజ్ అహ్మద్సన్వీర్ సింగ్మార్కో జన్సెన్ఉపేంద్ర యాదవ్జయదేవ్ ఉనద్కత్టి నటరాజన్జఠావేద్ సుబ్రమణ్యన్మయాంక్ మార్కండేభువనేశ్వర్ కుమార్ఫజల్ హక్ ఫారూఖీఆకాశ్ మహారాజ్ సింగ్ఉమ్రాన్ మాలిక్విజయ్కాంత్ వియాస్కాంత్చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల -
చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్
ప్రతిష్టాత్మక దేశవాలీ టోర్నీ రంజీ ట్రోఫీలో జమ్మూ అండ్ కశ్మీర్ ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అబ్దుల్ సమద్ చరిత్ర సృష్టించాడు. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో సమద్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి, ఈ ఘనత సాధించిన తొలి జమ్మూ అండ్ కశ్మీర్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో 117 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 127 పరుగులు చేసిన సమద్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 108 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సమద్ ట్విన్ సెంచరీస్‌తో చెలరేగడంతో ఒడిషాతో మ్యాచ్‌లో జమ్మూ అండ్ కశ్మీర్ పటిష్ట స్థితికి చేరింది. జమ్మూ అండ్ కశ్మీర్ ఒడిషా ముందు 269 పరుగల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి ఒడిషా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తుంది. ఇవాళే (అక్టోబర్ 21) ఆటకు చివరి రోజు కాగా.. ఒడిషా ఇంకా 230 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. సందీప్ పట్నాయక్ (17), బిప్లబ్ సమంత్రే (4) క్రీజ్‌లో ఉన్నారు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో ఆబిద్ ముస్తాక్ 2, సాహిల్ లోత్రా, ఉమర్ నజీర్ మిర్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు జమ్మూ అండ్ కశ్మీర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సమద్ అజేయ సెంచరీతో పోరాడగా.. శుభమ్ ఖజూరియా 43, శుభమ్ పుండిర్ 40 పరుగులు చేశారు. ఒడిషా బౌలర్లలో ప్రధాన్ 3, కార్తీక్ బిస్వాల్ 2, సుమిత్ శర్మ, డి ప్రధాన్ తలో వికెట్ పడగొట్టారు.దీనికి ముందు ఒడిషా తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. ఒడిషా కెప్టెన్ గోవిందా పొద్దార్ అజేయ సెంచరీతో (133) సత్తా చాటాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో ఆబిద్ ముస్తాక్ 4, ఉమర్ నజీర్ 3, ఆకిబ్, యుద్ద్‌వీర్ సింగ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ అండ్ కశ్మీర్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ సమద్ ఒక్కడే సెంచరీతో సత్తా చాటాడు. ఒడిషా బౌలర్లలో సుమిత్ శర్మ ఐదు వికెట్లు తీశాడు. చదవండి: దక్షిణాఫ్రికా బౌలర్ల ఉగ్రరూపం.. 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ -
భారత్‌లో రూ. 1400 కోట్లు పెట్టుబడి పెట్టనున్న క్రికెట్ దిగ్గజం
స్పిన్ దిగ్గజం, శ్రీలంకన్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ ముత్తయ్య మురళీథరన్ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్నాడు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో (బడనగుప్పే అనే ప్రాంతంలో) 1400 కోట్ల పెట్టుబడితో బెవరేజ్ యూనిట్ (శీతల పానీయాల తయారీ కేంద్రం) స్థాపించనున్నాడు. ఇందు కోసం కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కర్ణాటక ప్రభుత్వం మురళీ స్థాపించబోయే ‘ముత్తయ్య బెవరేజెస్ అండ్ కన్ఫెక్షనరీస్' సంస్థకు బడనగుప్పేలో 46 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు మురళీ, కర్ణాటక ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని కర్ణాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ దృవీకరించారు. మురళీ శీతల పానీయాల యూనిట్ వచ్చే ఏడాది జనవరి నుంచి పనులను ప్రారంభించాలని భావిస్తుంది. మురళీ ఈ శీతల పానీయాల వ్యాపారాన్ని శ్రీలంకలో విజయవంతంగా నడుపుతున్నాడు. తన వ్యాపారాన్ని భారత్‌లో విస్తరించడంలో భాగంగా అతను తొలుత కర్ణాటకలో పెట్టుబడులు పెట్టనున్నాడు. కర్ణాటక పరిశ్రమల మంత్రి చెప్పిన ప్రకారం మురళీ త్వరలో తన వ్యాపారాన్ని ధార్వడ్ జిల్లాకు కూడా విస్తరించనున్నాడు. కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో మురళీ ఇటీవల ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్‌ను కలిశారు. ఆ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సెల్వకుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ గుంజన్ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 52 ఏళ్ల మురళీథరన్ ప్రస్తుతం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు స్ట్రాటజిక్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. -
షారూఖ్ కంటే కావ్య మారన్ ఆస్తులే నాలుగు రెట్లు ఎక్కువ..!
-
IPL 2024 KKR vs SRH: ఐపీఎల్ విన్నర్లు, రన్నరప్స్ వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. కేకేఆర్, సన్‌రైజర్స్ మధ్య నేడు (మే 26) జరుగబోయే ఫైనల్‌తో ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ గత సీజన్లకు భిన్నంగా సాగింది. బ్యాటింగ్‌కు సంబంధించి ఆల్‌టైమ్ రికార్డులు బద్దలుకావడంతో పాటు పలు సంచలన బౌలింగ్ ప్రదర్శనలు నమోదయ్యాయి. చెరి ఐదసార్లు ఛాంపియన్లైన ముంబై, సీఎస్కే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించాయి. దిగ్గజ కెప్టెన్లు రోహిత్, ధోని లేకుండా జరుగుతున్న ఐదో ఐపీఎల్ ఫైనల్ ఇది.ఐపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో విజేతలు, రన్నరప్లపై ఓ లుక్కేద్దాం. ఇప్పటివరకు జరిగిన 16 ఫైనల్స్‌లో సీఎస్కే (2010, 2011, 2018, 2021, 2023), ముంబై (2013, 2015, 2017, 2019, 2020) చెరి ఐదుసార్లు టైటిల్ కైవసం చేసుకోగా.. కేకేఆర్ రెండు (2012, 2014), సన్‌రైజర్స్ (2016), రాజస్థాన్ రాయల్స్ (2008), గుజరాత్ టైటాన్స్ (2022), డెక్కన్ ఛార్జర్స్ (2009) తలో సారి టైటిల్ నెగ్గాయి. అత్యధికసార్లు రన్నరప్‌గా నిలిచిన ఘనత సీఎస్కేకు దక్కింది. సీఎస్కే ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) ఫైనల్లో ఓటమిపాలైంది.ఆతర్వాత ఆర్సీబీ మూడు సార్లు (2009, 2011, 2016).. ముంబై ఇండియన్స్ (2010), కేకేఆర్ (2021), సన్‌రైజర్స్ (2018), రాజస్థాన్ రాయల్స్ (2022), గుజరాత్ టైటాన్స్ (2023), పంజాబ్ కింగ్స్ (2014), ఢిల్లీ క్యాపిటల్స్ (2020), రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (2017) తలో సారి రన్నరప్‌గా నిలిచాయి.సీజన్ల వారీగా విజేతలు, రన్నరప్స్..2008- రాజస్థాన్ రాయల్స్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2009- డెక్కన్ ఛార్జర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2010- సీఎస్కే (విజేత), ముంబై ఇండియన్స్ (రన్నరప్)2011- సీఎస్కే (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2012- కేకేఆర్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2013- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2014- కేకేఆర్ (విజేత), పంజాబ్ (రన్నరప్)2015- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2016- సన్‌రైజర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2017- ముంబై (విజేత), పూణే (రన్నరప్)2018- సీఎస్కే (విజేత), సన్‌రైజర్స్ (రన్నరప్)2019- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2020- ముంబై (విజేత), ఢిల్లీ (రన్నరప్)2021- సీఎస్కే (విజేత), కేకేఆర్ (రన్నరప్)2022- గుజరాత్ (విజేత), రాజస్థాన్ (రన్నరప్)2023- సీఎస్కే (విజేత), గుజరాత్ (రన్నరప్) -
SRH Vs KKR IPL 2024 Final: జై జై రైజర్స్
ఐపీఎల్– 2024లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. 65 రోజులు, 73 మ్యాచ్‌ల తర్వాత ఐపీఎల్–17 విజేతను తేల్చే మ్యాచ్‌కు ఆదివారం చెన్నై వేదికవుతోంది. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని పంచుతూ ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ టీమ్ ఆఖరి పంచ్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. తొలి క్వాలిఫయర్‌లో తమను దెబ్బ తీసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పుడు మళ్లీ ప్రత్యర్థి రూపంలో ఎదురుగా ఉంది. గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకుంటూ రైజర్స్ చెలరేగితే రెండోసారి లీగ్ చాంపియన్‌గా సగర్వంగా నిలవవచ్చు. 2016లో ఆఖరిసారిగా టైటిల్ సాధించిన హైదరాబాద్ 2018లో ఫైనల్ చేరి తుది మెట్టుపై తడబడింది. 2012, 2014లలో ఐపీఎల్ గెలుచుకున్న కోల్‌కతా ఇప్పుడు మూడోసారి ట్రోఫీపై గురి పెట్టింది. మ్యాచ్ చెన్నైలో జరుగుతుండడంతో మన నగర అభిమానుల మనసంతా అక్కడే ఉందనేది వాస్తవం. హైదరాబాద్ గెలిస్తే సారథిగా మన నగరానికి టైటిల్ అందించిన మూడో ఆస్ట్రేలియన్‌గా కమిన్స్ నిలుస్తాడు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ ఆదివారం చెన్నైలో జరుగుతున్నప్పటికీ మన నగరంలోనే జరుగుతున్నంత కోలాహలం నెలకొంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతున్నాయి. పలు పబ్స్, లాంజ్‌లు.. క్రికెట్ థీమ్ అలంకరణతో ఆకట్టుకుంటున్నాయి. మన సొంత జట్టు ఫైనల్‌కు చేరడంతో మరింత ఆసక్తికరంగా మారిన ఈ మ్యాచ్ నగరవాసులను ఉర్రూతలూగించనుంది. దీంతో ఎంట్రీ ఫీజు కనీసం రూ.500 నుంచి ప్రారంభించి ఆపై ధరలో విభిన్న రకాల ఆకర్షణలతో క్రికెట్ అభిమానుల్ని లైవ్ ఏర్పాట్లతో ఆహా్వనిస్తున్నారు. గచ్చిబౌలిలోని ముస్టాంగ్ టెర్రస్ లాంజ్‌లో ఏకంగా 3 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్‌లో 2 స్క్రీన్స్, మాదాపూర్‌లోని రష్ స్పోర్ట్స్ బార్ అండ్ బౌలింగ్ సెంటర్లో పెద్ద స్క్రీన్, కార్ఖానాలోని ద బార్ నెక్ట్స్ డోర్లో 2 బిగ్ స్క్రీన్స్‌తోపాటు చిన్నపాటి టీవీలు కూడా పూర్తిగా ఐపీఎల్ సందడికి సిద్ధమయ్యాయి. నగరంలోని పబ్స్, బార్స్, రెస్టారెంట్స్‌తో పాటు సికింద్రాబాద్ క్లబ్, జింఖానా క్లబ్, ఫిలింనగర్ క్లబ్.. వంటి సంపన్నులకు చెందిన క్లబ్స్ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో సభ్యులను ఆహా్వనిస్తున్నాయి. మాల్స్, మలీ్టఫ్లెక్స్లూ, కెఫెలు సైతం స్క్రీన్స్ ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. పలు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. -
Qualifier 1: సన్‌రైజర్స్ విఫలం.. ఫైనల్ చేరిన కేకేఆర్
-
MI Vs SRH: ఆల్‌టైమ్ రికార్డు సమం
2024 ఐపీఎల్ సీజన్ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ సీజన్లో దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపు ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. నిన్న (మే 6) ముంబై-ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది. ముంబై ఆటగాడు సూర్యకుమార్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. ఈ క్రమంలో ఓ ఆల్‌టైమ్ రికార్డు సమం అయ్యింది.ఓ సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్ సమం చేసింది. 2023 సీజన్లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు (అన్ని జట్లు కలిపి) నమోదు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 12 సెంచరీలు పూర్తయ్యాయి. ఇంకా 19 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది.ఐపీఎల్లో ఏ యేడుకాయేడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2022 సీజన్ మొత్తంలో 8 సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మరికొన్ని మ్యాచ్‌లు మిగిలుండగానే 12 సెంచరీలు నమోదవడం చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ముక్కీ మూలిగి 173 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (48). కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి సన్‌రైజర్స్ పరువు కాపాడారు. ముంబై బౌలర్లలో పియూశ్ చావ్లా, హార్దిక్ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్.. తిలక్ వర్మ (37 నాటౌట్) సాయంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఓటమితో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు నెట్ రన్‌రేట్‌ను కూడా దిగజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై ఆఖరి స్థానం నుంచి లేచొచ్చి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. -
SRH Vs RCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్.. ఆర్సీబీకి వార్నింగ్!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం తలపడనుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.ఈ సీజన్లో ఇప్పటికే ఆర్సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన సన్‌రైజర్స్ ఉప్పల్‌లోనూ ఆ సీన్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) సాధించిన రైజర్స్... హైదరాబాద్‌లో తమ రికార్డును బ్రేక్ చేయాలని పట్టుదలగా ఉంది.ప్యాట్ కమిన్స్ బృందం జోరు చూస్తుంటే ఇదేమీ అసాధ్యం కాకపోవచ్చనే అనిపిస్తోంది. మరోవైపు.. ఆర్సీబీ సైతం ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఖాయమంటూ ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.The crossover we all love to see 🤩 pic.twitter.com/nLlDlUcH7E— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2024ఇదిలా ఉంటే.. ఈ కీలక పోరుకు ముందే సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌ను తన మాటలతో ఖుషీ చేశాడు. ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.కమిన్స్ అంటే క్లాస్ అనుకుంటివా? మాస్.. ఊరమాస్.. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ’’ అంటూ తెలుగులో డైలాగ్స్ చెప్పి దుమ్ములేపాడు. తగ్గేదేలే అంటూ ఆర్సీబీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన ఆరెంజ్ ఆర్మీ.. ‘‘కెప్టెన్ ఓ రేంజు.. మామ మనోడే.. సూపర్ కమిన్స్’’ అంటూ కామెంట్లతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో సన్‌రైజర్స్ తలరాత మారిపోయింది. గత మూడేళ్లుగా వైఫల్యాలతో చతికిల పడ్డ రైజర్స్‌ను తన కెప్టెన్సీతో ఈ సీజన్లో హాట్ ఫేవరెట్‌గా మార్చాడు ఈ పేస్ బౌలర్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు తోడు బౌలర్లు కూడా రాణిస్తుండటంతో తన కెప్టెన్సీ వ్యూహాలకు మరింత పదును పెట్టి వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇక ఈ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచి పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ ఎనిమిదింట ఏడు ఓడి అట్టడుగున ఉంది.చదవండి: IPL 2024: అన్ని జట్లు ఓడాయి.. ఒక్క సన్‌రైజర్స్ మాత్రమే..!ఓవైపు కెప్టెన్‌గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥@patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩చూడండి#TATAIPLHyderabad v Bengaluru | రేపు 6 PM నుంచిమీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu pic.twitter.com/wv5IzPZhFe— StarSportsTelugu (@StarSportsTel) April 24, 2024 -
SRH vs RCB: ఉప్పల్‌లో 300 కొడతారా..!
సాక్షి, హైదరాబాద్: 266... 277... 287... ఇదంతా ఒకే ఐపీఎల్ సీజన్లో, ఒకే టీమ్, వేర్వేరు మ్యాచ్‌లలో చేసిన పరుగుల విధ్వంసం. విశేషం ఏమిటంటే ఈ 287 పరుగులే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు. ఈ పరుగుల సునామీ సృష్టించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కాగా... ఇందులో 277 పరుగులు నమోదు చేసింది నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగానే.ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఈసారి ఐపీఎల్ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ‘ఢీ’ కొట్టనుంది. 10 రోజుల క్రితం బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ జట్టు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ (262/7) చేధించినంత పనిచేసింది. ఈ ఇరు జట్లే మళ్లీ నేడు తలపడనుండటంతో క్రికెట్ అభిమానుల చూపంతా ఈ మ్యాచ్‌పైనే ఉంది. ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకోనుందా? హైదరాబాద్ తన హవాను కొనసాగించనుందా? అనే ఆసక్తికి ఉప్పల్ స్టేడియం వేదికగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడితే బెంగళూరు ‘ప్లే ఆఫ్స్’ చేరే అవకాశాలు ఆవిరవుతాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు ఆడుతున్న ‘లోకల్ బాయ్’ మొహమ్మద్ సిరాజ్, భారత స్టార్ విరాట్ కోహ్లి ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్క్రమ్, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ చెలరేగితే సన్‌రైజర్స్ స్కోరు ఈసారి 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సన్‌రైజర్స్ భీకరమైన ఫామ్‌లో ఉండటం... కోహ్లిలాంటి దిగ్గజం బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ సీజన్‌లోని గత మ్యాచ్‌ల్లాగే ఈసారీ అభిమానులకు టికెట్ల ఇక్కట్లు తప్పట్లేదు. ఆన్లైన్లో టిక్కెట్లు క్షణాల్లో అయిపోవడంతో చేసేదేమిలేక క్రికెట్ అభిమానులంతా బిగ్ స్క్రీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న పలు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, మాల్స్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం కోసం భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాయి. 🧡❤️ pic.twitter.com/3ho5bxzGSZ— SunRisers Hyderabad (@SunRisers) April 25, 2024 -
ఐపీఎల్లో సన్‌రైజర్స్ రికార్డులు.. పుష్ప టీమ్ స్పెషల్ ట్వీట్!
అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 రూపొందిస్తున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా పుష్ప టీమ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పుష్ప సినిమాతో పోలుస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ టీమ్ తన రికార్డ్‌ను తానే అధిగమించింది. ముంబయిపై 277 పరుగుల అత్యధిక స్కోరు చేసిన ఎస్ఆర్హెచ్.. మరోసారి బెంగళూరుపై 287 రన్స్ చేసి తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టింది. దీంతో మొదటి మ్యాచ్‌ను పుష్ప పార్ట్-1గా.. రెండో మ్యాచ్‌ను పుష్ప-2గా పోలుస్తూ పోస్ట్ చేసింది. రెండుసార్లు అత్యధిక స్కోరు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు అభినందనలు తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది చూసిన కొందరు అభిమానులు పుష్ప డైలాగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రపంచలో ఎక్కడా లేని సరకు మన దగ్గరే ఉండాది అనే డైలాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఏ టీమ్ సాధించని రికార్డ్‌ను రెండుసార్లు సన్‌రైజర్స్ అధిగమించడం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోనుంది. HUPPPP!!! 💥💥 277/3 - SRH: The Rise 😎 287/3 - SRH: The Rule 🤙 Congratulations on scoring the Highest-ever IPL team totals twice in this season! 🔥 @SunRisers https://t.co/kcfJBj5E0Z pic.twitter.com/co0o1zIw7T — Pushpa (@PushpaMovie) April 16, 2024 -
IPL 2024 RCB VS SRH: ఓడినా ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేసిన ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్లో నిన్న (ఏప్రిల్ 15) అత్యంత రసవత్తరమైన సమరం జరిగింది. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మధ్య జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో ఎన్నో టీ20 రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్.. ఓ టీ20 మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన అత్యధిక స్కోర్ (సన్‌రైజర్స్ 287 + ఆర్సీబీ 262 = 549 పరుగులు).. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు (ఆర్సీబీ-22).. ఓ టీ20 మ్యాచ్‌లో నమోదైన అత్యధిక బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81).. ఇలా ఈ మ్యాచ్‌లో చాలావరకు పొట్టి క్రికెట్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇదే మ్యాచ్‌లో మరో భారీ రికార్డు కూడా నమోదైంది. ఆర్సీబీ మ్యాచ్ ఓడినప్పటికీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ (262) చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ముంబై ఇండియన్స్ ఇదే సీజన్లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ (సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ) 246 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆర్సీబీ.. మరో రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా డ్యూయల్ రికార్డు నమోదు చేసింది. 2017 సీజన్లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 49 పరుగులకే ఆలౌటైంది. ఈ స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌గానూ రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆర్సీబీ 262 పరుగులకు పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్సీబీ చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. -
నితీశ్ ‘షో’
ముల్లన్పూర్: ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇంట గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు రచ్చ గెలిచింది. పంజాబ్ గడ్డపై ఆంధ్ర బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి (37 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. దీంతో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. ముందుగా సన్‌రైజర్స్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్‌తో పాటు అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 25; 5 ఫోర్లు) ధాటిగా ఆడారు. అర్షదీప్ కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది. శశాంక్ సింగ్ (25 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, అశుతోష్ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడగా ఆడాడు. ఆఖరి ఓవర్లో 29 పరుగులు కావాల్సి ఉండగా బౌలర్ ఉనాద్కట్ పట్టు తప్పాడు. వైడ్లతో పాటు పేలవ బంతులు వేయడంతో ఉత్కంఠ పెరిగింది. చివరకు పంజాబ్ 3 సిక్స్‌లు సహా 26 పరుగులే రాబట్టడంతో హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది. నితీశ్ వీరబాదుడు... ఓపెనర్ ట్రవిస్ హెడ్ (15 బంతుల్లో 21; 4 ఫోర్లు), మార్క్రమ్ (0)లను ఒకే ఓవర్లో అర్షదీప్ అవుట్ చేయగా, అభిషేక్ శర్మ (16)కు సామ్ కరన్ కళ్లెం వేశాడు. 39 పరుగులకే టాప్ 3 వికెట్లను కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి (11) ‘ఇంపాక్ట్’ చూపలేకపోయాడు. సగం (10) ఓవర్లు ముగిసే సరికి జట్టు 66/4 స్కోరు చేసింది. అయితే నాలుగో ఓవర్లోనే క్రీజులోకి వచి్చన నితీశ్ పదో ఓవర్‌దాకా చేసిన స్కోరు 14! ఒకటే బౌండరీ కొట్టాడు. ఇలా ఆడిన విశాఖ కుర్రాడు ధనాధన్‌కు స్విచ్చాన్ చేసినట్లుగా 11వ ఓవర్ నుంచి అనూహ్యంగా దంచేశాడు. హర్‌ప్రీత్ బౌలింగ్‌లో 4, 6 బాదగా, క్లాసెన్ ఓ ఫోర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. రబడ, సామ్ కరన్ ఓవర్లలో చెరో సిక్సర్‌తో దూకుడు పెంచాడు. క్లాసెన్ (9) అవుటయ్యాక సమద్ రావడంతో దూకుడు ‘డబుల్’ అయింది. హర్‌ప్రీత్ 15వ ఓవర్‌నూ పూర్తిగా ఎదుర్కొన్న నితీశ్ 0, 4, 6, 4, 6, 2లతో 22 పరుగులు పిండుకున్నాడు. దీంతో 32 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. 17వ ఓవర్ వేసిన అర్షదీప్ 3 బంతుల వ్యవధిలో సమద్, నితీశ్‌లను అవుట్ చేయడంతో రైజర్స్ డెత్ ఓవర్లలో ఆశించినన్ని పరుగుల్ని చేయలేకపోయింది. దెబ్బకొట్టిన భువీ... ఓపెనర్ బెయిర్‌స్టో (0)ను రెండో ఓవర్లోనే కమిన్స్ డకౌట్ చేయగా, భువనేశ్వర్ వరుస ఓవర్లలో ప్రభ్‌సిమ్రన్ (4)తో పాటు మరో శిఖర్ ధావన్ (14)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 20 పరుగులకే టాపార్డర్ కూలింది. సామ్ కరన్ (22 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సికందర్ రజా (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు పోరాడారు. నటరాజన్ పదో ఓవర్లో సామ్ కరన్ బౌండరీ కోసం ప్రయత్నించగా మిడాఫ్‌లో కమిన్స్ కళ్లు చెదిరే క్యాచ్‌తో అతని ఆట ముగించాడు. జట్టు స్కోరు 91 పరుగుల వద్ద రజా ని్రష్కమించడంతో సన్‌రైజర్స్ గెలుపు దాదాపుగా ఖాయమైంది. అయితే ఆఖరి ఓవర్లో ఉనాద్కట్ 3 వైడ్లు వేయడంతో 2 బంతుల్లో 10 పరుగుల సమీకరణం పంజాబ్‌కు అవకాశమిచ్చింది. అశుతోష్ మరో షాట్ ఆడగా డీప్ మిడ్ వికెట్ వద్ద రాహుల్ త్రిపాఠి క్యాచ్ జారవిడిచాడు. ఒకే పరుగు రావడంతో ఇక ఆఖరి బంతికి 9 పరుగులు అసాధ్యమవడంతో హైదరాబాద్ గెలిచింది. అయితే చివరి బంతిని శశాంక్ సిక్స్ కొట్టడంతో సన్‌రైజర్స్ 2 పరుగులతో నెగ్గింది. సన్‌రైజర్స్ జట్టులో విజయకాంత్ శ్రీలంక యువ లెగ్‌స్పిన్నర్ విజయకాంత్ వియస్కాత్ ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయంతో టోర్నీకి దూరమైన లంక లెగ్‌స్పిన్నర్ వనిందు హసరంగ స్థానంలో కనీస విలువ రూ. 50 లక్షలకు రైజర్స్ యాజమాన్యం విజయ్‌కాంత్‌ను ఎంచుకుంది. 22 ఏళ్ల విజయ్‌కాంత్ ఆసియా క్రీడల్లో లంక తరఫున ఒకే ఒక అంతర్జాతీయ టి20 ఆడాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) ధావన్ (బి) అర్షదీప్ 21; అభిషేక్ (సి) శశాంక్ (బి) సామ్ కరన్ 16; మార్క్రమ్ (సి) జితేశ్ (బి) అర్షదీప్ 0; నితీశ్ కుమార్ (సి) రబడ (బి) అర్షదీప్ 64; రాహుల్ త్రిపాఠి (సి) జితేశ్ (బి) హర్షల్ 11; క్లాసెన్ (సి) సామ్ కరన్ (బి) హర్షల్ 9; సమద్ (సి) హర్షల్ (బి) అర్షదీప్ 25; షాబాజ్ నాటౌట్ 14; కమిన్స్ (బి) రబడ 3; భువనేశ్వర్ (సి) బెయిర్‌స్టో (బి) సామ్ కరన్ 6; ఉనాద్కట్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–39, 4–64, 5–100, 6–150, 7–151, 8–155, 9–176. బౌలింగ్: రబడ 4–0–32–1, అర్షదీప్ 4–0–29–4, సామ్ కరన్ 4–0–41–2, హర్షల్ 4–0–30–2, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–48–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) భువనేశ్వర్ 14; బెయిర్‌స్టో (బి) కమిన్స్ 0; ప్రభ్సిమ్రాన్ (సి) నితీశ్ (బి) భువనేశ్వర్ 4; సామ్ కరన్ (సి) కమిన్స్ (బి) నటరాజన్ 29; సికందర్ రజా (సి) క్లాసెన్ (బి) ఉనాద్కట్ 28; శశాంక్ నాటౌట్ 46; జితేశ్ (సి) అభిషేక్ (బి) నితీశ్ 19; అశుతోష్ నాటౌట్ 33; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–2, 2–11, 3–20, 4–58, 5–91, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–32–2, కమిన్స్ 4–0–22–1, నటరాజన్ 4–0–33–1, నితీశ్ కుమార్ 3–0–33–1, ఉనాద్కట్ 4–0–49–1, షహబాజ్ 1–0–10–0. అదరగొట్టాడు ఏడేళ్ల క్రితం...బీసీసీఐ అండర్–16 టోర్నీ విజయ్‌మర్చంట్ ట్రోఫీ..రాజ్‌కోట్‌లో నాగాలాండ్‌తో ఆంధ్ర మ్యాచ్. అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన నితీశ్ కుమార్ రెడ్డి 345 బంతుల్లో ఏకంగా 441 పరుగుల స్కోరు సాధించి సంచలనం సృష్టించాడు. ఈ క్వాడ్రపుల్ సెంచరీ మాత్రమే కాకుండా టోర్నీ మొత్తం అదరగొట్టిన అతను 8 ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా 176.71 సగటుతో ఏకంగా 1237 పరుగులు నమోదు చేశాడు. విజయ్‌మర్చంట్ ట్రోఫీ చరిత్రలో ఒక్క సీజన్లో ఎవరూ చేయని పరుగుల రికార్డు అది. ఆ ఏడాది బీసీసీఐ వార్షిక అవార్డుల్లో ‘బెస్ట్ అండర్–16 క్రికెటర్’గా నిలవడంతో దేశవాళీ క్రికెట్లో అందరి దృష్టీ ఈ కుర్రాడిపై పడింది. ఓపెనర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నితీశ్ అండర్–19 స్థాయి వినూ మన్కడ్ ట్రోఫీ, చాలెంజర్ టోర్నీ వరకు అలాగే కొనసాగించాడు. అయితే మరో వైపు మీడియం పేస్ బౌలింగ్‌పై కూడా దృష్టి పెట్టిన అతను కొత్త బంతితో బౌలింగ్ చేశాడు. దాంతో భారం ఎక్కువ కావడంతో అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మిడిలార్డర్‌లోకి మార్చారు. వైజాగ్‌లో పుట్టిన నితీశ్ ఏజ్ గ్రూప్ టోర్నీల్లో సత్తా చాటిన తర్వాత 2020–21 సీజన్లో ఆంధ్ర తరఫున రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టి ఆల్‌రౌండర్‌గా జట్టుకు కీలకంగా మారాడు. రెండేళ్ల తర్వాత రంజీ సీజన్లో 25 వికెట్లు పడగొట్టిన నితీశ్ తన బౌలింగ్ పదును కూడా చూపించాడు. తాజా సీజన్ రంజీ ట్రోఫీలో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నితీశ్ బాధిత బ్యాటర్లలో పుజారా, రహానే, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. బ్యాటింగ్‌లో చెలరేగుతూ మీడియం పేస్ బౌలింగ్ చేసే హార్దిక్ పాండ్యాను అతను అభిమానిస్తాడు. తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్తాన్ జింక్ సంస్థలో ఉద్యోగిగా పని చేసేవాడు. అయితే రాజస్తాన్‌కు బదిలీ కావడంతో ఆయన ఉద్యోగంకంటే కొడుకు భవిష్యత్తే ముఖ్యమని భావిస్తూ రాజీనామా చేశారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో నితీశ్‌కు మార్గనిర్దేశం చేసి నడిపించారు. ఇప్పుడు ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్‌తో నితీశ్ అందరికీ తెలిశాడు. 2023 సీజన్లో సన్‌రైజర్స్ తరఫున 2 మ్యాచ్‌లు ఆడినా బ్యాటింగ్ రాకపోగా, వికెట్ కూడా దక్కలేదు. ఈ సీజన్లో చెన్నైతో మ్యాచ్‌లో 8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 14 పరుగులు చేసి ట్రైలర్ చూపించిన నితీశ్ తానేంటే ఈ మ్యాచ్‌లో అసలు షో ప్రదర్శించాడు. చాలా కాలం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక స్థానిక ఆటగాడు చెలరేగి జట్టును గెలిపించడం మరో విశేషం. - (సాక్షి క్రీడా విభాగం) -
IPL 2024: సమిష్టిగా రాణించిన టైటాన్స్..సన్‌రైజర్స్‌కు శృంగభంగం
అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించారు. ఫలితంగా భీకర ఫామ్‌లో ఉండిన సన్‌రైజర్స్‌కు శృంగభంగం ఎదురైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ సిక్సర్ బాది మ్యాచ్ ముగించాడు. సన్‌రైజర్స్ దూకుడుకు ఆడ్డుకట్ట వేసిన గుజరాత్ బౌలర్లు.. సూపర్ ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ బ్యాటర్లకు ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు అడ్డుకట్ట వేశారు. గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి సన్‌రైజర్స్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశారు. మోహిత్ శర్మ 3, ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 200 పరుగుల మార్కును క్రాస్ చేసిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29, వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యారు. ఆడుతూపాడుతూ.. 163 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆది నుంచి నిలకడగా ఆడిన గుజరాత్ బ్యాటర్లు ఒక్కో పరుగు పేర్చుకుంటూ విజయం దిశగా సాగారు. సాహా (25), గిల్ (36), సాయి సుదర్శన్ (45), డేవిడ్ మిల్లర్ (44 నాటౌట్), విజయ్ శంకర్ (14 నాటౌట్) తలో చేయి వేసి గుజరాత్‌ను గెలిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్, మార్కండే, కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు. -
విధ్వంసకర బ్యాటింగ్..మరోసారి మోత మోగేనా ?
-
సన్ రైజర్స్ విజయోత్సాహం: దటీజ్ కావ్య మారన్, వైరల్ వీడియో
పురుషులకే సొంతమనుకున్న క్రికెట్లో మహిళలు తామేం తక్కువ అన్నట్టు రాణిస్తున్నారు. రిక్డార్డులతో తమ సత్తా చాటుతున్నారు. అంతేకాదు క్రికెట్ ఫ్రాంచైజీ యజమానులుగా కూడా మహిళలు దూసుకుపోతుండటం విశేషం. ముంబై ఇండియన్స్ జట్టు ఓనర్‌గా నీతా అంబానీ, ఇంకా శిల్పా శెట్టి, ప్రీతి జింటా ఇప్పటికే స్పెటల్ ఎట్రాక్షన్. తాజాగా కావ్య మారన్ రూపంలో యువకెరటం దూసుకొచ్చింది. సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. డీఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మనవరాలు. ఈ సక్సెస్ కిడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఐపీఎల్ 2024లో బాగంగా బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టూడియంలో జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరీ హోరీగా సాగిన ఈ పోటీ ఆద్యంతం అభిమానులను అలరించింది. తొలి పది ఓవర్లలోనే 100 పరుగులు, మొత్తం మ్యాచ్‌లో పరుగుల వరద, రికార్డులు వర్షం కురిసింది. ముఖ్యంగా ఎంఐపై జట్టు రికార్డ్ బ్రేకింగ్ విజయాన్ని సాధించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆకర్షణీయమైన ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో ఉత్సాహంగా గెంతులు వేసింది. తన జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరిచిన దృశ్యాలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. "Kavya Maran shines as the happiest person on Earth today! "Exciting #SRHvsMI clash! 🔥 #IPLUpdate with #RohitSharma𓃵 and Travis Head. Keep up with the action on #IPLonJioCinema! 🏏 #HardikPandya #LEAKED #IPLHistory #Klassen #NitaAmbani #SunriseHyderabad #CricketCaptaincy" 🌟… pic.twitter.com/5RmTRRKQlR — Rakesh Yadav 𝕏 (@RAKESHYADAV4) March 28, 2024 నిర్ణీత 20 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సౌజన్యంతో ఆతిథ్య జట్టుకు బలమైన ఆరంభం లభించడంతో ఎస్ఆర్హెచ్ సీఈవో ఈ ప్రపంచంలోనే ఇంతకుమించిన ఆనందం లేదన్నట్టుగా ఉద్వేగానికి లోనైంది. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్ కొట్టినప్పుడు ఆమె ఆనందం చూసి తీరాల్సిందే. క్లాసెన్ 34 బంతుల్లో నాలుగు ఫోర్లు,ఏడు సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతేనా 64 పరుగులతో ముంబై విజయాన్నివ్వడం ఖాయం అనుకుంటున్న తరుణంలో తిలక్ ఔటవ్వడంతో సన్‌రైజర్స్ అభిమానులే కాదు కావ్య కూడా ఊపిరి పీల్చుకుంది. తిలక్ మైదానాన్ని వీడుతుంటే ఆమె దండం పెట్టడం వైరల్‌గా మారింది. Brilliant innings by Tilak 👌 Reaction of Kavya Maran 🙏#SRHvsMi pic.twitter.com/8zpKU6s3Fp — Cricket Uncut (@CricketUncutOG) March 27, 2024 అద్భుతమైన బ్యాటింగ్‌తో SRH టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2013లో పూణే వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ 263/5 రికార్డును బద్దలు కొట్టింది.SRH కెప్టెన్ కమ్మిన్స్ ఈ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 👉: సన్‌రైజర్స్ గెలుపు.. ఆనందంతో గంతులేసిన కావ్య పాప -
IPL 2024 Full Schedule: ఐపీఎల్ 2024 రెండో విడత షెడ్యూల్ విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్ రెండో విడత షెడ్యూల్ ఇవాళ (మార్చి 25) విడుదలైంది. తొలి విడతలో 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా మిగతా 53 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రస్తుత సీజన్లో ఓవరాల్‌గా 74 మ్యాచ్‌లు (ప్లే ఆఫ్స్‌తో కలుపుకుని) జరగాల్సి ఉన్నాయి. సీఎస్కే వర్సెస్ కేకేఆర్.. రెండో విడత షెడ్యూల్ మ్యాచ్‌లు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమవుతాయి. ఈ విడత ఆరంభ మ్యాచ్‌లో సీఎస్కే.. కేకేఆర్‌తో తలపడనుంది. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటించారు. ఎన్నికల తేదీలు క్లాష్ కాకుండా ఉండేందుకు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అన్ని కసర్తులు పూర్తి చేసిన అనంతరం ఇవాళ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. IPL 2024 SCHEDULE....!!! ⭐ pic.twitter.com/M80vWCBE40 — Johns. (@CricCrazyJohns) March 25, 2024 చెన్నైలో ఫైనల్.. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనుంది. మే 21న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-1, మే 22న అదే నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న చెపాక్ వేదికగా క్వాలిఫయర్-2 జరుగనున్నాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. హైదరాబాద్‌లో ఐదు.. రెండో విడతలో హైదరాబాద్‌లో ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 25- సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ (రాత్రి 7:30 గంటలకు) మే 2- సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (రాత్రి) మే 8- సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో (రాత్రి) మే 16-సన్‌రైజర్స్ వర్సెస్ గుజరాత్ (రాత్రి) మే 19- సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్ (రాత్రి) -
IPL 2024: రసెల్ సిక్సర్ల సునామీ.. గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల సునామీ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించిన రసెల్.. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లను (1322 బంతుల్లో) పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రసెల్‌కు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ (1811 బంతుల్లో) పేరిట ఉండేది. రసెల్, గేల్ తర్వాత అత్యంత వేగంగా 200 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత కీరన్ పోలార్డ్‌కు (2055) దక్కింది. ఈ జాబితాలో టాప్-3 ఆటగాళ్లు విండీస్ వీరులే కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో సిక్సర్ల సంఖ్యను 202కు పెంచుకున్న రసెల్.. క్యాష్ రిచ్ లీగ్‌లో 200 సిక్సర్ల మైలురాయిని తాకిన తొమ్మిదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రసెల్‌కు ముందు గేల్ (357), రోహిత్ శర్మ (257), ఏబీ డివిలియర్స్ (251), ధోని (239), విరాట్ కోహ్లి (235), వార్నర్ (228), పోలార్డ్ (223), రైనా (203) ఈ మార్కును తాకిన వారిలో ఉన్నారు. కాగా, సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రసెల్ బ్యాటింగ్ విన్యాసాలకు హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ (4-0-33-3) తోడు కావడంతో కేకేఆర్ చిరస్మరణీయ విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే కీలకమైన క్లాసెన్ వికెట్‌తో పాటు షాబాజ్ అహ్మద్ వికెట్లు పడగొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్‌రైజర్స్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
KKR Vs SRH: శభాష్ సుయాష్.. సన్‌రైజర్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు..!
ఐపీఎల్ 2024 సీజన్లో ప్రారంభమైన రెండో రోజు అదిరిపోయే మ్యాచ్‌ను అందించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నిన్న (రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. హెన్రిచ్ క్లాసెన్ తొలి బంతికే సిక్సర్ బాది సన్‌రైజర్స్ శిబిరంలో గెలుపుపై ధీమా పెంచగా.. కేకేఆర్ ఆటగాళ్లు హర్షిత్ రాణా, సుయాష్ శర్మ ఆ ఆనందాన్ని వారికి ఎంతో సేపు నిలబడనీయలేదు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన రాణా వైవిధ్యమైన బంతులు సంధించి సన్‌రైజర్స్ గెలుపుకు అడ్డుకోగా.. సుయాష్ శర్మ కీలక దశలో (2 బంతుల్లో 5 పరుగులు) మెరుపు క్యాచ్ (క్లాసెన్) పట్టి ఆరెంజ్ ఆర్మీ చేతుల్లో నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ONE OF THE GREATEST CATCHES IN IPL HISTORY...!!! - Take a bow, Suyash Sharma. 🫡pic.twitter.com/CAq18gb8EO — Johns. (@CricCrazyJohns) March 23, 2024 సుయాష్ ఆ క్యాచ్ మిస్ చేసి ఉంటే బౌండరీ లభించి సన్‌రైజర్స్ సునాయాసంగా మ్యాచ్ గెలిచేది. ఒకవేళ ఆ క్యాచ్ డ్రాప్ అయ్యి, పరుగు రాకపోయినా అప్పటికే శివాలెత్తి ఉన్న క్లాసెన్ ఆఖరి బంతికి సిక్సర్ బాది సన్‌రైజర్స్‌ను గెలిపించేవాడు. సుయాష్ అందుకున్న ఈ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఇందుకే అంటారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆఖర్లో రసెల్ 7 సిక్సర్లు, 3 బౌండరీలతో విరుచుకుపడి కేకేఆర్ 200 పరుగుల మార్కును దాటేందుకు దోహదపడ్డాడు. చివర్లో రమన్‌దీప్ సింగ్ (35; ఫోర్, 4 సిక్సర్లు), రింకూ సింగ్ (23; 3 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. మయాంక్ మార్కండే 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. ఆదిలో తడబడినప్పటికీ గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమిపాలైంది. క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (29 బంతుల్లో 63; 8 సిక్సర్లు) మ్యాచ్ రూపురేఖల్నే మార్చేశాడు. అయితే గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో అతడు ఔట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా కేకేఆర్పైపు మలుపు తిరిగింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సన్‌రైజర్స్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) ఓ మోస్తరు స్కోర్లతో శుభారంభాన్ని అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి జిడ్డు బ్యాటింగ్‌తో (20 బంతుల్లో 20) సన్‌రైజర్స్ ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
బ్రూక్ కి అంత.. ఫిలిప్స్‌కి ఇంతే ఫైనల్ 4 లో ఎస్ ఆర్ హెచ్
-
ఛల్.. హట్ రే.. కావ్య మారన్ ఆన్ ఫైర్
-
అన్ని విభాగాల్లోనూ సన్‌రైజర్స్ ఫ్లాప్ షో
-
వచ్చేశారు..ఇక తగ్గేదేలే..SRHకి గుడ్ న్యూస్
-
కొత్త సీజన్.. కొత్త కెప్టెన్.. సన్‌రైజర్స్ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్‌కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఒకొక్కటిగా తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఆ జట్టు స్టార్ క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్‌లు తమ కొత్త జెర్సీని ధరించి ఉన్న ఫోటోలను సన్‌రైజర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే విధంగా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఎస్ఆర్హెచ్ అభిమానులతో పంచుకుంది. కాగా ఎస్ఆర్హెచ్ తమ పాత జెర్సీలో పూర్తి స్థాయిలో మార్పులు చేయకుండా.. కాషాయానికి కాస్త నల్లరంగును అద్దింది. అదే విధంగా ఆరంజ్ కలర్ లో ఉన్న ట్రాక్ ప్యాంటు స్థానంలో పూర్తి బ్లాక్ కలర్ ప్యాంటు తీసుకొచ్చారు. కాగా ఆరెంజ్ ఆర్మీ కొత్త జెర్సీ.. మొట్టమొదటి సౌతాఫ్రికా20 లీగ్‌లో టైటిల్ నెగ్గిన సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జెర్సీని పోలి ఉంది. ఇక ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ తమ కొత్త కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐడెన్ మార్కరమ్‌ను ఎంపిక చేసింది. అతని సారథ్యంలోని సన్ రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జట్టు తొట్ట తొలి సౌతాఫ్రికా20 లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. Idhi, Orange Fire 🔥 Buy your tickets now to watch your favourite #Risers in this brand new jersey soon 💥 🎟️ - https://t.co/ph5oL4pzDI#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/lRM75Yz6kO — SunRisers Hyderabad (@SunRisers) March 16, 2023 ℍ𝔼ℝ𝔼. 𝕎𝔼. 𝔾𝕆. 🧡 Presenting to you, our new #OrangeArmour for #IPL2023 😍@StayWrogn | #OrangeArmy #OrangeFireIdhi pic.twitter.com/CRS0LVpNyi — SunRisers Hyderabad (@SunRisers) March 16, 2023 చదవండి: IPL 2023: శ్రేయస్ అయ్యర్ దూరం..! కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్! -
SRH: విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేసేది, సన్‌రైజర్స్ కెప్టెన్ కూడా అతడే!
IPL Mini Auction 2023- Sunrisers Hyderabad: ఐపీఎల్ మినీ వేలం-2023కి సమయం దగ్గరపడింది. కొచ్చి వేదికగా శుక్రవారం(డిసెంబరు 23)న ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల కొనుగోలు అంశంపై ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ స్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ జట్టు గతేడాది దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన 14 మ్యాచ్‌లకు గానూ ఆరింట మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో కేన్ మామ కోసం గతంలో 14 కోట్ల భారీ పెట్టిన ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మినీ వేలానికి ముందు అతడితో బంధం తెంచుకుంది. మయాంక్ అగర్వాల్ కేన్ మామ స్థానాన్ని భర్తీ చేసేది అతడే ఈ నేపథ్యంలో విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఇతడేనంటూ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా క్రికెటర్ పేరును సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘ఎస్ఆర్హెచ్ మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్లకు.. దూకుడుగా ఆడగల ఓపెనర్ అవసరం ఎంతగానో ఉంది. అంతేకాదు గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ కూడా ఇప్పుడు లేడు. అనుభవజ్ఞుడైన, ఓపెనింగ్ బ్యాటర్ కేన్ సేవలను ఎస్ఆర్హెచ్ కచ్చితంగా మిస్సవుతుంది. కాబట్టి కేన్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఓపెనర్‌గా తను దూకుడు ప్రదర్శించగలడు. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడగలడు. బహుశా వాళ్లు అతడిని తమ కెప్టెన్‌గా చేసే ఆలోచనలో కూడా ఉన్నారేమో!’’ అని చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ ప్రస్తుతం కోటి రూపాయల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇక సారథిగా నియమించిన సమయంలో మయాంక్ కోసం పంజాబ్ 14 కోట్లు వెచ్చించగా.. ఈసారి అతడు ఎంత ధరకు అమ్ముడుపోతాడనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నిజంగానే సన్‌రైజర్స్ మయాంక్‌ను కొనుగోలు చేస్తే ఓపెనింగ్ స్థానానికి చక్కటి ఆప్షన్ దొరుకుతుంది. చదవండి: IPL 2023 Mini Auction Players List: వేలంలో 405 మంది ఆటగాళ్లు.. షార్ట్‌లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలు IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా! వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు