రాయుడు, రైనా
హైదరాబాద్ : ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త రికార్డు నమోదు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్ల అద్బుత బౌలింగ్‌కు ఈ సీజన్‌లో తొలి పవర్‌ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన చెన్నై జట్టు సన్‌రైజర్స్ పటిష్ట బౌలింగ్ ముందు తేలిపోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోని సేన పవర్ ప్లే(ఆరు ఓవర్లు) ముగిసే సరికి వికెట్ నష్టపోయి 27 పరుగులే చేసింది. దీంతో ఈ సీజన్‌లో పవర్‌ప్లే ముగిసే సరికి అత్యల్ప స్కోర్ నమోదు చేసిన తొలి జట్టుగా చెన్నై అప్రతిష్టను మూటగట్టుకుంది. సన్‌రైజర్స్ బౌలర్లు భువనేశ్వర్, బిల్లిస్టేన్‌లేక్, రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్‌ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల కోసం చెన్నై బ్యాట్స్‌మన్‌లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీడేర్ డేవిల్స్ తొలి పవర్‌ప్లేలో రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌లో చెన్నై 27 పరుగులతో ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment