తివారి బౌలింగ్‌ యాక్షన్‌పై జోకులే జోకులు | Manoj Tiwary Trolled on Twitter For His Bowling Action | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 27 2018 2:48 PM | Last Updated on Fri, Apr 27 2018 2:48 PM

Manoj Tiwary Trolled on Twitter For His Bowling Action - Sakshi

బౌలింగ్‌ చేస్తున్న తివారి

హైదరాబాద్‌ : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌గా కొత్త అవతారమెత్తాడు.. కింగ్స్‌పంజాబ్‌ ఆటగాడు మనోజ్‌ తివారి. యువరాజ్‌ సింగ్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వినూత్న శైలితో బౌలింగ్‌ చేసి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం తివారి బౌలింగ్‌ యాక్షన్‌పై అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నారు. టీమిండియా క్రికెటర్‌ కేదార్‌ జాదవ్‌, శ్రీలంక పేసర్‌ మలింగాల యాక్షన్‌ల కలయికగా తివారి బౌలింగ్‌ యాక్షన్‌ ఉందని అభిప్రాయపడుతున్నారు.

తివారి బౌలింగ్‌ చూస్తే నవ్వు ఆగడం లేదని.. ఇది మలింగా స్పిన్‌ వర్షన్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. ఇంకొంతమంది ఇది సరైన బౌలింగేనా.. అని ప్రశ్నిస్తున్నారు.  ఇలాంటి బౌలింగ్‌ను ఐపీఎల్‌లో అనుమతించ కూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఒకే ఓవర్‌ వేసిన తివారి 10 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 13 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement