KXIP
-
ఐపీఎల్: పేరు మార్చుకున్న కింగ్స్ పంజాబ్
న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్ 2021 సీజన్‌కు కొత్త పేరుతో బరిలోకి దిగుతామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ తెలిపింది. తమ జట్టును ఇక నుంచి పంజాబ్ కింగ్స్ పేరుతో పిలవాలని... పేరులో మార్పును కోరుతూ తాము బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నామని ఆ ఫ్రాంచైజీ తెలిపింది. ఐపీఎల్ (2008) ప్రారంభం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్న పంజాబ్ జట్టు ఒక్కసారీ టైటిల్ సాధించలేదు.ఐపీఎల్ 14వ సీజన్లో కొత్త పేరుతో బరిలోకి దిగనున్న పంజాబ్ తలరాత మారుతుందేమో వేచి చూడాలి. కేఎల్ రాహుల్ సారధ్యంలోని కింగ్స్ పంజాబ్ గతేడాది సీజన్లో ఆరో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా రాహుల్ 675 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నా.. మిగతా ఆటగాళ్లు ఎవరు ఆశించినరీతిలో ఆకట్టుకోలేదు. ముఖ్యంగా రూ.10 కోట్లు పెట్టి కొన్న ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తీవ్రంగా నిరాశపరిచాడు. కాగా ఫిబ్రవరి 18న జరగనున్న మినీ ఐపీఎల్ వేలానికి అంతా సిద్ధమైన వేళ పంజాబ్ జట్టు తమ పర్స్‌లో రూ.52 కోట్లతో వేలంలో పాల్గొననుంది. అయితే బీసీసీఐ సవరించిన తాజా నిబంధనల ప్రకారం పర్స్‌లో 75 శాతం ఆటగాళ్ల కొనుగోలుకు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో పంజాబ్ జట్టు రూ. 31.7 కోట్లతో వేలంలో పాల్గొనాల్సి ఉంది. కాగా గతేడాది దారుణ ప్రదర్శన కనబరిచిన మ్యాక్స్‌వెల్ సహా పలువురిని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కింగ్స్ పంజాబ్‌కు ‘వేలం’ కష్టాలు పాపం పుజారా.. ఎంత పని జరిగిపోయింది -
'ఆ అవకాశం ఇలా వస్తుందని ఊహించలేదు'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. లీగ్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన రాహుల్ 595 పరుగులతో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఒక దశలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన పంజాబ్.. తర్వాత అనూహ్యంగా ఫుంజుకొని వరుసగా ఐదు విజయాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. కెప్టెన్ అనే పదానికి నిర్వచనం చెబుతూనే బ్యాట్సమెన్గా నిలకడగా రాణిస్తున్న రాహుల్ తాజాగా ఆస్ట్రేలియా టూర్‌కు అన్ని ఫార్మట్లలో ఎంపికయ్యాడు. కాగా రోహిత్‌శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వన్డే, టీ20 జట్లకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. (చదవండి : ఇలాంటి కీపర్ ఉంటే అంతే సంగతులు) ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికవడం పట్ల స్పందించాడు.'ఆసీస్ టూర్లో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉంది. నా దృష్టిలో ఇది గర్వించదగిన విషయం. అసలు నేను వైస్ కెప్టెన్ అవుతానని ఊహించలేదు. ఈ బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా.. నా వంతు బాధ్యతగా జట్టును విజయవంతగా నడిపించడానికి ప్రయత్నిస్తా. అని తెలిపాడు. అయితే వైస్ కెప్టెన్‌గా రాహుల్ ఎంపిక సంతోషమే అయినా.. అతని ముందున్న లక్ష్యం మాత్రం కింగ్స పంజాబ్‌ను చాంపియన్‌గా నిలపడమే. కింగ్స్ పంజాబ్ ఆడనున్న తదుపరి రెండు మ్యాచ్‌లు చాలా కీలకం. ఇప్పటికే పంజాబ్ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములతో నాలుగో స్థానంలో ఉంది. కాగా కింగ్స్ పంజాబ్ రాజస్తాన్, సీఎస్‌కేలను ఎదుర్కోనుంది. (చదవండి : 'బయోబబుల్ నరకం.. కౌంట్‌డౌన్ మొదలెట్టా') -
కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో ఆర్సీబీ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్ విధించిన 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆర్సీబీ బ్యాటింగ్‌లో దేవదూత్ పడిక్కల్, ఫించ్‌లు కలిసి మొదటి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. 6వ ఓవర్ బౌలింగ్ వచ్చిన పెర్గూసన్ బౌలింగ్‌లో రెండో బంతికి ఫించ్ 16 పరుగుల వద్ద ఔటవ్వగా.. అదే ఓవర్లో నాలుగో బంతికి దేవదూత్ కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి.. గురుకీరత్‌తో కలిసి మరో వికెట్ పడకుండా 13.3 ఓవర్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ బౌలర్లలో పెర్గూసన్ ఒక వికెట్ తీశాడు. కాగా ఈ విజయంతో ఆర్సీబీ రన్‌రేట్‌ను మరింత మెరుగుపరుచుకొని మొత్తం 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కేకేఆర్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలయినా పది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, 5 ఓటమిలతో నాలుగో స్థానంలోనే కొనసాగుతుంది.కాగా అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన మహ్మద్ సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. (చదవండి : 84 పరుగులకే చాప చుట్టేసిన కేకేఆర్) అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న కేకేఆర్.. ఆర్సీబీ బౌలర్ల దాటికి ఏ దశలోనూ పోరాటపటిమ కనబర్చలేదు. కాగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాట్స్మెన్లలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 30 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఒక దశలో జట్టు స్కోరు 60 పరుగులు దాటుటుందా అన్న దశలో చివర్లో లోకీ పెర్గ్యూసన్ 19 పరుగులు, కుల్దీప్ యాదవ్ 12 పరుగులు చేయడంతో 84 పరుగులు చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3వికెట్లు, చహల్ 2, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ తలా ఒక వికెట్ తీశారు. (చదవండి : ఎందుకన్నయ్య మీరు ఇలా చేశారు..) -
మాక్స్‌వెల్‌ను అందుకే ఆడిస్తున్నాం : కేఎల్ రాహుల్
దుబాయ్ : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో కింగ్స్ పంజాబ్ రూ.10.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కింగ్స్ యాజమాన్యం అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ మ్యాక్స్‌వెల్ నుంచి ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మంచి ప్రదర్శన కూడా చూడలేకపోయాం. వరుసగా విఫలమవుతూ వస్తున్న మ్యాక్స్‌వెల్‌ను ఇంకా జట్టులో ఎందుకు ఆడిస్తున్నారంటూ కింగ్స్ జట్టును పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. కానీ ఇవేవి పట్టించుకోని కింగ్స్ యాజామాన్యం మాక్స్‌వెల్‌ను తుదిజట్టులో ఆడిస్తూనే ఉంది. తాజాగా మాక్స్‌వెల్‌ను జట్టులో ఎందుకు ఆడిస్తున్నామనే దానిపై కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ క్లారీటి ఇచ్చాడు. (చదవండి : పూరన్ ఆట అతన్ని గుర్తుకుతెచ్చింది : సచిన్) మ్యాచ్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్ స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ...'నిజానికి మ్యాక్స్‌వెల్ ప్రాక్టీస్ సమయంలో బ్యాటింగ్ విషయంలో బాగా కష్టపడుతున్నాడు. మ్యాక్సీ మా జట్టులో ఒక అద్భుతమైన టీం మెంబర్‌గా కనిపిస్తాడు. అతను జట్టులో ఉంటే నాకు ఎందుకో మేము మంచి బ్యాలెన్స్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. జట్టులో 11 మంది సరిగ్గా ఆడడం అనేది ఎప్పటికీ జరగదు. ఫీల్డింగ్‌లోనూ అందరూ తమ వైవిధ్యమైన ఆటతీరును చూపలేరు. కానీ మ్యాచ్ విన్నర్లు జట్టుకు చాలా అవసరం. ఇది మాక్స్‌వెల్‌లో పుష్కలంగా ఉంది.. అయితే ఈ సీజన్లో అతను విఫలం కావడం నిజమే. కానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ చేసిన 32 పరుగులు మా జట్టు విజయంలో మరో కీలకపాత్ర అని చెప్పొచ్చు. నా దృష్టిలో మ్యాక్స్‌వెల్ ఫామ్‌లోకి వచ్చాడనే అనుకుంటున్నా. ఒకవేళ అదే నిజమైతే మాత్రం అతని నుంచి ఇకపై మంచి ఇన్నింగ్స్‌లు చూసే అవకాశం ఉంటుంది.' అని రాహుల్ చెప్పుకొచ్చాడు.(చదవండి : గేల్ రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్ చేయాలి) మంగళవారం ఢిల్లీతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మ్యాక్స్‌వెల్‌తో ఓపెనింగ్ బౌలింగ్ చేయించడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మ్యాక్సీ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ 4ఓవర్లు బౌలింగ్ వేసి ఒక వికెట్ తీశాడు. ఇక కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్ సమయంలోనూ మ్యాక్సీ 24 బంతుల్లో మూడు ఫోర్లతో 32 పరుగులు చేశాడు. ఈ సీజన్లో మ్యాక్సీ అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. మ్యాక్స్‌వెల్ కొనసాగించడంపై విమర్శలు వస్తున్న వేళ విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రం మ్యాక్సీకి మద్దతుగా నిలిచాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌పై కింగ్స్‌కు నమ్మకం ఉంది. తన ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌తో జట్టుకు విజయం సాధించే అవకాశాలు ఉండడంతోనే జట్టులో అతన్ని ఆడిస్తోందని పేర్కొన్నాడు. ఢిల్లీపై విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకిన పంజాబ్ తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్ 24న సన్‌రైజర్స్‌తో తలపడనుంది. -
'పూరన్ ఆట అతన్ని గుర్తుకుతెచ్చింది'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ హ్యాట్రిక్ విజయం నమోదు చేయడంలో నికోలస్ పూరన్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఈ సీజన్లో పూరన్ కింగ్స్ పంజాబ్ తరపున ఆది నుంచి మంచి ప్రదర్శననే కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు కింగ్స్ తరపున 10 మ్యాచ్‌లాడిన పూరన్ 183. 22 స్ట్రైక్ రేట్‌తో 295 రన్స్ చేశాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నికోలస్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిసిస్తున్నారు. అందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. (చదవండి : గేల్ రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్ చేయాలి) 'ఢిల్లీతో మ్యాచ్‌లో నికోలస్ పూరన్ ఇన్నింగ్స్ అద్బుతం. అతను ఆడిన కొన్ని పవర్ షాట్స్ నాకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జేపీ డుమినిని గుర్తుచేశాయి. పూరన్ కొట్టిన ప్రతీ షాట్ క్లీన్‌గా ఉంటూనే మంచి పవర్ కలిగి ఉన్నాయి. అతని ఆటతీరు కొన్నిసార్లు డుమిని తలచుకునేలా చేసింది.' అని పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన జేపీ డుమిని 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్, డెక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడాడు. Some power packed shots played by @nicholas_47. What a clean striker of the ball he has been. His stance and backlift reminds me of @jpduminy21.#KXIPvDC #IPL2020 — Sachin Tendulkar (@sachin_rt) October 20, 2020 కాగా డుమిని జూలై 2019లో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. కాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నికోలస్ పూరన్ 28 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. పూరన్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుతం లీగ్‌లో 5వ స్థానంలో ఉన్న పంజాబ్ తన తదుపరి మ్యాచ్‌లో అక్టోబర్ 24న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కోనుంది. (చదవండి : నా చేతికి ధోని జెర్సీ: బట్లర్) -
'గేల్ రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్ చేయాలి'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ కింగ్స్ పంజాబ్ తుది జట్టులోకి అడుగుపెట్టాకా ఆ జట్టు ఆటతీరు పూర్తిగా మారిపోయిందనే చెప్పొచ్చు. గేల్ రాకముందు ఆరు మ్యాచ్‌లాడిన పంజాబ్ ఒక విజయం, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది. అయితే గేల్ వచ్చిన తర్వాత హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయడం విశేషం. గేల్ వచ్చి పెద్దగా మెరుపులు మెరిపించకపోయినా.. అతను ఆడుతున్న సుడిగాలి ఇన్నింగ్స్‌లు పంజాబ్ విజయాలను తేలికచేశాయని చెప్పొచ్చు. తాజాగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ 29 పరుగులే చేసినా.. అతను ఆడిన ఇన్నింగ్స్ వల్లే పంజాబ్ సులువైన విజయాన్ని నమోదు చేసింది. (చదవండి : ఐదో ప్లేయర్‌గా గబ్బర్..) కాగా నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ను రవిచంద్రన్ అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీనికంటే ముందు ఇద్దరి మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గేల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని షూ లేస్ ఒకటి ఊడిపోయింది. ఈ సందర్భంగా అశ్విన్ గేల్ షూలేస్‌ను కట్టి సరిచేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను అశ్విన్ సరదా క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. 'డెవిల్ చూడడానికి భయంకరంగా ఉంటుంది. అది చేసే విధ్వంసం కూడా అలాగే ఉంటుంది. ఇదే తరహా పోలిక నాకు గేల్‌లోనూ కనబడుతుంది. అందుకే గేల్ రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్ చేయాలి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈరోజు కఠినమైన రోజు. కానీ వచ్చే మ్యాచ్‌లో విజయంతో ఫుంజుకొని తిరిగి బలంగా తయారవుతాం ' అంటూ కామెంట్ చేశాడు. (చదవండి :ఆ ప్రశ్నకు నాకు కోపం వచ్చింది: గేల్) ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ శిఖర్ ధావన్ మరోసారి సెంచరీతో మెరవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ధావన్ మినహా మిగతా ఎవరు రాణించకపోవడంతో ఢిల్లీ సాధారణ స్కోరునే నమోదు చేసింది. 165 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. మూడో ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఇన్ఫామ్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ వెనుదిరిగినా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్ వచ్చిన గేల్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో 25 పరుగులు పిండుకొని మ్యాచ్ స్వరూపమే మార్చేశాడు. కాసపటికే గేల్ అవుటైనా నికోలస్ పూరన్ 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న పంజాబ్ తన తదుపరి మ్యాచ్‌లో అక్టోబర్ 24న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కోనుంది. -
ముంబైని పంజాబ్ నిలువరించేనా?
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో ఆదివారం దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ పంజాబ్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. కాగా వరుస విజయాలతో దూకుడు మీదున్న ముంబైని కింగ్స్ పంజాబ్ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. ఇందులో ఆసక్తికర విషయమేంటంటే ముంబై వరుసగా ఐదు విజయాలు నమోదు చేసి అగ్రస్థానంలో ఉండగా.. కింగ్స్ పంజాబ్ మాత్రం వరుస ఐదు ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో ఆర్సీబీపై విజయం సాధించినా పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది. ఇక ఇరుజట్ల విషయానికి వస్తే.. రోహిత్ శర్మ, డికాక్, సూర్య కుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలతో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగం దుర్బేద్యంగా ఉంది. ఇక బౌలింగ్‌లో బౌల్ట్, కౌల్టర్‌నీల్, బుమ్రాలతో పటిష్టంగా ఉంది. కింగ్స్ పంజాబ్ విషయానికి వస్తే.. క్రిస్ గేల్ రాకతో ఆ జట్టు పటిష్టంగా మారిందనే చెప్పొచ్చు. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే గేల్ తన విలువేంటో చూపాడు.. దీంతోపాటు కెప్టెన్ రాహుల్, మాయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్‌లు ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. అయితే ఇప్పటికి పంజాబ్ జట్టు మిడిలార్డర్ నిరాశపరుస్తూనే ఉంది. మ్యాక్స్‌వెల్ విఫలం ఇంకా కొనసాగుతూనే ఉండడం చర్చకు దారి తీస్తుంది. అయితే ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది.ఇక ముఖాముఖి పోరులో ఇప్పటివరకు 25 మ్యాచ్‌ల్లో తలపడగా.. ముంబై 14 మ్యాచ్‌లు.. పంజాబ్ 11 మ్యాచ్‌లు గెలిచింది. ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, కృనాల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, కౌల్టర్ నైట్, జస్ప్రీత్ బుమ్రా కింగ్స్ పంజాబ్ : కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, క్రిస్ గేల్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్నోయ్, అర్షదీప్ సింగ్ -
ఈ పేరును కొంచెం గౌరవించండి : గేల్
షార్జా : విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్ 13వ సీజన్లో తన ఆటను ఆరంభించాడు. గురువారం ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఆఖరి బంతికి విజయం సాధించి లీగ్‌లో కీలక విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో మొదటి మ్యాచ్‌లో బరిలోకి దిగిన గేల్ 54 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గేల్ ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. గేల్ మ్యాచ్ ఆడుతున్నాడంటే అక్కడ ఉండే సరదా వేరుగా ఉంటుంది. తాను చేసే అల్లరితో గ్రౌండ్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మోడ్‌లోకి మారిపోతుంది. (చదవండి : ఉత్కంఠ పోరు.. చివరి బంతికి గెలిచారు) తాజాగా కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌లో గేల్ తన అర్థసెంచరీ పూర్తి చేశాక ఒక సన్నివేశం చోటుచేసుకుంది. ఫిప్టీ పూర్తయిన తర్వాత బ్యాట్ పైకెత్తిన గేల్ బ్యాట్‌పై ఉన్న స్టిక్కర్‌ను చూపించాడు. ఆ స్టిక్కర్‌పై ది బాస్ అని రాసి ఉంది. బ్యాట్‌పై ఉన్న స్టిక్కర్ ద్వారా గేల్ ఒక మెసేజ్‌ను పాస్ చేశాడు. ' అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. నేను చూపించే ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి' అంటూ పేర్కొన్నాడు. కాగా గేల్ చేసిన పనిపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రస్తావించాడు.(చదవండి : కెప్టెన్సీకి దినేశ్ కార్తీక్ గుడ్ బై) When he is on the mic, expect nothing less than entertainment and laughs 😅😅#Dream11IPL | @henrygayle pic.twitter.com/I62YPN1pES — IndianPremierLeague (@IPL) October 15, 2020 గేల్ ఒక మంచి గుణం కలిగిన ఆటగాడని.. క్రికెట్లో గొప్పగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఆటగాళ్లలో అతను ముందు వరుసలో ఉంటాడని కొనియాడాడు. అతను ఉన్న చోట ఎంటర్టైన్మెంట్కు కొదువ ఉండదు.. అందుకే గేల్ మంచి మనసున్న ఆటగాడయ్యాడని తెలిపాడు.అనంతరం మ్యాచ్ గురించి ప్రస్తావించగా.. కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడని.. అతనికి మంచి భవిష్యత్తు ఉందన్నాడు. కింగ్స్ పంజాబ్ అసలైతే ఐదు మ్యాచ్‌లు గెలవాల్సి ఉండేది.. కానీ వారికి అదృష్టం కలిసిరావడం లేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ కూడా ఈజీగా గెలవాల్సినా.. చివరివరకు ఆడి క్లిష్టతరం చేసుకున్నారని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అంతేగాక క్రీడల్లో గొప్ప అథ్లెట్‌గా కోహ్లితో పాటు ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోలను మొదటి చాయిస్‌గా తీసుకుంటానని రవిశాస్త్రి ఇంటర్య్వూలో సమాధానమిచ్చాడు. కాగా కింగ్స్ పంజాబ్ 8 మ్యచ్‌లాడి కేవలం రెండు విజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. లీగ్‌లో ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లను పంజాబ్ గెలవడంతో పాటు రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటేనే ఫ్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. -
అందుకే ఆరో స్థానంలో ఆడించాం: కోహ్లి
దుబాయ్: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఓడిపోయింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య ఛేదనను ఆఖరి బంతికి ఫినిష్ చేశారు పంజాబ్. ఐతే ఈ మ్యాచ్‌లో ఏబీ డివీలియర్స్ ఆరవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతడి కంటే ముందు వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబెను ఆడించారు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి ఈ విషయంపై మాట్లాడాడు. 'లెఫ్ట అండ్ రైట్ కాంబినేషన్ ఉండాలనే ఏబీని ఆరవ స్థానంలో ఆడించాల్సి వచ్చింది. పంజాబ్‌లో ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వారిని టార్గెట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. 170 పరుగులు చేయడం సంతృప్తిగా ఉంది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఆటతీరు చూసి 19వ ఓవర్లోనే మ్యాచ్ పూర్తి అవుతుందని అనుకున్నా. కానీ ఆఖరి బంతి వరకు బౌలర్లు పోరాడారు. ఆఖరి ఓవర్లో చాహల్‌తో ఎలాంటి చర్చ జరపలేదు' అని కోహ్లి పేర్కొన్నాడు. ఏబీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ 2 (5) పరుగులకే ఔటయ్యాడు. ఇప్పుడున్న ఫామ్‌కు ఏబీ తన స్థానంలో ఆడుంటే జట్టు స్కోర్ 200 పరుగులు దాటేదని విశ్లేకలు అంటున్నారు. కాగా పంబాబ్ జట్టు చివరి ఓవర్లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా చాహల్ వేసిన మొదటి ఐదు బంతులకు కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. ఐదో బంతికి గేల్ రన్ ఔట్ అయ్యాడు. చివరి బంతికి పూరన్ సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. -
'ఇంత దారుణంగా ఆడుతానని అనుకోలేదు'
షార్జా : ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే మ్యాక్స్‌వెల్ 2014లో కింగ్స్ పంజాబ్ తరపున 552 పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఈ ప్రదర్శనే అతన్ని ఐపీఎల్ వేలంలో ఎక్కువ ధర పలికేలా చేసింది. అంతేకాదు.. 2017లో మళ్లీ కింగ్స్ పంజాబ్ జట్టుకు మ్యాక్స్‌వెల్ కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వహించాడు. కానీ ఇప్పుడు అదే మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ పంజాబ్ వేలంలో రూ. 10.5 కోట్లు పెట్టి కొంటే ఐపీఎల్ 13వ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. (చదవండి : కోహ్లి బ్యాట్స్ దొంగలిస్తా : డివిలియర్స్) అయితే మ్యాక్సీ ఐపీఎల్‌కు రాకముందు ఇంగ్లండ్ సీజన్లో తన ప్రదర్శనతో దుమ్మురేపాడు. వన్డే సిరీస్‌లో కీలక మ్యాచ్‌లో 90 బంతుల్లోనే 108 పరుగులు చేసి ఆసీస్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. తీరా ఐపీఎల్‌కు వచ్చేసరికి మ్యాక్స్‌వెల్ పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు. కింగ్స్ పంజాబ్ తరపున ఏడు మ్యాచ్‌లాడిన మ్యాక్సీ కేవలం 58 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు మాక్స్వెల్ స్థానంలో క్రిస్‌గేల్‌ను ఆడించాలని.. లేకపోతే పంజాబ్ తీవ్రంగా నష్టపోతుదంటూ సీనియర్లు విమర్శించారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన మ్యాక్స్‌వెల్ తనకు పూర్తి క్లారిటీ ఉందని పేర్కొన్నాడు. (చదవండి : ఆ టోపీలకు విలువ ఇవ్వను: అశ్విన్) 'ఐపీఎల్, అంతర్జాతీయ కెరీర్‌ను ఎప్పుడూ పోల్చుకోకూడదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు నా పాత్రపై పూర్తి స్పష్టత ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరు ముందు.. ఎవరు వెనుక అనే దానిపై స్పష్టత ఉంటుంది. ఎందుకంటే అది జాతీయ జట్టు.. అందునా ప్రతీ మ్యాచ్‌లోనూ దాదాపు ఒకే జట్టును ఆడిస్తారు. కానీ ఐపీఎల్లో అలా ఉండదు. ప్రతీ మ్యాచ్‌లోనూ బ్యాటింగ్ ఆర్డర్ మారుతూ వస్తుంది. అందువల్లే నా ప్రదర్శనలో తేడా కనిపిస్తుంది. ప్రస్తుత పంజాబ్ జట్టులో మొదటి నాలుగు స్థానాల తర్వాతే నేను బ్యాటింగ్‌కు దిగుతున్నా.. ఇప్పటికైతే టాప్ ఆర్డర్లో ఆడే అవకాశం లేదు.. దీంతో ముందున్న నలుగురు బ్యాట్స్‌మెన్‌కు మద్దతుగా స్ట్రైక్ రొటేట్ చేయడమే నా పాత్ర. కానీ నేను ఇంత దారుణంగా ఆడుతానని అనుకోలేదు. కానీ యూఏఈ పిచ్‌లు ప్రస్తుతం నెమ్మదిస్తున్నాయి. ఆసీస్ తరఫున మంచి ప్రదర్శన చేసిన అనంతరం ఇక్కడ అదే ప్రదర్శనను పునరావృతం చేయకపోవడం బాధ కలిగిస్తుంది. కానీ ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని.. గతంతో పోలిస్తే వికెట్లలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని తెలిపాడు. చాలా మ్యాచుల్లో పంజాబ్ గెలుపు దగ్గరికొచ్చి ఓడిపోవడం బాధాకరమే.. అందకు నన్ను ఒక్కడినే బాధ్యుడిని చేయడం మాత్రం ఒప్పుకోను.' అని చెప్పుకొచ్చాడు. కాగా పంజాబ్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. ఇక ఇప్పటినుంచి జరిగే ప్రతీ మ్యాచ్ పంజాబ్‌కు కీలకమనే చెప్పొచ్చు. గురువారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో క్రిస్ గేల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. (చదవండి : ‘ఈ సీజన్లో ఆ రెండు జట్లే అత్యుత్తమం’) -
ముచ్చటగా 100వ ఓటమి !
దుబాయ్: ముంబయి ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. దీంతో ఐపీఎల్లో 100 మ్యాచులు ఓడిన రెండో జట్టుగా ఢిల్లీ రికార్డు నెలకొల్పింది. ఈ జాబితాలో మొదట కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఉంది. అత్యధిక ఓటములు నమోదు చేసిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (95), కోల్‌కతా నైట్ రైడర్స్ (88), ముంబయి ఇండియన్స్ (80), రాజస్థాన్ రాయల్స్ (74) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసి 162 పరుగులు చేసింది. ధావన్ (69) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ముంబయి బ్యాట్స్‌మెన్స్ క్వింటన్ డికాక్ (53), సూర్యకుమార్ యాదవ్ (53) ఆఫ్ సెంచరీలు చేయడంతో మ్యాచ్‌ను సులువుగా ముగించేశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టిలో ముంబయి జట్టు మొదటి స్థానానికి చేరుకుంది. (ఇదీ చదవండి: కొడితే బంతి బయటపడాల్సిందే !) -
గేల్.. నువ్వు త్వరగా కోలుకోవాలి
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఏది కలిసిరావడం లేదు. శనివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సులభంగా గెలిచే మ్యాచ్‌ను కష్టతరం చేసుకొని ఆపై కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ జట్టు దారుణ వైఫల్యం గురించి చెబుతుంది. ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోని మిడిలార్డర్ బ్యాట్స్మన్లు దారుణంగా ఫేయిలయ్యారు. చివరి బంతిని మ్యాక్స్‌వెల్ భారీ షాట్‌కు ప్రయత్నించినా.. దురదృష్టం ఆ జట్టును వెంటాడుతుండడంతో అది బౌండరీగా మారి వారి పాలిట శాపంగా మారింది. లీగ్‌లో వరుసగా విఫలమవుతూ వస్తున్న మ్యాక్స్‌వెల్ స్థానంలో క్రిస్ గేల్‌ను జట్టులోకి తీసుకోవాలంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. (చదవండి : ‘గేల్‌ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’) శనివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గేల్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. అయితే గేల్‌ను జట్టులోకి తీసుకోకపోవడం వెనుక బలమైన కారణమే ఉంది. నిజానికి ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లోనే గేల్‌ను తీసుకోవాలని భావించారు. కానీ గేల్‌కు ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరాడని.. అందుకే మ్యాచ్ ఆడలేదని ఆ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. ఇప్పుడు అతని పరిస్థితి బాగానే ఉన్నా కాస్త అనారోగ్యం ఉండడంతో కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగలేదని పేర్కొన్నాడు. కాగా గేల్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన అతని అభిమానులు గేల్ నువ్వు త్వరగా కోలుకోవాలంటూ సోషల్‌మీడియాలో కామెంట్స్ షేర్ చేశారు. దీంతో క్రిస్ గేల్ తన ఆరోగ్య పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను విడుదల చేశాడు. 'మీ అందరికి ఒక విషయం చెప్పదలచుకున్న. సమస్యలో ఉన్నప్పుడు పోరాటం చేయకుండా నేను వెనుకడుగు వేయను. నేను యునివర్స్‌ల్ బాస్‌ను.. నేను ఎన్నటికి మారను. ఎంత కష్టం వచ్చిన దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను తప్ప నా శైలిని మార్చుకోను. బతకడం అనేది ఒక కళ.. అది అందరికి రాదు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా.. మీ ఆశీర్వాద బలం ఎప్పటికి ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటాన్నా. నా కోసం ప్రార్ధించిన మీ అందరికి ధన్యవాదాలు. అంటూ తెలిపాడు. కాగా పంజాబ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇకపై పంజాబ్‌కు ప్రతీ మ్యాచ్‌కు కీలకంగా మారనుంది. ఇప్పటినుంచి ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ పంజాబ్ గెలవాల్సి ఉంటుంది. తన తర్వాతి మ్యాచ్‌ను అక్టోబర్ 15న ఆర్సీబీతో తలపడనుంది.(చదవండి : దినేశ్ కార్తీక్.. ఏం తిన్నావ్: మాజీ క్రికెటర్) -
సునీల్ నరైన్‌కు వార్నింగ్!
దుబాయ్: కోల్‌కతా ఆటగాడు సునీల్ నరైన్‌కు అంపైర్లు వార్నింగ్ ఇచ్చారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని మ్యాచ్ అనంతరం అంపైర్లు తెలిపారు. ప్రస్తుతం నరైన్ బౌలింగ్ చేయవచ్చని, మరోసారి తన బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు వస్తే ఈ సీజన్ ఐపీఎల్ నుంచి సస్పెండ్ చేస్తారన్నారు. కోల్‌కతా జట్టులో నరైన్ కీలక ఆటగాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా మెరిపించగలడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివర్లో రెండు కీలక ఓవర్లు వేశాడు. పంజాబ్ 18 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఆ సమయంలో 18వ ఓవర్ వేసిన నరైన్ కేవలం రెండు పరుగులు ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇంతకు ముందూ ఇలాగే... నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు రావడం కొత్తేమి కాదు. 2014లో జరిగిన ఛాంపియన్స్ లీగ్‌లో రెండు సార్లు అతడిపై ఫిర్యాదులు వచ్చాయి. తన బౌలింగ్ కారణంగా 2015లో జరిగిన ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. అంతేకాదు అదే ఏడాదిలో జరిగిన ఐపీఎల్లో కూడా ఇలాంటి ఫిర్యాదులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఫలితంగా ఐసీసీ ఆ ఏడాది నవంబర్‌లో అతడిని సస్పెండ్ చేసింది. ఈ సారి తన బౌలింగ్ వైఖరిని మార్చుకోకపోతే వేటు తప్పదు. -
మూడు సిక్సులు... 300 మీటర్లు !
ఢిల్లీ: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ సన్‌రైజన్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు సిక్సులు బాదాడు. ఇందులో మూడు సిక్సులు (100, 105, 106) వంద మీటర్లు దాటాయి. ఈ ఐపీఎల్ సీజన్లో ఒకే మ్యాచ్‌లో మూడు సిక్సులు వంద మీటర్లు బాదిన ఆటగాడు అతడే. అంతేకాదు ఈ సీజన్లో భారీ సిక్సు (106 మీటర్లు) అతడి పేరుపైనే ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్దేశించిన 201 పరుగుల భారి లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. పూరన్ ఒక్కడే 77 (37) అద్భుతంగా ఆడాడు. మరే బ్యాట్స్‌మెన్ నుంచి అతడికి మద్దతు లభించకపోవడంతో ఒంటరి పోరాటం చేశాడు. ఫలితంగా హైదరాబాద్ చేతిలో 69 పరుగుల తేడాతో పంజాబ్ ఓడిపోయింది. -
'పాపం పంజాబ్.. మ్యాక్స్‌వెల్ నుంచి ఏదో ఆశిస్తుంది'
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. లీగ్ ప్రారంభానికి ముందు కింగ్స్‌పంజాబ్‌ను టైటిల్ ఫేవరెట్‌గా భావించారు. ఎందుకంటే ఆ జట్టులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాటింగ్ ఆర్డర్ కలిగి ఉంది. దీనికి తోడు మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన మ్యాచ్‌లో కింగ్స్ ఓడిపోయినా ఆకట్టుకుంది.ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ మెరుపు ఇన్నింగ్స్‌తో గెలిచినంత పని చేసిన పంజాబ్ తీరా సూపర్ ఓవర్లో రబడ దాటికి మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి భోణీ కొట్టింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. (చదవండి : సీఎస్కే బ్యాట్స్‌మెన్ ప్రభుత్వ ఉద్యోగులా?!) రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోతూ వచ్చింది. దీంతో ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. పంజాబ్ ఆటతీరు మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఇలాగే కొనసాగితే మొదట లీగ్ నుంచి నిష్క్రమించిన జట్టుగా నిలుస్తుంది. అయితే కింగ్స్ పంజాబ్ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్లో ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా 1,5,13,11,11*, 7 పరుగులు చూస్తే అసలు మనం చూస్తున్నది మ్యాక్స్‌వెల్ ఆటేనా అనే అనుమానం కలుగుతుంది. గురువారం ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ను పక్కనపెట్టి గేల్‌ను తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కింగ్స్ అభిమానులు విమర్శిస్తున్నారు. అయితే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మ్యాక్స్ వెల్ ఆటతీరుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : రోహిత్ శర్మను గుడ్డిగా నమ్మాను.. అందుకే) 'పంజాబ్ జట్టు మ్యాక్స్‌వెల్ నుంచి ఏదో ఆశిస్తుంది. కానీ అతను మాత్రం స్కోర్లు చేయలేక వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. కెప్టెన్ రాహుల్‌కు విదేశీ ఆటగాళ్ల నుంచి సరైన సహకారం అందడం లేదు. నికోలస్ పూరన్ మినహా మిగతా ఆటగాళ్లు ఎవరు రాణించడం లేదు. అందులో మ్యాక్స్‌వెల్ కూడా ఒకడు. అయితే 10.5 కోట్ల రూపాయలు పెట్టి కొన్న మ్యాక్స్‌వెల్ నుంచి పంజాబ్ ఆశించడంలో తప్పు లేదు. ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నందుకు పంజాబ్‌కు అతను కీలకం కావచ్చు.. కానీ మ్యాక్స్ విఫలమవుతున్న వేళ పక్కనైనా పెట్టాలి లేదా మరో మ్యాచ్ అవకాశమైనా ఇవ్వాలి. ఒకవేళ మ్యాక్స్‌వెల్ వద్దనుకుంటే గేల్‌కు అవకాశమిచ్చి చూడాలి. గేల్ మెరుస్తాడని కాదు కాని ఒకసారి అవకాశమిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరైతే ఏంటి ఆడకపోతే పక్కన పెట్టాల్సిందే. కింగ్స్ కెప్టెన్‌గా రాహుల్ మ్యాక్స్‌వెల్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే కూడా మ్యాక్స్‌వెల్ స్థానంలో గేల్‌ను ఆడించి ఉంటే బాగుండేదని తన అభిప్రాయం చెప్పాడు. ఒకవేళ గేల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే నాకు తెలిసి పంజాబ్ జట్టు అతన్ని మూడు లేదా నాలుగు స్థానాల్లో ఆడించాల్సి ఉంటుంది. మరి పంజాబ్ తలరాత తర్వాతి మ్యాచ్ నుంచైనా మారుతుందేమో చూడాలంటూ తెలిపాడు. కాగా కింగ్స్ పంజాబ్ తన తర్వాతి మ్యాచ్ రేపు(శనివారం) కేకేఆర్‌ను ఎదుర్కోనుంది. (చదవండి : 'ఈ సమయంలో గేల్ చాలా అవసరం') -
'ఈ సమయంలో గేల్ చాలా అవసరం'
దుబాయ్ : ఐపీఎల్ అంటేనే దనాధన్ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. అయితే సిక్సర్ల వీరుడిగా పేరు పొందిన విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇంతవరకు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. మరోవైపు కింగ్స్ పంజాబ్ ఈ సీజన్లో దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. కింగ్స్ జట్టులో ఓపెనర్లు రాహుల్, మాయాంక్, మరో ఆటగాడు నికోలస్ పూరన్ మినహా మిగతా ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్‌వెల్ దారుణ ప్రదర్శన మరింత కలవరపరుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ గేల్ రాకపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' వరుస ఓటములు మా జట్టును తీవ్రంగా బాధిస్తున్నాయి. క్రిస్ గేల్, ముజీబ్ ఉర్ రెహమన్ జట్టులోకి వచ్చే సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తుంది. వారిద్దరిని తుది జట్టులోకి తీసుకోకపోతే మేం నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్లేఆఫ్స్‌కు సమయం దగ్గరైన కొద్దీ ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన దశలో తుది జట్టులోకి తీసుకోవాలని ఎవరు అనుకోరు. వారిని తీసుకునేందుకు ఇప్పుడే మంచి అవకాశం.. రానున్న మ్యాచ్‌ల్లో అది జరగవచ్చు. ఇక గేల్ తన విధ్వంసాన్ని చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతను ఫామ్‌లో ఉంటే ఎలాంటి విధ్వంసముంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. (చదవండి : నచ్చినవారిని వదిలిరావడం ఎంతో కష్టం') ఇప్పుడు మాకు మ్యాచ్ విన్నర్స్ అవసరం చాలా ఉంది. గేల్ లాంటి ఆటగాడు ఫామ్‌లో ఉంటే.. నాలుగైదు మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు మాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. రానున్న తొమ్మిది మ్యాచ్‌ల్లో కనీసం ఏడు మ్యాచ్‌లు గెలిస్తే గాని టాప్-4 లో నిలిచే అవకాశం ఉంటుంది. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే కొనసాగాలనే నిబంధన ఉండడంతో క్రిస్ గేల్ కోసం మ్యాక్స్‌వెల్‌ను పక్కనపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతావాళ్లలో బ్యాటింగ్ విభాగంలో నికోలస్ పూరన్, బౌలింగ్ విభాగంలో షెల్డన్ కాట్రెల్, క్రిస్ జోర్డాన్లు ఉన్నారు. ముజీబ్ కోసం వీరిలో ఎవరు ఒకరు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. నికోలస్ పూరన్ అద్భుత ఫామ్‌లో ఉండడంతో అతన్ని తీసే పరిస్థితి లేదు. మ్యాక్స్‌వెల్ స్థానంలో గేల్‌ను తుదిజట్టులోకి రావాలి. ఇదే విషయమై కెప్టెన్ రాహుల్, ప్రధాన కోచ్ కుంబ్లేతో మాట్లాడాలి.' అంటూ తెలిపాడు. కాగా ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తుంది. కానీ అసలు ఆటలోకి వచ్చేసరికి మాత్రం చతికిలపడుతుంది. ఢిల్లీతో జరిగిన మొదటిమ్యాచ్‌లో సూపర్ ఓవర్లో పరాజయం పాలైన కింగ్స్ ఆ తర్వాత ఆర్సీబీపై 97 పరుగులతో విజయం సాధించింది. తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్, మాయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్‌లు రాణిస్తున్నా మిగతా ఆటగాళ్లు సరిగా ఆడకపోవడంతో వరుస ఓటములను చవిచూస్తుంది. కాగా కేఎల్ రాహుల్ 342 పరుగులతో ఐపీఎల్ 13వ సీజన్లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కింగ్స్ పంజాబ్ తన తర్వాతి మ్యాచ్ రేపు(గురువారం) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. -
'ఆకాశ్.. ముందు మీ స్ట్రైక్‌రేట్ చూసుకోండి'
దుబాయ్ : కివీస్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్.. భారత మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్‌చోప్రా మధ్య మాటల యుద్దం ఆసక్తికరంగా సాగింది. నీషమ్ స్థానం గురించి ఆకాశ్ చోప్రా ప్రశ్నించడం పట్ల దీటైన కౌంటర్ ఇచ్చాడు. ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున జిమ్మీ నీషమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. నీషమ్ సెప్టెంబర్ 27న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ సీజన్లో అరంగేట్రం చేశాడు. తరువాత అక్టోబర్ 1న ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆడాడు. అయితే నీషమ్ ఆడిన రెండు మ్యాచ్‌లు కింగ్స్ ఓడిపోయింది.. దీంతో నీషమ్‌కు బ్యాడ్ ఎంట్రీగా మారింది. (చదవండి : చాలా కష్టంగా ఉంది.. ధోనీకేమైంది?) ఆర్ఆర్తో జరిగిన మొదటి మ్యాచ్‌లో బౌలింగ్ దిగి 40 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ముంబైతో జరిగిన రెండో మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 52 పరుగులు సమర్పించుకున్నాడు.. బ్యాటింగ్‌లోనూ 8 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై ఆకాశ్ చోప్రా నీషమ్ ఎంపికను తప్పుబడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నీషమ్ స్థానంలో 2018 నుంచి కింగ్స్ జట్టుతో కొనసాగుతున్న ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌ను ఆడిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. 'జిమ్మీ నీషమ్‌ను ఒక విదేశీ ఆటగాడిగా.. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తాడని కింగ్స్ జట్టులోకి తీసుకుంది. కానీ ఒక బౌలర్‌గా నీషమ్ అటు పవర్‌ప్లేలో లేదా డెత్ ఓవర్లలో ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. మంచి ఫినిషర్ అని పేరున్న నీషమ్ బ్యాటింగ్‌లోనూ టాప్ 5లోనూ కనిపించడు. మరి అలాంటప్పుడు కింగ్స్ పంజాబ్ జట్టు అతన్ని ఎందుకు ఆడిస్తున్నట్టు.. వాళ్లు మ్యాచ్ విన్నర్ అని భావించి ఆడిస్తున్న నీషమ్ సరైన ఆటగాడు కాదు. సరిగ్గా చెప్పాలంటే కింగ్స్ జట్టు సరైన టీమ్‌ను ఎంపిక చేసుకోవడం లేదు. ముజీబ్ లాంటి మిస్టరీ స్పిన్నర్‌ను తుది జట్టులో ఆడించకపోవడం పట్ల కింగ్స్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. అంటూ తెలిపాడు. అయితే చోప్రా వ్యాఖ్యలకు జిమ్మీ నీషమ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. చోప్రా టీ20 ప్రదర్శన.. అతని పూర్ స్ట్రైక్‌రేట్.. సగటును చూపిస్తూ ట్వీట్ చేశాడు. ఆకాశ్ చోప్రా తన కెరీర్లో మొత్తం 21 టీ20లు ఆడి 91 స్ట్రైక్‌రేట్‌తో 18.55 సగటుతో 334 పరుగులు చేశాడు.'90 స్ట్రైక్‌రేట్.. 18.5 సగటుతో ఎవరైనా మ్యాచ్‌లను గెలిపించగలరా.. ముందు మీ ఆటతీరు చూసుకొండి.. ఆ తర్వాత కామెంట్ చేయండి 'అంటూ కౌంటర్ ఇచ్చాడు. (చదవండి : ఐపీఎల్ అభిమానులకు డబుల్ మజా) అయితే ఆకాశ్ చోప్రా వెంటనే స్పందిస్తూ.. ' నీషమ్.. నువ్వు చెప్పింది నిజమే.. అందుకే ఆ తర్వాత నన్నెవరు కొనుగోలు చేయలేదు.. ఆడించలేదు. అందుకే వేరే రూపంలో డబ్బు సంపాదిస్తున్నాను. నా ఆటకు సంబంధించిన గణాంకాలను గుర్తించినా మీతో పోల్చనందుకు సంతోషమే. కనీసం ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లైనా మంచిగా ఆడాలని కోరుకుంటున్నా. అంటూ తెలిపాడు. కాగా కింగ్స్ పంజాబ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో 7వ స్థానంలో నిలిచింది. కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ అక్టోబర్ 4న సీఎస్కేతో ఆడనుంది. -
కేఎల్ రాహుల్ అరుదైన ఘనత
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా గురువారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పలు రికార్డులు నెలకొల్పాడు. 69 బంతుల్లోనే 132 పరుగులు చేసిన రాహుల్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజన్లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. కాగా రికార్డుల రారాజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. తాజాగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును కేఎల్ రాహుల్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్లో అతి వేగంగా 2వేల పరుగులు సాధించిన రికార్డు ఇప్పటివరకు సచిన్ పేరిట ఉంది. సచిన్‌కు ఐపీఎల్లో 2వేల పరుగులు పూర్తి చేయడానికి 63 ఇన్నింగ్స్‌లు అవసరం పడ్డాయి. కాగా కేఎల్ రాహుల్ మాత్రం కేవలం 60 ఇన్నింగ్స్‌లోనే 2వేల పరుగులు సాధించాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 22 పరుగులు వద్ద ఉన్నప్పుడు ఈ ఘనత సాధించాడు. (చదవండి : కోహ్లి ఎందుకిలా చేశావు) ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ నిర్ణీత 20ఓవర్లలో 206 పరుగులు చేసింది. 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ పూర్తిగా ఒత్తిడికి లోనై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మొత్తం ఓవర్లు ఆడకుండానే 17 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైన ఆర్సీబీ 97 పరుగులతో ఘోర పరాజయం పాలైంది. కాగా కింగ్స్ పంజాబ్ తన తర్వాతి మ్యాచ్ అక్టోబర్ 1న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. (చదవండి : కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా అయితే ఎలా!) -
‘ధర’వంతుడైన ఆటగాడు... ఒక్క మ్యాచ్‌కే
మొహాలి: వేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో తమిళనాడు స్పిన్నర్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి ఐపీఎల్‌కు దూరమయ్యాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకున్న 27 ఏళ్ల లెగ్ స్పిన్నర్ వరుణ్‌ను... పంజాబ్ వేలంలో ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా అతడిని ఎక్కువ మ్యాచ్‌లు ఆడించలేక పోయింది. గత నెలలో కోల్‌కతాపై మ్యాచ్‌కు బరిలో దించగా వరుణ్ వికెట్ పడగొట్టి 35 పరుగులిచ్చాడు. ‘వరుణ్ కోలుకుని చివరి మ్యాచ్‌లకైనా అందుబాటులో ఉంటాడని ఆశించాం. కానీ, అలా జరగలేదు. దీంతో ఇంటిబాట పట్టాడు. అతడు త్వరగా కోలుకుని తర్వాత జరిగే టోర్నీల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నాం’ అని కింగ్స్ ఎలెవెన్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
బెంగళూరు నిలిచింది
హమ్మయ్య... ఈ సీజన్లో కోహ్లి జట్టు స్థానం తొలిసారి మారింది. ఆరంభంలో వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిన బెంగళూరు 10 మ్యాచ్‌లు ఆడాక కూడా అట్టడుగునే నిలిచింది. ఎట్టకేలకు ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్‌ను కిందకు పడేసి ఏడో స్థానంతో కాస్త మెరుగైంది. ప్లే–ఆఫ్ రేసులో నిలిచింది. బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టచ్‌లోకి వచ్చింది. ఈ సీజన్లో నాలుగో విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన పోరులో 17 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్ (44 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), స్టొయినిస్ (34 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 185 పరుగులు చేసి ఓడింది. పూరన్ (28 బంతుల్లో 46; 1 ఫోర్, 5 సిక్స్‌లు), రాహుల్ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఉమేశ్ 3, సైనీ 2 వికెట్లు తీశారు. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. పార్థివ్ ఫటాఫట్... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టును నడిపించడంలో కెప్టెన్ కోహ్లి (13) విఫలమయ్యాడు. షమీ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి విలోన్ క్యాచ్ మిస్ చేయడంతో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన కోహ్లి వరుసగా 2 బౌండరీలు బాదాడు. కానీ అతని తదుపరి ఓవర్లో (4వ)నే నిష్క్రమించాడు. డివిలియర్స్ అండతో పార్థివ్ రెచ్చిపోయాడు. రాజ్‌పుత్ ఐదో ఓవర్లో సిక్స్ బాదిన అతను.. షమీ 6వ ఓవర్‌ను 4, 4, 0, 4, 6, 0 చితగ్గొట్టాడు. 18 పరుగులు పిండుకున్నాడు. కానీ పార్థివ్ పటేల్ ఔటైన ఏడో ఓవర్ నుంచి 13వ ఓవర్‌దాకా బెంగళూరుకు కష్టాలెదురయ్యాయి. పార్థివ్ (24 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో పాటు మొయిన్ అలీ (4), అ„Š దీప్ నాథ్ (3) వికెట్లను కోల్పోయిన చాలెంజర్స్ ఈ 7 ఓవర్లలో చేసింది 29 పరుగులే! డివిలియర్స్, స్టొయినిస్ మొదట నిదానంగా ఆడి తర్వాత బ్యాట్ ఝళిపించారు. 14వ ఓవర్ నుంచి జట్టు మళ్లీ పరుగుల దారిన పడింది. మురుగన్ అశ్విన్ వేసిన ఆ ఓవర్లో స్టొయినిస్ సిక్స్ కొట్టడంతో 10 పరుగులు జతయ్యాయి. స్కోరు వంద పరుగుల్ని దాటేసింది. ఆ రెండు ఓవర్లు చుక్కలే..! బెంగళూరు 18 ఓవర్లు ముగిసేసరికి 154/4 స్కోరు చేసింది. ఇక మిగిలినవి రెండే ఓవర్లు. మహా అయితే 30 పరుగులు చేసినా 180 దాటొచ్చు. కానీ డివిలియర్స్, స్టొయినిస్ చెరో ఓవర్‌ను పంచుకున్నట్లుగా ఆడారు. షమీ, విలోన్ ఓవర్లను చితగ్గొట్టారు. చెప్పాలంటే ఆ బంతులు చుక్కల్ని చూసొచ్చాయి. దీంతో ఆఖరి 12 బంతుల్లోనే రాయల్ చాలెంజర్స్ జట్టు 48 పరుగులు చేసింది. 19వ ఓవర్‌ను షమీ వేశాడు. తొలి రెండు బంతుల్లో సింగిల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత మూడు బంతుల్ని ‘మిస్టర్ 360’ బ్యాట్స్‌మన్ 6, 6, 6గా మలచడంతో 21 పరుగులు లభించాయి. ఒక బంతి అయితే స్టేడియం టాప్‌పైనే స్థిరపడింది. దీంతో మరో బంతి తెస్తేగానీ ఓవర్ పూర్తికాలేదు. విలోన్ ఆఖరి ఓవర్లో తొలి బంతిని డివిలియర్స్ సిక్స్ కొట్టగా... తర్వాత ఆట స్టొయినిస్ ఆడేశాడు. 4, 6, 4, 6 బాదేయడంతో 27 పరుగులొచ్చాయి. వేగంగా మొదలైన ఛేదన... లక్ష్యఛేదనను పంజాబ్ వేగంగా మొదలుపెట్టింది. సౌతీ తొలి ఓవర్లో గేల్ 3 ఫోర్లు కొడితే, రాహుల్ తర్వాతి ఓవర్లో 2 బౌండరీలు బాదాడు. 3 ఓవర్లలో పంజాబ్ 36 పరుగులు చేసింది. వేగంగా దూసుకెళ్తున్న జోడీకి ఉమేశ్ కళ్లెం వేశాడు. సిక్స్ కొట్టిన గేల్ (10 బంతుల్లో 23; 4 ఫోర్లు, 1 సిక్స్) తర్వాత మరో షాట్‌కు ప్రయత్నించి డివిలియర్స్ చేతికి చిక్కాడు. రాహుల్ జోరు... రాహుల్‌కు మయాంక్ జతయ్యాడు. సౌతీ ఐదో ఓవర్లో మయాంక్ వరుస బౌండరీలు కొట్టగా, చహల్ బౌలింగ్‌లో రాహుల్ 6, 4తో అలరించాడు. ఛేదన ఆరంభం నుంచి ఓవర్‌కు 10 పరుగులకు మించే సాధిస్తూ వచ్చిన పంజాబ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. ఇలా ధాటిగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను స్టొయినిస్ దెబ్బతీశాడు. తన తొలి బంతికే మయాంక్ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మొయిన్ కూడా తన తొలి బంతికే రాహుల్ జోరును ముగించాడు. పూరన్ మెరుపులు... 9 నుంచి 13వ ఓవర్ వరకు డీలా పడిన పంజాబ్‌ను మళ్లీ పూరన్ పట్టాలెక్కించాడు. సుందర్ వేసిన 14వ ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. 19 పరుగులు పిండుకున్న పంజాబ్ మళ్లీ జోరందుకుంది. సైనీ 15వ ఓవర్లో ఫోర్ కొట్టిన పూరన్... 16వ ఓవర్లో మరో 2 సిక్సర్లు కొట్టాడు. దీంతో సమీకరణం కూడా వేగంగానే మారిపోయింది. పంజాబ్ విజయానికి 24 బంతుల్లో 47 పరుగులు కావాల్సిన దశలో సౌతీ 17వ ఓవర్ వేసి 11 పరుగులిచ్చుకున్నాడు. ఉమేశ్ 18వ ఓవర్లో పూరన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను స్టొయినిస్ జారవిడిచాడు. 12 బంతుల్లో 30 పరుగులు అవసరమైన దశలో సైనీ తొలి బంతికి మిల్లర్ (24; 2 ఫోర్లు)ను, ఆఖరి బంతికి పూరన్‌ను ఔట్ చేశాడు. ఈ ఓవర్లో మూడు పరుగులే ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో 27 పరుగులు చేయాల్సి ఉండగా ఉమేశ్... అశ్విన్ (6)తో పాటు విలోన్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేయడంతోనే బెంగళూరు విజయం ఖాయమైంది. -
ఢిల్లీ పతనాన్ని శాసించిన స్యామ్ కరన్!
పంజాబ్‌పై 167 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో ఢిల్లీ స్కోరు 16.3 ఓవర్లలో 144/3... అయితే 17 బంతులు ముగిసేసరికి ఆటంతా మారిపోయింది. కేవలం 8 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో 152 పరుగుల వద్ద ఆలౌటైంది! సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ 14 పరుగుల తేడాతో క్యాపిటల్స్‌పై ఊహించని విజయాన్ని సాధించింది. అద్భుత బౌలింగ్‌తో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసిన స్యామ్ కరన్ ఢిల్లీ పతనాన్ని శాసించాడు. మొహాలి: ఐపీఎల్లో పంజాబ్ వరుస విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (30 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సర్ఫరాజ్ ఖాన్ (29 బంతుల్లో 39; 6 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇంగ్రామ్ (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హ్యాట్రిక్‌తో చెలరేగిన స్యామ్ కరన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌ల హిట్టర్ క్రిస్ గేల్ గాయంతో ఈ మ్యాచ్ ఆడలేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న అతని స్థానంలో కరన్ బరిలోకి దిగాడు. ధాటిగా ఆడిన మిల్లర్, సర్ఫరాజ్ టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. గేల్ లేని పంజాబ్ ఇన్నింగ్స్ కళ తప్పింది. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన ఓపెనర్లు కె.ఎల్.రాహుల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్), కరన్ (10 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) తమ ధాటిని ఎంతోసేపు కొనసాగించలేకపోయారు. మోరిస్ బౌలింగ్‌లో రాహుల్, లమిచానే బౌలింగ్‌లో కరన్ ఎల్బీగా నిష్క్రమించారు. తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ (6) విఫలమయ్యాడు. ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్, మిల్లర్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు బౌండరీలతో పంజాబ్‌ను నడిపించారు. నాలుగో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. సర్ఫరాజ్ చూడచక్కని స్ట్రోక్స్‌తో అలరించాడు. జట్టు స్కోరు 120 పరుగులు చేరాక, మొదట సర్ఫరాజ్, కాసేపటికి మిల్లర్ పెవిలియన్ చేరారు. మళ్లీ మోరిస్, లమిచానే కీపర్ క్యాచ్‌లతో వీళ్లిద్దరి ఆటకట్టించారు. ఇంతటితో పంజాబ్‌కు ఆ కాస్త మెరుపులు కూడా మాయమయ్యాయి. తర్వాత మన్దీప్ సింగ్ (21 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే మెరుగనిపించాడు. పృథ్వీ షా డకౌట్ గత మ్యాచ్‌లో పరుగు తేడాతో సెంచరీని కోల్పోయిన ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (0) ఈ మ్యాచ్‌లో పరుగైనా చేయకుండా అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ తొలిబంతికే నిష్క్రమించాడు. ఓపెనర్ ధావన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అడపాదడపా ఫోర్లు కొడుతూ రెండో వికెట్‌కు 7.1 ఓవర్లలో 61 పరుగుల్ని జోడించారు. శ్రేయస్ (22 బంతుల్లో 28; 5 ఫోర్లు)ను బౌల్డ్ చేసి విలోన్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. కాసేపటికే ధావన్ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు)ను అశ్విన్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. కరన్ ‘హ్యాట్రిక్’... క్యాపిటల్స్ ఆలౌట్ ఇక్కడి నుంచి రిషభ్ పంత్, ఇంగ్రామ్‌లు ఢిల్లీని నడిపించారు. పంత్ మొదట అశ్విన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఆ మరుసటి ఓవర్ షమీ వేయగా సిక్స్‌తో అలరించాడు. కానీ తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. ఇక్కడి నుంచి క్యాపిటల్స్ పతనం మొదలైంది. షమీ ఓవర్లోనే మోరిస్ (0) రనౌట్ కాగా.. కరన్ నిప్పులు చెరిగే బౌలింగ్‌లో ఇంగ్రామ్, హర్షల్ (0) కూడా ఔటయ్యారు. 12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన దశలో విహారి (2) చేతులెత్తేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి హర్షల్‌ను ఔట్ చేసిన కరన్... 20వ ఓవర్ తొలి రెండు బంతులకి రబడ (0), లమిచానే (0)లను క్లీన్‌బౌల్డ్ చేసి ఈ సీజన్లో తొలి ‘హ్యాట్రిక్’ను నమోదు చేశాడు. ►ఐపీఎల్లో ఇది 17వ హ్యాట్రిక్ కాగా...అతి పిన్న వయసులో (20 ఏళ్ల 302) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కరన్ నిలిచాడు. -
సొంతగడ్డపై కోల్‌కతా రెండో విజయం
-
రాజస్తాన్ రాయల్స్ ఓటమి
-
జవాన్ల కుటుంబాలను ఆదుకున్న ఐపీఎల్ జట్టు
చంఢీగడ్ : ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఐపీఎల్ జట్టు కింగ్స్ పంజాబ్ ఆదుకుంది. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ఐదుగురు జవాన్ల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 25 లక్షలను విరాళంగా అందజేసింది. ఈ చెక్కులను ఉగ్రదాడిలో అసువులు బాసిన జవాన్లు జైమాల్ సింగ్, సుఖిజిందర్ సింగ్, మహిందర్ సింగ్, కుల్విందర్ సింగ్, తిలక్ రాజుల కుటుంబాలకు పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్, సీఆర్పీఎఫ్ డీఐజీ వీకే కౌందాల్‌లు అందజేశారు. గత ఫిబ్రవరి 14న చోటు చేసుకున్న ఈ ఉగ్రదాడిలో 40 మందికిపైగా సీర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గత ఏడాది అశ్విన్ నాయకత్వంలో కొత్తగా కనిపించిన కింగ్స్ పంజాబ్ జట్టు తొలి 9 మ్యాచ్‌ల్లో 6 గెలిచి దూసుకుపోయింది. కానీ తర్వాతి ఐదు మ్యాచ్‌లు ఓడి అనూహ్యంగా లీగ్ దశకే పరిమితమైంది. అయితే ఈ సారి మాత్రం నిలకడైన ప్రదర్శనతో రాణించి టైటిల్ కొట్టాలని భావిస్తోంది. కాగా ఈ నెల 23న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 12వ సీజన్‌కు తెరలేవనున్న విషయం తెలిసిందే. ఇక పంజాబ్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 25న రాజస్తాన్రాయల్స్తో ఆడనుంది. చదవండి: పంజాబ్‌కు ‘ఆ ఇద్దరి’ బలం... మే 12న ఐపీఎల్ ఫైనల్ -
ప్రేయసిని పెళ్లాడిన క్రికెటర్
బెంగళూరు : కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మన్, కర్టాటక రంజీ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ ఓ ఇంటివాడయ్యాడు. సోమవారం తన ప్రేయసి అషితా సుధ్‌ను వివాహమాడాడు. ఈ పెళ్లికి టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మయాంక్ ఆగర్వాల్‌తో పాటు స్నేహితులతో దిగిన ఫొటోలను కేఎల్ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఐదు నెలల క్రితం ఆషిత సూద్‌కు మయాంక్ అగర్వాల్ ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. అషితా ఒప్పుకోవడం... ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు సైతం వీరి పెళ్లికి అంగీకరించడంతో అతికొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మయాంక్ అగర్వాల్ పంజాబ్ తరుపున మొత్తం 11 మ్యాచ్‌లాడి 120 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ ఆరంభంలో మంచి ప్రదర్శన కనబర్చిన పంజాబ్ ఆ తర్వాత వరుస ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో మయాంక్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత్-ఏ జట్టులో చోటు దక్కలేదు. రంజీల్లో కర్ణాటక తరపున బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ ఈ ఏడాది రంజీల్లో 2,141 పరుగులు సాధించాడు. దీంతో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్‌గా అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. -
అయ్యో.. యువీ!
హైదరాబాద్ : టీమిండియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ తడబాటును అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం అసలు సిసలు టీ20 గేమ్ అంటే ఎంటో యువీ భారత అభిమానులకు చూపించాడు. 2007 దక్షిణాఫ్రికా వేదికగా సాగిన తొలి టీ20 ప్రపంచకప్ టోర్నీలో 6 బంతులకు 6 సిక్స్‌లు బాది తానెంత వైవిధ్యమైన ఆటగాడినో అని ప్రపంచానికి తెలియజేశాడు. బంతిని అలవోకగా స్టాండ్స్‌కు తరలించే యువీ.. అదే బంతితో బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఎడమ చేతివాటం స్పిన్నర్‌గా ఎన్నో కీలక మ్యాచ్‌ల్లో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలనందించాడు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్ భారత్ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. అవసరమైనప్పుడల్లా బంతి, బ్యాట్‌తో జట్టుకు అండగా నిలిచి మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. ఇలా యువరాజ్ ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. కలిసి రాని ఐపీఎల్.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గడ్డుకాలం ఉంటుందంటారు. అలా యువరాజ్ జీవితంలో ఐపీఎల్ కొరకరాని కొయ్యలా తయారైంది. ప్రతీ ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన యువరాజ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చలేకపోయాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో కింగ్స్ పంజాబ్, పుణె వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లకు ప్రాతినిథ్యం వహించిన యువీ ఏ జట్టు తరుఫున రాణించలేకపోయాడు. నిలకడలేమి ఫామ్‌తో భారత జట్టుకు దూరమైన యువీ.. ఈ సీజన్లో రాణించి తుది జట్టులోకి రావాలని బరిలోకి దిగాడు. ఈ సీజన్ తనకు ప్రత్యేకమైనదని కూడా వెళ్లడించాడు. కానీ టీమిండియాలో చోటు ఏమో కానీ కింగ్స్ పంజాబ్ తుది జట్టులో స్థానం కోసం నిరీక్షించాల్సి వచ్చింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకవపోవడంతో యువీ ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ 36 ఏళ్ల పంజాబ్ ఆటగాడు కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు. అటు బంతితోను ఒక్క వికెట్ సాధించలేదు. ఈ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సైతం దూరమయ్యాడు. సోషల్ మీడియాలో విమర్శలు యువరాజ్ సింగ్ ప్రదర్శనపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఆటకు వీడ్కోలు చెప్పడం మంచిదని కూడా సలహా ఇచ్చారు. ఇక యువీ డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన క్రికెటర్ ఆటను చూడలేకపోతున్నామని, 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన మేటి ఆటగాడు ఇలా తడబడటం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు అందరికి గడ్డు కాలం వస్తోందని, ప్రస్తుతం యువీకి అదికొనసాగుతోందని, త్వరలోనే యువీ ఎంటో నిరూపిస్తాడని మరికొందరు మద్దతు పలుకుతున్నారు. 304 అంతర్జాతీయ వన్డేలా ఆడిన యువీ ఓ సందర్భంలో 18 ఏళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నానని, 2019 ప్రపంచకప్ అనంతరం క్రికెట్‌కు గుడ్‌బై చెప్తానని స్పష్టం చేశాడు. అయితే ఈ తరహా ప్రదర్శనతో యువీ ప్రపంచకప్ ఆడటం అసాధ్యమని క్రీడావిశ్లేషకులు భావిస్తున్నారు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని సేన
-
ఐపీఎల్: పంజాబ్ గెలిచేనా?
పుణే : ఐపీఎల్-11 సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం వేదికైంది. కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. యువరాజ్ సింగ్, స్టోయినిస్ స్థానాల్లో కరుణ్ నాయర్, డెవిడ్ మిల్లర్లు పంజాబ్ జట్టులోకి రాగా.. చెన్నై జట్టులోకి షేన్ వాట్సన్ స్థానంలో డుప్లెసిస్ తుది జట్టులోకి వచ్చాడు. చావోరేవో మ్యాచ్.. ఈ మ్యాచ్ పంజాబ్‌కు అత్యంత కీలకం. ప్లే ఆఫ్ రేసులోనిలవాలంటే గెలవడమే కాకుండా మెరుగైన రన్‌రేట్ సాధించాలి. గత ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కడవరకు కేఎల్ రాహుల్ పోరాడిన పంజాబ్ జట్టు ఓటమి పాలైంది. మరోసారి క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్లు బ్యాట్ ఝులిపిస్తేనే పంజాబ్ గట్టెక్కనుంది. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్ చేరిన చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఢిల్లీపై అనుహ్యంగా ఓడిన చెన్నై ఈ మ్యాచ్‌లో తిరిగి విజయాన్నందుకోవాలని భావిస్తోంది. -
ఉత్కంఠ పోరులో ముంబైదే విజయం
ముంబై : కింగ్స్ పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌నే విజయం వరించింది. చివర్లో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 187 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించలేకపోయింది. కేఎల్ రాహుల్ (94: 60 బంతులు,10 ఫోర్లు,3 సిక్స్‌లు), ఫించ్(46: 35 బంతులు, 3 ఫోర్లు,1 సిక్స్) లు దాటిగా ఆడినా చివర్లో బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి చిత్తవ్వడంతో 3 పరుగుల తేడాతో ముంబై విజయాన్నందుకుంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆండ్రూ టై(4/ 16) దాటికి కుదేలైంది. పోలార్డ్ (50: 23బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కృనాల్(32: 23 బంతుల్లో,1 ఫోర్,1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్(27: 15 బంతుల్లో 3 ఫోర్, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషాన్(20 : 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 186 పరుగులు చేసింది. రాహుల్ వీరవిహారం.. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ పంజాబ్ ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించారు. అయితే క్రిస్ గేల్ (18: 11బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) నిరాశ పరచగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈ సీజన్లో దూకుడు మీదున్న రాహుల్ క్రీజులోకి వచ్చిన ఫించ్‌తో దాటిగా ఆడాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఫించ్ సైతం దాటిగా ఆడాడు. దీంతో పంజాబ్ 12.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. బుమ్రా వేసిన 17 ఓవర్లో ఫించ్(46: 35 బంతులు, 3 ఫోర్లు,1 సిక్స్) భారీ షాట్‌కు ప్రయత్నించి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 111 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ (1) తీవ్రంగా నిరాశపరిచాడు. మ్యాచ్‌ను తిప్పేసిన బుమ్రా పంజాబ్ విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు కావాల్సి ఉండగా బుమ్రా పంజాబ్ విజయాన్ని లాగేశాడు. అద్భుత బంతితో రాహుల్ (94: 60 బంతులు,10 ఫోర్లు,3సిక్స్‌లు)ను బోల్తా కొట్టించిన బుమ్రా ఈ ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు . చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి కావాల్సిన 17 పరుగులను చేయడంలో యువరాజ్ సింగ్, అక్షర్ పటేల్‌లు విఫలమవ్వడంతో పంజాబ్ ఓటమిని చవిచూసింది. మెక్లీగన్ వేసిన ఈ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగగా.. ఆవెంటనే అక్షర్ సిక్స్ బాది పంజాబ్ శిభిరంలో ఆశలు రేపాడు కానీ తరువాత పరుగులు రాబట్టడంతో విఫలమవ్వడంతో బంతి మిగిలి ఉండగానే ముంబై విజయం లాంఛనమైంది. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు, మెక్లిగన్ రెండు వికెట్లు తీశారు. -
ఆండ్రూ టై విజృంభణ
ముంబై : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ బౌలర్ ఆండ్రూ టై విజృంభించాడు. దీంతో ముంబై ఇండియన్స్ కీలక వికెట్లను కోల్పోయింది. ఇప్పటికీ రెండు ఓవర్లు మాత్రమే వేసిన టై 5 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. టై.. తొలి ఓవర్లో ముంబై ఓపెనర్ ఎవిన్ లూయిస్(9)ను క్లీన్ బౌల్డ్ చేయగా.. రెండో ఓవర్లో వరుస బంతుల్లో జోరు మీదున్న ఇషాన్ కిషాన్(20), సూర్యకుమార్ యాదవ్(27)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో ముంబై ఇండియన్స్ 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక ఈ సీజన్లో 23 వికెట్లతో టై బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. -
ఐపీఎల్: గెలిచేది.. నిలిచేదెవరు?
ముంబై : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా మరో రసవత్తర పోరుకు వాంఖేడే మైదానం వేదికైంది. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ రవించంద్రస్ అశ్విన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇరుజట్లలో స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పంజాబ్‌లో మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ స్థానంలో యువరాజ్ సింగ్, మనోజ్ తివారీ తుది జట్టులోకి రాగా.. ముంబై జట్టులో జేపీ డుమినీ స్థానంలో కీరన్ పోలార్డ్ వచ్చాడు. ఈ కీలక మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్ రేసులో నిలుస్తోంది. కింగ్స్‌పంజాబ్‌కు మరో అవకాశం ఉండగా.. ముంబైకి మాత్రం ఆ అవకాశం లేదు. రోహిత్ సేనకు ఇది చావోరేవో మ్యాచ్. 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై 5 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ 12 మ్యాచ్‌లకు 6 గెలిచి ఐదో స్థానంలో నిలిచింది. రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుతో ఊహించని రీతిలో చిత్తుగా ఓడిన పంజాబ్.. ఆ ఓటమి నుంచి తేరుకోని విజయం సాధించాలని భావిస్తోంది. ఇక వరుస పరాజయాలతో ఓ దశలో అట్టుడుగు స్థానానికి పడిపోయిన ముంబై అనూహ్యంగా హ్యాట్రిక్ విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. అయితే గత ఆదివారం రాజస్తాన్ రాయల్స్, ముంబై జైతయాత్రకు అడ్డుకట్ట వేయడంతో ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో ముంబైనే విజయం వరించింది. తుదిజట్లు కింగ్స్ పంజాబ్ : రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, యువరాజ్ సింగ్, మనోజ్ తివారీ, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, ఆండ్రూ టై, మోహిత్ శర్మ, అంకిత్ రాజ్‌పుత్ ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్, ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, బెన్ కట్టింగ్, మిచెల్ మెక్‌గ్లాన్, మయాంక్ మార్కండే, జస్ప్రిత్ బుమ్రా -
ప్రీతి జింతా ఫైర్..
న్యూఢిల్లీ : కింగ్స్ పంజాబ్ జట్టు కోచ్ వీరేంద్ర సెహ్వాగ్, యజమాని ప్రీతిజింతాల మధ్య వివాదం తలెత్తిందంటూ వచ్చిన వార్తలను ప్రీతి ఖండించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అసత్య కథనాలను ప్రచురించొద్దంటూ మీడియాపై ఫైర్ అయ్యారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ ఓటమికి సెహ్వాగ్‌ను బాధ్యుడిని చేస్తూ జింతా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. తనకి సెహ్వాగ్‌కు మధ్య ఏదో వాగ్వాదం జరిగిందని, తనని విలన్‌ను చేసి చూపిస్తూ వార్తలు రాయడంపై తీవ్రంగా మండిపడ్డారు. జింతా ట్వీట్ అనంతరం కింగ్స ఎలెవన్ పంజాబ్ సైతం ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రీతి జింతా-సెహ్వాగ్‌ల మధ్య వివాదం చెలరేగిందంటూ వచ్చిన వార్తలు సత్యదూరమని పేర్కొంది. ఎవరో కొందరు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. చదవండి : ప్రీతిజింతా అసహనం.. సెహ్వాగ్ సంచలన నిర్ణయం! -
ప్రీతిజింతా అసహనం.. సెహ్వాగ్ సంచలన నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్ : కింగ్స్ పంజాబ్ జట్టు కోచ్ వీరేంద్ర సెహ్వాగ్, యజమాని ప్రీతిజింతా మద్య వివాదం తలెత్తింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ ఓటమికి సెహ్వాగ్‌ను బాధ్యుడిని చేస్తూ జింతా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. రాజస్థాన్‌తో పంజాబ్ ఆడిన మ్యాచ్‌లో 158 పరుగులను ఛేజ్ చేయలేక చతికల పడి ఓటమి పాలైంది. ఛేదనలో తొలి వికెట్ పడిన అనంతరం కరుణ్ నాయర్, మనోజ్ తివారి వంటి ఆటగాళ్లు ఉన్నా అశ్విన్‌ను బ్యాటింగ్‌కు పంపించారు. అయితే కెప్టెన్ పరుగులేమీ చేయకుండానే ఔట్ అయ్యాడు. అనంతరం ఏ ఒక్కరు జట్టును గెలుపు బాట పట్టించలేక పోయారు. దీంతో పంజాబ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఓటమితో అసహనానికి గురైన ప్రీతిజింతా ఆవేశంతో కోచ్, మెంటర్‌గా ఉన్న వీరూపై మండిపడింది. సెహ్వాగ్ పలుసార్లు సహనంతో ఓటమికి కారణాలు చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయినా కూడా ప్రీతిజింతా పదేపదే విమర్శలకు దిగుతుంటడంతో వీరూ ఆలోచనలో పడినట్లు సమాచారం. అంతేకాకుండా వచ్చే ఏడాది జట్టు బాధ్యతలను నుంచి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నట్టు జాతీయ మీడియా తెలిపింది. పంజాబ్‌కు ప్లేఆఫ్స్‌కు అవకాశం ఉండటంతో ఈ విషయంపై విరవణ ఇవ్వడానికి సెహ్వాగ్ నిరాకరించారు. ఈ వివాదాలు ఆటగాళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో అటు యాజమాన్యం, ఇటు సెహ్వాగ్ మౌనంగా ఉన్నారని సమాచారం. ఈ వివాదంపై ప్రీతిజింతా వివరణ కోసం ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. గతంలో సైతం ఇదే తీరుగా ప్రవర్తించారు. గత ఐదేళ్లుగా పంజాబ్‌కు కోచ్‌గా పనిచేస్తున్న వీరేంద్ర సెహ్వాగ్, ప్రీతిజింతా మధ్య చాలాసార్లు వివాదాలు తలెత్తాయి. -
దుఃఖాన్ని దిగమింగుకొని వికెట్లు తీశాడు
జైపూర్ : ఆకస్మాత్తుగా ఏదైనా చెడు వార్త వింటేనే తట్టుకోలేము.. ఇక అది మన కుటుంబ సభ్యుల గురించైతే..ఆ బాధ వర్ణనాతీతం. కానీ కింగ్స్ పంజాబ్ ఆటగాడు, ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై దుఃఖాన్ని దిగమింగుకోని రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు.ఈ మ్యాచ్‌లో ఆడటమే కాదు నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఆండ్రూ టై నానమ్మ మరణించినట్లు మంగళవారం అతనికి కబురందింది. కానీ ఆటపట్ల శ్రద్దతో ఏ మాత్రం కుంగుబాటుకు లోనుకానీ టై అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దీంతో ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనైన టై తన నానమ్మ మరణించిన విషయాన్ని తెలిపాడు. ‘ మా నానమ్మ ఇక లేరు. ఈ ప్రదర్శనను ఆమెతో నాకుటుంబ సభ్యులకు అంకితమిస్తున్నాను. ఇది నాకు భావోద్వేగపూరితమైన మ్యాచ్. నా జీవితంలో చాలా కఠినమైన రోజు. నేనెప్పుడు క్రికెట్‌ను ఇష్టపడుతాను. మా జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. ఒక్కోసారి బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణిస్తారు. కొన్నిసార్లు విఫలం అవుతారు. పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. కొత్త బంతి మాకు అనుకూలించింది.’ అని వ్యాఖ్యానించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత గౌతమ్‌ను ఔట్ చేసిన టై చివరి ఓవర్లో బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, ఉనద్కత్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో రాజస్తాన్ 158 పరుగుల సాధారణ లక్ష్యమే నమోదు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ మినహా పంజాబ్ బ్యాట్స్‌మన్ విఫలమవ్వడంతో రాజస్తాన్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
రోహిత్ కంటే రాహుల్ బెస్ట్.!
ఇండోర్ : టీమిండియా ఓపెనర్‌గా రోహిత్ శర్మ బదులు కేఎల్ రాహుల్ తీసుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్-11 సీజన్లో కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కడదాక నిలిచి కింగ్స్ పంజాబ్‌ను గెలిపించిన రాహుల్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీమిండియా ఓపెనర్‌గా రోహిత్ శర్మ కన్నా రాహులే బెస్ట్ అని కొంతమంది అభిప్రాయపడుతుండగా.. రాహుల్‌ను ఓపెనర్‌గా పంపించి రోహిత్‌ను మిడిలార్డర్లో ఆడించాలని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించకపోతే 2019 ప్రపంచకప్ టోర్నీలో భారత్ పరిస్థితి అంతేనని హెచ్చరిస్తున్నారు. అసలు ఇంత బాగా రాణిస్తున్న కేఎల్ రాహుల్‌ను జట్టులోకి ఎందుకు తీసుకోవడంలేదని నిలదీస్తున్నారు. మరోసారి రోహిత్‌ను ఎంపిక చేసి బీసీసీఐ మరో తప్పు చేయవద్దని కోరుతున్నారు. ఈ సీజన్లో కేఎల్ రాహుల్ రెచ్చిపోతూ.. కింగ్స్ పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సీజన్ తొలి మ్యాచ్‌లోనే రికార్డు హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ 9 మ్యాచ్‌ల్లో మొత్తం మూడు అర్థ సెంచరీలతో 376 పరుగులు చేశాడు. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. అనూహ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ మార్చిన రోహిత్ అనుకున్న మేరకు రాణించలేకపోయాడు.10 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే మెరిసాడు. రెండు హాఫ్ సెంచరీలతో 231 పరుగులు మాత్రమే చేశాడు. ముంబై ఓపెనింగ్ అవకాశం అందిపుచ్చుకున్న యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ రాణిస్తున్నాడు. దీంతో రోహిత్ స్థానంలో టీమిండియా ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. Rohit Sharma Position in Danger! KL RAHUL Was Just Outstanding Tonight.. He Must Be In #CWC19 or Else India RIP😉#MIvKKR #KXIPvRR #klrahul #IPL2018 #VIVOIPL #VIVOIPL2018 #rohit — HARSH (ABD17 & MSD7) (@Abd_MsdFC) 6 May 2018 Why not KL RAHUL in place of Rohit Sharma?? I repeat Why ?#KXIPvRR — •Sudhanshu• (@beingsudhanshu_) 6 May 2018 Again I say Kl Rahul > Rohit Sharma Rohit is in the team Oly coz of his 3 double 💯 and just talent👿.. he is Hella inconsistent and can't play test matches outside India.. give Rahul a chance #RCBvMI #MumbaiIndians #Rcb — Rayan Dsouza (@dsouzarayan10) 1 May 2018 -
ఐపీఎల్: యువీ.. ఇక ‘నీకదే గతి’
ఇండోర్ : టీమిండియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, కింగ్స్ పంజాబ్ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై అభిమానులు సోషల్ మీడియాలో కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఐపీఎల్-11 సీజన్లో ఈ సిక్సర్ల సింగ్ నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో యువీ దారుణంగా విఫలమయ్యాడు. 14 బంతుల్లో 14 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో యువరాజ్ ఈ సీజన్లో అత్యల్ప స్ట్రైక్ రేట్(91.42) కలిగిన బ్యాట్స్‌మన్(50 అంతకంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఆటగాళ్లలో)గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన యువీ కేవలం 64 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ సీనియర్ ఆటగాడిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువరాజ్‌ను జట్టు నుంచి తీసేయాలని కోరుతున్నారు. ఇంకొందరైతే మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్ల సరసన చేరి కామెంటరీ చెప్పుకో అని ఘాటుగా విమర్శిస్తున్నారు. యువీ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడమే ఉత్తమమని, అతని ఆటను చూడలేకపోతున్నామని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. కెంట్ వాటర్ ప్యూరిఫై ప్రకటనలో తప్ప యువరాజ్ ఈ సీజన్లో బౌండరీ సాధించడం చూడలేదని ఓ అభిమాని సెటైర్ వేశాడు. ఇక యువరాజ్ కెరీర్ ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తుండగా..యువీకి మరో అవకాశం ఇవ్వాలని, అతనేంటో చూపిస్తాడని కొందరు మద్దతు తెలుపుతున్నారు. Time for Yuvraj Singh to co host commentary section with Irfan Pathan and Mohammed Kaif... — Mayur (@Mayurgoakar) 5 May 2018 Its about time Yuvraj Singh graciously steps aside/retire from IPL. It is getting painful to watch. — Sense of rumour (@speshelly) 4 May 2018 Kent water purifier ad is the only place where I saw Yuvraj Singh hitting a boundary this season. #KXIPvMI — Ankit Mishra (@ankitTrump) 4 May 2018 -
అందుకే ఓడిపోయాం : అశ్విన్
ఇండోర్ : డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. కాగా ఈ ఓటమిపై కింగ్స్‌పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అశ్విన్.. ‘మేము బాగానే ఆడాం. కానీ మంచి స్కోరు సాధించలేకపోయాం. చివర్లో స్టోయినిస్ సమయోచితంగా ఆడకపోయి ఉంటే గౌరవప్రదమైన స్కోరు కూడా దక్కేది కాదని’ వ్యాఖ్యానించాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించిన అశ్విన్.. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓటమి తప్పలేదని పరోక్షంగా బ్యాట్స్మెన్ల వైఫల్యాన్ని ప్రస్తావించాడు. కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా బాధ్యతతో కూడుకున్నదని.. ప్రస్తుతం తాను ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలనుకుంటున్నానని అశ్విన్ పేర్కొన్నాడు. ఈ ఓటమితో తామేమీ కుంగిపోవడం లేదని, తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధించడంపై దృష్టిసారిస్తామన్నాడు. 16 పాయింట్లు సాధించడం అంత సులభమేమీ కాదన్న అశ్విన్.. మంచి ప్రదర్శన ద్వారా నాకౌట్‌కు చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
అదంతా విధి రాత : క్రిస్ గేల్
మొహాలీ : కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడాలని రాసిపెట్టుండటంతోనే చివర్లో ఆ జట్టు తనను తీసుకుందని విధ్వంసకర బ్యాట్స్‌మన్, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గేల్ పలు ఆసక్తికరవిషయాలను పంచుకున్నాడు. గేల్ నిరూపంచుకున్నాడనే వ్యాఖ్యలను ఈ విండీస్ క్రికెటర్ తప్పుబట్టాడు. తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, తన రికార్డులే తనేంటో తెలియజేస్తాయన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో చివరి రౌండ్లో ఎంపికయ్యాని, తనపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదని తెలిసిన తరువాత కూడా తానేమి బాధపడలేదన్నాడు. జీవితమంటే ఒక క్రికెట్ మాత్రమే కాదని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో ఒక కొత్త ఫ్రాంచైజీకి ఎంపికవ్వడం సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు. తనపై నమ్మకంతో కొనగోలు చేసిన జట్టకు సేవలందించడమే ప్రస్తుతం తన ముందున్న కర్తవ్యమని తెలిపాడు. తాను ఏ జట్టుకు ఆడుతున్నా, ఆ జట్టు గెలవాలనే కోరుకుంటానని చెప్పుకొచ్చాడు. మిగతా ఫ్రాంచైజీలు వేలంలో ఆసక్తి కనబర్చకపోవడంపై స్పందిస్తూ, తానేమీ తప్పుగా ప్రవర్తించలేదని, ప్రతి మ్యాచ్ లోనూ రాణించడం ఎవరి వల్లా కాదని, కెరీర్లో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమేనని గేల్ అభిప్రాయపడ్డాడు. 38 ఏళ్ల వయసులో ఫిట్నెస్ గురించి స్పందిస్తూ.. ‘‘ నా శరీరాకృతి మారకుండా కొనసాగిస్తున్నాను. నేను స్ప్రింగ్ చికెన్‌లా ఉండనని నాకు తెలుసు. కానీ శరీరాకృతి కోసం ఎలాంటి కసరత్తులు చేయను. నాది సహజసిద్దమైన శరీరాకృతి. 38 ఏళ్ల వయసులో కూడా నా శరీర ఆకృతి బానే ఉంది’’ అని తెలిపాడు. ఆ రెండే నా లక్ష్యం.. ‘‘ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్, 2019 ప్రపంచకప్ గెలవడమే నా లక్ష్యం. ప్రపంచకప్ గెలిచే అవకాశం వెస్టిండీస్‌కు ఎక్కువగా ఉందని నేను భావిస్తున్నా. మా జట్టు క్వాలిఫైయర్స్‌లో ఇబ్బంది పడ్డ విషయం నాకు తెలుసు. కానీ మేం టైటిల్ సాధించేలా సిద్దమయ్యాం. ప్రస్తుతం ఖచ్చితంగా ఐపీఎల్ టైటిల్ గెలువాలి. కింగ్స్ పంజాబ్ ఇప్పటివరకు గెలవలేదు. మా యజమాని ప్రితీజింతా అద్భుతం. ఆమె ఆటగాళ్లికిచ్చె మద్దతు అత్యద్భుతం. ఈ ఏడాది టైటిల్‌ను ఆమె అందుకోవడం ఎంతో అవసరమని నేను భావిస్తున్నా.’’ అని చెప్పాడు. ఇక గేల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినప్పటికీ, 252 పరుగులు చేసి, పొట్టి క్రికెట్ లో తానెంత ముఖ్యమో నిరుపించుకున్నాడు. తనను వదిలేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పాటు, తనను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని మిగతా ఫ్రాంచైజీలకు తన విధ్వంసక బ్యాటింగ్‌తో సమాధానం చెబుతున్న విషయం తెలిసిందే. ఇక గేల్ ఆడిన మ్యాచ్ ఓ శతకం, రెండు అర్థ సెంచరీలు సాధించి పంజాబ్‌కు సునాయస విజయాలందించాడు. -
ఐపీఎల్లో రికార్డు సృష్టించిన రాజ్‌పుత్
హైదరాబాద్: ఐపీఎల్-11 సీజన్లో కింగ్స్ పంజాబ్ యువ బౌలర్ అంకిత్ రాజ్‌పుత్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టిన ఈ యువ ఆటగాడు (5/14) ఈ సీజన్లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఐదు వికెట్లు సాధించిన తొలి భారత అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేగాకుండా ఐదు వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అంతకు ముందు ఇషాంత్ శర్మ (5/11) ఐపీఎల్ 2011 సీజన్ తొలి సారి ఈ ఘనతను నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో రాజ్‌పుత్ వేసిన ప్రతి ఓవర్లో వికెట్ సాధించడం ఇక్కడ విశేషం. దీంతో ఇప్పటి వరకు అత్యత్తుమ ప్రదర్శన జాబితాలో తొలి స్థానంలో ఉన్న ముంబై ఆటగాడు మయాంక్ మార్కండే(4/23)ను రాజ్‌పుత్ తాజా ప్రదర్శనతో అధిగమించాడు. ఐపీఎల్ అంత ఈజీ కాదు: రాజ్‌పుత్ ఇక మ్యాచ్ అనంతరం రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ అంత సులువైనదిగా నేను భావించడంలేదు. ప్రతి ఆటగాడు చాల కష్టపడి రాణిస్తున్నారు. నేను వికెట్లు తీసీ నా బౌలింగ్‌తో రాణించా. మంచి ప్రణాళికతో వచ్చి విజయవంతమయ్యా. ఇది నారోజు కావడంతో ఐదు వికెట్లు దక్కాయి.’’ అని తెలిపాడు. ఇక పంజాబ్ బ్యాట్స్‌మెన్ రాజ్‌పుత్ జోరును కొనసాగించలేకపోయారు. సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి చేతులెత్తయడంతో.. పంజాబ్ స్పల్ప స్కోర్‌ను చేధించలేక 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. -
తివారి బౌలింగ్ యాక్షన్‌పై జోకులే జోకులు
హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌గా కొత్త అవతారమెత్తాడు.. కింగ్స్‌పంజాబ్ ఆటగాడు మనోజ్ తివారి. యువరాజ్ సింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వినూత్న శైలితో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం తివారి బౌలింగ్ యాక్షన్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నారు. టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్, శ్రీలంక పేసర్ మలింగాల యాక్షన్ల కలయికగా తివారి బౌలింగ్ యాక్షన్ ఉందని అభిప్రాయపడుతున్నారు. తివారి బౌలింగ్ చూస్తే నవ్వు ఆగడం లేదని.. ఇది మలింగా స్పిన్ వర్షన్ అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఇది సరైన బౌలింగేనా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి బౌలింగ్‌ను ఐపీఎల్లో అనుమతించ కూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఒకే ఓవర్ వేసిన తివారి 10 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 13 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. Manoj Tiwari bowl like Malinga pic.twitter.com/49mWCCUUvG — Rashid Ibrar Khan (@Rashid_Ibrar14) April 26, 2018 This Manoj Tiwari's bowling action shouldn't be allowed !! IPL is ruining technic and class !! 😕 — sarvesh sambare (@sarvesh555) April 26, 2018 -
వర్షంలోనే దూసుకెళ్లిన గేల్ సిక్స్.!
-
వర్షంలోనే దూసుకెళ్లిన గేల్ సిక్స్.!
కోల్‌కతా : కింగ్స్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ పంజాబ్‌కు ఓపెనర్లు క్రిస్‌గేల్, కేఎల్ రాహుల్‌లు మంచి శుభారంబాన్ని అందించారు. 8.2 ఓవర్లు సాగిన ఆటలో పంజాబ్ వికెట్ నష్టపోకుండా 96 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాట్స్‌మన్ గేల్ మరోసారి అర్థసెంచరీకి చేరువయ్యాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సులతో 49 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 23 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సుతో 43 పరుగులు పూర్తి చేసుకున్నాడు. చావ్లా వేసిన 9 ఓవర్ రెండో బంతిని గేల్ భారీ షాట్ ఆడాడు. ఇక బంతి గాల్లో ఉండగానే వర్షం ప్రారంభమైంది. విచిత్రంగా గేల్ సిక్సుకే వర్షం వచ్చినట్లైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు. -
క్రిస్‌లిన్ విజృంభణ.. పంజాబ్‌కు భారీ లక్ష్యం
కోల్‌కతా : సొంతగడ్డపై కింగ్స్‌పంజాబ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ క్రిస్‌లిన్ విజృంభించాడు. దీంతో పంజాబ్‌కు 192 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే నరైన్(1) వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఊతప్పతో లిన్ దాటిగా ఆడాడు. వీరిద్దరు రన్‌రేట్ తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి కోల్‌కతా 50 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడు పెంచిన ఉతప్ప34(23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సు).. అశ్విన్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే నితీష్ రానా లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ బాధ్యాతాయుతంగా ఆడగా.. మరో వైపు క్రిస్‌లిన్ రెచ్చిపోయాడు. ఈ దశలో 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో క్రిస్‌లిన్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 147 పరుగుల వద్ద ఆండ్రూ టై బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా క్రిస్‌లిన్71(41 బంతుల్లో 6 ఫోర్లు,4 సిక్సులు) పెవిలియన్ చేరాడు. దీంతో నాలుగో వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రస్సెల్(10) నిరాశపరిచాడు. కట్టడి చేసిన పంజాబ్ చివర్లో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కార్తీక్ 43(28 బంతులు, 6 ఫోర్లు) దాటిగా ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే టామ్ కుర్రాన్(1) సైతం వికెట్ సమర్పించుకున్నాడు. అండర్-19 స్టార్ శుభ్‌మన్‌గిల్(14 నాటౌట్), పియూష్ చవ్లా(2 నాటౌట్)లుగా నిలిచారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది. ఇక చివరి రెండో ఓవర్లో కోలకతాకు కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. పంజాబ్ బౌలర్లలో బీబీశ్రన్, ఆండ్రూ టైలు రెండు వికెట్లు తీయగా.. ముజీబ్, అశ్విన్‌లు తలా ఓ వికెట్ తీశారు. -
క్రిస్ గేల్‌కు అరుదైన గౌరవం
కోల్‌కతా: ఐపీఎల్-11 సీజన్లో దూకుడుమీద ఉన్న కింగ్స్‌పంజాబ్ ఓపెనర్, వెస్టిండియన్ క్రికెటర్ క్రిస్ గేల్‌కు అరుదైన గౌరవం దక్కింది. శనివారం కోల్‌కతాతో ఈడేన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రతి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ మైదానంలో ఉన్న గంటను మోగించడం ఆనవాయితీగా వస్తోంది. నేడు ఈ అరుదైన అవకాశం ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌కు వచ్చింది. మ్యాచ్‌కు ముందు గేల్ గంట మోగించాడు. ఇప్పటి వరకు ప్రముఖ మాజీ క్రికెటర్లు, అసాధారణ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు మాత్రమే ఈ అవకాశం లభించింది. గతంలో కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, మహిళా క్రికెటర్ జులాన్ గోస్వామికి ఈ అద్భుత అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక గేల్ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచుల్లో తమ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా విశ్వరూపం కనబర్చి104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. -
కోల్‌కతాదే బ్యాటింగ్
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్ ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపాడు. ఈ మైదాన వికెట్ చేజింగ్ అనుకూలంగా ఉంటందని ఇరు జట్ల కెప్టెన్లు అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌కు ఎలాంటి మార్పులు లేకుండా కోల్‌కతా బరిలోకి దిగుతుండగా.. పంజాబ్ జట్టులో స్పల్ప మార్పు చోటు చేసుకుంది. మోహిత్‌శర్మ స్థానంలో అంకిత్‌శర్మ తుదిజట్టులోకి వచ్చాడు. ఇక కోల్‌కతా 5 మ్యాచుల్లో మూడు గెలిచి రెండు ఓడగా.. పంజాబ్ నాలుగింటిలో మూడు నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. క్రిస్‌గేల్ భీకర ఫామ్‌లో ఉండటం పంజాబ్‌కు అదనపు బలం కాగా.. సొంత మైదానంలో ఆడటం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం. తుది జట్లు కోల్‌కతా: సునీల్ నరైన్, క్రిస్‌లిన్, ఉతప్ప, రానా, దినేశ్ కార్తీక్ (కెప్టెన్), రస్సెల్, శుభమన్ గిల్, కుర్రాన్, చావ్లా, శివం మావి, కుల్దీప్ యాదవ్ కింగ్స్ పంజాబ్: కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, అగర్వాల్, కరుణ్ నాయర్, ఆరోన్ ఫించ్, యువరాజ్ సింగ్, ఆర్ అశ్విన్(కెప్టెన్), ఆండ్రూ టై, మూజీబ్, రాజ్‌పూత్, బీబీశ్రన్ -
కోహ్లి జట్టుపై విమర్శల వెల్లువ
హైదరాబాద్ : ‘పుండు మీద కారం చల్లినట్లుంది’ ఐపీఎల్-11 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న ఈ జట్టుకు క్రిస్‌గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్ తలనొప్పిగా మారింది. గత సీజన్‌కు వరకు బెంగళూరుకే ఆడిన గేల్‌ను ఈ సీజన్లో సదరు ఫ్రాంచైజీ వదులుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడిదే ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ ఆడిన రెండు మ్యాచుల్లో ఒంటి చెత్తో ఆ జట్టును గెలిపించాడు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ అభిమానులు ఆర్సీబీని దెప్పిపొడుస్తున్నారు. ఇక గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యూనివర్సల్ బాస్ సెంచరీతో రెచ్చిపోవడం.. అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకునెలా చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ యాజమాన్యాన్ని, జట్టును నిలదీస్తున్నారు. క్రిస్‌గేల్‌ను కాదని, సర్ఫరాజ్ ఖాన్, మెక్‌కల్లమ్‌లను తీసుకున్నారు.. వారేమో ఆడడటం లేదని ఒకరంటే.. ‘మీరు ఏడుస్తునే ఉండండి..నేను నవ్వుతూనే ఉంటా’ అని గేల్ అన్నట్లు మరోకరు ఫొటో షాప్ నైపుణ్యంతో ట్రోల్ చేస్తున్నారు. ఆర్సీబీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఆటగాడు..గేల్, రాహుల్, వాట్సన్‌లు రాణిస్తున్నారని ఇంకొకరు ఎద్దేవా చేశారు. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక మ్యాచ్ గెలిచి మూడు ఓడిన విషయం తెలిసిందే. Every guy out of RCB starting to perform.#Rahul #Gayle #Watson — Nikhil 🏏 (@CricCrazyNIKS) 19 April 2018 This #RCB released #Gayle & retained #SarfrazKhan ! Yenna oru decision 👌 Shows d quality of this management ! Look wat he is doing now for #KXIP ! — Rajĸυмaя ♥ (@Rajj8990) 19 April 2018 -
అశ్విన్‌పై ధోని అభిమానుల ఆగ్రహం
మొహలీ : కింగ్స్ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌పై ధోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 పరుగుల తేడాతో గట్టెక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ పరుగుల సునామీ సృష్టించగా.. చెన్నై తరఫున ధోని అద్భుతంగా పోరాడాడు. అయితే మ్యాచ్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ.. తమ బౌలర్లు అద్బుతంగా రాణించారని, రాయుడు వికెట్ అనంతరం మ్యాచ్‌పై పట్టు చిక్కిందని తెలిపాడు. ఇక గేల్ ఇన్నింగ్స్ సైతం తమ విజయానికి కలిసొచ్చిందని పేర్కొన్నాడు. అయితే అశ్విన్ ధోని అద్భుత ప్రదర్శనను ప్రస్తావించకపోవడం అతని అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అదే ధోని మాట్లాడుతూ.. గేల్, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లు పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. తమ కంటే పంజాబ్ ఆటగాళ్లు బాగా ఆడారని, కొన్ని విషయాల్లో తమింకా మెరుగుపడాలని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అభిమానులు అశ్విన్‌పై మండిపడుతున్నారు. ధోని ప్రత్యర్థి ఆటగాళ్ల గురించి మాట్లాడినప్పుడు అశ్విన్‌కు ఏమైందని సోషల్ మీడియా వేదికగా నిలిదీస్తున్నారు. ధోని గురించి అశ్విన్ ఒక్క మాట మాట్లడకపోవడంతో అతనిపై తమకు గౌరవం పోయిందని కొందరంటే.. అసలు ధోని లేకపోతే అశ్విన్ ఎక్కడా.. కష్టసమయాల్లో ధోని ఎన్నో సార్లు అశ్విన్‌కు మద్దతిచ్చాడని అలాంటిది ధోని అద్భుత ఇన్నింగ్స్ గురించి ఒక్క మాట మాట్లడకపోవడం ఏమిటని ఇంకోందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడ్డ ధోని 5 సిక్సులు, 6 ఫోర్లతో 44 బంతుల్లో 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచి కడదాక పోరాడిన విషయం తెలిసిందే. Not a single word of appreciation by Ashwin for Dhoni. He completely lost my respect🤗#KXIPvCSK #Dhoni #CSK #Mahi #CSKian — Anjali..🐇🐿❤ (@Anjali39483451) 15 April 2018 With out dhoni ashwin is nothing.. He supported him alot in tough situations.. If u see dhoni speech today he applauded gayle and mujeeb for their game.. But ashwin didn't utter a single word — pradeep yadav :) (@itsmepradeep7) 15 April 2018 -
ధోని వెన్ను నొప్పితోనే పంజాబ్ గట్టెక్కింది
మొహాలి : కింగ్స్‌పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అద్భుత ఇన్నింగ్స్‌కు అంతా స్టన్ అయ్యారు. ఓ వైపు ధోనిని వెన్ను నొప్పి వెంటాడిన ఏ మాత్రం తగ్గకుండా రెచ్చిపోయాడు. తనదైన షాట్లతో బంతిని బౌండరీకి తరలిస్తూ చివరి క్షణం వరకు పోరాడాడు. అయితే చివరి ఓవర్ వేసిన పంజాబ్ బౌలర్ మోహిత్ శర్మ ధోని వెన్నునొప్పిని దృష్టిలో ఉంచుకొని ఆఫ్ వికెట్ మీదుగా బంతులను విసిరాడు. అయినా ధోని గెలుపే లక్ష్యంగా పోరాడాడు. చివరకు విజయానికి చేరువగా వచ్చిన చెన్నై 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ధోని వెన్ను నొప్పితోనే పంజాబ్ ఓటమిని తప్పించుకుందని సోషల్ మీడియాలో అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు. ధోని ప్రదర్శనపై అటు అభిమానులు, మాజీ క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లంతా ఫిదా అయ్యారు. ట్విటర్ వేదికగా ధోనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎంఎస్ ధోని అద్భుత ప్రదర్శన. అతని ఇంటర్వ్యూలను ఆస్వాదిస్తున్నాను. ఆ ఇంటర్వ్యూలో గాయాలైనప్పుడు కూడా నొప్పిని భరిస్తూ ఆడగలనని, దేవుడు నాకా శక్తి ఇచ్చాడని ధోని చెప్పిన మాట ఎంతగానో నచ్చింది. ఈ ఉత్కంఠకర మ్యాచ్‌లో పంజాబ్ నెగ్గడం సంతోషాన్నించింది.- మహ్మద్ కైఫ్ ధోని చేత ఓ గొప్ప ప్రదర్శన.. దాదాపు లక్ష్యాన్ని చేధించాడు. ఈ మ్యాచ్ చూస్తే 200 పరుగుల టార్గెట్ కూడా అంత భద్రం కాదనిపిస్తుంది. మీరేమంటారు? - రోహిత్ శర్మ ధోనిభాయ్ నీవు చాంపియన్.. నీ ఇన్నింగ్స్ అద్భుతం-రషీద్ ఖాన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ధోని మరోసారి నిరూపించాడు. కింగ్స్‌పంజాబ్‌కు అభినందనలు- హర్భజన్ సింగ్ ఇక ధోని వెన్నునొప్పి తాళలేక ఇన్నింగ్స్ మధ్యలో ఫిజియోథెరపీ చేయించుకున్నాడు. రిటైర్డ్ హర్ట్ కావాలని ఫిజియో సూచించినా అతన్ని వెనక్కి పంపించి పోరాడాడు. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘‘వెన్నునొప్పి నన్ను బాధించింది. ఫిజియో సాయంతో కాస్త ఉపశమనం పొందాను. మళ్లీ నొప్పి తిరగబెడుతుందా లేదా ఇప్పుడే చెప్పలేను. అయితే ఇవేవీ నాకు కొత్తేంకాదు. ఒక మోస్తారు గాయాలైనప్పుడు కూడా నొప్పిని భరిస్తూ ఆడగలను. దేవుడు నాకా శక్తి ఇచ్చాడు. పైగా తర్వాతి మ్యాచ్‌కు కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి బహుశా పూర్తిగా కోలుకోవచ్చని ఆశిస్తున్నా’’ అని ధోనీ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ధోని 5 సిక్సులు, 6 ఫోర్లతో 44 బంతుల్లో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
గేల్ సునామీ జాగ్రత్త.. సన్‌రైజర్స్
మొహాలీ : రాక రాక వచ్చిన అవకాశం అనుకున్నాడో ఏమో కానీ తన విశ్వరూపాన్నీ చూపించాడు.. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జి‘గేల్’మన్నాడు. ప్రతి బంతిని బౌండరికి తరలించడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు పరుగుల సునామీ సృష్టించాడు. దీంతో పంజాబ్ బలమైన చెన్నై జట్టుపై 4 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో మూడు మ్యాచ్‌లాడిన పంజాబ్ బెంగళూరు చేతిలో ఓడి ఢిల్లీ, చెన్నైలపై గెలిచింది. అయితే తదుపరి మ్యాచ్ లీగ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఏప్రిల్19న (గురువారం) తలపడనుంది. సొంతమైదానంలో మ్యాచ్ జరగడం పంజాబ్ కలిసొచ్చె అంశం కాగా.. విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఫామ్‌లోకి రావడం ఆజట్టుకు మరింత బలాన్నిచ్చింది. ఈనేపథ్యంలో సన్‌రైజర్స్ జట్టుకు పంజాబ్ తమ అధికార ట్విటర్ వేదికగా సవాల్ విసిరింది. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ గేల్సునామీ జాగ్రత్త..’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై హైదరాబాద్ అభిమానులు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘సన్‌రైజర్స్‌లో వరల్డ్‌క్లాస్ బౌలర్స్ రషీద్‌ఖాన్, భువనేశ్వర్లున్నారు.. వారితో జాగ్రత్త..’ పంజాబ్ అంటూ ఒకరు బుదులివ్వగా.. హాహాహా.. పెద్ద జోక్ అంటూ తేలికగా మరొకరు కొట్టిపారేశారు. గేల్‌కు సన్‌రైజర్స్‌తో అంత సీన్లేదని, డకౌట్ పక్కా అని ఇంకొకరు కామెంట్ చేశారు. Sunrisers Hyderabad, beware of the Gaylestorm 😎#LivePunjabiPlayPunjabi #KXIPvCSK pic.twitter.com/AKlnR9yu8Q — Kings XI Punjab (@lionsdenkxip) 15 April 2018 There is world class bowlers rashid Khan and bhuvaneswar beware of them — Srikanth318 (@Srikanth3184) 15 April 2018 -
చెలరేగిన డివిలియర్స్.. బెంగళూరు విజయం
-
చెలరేగిన డివిలియర్స్.. బెంగళూరు విజయం
బెంగళూరు : సొంతగడ్డపై సమిష్టి ప్రదర్శనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చెలరేగింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో కింగ్స్‌పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో ఉమేశ్, సుందర్‌లు రాణించగా.. బ్యాటింగ్‌లో డివిలియర్స్ 57 ( 40 బంతులు,2 ఫోర్లు, 4 సిక్సులు), డికాక్45( 34 బంతులు,7 ఫోర్లు, ఒక సిక్సు) బ్యాట్‌ను ఝులిపించారు. దీంతో కింగ్స్‌పంజాబ్ జట్టుపై బెంగళూరు విజయం సాధించింది. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కింగ్స్‌పంజాబ్ 19.2 ఓవర్లకు 155 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ 47(30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు)తన జోరును కొనసాగించగా.. కరుణ్ నాయర్ 29 (26 బంతుల్లో 3 ఫోర్లు) చివర్లో కెప్టెన్ అశ్విన్ 33(20 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సు) ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ గౌరవ ప్రదమమైన స్కోరు చేయగలిగింది. డివిలియర్స్ మెరుపులు.. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి తొలి ఓవర్లో మెకల్లమ్ గోల్డెన్ డకౌట్‌తో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, మరో ఓపెనర్ డికాక్‌తో కలసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ తరుణంలో కోహ్లి21(16 బంతులు, 4 ఫోర్లు)ని యువబౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అద్బుత బంతితో క్లీన్ బౌల్డ్ చేసి ఔరా అనిపించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన డివిలియర్స్, అప్పటికే జోరు మీదున్న డికాక్‌తో ఆచితూచి ఆడాడు. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన అశ్విన్ వరుస బంతుల్లో డికాక్, సర్ఫరాజ్ఖాన్లను పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మన్దీప్ సింగ్‌తో కలసి డివిలియర్స్ వరుస సిక్సర్లతో చెలరేగాడు. ఈ దశలో డివిలియర్స్ 36 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో పంజాబ్ విధించిన లక్ష్యం చిన్నబోయింది. చివర్లో ఆండ్రూ టై బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన డివిలియర్స్ బౌండరీ లైన్ వద్ద కరుణ్నాయర్కు చిక్కాడు. ఆ వెంటనే మన్దీప్ కూడా రనౌట్ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. కానీ చేధించాల్సిన పరుగులు తక్కువగా ఉండటం చివరి ఓవర్లో సుందర్ ఫోర్ కొట్టడంతో మూడు బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీకి విజయం వరించింది. -
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లక్ష్యం 156
-
కుప్పకూలిన కింగ్స్ పంజాబ్
బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్ 155 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగళూరుకు సాధారణ లక్ష్యం నమోదైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి మ్యాచ్ జోరునే కొనసాగించడంతో శుభారంభం దక్కింది. అయితే పేసర్ ఉమేశ్ యాదవ్(3-23) దాటికి ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉమేశ్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (15; 11 బంతుల్లో 3 ఫోర్లు) కీపర్ డికాక్ అద్బుత క్యాచ్‌కు వెనుదిరగగా.. రెండో బంతికి హిట్టర్ ఆరోన్ ఫించ్ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక చివరి బంతికి యువరాజ్ సింగ్ (4) దారుణంగా విఫలమయ్యాడు. కొనసాగిన రాహుల్ జోరు ఓ వైపు వికెట్లు పడుతున్నా రాహుల్ తనదైన శైలిలో వేగంగా ఆడుతూ.. స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ తరుణంలో రాహుల్ 47(30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) వాషింగ్టన్ సుందర్ అద్భుత బంతికి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగి తృటిలో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. ఆ వెంటనే పంజాబ్.. కరుణ్ నాయర్ 29 (26 బంతుల్లో 3 ఫోర్లు), స్టోయినిస్11(9 బంతులు, 1 సిక్సు), అక్షర్ పటేల్(2)ల వికెట్లు స్వల్ప వ్యవధిలోనే కోల్పోయింది. ఇక వీటిలో రెండు వికెట్లను బెంగళూరు రివ్యూల ద్వారా సాధించడం విశేషం. దీంతో భారీ స్కోర్ సాధిస్తుందనుకున్న పంజాబ్ ఒక్కసారిగా కుదేలైంది. చివర్లో కెప్టెన్ అశ్విన్ 33(20 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సు) పర్వాలేదనిపించినా పంజాబ్ కోలుకోలేకపోయింది. 19.2 ఓవర్లకు 155 పరుగులకు ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కు మూడు వికెట్లు, కెజ్రోలియా, సుందర్, క్రిస్ వోక్స్‌లకు రెండేసి వికెట్లు దక్కగా.. చహల్‌లకు ఓ వికెట్ లభించింది. -
ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత
బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక జట్లకు ప్రాతినిథ్యం వహించిన తొలి ఆటగాడిన ఫించ్ గుర్తింపు పొందాడు. బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌తో ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫించ్ తర్వాత ఆరు జట్లకి ప్రాతినిథ్యం వహించిన పార్థీవ్ పటేల్, తిసారా పెరీరా, దినేశ్ కార్తీక్లున్నారు. ఫించ్ తొలిసారిగా 2010లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు. 2011-12లో ఢిల్లీ డేర్ డేవిల్స్, 2013లో అప్పటి జట్టు పుణెవారియర్స్, 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్, 2015లో ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు. ఇక 2016లో ఫించ్‌ను గుజరాత్ లయన్స్ కొనుగోలు చేసుకోగా.. గాయంతో ఆసీజన్కు దూరమయ్యాడు. 2017లోను గుజరాత్ జట్టులోనే కొనసాగాడు. ఈ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. వివాహం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన ఫించ్ తాజా మ్యాచ్‌తో తుదిజట్టులోకి వచ్చాడు. -
గేల్‌కు మళ్లీ మొండి చెయ్యి!
బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక తొలి మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి విజయాల ఖాతా తెరవాలని భావిస్తుండగా.. తొలి మ్యాచ్‌లో అద్బుత విజయం సొంతం చేసుకున్న కింగ్స్ పంజాబ్ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లురుతోంది. ఇక కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్, కరుణ్నాయర్ సొంత గడ్డపై విజృంభిస్తారని అటు పంజాబ్ అభిమానులు ఇటు బెంగళూరు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ యువ ఆటగాళ్లు తొలి మ్యాచ్‌లో అర్థశతకంతో మెరిసిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌కు ఎలాంటి మార్పుల్లేకుండా బెంగళూరు బరిలోకి దిగుతుండగా.. పంజాబ్ మాత్రం మిల్లర్ స్థానంలో ఆరోన్ ఫించ్‌ను తీసుకుంది. ఇక విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు. తుది జట్లు ఆర్సీబీ : క్వింటన్ డికాక్, బ్రెండన్ మెక్కల్లమ్, విరాట్ కోహ్లి (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, సర్ఫరాజ్ ఖాన్, మన్దీప్ సింగ్, వాషింగ్టన్ సుంధర్, క్రిస్ వోక్స్, కుల్వంత్, ఉమేశ్ యాదవ్, చాహల్ పంజాబ్ : కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, యువరాజ్ సింగ్, మార్కస్ స్టోయినీస్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), ఆండ్రూ టై, మోహిత్ శర్మ, రెహ్మాన్, ఆరోన్ ఫించ్ -
ఈ ఐపీఎల్లో ఆ టీమ్ కెప్టెన్.. స్పెషల్.!
సాక్షి, హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2018 సీజన్లో కింగ్స్ఎలెవన్ పంజాబ్‌కు సారథ్యం వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఫ్రాంచైజీల కెప్టెన్లు ఎంఎస్ధోని(చెన్నై సూపర్ కింగ్స్), విరాట్ కోహ్లి(రాయల్ చాలెంజర్స్), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్), కేన్ విలియమ్సన్(సన్‌రైజర్స్), అజింక్యా రహానే(రాజస్తాన్), గౌతం గంభీర్(ఢిల్లీడేర్ డేవిల్స్), దినేశ్ కార్తీక్(కోల్‌కతా నైట్ రైడర్స్)లంతా బ్యాట్స్మెన్లు కాగా.. అశ్విన్ ఒక్కడే బౌలర్ కావడం విశేషం. ఈ సీజన్లో ఒక విలియమ్సన్ మినహా మిగతా అంత భారత ఆటగాళ్లే సారథిలుగా వ్యవహరిస్తుండటం మరో విశేషం. ఇక గత సీజన్ ఐపీఎల్లో కూడా ఒకే ఒక్క బౌలర్(జహీర్ ఖాన్,ఢిల్లీ) కెప్టెన్సీ వహించాడు. తొలిసారి సారథిగా వ్యవహరిస్తున్న అశ్విన్ ఆల్‌రౌండర్ అయినప్పటికి అతని ప్రధాన బలం మాత్రం బౌలింగేనన్న విషయం అందరికి తెలిసిందే. అశ్విన్ సారథ్యంలో పంజాబ్ ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై విజయం సాధించి ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. గత సీజన్లలో రైజింగ్ పుణె, చెన్నైసూపర్ కింగ్స్‌ల పాత్రినిథ్యం వహించిన ఈ ఆఫ్ స్పిన్నర్‌ను పంజాబ్ ఈసీజన్లో అనూహ్యంగా కెప్టెన్‌ను చేసింది. ఇప్పటి వరకు ట్రోఫీ అందుకోని పంజాబ్ ఎలాగైనా ఈ సీజన్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వేలంలో పోటిపడి మరి యువ ఆటగాళ్లు సొంతం చేసుకుంది. -
తట్టుకోలేనంత సంతోషంలో ప్రీతి జింతా!
మొహాలి : ఐపీఎల్-11 సీజన్లో కింగ్స్ఎలెవన్ పంజాబ్ శుభారంభం చేయడంతో ఆ జట్టు సహయజమాని ప్రీతి జింతా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆదివారం ఢిల్లీడేర్ డెవిల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డుకు తోడు కరుణ్ నాయర్ మెరవడంతో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై ప్రీతి జింతా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ‘నూతన సారథి అశ్విన్ నాయకత్వంలో కేఎల్ రాహుల్ రికార్డు నమోదు, ఐపీఎల్లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన అఫ్గానిస్తాన్ యువ క్రికెటర్ ముజీబ్ ఉర్ రహ్మాన్, కరుణ్ నాయర్ ప్యాక్స్ పంచ్‌లతో మ్యాచ్ ఆసాంతం నా నవ్వును ఆపుకోలేకపోయాను’ టింగ్! అని ఈ స్టార్ ఆటగాళ్లతో దిగిన ఫొటోను షేర్ చేసింది ఈ సొట్టబుగ్గల సుందరి. ప్రస్తుతం ఈ ట్వీట్ పంజాబ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మ్యాచ్‌తో పంజాబ్ ఆటగాళ్లు రెండు రికార్డులు నమోదు చేశారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. దీంతో ఇప్పటివరకూ యూసఫ్ పఠాన్, సునీల్ నరైన్ పేరిట సంయుక్తంగా ఉన్న 15 బంతుల ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బద్ధలైంది. ఇక 17 ఏళ్ల 11 రోజుల వయసుతో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా ముజీబ్ ఉర్ రహ్మాన్ ఘనత సాధించాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు 17 ఏళ్ల 177 రోజుల వయసులో బెంగళూరు తరఫున అరంగ్రేటం చేసిన సర్ఫరాజ్ ఖాన్ పేరిట ఉండేది. When @ashwinravi99 leads, @klrahul11 sets a new record, @Mujeeb_Zadran debuts at 17, @karun126 packs a punch & I can’t stop smiling 😃 #ting😘 pic.twitter.com/9DZZX9XwK0 — Preity zinta (@realpreityzinta) 9 April 2018 -
టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్
మొహాలీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా ఇక్కడ ఆదివారం ఐఎస్ బింద్రా స్టేడియంలో ఢిల్లీడేర్ డేవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్‌గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇరు జట్లు తొలి విజయం కోసం ఉవ్విళ్లురుతున్నాయి. అశ్విన్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌కాగా.. సొంత గూటి చేరిన గంభీర్ ఎలాగైన విజయాన్నందించాలని భావిస్తున్నాడు. మేటి ఆటగాళ్లతో ఇరు జట్లు సమిష్టిగా ఉన్నాయి. తుది జట్లు: పంజాబ్ : కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, యువరాజ్ సింగ్, డేవిడ్ మిల్లర్, మార్కస్ స్టోయినీస్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), ఆండ్రూ టై, మోహిత్ శర్మ, రెహ్మాన్ ఢిల్లీ: గౌతం గంభీర్ (కెప్టెన్), కోలిన్ మున్రో, రిషబ్‌పంత్, శ్రేయస్ అయ్యర్, క్రిస్ మొర్రిస్, విజయ్ శంకర్, డానియల్ క్రిస్టియన్, అమిత్ మిశ్రా, రాహుల్ తెవాటియా, ట్రెంట్ బోల్ట్, మహ్మద్ షమీ -
ఐపీఎల్: గేల్ ఈ సారైనా..
సాక్షి, హైదరాబాద్ : 20 క్రికెట్లో క్రిస్‌గేల్ విద్వంసకర ఆటగాడు.. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సమర్ధుడు. బంతిని అవలీలగా బౌండరీ దాటించగల సత్తా ఉన్నవాడు. కానీ ఒక్కసారి కూడా జట్టుకు ఐపీఎల్ కప్‌ను అందించలేకపోయాడు. పది ఐపీఎల్‌లు ఆడిన గేల్ గత రెండు సీజన్లలో మాత్రం అంచనాలను అందుకోలేక పోయాడు. దారుణంగా విఫలమయ్యాడు. దీంతో బెంగుళూరు జట్టు వదుకోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా గేల్‌లో కసి రగులుతుందా.. ఈ సీజన్లోనైనా గేల్ సునామీని చూడొచ్చా అంటూ క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2011, 2012, 2013 సీజన్లలో సుమారు 60కి పైగా సగటు నమోదు చేశాడు గత రెండు సీజన్లు మొత్తం కలుపుకొని గేల్ చేసిన అర్ధ సెంచరీలు రెండు చివరి రెండు ఐపీఎల్ సీజన్లలో గేల్ సగటు 22.47 మాత్రమే జట్టు మారితేనైనా గేల్ ఆటతీరు మారకపోతుందా అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడైనా గేల్ మైదానంలో బంతులను సిక్సర్లకు మళ్లించగలిగితే ఇక పండుగే. పంజాబ్ తరపున సత్తా చాటాలని, తనపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
ప్రీతితో చిందేయడానికి గేల్ రెడీ!
ముంబై : వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ ఈ సీజన్ ఐపీఎల్లో పరుగుల సునామీ సృష్టించేందుకు సిద్దమయ్యాడు. బ్యాట్‌తోనే కాకుండా తన ఆట పాటతో అలరించే గేల్‌ను కొనుగోలు చేసేందుకు తొలుత ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. రెండు సార్లు అతను ఆన్సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. చివర్లో కింగ్స్ పంజాబ్ సహా యజమాని ప్రీతిజింతా కనికరించడంతో ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌కు ఈ సీజన్ ఐపీఎల్ ఆడే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో పంజాబీ స్టైల్లో అలరించేందుకు గేల్ సిద్దమవుతున్నాడు. ఓ పంజాబీ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను ‘భారత్‌కు వస్తున్నా.. పంజాబీ స్టైల్లో అలరిస్తా’ అనే క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. ఇప్పటి వరకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన గేల్ గత సీజన్లో విఫలమయ్యాడు. దీంతో ఏ ఫ్రాంచైజీ గేల్‌పై ఆసక్తి కనబర్చలేదు. అయితే ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీలో ఈ జమైకన్ స్టార్ పరుగుల సునామీ సృష్టించి ఫామ్‌లోకి వచ్చాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 11 సిక్సులతో శతకం సాధించాడు. -
‘భారత్‌కు వస్తున్నా.. పంజాబీ స్టైల్లో అలరిస్తా’
-
‘పెళ్లి చేసుకుంటున్నా తొలి మ్యాచ్‌కు రాలేను’
సాక్షి, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2018 సీజన్ తొలి మ్యాచ్‌కు తాము అందుబాటులో ఉండటంలేదని ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ఆరోన్ ఫించ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌లు స్పష్టం చేశారు. ఫించ్ కింగ్స్ ఎల్‌వన్ పంజాబ్‌కు ఫ్రాతినిథ్యం వహిస్తుండగా.. మ్యాక్సీ ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడునున్నాడు. ఐపీఎల్-11 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తొలి సమరంతో ఈ సీజన్ ఐపీఎల్‌కు తెరలేవనుంది. ఏప్రిల్ 8న పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు రోజు ఏప్రిల్ 7న ఫించ్ ప్రేయసి అమీ గ్రిఫ్త్స్ను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ పెళ్లికి మ్యాక్స్‌వెల్ మాస్టర్ ఆఫ్ సెర్మెనీగా (వధువరులతో ప్రమాణం చేయించడం) వ్యవహరించనున్నాడు. దీంతో ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు తొలి మ్యాచ్‌కు దూరం కానున్నారు. ‘ఐపీఎల్ మ్యాచ్‌లు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం అవుతాయనే ఉద్దేశంతో పెళ్లిని 7న పెట్టుకున్నాను. ఐపీఎల్ షెడ్యూల్ చూశాను. ఇప్పుడు పెళ్లిని వాయిదా వేసుకోలేను. కాబట్టి ఆరంభ మ్యాచ్‌కు రాలేను. 13న జరిగే రెండో మ్యాచ్‌కు చాలా సమయం ఉంది. ఆ టైంలోగా జట్టులో చేరిపోతానని’ ఫించ్ తెలిపాడు. -
‘గేల్‌ను అందుకే తీసుకున్నాం’
సాక్షి, స్పోర్ట్స్ : క్రిస్ గేల్.. ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ట్వంటీ 20ల్లో అమోఘమైన రికార్డు ఈ విధ్వంసకర క్రికెటర్ సొంతం. ప్రధానంగా సిక్సర్ల కింగ్‌గా పిలుచుకునే గేల్... ఈసారి ఐపీఎల్ వేలంలో విపత్కర పరిస్థితి ఎదుర్కొన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన గేల్‌ను ఈ సారి వేలంలో ఆ జట్టు ఉద్వాసన పలికింది. అంతేగాకుండా ఏ ప్రాంచైజీ గేల్‌ను తీసుకోవడానికి ముందుకు రాలేదు. రూ.2 కోట్ల కనీస ధరతో రెండు సార్లు వేలంలో అతని పేరు ప్రకటించినా ఎవరూ ఆసక్తి కనబర్చలేదు. ఇక అమ్ముడుపోని క్రికెటర్లకు ఆఖర్లో మరొకసారి వేలం జరగ్గా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కనికరించి అదే బేస్ ప్రైస్‌కు సొంతం చేసుకుంది. అంత వరకు విముఖత కనబర్చి తరువాత ఎంపిక చేయడంపై క్రికెట్ అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీనిపై మాజీక్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చాడు. ‘గేల్ ఓపెనింగ్ వస్తే ప్రత్యర్థి జట్లు భయపడతాయి. ఏ ప్రత్యర్థి జట్టుకైనా గేల్ విధ్వంసకర ఆటగాడు. ఇప్పటికే అతను నిరూపించుకున్నాడు. కింగ్స్ పంజాబ్ జట్టుకు ఆరోన్ ఫించ్, స్టోయినిస్, డేవిడ్ మిల్లర్, యువరాజ్ సింగ్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్లతో మంచి బ్యాటింగ్ లైనప్ కలిగిఉంది. ఈ లైనప్‌కు గేల్‌తో మరింత బలం చేకూరుతుంది. ఇక గేల్ అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఓపెనింగ్‌కు బ్యాక్ అప్‌గా తీసుకున్నాం’ అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. -
‘ధోనిలా సిక్స్‌లు బాదడమే నాధ్యేయం’
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ అనామక క్రికెటర్ల జీవితాల్లో వెలుగు నింపుతోంది. ప్రతి సీజన్లో ఓ కొత్త క్రికెటర్ జీవితాన్ని కెరీర్ పరంగా.. ఆర్థికపరంగా వారు ఊహించనంతలా మార్చేస్తుంది. ఒకప్పుడు రూ.60 రోజు కూలి పొందిన కశ్మీర్ యువ ఆటగాడు మంజూర్ ధార్ ఈ సారి జరిగన వేలంలో రూ.20లక్షలు పలికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో కశ్మీర్ నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఎంపికతో కశ్మీర్ వ్యాప్తంగా మంజూర్ ధార్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. ఇక అతని సొంత గ్రామ ప్రజలు నాట్యం చేస్తూ పండుగ చేసుకున్నారు. రాత్రివేళ సెక్యూరిటీ గార్డ్.. పగలు క్రికెటర్ రెక్కాడితేగాని డొక్కాడని జీవితం మంజూర్ ధార్ది. నలుగురు చెల్లెల్లు, ముగ్గురు తమ్ముళ్లతో కుటుంబ బాధ్యత తనపై ఉన్నా ఆటపై ఉన్న మక్కువతో ఒకవైపు సెక్యూరిటీ గార్డ్‌గా రాత్రి వేళలో పనిచేస్తూ.. పగలు లోకల్ కోచ్ సాయంతో క్లబ్ క్రికెట్ ఆడేవాడు. 2008 నుంచి 2012 వరకు ఇలా క్లబ్ క్రికెట్ ఆడిన మంజూర్ రాష్ట్ర జట్టులో చోటు కోసం ప్రయత్నించాడు. అనంతరం 2017లో కశ్మీర్ తరపున తొలి మ్యాచ్ ఆడాడు. సహజసిద్దమైన ఆటతో అలవోకగా సిక్సులు బాదేవాడు. దీంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈ ఏడాదిలోతన సొంత రాష్ట్రం తరపున 9 టీ20లు, నాలుగు లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇక భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన పర్వేజ్ రసూల్, మంజూర్ ధార్లే కశ్మీర్ తరపున వేలంలో పాల్గొనగా మంజూర్ ఎంపికవడం విశేషం. కోట్ల రూపాయలు పలకకపోయినా ఈ వేదిక అతని కెరీర్‌కు, కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ధోనిలా సిక్స్‌లు బాదడమంటే ఇష్టం.. ఈ ఎంపికపై ఆనందం వ్యక్తం చేసిన మంజూర్ ధోనిలా సిక్స్‌లు బాదడమే తనకిష్టమని చెప్పుకొచ్చాడు. తనపై నమ్మకం ఉంచిన పంజాబ్ యజమాని ప్రీతిజింతాకు ధన్యవాదాలు తెలిపాడు. నా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ వచ్చా.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో ఎంపికవడం సంతోషంగా ఉందన్నాడు. ఒకప్పుడు రూ.60 కూలీకి పని చేసానని, క్రికెట్ ఆడే రోజుల్లో తనకి కనీసం షూ కూడా లేవని గుర్తు చేసుకున్నాడు. తన అభిమాన క్రికెటర్ యువరాజ్‌తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం రావడం మరింత సంతోషాన్నిస్తుందన్నాడు. నా ఎంపికనంతరం మా అమ్మను సుమారు 30 వేల మంది కలిసి అభినందించారని చెబుతూ ఆనందం వ్యక్తం చేశాడు. కొత్త ఇళ్లును ప్రారంభించి మూడేళ్లు అవుతుందని, దానికి కనీసం డోర్స్, కిటీకీలు కూడా లేవని ఇప్పుడు ఈ డబ్బుతో అది పూర్తి చేస్తానని, మా చెల్లెల్లు, తమ్ముళ్లను బాగా చదివిస్తానని చెప్పుకొచ్చాడు. తన తల్లి ఆరోగ్యం సైతం బాలేదని, ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తానని పేర్కొన్నాడు. -
ఐపీఎల్ వేలంపై సెహ్వాగ్ సెటైర్
సాక్షి, బెంగళూరు : ట్వీటర్లో ప్రతివిషయంపై వ్యంగ్యంగా స్పందించే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ వేలంను సైతం విడిచిపెట్టలేదు. బెంగళూరు వేదికగా ఐపీఎల్-11 కోసం ఆటగాళ్ల వేలం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజీలు ఉత్తమ ఆటగాళ్లను దక్కించుకొనేందుకు కోట్లానుకోట్ల రూపాయలతో పోటీపడుతున్నాయి. ఈ వేలంలో కింగ్స్ఎలెవన్ పంజాబ్‌కు మెంటర్‌గా పాల్గొన్న సెహ్వాగ్ ఫ్రాంచైజీ సహ యజమానైన ప్రితీజింతాపై సెటైరిక్ ట్వీట్ చేశాడు. ‘సాధారణంగా అమ్మాయిలకు షాపింగ్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ప్రీతి ఫుల్ షాపింగ్ మూడ్‌లో ఉంది. ఏదీ కనిపించినా కొనుగోలు చేస్తోంది.’ అని ట్వీట్ చేశాడు. ఇక ఆటగాళ్ల వేలంపై సైతం తనదైన శైలిలో స్పందించాడు. ‘‘చిన్నప్పుడు మనం కూరగాయలు కొనేందుకు వెళితే.. అమ్మ ధర సరిగ్గా చూసి కొనమని చెప్పేది. ఇప్పుడు మేం ఆటగాళ్లను కొనడానికి వెళ్తున్నాం. తేడా ఏంటంటే.. ఇప్పుడు ఓనర్ చెబుతారు.. సరైన ధరకి కొనమని’’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఇక కింగ్స్ఎలెవన్ పంజాబ్ రిటైన్ పద్దతిలో అక్సర్ పటేల్‌ను అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన వేలంలో కేఎల్ రాహుల్‌కు అత్యధికంగా రూ.11 కోట్లు వెచ్చించగా.. రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.7.6 కోట్లతో కొనుగోలు చేసింది. కింగ్స్ పంజాబ్ దక్కించుకున్న ఆటగాళ్లు అరోన్ ఫించ్ - 6.2 కోట్లు మార్కస్ స్టోయినిస్ - 6.2 కోట్లు కరుణ్ నాయర్ - 5.6 కోట్లు డేవిడ్ మిల్లర్ - 3 కోట్లు యువరాజ్ సింగ్ - 2 కోట్లు మయాంక్ అగర్వాల్ - రూ. కోటి అంకిత్ రాజ్‌పుత్ - రూ. 3 కోట్లు -
కుప్పకూలిన కింగ్స్ పంజాబ్
► ఆఖరి పోరులో విఫలమైన కింగ్స్ పుణె: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్-రైజింగ్ పుణె జట్లు మధ్య జరుగుతున్న అమీతుమీ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ 73 పరుగులకే కుప్పకూలి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్లే ఆఫ్ అర్హత కోసం జరుగుతున్న ఈ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ కనీస పోరాటాన్ని ప్రదర్శించలేకపోయింది. పుణే బౌలర్లు శార్ధుల్ టాకుర్ (3/19), జయదేవ్ ఉనద్కట్ (2/12), క్రిస్టియన్ (2/10), ఆడమ్ జంపా(2/22) లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ బ్యాట్స్ మన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బతగిలింది. పరుగుల ఖాతా తెరవకముందే గప్టిల్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ వృధ్దిమాన్ సాహా, షాన్ మార్ష్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా టాకుర్ మార్ష్(10) వికెట్ తీసి దెబ్బకొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్ మన్ కుదురుకోలేకపోయాడు. దీంతో కింగ్స్ పంజాబ్ పవర్ ప్లే ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. అక్సర్ పటేల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా క్రిస్టియన్ అడ్డుపడ్డాడు. పంజాబ్ బ్యాట్స్ మెన్స్ లో మాక్స్ వెల్, గప్టిల్ డకౌట్ అవ్వగా, అక్సర్(22), సాహా(13), మార్ష్(10), స్వప్నిల్(10) లు మినహా మిగతా అంతా సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. దీంతో కింగ్స్ పంజాబ్ 15.5 ఓవర్లకే ఆలౌట్ అయింది. -
చివరి ఓవర్లో గట్టెక్కిన కింగ్స్ ఎలెవన్
-
సాహోరే... పంజాబ్
-
సాహోరే... పంజాబ్
►చివరి ఓవర్లో గట్టెక్కిన కింగ్స్ ఎలెవన్ ►ప్లే ఆఫ్ ఆశలు సజీవం ►పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్ ►సాహా మెరుపు ఇన్నింగ్స్ ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు వరుసగా మూడు మ్యాచ్‌లను నెగ్గాల్సిన ఒత్తిడిలో ఉన్న పంజాబ్ ‘కింగ్స్’లా చెలరేగింది. వృద్ధిమాన్ సాహా (93 నాటౌట్) తుదికంటా క్రీజులో నిలిచి భారీ స్కోరు సాధించి పెట్టగా.. ఆ తర్వాత బౌలర్లు పట్టు విడవకుండా ప్రయత్నించి లీగ్‌లో టాప్ పొజిషన్లో ఉన్న ముంబై ఇండియన్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించారు. అయితే పొలార్డ్ చివరి బంతి వరకు విజయం కోసం ప్రయత్నించి పంజాబ్‌ను వణికించాడు. మ్యాక్స్‌వెల్ సేన ఇక తమ చివరి మ్యాచ్‌లో పుణేపై కచ్చితంగా నెగ్గి ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ముంబై: వాంఖెడే మైదానం పరుగుల వర్షంతో తడిసి ముద్దయ్యింది. 231 పరుగుల లక్ష్యం.. టి20ల్లో ఇది కష్టసాధ్యమైనదే అయినా ముంబై ఇండియన్స్ మాత్రం చివరి బంతి వరకు పోరాడింది. అయితే ఆఖరి ఓవర్లో 16 పరుగులు కావాల్సిన దశలో పొలార్డ్ ఓ భారీ సిక్స్ బాదినా మోహిత్ అద్భుతంగా బంతులేసి తమ జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. దీంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 7 పరుగుల తేడాతో నెగ్గి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. అంతకుముందు వృద్ధిమాన్ సాహా (55 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సీజన్లో తొలిసారి తమ కీలక మ్యాచ్‌లో చెలరేగడంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), గప్టిల్ (18 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. ఆ తర్వాత 231 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసి ఓడింది. సిమన్స్ (32 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పార్థివ్ (23 బంతుల్లో 38; 7 ఫోర్లు), పొలార్డ్ (24 బంతుల్లో 50 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 30; 4 సిక్సర్లు) చెలరేగారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాహాకు దక్కింది. సాహా, మ్యాక్స్ దూకుడు... ఫామ్‌లో ఉన్న ఆమ్లా లేకుండానే బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆ లోటు లేకుండా ఓపెనర్లు గప్టిల్, సాహా అద్భుత ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్లోనే గప్టిల్ రెండు, సాహా ఓ ఫోర్‌తో జట్టు 13 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఓవర్లో సాహా రెచ్చిపోయి మూడు ఫోర్లు బాదడంతో స్కోరు దూసుకెళ్లింది. ఈ దూకుడుకు పంజాబ్ 3.4 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే ఆరో ఓవర్లో తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచిన గప్టిల్ మూడో బంతికి వెనుదిరిగాడు. ఇక మ్యాక్స్‌వెల్ రాకతో రన్‌రేట్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కరణ్ శర్మ ఓవర్లో రెండు సిక్సర్లు, ఆ తర్వాత హర్భజన్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన తను అర్ధ సెంచరీ వైపు దూసుకెళుతున్న దశలో బుమ్రా బోల్తా కొట్టించాడు. అప్పటికే జట్టు స్కోరు 11 ఓవర్లలో రెండు వికెట్లకు 131 పరుగులకు చేరింది. ఓవర్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన సాహా 31 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 16వ ఓవర్లో మార్‡్ష (16 బంతుల్లో 25; 2 సిక్సర్లు) అవుటైన అనంతరం స్కోరులో కాస్త వేగం తగ్గింది. శుభారంభం అందినా.. లక్ష్యం భారీగా ఉండటంతో ప్రారంభంలో ముంబై ఇన్నింగ్స్ కూడా దానికి తగ్గట్టుగానే సాగింది. ఓపెనర్లు పార్థివ్, సిమన్స్ ధాటిగా ఆడి శుభారంభాన్ని అందించారు. రెండో ఓవర్లో పార్థివ్ మూడు ఫోర్లు బాదాడు. ఆరో ఓవర్లో సిమన్స్ రెండు సిక్సర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో జట్టు 68 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓవర్లోనే సిమన్స్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే తొమ్మిదో ఓవర్ నుంచి ముంబై పతనం ప్రారంభమైంది. మోహిత్ శర్మ వేసిన ఆ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో చెలరేగిన పార్థివ్ నాలుగో బంతికి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలో 99 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక పదో ఓవర్లో సిమన్స్ లాంగ్ ఆన్‌లో ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ దగ్గర గప్టిల్ అమాంతం పైకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ తీసుకోవడంతో ముంబై షాక్‌కు గురైంది. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ (5), నితీశ్ రాణా (12) వరుసగా అవుట్ కావడంతో 22 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లను కోల్పోయింది. అయితే పొలార్డ్, హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా గేరు మార్చారు. హెన్రీ వేసిన 16వ ఓవర్లో వీరిద్దరు రెండేసి సిక్సర్లు బాదడంతో మొత్తంగా 27 పరుగులు వచ్చాయి. కానీ మరుసటి ఓవర్లో సందీప్.. పాండ్యా వికెట్ తీయడంతో ఐదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా కరణ్ శర్మ ఆడిన ఆరు బంతుల్లోనే మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాది 19 పరుగులు చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో 16 పరుగులు కావాల్సిన దశలో ముంబై తడబడి విజయానికి దూరమైంది. ఆదివారం వరకు వేచి చూడాలేమో! ►ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ గెలవడంతో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్‌కు చేరుకోగా... మిగతా మూడు బెర్త్‌ల కోసం నాలుగు జట్లు బరిలో ఉన్నాయి. ►నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో ఢిల్లీపై రైజింగ్ పుణే గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పుణే ఓడినా ఆ జట్టు ఆదివారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ►శనివారం గుజరాత్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ నెగ్గితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ సన్‌రైజర్స్ ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే పుణేతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓడిపోవాలి. ►శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ కోల్‌కతా ఓడితే మాత్రం ఆ జట్టు భవితవ్యం గుజరాత్, హైదరాబాద్... పుణే, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ప్లే ఆఫ్‌కు చేరే అన్ని జట్లు ఏవో తేలాలంటే ఆదివారం వరకు వేచి చూడక తప్పదేమో! -
ఫలించిన పంజాబ్ వ్యూహం
► సాహా విజృంభణ.. ముంబైకి భారీ లక్ష్యం ► రాణించిన మాక్స్ వెల్, గప్టిల్, షాన్ మార్ష్ ముంబై: కింగ్స్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ బ్యాట్స్ మెన్ వృద్దిమాన్ సాహా 93 పరుగులతో విజృంభించడంతో పంజాబ్ ముంబైకి 231 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. మరో వైపు ఓపెనర్ ఆమ్లా అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో సాహాను ఓపెనర్ గా ప్రయత్నించిన పంజాబ్ వ్యూహం ఫలించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఓపెనర్లు గప్టిల్, సాహా మంచి శుభారంబాన్ని అందించారు. ఇక మలింగ వేసిన మూడో ఓవర్లో గప్టిల్, సాహా లు బౌండరీలతో విరుచుకపడి 19 పరుగులు పిండుకున్నారు. ఈ దూకుడుతో పంజాబ్ ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేయగలిగింది. వేగంగా ఆడుతున్న మార్టిన్ గప్టిల్ (37) కరణ్ శర్మ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి హార్థిక్ పాండ్యా కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్, సాహా తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. మాక్స్ వెల్ హార్భజన్ వేసిన 9 ఓవర్లో మూడు సిక్స్ లు బాదడంతో జట్టుకు 21 పరుగులు చేరాయి. 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 47 పరుగులు చేసిన మాక్స్ వెల్ బూమ్రా బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన షాన్ మార్ష్ తో సాహా ఇన్నింగ్స్ కొనసాగించాడు. హార్భజన్ వేసిన బంతిని సిక్సర్ గా మలిచిన సాహా 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. సాహా కి తోడుగా మార్ష్ కూడా చెలరేగడంతో 15 ఓవర్లకే పంజాబ్ 173 పరుగులు చేయగలిగింది.ఈ తరుణంలో భారీ షాట్ కుప్రయత్నించిన షాన్ మార్ష్ (25) క్యాచ్ అవుటయ్యాడు. ముంబై బౌలర్లలో బుమ్రా మినహా మిగిలిన వారంతా పోటా పోటిగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పంజాబ్ 18 ఓవర్లోనే 200 పరుగులకు చేరుకొంది. చివర్లో సాహా, అక్సర్ దాటిగా ఆడటంతో పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి ఈ సీజన్లోనే అత్యధికంగా 230 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కరణ్ శర్మ, మెక్లిన్ గన్ లకు తలో వికెట్ దక్కింది. -
అక్సర్ క్యాచ్ తో పంజాబ్ ఆశలు సజీవం
న్యూఢిల్లీ: క్రికెట్ లో క్యాచ్ పట్టడం, జారవిడచడంతో మ్యాచ్ ఫలితాలే మారిపోయే సందర్భాలెన్నో ఉన్నాయి. ఇక ఐపీఎల్ లో మాత్రం దీని ప్రభావం మరి ఎక్కువ. క్యాచ్ జారవిడిచితే ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక కింగ్స్ పంజాబ్- కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇలాంటిదే ఒకటి జరిగింది. పంజాబ్ ఆటగాడు అక్సర్ పటేల్ అద్భుత క్యాచ్ కు కోల్ కతా తగిన మూల్యం చెల్లించుకుంది. కోల్ కతా ఓపెనర్లు క్రిస్ లిన్- సునీల్ నరైన్ మంచి శుభారంభం అందించినా కోల్ కతా 14 పరుగుల తేడాతో ఓడింది. దీనికి కారణం అక్సర్ క్యాచ్. రాహుల్ తెవాతియా వేసిన 10 ఓవర్లో అక్సర్ పట్టిన క్యాచ్ మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చు. గౌతం గంభీర్ అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన ఉతప్ప వచ్చిరావడంతో భారీ షాట్ కు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి లేవడంతో అటుగా ఫీల్డింగ్ చేస్తున్న అక్సర్ పటేల్ పరిగెత్తుకుంటూ డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో ఉతప్ప పరుగులు ఏమి చేయకుండా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇద్దరు ప్రధానమైన బ్యాట్స్ మెన్ లు వెను వెంటనే వెనుదిరిగారు. మరో ఎండ్ లో నిలకడగా ఆడుతున్న క్రిస్ లిన్ ను సైతం అక్సరే రనౌట్ చేయడంతో పంజాబ్ గెలుపు సుగమమైంది. ఈ ప్రదర్శనతో అక్సర్ మ్యాచ్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈ గెలుపుతో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవమయ్యాయి. -
నా దూకుడు వెనుక ఆమె: డివిలియర్స్
బెంగళూరు: ప్రతి మగవాడి విజయం వెనుక మహిళ పాత్ర ఉందంటారు. ఇది బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ విషయంలో కూడా జరిగింది. సోమవారం ఇండోర్ వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుల మధ్య జరిగిన మ్యాచ్ లో డివి 9 సిక్సర్లు, 3 ఫోర్లతో చెలరేగిన విషయం తెలిసిందే. ఏబీ 46 బంతుల్లో 89 పరుగులతో దూకుడు ప్రదర్శించడంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు 148 పరుగులు చేసింది. ఈ దూకుడు ఎలా సాధ్యమైందని మ్యాచ్ సమయంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ డివిలియర్స్ ను ప్రశ్నించాడు. నా దూకుడుకు నా భార్య డానియల్ ఇచ్చిన స్పూర్తే కారణమని డివిలియర్స్ తెలిపాడు. మ్యాచ్ కు ముందు డానియల్ కు ఫోన్ చేశానన్నాడు. " గాయంతో మొదటి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాను. నా ఆటపై నాకు కొద్దిగా అనుమానం నెలకొంది' అని డానియల్ తో ప్రస్తావించినపుడు ఆమె నాకు దైర్యాన్నించిందని డివిలియర్స్ పేర్కొన్నాడు. వాట్సన్ ఔట్ అయిన అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ మొదట్లో నెమ్మదిగా ఆడిన డెత్ ఓవర్లలో వరుస సిక్సర్లతో విజృంభించాడు. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరుపై పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు ఓడినా డివిలియర్స్ దూకుడుతో అభిమానులు పండుగ చేసుకున్నారు. -
'స్పాట్ ఫిక్సింగ్ తో మాకు సంబంధం లేదు'
న్యూఢిల్లీ : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో హస్తం ఉందని తనపై వచ్చిన ఆరోపణలను కింగ్స్ ఎలెవన్ జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఖండించారు. ఐపీఎల్ గ్రూప్ మీటింగ్ తర్వాత ఆగస్టు 8న బీసీసీఐ అధికారులకు కొన్ని విషయాలను వెల్లడించినట్లు కథనాలు వచ్చాయి. కింగ్స్ ఎలెవన్ జట్టు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ చేశారని బీసీసీఐ సమావేశంలో ప్రీతి అనుమానాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై ఆమె మండిపడింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, కోశాధికారి అనిరుద్ చౌదరి, భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ సభ్యులు ఉన్న వర్కింగ్ గ్రూపు సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదిలాఉండగా, తాను బీసీసీఐ అధికారులకు చెప్పిన విషయాలను మీడియా వక్రీకరించిందని, వీటిపై మండిపడుతూ సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అవసరమైతే మా జట్టు ఆటగాళ్లను లై డిటెక్టర్ తో పరీక్షించండి. నేనైతే ఎవరూ ఫిక్సింగ్ చేశారని భావించడం లేదంటూ జట్టు ఆటగాళ్లపై తన నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఆ కథనాలు పూర్తిగా బాధ్యతా రాహిత్యమైనవని, తప్పుడు వార్తలని ఆమె ట్వీట్ చేశారు. Dear All, This piece of article is completely false, libel per say, inaccurate and an irresponsible piece of... http://t.co/x0pURYfKVw — Preity zinta (@realpreityzinta) August 19, 2015 I suggested RANDOM POLYGRAPH ( LIE DETECTOR) Tests to Bcci for players so no can even think about match fixing. The theory was that ... 1/1 — Preity zinta (@realpreityzinta) August 19, 2015