ఈ ఐపీఎల్‌లో ఆ టీమ్‌ కెప్టెన్‌.. స్పెషల్‌.! | KXIP Captain Ravichandran Ashwin Special For This IPL | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 10 2018 1:46 PM | Last Updated on Tue, Apr 10 2018 5:23 PM

KXIP Captain Ravichandran Ashwin Special For This IPL  - Sakshi

ఐపీఎల్‌ కెప్టెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2018 సీజన్‌లో కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌కు సారథ్యం వహిస్తున్న రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఫ్రాంచైజీల కెప్టెన్లు ఎంఎస్‌ధోని(చెన్నై సూపర్‌ కింగ్స్‌), విరాట్‌ కోహ్లి(రాయల్‌ చాలెంజర్స్‌), రోహిత్‌ శర్మ(ముంబై ఇండియన్స్‌), కేన్‌ విలియమ్సన్‌(సన్‌రైజర్స్‌), అజింక్యా రహానే(రాజస్తాన్‌), గౌతం గంభీర్‌(ఢిల్లీడేర్‌ డేవిల్స్‌), దినేశ్‌ కార్తీక్‌(కోల్‌కతా నైట్‌ రైడర్స్‌)లంతా బ్యాట్స్‌మెన్‌లు కాగా.. అశ్విన్‌ ఒక్కడే బౌలర్‌ కావడం విశేషం. ఈ సీజన్‌లో ఒక విలియమ్సన్‌ మినహా మిగతా అంత భారత ఆటగాళ్లే సారథిలుగా వ్యవహరిస్తుండటం మరో విశేషం. ఇక గత సీజన్‌ ఐపీఎల్‌లో కూడా ఒకే ఒక్క బౌలర్‌(జహీర్‌ ఖాన్‌,ఢిల్లీ) కెప్టెన్సీ వహించాడు. 

తొలిసారి సారథిగా వ్యవహరిస్తున్న అశ్విన్‌ ఆల్‌రౌండర్‌ అయినప్పటికి అతని ప్రధాన బలం మాత్రం బౌలింగేనన్న విషయం అందరికి తెలిసిందే. అశ్విన్‌ సారథ్యంలో పంజాబ్‌ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌పై విజయం సాధించి ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. గత సీజన్లలో రైజింగ్‌ పుణె, చెన్నైసూపర్‌ కింగ్స్‌ల పాత్రినిథ్యం వహించిన ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ను పంజాబ్‌ ఈసీజన్‌లో అనూహ్యంగా కెప్టెన్‌ను చేసింది. ఇప్పటి వరకు ట్రోఫీ అందుకోని పంజాబ్‌ ఎలాగైనా ఈ సీజన్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వేలంలో పోటిపడి మరి యువ ఆటగాళ్లు సొంతం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement