
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ అశ్విన్
ఇండోర్ : డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. కాగా ఈ ఓటమిపై కింగ్స్‌పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అశ్విన్.. ‘మేము బాగానే ఆడాం. కానీ మంచి స్కోరు సాధించలేకపోయాం. చివర్లో స్టోయినిస్ సమయోచితంగా ఆడకపోయి ఉంటే గౌరవప్రదమైన స్కోరు కూడా దక్కేది కాదని’ వ్యాఖ్యానించాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించిన అశ్విన్.. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓటమి తప్పలేదని పరోక్షంగా బ్యాట్స్‌మెన్ల వైఫల్యాన్ని ప్రస్తావించాడు.
కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా బాధ్యతతో కూడుకున్నదని.. ప్రస్తుతం తాను ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలనుకుంటున్నానని అశ్విన్ పేర్కొన్నాడు. ఈ ఓటమితో తామేమీ కుంగిపోవడం లేదని, తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధించడంపై దృష్టిసారిస్తామన్నాడు. 16 పాయింట్లు సాధించడం అంత సులభమేమీ కాదన్న అశ్విన్.. మంచి ప్రదర్శన ద్వారా నాకౌట్‌కు చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment