
ఆండ్రూ టై
ముంబై : ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ బౌలర్ ఆండ్రూ టై విజృంభించాడు. దీంతో ముంబై ఇండియన్స్ కీలక వికెట్లను కోల్పోయింది. ఇప్పటికీ రెండు ఓవర్లు మాత్రమే వేసిన టై 5 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. టై.. తొలి ఓవర్‌లో ముంబై ఓపెనర్ ఎవిన్ లూయిస్(9)ను క్లీన్ బౌల్డ్ చేయగా.. రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో జోరు మీదున్న ఇషాన్ కిషాన్(20), సూర్యకుమార్ యాదవ్(27)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో ముంబై ఇండియన్స్ 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక ఈ సీజన్‌లో 23 వికెట్లతో టై బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment