దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్‌లో ఆదివారం దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ పంజాబ్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. కాగా వరుస విజయాలతో దూకుడు మీదున్న ముంబైని కింగ్స్ పంజాబ్ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. ఇందులో ఆసక్తికర విషయమేంటంటే ముంబై వరుసగా ఐదు విజయాలు నమోదు చేసి అగ్రస్థానంలో ఉండగా.. కింగ్స్ పంజాబ్ మాత్రం వరుస ఐదు ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో ఆర్‌సీబీపై విజయం సాధించినా పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది.
ఇక ఇరుజట్ల విషయానికి వస్తే.. రోహిత్ శర్మ, డికాక్, సూర్య కుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలతో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగం దుర్బేద్యంగా ఉంది. ఇక బౌలింగ్‌లో బౌల్ట్, కౌల్టర్‌నీల్, బుమ్రాలతో పటిష్టంగా ఉంది. కింగ్స్ పంజాబ్ విషయానికి వస్తే.. క్రిస్ గేల్ రాకతో ఆ జట్టు పటిష్టంగా మారిందనే చెప్పొచ్చు. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే గేల్ తన విలువేంటో చూపాడు.. దీంతోపాటు కెప్టెన్ రాహుల్, మాయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్‌లు ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. అయితే ఇప్పటికి పంజాబ్ జట్టు మిడిలార్డర్ నిరాశపరుస్తూనే ఉంది. మ్యాక్స్‌వెల్ విఫలం ఇంకా కొనసాగుతూనే ఉండడం చర్చకు దారి తీస్తుంది. అయితే ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది.ఇక ముఖాముఖి పోరులో ఇప్పటివరకు 25 మ్యాచ్‌ల్లో తలపడగా.. ముంబై 14 మ్యాచ్‌లు.. పంజాబ్ 11 మ్యాచ్‌లు గెలిచింది.
ముంబై ఇండియన్స్ :
రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, కృనాల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, కౌల్టర్ నైట్, జస్‌ప్రీత్ బుమ్రా
కింగ్స్ పంజాబ్ :
కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, క్రిస్ గేల్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్నోయ్, అర్షదీప్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment